SCERT AP 10th Class Physical Science Guide 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Physical Science 2nd Lesson Questions and Answers ఆమ్లాలు-క్షారాలు-లవణాలు
10th Class Physical Science 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
A, B, C, D& E అనే ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినపుడు అవి వరుసగా 4, 1, 11, 7 మరియు 9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది? (AS1)
a) తటస్థ ద్రావణం
b) బలమైన క్షారం
c) బలమైన ఆమ్లం
d) బలహీన ఆమ్లం
e) బలహీన క్షారం? వీటిని pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంగా రాయండి.
జవాబు:
a) తటస్థ ద్రావణం – D, pH విలువ -7
b) బలమైన క్షారం – C, pH విలువ – 11
c) బలమైన ఆమ్లం – B, pH విలువ – 1
d) బలహీన ఆమ్లం – A, pH విలువ – 4
e) బలహీన క్షారం – E, pH విలువ – 11
ప్రశ్న 2.
తటస్థీకరణం అనగానేమి? రెండు ఉదాహరణలు రాయండి. (AS1)
(లేదా)
తటస్థీకరణంను నిర్వచించి, రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు. సాధారణంగా తటస్థీకరణ చర్యను ఈ విధంగా రాస్తారు.
ఆమ్లం + క్షారం → లవణం + నీరు
ఉదా : HCl + NaOH → Nacl + H2O
H2SO4 + 2 KOH → K2SO4 + 2 H2O
ప్రశ్న 3.
ఆమ్లమును/క్షారమును నీటికి కలిపినపుడు ఏమి జరుగుతుంది? (AS1)
(లేదా)
ఆమ్లమునకు నీరును చేర్చిన జరుగు మార్పును వివరించుము.
(లేదా)
క్షారమునకు నీరును చేర్చిన జరుగు మార్పును వివరించుము.
జవాబు:
ఆమ్లానికి నీటిని కలిపినపుడు ప్రమాణ ఘనపరిమాణంలో ‘గల H3O+ అయాను గాఢత తగ్గుతుంది. ఇటువంటి ఆమ్లాలను విలీన ఆమ్లాలు అంటారు.
అదే విధంగా క్షారాలకు నీటిని కలిపినపుడు ప్రమాణ ఘనపరిమాణంలో గల OH– అయాను గాఢత తగ్గుతుంది. ఇటువంటి క్షారాలను విలీన క్షారాలు అంటారు.
ఆమ్లానికి, క్షారానికి నీటిని కలిపే దృగ్విషయాన్ని విలీనత అంటారు.
ప్రశ్న 4.
నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దంత క్షయం ఎందుకు ప్రారంభం అవుతుంది? (AS1)
(లేదా)
నోటిలో pH విలువ ఎంత ఉన్నప్పుడు దంతక్షయం జరుగుతుంది? ఎందుకు?
(లేదా)
దంతక్షయం ఏ విధముగా ఏర్పడును, దాని నివారణకు పాటించవలసిన నియమాలు ఏవి?
జవాబు:
a) దంతక్షయం :
- మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్ధం దంతాలపై గల పింగాణీ పొర.
- ఇది కాల్షియం ఫాస్ఫేట్ Ca3(PO4)తో తయారగును. నీటిలో కరగదు.
- నోటిలోని బాక్టీరియా దంతాల మధ్య చిక్కుకొని ఉన్న ఆహారపదార్థాలను వియోగం చెందించి నోటిలో లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయును.
- కావున నోటిలో pH విలువ తక్కువగును. దీనివలన అత్యంత దృఢమైన పింగాణీ (ఎనామిల్) పొర క్షీణించి పళ్లు నాశనం అగును. దీనినే దంత క్షయం అంటారు.
b) దంతక్షయాన్ని అరికట్టుట :
- ఈ దంతక్షయాన్ని అరికట్టడానికి ఆహారాన్ని తిన్న తరువాత నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి.
- క్షార స్వభావం గల టూత్ పేస్ట్ తో రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రపరచుట వలన అధిక ఆమ్లం తటస్థీకరించడం ద్వారా దంతక్షయాన్ని నివారించవచ్చు.
ప్రశ్న 5.
శుద్ధజలం విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించదు? (AS1)
(లేదా)
“మినరల్ వాటర్ ఒక విద్యుత్ నిరోధక పదార్థం” వివరించుము.
