AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

These AP 9th Biology Important Questions and Answers 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 11th Lesson Important Questions and Answers జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అనగానేమి?
జవాబు:
భూమి మీద పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల ప్రసరణ జరగడంలో ఇమిడి ఉండే నిర్దిష్ట మార్గాలను “జీవ భౌగోళిక రసాయనిక వలయాలు” అంటారు.

ప్రశ్న 2.
వినత్రీకరణం అనగానేమి?
జవాబు:

  1. జంతువృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డినైట్రిఫికేషన్ అంటారు.
  2. దీనిలో ఘనరూపంలోనున్న నైట్రెట్స్ (NO3) వాయురూపంలో ఉండే నైట్రోజన్ (N2) గా మారుతాయి.

ప్రశ్న 3.
ఆక్సిజన్ మరియు ఓజోన్ల మధ్య గల భేదాలు రాయండి.
జవాబు:

  1. ఆక్సిజన్ రెండు పరమాణువులతో ఉండే రంగు వాసన లేని వాయువు.
  2. మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ ఏర్పడుతుంది. ఓజోన్ నీలిరంగులో ఉండి ఘాటైన వాసన కలిగి ఉంటుంది.

ప్రశ్న 4.
నైట్రోజన్ స్థాపన అనగానేమి?
జవాబు:
నైట్రోజన్ స్థాపన : నైట్రోజన్ సమ్మేళనం (సంయోగ పదార్థం) స్థిర రూపంలోకి మార్చబడడాన్ని ‘నైట్రోజన్ స్థాపన’ (Nitrogen) అంటారు.

ప్రశ్న 5.
అమ్మోనీకరణం అనగానేమి?
జవాబు:
నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా (NH3) ఉత్పత్తి కావటాన్ని అమ్మోనీకరణం అంటారు.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 6.
BOD అనగానేమి?
జవాబు:
నీటిలోని జీవ విఘటన పదార్థాలను ప్రత్యేకమైన సూచిక ద్వారా తెలియజేస్తారు. ఆ సూచికను జీవులకు అవసరమైన ఆక్సిజన్ “(Biological Oxygen Demand (BOD))” అంటారు.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీటి యొక్క ఉపయోగమును వివరించండి.
జవాబు:

  1. భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు తాగునీటిగా ఉపయోగపడుతుంది.
  2. కిరణజన్య సంయోగక్రియ, జీర్ణక్రియ, కణశ్వాస క్రియలతో సహా వివిధ జీవరసాయనిక చర్యలలో నీరు పాల్గొంటుంది.
  3. చాలా జాతుల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులకు నీరు ఆవాసంగా ఉండడంతోబాటు జీవులు వినియోగించుకొనే వివిధ పదార్థాల రవాణాలో పాల్గొంటుంది.
  4. జీవరాశి ఏర్పడడానికి కావలసిన సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్ నీటి ద్వారానే లభ్యమవుతున్నాయి.

ప్రశ్న 2.
నత్రీకరణం అనగానేమి? నత్రీకరణలో పాల్గొను బాక్టీరియాలు ఏవి?
జవాబు:

  1. నేలలోని డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియాలు నైట్రేట్ లను అమ్మోనియా రూపంలో మారుస్తాయి.
  2. నైట్రిఫైయింగ్ బాక్టీరియా తమ కణాల కొరకు ఈ అమ్మోనియాను ఉపయోగించుకుని, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, నైటైట్స్, నైట్రేట్స్ గా మార్చుకుంటాయి.
  3. ప్రధానంగా నైట్రో సోమోనాస్ నైటైలను ఉత్పత్తిచేయగా, నైట్రేట్ లను నైట్రోబాక్టర్స్ ఉత్పత్తిచేస్తాయి.
  4. సూక్ష్మజీవులు చనిపోవడం వలన నేలలో నత్రజని సంబంధిత పదార్థాలు కలుపబడుతాయి.

