AP 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం

Students can go through AP Board 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం to understand and remember the concept easily.

AP Board 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం

→ ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం.

→ జంతు కణజాలాలు నాలుగు రకాలు. అవి : ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం.

→ జంతువుల లోపలి అవయవాలను, బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఉపకళా కణజాలం.

→ అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరం దూరంగా విస్తరించినట్లు ఉండే కణజాలం సంయోజక కణజాలం.

→ శరీర కదలికలకు తోడ్పడే కణజాలం కండర కణజాలం.

→ బాహ్య, అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం నాడీకణజాలం.

→ విచక్షణా త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో స్తంభాకార ఉపకళా కణజాలము ఉంటుంది.

AP 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం

→ చర్మంపై అనేక వరుసలలో అమరియున్న ఉపకళా కణజాలమును స్తరిత ఉపకళా కణజాలము అంటారు.

→ ఘనాకార ఉపకళా కణజాలాలు మూత్రనాళాలలో కనిపిస్తాయి.

→ ఉపకళా కణజాలంలో కొంతభాగం లోపలికి ముడుచుకుపోయి గ్రంథి ఉపకళా కణజాలంను ఏర్పరుస్తాయి. ఆ స్తంభాకార ఉపకళా కణజాల కణాలు స్రవించేచోట, శోషణ జరిగేచోట ఉంటాయి.

→ కేశయుత ఉపకళా కణజాలము, శుక్రనాళము నందు, వాయునాళం నందు, శ్వాసనాళాలు, మూత్రపిండనాళాలు మరియు బీజకోశనాళాలందు ఉంటుంది.

→ ఉపకళా కణజాలమైన చర్మం నుండి గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు వంటి నిర్మాణాలు తయారవుతాయి.

→ మన శరీరంలో ఉండే వివిధరకాల సంయోజక కణజాలాలు : వాయుగత కణజాలం, ఎడిపోజ్ కణజాలం, సంధి బంధనము, స్నాయుబంధనము, మృదులాస్థి మరియు రక్త కణజాలం. వివిధ రకాల కణజాలములను కలిపి ఉంచేది వాయుగత కణజాలం.

→ క్రొవ్వును నిల్వయుంచు కణజాలము ఎడిపోజ్ కణజాలం.

→ ఎముక శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.

→ స్నాయుబంధనం కండరాలను ఎముకతో కలుపుతుంది.

→ సంధి బంధనం ఎముకలను సంధి తలాలతో కలుపుతుంది.

→ మృదులాస్థి ఎముకలు కలిసే ప్రదేశాలలో, పక్కటెముకల చివర, నాశికాగ్రము, చెవిదొప్ప, వాయునాళంలోను ఉంటుంది.

→ సొరచేప వంటి చేపలలో అస్థిపంజరము మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.

AP 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం

→ రక్తము ఒక సంయోజక కణజాలము. దీనియందు ఎర్ర రక్తకణములు, తెల్లరక్తకణములు మరియు రక్తఫలకికలు ఉంటాయి.

→ మానవునిలో రక్త వర్గాలు నాలుగు రకాలు. అవి : ‘A’, ‘B’, ‘AB’ మరియు ‘0’ వర్గాలు.

→ కండర కణజాలాలు మూడు రకాలు. అవి : రేఖిత, అరేఖిత మరియు హృదయ కండరాలు.

→ నాడీకణము లేదా న్యూరాను నందు మూడు భాగములు కలవు. అవి : 1) కణదేహం 2) ఏక్సాన్ 3) డెండ్రైటులు.

→ కణజాలం : ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహము.

→ ఉపకళా కణజాలం : జంతువుల లోపలి అవయవాలను, బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం.

→ సంయోజక కణజాలం : అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో విస్తరించిన కణజాలం.

→ బంధకం : దేనిని తాకకుండబెట్టుట, వేరుగా ఉంచుట, ప్రత్యేకించుట.

→ అస్థిమజ్జ : పొడవు ఎముకల చివరన ఉండే సంయోజక కణజాలము.

→ ఎముక : సంయోజక కణజాల రకము, శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది.

→ మృదులాస్థి : సంయోజక కణజాలపు రకము, మెత్తటి ఎముక, ఎముకలు కలిసే ప్రదేశమునందు ఉండు కణజాలం.

→ కండర కణజాలం : చేతులు, కాళ్ళ కదలికలకు మరియు అనేక అంతర అవయవాల కదలికలకు సహాయపడే కణజాలం.

→ నాడీ కణజాలం : బాహ్య, అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం.

→ ఆహార వాహిక : ఆస్యకుహరమును, జీర్ణాశయమును కలుపు గొట్టము వంటి భాగము.

→ ఫైబ్లాస్టులు : వాయుగత కణజాలంలోని నిర్మాణాలు తంతుయుత పదార్థాన్ని స్రవించి కణజాలాన్ని స్థిరంగా ఉంచుతాయి.

AP 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం

→ ఆస్టియోసైట్ కణాలు : ఎముకనందు లవణాలను స్రవించే కణాలు.

→ సంధి బంధనము (లిగమెంట్) : ఎముకలను సంధితలాలలో కలిపే సంయోజక కణజాలము.

→ స్నాయుబంధనం : కండరాలను ఎముకతో కలిపే సంధితలాలలో ఉండే సంయోజక కణజాలము.

→ హిమోగ్లోబిన్ : ఎర్ర రక్తకణములలో ఉండే ఎరుపు వర్ణపు ప్రోటీను. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ రవాణాలో సహాయపడుతుంది.

→ సీరం : రసి, పస, కొన్ని జంతు ద్రవాలలో ఉండే నీరు ఉండే భాగం.

→ స్థితిస్థాపక శక్తి : యథాస్థితిని పొందునట్టి : లాగిన, నొక్కిన తిరిగి పూర్వపు ఆకారమునకు వచ్చునట్టి.

AP 9th Class Biology Notes 3rd Lesson జంతు కణజాలం 1