జవాబు:
శుద్ధజలంలో ఒక కోటి H2O అణువులతో, కేవలం ఒకటి మాత్రమే H3O+ అయాను గానో లేదా OH– అయాను గానో ఉండును. అనగా విద్యుత్ ప్రవాహానికి మోసుకు వెళ్ళటానికి ఎక్కువగా అయాన్లు లేవు. అందువల్ల శుద్ధజలం విద్యుత్ వాహకతను ప్రదర్శించదు.
శుద్ధ జలంలో ఎటువంటి మలినాలు ఉండవు. అందువలన శుద్ధజలం విద్యుత్ వాహకతను ప్రదర్శించదు.
ప్రశ్న 6.
శుద్ధ ఎసిటిక్ ఆమ్లం విద్యుద్వాహకతను ఎందుకు ప్రదర్శించదు? (AS2)
జవాబు:
శుద్ద ఎసిటిక్ ఆమ్లంలో అయాన్లుగా విడిపోవటం జరగదు. ఆమ్ల ధర్మాలకు కారణమైన H3O+ అయాను లేకపోవుట వలన శుద్ధ ఎసిటిక్ ఆమ్లం విద్యుద్వాహకతను ప్రదర్శించదు. ఎసిటిక్ ఆమ్లానికి కొంత నీటిని కలిపినప్పుడు అతి తక్కువగా వియోగం చెంది తక్కువ పరిమాణంలో H3O+ అయాన్లు కలిగి ఉండును. అందువలన దీనిని బలహీనమైన ఆమ్లం అంటారు.
ప్రశ్న 7.
పాల వ్యాపారి కొద్దిగా తినే సోడాను పాలకు కలిపినాడు. ఈ క్రింది వాటికి కారణాలు వ్రాయండి. (AS2)
a) ఎందుకు ఆ పాల యొక్క pH విలువను 6 నుండి పెంచాడు?
b) ఈ పాలు పెరుగుగా మారుటకు ఎక్కువ సమయం ఎందుకు పట్టింది?
జవాబు:
a) పాల యొక్క pH విలువ 6 కంటే తగ్గితే పాలకు పుల్లని రుచి వచ్చి క్రమేణ పాలు పాడైపోవును. దీనిని నివారించటానికి పాలకు తినేసోడాను కలిపితే పాలలోని ఆమ్లగుణం తినే సోడా (NaHCO3) అనే క్షారంతో తటస్థీకరించడం వలన pH విలువ పెరుగును. pH విలువ పెరుగుట వలన పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండును.
b) పాలు పెరుగుగా మారడానికి కారణం – పాలలోని బ్యాక్టీరియా ఆమ్లాన్ని ఉత్పత్తిచేసి పాల pH విలువను తగ్గించడం. కానీ తినేసోడాను పాలకు కలిపితే పాల pH విలువ పెరుగుతుంది. ఆ pH ను తగ్గించడానికి బాక్టీరియా ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయాలి. అందుకు ఎక్కువ సమయం పడుతుంది. కావున పాలు పెరుగుగా మారుటకు ఎక్కువ సమయం పడుతుంది.
ప్రశ్న 8.
ప్లాస్టర్ ఆఫ్ పారిసను తడిలేని, గాలి సోకని పాత్రలలో నిల్వ చేస్తారు. ఎందుకు? (AS2)
జవాబు:
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తెల్లగా ఉండే చూర్ణ పదార్థం. దీనిని సాధారణ వాతావరణంలో ఉంచినపుడు వెంటనే తేమను గ్రహించి దృఢమైన ఘనపదార్థంగా మారును.
CasO4 . ½H2O + 1½H2O → CaSO4 2H2O (జిప్సం)
దీనినే జిప్సం అంటారు. అందువలన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను గాలి సోకని, తడిలేని పాత్రలలోనే నిల్వ చేస్తారు.
ప్రశ్న 9.
