AP 9th Class Biology Notes 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

Students can go through AP Board 9th Class Biology Notes 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక to understand and remember the concept easily.

AP Board 9th Class Biology Notes 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

→ కణము వివిధ రకముల విధులను నిర్వహిస్తుంది.

→ కణము విధులను నిర్వహించడానికి ఘన, ద్రవ, వాయు పదార్ధములైన గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్ వంటి వాటిని రవాణా చేస్తాయి.

→ గ్రీకు భాషలో ‘ఆస్మా’ అంటే నెట్టడం.

→ ప్లాస్మాపొర అన్ని రకాల పదార్ధములను తన ద్వారా సమానంగా ప్రవేశింపనీయదు.

→ విచక్షణాస్తరం గుండా నీటి అణువుల ప్రసరణ తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢతకి రెండువైపులా సమాన గాఢత వచ్చేవరకు జరిగే ప్రక్రియను ద్రవాభిసరణం అంటారు.

→ గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థములను ఉంచినపుడు అవి ఆ మాధ్యమంలో విస్తరించడాన్ని వ్యాపనం అంటారు.

AP 9th Class Biology Notes 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

→ వ్యాపనం, ద్రవాభిసరణం ఇతర పద్ధతుల ద్వారా, ప్లాస్మా పొర ద్వారా పదార్థాలు రవాణా చేయబడతాయి.

→ వ్యాపనం, ద్రవాభిసరణం మన నిత్యజీవితంలో ఎంతో ఉపయోగపడతాయి.

→ ఎయిర్ ఫ్రెష్ నర్స్, అగర్బత్తీ, దోమలనివారణ మందులు వ్యాపనం సూత్రంపై పనిచేస్తాయి.

→ వ్యతిరేక ద్రవాభిసరణం ద్వారా సముద్రపు నీటి నుండి లవణాలను వేరు చేసి మంచినీరుగా మారుస్తారు.

→ కణం నుండి, నీరు బయటకు పోవడాన్ని బాహ్యప్రసరణం అంటారు.

→ కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని అంతరప్రసరణం అంటారు.

→ ఫ్రెడ్డీ మెర్క్యురీ, డేవిడ్ బోరీ అనే శాస్త్రవేత్తలు పారగమ్యత్వచాన్ని వినియోగించి, సముద్రపు నీటి నుండి లవణాలను వేరు చేశారు.

→ థామస్ గ్రాహం వాయువుల వ్యాపనం మరియు ద్రవపదార్థాల వ్యాపనాన్ని అధ్యయనం చేశాడు.

→ నిర్జీవ కణాలలో ద్రవాభిసరణ క్రియ జరగదు.

→ ద్రావితం : ద్రావణంలో కలిగిన పదార్థం

→ ద్రావణి : ఘనపదార్థమును కరిగించు ద్రవపదార్థం

→ విచక్షణాస్తరం : కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తమ గుండా ప్రవేశింపచేస్తుంది.

→ ద్రవాభిసరణం : గాఢమైన ద్రావణం వైపు పాక్షిక పారగమ్యత్వచం ద్వారా నీటి అణువుల కదలిక.

→ ప్లాస్మాడెస్మాట : కణకవచముల ద్వారా ప్రయాణించి ప్రక్కప్రక్క కణముల జీవపదార్థములను కలిపే కణద్రవ్య పోగులు.

→ పారగమ్యత : ద్రావితాలు, ద్రావణిని తమగుండా ప్రవేశింపచేయుట.

→ పాక్షిక పారగమ్యత : ద్రావణిని అనుమతిస్తుందే గాని దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించదు.

AP 9th Class Biology Notes 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

→ బాహ్య ద్రవాభిసరణం : కణం నుండి నీరు బయటకు పోవటం

→ అంతర ద్రవాభిసరణం : కణం లోపలికి నీరు ప్రవేశించడం

→ వ్యతిరేక ద్రవాభిసరణం : సముద్రపు నీటి నుండి లవణాలను పారగమ్యత్వచాన్ని ఉపయోగించి తొలగించే పద్ధతి.

→ విసరణము : గాలి లేదా నీరులాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినపుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించుట.

→ సంతృప్త ద్రావణం : ద్రావితంను కరిగించుకోలేని ద్రావణము

→ ఎండోసైటాసిస్ : త్వచం సరళమైన నిర్మాణం కలిగి ఉండుట వలన కణం ఆహారాన్ని కానీ ఇతర బాహ్యకణాలను గానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరుచేసి ఆహారాన్ని సేకరించటం.
ఉదా: అమీబా.

AP 9th Class Biology Notes 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1