These AP 9th Biology Important Questions and Answers 5th Lesson జీవులలో వైవిధ్యం will help students prepare well for the exams.
AP Board 9th Class Biology 5th Lesson Important Questions and Answers జీవులలో వైవిధ్యం
9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ప్రకృతిలో ఉండే వైవిధ్యానికి సంకేతం?
జవాబు:
ఎత్తైన శిఖరాలలో, ఎడారులలో, మైదానాలలో, లోతైన సముద్రాలలో అతి చల్లని ప్రాంతాల నుండి అతి వేడైన ప్రాంతాలకు జీవులు వ్యాపించి ఉండడం ప్రకృతిలో ఉండే వైవిధ్యానికి సూచిక.
ప్రశ్న 2.
ద్విదళ బీజాల మొక్కల లక్షణాలు ఏవి?
జవాబు:
మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉండటం, జాలాకార ఈనెల వ్యాపనం మరియు ప్రధాన వేరు వ్యవస్థను ద్విదళబీజ మొక్కలు కలిగి ఉంటాయి.
ప్రశ్న 3.
ఏకదళ బీజ మొక్కల లక్షణాలు ఏవి?
జవాబు:
మొక్కల గింజలందు ఒకే దళం, సమాంతర ఈనెల వ్యాపనం మరియు గుబురు వేరువ్యవస్థను ఏకదళ బీజ మొక్కలు కలిగి ఉంటాయి.
ప్రశ్న 4.
వైవిధ్యం అనగానేమి?
జవాబు:
ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు.
ప్రశ్న 5.
వరీకరణము అనగానేమి?
జవాబు:
ఒక జనాభాలో వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటన్నింటిని ఒక సమూహం కిందికి తీసుకురావడాన్ని వర్గీకరణం అంటారు.
ప్రశ్న 6.
ఛార్లెస్ డార్విన్ రచించిన గ్రంథం ‘జీవుల పుట్టుక’ దేనిని గురించి తెలియచేస్తుంది?
జవాబు:
‘జీవుల పుట్టుక’ గ్రంథం జీవపరిణామము గురించి తెలియచేస్తుంది.
ప్రశ్న 7.
లిన్నేయస్ (1758) జీవులను ఎన్ని రాజ్యా లుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
లిన్నేయస్ జీవులను రెండు రాజ్యాలుగా విభజించాడు. అవి :
- వెజిటేబిలియా (స్టాంగే)
- అనిమేలియా
ప్రశ్న 8.
ఎర్నెస్ట్ హెకెల్ (1866) జీవులను ఎన్ని రాజ్యాలుగా విభజించాడు?
జవాబు:
ఎర్నెస్ట్ హెకెల్ జీవులను 3 రాజ్యా లుగా విభజించాడు. అవి :
- ప్రొటిస్టా
- ప్లాంటే
- అనిమేలియా
ప్రశ్న 9.
చాటన్ (1925) జీవులను ఎన్ని సామ్రాజ్యాలుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
చాటన్ జీవులను 2 సామ్రాజ్యాలుగా విభజించాడు. అవి :
- కేంద్రకపూర్వజీవులు
- నిజకేంద్రక జీవులు
ప్రశ్న 10.
కోప్ లాండ్ (1938) జీవులను ఎన్ని రాజ్యా లుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
కోప్ లాండ్ (1938) జీవులను 4 రాజ్యా లుగా విభజించాడు. అవి :
- మొనిరా
- ప్రొటీస్టా
- ప్లాంటే
- అనిమేలియా
ప్రశ్న 11.
విబేకర్ (1969) జీవులను ఎన్ని రాజ్యా లుగా విభజించాడు. అవి ఏవి?
జవాబు:
విట్టేకర్ జీవులను 5 రాజ్యా లుగా విభజించాడు. అవి :
- మొనిరా
- ప్రొటీస్టా
- ప్లాంటే
- ఫంగై
- అనిమేలియా
ప్రశ్న 12.
ఊజ్ ఎట్ ఆల్ (1990) జీవులను ఎన్ని డొమైన్స్ గా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
ఊజ్ ఎట్ ఆల్ (1990) జీవులను 3 డొమైన్లుగా అవి :
- బాక్టీరియా
- అరాకియా
- యూకారియా
ప్రశ్న 13.
కెవాలియర్ -స్మిత్ (1998) జీవులను ఎన్ని డొమైన్లుగా విభజించాడు? అవి ఏవి?
జవాబు:
కెవాలియర్ – స్మిత్ (1998) జీవులను 6 డొమైన్లుగా విభజించాడు. అవి :
- బాక్టీరియా
- ప్రోటోజోవా
- క్రోమిస్టా
- ప్లాంటే
- ఫంగై
- అనిమేలియా
ప్రశ్న 14.
ద్వినామీకరణం అనగానేమి? దీనిని ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
ప్రతి జీవికి రెండు పేర్లతో నామకరణం చేయడమును ద్వినామీకరణం అంటారు. అందులో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియచేస్తుంది. కరోలియస్ వాన్ లిన్నేయస్ ద్వినామీకరణం విధానమును ప్రవేశపెట్టాడు.
ప్రశ్న 15.
లిన్నేయస్ వర్గీకరణములో జీవుల అమరిక విధానమేది?
జవాబు:
ప్రజాతి సమూహాలను కుటుంబము అని, కుటుంబాలన్నీ కలిపి క్రమాలని, క్రమాలన్నీ కలిపి తరగతులు, తరగతులన్నీ కలిపి వర్గాలుగా, వర్గాలన్నీ కలిపి రాజ్యాలుగా పేర్కొన్నాడు. జీవులను రెండు రాజ్యాలుగా గుర్తించాడు.
ప్రశ్న 16.
లిన్నేయస్ జీవుల వర్గీకరణకు ఎంచుకున్న అంశాలు ఏవి?
జవాబు:
వివిధ జీవుల మధ్య ఉన్న పోలికలు, భేదాలను జీవుల వర్గీకరణకు అంశాలుగా లిన్నేయస్ ఎంచుకున్నాడు.
ప్రశ్న 17.
థామస్ విట్టేకర్ జీవుల వర్గీకరణకు ఎంచుకున్న లక్షణాలు ఏవి?
జవాబు:
జీవులలో కేంద్రకం ఉన్నవి లేదా కేంద్రకం లేనివి మరియు జీవులు ఆహారాన్ని పొందే విధానంలో భేదాలను బట్టి థీమస్ విట్టేకర్ జీవుల వర్గీకరణను పొందుపరిచాడు.
ప్రశ్న 18.
థర్మోఫిల్స్, హేలోఫిల్స్ అసాధారణ పరిస్థితులలో జీవించడానికి కారణం ఏమిటి?
జవాబు:
థర్మోఫిల్స్, హేలో ఫిల్స్ యొక్క DNA నిర్మాణంలో, అమరికలో వైవిధ్యము ఉండడము వలన అసాధారణ పరిస్థితులలో జీవించగలుగుతున్నాయి.
ప్రశ్న 19.
స్వతంత్ర పూర్వీక కణమైన ‘లూకా’ నుండి ఉద్భవించిన మూడు రకాల కణాల తరువాత కాలంలో నిర్దేశించిన రంగాలు ఏవి?
జవాబు:
అరాఖియా, బాక్టీరియా, యూకేరియా
ప్రశ్న 20.
‘జాతి’ అనగానేమి?
జవాబు:
ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి, జంటగా లేదా స్వతంత్రంగా తమ తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ‘జాతి’ అంటారు.
ప్రశ్న 21.
మొనీరా జీవుల నిర్దిష్ట లక్షణమేది? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
నిజకేంద్రకం లేని ఏకకణజీవులు మొనీరా జీవులు.
ఉదా : అనబిన, బాక్టీరియా,
ప్రశ్న 22.
మొనీరా రాజ్యంలో గల ప్రధాన సమూహాలేవి.
జవాబు:
ఆర్కె బాక్టీరియా, యూబాక్టీరియా మరియు సయానోబాక్టీరియా మొనీరా రాజ్యంలో గల ప్రధాన సమూహాలు.
ప్రశ్న 23.
ప్రొటీస్టా జీవుల ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
చాలావరకు ఏక కణజీవులు, కొన్ని మాత్రం బహుకణజీవులు నిజకేంద్రక జీవులు.
ఉదా : అమీబా, యూగ్లీనా, పారామీషియం.
ప్రశ్న 24.
శిలీంధ్ర జీవుల ప్రత్యేక లక్షణాలు ఏవి?
జవాబు:
చాలావరకు బహుకణజీవులు కొన్ని మాత్రం ఏకకణజీవులు సిద్ధబీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి, వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో ఆహారాన్ని సేకరించే పరపోషకాలు.
ఉదా : రైజోపస్, మ్యూకార్, అగారికస్.
ప్రశ్న 25.
మొక్కలను వర్గీకరించడానికి ఎంచుకునే లక్షణాలు ఏవి?
జవాబు:
ఆహారాన్ని సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానాన్ని బట్టి మొక్కలను వర్గీకరిస్తారు.
ప్రశ్న 26.
విత్తనాలకు, సిద్ధబీజాలకు మధ్యగల భేదాలేవి?
జవాబు:
విత్తనాలు పుష్పంలోని అండకోశం నుండి ఉత్పత్తి అవుతాయి. వీటిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది. సిద్ధబీజాలు సిద్ధబీజాశయం నుండి ఉత్పత్తి అవుతాయి. తక్కువ మొత్తంలో ఆహారం నిల్వ ఉంటుంది.
ప్రశ్న 27.
జంతువులలో కనిపించే సామాన్య లక్షణాలు ఏవి?
జవాబు:
నిజకేంద్రక బహుకణ జీవులు, పరపోషకాలు, కణాలలో కణత్వచం ఉండదు. చలనం కోసం ప్రత్యేకమయిన అవయవాలు ఉంటాయి.
ప్రశ్న 28.
ఏ లక్షణం ఆధారంగా జంతువులను వర్గీకరించడం జరిగినది?
జవాబు:
జంతువుల శరీర నిర్మాణంలో ఉన్న వ్యత్యాసం ఆధారంగా వాటిని వర్గీకరించడం జరిగింది.
ప్రశ్న 29.
పొరిఫెర జీవుల ప్రధాన లక్షణాలు ఏవి?
జవాబు:
రంధ్రాలు కలిగిన చలనాంగాలు లేని స్థిర సముద్ర జీవులు. శరీరం అస్థిపంజరంలో కప్పబడి ఉంటుంది. వీటిని స్పంజికలు అంటారు.
ఉదా : యూప్లిక్టీలియ, సైకాన్, స్పంజీలా
ప్రశ్న 30.
సీలెంటిరేటా నిడేరియ జీవుల లక్షణాలు ఏవి?
జవాబు:
నీటిలో నివసించే ద్విస్తరిత, శరీరకుహరం కలిగి, కొన్ని సమూహాలుగా లేదా ఒంటరిగా జీవిస్తాయి.
ఉదా: హైడ్రా, జెల్లీఫిష్ మరియు పగడాలు
ప్రశ్న 31.
ప్లాటిహెల్మింథిస్ జీవుల ముఖ్య లక్షణాలు రాయండి.
జవాబు:
ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత మరియు నిజశరీర కుహరం లేని బల్లపరుపు జీవులు. వీటిని చదును పురుగులంటారు. ఉదా : ప్లనేరియా (స్వతంత్ర్యం), టీనియా (పరాన్నజీవి)
ప్రశ్న 32.