ఆల్కహాల్, గ్లూకోజ్ వంటి లవణాలు హైడ్రోజన్ ను కలిగి ఉన్నప్పటికీ అవి ఆమ్లాలు కావు. దీనిని ఒక కృత్యం ద్వారా వివరింపుము. (AS3)
(లేదా)
హైడ్రోజన్ కలిగియున్న సమ్మేళనాలన్నీ ఆమ్లాలో కాదో నిర్ధారించటానికి కృత్యం చేయుము. (కృత్యం -7)
జవాబు:
కావలసిన పరికరాలు :
గ్లూకోజ్, ఆల్కహాల్, HCl ద్రావణం, బీకరు, గ్రాఫైట్ కడ్డీలు, బల్బు, హోల్డర్, వేర్వేరు రంగులు గల విద్యుత్ వాహక తీగలు.
పద్ధతి :
- ఒక గాజు బీకరులో రెండు గ్రాఫైట్ కడ్డీలను ఉంచుము.
- ఒక గ్రాఫైట్ కడ్డీకి వాహకం యొక్క మొదటి కొనను అమర్చవలేను. రెండవ కొనను 230 వోల్టుల పవర్ సప్లికి కలపటానికి సిద్ధంగా ఉంచవలెను.
- వేరే రంగులోని వాహక తీగల యొక్క మొదటి కొనను రెండవ గ్రాఫైట్ కడ్డీకి అమర్చవలెను. తీగ యొక్క రెండవ కొనను బల్పు కలిగిన హోల్డరుకు కలపనలెను.
- ఇదే రంగు గల వాహక తీగను హోల్డర్ యొక్క రెండవ కొనకు కలిపి, 230 వోల్టుల పవర్ సప్లికి కలపటానికి సిద్ధంగా ఉంచాలి.
- మొదట బీకరులో HCl జలద్రావణాన్ని తీసుకొని వలయంలో రెండు చివరలను 230 వోల్టుల ఎ.సి. విద్యుత్ ప్రవాహానికి కలపాలి.
- బల్బు వెలుగుతుందంటే ఆ ద్రావణం గుండా విద్యుత్ ప్రసరిస్తుందని తెలుస్తుంది.
- HCl వంటి ఆమ్లాలు జలద్రావణంలో ఆమ్ల ధర్మాలకు కారణమైన హైడ్రోజన్ అణువుల (H+) ను ఇస్తాయి. అందువలన విద్యుత్ ప్రసారం జరిగినది.
- ఇపుడు బీకరులో గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకొని ప్రయోగాన్ని కొనసాగించండి. బల్బు వెలగలేదు. అనగా విద్యుత్ ప్రసారం జరగలేదు.
- బీకరులో ఆల్కహాల్ ద్రావణాన్ని తీసుకొని ప్రయోగాన్ని కొనసాగించండి. బల్బు వెలగలేదు. అనగా విద్యుత్ ప్రసారం జరగలేదు.
- విద్యుత్ ప్రసారానికి కావల్సిన అయాన్లు గ్లూకోజ్ జోనూ, ఆల్కహాల్ లోనూ లేవు.
- గ్లూకోజ్ (C12H22O11), ఆల్కహాల్ (C2H5OH) సంఘటనాలలో హైడ్రోజన్ ఉన్నప్పటికీ జలద్రావణంలో H+ అయానులను ఇచ్చే వాటిని మాత్రమే ఆమ్లాలంటారు. కాబట్టి గ్లూకోజ్, ఆల్కహాల్ ఆమ్లాలు కావు.
నిర్ధారణ : దీనినిబట్టి ఈ ద్రావణాలలో H+ అయానులు ఉండవని అర్థమవుతుంది. ద్రావణాలలో విడుదలైన H+ అయాన్లు మాత్రమే ఆమ్లాల యొక్క స్వభావాన్ని నిర్ధారిస్తాయి.
ప్రశ్న 10.
లవణాల యొక్క స్ఫటికజలం అంటే ఏమిటి ? దీనిని ఒక కృత్యం ద్వారా వివరింపుము. (AS3)
(లేదా)
లవణాలలో స్ఫటికజలం ఉంది అని కృత్యం ద్వారా నిరూపించుము.
(లేదా)
లవణాల యొక్క స్ఫటికజలం అంటే ఏమిటి? దీనిని ఒక కృత్యం ద్వారా వివరింపుము. (కృత్యం – 16)
జవాబు:
స్ఫటికజలం :
ఏదైనా లవణం యొక్క ఫార్ములాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
కృత్యం :
కావలసిన పరికరాలు : బుస్సెన్ బర్నర్, పరీక్ష నాళిక, పట్టకారు, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు.
