These AP 9th Physical Science Important Questions and Answers 10th Lesson పని మరియు శక్తి will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 10th Lesson Important Questions and Answers పని మరియు శక్తి
9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ఒక జౌల్ పని అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుపై 1 న్యూటన్ బలం పని చేసి ఆ వస్తువును బల ప్రయోగదిశలో 1 మీ. దూరం కదిలిస్తే అపుడు 1 జౌల్ పని జరిగింది అంటాం.
ప్రశ్న 2.
ఒక బంతిని పైకి విసిరితే అది పైకి వెళుతున్నప్పుడు దాని వది ఏమవుతుంది?
జవాబు:
బంతి పైకి వెళుతున్న కొద్దీ దానిపై గురుత్వాకర్షణ బలము వ్యతిరేకదిశలో పని చేయటం వల్ల ఆ బంతి వడి క్రమేపి తగ్గును.
ప్రశ్న 3.
పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వడి ఎంత?
జవాబు:
పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వడి శూన్యము.
ప్రశ్న 4.
పైకి విసిరిన బంతి తిరిగి కిందికి పడుతున్నప్పుడు దాని వది ఏమవుతుంది?
జవాబు:
పైకి విసిరిన బంతి తిరిగి కిందికి పడుతున్నపుడు దాని వడి క్రమేపి ‘పెరుగును.
ప్రశ్న 5.
శక్తి అనగానేమి?
జవాబు:
పని చేయగల సామర్థ్యాన్ని శక్తి అంటారు.
ప్రశ్న 6.
ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఎక్కువ సేపు నిలుచున్నా, అలసిపోతాడు. ఎందుకు?
జవాబు:
నిలచున్న వ్యక్తి ఏ పని చేస్తున్నట్లు మనకు కనిపించకపోయినా, అతని శరీరంలో కండరాలు సంకోచవ్యాకోచాలు చెందుతాయి. అదే విధంగా గుండె వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇటువంటి అనేక పనుల వలన శరీరంలోని శక్తి తరిగిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి అలసిపోతాడు.
ప్రశ్న 7.
గతిశక్తి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుకు దాని గమనం వల్ల లభించే శక్తిని ‘గతిశక్తి’ అంటారు.
ప్రశ్న 8.
గతిశక్తిని కొలవడానికి సూత్రం వ్రాయుము.
జవాబు:
గతిశక్తి KE = \(\frac{1}{2}\) mv².
ప్రశ్న 9.
స్థితిశక్తి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుకు దాని ఆకారం లేదా స్థానం వల్ల పొందే శక్తి ‘స్థితిశక్తి’ అంటారు.
ప్రశ్న 10.
స్థితిశక్తిని కొలవడానికి సూత్రం రాయుము.
జవాబు:
స్థితిశక్తి PE = mgh.
ప్రశ్న 11.
శక్తి నిత్యత్వం అనగానేమి?
జవాబు:
శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు. అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమము అంటారు.
ప్రశ్న 12.
ప్రక్కన ఇవ్వబడిన పటం ద్వారా నీవేమి సమాచారాన్ని గ్రహించితివో వ్రాయండి.
జవాబు:
పళ్ళెంలో నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు గోళీ ‘పని’ చేయలేకపోయింది. కానీ దానిని కొంత ఎత్తు వరకు పైకి ఎత్తినపుడు గోళీ పని చేయగలిగింది.
ప్రశ్న 13.
మీ ఇంటిలో వాడే లైట్లు (బల్బులు) ఏ విధంగా శక్తి పరివర్తనను జరుపుచున్నాయో వ్రాయుము.
జవాబు:
ఎలక్ట్రిక్ బల్బు, విద్యుత్ శక్తిని మొదటగా ఉష్ణశక్తిగాను, తర్వాత కాంతిశక్తిగాను మారుస్తుంది.
∴ విద్యుత్ శక్తి → ఉష్ణశక్తి → కాంతి శక్తి
ప్రశ్న 14.
25 కిలోల బియ్యం బస్తాను పిల్లలు పైకెత్తలేకపోవచ్చు. కానీ పెద్దవారు ఎత్తగలుగుతారు. ఎందుకు?
జవాబు:
పిల్లవాడు ప్రయోగించిన బలం కన్నా, పెద్దవారు ప్రయోగించిన బలం అధికము కావున.
9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
‘పని’ భావనను శాస్త్రీయంగా చెప్పాలంటే క్రింది రెండు షరతులు పాటింపబడాలి.
1. వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలి.
2. ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి.
క్రింది పట్టికను పూరించండి.
జవాబు:
ప్రశ్న 2.
అ)
ఆ)
పై పటములలో చూపబడిన వస్తువులు ఏ శక్తులను కలిగి ఉంటాయో తెలపండి.
జవాబు:
i) వస్తువు స్థితిశక్తిని కలిగియుంది.
ii) వస్తువు గతిశక్తిని కలిగియుంది.
ప్రశ్న 3.
సామర్థ్యమును వివరించుము. ఇది అదిశ రాశా? సదిశ రాశా?
జవాబు:
పని జరిగే రేటును సామర్ధ్యం అంటారు. (లేక) శక్తి మార్పు రేటును సామర్థ్యం అంటారు. ఒక శక్తి ‘W’ పనిని ‘t’
కాలములో చేసిన దాని సామర్థ్యము (P) = పని / కాలము
⇒ P = \(\frac{W}{t}\)
పని మరియు కాలములు అదిశ రాశులు కావున సామర్ధ్యము కూడా అదిశ రాశి అగును.
ప్రశ్న 4.
క్రింది పటంను గమనించి, దాని గురించి వ్రాయుము.
జవాబు:
ఒక సమతలం పైన కదులుతున్న బంతిపై ఘర్షణ బలం బంతి కదిలే దిశకు వ్యతిరేక దిశలో పనిచేయడం వలననే ఆ బంతి కొంత సేపటికి ఆగిపోతుంది.
ప్రశ్న 5.
పని జరగటానికి కావాల్సిన షరతులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
విజ్ఞానశాస్త్రం ప్రకారం పని జరిగిందని చెప్పాలంటే క్రింద తెలిపిన రెండు షరతులు సంతృప్తి పరచబడాలి.
- వస్తువుపై ఏదైనా బలం పని చేయాలి.
- ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి.
ప్రశ్న 6.
సామర్థ్యమునకు SI పద్ధతిలో ప్రమాణము వ్రాయుము. దాని యొక్క ఉన్నత ప్రమాణాలను తెలుపుము.
జవాబు:
1) SI పద్ధతిలో సామర్ధ్యమునకు ప్రమాణము వాట్. వాట్ అనగా 1 జోల్ పనిని 1 సెకను కాలము చేయుట అని అర్ధము.
2) సామర్ధ్యం యొక్క టన్నుల విలువను కిలోవాట్లలో కొలుస్తారు.
1 కిలోవాట్ = 1000 వాట్లు = 1000 వోళ్ళు / సెకను
1 మెగావాట్ = 106 వాట్లు
ప్రశ్న 7.
ఒక బొమ్మ కారుకు ‘కీ’ ఇవ్వకుండా నేలపై ఉంచాం. తర్వాత ‘కీ’ ఇచ్చి నేలపై ఉంచబడిన పటం ఇవ్వబడినది. దానిపై ఒక వాక్యమును వ్రాయుము.
జవాబు:
‘కీ’ ఇవ్వబడని కారు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. కాని ‘కీ’ ఇచ్చిన తర్వాత అదే బొమ్మకారు కదిలేందుకు కావలసిన శక్తిని స్ప్రింగు ద్వారా పొందుతుంది.
ప్రశ్న 8.
గతిశక్తికి కొన్ని ఉదాహరణలిచ్చు సందర్భాలను వ్రాయుము.
జవాబు:
- వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్లను పడగొట్టడం.
- అదే బంతి బ్యాట్ కు తగిలితే వేగంగా మరొక దిశలో కదలడం.
- వేగంగా కదిలే తుపాకి గుండు, లక్ష్యం గుండా దూసుకొని పోవడం.
- కదిలే గాలి (పవనం) గాలిమరను తిప్పడం.
ప్రశ్న 9.
మానవ శరీరంలోని శక్తిని గురించి రాయుము.
జవాబు:
- మానవ శరీరం వివిధ రకాల శక్తి మార్పులు జరిగే ఒక సంక్లిష్ట వ్యవస్థ.
- మానవ శరీరంలోని శక్తికి మూలాధారం ఆహారం.
- పనిని చేసేటపుడు కండరాల సంకోచ, వ్యాకోచాల సందర్భంలో గుండె రక్తాన్ని “పంప్” చేయడానికి శక్తి వినియోగించ బడుతుంది.
- మన శరీరంలో వివిధ జీవక్రియలు జరగడానికి పనిచేసే బలం మన శరీర శక్తిని తగ్గిస్తుంది. అటువంటి సందర్భంలో మనం అలసిపోతాం.