నిమటోద వర్గ జీవుల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
ఈ వర్గ జీవుల శరీరం సూపాకారంగా, విస్తరిత, ద్విపార్వ సౌష్టవం మరియు మిధ్యాకుహరం కలిగిన జీవులు. కణజాలాల విభేదనం కలిగి ఉంటాయి.
ఉదా : ఉకరేరియా మరియు ఆస్కారిస్ లుంబికాయిడ్స్ నులిపురుగు.
ప్రశ్న 33.
అనెలిడ జీవుల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
అనెలిడ జీవులు ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, నిజశరీరకుహరం మరియు ఖండితాలు గల శరీరం గల జీవులు. అన్ని రకాల ఆవాసాలలో ఉంటాయి.
ఉదా : వానపాము, జలగ.
ప్రశ్న 34.
ఆర్రోపొడ జీవుల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
ఆర్రోపొడ జీవులు శరీరం ద్విపార్శ్వసౌష్టవం, ఖండితాలు కలిగి స్వేచ్ఛాయుత రక్తప్రసరణ మరియు కీళ్ళు గల కాళ్ళు కలిగిన జీవులు.
ఉదా : రొయ్యలు, సీతాకోకచిలుకలు, బొద్దింకలు.
ప్రశ్న 35.
మొలస్కా వర్గజీవుల గురించి రాయండి.
జవాబు:
మొలస్కా వర్గజీవులు స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ, కుచించుకుపోయిన శరీరకుహరం, ద్విపార్వ సౌష్టవం మరియు విసర్జన వ్యవస్థ వృక్కాలతో నిర్మితమై ఉంటుంది. పాదం వంటి అంగంతో చలిస్తాయి. ఉదా : నత్తలు, ఆల్చిప్పలు, కోమటి సంచులు.
ప్రశ్న 36.
‘అఖైనోడర్మేటా’ అనగానేమి?
జవాబు:
గ్రీకు భాషలో ఇఖైనోడర్మేటా అనగా ముళ్ళవంటి చర్మం కలిగిన జీవులు.
ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిళ్లు.
ప్రశ్న 37.
ప్రోటోకార్డేటా జీవుల లక్షణాలు తెలుపండి.
జవాబు:
ప్రొటోకారేటాలు త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవం, శరీర కుహరం కలిగిన జీవులు. ఈ జీవులలో పృష్ఠవంశం జీవితంలో ఏదో ఒక దశలో తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా : బెలనోగ్లోసెస్, ఎంఫియాక్సిస్
ప్రశ్న 38.
సకశేరుక జీవులను ఎన్ని తరగతులుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
సకశేరుక జీవులను ఐదు తరగతులుగా విభజించారు. అవి : 1. చేపలు 2 ఉభయచరాలు 3. సరీసృపాలు 4. పక్షులు 5. క్షీరదాలు
ప్రశ్న 39.
చేపల ముఖ్య లక్షణాలు ఏవి?
జవాబు:
చేపల ముఖ్య లక్షణాలు :
చర్మంపై పొలుసులు, మొప్పలతో జలశ్వాసక్రియ, రెండు గదుల గుండె కలిగి నీటిలో నివసిస్తాయి.
ప్రశ్న 40.
ఉభయచర జీవుల ముఖ్య లక్షణములు ఏవి?
జవాబు:
ఉభయచర జీవులు :
నేలమీద, నీటిలోని జీవించగల శీతల రక్త జంతువులు. గుండె నందు మూడు గదులుంటాయి.
ఉదా : కప్ప, సాలమాండర్
ప్రశ్న 41.
సరీసృపాల యొక్క ముఖ్య లక్షణములు ఏవి?
జవాబు:
సరీసృపాలు :
చర్మంపైన పొలుసులు ఉంటాయి. శీతల రక్త జంతువులు. గుండెనందు మూడు గదులు ఉంటాయి. మొసళ్ళలో నాలుగు గదుల గుండె ఉంటుంది.
ఉదా : పాములు, బల్లులు, తొండలు.
ప్రశ్న 42.
క్షీరదాల ముఖ్య లక్షణములు తెలుపండి.
జవాబు:
క్షీరదాల ముఖ్య లక్షణములు బాహ్య చెవులు, నాలుగు గదుల గుండె, చర్మం వెంట్రుకలతో కప్పబడి స్వేద మరియు పాల గ్రంథులుంటాయి. శిశోత్పాదకాలు (పిల్లలను కని పాలిచ్చే జంతువులు)
ప్రశ్న 43.
క్షీరదములను నివసించే ప్రదేశాన్ని బట్టి ఎన్ని సమూహములుగా విభజించారు?
జవాబు:
క్షీరదములను నివసించే ప్రదేశాన్ని బట్టి 3 సమూహములుగా విభజించారు. అవి :
- నేలపై నివసించే క్షీరదాలు
- సముద్రపు క్షీరదాలు
- ఎగిరే క్షీరదాలు
ప్రశ్న 44.
నేలపై నివసించే క్షీరదములు ఎన్ని రకములు?
జవాబు:
నేలపై నివసించే క్షీరదములు 3 రకములు. అవి : మార్సూపియల్స్, ప్రైవేట్స్, రోడెంట్స్
ప్రశ్న 45.
మార్సుపియల్స్ క్షీరద ప్రత్యేక లక్షణమేది?
జవాబు:
మార్సుపియల్స్ క్షీరద ప్రత్యేక లక్షణం :
పిల్లలను సంరక్షించడానికి ఒక సంచి వంటి నిర్మాణము ఉదరభాగములో ఉంటుంది.
ఉదా : కంగారూ
ప్రశ్న 46.
ప్రైమేట్స్ క్షీరదముల లక్షణములేవి?
జవాబు:
ప్రైమేట్స్ క్షీరదముల లక్షణము : అభివృద్ధి చెందిన చేతులు, కాళ్ళు, వేళ్ళకు గోళ్ళుంటాయి. తెలివైన సంఘజీవులు
ఉదా : కోతి, మానవుడు
ప్రశ్న 47.
రోడెండ్స్ క్షీరదముల ప్రత్యేక లక్షణం ఏది?
జవాబు:
రోడెండ్స్ క్షీరదముల ప్రత్యేక లక్షణం దవడలను కలిగి ఆహారాన్ని ముక్కలు చేయడానికి కుంతకాలను ఉపయోగిస్తాయి.
ఉదా : ఎలుక
ప్రశ్న 48.
ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగానేమి?
జవాబు:
ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగా శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉండే జీవులు.
ప్రశ్న 49.
అనుపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగానేమి?
జవాబు:
అనుపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు అనగా మధ్య అక్షము చుట్టూ క్రమానుగతంగా శరీర భాగాల అమరిక ఉంటే అటువంటి నిర్మాణమును అనుపార్శ్వ సౌష్టవం అంటారు. నోరు మధ్యగా ఉండి దాని చుట్టూ ఐదు సమాన భాగాలు విస్తరించి యుండు విధానం.
ప్రశ్న 50.
ద్విస్తరిత జీవులు అనగానేమి?
జవాబు:
ద్విస్తరిత జీవులు అనగా శరీరం రెండు త్వచాలతో తయారయిన జీవులు.
ఉదా : సీలెంటిరేటా
ప్రశ్న 51.
త్రిస్తరిత జీవులు అనగానేమి?
జవాబు:
త్రిస్తరిత జీవులు అనగా శరీరం మూడు పొరలుగా విభేదనం చెంది ఉంటుంది.
ఉదా : ప్లాటి హెల్మింథిస్, నిమటోడ, అనెలిడ, ఇఖైనోడర్మేటా
ప్రశ్న 52.
ఇఖైనోడర్మేటా వర్గజీవుల ప్రత్యేక లక్షణాలేవి?
జవాబు:
ఇఖైనోడర్మేట వర్గజీవులు ముళ్ళవంటి చర్మం కలిగిన త్రిస్తరిత, అనుపార్శ్వ సౌష్టవం, శరీర కుహరం జల విసర్జన వ్యవస్థ గల జీవులు.
ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిన్లు.
ప్రశ్న 53.
కరోలస్ వాన్ లిన్నేయస్ వర్గీకరణ విధానమును ఏ విధముగా ప్రశంసిస్తావు?
జవాబు:
లిన్నేయస్ ప్రతిపాదించిన వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటిని అధిగమించింది. జీవులను ఒక క్రమ పద్ధతిలో వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను అధ్యయనం చేయడం ద్వారా వర్గీకరించడం జరిగినది.
ప్రశ్న 54.
ప్రాంతాలను బట్టి జీవులకు ఉన్న పేర్లలోని వ్యత్యాసమును అధిగమించడంలో లిన్నేయస్ చేసిన కృషి ఏమిటి?
జవాబు:
లిన్నేయస్ ప్రతి జీవికి రెండు పేర్లతో నామకరణం చేయడం వలన జీవులను పేర్లను బట్టి అధ్యయనం చేయడం జరిగింది. ప్రపంచమంతటా ఉండి అందరిచే ఆమోదించబడినది.
ప్రశ్న 55.
జీవులలో వైవిధ్యం ఉండదమును నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ప్రకృతి జీవరాసులు అన్నింటిదని, రకరకాల ప్రాంతాలలో వేరు వేరు రకాల జీవరాసులు ఉన్నాయని అవి ప్రకృతి యొక్క సౌందర్యమును ఇనుమడింపచేస్తున్నాయని వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని భావిస్తాను.
ప్రశ్న 56.
లిన్నేయస్ వర్గీకరణములోని లోపాలను అధిగమించడానికి ప్రయత్నము చేసిన థామస్ విట్టేకర్ సేవలను నీవు ఏవిధంగా అభినందిస్తావు?
జవాబు:
విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణలో నూతన పద్ధతులు, నూతన ఆధారాలు పొందుపరచాడు. జీవుల మధ్య ఉన్న పోలికలు, భేదాలను బట్టి జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించాడు.
ప్రశ్న 57.
గబ్బిలం పక్షి కాదు క్షీరదమని నీవు ఏ విధముగా భావిస్తావు?
జవాబు:
పుట్టిన గబ్బిలము పాలకోసం తల్లిపాల మీద ఆధారపడుతుంది. శరీరం మీద రోమాలు కలవు. ఇది ఎగర గలిగిన క్షీరదము కాని పక్షి కాదు.
ప్రశ్న 58.
మానవులలో వైవిధ్య లక్షణాలు కలవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఏ ఇద్దరు మానవులు ఒకటి కాదనియు, వేలిముద్రలు మరియు కంటి పాపలు వేరు వేరుగా ఉండుట వలన మానవులలో వైవిధ్యము కలదని చెప్పవచ్చు.
ప్రశ్న 59.
మీకే గాని జంతువులను వర్గీకరించడానికి అవకాశం వస్తే జీవులను దేని ఆధారంగా వర్గీకరిస్తావు?
జవాబు:
జీవి నిజకేంద్రక జీవా? లేదా కేంద్రక జీవా? బహుకణ జీవా, ఏకకణజీవా? ప్రత్యుత్పత్తి విధానమేది? ఆహార సంపాదన ఎలా చేస్తుంది? అన్న అంశాల ఆధారంగా జంతువులను వర్గీకరిస్తాను.
ప్రశ్న 60.
బంగాళాదుంపలను వివిధ భాషలలో ఏ ఏ పేర్లతో పిలుస్తారో రాయండి.
జవాబు:
బంగాళాదుంపలను హిందీలో ఆలు, తమిళంలో ఉరుళక్కిజ్ హంగు, మరాఠీలో బటాటా, ఒడియాలో బలాటి ఆలు అని పిలుస్తారు.
ప్రశ్న 61.