పద్ధతి :
- కాపర్ సల్ఫేట్ స్ఫటికాల యొక్క నీలిరంగును పరిశీలించండి.
- కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడి పరీక్ష నాళికలో తీసుకొని వేడి చెయ్యండి.
- పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు కాపర్ సల్పేట్ నుండి వియోగం చెందిన స్ఫటికజలంగా గుర్తించండి.
- ఇపుడు కాపర్ సల్ఫేట్ యొక్క రంగు తెల్లగా మారటం గుర్తించండి.
- దీనికి కారణం కాపర్ సల్ఫేట్ నుండి స్పటికజలం విడిపోవుట వలన తెల్లగా మారిందని గుర్తించండి.
- తెల్లటి కాపర్ సల్ఫేట్ లవణానికి నీటిని కలిపిన వెంటనే నీలిరంగుకు మారుతుంది. దీని ఫార్ములా CuSO45H2O.
- ఈ కృత్యం ద్వారా కాపర్ సల్ఫేట్ స్ఫటిక జలం కలిగి ఉందని నిర్ధారణ జరిగింది.
ప్రశ్న 11.
నీటిలో కరిగిన ఆమ్ల ద్రావణం విద్యుత్ వాహకతను కలిగి ఉంటుందని చూపే ప్రయోగపటంను గీయండి. (AS5)
(లేదా)
క్షారం కలిపిన జలద్రావణం విద్యుద్వాహకతను చూపు పటం గీయండి. చక్కెర / గ్లూకోజ్ కరిగిన జలద్రావణంలో ఎందుకు విద్యుత్ప్రవాహం జరగదు?
జవాబు:
చక్కెర / గ్లూకోజ్ కరిగిన జలద్రావణంలో అయాన్లు లేకపోవడం వలన విద్యుతవాహం జరగదు.
ప్రశ్న 12.
ఆమ్ల వర్షాలు చెరువు/నదులలోనికి వచ్చి చేరినపుడు జలచరాల ఉనికికి ప్రమాదం ఎందుకు? (AS5)
జవాబు:
వర్షపునీరు pH విలువ 5.6 కంటే తక్కువైతే దానిని ఆమ్ల వర్షం అంటారు. ఈ వర్షపునీరు నదీజలాలలో కలిసినపుడు నదీజలాల pH విలువలు తగ్గుతాయి. ఇటువంటి తక్కువ pH విలువ గల నదీజలాలలో ఉండే జలచరాల, జీవనం సంకటంలో పడుతుంది.
ప్రశ్న 13.
బేకింగ్ పౌడర్ అని దేనిని పిలుస్తారు? దీనిని కేక్ తయారీలో వాడినప్పుడు మృదువుగా మరియు మెత్తగా చేస్తుంది. ఎందుకు? (AS1)
(లేదా)
మనము తినే కేక్ చాలా మృదువుగా మెత్తగా ఉండుటకు దాని తయారీలో కలిపే రసాయన పదార్థం ఏమిటి? దానిని ఏమని పిలుస్తారు? దాని చర్య గురించి వివరించుము.
జవాబు:
బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లం వంటి బలహీన, తినదగిన ఆమ్లంతో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటాం. బేకింగ్ పౌడరను వేడిచేసినపుడు లేదా వాటిలో కలిపినపుడు ఈ క్రింది రసాయన చర్య జరుగును.
NaHCO3 + H+ → CO2 + H2O+ లవణం
ఈ చర్యలో క్రియాజన్యంగా విడుదలైన కార్బన్ డై ఆక్సెడ్ వాయువు రొట్టె లేక కేక్ నుండి రంధ్రాలు చేసుకొని బయటకు పోవుట వలన రొట్టె లేదా కేక్ వ్యాకోచించడమే కాకుండా మెత్తగా స్పాంజి వలె మారుతుంది. తినటానికి సులువుగానూ, మృదువుగానూ, రుచికరంగానూ మారుతుంది.
ప్రశ్న 14.
తినేసోడా, బట్టలసోడా యొక్క రెండు ఉపయోగములు రాయండి. (AS7)
(లేదా)
వాషింగ్ సోడా, బేకింగ్ సోడా రసాయన ఫార్ములాలు వ్రాసి, వాటి ఉపయోగాలు తెలపండి.