ప్రశ్న 10.
సోను ఈ మధ్య జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించాడు. అతనికి క్రికెట్లోని బంతి, బ్యాట్ పై మరియు దాని చలనాలపై కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో వ్రాయండి.
జవాబు:
- బంతిని బౌలర్ వేగంగా ఎందుకు వేస్తున్నాడు?
- వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్లను పడగొట్టడంలో ఇమిడివున్న నియమమేమిటి?
- అదే బంతి బ్యాట్ కు తగలగానే దిశ ఎందుకు మార్చుకోగలిగినది?
ప్రశ్న 11.
వెంకట్ వాలీబాల్ తో ఆడుచున్నాడు. అతను బంతిని పైకి వేసిన సందర్భంలో దానిలో కలిగే మార్పులను గమనించాడు. అతనికి కొన్ని ప్రశ్నలు (సందేహాలు) వచ్చాయి. అవి ఏమైవుంటాయో మీరు ఊహించగలరా?
జవాబు:
- బంతి పైకి వెళుతుంటే దాని వేగం ఏమవుతుంది?
- బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వేగం ఎంత?
- బంతి తిరిగి కిందకి వస్తున్నప్పుడు దాని వడి ఏమవుతుంది?
9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సితిజ, గతిజ శక్తుల మధ్య పోలికలు, తేడాలను వ్రాయండి.
జవాబు:
స్థితిజ శక్తి | గతిజ శక్తి |
1) ఒక వస్తువుకు దాని ఆకారం లేదా స్థానం వలన పొందే శక్తిని స్థితిజశక్తి (P.E) అని అంటారు. | 1) ఒక వస్తువుకు దాని గమనం వలన పొందే శక్తిని గతిజ శక్తి (K.E) అని అంటారు. |
2) ఇంటిపై గల నీటి ట్యాంక్ లో నీటికి గల శక్తి స్థితిజ శక్తి. సాగదీసి ఉంచబడిన రబ్బరు బ్యాండ్‌కు గల శక్తి స్థితిజ శక్తి. | 2) ప్రవహించే నీటికి గల శక్తి గతిజ శక్తి. ప్రయాణించే వాహనానికి గల శక్తి గతిజ శక్తి. |
3) P.E = mgh | 3) K.E = \(\frac{1}{2}\) mv2 |
4) ఇది ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. (కొన్ని సందర్భాలలో) |
4) ఇది వేగంపై ఆధారపడి ఉంటుంది. |
ప్రశ్న 2.
యాంత్రిక శక్తి అనగానేమి? దాని యొక్క రూపాలను రాయుము. ఒక ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
ఒక వస్తువునకు యాంత్రిక బలము వలన వచ్చు శక్తినే యాంత్రిక శక్తి అంటారు.
యాంత్రిక శక్తి రెండు రకాలు. అవి : 1) గతిశక్తి ii) స్థితిశక్తి
ఉదాహరణ:
- ఒక విమానం నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు దాని గతిశక్తి విలువ శూన్యం. అదే విధంగా అది నేలపై ఉన్నప్పుడు దాని స్థితిశక్తి విలువ కూడా శూన్యమే.
- అనగా నేలపై నిశ్చలస్థితిలో ఉన్న విమానం యొక్క యాంత్రికశక్తి శూన్యం.
- అదే విమానం కొంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు దానికి గతిశక్తి మరియు స్థితిశక్తి ఉంటాయి కనుక యాంత్రిక శక్తి ఉండదు.
ప్రశ్న 3.
ప్రకృతిలో జలచక్రం ఏర్పడడాన్ని నీవెలా అభినందిస్తావు?
జవాబు:
- సముద్రాలు, నదులు, సరస్సులు మరియు కొలనులలోని నీరు ఆవిరిగా భాష్పీభవనం చెందును.
- ఈ ఆవిరి నీటి మేఘములను ఏర్పరచును.
- ఈ మేఘములు వర్షములు కురిసేందుకు దోహదపడును.
- వర్షం ద్వారా వచ్చిన నీరు డ్యాములలో నిల్వ చేయబడును. వీటికి స్థితిశక్తి వుండును.
- మరలా ఈ నీరు తిరిగి సముద్రంలోకి కలియును.
- ఈ కలిసే నీటిని మనము విద్యుత్ శక్తి వనరుగా ఉపయోగిస్తాము.
- ఈ విధముగా ప్రకృతిలో గల జలచక్రం మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జలచక్రంను నేను అభినందిస్తున్నాను.