ప్రశ్న 3.
స్వాంగీకరణంను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. నైట్రోజన్ సంబంధ పదార్థాలు, ప్రధానంగా నైట్రేట్స్ లేదా అమ్మోనియం (NH3+) అయాన్లను మొక్కలు, నేల నుండి గ్రహిస్తాయి.
  2. వీటిని మొక్కలు ప్రోటీన్లు తయారుచేయడానికి ఉపయోగించుకుంటాయి.
  3. జంతువులు ఈ మొక్కలను తిన్నాక, వాటిలో జంతువుల ప్రోటీన్లు తయారవుతాయి.

ప్రశ్న 4.
అమ్మోనీకరణం అనగానేమి? అమ్మోనీకరణం జరిగే సందర్భాలు ఏవి?
జవాబు:

  1. నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా (NH3) ఉత్పత్తి కావటాన్ని అమ్మోనిఫికేషన్ అంటాం.
  2. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు లేదా జంతువుల వ్యర్థాలను వదలినప్పుడు కూడా అమ్మోనిఫికేషన్ జరుగుతుంది.
  3. సేంద్రియ పదార్థాలలోనున్న నైట్రోజన్ నేలలోనూ, నీటి వనరుల్లోనూ తిరిగి చేరి అక్కడ విచ్ఛిన్నకారులైన సూక్ష్మజీవుల చర్య వల్ల అమ్మోనియాగా మారి ఇతర జీవన ప్రక్రియలకు అందుబాటులో ఉంటుంది.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 5.
ఆక్సిజన్ యొక్క ఉపయోగాలు ఏవి?
జవాబు:

  1. జీవులు జీవించడానికి ఆక్సిజన్ కావాలి.
  2. శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించబడి కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదలచేయటం వలన ప్రకృతిలో సమతాస్థితి కొనసాగుతుంది.
  3. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ నీటిలో నివసించే జంతువులకు ప్రాణాధారం.
  4. కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నమవడానికి ఆక్సిజన్ చాలా అవసరం.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
భూమిపై నీటి యొక్క విస్తరణను వివరించండి.
జవాబు:

  1. భూమి మీద ఉన్న నీటిలో దాదాపుగా 97% నీరు ఉప్పునీటి రూపంలో సముద్రంలో ఉంది.
  2. 3% మాత్రమే మంచినీరు, ఇందులో కూడా 2% మంచినీరు గడ్డకట్టిన గ్లేసియలోనూ, ధృవ ప్రాంతాలలోనూ ఉంటుంది.
  3. మనకు 1% మంచినీరు మాత్రమే అందుబాటులో ఉన్నది.
  4. ఇందులో కూడా మళ్ళీ 4వ వంతు భూగర్భ జలరూపంలో ఉంటుంది.
  5. 0.0091 మాత్రమే భూమిపై నదులలో, సరస్సులలో ఉంటుంది.
  6. మిగిలినదంతా జీవుల దేహాలలో, నేలలో, వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది.
  7. సజీవులలో అత్యవసరమైనదీ అధికమొత్తంలో ఉండే పదార్థం నీరు.
  8. ఉదాహరణకు మన శరీరంలో 70% నీరు ఉంటుంది.

ప్రశ్న 2.
జలచక్రం అనగానేమి? దానిని వివరించండి.
జవాబు:

  1. నీరు ఆవిరిగా మారటం, వర్షం రూపంలో భూమిపైన కురియటం మరియు వివిధ రూపాలలో అవక్షేపాలుగా మారి భూమి నుండి వివిధ మార్గాలుగా అనగా నది, భూగర్భ జల మార్గాల ద్వారా సముద్రాలలో కలిసే మొత్తం ప్రక్రియను’ – జలచక్రం అంటారు.
  2. భూమి పైన పడ్డ వర్షం నీరు మొత్తం నేరుగా సముద్రాలలోకి పోదు.
  3. అందులో కొంతభాగం నేలలో ఇంకిపోతుంది. అది భూగర్భజల నిల్వలో భాగమవుతుంది.
  4. భూగర్భ జలాల్లోని కొంత నీరు ఊటల రూపంలో పైకి వస్తుంది. దాన్నే మనం అవసరం నిమిత్తం బావులు, గొట్టపు . బావుల ద్వారా పైకి తెస్తాం.
  5. సముద్రం, భూమి వాతావరణాల మధ్య నీటి మార్పిడి ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 3.
నైట్రోజన్ స్థాపన అనగానేమి ? అది ఏ విధముగా జరుగుతుంది?
జవాబు:

  1. వాతావరణంలో థమికంగా జడస్థితి లేదా క్రియారహితంగా ఉండే నత్రజనిని కొన్ని రకాల జీవులు నైట్రోజన్’ సమ్మేళనం స్థిర రూపంలోకి మార్చుతాయి. దీనిని నైట్రోజన్ స్థాపన అంటాం.
  2. చాలా వరకు వాతావరణంలోని నైట్రోజన్ జైవిక పద్ధతుల ద్వారా ‘స్థాపన’ చేయబడుతుంది.
  3. చాలా రకాల సూక్ష్మజీవులు, బాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలు, నైట్రోజనను తమ శరీరంలో వివిధ సమ్మేళనాల రూపంలో స్థాపన చేసుకోగలవు.
  4. ఈ బాక్టీరియాలో కొన్ని స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి. ఉదా : నైట్రో సోమోనాస్ మరికొన్ని సహజీవనం జరిపే బాక్టీరియా. ఉదా : రైజోబియం.
  5. ఈ జీవులు వాతావరణంలోని నైట్రోజన్‌ను తమ సొంత కణాల కొరకు సేంద్రియ రూపంలోకి మార్చుకుంటాయి.
  6. చిక్కుడు జాతి మొక్కలలో మొక్కకి, నైట్రోజన్ స్థాపన బాక్టీరియాకి మధ్య సహజీవనం ఉండటం వలన లెగ్యూమినేసి పంట తరువాత నైట్రోజన్ సమ్మేళనాలు వేలలోకి చేరుతాయి.
  7. ఉరుములు, మెరుపులు సంభవించినపుడు ఆ కాంతి నుండి నైట్రోజన్ నైట్రేటుగా స్థాపన చేయబడుతుంది.

ప్రశ్న 4.
భూమిపైన కార్బన్ ఏయే రూపాలలో లభ్యమవుతుంది?
జవాబు:

  1. భూమిపైన కార్బన్ వివిధ రూపాలలో లభ్యమవుతుంది.
  2. మూలక స్థితిలో, నల్లటి మసిలో వజ్రం, గ్రాఫైట్ రూపాలలో లభ్యమవుతుంది.
  3. సమ్మేళనాల రూపంలో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది.
  4. అదే విధంగా వివిధ ఖనిజాలలో కార్బొనేట్, హైడ్రోకార్బొనేట్ లవణాలుగా కూడా లభ్యమవుతుంది.
  5. జీవుల దేహాలు’ కార్బన్ ని కలిగిన అణువులైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లతో నిర్మితమై ఉన్నాయి.
  6. వివిధ జంతువుల అంతర అస్థిపంజరాలు మరియు బాహ్య అస్థిపంజరాలు కూడా కార్బొనేట్ లవణాలతో నిర్మితమై ఉన్నాయి.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 5.
గ్రీన్ హౌజ్ ఎఫెక్టు గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. వాతావరణంలో CO, CO2, మీథేన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉద్గారమయ్యే వేడిని నిల్వచేసుకుంటాయి.
  2. ఇటువంటి సహజ గ్రీన్‌హౌజ్ వాయువులు భూమిచుట్టూ ఒక కంబళిలాగా ఏర్పడి భూమిని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి.
  3. భూమి పైన ఉన్న జీవరాశులు జీవించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి.
  4. ఇలా జరగకపోతే భూమి పైన ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువైపోయే ప్రమాదం ఉంది.
  5. ఇటువంటి సహజ సిద్ధమైన వెచ్చదనం ఏర్పాటుచేసే దృగ్విషయాన్ని గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ అంటారు.

ప్రశ్న 6.
“జీవులకు అవసరమైన ఆక్సిజన్” సూచిక అనగానేమి? క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. నీటిలోని జీవ విఘటన పదార్థాలను ప్రత్యేకమైన సూచిక ద్వారా తెలియచేస్తారు.
  2. ఆ సూచికను “జీవులకు అవసరమయిన ఆక్సిజన్” (Biological Oxygen Demand (BOD)) అంటారు.
  3. వాయుసహిత బాక్టీరియా వ్యర్థ పదార్థాలను కుళ్ళింపచేయడానికి కావలసిన ఆక్సిజన్ మొత్తం పరిమాణాన్ని BOD సూచిస్తుంది.
  4. వ్యర్థ పదార్థాలు విఘటన చెందడానికి నీటిలో కరిగిన ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగించబడినప్పుడు నీటిలో నివసించే జీవులకు ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత పెరుగుతుంది అంటే BOD పెరుగుతుంది.
  5. కావున BOD అనునది వ్యర్థాలను విఘటన చెందటాన్ని సూచించే మంచి సూచిక.