జీవ వైవిధ్యమును కాపాడుటకు నీవు చేయు కార్యకలాపములు ఏవి?
జవాబు:
జీవ హింస చేయకూడదనియు, జీవ సంరక్షణ కేంద్రాలు, వన సంరక్షణ సమితులు, జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటుకు తగు చర్యలను చేపడతాను.
ప్రశ్న 62.
ఆక్రోపొడ వర్గ జీవుల ఉపయోగములు ఏవి?
జవాబు:
ఆర్రోపొడ జీవులు, పరాగసంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీల యందు ఉపయోగపడతాయి.
ప్రశ్న 63.
సంవత్సరాల తరబడి వర్గీకరణ విధానం ఎందుకు మార్పునకు లోనవుతుందో చెప్పగలరా?
జవాబు:
సంవత్సరాల తరబడి వర్గీకరణ విధానం మార్పుకు లోనవ్వడానికి కారణాలు : కొత్త జీవులను కనిపెట్టడం, జన్యుశాస్త్రంలో పురోగతి నురియు శక్తివంతమైన సూక్ష్మదర్శినిలు తయారుచేయడం.
ప్రశ్న 64.
కారేటా వరంలోని ఉపవరాలు ఏమిటి?
జవాబు:
కార్డేటా వర్గంలో మూడు ఉపవర్గాలు కలవు. అవి : 1. యూరోకార్డేటా 2. సెఫలోకార్డేటా 3. వర్టిబ్రేటా
ప్రశ్న 65.
ఐ.బి.ఎస్ ఆమోదం పొందిన వర్గీకరణ విధానం ఏమిటి?
జవాబు:
హెవాలియర్ మరియు స్మిత్ 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004 లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల (ఐ.బి.యస్) ఆమోదం పొందింది.
ప్రశ్న 66.
వర్గీకరణలో చిన్న ప్రమాణం ఏమిటి?
జవాబు:
వర్గీకరణలో అతిచిన్న ప్రమాణం జాతి.
9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
జీవుల వర్గీకరణ వలన కలిగే లాభాలు ఏమిటి?
జవాబు:
- వివిధ జంతువుల అధ్యయనము వర్గీకరణ వలన సులభం అవుతుంది.
- వివిధ జీవసమూహాల మధ్య ఉన్న అంతర సంబంధాలను అర్థం చేసుకోవడానికి వర్గీకరణం అవసరం.
- వర్గీకరణం వలన జీవుల మధ్య ఉన్న వైవిధ్యంను కనుగొనవచ్చు.
- వర్గీకరణం వలన వివిధ జంతువులు సరళము నుండి సంక్లిష్టముగా పరిణామం చెందిన విధమును తెలుసుకోవచ్చు.
- జంతువుల భౌగోళిక విస్తరణమును అధ్యయనము చేయడానికి వర్గీకరణ సమాచారము ఉపయోగపడుతుంది.
ప్రశ్న 2.
వెన్నెముక కలిగిన జీవులను ఎన్ని ఉప తరగతులుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
వెన్నెముక కలిగిన జీవులను 5 ఉప తరగతులుగా విభజించారు. అవి.
- చేపలు
- ఉభయచరాలు
- సరీసృపాలు
- పక్షులు
- క్షీరదాలు.
ప్రశ్న 3.
వైవిధ్యం, జీవవైవిధ్యం మరియు వర్గీకరణం అనగానేమి?
జవాబు:
వైవిధ్యం :
ఒకే జాతి జీవుల మధ్య ఉండే భేదాలను వైవిధ్యం అంటారు.
జీవవైవిధ్యం :
ఒకే జాతి జీవుల మధ్య, వివిధ జాతి జీవుల మధ్య మరియు వివిధ ఆవరణ వ్యవస్థల మధ్య గల వైవిధ్యం.
వర్గీకరణం :
ప్రకృతిలో ఉన్న జీవుల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయడానికి తోడ్పడే శాస్త్రం.
ప్రశ్న 4.
ప్రాచీన కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు వర్గీకరణకు ఏ విధముగా తోడ్పాటును అందించారు?
జవాబు:
- భారతదేశంలో మొట్టమొదటిగా క్రీ.శ. మొదటి, రెండవ శతాబ్దాలలో వైద్యశాస్త్రంలో గొప్ప పరిశోధన జరిగింది.
- చరకుడు, సుశ్రుతుడు మొక్కలను, వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసికొని వర్గీకరించారు.
- మొదటిగా పరాశర మహర్షి ‘వృక్షాయుర్వేద’ అనే గ్రంథంలో వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరిచారు.
- పుష్పాలను ఆధారంగా చేసుకొని పరాశర మర్షి ఈ వర్గీకరణ చేశాడు.
ప్రశ్న 5.
కరోలస్ లిన్నేయస్ వర్గీకరణము గురించి రాయండి.
జవాబు:
- 1758 లో కరోలస్ వాన్ లిన్నేయస్ ప్రతిపాదించిన వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటినీ అధిగమించింది.
- ఈయన ప్రతి జీవికి రెండు పేర్లతో నామకరణం చేశాడు. దీనిని ద్వినామీకరణం అంటారు. అందులో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియచేస్తుంది.
- ఆ తరువాత ప్రజాతి సమూహాలను కుటుంబము అని, కుటుంబాలన్నీ కలిపి క్రమము, క్రమములన్నీ కలిపి తరగతులు, తరగతులన్నీ కలిపి వర్గాలుగా, వర్గాలన్నీ కలిపి రాజ్యా లుగా పేర్కొన్నారు.
- జీవులను రెండు రాజ్యాలుగా గుర్తించారు. వాటిలో ఒకటి అనిమేలియా (జంతువులు), రెండవది ప్లాంటే (మొక్కలు).
ప్రశ్న 6.
సజీవులు ఏ విధంగా వర్గీకరించబడ్డాయి?
జవాబు:
- శరీర నిర్మాణమును అనుసరించి జీవులు వర్గీకరించబడ్డాయి.
- జీవుల మధ్య ఉన్న పోలికలు, భేదాలను అనుసరించి జీవులను వర్గీకరించడమైనది.
ప్రశ్న 7.
ద్వినామీకరణ విధానం అనగానేమి? దీనిని ఎవరు ప్రతిపాదించారు?
జవాబు:
- ఒక జీవిని ఒక శాస్త్రీయ నామంతో పిలవడాన్ని నామీకరణ విధానం అంటారు.
- ఇది ప్రపంచం అంతటా ఒకేలా ఉంటుంది.
- ప్రతి జీవికి రెండు పేర్లుండే విధానమును కరోలస్ లిన్నేయస్ ప్రతిపాదించాడు.
- మొదటి పేరు ప్రజాతిని, రెండో పేరు జాతిని తెలియజేస్తాయి. దీనినే ద్వినామీకరణ విధానం అంటారు.
ప్రశ్న 8.
సిద్ధబీజము మరియు విత్తనము మధ్యగల భేదములేవి?
జవాబు:
సిద్ధబీజము | విత్తనము |
1. సిద్ధబీజమునందు తక్కువ మొత్తంలో ఆహారం ఉంటుంది. | 1. విత్తనము ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని నిలువచేస్తుంది. |
2. ఇది సిద్ధబీజాశయము నుండి ఉత్పత్తి అవుతుంది. | 2. విత్తనములు పుష్పమునందలి అండము నుండి తయారవుతాయి. |
ప్రశ్న 9.
వివృత బీజాలు మరియు ఆవృత బీజాలకు మధ్యగల భేదములేవి?
జవాబు:
వివృత బీజాలు | ఆవృత బీజాలు |
1. విత్తనాలు పండ్ల బయటకు కనిపిస్తూ ఉంటాయి. | 1. విత్తనాలు పండ్ల లోపల అమరి ఉంటాయి. |
2. అండాలు అండాశయమునందు లోపల ఉండవు. ఉదా : పైనస్, సైకాస్ |
2. అండాశయము నందు అండములు ఉంటాయి. ఉదా : మామిడి, యాపిల్. |
ప్రశ్న 10.
పొరిఫెరా జీవులకు మరియు సీలెంటిరేటా జీవులకు మధ్యగల రెండు భేదాలను రాయండి.
జవాబు:
పొరిఫెరా జంతువులు | సీలెంటిరేటా జంతువులు |
1. జీవుల వ్యవస్థీకరణ కణస్థాయిలో ఉంటుంది. | 1. జీవుల వ్యవస్థీకరణ కణజాల స్థాయిలో ఉంటుంది. |
2. శరీర నిర్మాణం కనీసస్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. | 2. కొద్ది మొత్తంలో శరీర నిర్మాణం విభేదనం చెంది ఉంటుంది. |
9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
వర్గీకరణ అవసరం ఏమిటి?
జవాబు:
వర్గీకరణ అవసరం :
- మనం పరిశీలించిన జీవుల గురించి పూర్తిగా అర్థంచేసుకోవటానికి వర్గీకరణ తోడ్పడుతుంది.
- ఒక నిర్దిష్టమైన, క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయడానికి,
- జీవులు వాటి యొక్క పూర్వీకుల నుండి ఏర్పడిన విధమును వివరించడానికి,
- ఒకే రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలను సులభంగా గుర్తించడానికి తోడ్పడుతుంది,
- జీవుల మధ్య ఉన్న సంబంధం, పరస్పర ఆధారిత్వాన్ని గురించి అధ్యయనం చేయడానికి,
- జనాభాలో వివిధ రకాల జీవుల గురించి అధ్యయనం చేయడానికి,
- ప్రకృతిలో జరిగిన జీవపరిణామం గురించి ఒక అవగాహనకు రావడానికి వర్గీకరణ తోడ్పడుతుంది.
ప్రశ్న 2.
వర్గీకరణకు, పరిణామానికి గల సంబంధమేది?
జవాబు:
- జీవుల యొక్క శరీర నిర్మాణం, విధుల ఆధారంగా వాటిని గుర్తించడం, వర్గీకరించడం జరిగింది.
- కొన్ని లక్షణాలు ఇతర లక్షణాల కంటే శరీరాకృతిలో ఎక్కువ మార్పులు తేవడంలో దోహదపడతాయి.
- జీవుల యొక్క మనుగడలో ముందుగా వచ్చిన మౌలిక లక్షణాలు, తరువాత వచ్చిన మౌలిక లక్షణాల కంటే ప్రముఖ పాత్ర వహిస్తాయి.
- జీవుల వర్గీకరణ అనే అంశం జీవపరిణామంతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.
- పరిణామము అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ.
- నేడు మనం చూస్తున్న చాలా జీవుల లక్షణాలు, సంవత్సరాల తరబడి వచ్చిన మార్పులకు నిదర్శనం.
- 1859 లో చార్లెస్ డార్విన్ అను జీవశాస్త్రవేత్త మొదటిసారిగా “జీవుల పుట్టుక” అనే గ్రంథంలో జీవపరిణామం గురించి పేర్కొన్నారు.
- జీవుల శరీర నిర్మాణంలో గల సంక్లిష్టత పురాతన జీవులకంటె ఇటీవల ఏర్పడిన జీవులలో తక్కువగా ఉంటుంది.
- వర్గీకరణము కూడా సరళమైన జీవులతో ప్రారంభించబడి సంక్లిష్ట జీవుల వరకు కొనసాగినది. ఇది పరిణామమునకు దారితీసింది.
- అందువలన వర్గీకరణము, పరిణామము ఒకదానితో నొకటి సంబంధం కలిగినవి.
ప్రశ్న 3.
కారల్ వూజ్ ప్రతిపాదించిన వర్గీకరణమును వివరించండి.
