SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 2 సమితులు Exercise 2.4 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 10th Class Maths Solutions 2nd Lesson సమితులు Exercise 2.4
ప్రశ్న 1.
క్రింది సమితులలో ఏవి శూన్యసమితులో, ఏవి కావో తెల్పండి.
(i) ఒక బిందువు గుండా వెళ్ళే సరళరేఖల సమితి
(ii) 2 చే భాగించబడే బేసి సహజ సంఖ్యల సమితి
(iii) {x : x ఒక సహజసంఖ్య, x < 5 మరియు x > 7}
(iv) {x : x ఏవేని రెండు సమాంతర రేఖల ఉమ్మడి బిందువు}
(v) సరి ప్రధాన సంఖ్యల సమితి
సాధన.
(i) శూన్యసమితి కాదు
(ii) శూన్యసమితి
(iii) శూన్యసమితి
(iv) శూన్యసమితి
(v) శూన్యసమితి కాదు
ప్రశ్న 2.
క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులో, ఏవి అపరిమిత సమితులో తెలపండి.
(i) ఒక సంవత్సరంలోని నెలల సమితి
(ii) {1, 2, 3, ….. 99, 100}
(iii) 99 కంటే తక్కువగా గల ప్రధానసంఖ్యల సమితి
సాధన.
(i) పరిమిత సమితి
(ii) పరిమిత సమితి
(iii) పరిమిత సమితి
ప్రశ్న 3.
క్రింది సమితులలో ప్రతి సమితిని, పరిమిత సమితో
లేదా అపరిమిత సమితో తెల్పండి.
(i) ఆంగ్ల భాషలోని అక్షరాల సమితి
(ii) X – అక్షానికి సమాంతరంగా ఉండే రేఖల సమితి
(iii) 5 యొక్క గుణిజాల సమితి
(iv) (0, 0) మూలబిందువు గుండా వెళ్ళే వృత్తాల సమితి
సాధన.
(i) పరిమిత సమితి
(ii) అపరిమిత సమితి
(iii) అపరిమిత సమితి
(iv) అపరిమిత సమితి