జవాబు:
తినేసోడా లేదా బేకింగ్ సోడా : సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHO3)ను తినేసోడా లేదా బేకింగ్ సోడా అంటారు.
ఫార్ములా : NaHCO3
తినేసోడా లేదా బేకింగ్ సోడా ఉపయోగాలు :
- ఆహారపదార్థాలు త్వరగా ఉడకడానికి
- ఏంటాసిడ్ గాను
- పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి
- అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగాను
- పూరీలు, బజ్జీల తయారీలో
- ఏంటి సెప్టిక్ గానూ
- బేకింగ్ పౌడర్ తయారీలో, బేకరీలో కేల తయారీలో విరివిగా వాడతారు.
బట్టలసోడా లేదా వాషింగ్ సోడా :
వాషింగ్ సోడా రసాయన ఫార్ములా Na2 CO310H2O (సోడియం కార్బోనేట్).
బట్టలసోడా లేదా వాషింగ్ సోడా ఉపయోగాలు :
- గాజు, సబ్బులు, కాగితాల పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
- బొరాక్స్ వంటి సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తారు.
- గృహాలలో వస్తువులను శుభ్రపరచడానికి వాడతారు.
- నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించటానికి దీనిని వాడతారు.
ప్రశ్న 15.
పొడిగా ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl) నీలి లిట్మస్ కాగితంతో చర్య జరపదు. కానీ, హైడ్రోక్లోరిక్ ఆమ్లము చర్య జరుపుతుంది. ఎందుకు?
జవాబు:
- పొడిగా ఉన్న HCl నీరు చేరనపుడు వియోగం చెందదు.
- అందువలన నీలి లిట్మతో HCl వాయువు చర్య జరపదు.
- HCl ను నీటిలో కలిపినపుడు HCl వియోగం చెంది అయానులను ఏర్పరచును.
HCl + H2O → H3O+ + Cl– - ఇప్పుడు నీలి లిట్మస్ పేపరును HCl ద్రావణంలో ముంచగా చర్య జరిపి ఎర్ర లిట్మస్ గా మారును.
ప్రశ్న 16.
అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6. కానీ దీనిని పెరుగుగా మార్చినపుడు pH విలువ ఎందుకు మారుతుంది? వివరించుము.
జవాబు:
అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6గా ఉండును. కానీ పాలను పెరుగుగా మార్చే ప్రక్రియలో బాక్టీరియా పాల కణాలను వియోగం చెందించి లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివలన పాల యొక్క pH విలువ 6 కంటే తగ్గి పుల్లని రుచితో పెరుగుగా మారుతుంది.
ప్రశ్న 17.
సమాన పొడవు (3 సెం.మీ.) ఉన్న మెగ్నీషియం ముక్కలను సమాన గాఢత కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ – ఆమ్లమునకు కలిపినపుడు ఏ ద్రావణం నందు చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
సమాన పొడవు గల మెగ్నీషియం ముక్కలను తీసుకొని సమాన గాఢతలు గల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోనూ, ఎసిటిక్ ఆమ్లంలోనూ కలిపినపుడు HCl ద్రావణంలో చర్య వేగంగా జరుగుతుంది. ఎసిటిక్ ఆమ్లంలో చర్య నెమ్మదిగా జరుగుతుంది. HCl బలమైన ఆమ్లం కావున వెంటనే నీటితో H+, Cl– గా అయనీకరణం చెందును. ఋణావేశం గల క్లోరిన్ అయాన్ మెగ్నీషియంతో చర్య జరిపి MgCl2ను ఏర్పరచును. కానీ ఎసిటిక్ ఆమ్ల ద్రావణం బలహీనమైనది కావున నీటిలో 30% కంటే తక్కువగా అయనీకరణం చెందును. మరియు నెమ్మదిగా అయనీకరణం చెందును. అందువలన ఎసిటిక్ ఆమ్లంలో చర్యావేగం తక్కువ.
ప్రశ్న 18.
బీట్ రూట్ ను ఉపయోగించి మీ సొంత సూచికను ఎలా తయారుచేస్తారు? వివరించండి.
(లేదా)
నీ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు తరగతినందు ఒక సొంత సూచికను తయారీ చేయమనిన నీవు ఏ విధంగా చేసెదవో ఒక – నమూనాను తెల్పుము.
జవాబు:
- మంచి బీట్ రూట్ ను సేకరించి శుభ్రంగా కడుగవలెను.