జవాబు:
- పూజ్ జీవులను మూడు సమూహములుగా విభజించాడు అవి. 1) బ్యా క్టీరియా 2) అరాఖియా 3) యూకేరియా
- బాక్టీరియా మరియు అరాఖియా కేంద్రక పూర్వ జీవులు.
- బాక్టీరియా కణత్వచం పెప్టిడోగ్లైకాన్ అనే రసాయన పదార్థంతో తయారైనది.
- యూకేరియా నందు నిజకేంద్రక జీవులు ఉంటాయి.
- కణములన్నీ స్వతంత్ర పూర్వీక కణం అయిన లూకా నుండి ఏర్పడినాయి.
- మొట్టమొదటి లూకా కణము నుండి తర్వాతి కాలంలో మూడు రకాల కణాలు పుట్టుకొచ్చాయి.
- పరిణామక్రమంలో ఈ మూడు, మూడు రకాల రంగాలను నిర్దేశిస్తాయి. అవి : 1) అరాఖియా 2) బ్యాక్టీరియా 3) యుకరేరియా అని ఊజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
ప్రశ్న 4.
వర్గీకరణ విధానంలో అమరిక గురించి రాయంది.
జవాబు:
- ఎర్నెస్ట్ హెకెల్ (1894), రాబర్ట్ విట్టేకర్ (1959) మరియు కారల్ వూజ్ సజీవులన్నింటినీ అతిపెద్ద విభాగాలైన రాజ్యాలుగా విభజించడానికి ప్రయత్నించారు.
- విట్టేకర్ వర్గీకరణములో 5 రాజ్యా లను ప్రతిపాదించారు.
- కణ నిర్మాణము, ఆహార సేకరణ విధానము మరియు శరీర వ్యవస్థీకరణము ఆధారముగా ఐదు రాజ్యాలు ఏర్పడినాయి.
- తరువాత వర్గీకరణలో ఉపసమూహములకు వివిధ స్థాయిలలో ఈ క్రింది విధముగా పేర్లు పెట్టడమైనది.
- లక్షణాలకు అనుగుణంగా జీవులను విభజించి చివరకు అతిచిన్న సమూహము మరియు వర్గీకరణకు ఆధారమైన జాతి వరకు కొనసాగుతుంది.
- ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి, జంటగా లేదా స్వతంత్రంగా తమ తమ సంతతి ఉత్పత్తి చేయగల జీవుల సముదాయమును జాతి అంటారు.
ప్రశ్న 5.
మొనీరా రాజ్యం జీవుల లక్షణములను పేర్కొనంది. ఉదాహరణలివ్వండి.
జవాబు:
- మొనీరా జీవులు నిజకేంద్రకం లేని ఏకకణజీవులు.
- ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
- కశాభం, శైలికలు వంటి నిర్మాణాల సహాయంతో ఒక చోటు నుండి మరియొక చోటికి చలిస్తాయి.
- శరీరం వెలుపలి నుండి ఆహారాన్ని సేకరిస్తాయి.
- కొన్ని మొనీరా జీవులు మానవులకు హాని కలిగిస్తాయి. కానీ చాలా వరకు ఇవి మానవులకు ఉపకారం చేస్తాయి.
ఉదాహరణలు : బ్యా క్టీరియా, అనబీన
ప్రశ్న 6.
మొనీరా రాజ్యంలో గల ప్రధాన సమూహములేవి?
జవాబు:
మొనీరా రాజ్యంలో ప్రధానంగా మూడు సమూహాలు గలవు. అవి :
- ఆర్కె బ్యా క్టీరియా : మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బాక్టీరియా. ఇది ఉష్ణమడుగులు లేదా వేడి నీటి బుగ్గలలో నివసిస్తుంది.
- యూ బ్యాక్టీరియా : స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈ కోలై మొదలగునవి.
- సయానో బ్యా క్టీరియా : నీలి ఆకుపచ్చ శైవలాలు.
ప్రశ్న 7.
ప్రొటీస్టా రాజ్య జీవుల లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రొటిస్టా రాజ్య జీవుల లక్షణాలు :
- చాలావరకు ఏకకణజీవులు. కొన్ని మాత్రమే బహుకణ జీవులు.
- త్వచంతో కూడిన నిజ కేంద్రకం ఉంటుంది.
- ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలు శక్తిని పొందుతాయి.
- కొన్ని సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. చుట్టూ ఉన్న నీటి నుండి కూడా పోషకాలు గ్రహిస్తాయి.
- ఇవి ఒంటరిగా గానీ, సమూహాలుగా గానీ జీవిస్తాయి.
- కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి.
- చాలావరకు ద్విధావిచ్చిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్ని బహుధావిచ్చిత్తి, సంయోగం ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
ఉదా : అమీబా, యూగ్లీనా, పారమీషియం మొదలగునవి.
ప్రశ్న 8.
శిలీంధ్ర రాజ్య జీవుల లక్షణాలను పేర్కొనంది. ఉదాహరణలివ్వండి.
జవాబు:
శిలీంధ్ర రాజ్య జీవుల లక్షణాలు :
- శిలీంధ్రాలు కొన్ని ఏకకణ జీవులు. కానీ చాలావరకు బహుకణ జీవులు.
- చాలా వాటిలో తల భాగంలో టిడిపి వంటి నిర్మాణం ఉంటుంది. కొన్నింటిలో గొడుగు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి.
- వర్షాకాలంలో నేల పైన గాని, చెట్టుకాండం పైన గాని మొలుస్తాయి.
- వీటికి ఉన్న వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో నివసించే ప్రదేశం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాయి.
ఇవి రేణువులు వంటి సిద్ధబీజాల సహాయముతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
ఉదా : రైజోపస్, మ్యూకార్, అగారికస్ మొదలైనవి.
ప్రశ్న 9.
మొక్కల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:
- ప్రకృతిలో మొక్కలు వైవిధ్యభరితమైనవి.
- మొక్క శరీరము వేరు, కాండము, ఆకులుగా విభజన చెంది ఉంటుంది.
- మొక్కలు బహుకణ, నిజకేంద్రక జీవులు. కణకవచము కలిగి ఉంటాయి.
- మొక్కలు ప్రధానంగా స్వయంపోషకాలు. పత్రహరితం సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిపి పిండిపదార్థమును తయారుచేస్తాయి.
- మొక్కలు సాధారణంగా విత్తనాలను ఉత్పత్తిచేస్తాయి.
ప్రశ్న 10.
పొరిఫెరా వర్గజీవులను గురించి రాయండి.
జవాబు:
- పొరిఫెరా అనగా శరీరం మీద రంధ్రాలు కలిగిన జీవులు. ఇవి నీటిలో నివసిస్తాయి.
- చలనాంగాలు ఉండవు. బలమైన ఆధారాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి.
- రంధ్రాలు ‘నాళ వ్యవస్థ’ గా పనిచేస్తాయి. వీటి గుండా ఆక్సిజన్, ఆహారపదార్థాల రవాణా జరుగుతాయి.
- శరీరం మొత్తం బలమైన అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది.
- శరీరాకృతి సరళంగా ఉంటుంది.
- పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి. వీటిని స్పంజికలు అంటారు.
- ఇవి ప్రధానంగా సముద్ర జీవులు.
ఉదా : యూప్లికితీయ, సైకాన్, స్పంజీలా.
ప్రశ్న 11.
సీలెంటిరేటా / నిడేరియ జీవుల లక్షణాలను రాయండి.
జవాబు:
- ఇవి నీటిలో నివసిస్తాయి.
- శరీరం లోపల ఖాళీ ప్రదేశాన్ని ‘శరీర కుహరం’ అంటారు.
- శరీరం రెండు త్వచాలతో తయారయిన ద్విస్తరిత జీవులు.
- వెలుపలి త్వచాన్ని బాహ్యత్వచం అని, లోపలి త్వచాన్ని అంతరత్వచం అని అంటారు.
- కొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. ఉదా : హైడ్రా, జెల్లీఫిష్
- కొన్ని పగడాలు కాలనీలుగా నివసిస్తాయి.
- ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది.
- కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర ‘పగడాల దీవి’ నిర్మిస్తాయి. దీనిని ‘కోరల్ రీఫ్’ అంటారు.
ప్రశ్న 12.
ప్లాటి హెల్మింథిస్ వర్గజీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
- శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటుంది. అంటే శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి.
- శరీరం మూడు పొరలుగా విభేదనం చెంది ఉంటుంది. కనుక వీటిని త్రిస్తరిత జీవులు అంటారు.
- త్వచాల నుండి కొన్ని ప్రాథమిక అవయవాలు ఏర్పడతాయి.
- కొన్ని ప్రాథమిక కణజాలాలు కూడా ఉంటాయి. అయినప్పటికి అవయవాల అమరికకు నిజశరీర కుహరం ఏర్పడి ఉండదు.
- శరీరం మొత్తం తల నుండి తోక వరకు బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి వీటిని చదును పురుగులు (బద్దెపురుగు) అని అంటారు.
- ఇవి స్వతంత్రంగాను జీవిస్తాయి. ఉదా : ప్లనేరియా, పరాన్నజీవిగాను జీవిస్తాయి. ఉదా : టినీయా
ప్రశ్న 13.
నిమటోడ వర్గ జీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
- ఈ వర్గ జీవుల శరీరాలు త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాయి.
- శరీరాకృతి స్థూపాకారంగా ఉంటుంది.
- కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి. కానీ అవయవాలు ఉండవు.
- మిధ్యాకుహరం ఉంటుంది.
- పరాన్నజీవులుగా జీవిస్తాయి.
ఉదా : వుకరేరియా బ్యాంక్రాఫ్ట్, పేగులలో నివసించే నులిపురుగులు (ఆస్కారిస్ లూంబికాయిడ్స్)
ప్రశ్న 14.
అనెలిడ వర్గ జంతువులను గురించి క్లుప్తంగా రాయుము.
జవాబు:
- అనెలిడ జంతువులు ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన త్రిస్తరిత జీవులు.
- నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి.
- నిజ శరీరకుహరం శరీరనిర్మాణ అవయవాలు అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది.
- శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. తల నుండి తోక వరకు వలయాకార ” ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి.
- ఈ జంతువులు మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు వానపాము భౌమావాసాలలో నివసిస్తుంటాయి. ఉదా : వానపాము, జలగ.
ప్రశ్న 15.
ఆర్థోపొడ వర్గ జంతువులను గురించి వివరించండి.
జవాబు:
- జంతుజాలంలో 80% జీవులు ఆరోపొడ వర్గ జీవులు 90,000 జీవులను కలిగిన అతి పెద్ద వర్గం ఆగ్రోపొడ.
- వీటి శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఖండితాలుగా ఉంటుంది.
- అర్రపొడ జీవులలో స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
- రక్తం ప్రసరించటానికి రక్తనాళాలు లేవు. శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది.
- కీళ్ళుగల కాళ్ళు ఉండటం ఈ వర్గజీవుల ముఖ్య లక్షణం.
ఉదా : రొయ్యలు, సీతాకోకచిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు. - ఆల్డోపొడ జీవులు హానికర మరియు ఉపయోగకర జీవులు.
ప్రశ్న 16.
మొలస్కా వర జీవులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
- మొలస్కా జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగినది.
- శరీర కుహరం కుంచించుకుపోయి ఉంటుంది.
- మొలస్కా జీవులతో శరీర విభజన మొదలవుతుంది.
- స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటుంది.
- విసర్జన వ్యవస్థ వృక్కాలు వంటి నిర్మాణాలతో జరుగుతుంది.
- పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా చలిస్తాయి. ఉదా : నత్తలు, కోమటి సంచులు (Loligo), ఆల్చిప్పలు.
ప్రశ్న 17.
ఇఖైనోడర్మేటా వర్గ జీవుల ప్రత్యేకతలను వివరించండి.
జవాబు:
- ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులను ఇఖైనోడర్నేటా అంటారు.
- ఇవి స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి.
- ఇవి త్రిస్తరిత అనుపార్శ్వ సౌష్టవం కలిగిన జీవులు.
- శరీర కుహరం ఉంటుంది.
- శరీరపు కదలిక కోసం, చలనం కోసం జలవిసర్జన వ్యవస్థను ఉపయోగించుకుంటాయి.
- జలవిసర్జన వ్యవస్థ నాళికాపాదాలు కలిగి ఉంటుంది.
- అస్థిపంజరం కాల్షియం కార్బొనేట్ తో నిర్మితమై ఉంటుంది. ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిన్లు.
ప్రశ్న 18.
ప్రొటోకార్డేటా వర్గ జీవులను గురించి పటముల సహాయంతో వర్ణించండి.
జవాబు:
- ప్రొటోకార్డేటా వర్గజీవులు త్రిస్తరిత జీవులు.
- శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటుంది. శరీర కుహరం ఉంటుంది.
- ప్రొటోకార్డేటా జీవులలో ‘పృష్ఠవంశం’ అనే సరిక్రొత్త నిర్మాణం కనబడుతుంది.
- పృష్ఠవంశం ఈ జీవుల జీవితంలో ఏదో ఒక దశలో బెలానోగ్లోనెస్ ఏంఫియోక్సస్ తప్పకుండా ఉంటుంది.
- పృష్టవంశం ఒక కడ్డీ వంటి నిర్మాణం. ఇది నాడీ కణజాలాల నుండి ఉదరభాగాన్ని వేరుచేస్తుంది.
- శరీరం వెనుకభాగంలో తల నుండి చివరి వరకు పృష్ఠవంశం వ్యాపించి ఉంటుంది.
- పృష్ఠవంశం కదలిక కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది.
- అన్ని జీవులకు పృష్ఠవంశం జీవితాంతం ఉండకపోవచ్చు. ఇవి అన్నీ సముద్ర జీవులు.
ఉదా : బెలనోగ్లోసెస్, హెర్డ్మనియ మరియు ఏంఫియాక్సస్.
ప్రశ్న 19.
సకశేరుక జీవులు (వర్టిబ్రేటా) ఏ లక్షణాలు కలిగి ఉంటాయి?
జవాబు:
సకశేరుక జీవుల లక్షణాలు :
- పృష్ఠవంశం కలిగి ఉంటాయి.
- పృష్ఠనాడీ వలయం కలిగి ఉంటాయి.
- త్రిస్తరిత జీవులు.
- మొప్పగదులు, మొప్ప చీలికలు కొన్నింటిలో ఉంటాయి.
- శరీర కుహరం కలిగి ఉంటుంది.
ప్రశ్న 20.
సకశేరుక వర్గ జీవులను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
- సకశేరుక జీవులకు నిజమైన శరీర కుహరం ఉంటుంది.
- వెన్నెముక, అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి.
- ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీరకదలికలకు తోడ్పడతాయి.
- ఇవి ద్విపార్శ్వ సౌష్టవం, నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు.
- వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది.
- కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా మార్పుచెంది ఉంటాయి.
ప్రశ్న 21.
అనెలిడ, ఆర్థోపొడ మరియు మొలస్కా జీవుల మధ్య గల రెండు భేదాలను పేర్కొనండి.
జవాబు:
అనెలిడ | ఆగ్రోపొడ | మొలస్కా |
1. శరీరము ఖండితములు గలది; జత ఉపాంగాలు ఉంటాయి. | 1. శరీరము ఖండితము మరియు కీళ్ళు గల కాళ్ళు ఉంటాయి. | 1. తక్కువ మొత్తంలో శరీరం ఖండితమైనది. ఉపాంగాలు ఉండవు. |
2. విసర్జన వృక్కాల ద్వారా జరుగుతుంది. | 2. విసర్జన కోశీయవృక్కాలు మాల్ఫీజియన్ నాళికల ద్వారా జరుగుతుంది. | 2. విసర్జన అంత్యవృక్కాలు లేదా మూత్రపిండము ద్వారా జరుగుతుంది. |
ప్రశ్న 22.
చేపల యొక్క లక్షణములను వివరించండి.
జవాబు:
- చేపలు రెక్కలు తోకలు కలిగి ఉంటాయి.
- చర్మముపై పొలుసులు ఉంటాయి. నీటిలో నివసిస్తాయి.
- చేపలు శీతల రక్త జంతువులు.
- మొప్పల సహాయంతో జలశ్వాసక్రియ జరుపుతాయి.
- నీటిలో గుడ్లను పెడతాయి.
- గుండెలో రెండు గదులు మాత్రమే ఉంటాయి.
- వెన్నెముక గలిగిన మొదటి సకశేరుకాలు.
ప్రశ్న 23.
ఉభయచర జీవుల ముఖ్య లక్షణములను తెలపంది.
జవాబు:
- లార్వా (పిల్లదశలో) లు నీటిలో నివసిస్తాయి. ప్రౌఢజీవులు నేలపై నివసిస్తాయి.
- చర్మంపై పొలుసులు ఉండవు కాని చర్మం నునుపుగా, జిగురుగా ఉంటుంది.
- కప్పలు నీటిలో గుడ్లను పెడతాయి. శీతల రక్త జంతువులు.
- నేలమీద మరియు నీటిలోను నివసించగల మొదటి సకశేరుకాలు.
- గుండె నందు మూడు గదులు ఉంటాయి.
- కాలివేళ్ళకు పంజాలు ఉండవు.
- భీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థలను చూపుతాయి.
ప్రశ్న 24.
సరీసృపాల యొక్క ముఖ్య లక్షణములను వివరించండి. ఉదాహరణలివ్వంది.
జవాబు:
సరీసృపాల యొక్క లక్షణాలు:
- చర్మం పొడిగా ఉండి పొలుసులతో నిండి ఉంటుంది.
- సరీసృపాలు శీతల రక్త జంతువులు. ఇవి గుడ్లు పెడతాయి.
ఉదా : మొసళ్ళు, పాములు, తొండలు. - గుండెలో మూడు గదులుంటాయి. కాని మొసళ్ళలో నాలుగు గదులుంటాయి.
- మొసళ్ళలో కాళ్ళవేళ్ళ యందు పంజాలుంటాయి.
ప్రశ్న 25.
పక్షుల యొక్క ముఖ్య లక్షణములు తెలపండి. ఉదాహరణలివ్వండి.
జవాబు:
- శరీరం మొత్తం ఈకలతో నిండి ఉంటుంది.
- పక్షులు ఉష్ణ రక్త జంతువులు.
- కాళ్ళకి గోళ్ళుంటాయి. జత రెక్కలుంటాయి.
- పక్షులు గుడ్లను పెడతాయి.
ఉదా : పావురాలు, కోళ్ళు, కాకులు మొదలైనవి.
ప్రశ్న 26.
క్షీరదాల ముఖ్య లక్షణములను తెలిపి, ఉదాహరణలివ్వండి.
జవాబు:
- బాహ్యచెవులు, నాలుగు చలనాంగాలు ఉంటాయి.
- చర్మం వెంట్రుకలు లేదా రోమాలతో కప్పబడి ఉంటుంది.
- ఎక్కువ జీవులందు స్వేద మరియు పాలగ్రంథులు ఉంటాయి.
- దంతములు రకరకాలుగా ఉంటాయి.
- పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువులకు జన్మనిస్తాయి.
- చేతులు, కాళ్ళు కలిగి ఉంటాయి. వేళ్ళకు గోళ్ళుంటాయి.
- నేల మీద, నీటిలో మరియు చెట్ల తొర్రలో, గుహలలో నివాసాలు ఏర్పరచుకుంటాయి.
ప్రశ్న 27.
మీకేగాని జంతువులను వర్గీకరించడానికి అవకాశం వస్తే జీవులను దేని ఆధారంగా వర్గీకరిస్తారు?
జవాబు:
నాకు గనుక జీవులను వర్గీకరించడానికి అవకాశం వస్తే ఈ క్రింది వాటి ఆధారంగా వర్గీకరిస్తాను.
- జీవి నిజకేంద్రకం కలిగి ఉన్నదా? లేక కేంద్రకపూర్వ జీవా?
- బహుకణం కలిగి ఉందా, ఏకకణం కలిగి ఉందా, సమూహంగా జీవిస్తుందా?
- ఏ పద్దతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది?
- జీవి స్వయంపోషకమా? పరపోషకమా?
ఇలా ఒక క్రమమైన పద్ధతిని పాటించి జీవులను వర్గీకరిస్తాను.
9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Important Questions and Answers
ప్రశ్న 1.
జీవులను ఎందుకు వర్గీకరించాలో తెలపండి.
జవాబు:
- వివిధ జంతువులను, మొక్కలను అధ్యయనం చేయడానికి వీలు కల్పించడానికి,
- వివిధ జీవ సమూహాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేయడానికి,
- జీవుల వైవిధ్యం గురించి తెలుసుకోవడానికి,
- జంతువుల మొక్కల భౌగోళిక విస్తరణా విధానాన్ని తెలుసుకోవడానికి మనం జీవుల వర్గీకరణ చేయవలసి ఉంటుంది.
ప్రశ్న 2.
హాసిత్, ఒక విద్యా పర్యటనకు వెళ్ళి కొన్ని మొక్కలను, జంతువులను సేకరించాడు. ‘వివిధ జీవులు – ఆవాసాలు’ అనే నివేదికను అతడు తయారుచేస్తున్నాడు. జీవులను వర్గీకరించి, పట్టిక పూరించుటలో అతనికి సహాయం చేయండి.
జవాబు:
మొక్క/ జంతువు | గ్రూప్ / వర్గము |
1. వానపాము | అనెలిడా |
2. సముద్ర నక్షత్రం | ఎఖైనోడర్మెటా |
3. తేలు | ఆర్థ్రోపోడా |
4. నత్త | మొలస్కా |
5. మాస్ | బ్రయోఫైటా |
6. మామిడి | ఆవృతబీజ ద్విదళ బీజ మొక్క |
7. వరి | ఆవృతబీజ ఏకదళ మొక్క |
8. కొబ్బరి | ఆవృతబీజ ఏకదళ బీజ మొక్క |
ప్రశ్న 3.
క్రింది పట్టికను పూరించి, క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
ఎ) పుష్పించని మొక్కలలో ఏ విభాగం నిజమైన వేర్లను, పత్రాలను కలిగి వుంటుంది?
బి) ఏ విభాగానికి చెందిన మొక్కలలో విత్తనాలు ఫలాల లోపల వుంటాయి?
జవాబు:
A – పుష్పించే మొక్కలు B – టెరిడోఫైటా C – వివృత బీజాలు D- ద్విదళ బీజాలు
ఎ) టెరిడోఫైటా
బి) ఆవృత బీజాలు
ప్రశ్న 4.
జీవులను వర్గీకరించే సందర్భంలో నీకొచ్చే సందేహాలు నాల్గింటిని రాయుము.
జవాబు:
- జీవుల వర్గీకరణకు ప్రాతిపదికలు ఏవి?
- జీవ పరిణామ క్రమానికి వర్గీకరణలో ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి?