ప్రశ్న 7.
కార్బన్ వలయమును వివరించండి.
జవాబు:

  1. కార్బన్ డై ఆక్సైడ్’ కొంత భాగం నీటిలో కరుగుతుంది.
  2. మొక్కలు CO2 ను కిరణజన్య సంయోగక్రియలో వాడుకుంటాయి.
  3. ఇందులో CO2 గ్లూకోజ్ గా మారుతుంది.
  4. కొంత గ్లూకోజ్ కణ శ్వాసక్రియలో వాడుకోబడుతుంది.
  5. మిగిలినది ఇతర పిండిపదార్థాలుగాను, నూనెల రూపంలోకి మార్చబడి వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది.
  6. జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకొన్నప్పుడు, కర్బన పదార్థాలు జీర్ణం అయి శోషణ చేయబడతాయి. జంతువు కణజీవ క్రియలో అవి వాడబడతాయి.
  7. ఈ విధంగా వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ జంతువుల శరీరాల్లోకి చేరుతుంది.
  8. ఈ పదార్థాలు జీవక్రియలో వినియోగించబడి చివరకు CO2 ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
  9. జంతువులు, మొక్కలు చనిపోయిన తరువాత విచ్ఛిన్నకర బాక్టీరియా వీటి శరీర కణాలలోని కర్బన అణువులను CO2 రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1

ప్రశ్న 8.
ఆక్సిజన్ వలయమును క్లుప్తంగా వివరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2

  1. నీటిలోని మొక్కలు, జంతువులు కలిగివున్న ఆక్సిజన్ ని శ్వాసక్రియ కోసం వినియోగించుకుంటాయి.
  2. అదే విధంగా భౌమ్య జీవులు గాలిలోని ఆక్సిజనను శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి.
  3. ఈ క్రియలో చివరి పదార్థాలయిన CO2, నీరు తిరిగి గాలిలోకి చేర్చబడతాయి.
  4. మొక్కలు ఈ పదార్థాలను కిరణజన్య సంయోగక్రియకు వినియోగించుకుంటాయి.
  5. ఈ ప్రక్రియలో తయారయిన ఆక్సిజన్ గాలిలోకి వదలబడుతుంది.
  6. కలప, బొగ్గు, పెట్రోలు మొదలయిన పదార్థాలు మండినపుడు CO2 విడుదల అవుతుంది.
  7. ఈ విధంగా O2 మరియు CO2 ల మధ్యనున్న సమతాస్థితి చాలా నాజుకుగా ఉంటుంది.
  8. అందువలన గాలిలోని ఆక్సిజన్ చాలా స్థిరంగా ఉంటుంది. ఈ క్రియలన్నీ కలసి ఆక్సిజన్ వలయం ఏర్పడుతుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Important Questions and Answers

ప్రశ్న 1.
భూతాపాన్ని తగ్గించుటకు ఒక బాధ్యత గల పౌరుడిగా నీవు నీ పాఠశాలలో లేదా గ్రామంలో ఏ చర్యలు పాటిస్తావు ?
జవాబు:

  1. ఇంటి ఆవరణలో, ఖాళీస్థలాలు, పాఠశాల ప్రాంగణాలలో మొక్కలను నాటుతాను.
  2. వాహనాల వాడకాన్ని తగ్గించి సైకిల్‌ను వినియోగిస్తాను.
  3. పత్తి కట్టె, రబ్బరు టైర్లను కాల్చడాన్ని నేను నియంత్రిస్తాను. ఎందుకంటే వీటిని మండిస్తే గ్రీన్ హౌస్ వాయువైన CO2 వాతావరణంలోకి విడుదల అవుతుంది.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 2.
నైట్రిఫికేషన్ అంటే ఏమిటి? ఇది ఏ విధంగా జరుగుతుందో వివరించండి.
జవాబు:

  1. నేలలోని డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలో చూరుస్తాయి.
  2. నైట్రిఫైయింగ్ బాక్టీరియా తమ కణాల కొరకు ఈ అమ్మోనియాను ఉపయోగించుకుని, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు, నైటైట్స్, నైట్రేట్స్ గా మార్చుకుంటాయి.
  3. ప్రధానంగా నైట్రో సోమోనాస్ నైటైలను ఉత్పత్తిచేయగా, నైట్రేట్ లను నైట్రోబాక్టర్స్ ఉత్పత్తిచేస్తాయి.
  4. సూక్ష్మజీవులు చనిపోవడం వలన నేలలో నత్రజని సంబంధిత పదార్థాలు కలుపబడుతాయి. నత్రీకరణను క్లుప్తంగా ఈ క్రింది విధంగా చూపవచ్చు.

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 3

ప్రశ్న 3.
కాగితం వినియోగాన్ని తగ్గిస్తే కాలుష్యాన్ని తగ్గించినట్లేనని ఎలా చెప్పగలవు?
జవాబు:
1) 1 టన్ను కాగితం తయారీకి 17 పచ్చని చెట్లను నేల కూల్చాల్సి వస్తుంది. అందువల్ల అడవుల నరికివేత జరుగుతుంది.
దీని ఫలితంగా భూతాపం పెరిగి సముద్రమట్టం పెరిగి భూమి మీద గల పల్లపు ప్రాంతాలు జలమయం అవుతాయి. కోట్లాది మంది తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రయులు అవుతారు.

2) కాగితాన్ని పునః చక్రీయం చేయడం ద్వారా అడవుల నరికివేతను అరికట్టి అనేక పర్యావరణ దుష్ఫలితాలను ఆపగలిగిన వాళ్ళం అవుతాము.

ప్రశ్న 4.
నత్రీకరణం, వినత్రీకరణంకు గల భేదాలు ఏమిటి?
జవాబు:

నత్రీకరణం వినత్రీకరణం
1) నేలలోని వినత్రీకరణ బాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలోకి మారుస్తాయి. 1) జంతువృక్ష కణాలలోకి చేరిన నత్రజని తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం అంటారు.
2) నేలలో స్థాపించబడిన అమ్మోనియాను నైట్రోసోమో నాస్” నైట్రేట్లను ఉత్పత్తి చేస్తాయి. నైట్రోబాక్టర్ నైట్రేట్లను ఉత్పత్తి చేస్తాయి. 2) ఘనరూపంలో ఉన్న నైట్రేట్లపై ఆక్సిజన్ కోసం బాక్టీరియాలు చర్యను వేగవంతం చేసి నైట్రోజన్ వాయువును తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
3) ఇది నీటిని లాగుకొనే నేలల్లో ఎక్కువగా జరుగుతుంది. 3) తడి నేలల్లో వినత్రీకరణం ఎక్కువగా జరుగుతుంది.
4) ఈ చర్యలో జీవులు నైట్రేట్లను ఉపయోగించుకొని కేంద్రకామ్లాలుగా మరియు ప్రొటీన్లుగా మార్చుకుంటాయి. 4) ఈ చర్య భూవాతావరణంలో నత్రజనిని సమతాస్థితి  చెడకుండా స్థిరంగా ఉంచుతుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. హ్యూవరణం నుండి జీవులకు, జీవుల నుండి హ్యూవరణానికి పోషకాల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది.
A) జీవ భౌగోళిక రసాయనిక వలయాలు
B) జీవ వలయాలు
C) రసాయనిక వలయాలు
D) భౌగోళిక వలయాలు
జవాబు:
A) జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

2. భూమి మీద ఉన్న నీటిలో ఉప్పునీటి శాతం
A) 3%
B) 1%
C) 97%
D) 2%
జవాబు:
B) 1%
C) 97%

