Students can go through AP Board 8th Class Social Notes 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ
→ వేర్వేరు ప్రజలు అడవులను వేర్వేరుగా ఉపయోగించుకుంటారు.
→ అడవులను మనుషులే కాక చెట్లు, మొక్కలు, గడ్డిజాతులు, పక్షులు, పురుగులు, జంతువులు, చేపలు వంటి అసంఖ్యాక జీవులు అడవులలో ఉంటూ వాటిని ఉపయోగించుకుంటాయి.
→ చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం అన్నది అడవికి నిర్వచనం.
→ కొన్ని వేల సం||రాల క్రితం మట్టి, సూర్యరశ్మి, వర్షపాతం ఉన్న ప్రతి చోటా అడవులు పెరిగేవి.
→ రకరకాల సూచికల ఆధారంగా అడవులను వర్గీకరించవచ్చు.
→ అడవులలో అనేక రకాలు ఉన్నాయి.
→ మన రాష్ట్రంలో 64,000 చ|| కి||మి|| మేర అడవులున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
→ మన రాష్ట్రంలో ప్రతి సం||రం 100 చ|| కి||మీ మేర అడవి తగ్గిపోతూ ఉంది.
→ జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడిన వాళ్ళలో గిరిజనులు ముఖ్యులు.
→ గిరిజన ప్రజలకు భూమి సమష్టి ఆస్తి.
→ 200 సం||రాల క్రితం బ్రిటిషు పాలనలో గిరిజనులు అడవులపై తమ హక్కులను, అధికారాన్ని కోల్పోయారు.
→ అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా జాతీయ అటవీ విధానం భావించింది.
→ 1988లో J.M.F. ఆచరణలోనికి వచ్చింది. ఇది రాష్ట్రంలో C.M.F. గా మారింది. (ఉమ్మడి అటవీ యాజమాన్యం)
→ 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది.
→ అడవుల పునరుద్ధరణ : అనేక కారణాల వలన నరకబడిన చెట్ల స్థానంలో తిరిగి చెట్లను నాటడం. లేదా చెట్లు నాటి కొత్త అడవులను తయారు చేయడం.
→ అడవులు నరికి వేయటం : గృహవినియోగానికి, వ్యవసాయానికి ఇంకా ఇతర కారణాల రీత్యా అడవులను నరికి వేస్తారు.
→ అటవీ యాజమాన్యం : అడవులనేవి ప్రకృతి సంపదలు. పూర్వం వీటి యాజమాన్యం గిరిజనుల చేతుల్లో ఉండేవి. తరువాత వాటిని ప్రభుత్వం తీసుకుంది.
→ అటవీ హక్కుల చట్టం : అడవి హక్కు అడవిలో పుట్టిన వారికే ఉంటుంది.
→ రిజర్వు అడవులు : బ్రిటిషు వారి కాలంలో అడవుల నుండి గిరిజనులను తొలగించి ‘రిజర్వు’, ‘రక్షిత’ అడవుల కింద వర్గీకరించారు. రిజర్వు అడవులలో ఎవరూ ప్రవేశించరాదు.
→ సతత హరిత అడవులు : ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే ప్రాంతాలలోనూ, హిమాలయాల్లోనూ ఉంటాయి.
→ ముళ్ళ అడవులు : అతి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల దగ్గర ఉండే అడవులు.
→ మడ అడవులు : సముద్ర తీర ప్రాంతంలో ఉండే అడవులు.
→ ఆకురాల్చే అడవులు : సంవత్సరంలో అధికంగా పొడి, వేడి ఉండే ప్రాంతాలలో ఉంటాయి.