- ఒకే జాతిలో వివిధ జీవుల మధ్య గల భేదాలను బట్టి వాటిని ఎలా వర్గీకరిస్తారు?
- కేవలం బాహ్య లక్షణాలను మాత్రమే కాకుండా ఇతర జీవశాస్త్ర శాఖల పరిజ్ఞానాన్ని కూడా జోడించి జీవులను వర్గీకరించాలా? అది సరియైన పద్ధతేనా?
ప్రశ్న 5.
ఏదైనా ఒక ద్విదళ బీజ మొక్క బొమ్మను గీచి భాగాలను రాయండి.
జవాబు:
ప్రశ్న 6.
అమీబా, యూగ్లినా, పారామీషియంలు ఏ రాజ్యానికి చెందినవి? ఎందుకు?
జవాబు:
ఇవి ప్రొటీస్టా రాజ్యా నికి చెందిన జీవులు. లక్షణాలు :
- ఏకకణ జీవులు.
- త్వచంతో కూడిన నిజకేంద్రకం ఉంటుంది.
- ఒంటరిగా గానీ సమూహాలుగా గానీ జీవిస్తాయి.
- ద్విధావిచ్చిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
ప్రశ్న 7.
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులకు ఉదాహరణలు ఇవ్వండి.
2. శీతల రక్తజీవులు, ఉష్ణ రక్తజీవులకు మధ్య గల తేడాలు రాయండి.
3. చరమాంగాలు మొట్టమొదట ఏ జీవులలో కనపడతాయి?
4. పై లక్షణాలను బట్టి క్షీరదాల లక్షణాలు ఎలా ఉండవచ్చో రాయండి.
జవాబు:
1) కప్ప, పాము, పావురం
2) శీతల రక్తజీవులు – పరిసరాలలో ఉన్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రతలను మార్చుకొనే జీవులు
ఉదా : చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు
ఉష్ణ రక్తజీవులు – పరిసరాలలో ఉన్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రత మార్చుకోలేని జీవులు.
ఉదా : పక్షులు, క్షీరదాలు
3) ఉభయచరాలు
4) a) ఉష్ణరక్త జీవులు
b) 4 గదుల గుండె ఉంటుంది.
c) ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుతాయి.
d) బాహ్య చెవులు, పూర్వ చరమాంగాలను కలిగి ఉంటాయి.
e) పిల్లల్ని కని పాలిస్తాయి. శరీరంపై రోమాలుంటాయి.
ప్రశ్న 8.
క్రింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
ఎ) మొక్కల వర్గీకరణ దేని ఆధారంగా చేశారు?
బి) ఫలం లోపల విత్తనాలు ఉండే మొక్కలను ఏమంటారు?
సి) మొట్టమొదట వేరు వ్యవస్థ ఏర్పడిన మొక్కలు ఏవి?
డి) ఏకదళ బీజాలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఎ) పుష్పాలను విత్తనాలను కలిగి ఉండటం, కలిగి ఉండకపోవడం అనే విధానాన్ని బట్టి వాటిని పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలుగా వర్గీకరించారు.
బి) ఆవృతబీజ మొక్కలు
సి) టెరిడోఫైటా
డి) వరి, గోధుమ
9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం 1 Mark Bits Questions and Answers
లక్ష్యాత్మక నియోజనము
1. మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉంటే అవి
A) ద్విదళ బీజాలు
B) ఏకదళ బీజాలు
C) ప్రొటీ
D) మొనీరా
జవాబు:
A) ద్విదళ బీజాలు
2. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను ఏమంటారు?
A) వర్గీకరణం
B) అనువంశికత
C) వైవిధ్యం
D) వంశపారపర్యంగా వచ్చే లక్షణాలు
జవాబు:
C) వైవిధ్యం
3. “జీవుల పుట్టుక” గ్రంథమును రచించినది
A) లామార్క్
B) చార్లెస్ డార్విన్
C) లిన్నేయస్
D) విట్టేకర్
జవాబు:
B) చార్లెస్ డార్విన్
4. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి, జంటగా లేదా స్వతంత్రంగా తమ తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయం
A) ప్రజాతి
B) కుటుంబము
C) జాతి
D) తరగతి
జవాబు:
C) జాతి
5. చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వీటి ఆధారంగా వర్గీకరించారు.
A) ఆర్థిక ప్రాముఖ్యత
B) ఔషధ గుణాలు
C) కలపను ఇవ్వటం
D) పుష్ప నిర్మాణం
జవాబు:
B) ఔషధ గుణాలు
6. “వృక్షాయుర్వేదమును” రచించినది
A) చరకుడు
B) సుశ్రుతుడు
C) పరాశర మహర్షి
D) వరాహమిహిరుడు
జవాబు:
C) పరాశర మహర్షి
7. 1969లో జీవులను 5 రాజ్యా లుగా వర్గీకరించి ప్రతిపాదించినవాడు
A) హెకెల్
B) కోస్టాండ్
C) విట్టేకర్
D) కెవిలియర్-స్మిత్
జవాబు:
C) విట్టేకర్
8. విట్టేకర్ ఈ క్రింది లక్షణం ఆధారంగా జీవులను
A) నిజకేంద్రక జీవులు లేదా కేంద్రకపూర్వ జీవులు వర్గీకరించెను.
B) ఒంటరిగా జీవిస్తాయా లేదా సమూహాలుగా జీవిస్తాయా?
C) మొక్కలకు విత్తనాలను ఉత్పత్తిచేసే సామర్థ్యం మరియు విత్తనాలు పండ్ల లోపల ఉన్నాయా, బయటకు కనిపిస్తున్నాయా?
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు
9. అతి లవణీయత కలిగిన నీటిలో జీవించగలిగే కేంద్రక పూర్వ జీవులు
A) థర్మఫిల్స్
B) హేలోఫిల్స్
C)హీమోహిల్స్
D) బేసోఫిల్స్
జవాబు:
B) హేలోఫిల్స్
10. స్వతంత్ర పూర్వక కణం నుండి (లూకా) పుట్టుకు వచ్చిన కణాలు ఏర్పరచిన రంగపు జీవులు
A) అరాఖియా
B) బ్యా క్టీరియా
C) యూకేరియా
D) పైవి అన్నియూ
జవాబు:
D) పైవి అన్నియూ
11. ఈ జీవుల కణత్వచం పెప్టిడోగైకాను అను రసాయనిక పదార్ధముతో తయారైనది.
A) అరాఖియా
B) బ్యా క్టీరియా
C) యూకేరియా
D) పైవి అన్నియు
జవాబు:
B) బ్యా క్టీరియా
12. కేంద్రక పూర్వ ఏక కణజీవులు ఈ రాజ్యంలో
A) మొనీరా
B) ప్రొటీస్టా
C) శిలీంధ్రాలు
D) ప్లాంటె
జవాబు:
A) మొనీరా
13. ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బాక్టీరియా
A) యూ బ్యాక్టీరియా
B) సయానో బ్యా క్టీరియా
C) ఆర్కె బ్యాక్టీరియా
D) పైవి అన్నియు
జవాబు:
C) ఆర్కె బ్యాక్టీరియా
14. సెప్టోకాకస్, రైజోబియం, ఈ కొలై ఏ సమూహమునకు చెందినవి?
A) ఆర్కె బ్యా క్టీరియా
B) యూ బ్యాక్టీరియా
C) సయానో బ్యాక్టీరియా
D) యూకేరియా
జవాబు:
B) యూ బ్యాక్టీరియా
15. ఏకకణ లేదా బహుకణ నిజకేంద్రక జీవులు కలిగిన జీవ సమూహం
A) ప్రొటిస్టా
B) శిలీంధ్రాలు
C) మొనీరా
D) పొరిఫెరా
జవాబు:
A) ప్రొటిస్టా
16. సిద్ధబీజాలు సహాయంతో ప్రత్యుత్పత్తి జరిపేవి
A) శిలీంధ్రాలు
B) మొనిరా
C) ప్రొటిస్టా
D) వివృత బీజాలు
జవాబు:
A) శిలీంధ్రాలు
17. మొక్కలలో వర్గీకరణ స్థాయి దీని మీద ఆధారపడి ఉంటుంది.
A) మొక్క శరీరం గుర్తించడానికి వీలు కలిగిన భాగాలుగా విభేదనం చెందినదా?
B) మొక్క శరీరం ప్రసరణ కణజాలాలను కలిగి ఉన్నదా?
C) కణకవచం ఉందా మరియు స్వయంపోషకాలా?
D) పైవి అన్నీ
జవాబు:
D) పైవి అన్నీ
18. పుష్పించని మొక్కలు అని వీటిని అంటారు.
A) క్రిప్టోగాములు
B) ఫానిరోగాములు
C) వివృత బీజాలు
D) ఆవృత బీజాలు
జవాబు:
A) క్రిప్టోగాములు
19. విత్తనాలు పండ్ల బయటకు కనిపించే మొక్కలు
A) వివృత బీజాలు
B) ఆవృత బీజాలు
C) క్రిప్టోగాములు
D) ఫానిరోగాములు,
జవాబు:
A) వివృత బీజాలు
20. పొరిఫెరా వర్గజీవులకు గల మరియొక పేరు
A) స్పంజీలు
B) తిమింగలాలు
C) ప్రోటోకార్డేటా
D) అనెలిడ
జవాబు:
A) స్పంజీలు
21. స్పంజికలకు ఉదాహరణ
A) యూప్లికీలియా
B) సైకాన్
C) స్పంజీలా
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు
22. “పగదాల కాలనీలు” ఈ వర్గమునకు చెందిన జీవులు.
A) పొరిఫెరా
B) మొనీరా
C) సీలెంటిరేటా
D) అనెలిడ ఉంచబడినాయి.
జవాబు:
C) సీలెంటిరేటా
23. క్రింది సమూహపు జీవులు ద్విపార్శ్వ సౌష్టవం, సాపేక్షం, ఖండితములు గల త్రిస్తరిత జీవులు
A) నెమటోడ
B) ప్లాటీ హెల్మింథిస్
C) అనెలిడ
D) సీలెంటిరేటా
జవాబు:
C) అనెలిడ
24. పుష్పములు వీటిలో ప్రత్యుత్పత్తి అవయవాలు.
A) థాలో ఫైటా
B) బ్రయోఫైటా
C) వివృత బీజాలు
D) ఆవృత బీజాలు
జవాబు:
C) వివృత బీజాలు
25. వుకరేరియ బాంక్రాప్తి కలిగించు వ్యాధి ,
A) మలేరియా
B) కలరా
C) ఫైలేరియా
D) డెంగ్యూ
జవాబు:
D) డెంగ్యూ
26. జంతుజాలంలో అత్యధిక జీవులు కలిగిన వర్గం
A) అనెలిడ
B) ఆపొడ
C) ఇఖైనోడర్మేటా
D) మొలస్కా
జవాబు:
C) ఇఖైనోడర్మేటా
27. ఇఖైనోడర్మేటా జీవుల అస్థిపంజరం దీనితో నిర్మితమైనది.
A) కాల్షియం కార్బొనేట్
B) సోడియం కార్బొనేట్
C) సోడియం సిలికేట్
D) మెగ్నీషియం కార్బొనేట్
జవాబు:
B) సోడియం కార్బొనేట్
28. పంచభాగ వ్యాసార్ధ సౌష్టవం కలిగి మధ్య అక్షం చుట్టూ ఐదు సమానభాగాలుగా అమరి ఉన్న జీవులు
A) ఇఖైనోడర్మేటా
B) ఆర్థ్రోపొడ
C) అనెలిడ
D) మొలస్కా
జవాబు:
A) ఇఖైనోడర్మేటా
29. వెన్నెముక గలిగిన మొదటి జీవులు
A) ప్రొటోకార్డేటా
B) చేపలు
C) పక్షులు
D) ఉభయచరాలు
జవాబు:
A) ప్రొటోకార్డేటా
30. సకశేరుకాలు ఇన్ని తరగతులుగా విభజించబడ్డాయి.