3. మానవ శరీరంలో ఉండే నీరు శాతం
A) 80%
B) 70%
C) 90%
D) 10%
జవాబు:
B) 70%

4. జీవరాశి ఏర్పడడానికి కావలసిన సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు
A) నత్రజని, హైడ్రోజన్
B) హైడ్రోజన్, ఫాస్ఫరస్
C) హైడ్రోజన్, ఆక్సిజన్
D) నత్రజని, ఆక్సిజన్
జవాబు:
C) హైడ్రోజన్, ఆక్సిజన్

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

5. వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) నైట్రోజన్
జవాబు:
D) నైట్రోజన్

6. స్వేచ్ఛాస్థితిలో ఉండే ఈ బాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది.
A) నైట్రో సోమోనాస్
B) రైజోబియం
C) నైట్రో బ్యాక్టర్
D) అన్నీ
జవాబు:
A) నైట్రో సోమోనాస్

7. జంతు, వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడం
A) అమ్మోనీకరణం
B) వినత్రీకరణం
C) స్వాంగీకరణం
D) నత్రీకరణం
జవాబు:
B) వినత్రీకరణం

8. ఎక్కువ మొత్తంలో నైట్రేట్లు మరియు నత్రజని సంబంధిత పదార్థాలు నదులు, సరస్సులలో చేరినపుడు అధిక మొత్తంలో పెరిగే జీవులు
A) బయో ఫైట్స్
B) శిలీం నాలు
C) శైవలాలు
D) టెరిడోఫైట్స్
జవాబు:
C) శైవలాలు

9. జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిని గ్రీన్‌హౌజ్ గా ఉంచడంలో ప్రధానపాత్ర వహించేది
A) ఆక్సిజన్
B) కార్బన్ డై ఆక్సైడ్
C) హైడ్రోజన్
D) నత్రజని
జవాబు:
B) కార్బన్ డై ఆక్సైడ్

10. కార్బన్ ఎక్కువగా ఉన్న నిల్వ పదార్థాలు
A) సెడిమెంటరీ శిలలు
B) సేంద్రియ పదార్థాలు
C) సముద్రాలు
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

11. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులు అధిక మొత్తంలో విడుదల కావడానికి కారణాలు
A) శిలాజ ఇంధనాల దహనం, అడవులను నరకడం
B) శిలాజ ఇంధనాల దహనం, పారిశ్రామికీకరణ
C) అడవులను నరకడం, పారిశ్రామికీకరణ
D) శిలాజ ఇంధనాల దహనం, అడవులను నరకడం, పారిశ్రామికీకరణ
జవాబు:
D) శిలాజ ఇంధనాల దహనం, అడవులను నరకడం, పారిశ్రామికీకరణ

12. ఆక్సిజన్ విషంలా పనిచేసే జీవులకు ఉదాహరణ
A) శైవలాలు
B) వైరస్లు
C) బాక్టీరియా
D) అన్నీ
జవాబు:
C) బాక్టీరియా

13. కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నమవడానికి అవసరం అయ్యే వాయువు
A) హైడ్రోజన్
B) ఆక్సిజన్
C) నత్రజని
D) ఫాస్ఫరస్
జవాబు:
B) ఆక్సిజన్

14. వాతావరణంలో 10 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొర
A) స్ట్రాటోస్ఫియర్
B) అయనోస్ఫియర్
C) మీసోస్ఫియర్
D) ట్రోపోస్పియర్
జవాబు:
D) ట్రోపోస్పియర్

15. ఓజోన్నందుండు ఆక్సిజన్‌ పరమాణువుల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

16. ఓజోన్ పొర సూర్యకాంతిలోని ఈ కిరణాలను శోషిస్తుంది.
A) పరారుణ కిరణాలు
B) అతినీలలోహిత కిరణాలు
C) కాస్మిక్ కిరణాలు
D) గామా కిరణాలు
జవాబు:
B) అతినీలలోహిత కిరణాలు

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

17. ఓజోన్ పొర నాశనమగుటకు కారణమయ్యే రసాయనాలు
A) పెస్టిసైడులు
B) కార్బన్ డై ఆక్సైడ్
C) క్లోరోఫ్లోరో కార్బనులు
D) హైడ్రోజన్
జవాబు:
C) క్లోరోఫ్లోరో కార్బనులు

18. ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానము
A) వాషింగ్టన్ ప్రోటోకాల్
B) మాంట్రియల్ ప్రోటోకాల్
C) వాంకోవర్ ప్రోటోకాల్
D) జెనీవా ప్రోటోకాల్
జవాబు:
B) మాంట్రియల్ ప్రోటోకాల్

19. వజ్రంలో ఉండే మూలకం
A) కార్బన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) భాస్వరం
జవాబు:
A) కార్బన్

20. సార్వత్రిక ద్రావణి
A) నీరు
B) ఆల్కహాల్
C) ఈధర్
D) CCl4
జవాబు:
A) నీరు

21. భూమిపైన ఉండే మంచినీటి శాతం (నదులు, సరస్సులలో)
A) 0.0089
B) 0.0090
C) 0.0091
D) 0.0092
జవాబు:
C) 0.0091

22. ఆమ్ల వర్షాలకు కారణం
A) SO2
B) NO2
C) A & B
D) CO2
జవాబు:
C) A & B

23. ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు ఏర్పడటంలో ప్రధాన పాత్ర వహించేది
A) హైడ్రోజన్
B) కార్బన్
C) నత్రజని
D) ఆక్సిజన్
జవాబు:
C) నత్రజని

24. భూమిపై N2 శాతం
A) 72%
B) 78%
C) 75%
D) 76%
జవాబు:
B) 78%

25. వినత్రీకరణ బాక్టీరియాల పని
A) నైట్రేట్స్ → అమ్మోనియాగా మార్చడం
B) అమ్మోనియా → నైట్రేట్
C) నైట్రేట్ → నైట్రీట్
D) నైట్రేటీ → ప్రోటీన్లు
జవాబు:
A) నైట్రేట్స్ → అమ్మోనియాగా మార్చడం

26. నైట్రెసోమోనాస్ తయారుచేసేవి
A) నైట్రేట్లు
B) నైటైట్లు
C) అమ్మోనియా
D) ప్రోటీన్లు
జవాబు:
B) నైటైట్లు

27. అమ్మోనిఫికేషన్లో తయారయ్యేది
A) అమ్మోనియా
B) నైట్రేట్స్
C) నైలైట్స్
D) నత్రజని
జవాబు:
A) అమ్మోనియా

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

28. నల్లటిమసి, వజ్రం, గ్రాఫైట్లలో ఉండేది.
A) నత్రజని
B) ఆక్సిజన్
C) కార్బన్
D) నీరు
జవాబు:
C) కార్బన్

29. గాలిలో CO2 శాతం
A) 0.02%
B) 0.03%
C) 0.04%
D) 0.05%
జవాబు:
C) 0.04%

30. సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావడానికి పట్టే కాలం
A) 10 మిలియన్ సం||
B) 20 మిలియన్ సం||
C) 30 మిలియన్ సం||
D) 40 మిలియన్ సం||
జవాబు:
A) 10 మిలియన్ సం||

31. గ్రీన్ హౌస్ వాయువు
A) O2
B) CO
C) CO2
D) N2
జవాబు:
C) CO2

32. గ్లోబల్ వార్మింగ్ కు కారణం
A) O2
B) CO2
C) మీథేన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. గాలిలో O2 శాతం
A) 20%
B) 21%
C) 22%
D) 23%
జవాబు:
B) 21%

34. దుర్గంధ వాసనలో ఉండే వాయువు
A) H2S
B) NO2
C) SO2
D) CO
జవాబు:
A) H2S

35. B.O.D అనగా
A) బయోలాజికల్ ఆర్గానిక్ డిమాండ్
B) బయోగ్యాస్ ఆర్గానిజం డిమాండ్
C) బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్
D) బయో పెస్టిసైడ్ ఆర్గానిక్ డిమాండ్
జవాబు:
C) బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్

36. వ్యర్థాల విఘటన చెందటాన్ని సూచించే సూచిక
A) B.O.D
B) C.O.D
C) T.O. D
D) A.O.D
జవాబు:
A) B.O.D

37. విమానాల రాకపోకలు జరిగేది.
A) ట్రోపోస్ఫియర్
B) స్ట్రాటోస్ఫియర్
C) అయనోస్ఫియర్
D) పైవేవీ కావు
జవాబు:
B) స్ట్రాటోస్ఫియర్