9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 1 Marks Bits Questions and Answers
1. బంతి వడి రెట్టింపైన దాని గతిజశక్తి
A) మారదు.
B) రెట్టింపగును.
C) సగమవుతుంది.
D) నాలుగురెట్లగును.
జవాబు:
D) నాలుగురెట్లగును.
2. చైతన్య 5 నిమిషాల కాలంలో 3000 ల పని చేసిన ఆమె సామర్థ్యం
A) 60 W
B) 1/60 W
C) 1 W
D) o W
జవాబు:
C) 1 W
3. ‘పని’కి
A) దిశ మాత్రమే ఉంది, కాని పరిమాణం లేదు.
B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.
C) పరిమాణం, దిశ రెండూ కలవు.
D) పరిమాణం, దిశ రెండూ లేవు.
జవాబు:
B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.
4. సామర్థ్యానికి నిర్వచనం
P) పని జరిగే రేటు
Q) శక్తి బదిలీ రేటు
R) స్థితిశక్తి, గతిశక్తిల మొత్తం
A) P మాత్రమే
B) Q మరియు R
C) P మరియు Q
D) P, Q మరియు R
జవాబు:
C) P మరియు Q
5. ఒక పుస్తకంపై 4.5 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించి, దానిని 30 సెం.మీ. కదిలించిన జరిగిన పని ఎంత?
A) 1.55 J
B) 1.35 J
C) 1.53 J
D) 1.3 J
జవాబు:
B) 1.35 J
I. సరియైన సమాధానమును రాయుము.
1. వస్తువుపై పనిచేసే బలం దాని వడికి విలోమాను పాతంలో ఉంటే గతిశక్తి …..
A) స్థిరం
B) కాలానికి విలోమానుపాతం
C) కాలానికి అనులోమానుపాతం
D) ఏదీకాదు
జవాబు:
C) కాలానికి అనులోమానుపాతం
2. 1కి.గ్రా. ద్రవ్యరాశి, 2 N – S ద్రవ్యవేగం గల వస్తువు గతిశక్తి ……..
A) 2 J
B) 4 J
C) 8 J
D) 16 J
జవాబు:
A) 2 J
3. 15 కి.గ్రా. సూట్‌కేస్ ని పట్టుకొని 15 ని|| బస్సు కొరకు వేచి ఉండుటలో జరిగిన పని
A) ఎక్కువ
B) తక్కువ
C) శూన్యం
D) అనంతం
జవాబు:
A) ఎక్కువ
4. 1 k Wh = ……….. ఎర్గులు.
A) 3.6 × 1018
B) 3.6 × 1011
C) 3.6 × 1012
D) 3.6 × 1013
జవాబు:
D) 3.6 × 1013
5. క్రింది వానిలో ఏది మిగతా వాటితో విభేదించును?
A) వాట్ – సెకను
B) కూలుంబు – ఫారడే
C) న్యూటన్ – మీటరు
D) కూలుంబు – వోల్టు
జవాబు:
B) కూలుంబు – ఫారడే
6. 100 కి.గ్రా. నీటిని 100 మీ. ఎత్తుకి 10 సె॥లలో తోడగల పంపు సామర్థ్యం …………
A) 9800 W
B) 980 W
C) 98 W
D) శూన్యం
జవాబు:
A) 9800 W
7. 2 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువు 20 మీ ఎత్తు నుండి క్రింద పడిత స్థితిశక్తిలో నష్టం ……..
A) 400 J
B) 300 J
C) 200 J
D) 100 J
జవాబు:
A) 400 J
8. 1 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువుకి 1 కౌలు శక్తి ఉండడానికి కావల్సిన వేగం ……
A) 1 మీ/సె
B) 4 మీ/సె
C) 1.414 మీ/సె
D) 9.8 మీ/సె
జవాబు:
C) 1.414 మీ/సె
9. రెండు ఎలకానను ఒకదానికొకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ స్థితిశక్తి ……
A) శూన్యం
B) 1 J
C) 2 J
D) 4 J
జవాబు:
A) శూన్యం
10. స్వేచ్ఛాపతనంలో గతిశక్తి …………….
A) ఎత్తుకి అనులోమానుపాతంలో
B) తగ్గును
C) పెరుగును
D) A మరియు C
జవాబు:
D) A మరియు C
11. ఒక రాయిని నిట్టనిలువుగా పైకి విసిరితే అది తిరిగి నేలను చేరింది. దాని స్థితి గరిష్టమయ్యేది
A) పైకి ప్రయాణించినపుడు
B) గరిష్ఠ ఎత్తు వద్ద
C) తిరుగు ప్రయాణంలో
D) అడుగు భాగంలో
జవాబు:
B) గరిష్ఠ ఎత్తు వద్ద
II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
1. పని ఒక ……………. రాశీ.