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4
31. శీతల రక్త జంతువులను గుర్తించండి.
A) చేపలు
B) క్షీరదాలు
C) పక్షులు
D) మార్సూపియల్స్
జవాబు:
A) చేపలు
32. వీటిలో మగజీవి పిల్లల్ని కంటుంది.
A) డాల్ఫిన్
B) గబ్బిలం
C) నెమలి
D) మనిషి
జవాబు:
A) డాల్ఫిన్
33. ఎగిరే క్షీరదము
A) గబ్బిలం
B) కాకి
C) నెమలి
D) కోడి
జవాబు:
C) నెమలి
34. మానవులు ఈ క్రమమునందు ఉంచబడినారు.
A) మార్సూపియల్స్
B) ప్రైమేట్స్
C) రోడెంట్స్
D) లోగోమార్పా
జవాబు:
A) మార్సూపియల్స్
35. ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలు
A) సీలెంటిరేట్స్
B) రొడెంట్స్
C) మార్సూపియల్స్
D) అండజనక క్షీరదాలు
జవాబు:
B) రొడెంట్స్
36. హోమోసెపియన్స్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం.
A) మనిషి
B) కుక్క
C) పిల్లి
D) మామిడి
జవాబు:
D) మామిడి
37. కీటకములు ఈ విభాగమునకు చెందినవి.
A) ఆర్థ్రోపొడ
B) పక్షులు
C) అనెలిడ
D) సీలెంటిరేటా
జవాబు:
A) ఆర్థ్రోపొడ
38. ముత్యములు వీటినుండి తయారవుతాయి.
A) ఆయస్టర్లు
B) సీ కుకుంబరులు
C) నత్తలు
D) నీటిగుర్రాలు
జవాబు:
A) ఆయస్టర్లు
39. చర్మము మీద ముళ్ళు గలిగిన సముద్ర జీవులు
A) ఇఖైనోడర్మేటా
B) అనెలిడ
C) సీలెంటిరేటా
D) నెమటోడ
జవాబు:
A) ఇఖైనోడర్మేటా
40. వివృత బీజాలు గల మొక్క
A) మామిడి
B) ఆపిల్
C) అరటి
D) పైనస్
జవాబు:
A) మామిడి
41. ‘సిస్టమా నేచురే’ గ్రంథమును రచించినది
A) హెకెల్
B) లిన్నేయస్
C) విట్టేకర్
D) వూజ్
జవాబు:
D) వూజ్
42. ఇఖైనోడర్నేటా నందు చలనాంగాలు
A) రెక్కలు
B) వాజాలు
C) మిధ్యాపాదాలు
D) నాళికా పాదాలు
జవాబు:
B) వాజాలు
43. క్షీరదాలు
A) శిశోత్పాదకాలు
B) చర్మము రోమాలతో కప్పబడి ఉంటుంది
C) వెన్నెముక గలవి
D) పైవి అన్నియు
జవాబు:
D) పైవి అన్నియు
44. వర్గీకరణ శాస్త్రము అనగా
A) లిమ్నాలజి
B) టాక్సానమి
C) డైవర్సిటీ
D) ఇకాలజి
జవాబు:
D) ఇకాలజి
45. హిప్పోకాంపస్ (నీటి గుర్రం)ను ఈ దేశీయులు మందులలో వినియోగిస్తారు.
A) చైనీయులు
B) భారతీయులు
C) ఇటాలియన్లు
D) అమెరికన్లు
జవాబు:
B) భారతీయులు
46. హైడ్రా ఈ వర్గమునకు చెందిన జీవి.
A) పొరిఫెర
B) సీలెంటిరేటా
C) మొలస్కా
D) నెమటోడ
జవాబు:
A) పొరిఫెర
47. సముద్ర నక్షత్రం ఈ వర్గ జీవులకు ఉదాహరణ.
A) అనెలిడ
B) ఆర్థోపొడ
C) మొలస్కా
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
B) ఆర్థోపొడ
48. ద్వినామీకరణ విధానంలో ఒక జీవికి గల శాస్త్రీయ నామము వీటిని సూచిస్తుంది.
A) ప్రజాతి, జాతి
B) జాతి, క్రమము
C) కుటుంబం, ప్రజాతి
D) క్రమము, వర్గము
జవాబు:
D) క్రమము, వర్గము
49. ఏకదళ బీజ మొక్కలలో ఉండే ఈనెల వ్యాపనం
A) జాలాకార
B) పిచ్చాకార
C) హస్తాకార
D) సమాంతర
జవాబు:
D) సమాంతర
50. జీవులను సమూహాలుగా వర్గీకరించటానికి ఆధారం
A) వైవిధ్యాలు
B) వంశపారంపర్య లక్షణాలు
C) పరిణామక్రమం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
51. వైవిధ్యం తక్కువగా ఉండేది
A) ఒకే జాతి జీవులు
B) వేరు వేరు జాతులు
C) శత్రుజాతులు
D) పైవేవీ కావు
జవాబు:
A) ఒకే జాతి జీవులు
52. పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందిన హృదయంలోని
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4
53. జీవులను వెజిటేబిలియా, ఎనిమేలియాగా వర్గీకరించిన శాస్త్రవేత్త
A) లిన్నేయస్
B) హెకెల్
C) చాటన్
D) కోలాండ్
జవాబు:
A) లిన్నేయస్
54. జీవులను కేంద్రకపూర్వ జీవులు, నిజకేంద్రక జీవులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త
A) లిన్నేయస్
B) హెకెల్
C) చాటన్
D) కోండ్
జవాబు:
C) చాటన్
55. వర్గీకరణలో ‘ప్రొటీస్టా’ను ప్రవేశపెట్టింది.
A) లిన్నేయస్
B) హెకెల్
C) చాటన్
D) కోర్లాండ్
జవాబు:
B) హెకెల్
56. విట్టేకర్ జీవులను ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించాడు?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
C) 5
57. అరాకియా అనే రాజ్యా న్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త
A) కోప్ లాండ్
B) విట్టేకర్
C) ఉజ్-ఎట్-ఆల్
D) కెవాలియర్ – స్మిత్
జవాబు:
C) ఉజ్-ఎట్-ఆల్
58. వర్గీకరణలో ‘క్రోమిస్టా’ రాజ్యా న్ని ప్రవేశపెట్టింది
A) కోస్టాండ్
B) విట్టేకర్
C) ఉజ్-ఎట్-ఆల్
D) కెవాలియర్ – స్మిత్
జవాబు:
D) కెవాలియర్ – స్మిత్
59. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది
A) చాటన్
B) లిన్నేయస్
C) హెకెల్
D) విట్టేకర్
జవాబు:
B) లిన్నేయస్
60. ద్వినామీకరణంలో రెండవపదం దేనిని సూచిస్తుంది?
A) ప్రజాతి
B) జాతి
C) క్రమం
D) తరగతి
జవాబు:
B) జాతి
61. మొట్టమొదటి కణాన్ని ఏమని పిలుస్తారు?
A) ప్రోటా
B) లూకా
C) యూకా
D) క్రోమా
జవాబు:
B) లూకా
62. ఒకే రకమయిన లక్షణాలు కలి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయం
A) తరగతి
B) జాతి
C) కుటుంబం
D) ప్రజాతి
జవాబు:
B) జాతి
63. బాక్టీరియా కణత్వచం ఏ రసాయన పదార్థంతో తయారవుతుంది?
A) ఫాస్ఫోలిపిడ్లు
B) గ్లైకోలిపిడ్లు
C) పెస్టిడోగ్లైకాన్లు
D) ప్రోటీన్లు, లిపిడ్లు
జవాబు:
C) పెస్టిడోగ్లైకాన్లు
64. కణత్వచం ‘వీనిలో ఉంటుంది.
A) ప్రోకారియేట్లు
B) యూకేరియేట్లు
C) పై రెండూ
D) పైవేవీ కావు
జవాబు:
B) యూకేరియేట్లు
65. అతి ప్రాచీనమైన బాక్టీరియా
A) ఆర్కె బాక్టీరియా
B) యూ బాక్టీరియా
C) సైనో బాక్టీరియా
D) రైజోబియం
జవాబు:
A) ఆర్కె బాక్టీరియా
66. సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి
A) అమీబా
B) యూగ్లీనాం
C) పారమీషియం
D) హైడ్రా
జవాబు:
C) పారమీషియం
67. క్రిప్టోగామ్ కి ఉదాహరణ
A) ఫెర్న్
B) మాస్
C) సైకాస్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
68. మొక్కలను వీటి ఆధారంగా వర్గీకరించారు.
A) వేర్లు
B) కాండం
C) పత్రాలు
D) పుష్పాలు
జవాబు:
D) పుష్పాలు
69. చలనాంగాలు లేని వర్గం
A) ప్రోటోజోవన్స్
B) పొరిఫెరా
C) సీలెంటిరేటా
D) ఇఖైనో డర్మేటా
జవాబు:
B) పొరిఫెరా
70. ద్విపార్శ సౌష్టవం కల్గిన త్రిస్తరిత జీవులు
A) సీలెంటిరేటా
B) ప్లాటిహెల్మింథిస్
C) పొరిఫెరన్స్
D) ప్రోటోజోవన్స్
జవాబు:
B) ప్లాటిహెల్మింథిస్
71. జంతు రాజ్యంలో అతి పెద్ద వర్గం
A) ప్లాటి హెల్మింథిస్
B) నిమాటిహెల్మింథిస్
C) ఆర్థ్రోపొడ
D) మొలస్కా
జవాబు:
C) ఆర్థోపొడ
72. గ్రీకుభాషలో ‘ఇఖైనస్’ అనగా
A) కీళ్ళు
B) కాళ్ళు
C) ముళ్ళు
D) చర్మం
జవాబు:
C) ముళ్ళు
73. ఇఖైనోడర్నేటాలో కనిపించే సౌష్టవం
A) ద్విపార్శ్వ సౌష్ఠవం
B) త్రిపార్శ్వ సౌష్ఠవం
C) అనుపార్శ్వ సౌష్ఠవం
D) పైవన్నీ
జవాబు:
C) అనుపార్శ్వ సౌష్ఠవం
74. జల ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు
A) ప్రోటోజోవన్స్
B) పొరిఫెరా
C) మొలస్కా జీవులు
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
D) ఇఖైనోడర్మేటా
75. పృష్ఠవంశం వీనిలో కనబడుతుంది.
A) ప్రోటోకార్డేటా
B) వరిబ్రేటా
C) పై రెండూ
D) పైవేవీ కావు
జవాబు:
C) పై రెండూ
76. ఈ క్రింది వానిలో శీతల రక్త జీవి
A) క్షీరదాలు
B) పక్షులు
C) చేపలు
D) పైవన్నీ
జవాబు:
C) చేపలు
77. ఈ క్రింది వానిలో చేప
A) జెల్లీఫిష్
B) సిల్వర్ ఫిష్
C) గోల్డ్ ఫిష్
D) డాల్ఫిన్
జవాబు:
C) గోల్డ్ ఫిష్
78. క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
a) ఎర్నెస్ట్ హెకెల్ – జీవరాజ్యాన్ని 3 రాజ్యాలుగా విభజించాడు.
b) కోండ్ – జీవరాజ్యాన్ని 6 రాజ్యాలుగా విభజించాడు.
c) కెవిలియర్-స్మిత్ – జీవరాజ్యాన్ని 4 రాజ్యాలుగా విభజించాడు.