38. అతినీలలోహిత కిరణాలను శోషించుకునేది
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) ఓజోన్
D) నైట్రోజన్
జవాబు:
B) హైడ్రోజన్

39. A.Cలలో వెలువడేవి
A) క్లోరో ఫ్లోరో కార్బన్లు
B) హైడ్రో కార్బన్లు
C) హేలోజన్లు
D) నత్రజని విష వాయువులు
జవాబు:
A) క్లోరో ఫ్లోరో కార్బన్లు

40. మాంట్రియల్ ఫోటోకాల్ దీనికి సంబంధించినది.
A) జీవవైవిధ్యం
B) పర్యావరణం
C) ఓజోన్ పొర సంరక్షణం
D) అడవుల నరికివేత
జవాబు:
C) ఓజోన్ పొర సంరక్షణం

41. మాంట్రియల్ ప్రోటోకాల్ అమలులోకి వచ్చిన సంవత్సరం
A) 1982
B) 1989
C) 1992
D) 1994
జవాబు:
B) 1989

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

42. భూ ఉపరితలం నుండి ట్రోపోస్పియర్ ఇంత ఎత్తు వరకు వ్యాపించి వుంటుంది.
A) 1000 మీ.
B) 8848 మీ.
C) 100 కి.మీ.
D) 10 కి.మీ.
జవాబు:
D) 10 కి.మీ.

43. పర్యావరణ స్నేహిత చర్య కానిది
A) వ్యర్ధ స్థలాల్లో మొక్కల పెంపకం
B) విద్యుత్ వినియోగం తగ్గించుట
C) కంపోస్ట్ ఎరువు వాడుట
D) వాహనాల వినియోగం పెంచుట
జవాబు:
D) వాహనాల వినియోగం పెంచుట

44. నత్రజని స్థాపన జరగకపోతే ఏమౌతుంది?
1) నేలలో నత్రజని తగ్గిపోతుంది
2) మొక్కలకు నైట్రేట్లు అందవు
3) మొక్కలు, జంతువులు మరణిస్తాయి
4) వాతావరణంలో నత్రజని తగ్గిపోతుంది
పై వాటిలో సరైనవి
A) 1, 2
B) 3, 4
C) 1, 3
D) 1, 4
జవాబు:
A) 1, 2

మీకు తెలుసా?

శ్వాసక్రియకు ఆక్సిజన్ అత్యవసరమని మనం సాధారణంగా అనుకుంటుంటాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులకు ఆక్సిజన్ విషంలా పనిచేస్తుంది. నత్రజని స్థాపక బాక్టీరియా ఆక్సిజన్ సమక్షంలో నైట్రోజన్ స్థాపన చేయలేవు.

మాంట్రియల్ ప్రోటోకాల్

ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానమే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది అంటార్కిటికా పైన కనిపించిన ఓజోన్ రంధ్రాన్ని పరిశీలించి ఓజోన్ పొరను నాశనం చేసే వాయువులపై నియంత్రించే విధంగా చర్యలు చేపట్టడానికి అవకాశాన్నిచ్చింది. ఈ అంశానికి అనుగుణంగా ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలపై నిషేధం విధిస్తూ Montreal Protocol ఉద్భవించింది. ఈ ఒప్పందంపై 1987లో 24 దేశాలు సంతకాలు చేశాయి. 1989లో ఇది అమలులోకి వచ్చింది. నేటికి 120 దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యాయి. ఒప్పందం ఏమిటంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, (Chloro Floro Carbon (CFC)) వాటి ఉత్పన్నాల వంటివి, ఓజోన్ పొరకు నష్టం కలిగించే పదార్థాల ఉత్పత్తి మరియు సరఫరాను నియంత్రించడం. ప్రోటోకాలను సరిచేయడానికి మరల 1992లో కోపెన్ హెగలో సమావేశం జరిగింది. ఈ సమావేశం హాలోకార్బన్ ఉత్పత్తిని 1994 నాటికి, క్లోరోఫ్లోరోకార్బన్స్, CHLORO FLORO CARBON (CFC) ఇతర హాలోకార్బన్లను 1996 నాటికి నిలిపివేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయాం.

పునరాలోచన

AP 9th Class Biology Important Questions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2