2. పనికి ప్రమాణాలు ……………
3. పైకి వెళ్ళే వస్తువు వడి క్రమేపి …..
4. పని ధనాత్మకమైన ఆ వస్తువు శక్తిని …………
5. పని ఋణాత్మకమైన ఆ వస్తువు శక్తిని ……………..
6. వివిధ వస్తువుల పనిచేయగల సామర్థ్యం వాటి ………………. పై ఆధారపడుతుంది.
7. మానవ శరీరం ఒక ………. వ్యవస్థ.
8. సముద్ర అలలు …………… శక్తి వనరు.
9. చెట్టుపై నుండి పడే కొబ్బరికాయకు ఉండు శక్తి.
10. పారుతున్న నీటికి ఉండే శక్తి ………
11. గతిశక్తికి సమీకరణము ……….
12. బొమ్మకారులో ‘కీ’ ని తిప్పినపుడు దానిలో ఉన్న శక్తి ……………..
13. స్థితిశక్తికి సమీకరణము ……………..
14. యాంత్రిక శక్తి = ………….. + …………..
15. నేలపై ఆగి ఉన్న విమానపు గతిశక్తి విలువ ………….
16. ఇస్త్రీ పెట్టెలో ……………… శక్తి, …………….. శక్తిగా మారుతుంది.
17. టార్చ్ లైట్ లో ………….. శక్తి, ……….. గా మారును.
18. సామర్ధ్యమనేది ……………… కు కొలమానము.
19. సామర్థ్యంకు ప్రమాణం …………….
20. ఒక వస్తువుకు దాని చలనం వలన కలిగే శక్తిని …………….. అంటాము.
21. ఒక వస్తువు దాని స్థానం, ఆకారం వలన పొందే శక్తిని ……………. అంటాము.
22. ఒక వస్తువు యొక్క స్థితిశక్తి, గతిశక్తుల మొత్తం ………… శక్తి అగును.
జవాబు:
1) అదిశ
2) N- m లేదా జోల్
3) తగ్గును
4) గ్రహించును
5) కోల్పోవును
6) స్థితి, స్థానాల
7) సంక్లిష్ట
8) సూర్యునిపై ఆధారపడని
9) గతిశక్తి
10) గతిశక్తి
11) K.E = \(\frac{1}{2}\)mv²
12) స్థితిశక్తి
13) P.E = mgh
14) స్థితిశక్తి, గతిశక్తి
15) శూన్యం
16) విద్యుత్, ఉష్ణ
17) రసాయన, కాంతిశక్తి
18) పనిచేసే వేగం
19) వాట్
20) గతిశక్తి
21) స్థితిశక్తి
22) యాంత్రిక
III. జతపరచుము.
Group – A | Group – B |
1. పని | A) mgh |
2. సామర్థ్యం | B) \(\frac{1}{2}\) mv² |
3. స్థితిశక్తి | C) Fs |
4. గతిశక్తి | D) \(\frac{W}{t}\) |
జవాబు:
Group – A | Group – B |
1. పని | C) Fs |
2. సామర్థ్యం | D) \(\frac{W}{t}\) |
3. స్థితిశక్తి | A) mgh |
4. గతిశక్తి | B) \(\frac{1}{2}\) mv² |
ii)
Group – A | Group – B |
1. ఎలక్ట్రిక్ హీటరు | A) రసాయన శక్తి → విద్యుత్ శక్తి |
2. ఎలక్ట్రిక్ మోటరు | B) విద్యుత్ శక్తి → ధ్వని శక్తి |
3. ఎలక్ట్రిక్ బ్యాటరీ | C) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి |
4. హెడ్ ఫోను | D) విద్యుత్ శక్తి → ఉష్ణ శక్తి |
జవాబు:
Group – A | Group – B |
1. ఎలక్ట్రిక్ హీటరు | D) విద్యుత్ శక్తి → ఉష్ణ శక్తి |
2. ఎలక్ట్రిక్ మోటరు | C) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి |
3. ఎలక్ట్రిక్ బ్యాటరీ | A) రసాయన శక్తి → విద్యుత్ శక్తి |
4. హెడ్ ఫోను | B) విద్యుత్ శక్తి → ధ్వని శక్తి |
పునరాలోచన