A) a మాత్రమే
B) b, c
C) c మాత్రమే
D) a, b
జవాబు:
D) a, b
79. క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
a) జీవుల పుట్టుక – చార్లెస్ డార్విన్
b) వృక్షాయుర్వేదం – చరకుడు
c) ద్వినామీకరణం – విట్టేకర్
A) a, b
B) a మాత్రమే
C) b, c
D) c మాత్రమే
జవాబు:
C) b, c
80. క్రింది వాక్యాలు చదవండి.
a) చర్మం పొడిగా ఉండి, పొలుసులతో నిండి ఉంటుంది, గుడ్లు పెడతాయి. – సరీసృపాల లక్షణాలు
b) వాజాలు తోక కలిగి ఉంటాయి. మొప్పల సహాయంతో జల శ్వాసక్రియ జరుపుకుంటాయి. – చేపల లక్షణాలు
A) a సరియైనది, b సరియైనది కాదు.
B) b సరియైనది, a సరియైనది కాదు.
C) a, b లు రెండు సరియైనవి కావు.
D) a, b లు రెం సరియైనవే.
జవాబు:
D) a, b లు రెం సరియైనవే.
81. పై పట్టికను చూసి, సరియైన దానిని పట్టికలో నింపిన దానిని గుర్తించండి.
జవాబు:
A
82. ఈ చిత్రంలోని జీవి ఏ వర్గానికి చెందినది?
A) ప్రోటోజోవా
B) నిడేరియా
C) ఆర్థోపొడ
D) పొరిఫెరా
జవాబు:
D) పొరిఫెరా
83. ఈ చిత్రంలోని జీవి ఏది?
A) జెల్లీ చేప
B) హైడ్రా
C) నులి పురుగు
D) బద్దె పురుగు
జవాబు:
B) హైడ్రా
84. ఈ జీవులు ఏ వర్గానికి చెందుతాయి?
A) అనెలిడ
B) ఆర్థ్రోపొడ
C) మొలస్కా
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
B) ఆర్థ్రోపొడ
85. ఈ జీవి ఏ వర్గానికి చెందినది?
A) ఆర్థ్రోపొడ
B) మొలస్కా
C) ఇఖైనోడర్మేటా
D) ప్రోటోకార్డేటా
జవాబు:
B) మొలస్కా
86. ఈ చిత్రంలోని జీవి పేరేమి?
A) బల్లి
B) పారామీషియం
C) బాక్టీరియా
D) వైరస్
జవాబు:
C) బాక్టీరియా
87. ఈ జీవి ఏ వర్గానికి చెందుతుంది?
A) మొలస్కా
B) ఆర్థ్రోపోడ
C) ఇఖైనో డర్మేటా
D) ఆంఫిబియా
జవాబు:
C) ఇఖైనో డర్మేటా
88. ముత్యాలనిచ్చే అల్చిప్పలు ఏ వర్గానికి చెందుతాయి?
A) ఆర్థ్రోపోడ
B) అనిలెడ
C) మొలస్కా
D) ఇఖైనోడర్మేటా
జవాబు:
C) మొలస్కా
89. గుండెలో నాలుగు గదులు కలిగిన మొసలి ఏ వర్గానికి చెందుతుంది?
A) క్షీరదాలు
B) చేపలు
C) ఉభయచరాలు
D) సరీసృపాలు
జవాబు:
D) సరీసృపాలు
90.
పైనున్న ఫ్లోచార్టును క్రమంలో అమర్చండి.
A) 5, 4, 3, 2, 1
B) 1, 3, 2, 4, 5
C) 1, 2, 3, 5, 4
D) 1, 2, 3, 4, 5
జవాబు:
D) 1, 2, 3, 4, 5
91. రొట్టె బూజు (బ్రెడ్ మోల్డ్)లు దీనికి చెందుతాయి.
A) ప్రొటిస్టా
B) బ్రయోఫైటా
C) ఫంగై
D) జిమ్నోస్పెర్మ్
జవాబు:
C) ఫంగై
92. కింది వాటిలో వివృత బీజాల లక్షణం
A) బాహ్యంగా విత్తన కవచాలను కలిగి వుంటాయి
B) ఇవి బహుకణ జీవులు కావు
C) ఇవి పుష్పాలను ఏర్పరచవు
D) ఇవి పరపోషకాలు
జవాబు:
A) బాహ్యంగా విత్తన కవచాలను కలిగి వుంటాయి
93. ఈ క్రింది వాటిలో కార్డేటా లక్షణాలు
1) పృష్టదండము 2) ఉదర నాడీ దండము
3) ద్విస్తరిత 4) జతలుగా వున్న మొప్ప కోష్టాలు
A) 1, 2, 4
B) 1, 4
C) 1, 3
D) 2, 4
జవాబు:
A) 1, 2, 4
94. మానవులు దీనికి చెందుతారు.
A) రొడెంట్స్
B) ప్రైమేట్స్
C) మార్సు బయల్స్
D) సరీసృపాలు
జవాబు:
B) ప్రైమేట్స్
95. సర్వ ఆమోదయోగ్యమైన ఐదు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించినది.
A) లిన్నేయస్
B) హెకెల్
C) కెవెలియర్ – స్మిత్
D) విట్టేకర్
జవాబు:
D) విట్టేకర్
96. కింది వాటిలో ఆరోపొడా లక్షణాలు
1) జలప్రసరణ వ్యవస్థ
2) కీళ్ళతో కూడిన కాళ్ళు
3) స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ
4) తేమతో కూడిన చర్మం
A) 1, 2 సరైనవి
B) 2, 3 సరైనవి
C) 3, 4 సరైనవి
D) 1, 4 సరైనవి
జవాబు:
B) 2, 3 సరైనవి
97. కింది వాటిలో కేంద్రక పూర్వ కణాన్ని గుర్తించండి.
A) స్ట్రెప్టోకాకస్
B) యూగ్లీనా
C) హైడ్రా
D) ఈస్ట్
జవాబు:
A) స్ట్రెప్టోకాకస్
98. కింది వాటిలో ఎగిరే క్షీరదాన్ని గుర్తించండి.
A) గుడ్లగూబ
B) కంగారు
C) గబ్బిలం
D) సీల్
జవాబు:
C) గబ్బిలం
99. జతపరుచుము.
1. ఛార్లెస్ డార్విన్ ( ) a) 5 రాజ్యా ల వర్గీకరణ
2. లిన్నేయస్ ( ) b) జీవ పరిణామము.
3. విట్టేకర్ ( ) C) ద్వినామీకరణ
A) 1-ఎ, 2-b, 3-c
B) 1-b, 2-c, 3-a
C) 1-c, 2-6, 3- a
D) 1-c, 2-a, 3-b
జవాబు:
B) 1-b, 2-c, 3-a
100. కింది వానిలో సరికానిది గుర్తించుము.
a) పుష్పించని మొక్కలు → విత్తనాలు లేనివి
b) ఆవృత బీజాలు → విత్తనాలు బయటకు కనిపించేవి
C) వివృత బీజాలు → ఫలాల లోపల విత్తనాలు
A) a మాత్రమే
B) bమాత్రమే
C) b మరియు C
D) పైవన్నీ
జవాబు:
C) b మరియు C
101. కణాలను కేంద్రకపూర్వ కణం మరియు నిజకేంద్రక కణంగా విభజించడానికి ఆధారం
A) కణత్వచము
B) కేంద్రకత్వచము
C) రైబోజోములు
D) హరితరేణువులు
జవాబు:
B) కేంద్రకత్వచము
102. మొక్కలను వర్గీకరించడానికి కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
A) పుష్పాలు
B) విత్తనాల అమరిక
C) బీజదళాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
103. జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించిన ప్రముఖ శాస్త్రవేత్త
A) ఎర్నెస్ట్ హకెల్
B) కెరోలస్ లిన్నేయస్
C) ఆగస్ట్ వీస్మన్
D) చార్లెస్ డార్విస్
జవాబు:
D) చార్లెస్ డార్విస్
104.
P, Qలు వరుసగా
A) జీవరాజ్యము. నిర్జీవరాజ్యము
B) విభాగము, ప్రగతి
C) తరగతి, కుటుంబము
D) కుటుంబము, తరగతి
జవాబు:
C) తరగతి, కుటుంబము
మీకు తెలుసా?
కేంద్రకపూర్వ జీవులు, నిజకేంద్రక కణాల పుట్టుక గురించి చాలా రకాల సిద్ధాంతాలు మనుగడలో ఉన్నాయి. అన్ని కణాల స్వభావం ఒకేలా ఉంటుంది. కనుక ఇవన్నీ ఒక స్వతంత్ర పూర్వీక కణం నుండి వచ్చి ఉండవచ్చు అని అనుకునేవారు. ఈ మొట్టమొదటి కణాన్ని ‘లూకా’ (Luca’-Last Universal Common Ancestor) అని పిలుస్తారు. ఈ లూకా నుండే తర్వాతి కాలంలో మూడు రకాల కణాలు పుట్టుకొచ్చాయి. పరిణామక్రమంలో ఈ మూడు, మూడు రకాల రంగాలను నిర్దేశిస్తాయి. అవి వరుసగా 1. అరాఖియా 2. బ్యా క్టీరియా 3, యూకేరియా అని ఊజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
అరాభియా, బ్యాక్టీరియాలు కేంద్రకపూర్వ కణాలు కలిగి ఉంటాయి. అంటే వీటి కణాలలో కణత్వచాన్ని కలిగియున్న కేంద్రకం ఉండదు. కాని కేంద్రక పదార్ధం మాత్రం కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది.
బ్యాక్టీరియాలలో కేంద్రకం లేకపోయినప్పటికీ వాటి కణత్వచం పెప్టిడోగ్లైకాను (Peptidoglycan) అనే రసాయన పదార్థంతో తయారై ఉంటుంది. యూకేరియాలలో నిజకేంద్రకం అంటే కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది.
అన్ని కీటకాలు ఆర్థోపొడ వర్గానికి చెందినవే. జీవులలో 80% ఆర్రోపొడ వర్గానికి చెందినవే. 90,000 ప్రజాతి జీవులను కల్గిన అతి పెద్ద వర్గం ఆర్రోపొడ. ఆ పొడ వర్గ జీవులు జీవ వైవిధ్యాన్ని చూపుతాయి. ఇవి హానికర మరియు ఉపయోగకర జీవులు. ఇవి పరాగ సంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీల యందు ఉపయోగపడతాయి. మలేరియా, ఫైలేరియా మరియు అనేక రకాల వ్యాధులకు వాహక జీవులుగా కూడా పని చేస్తాయి. కొన్ని ఆర్రోపోడ్లు కంటికి కనిపించనంత చిన్నవిగా కూడా ఉంటాయి. వీటిని సూక్ష్మ ఆర్టోపోడ్లు అంటారు. అయితే ఇవి ‘సూక్ష్మజీవులు కావు.
చేపలు శీతల రక్త జంతువులు. వాటి శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా మార్చుకోగలవు. చాలా చేపలు గుడ్లు పెడతాయి. కాని కొన్ని పిల్లల్ని కంటాయి. పిల్లలు పెట్టే వాటిని మనం చేపలు అనలేం. వాటిని జలక్షీరదాలు , అంటారు.
ఉదా : డాల్ఫిన్, తిమింగలం.