- పీలర్ సహాయంతో పైన ఉన్న తొక్కలను వేరుచేయవలెను.
- ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి తగినంత నీరు కలిపి జ్యూస్ తయారుచేయవలెను.
- జ్యూస్ ను వడపోయవలెను. ఇపుడు మనం సహజ బీట్ రూట్ సూచికను తయారు చేశాం.
- ఆమ్ల ద్రావణాన్ని తీసుకొని రెండు మూడు చుక్కల బీట్ రూట్ సూచికను కలపండి. ఆమ్ల ద్రావణం యొక్క రంగు మారును. ఇదే విధంగా క్షార ద్రావణాలను గుర్తించుటకు బీట్ రూట్ ను సహజ సూచికగా వాడుతారు.
ఖాళీలను పూరించండి
1. i) ఆమ్లాలు జలద్రావణాలలో …………… రుచిని ప్రదర్శిస్తాయి. (i) పుల్లని)
ii) ఆమ్లం, లోహంతో చర్యనొందినపుడు …………… వాయువును ఇస్తాయి. (ii) హైడ్రోజన్)
iii) ఆమ్లాలు జలద్రావణాలలో విద్యుత్ వాహకతను ప్రదర్శించిన కారణంగా అవి …………. గా గుర్తించబడ్డాయి. (iii) విద్యుత్ వాహకాలు)
iv) ఆమ్లాలు, క్షారాలతో చర్యనొందితే …………. మరియు నీరు ఏర్పడతాయి. (iv) లవణం)
v) ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ ను …………రంగులోకి మారుస్తాయి. (v) ఎరుపు)
2. i) క్షారాలు రుచికి …………… గానూ, పట్టుకొంటే ……….. గుణం కలిగి ఉంటాయి. (i) చేదు, జారుడు)
ii) క్షార ద్రావణాలు కూడా ఆమ్లాల మాదిరిగా వాహకతను ప్రదర్శించటం చేత అవి …………… గా గుర్తించబడ్డాయి. (ii) విద్యుత్ వాహకాలుగా లేదా విద్యుత్ విశ్లేష్యాలుగా)
iii) క్షారాలు ……………. చర్య నొందినపుడు లవణాన్ని, ……….. ఏర్పరుస్తాయి. (iii) ఆమ్లాలతో, నీటిని)
iv) క్షారాలు ఫినాఫ్తలీనను ………….. రంగులోనికి మారుస్తాయి. (iv) పింక్)
3. జతపరుచుము.
i) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ | a) CaoCl3 |
ii) జిప్సం | b) NaHCO3 |
iii) బ్లీచింగ్ పౌడర్ | b) Na2CO3 |
iv) బేకింగ్ సోడా | d) CaSO4 ½H2O |
v) వాషింగ్ పౌడర్ | e) CaSO3. 2H2O |
జవాబు:
i) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ | d) CaSO4 ½H2O |
ii) జిప్సం | e) CaSO3. 2H2O |
iii) బ్లీచింగ్ పౌడర్ | a) CaoCl3 |
iv) బేకింగ్ సోడా | b) NaHCO3 |
v) వాషింగ్ పౌడర్ | b) Na2CO3 |
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి
1. ఆమ్ల ద్రావణాలలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు
A) పసుపు
B) ఆకుపచ్చ
C) ఆరెంజ్
D) ఎరుపు
జవాబు:
D) ఎరుపు
2. క్షార ద్రావణాలలో ఫినాఫ్తలీన్ సూచిక యొక్క రంగు
A) పసుపు
B) ఆకుపచ్చ
C) పింక్
D) ఆరెంజ్
జవాబు:
C) పింక్
3. క్షార స్థితిలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు
A) ఆరెంజ్
B) పసుపు
C) ఎరుపు
D) నీలిరంగు
జవాబు:
B) పసుపు
4. ఒక ద్రావణం ఎర్రలిట్మసను నీలిరంగులోకి మార్చింది. దాని pH విలువ ……
A) 1
B) 4
C) 5
D) 10
జవాబు:
D) 10
5. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్య జరిపినపుడు విడుదలయ్యే వాయువు సున్నపుతేటను పాలవలె మార్చింది. ఆ ద్రావణం దీనిని కలిగి ఉంటుంది.
A) Nact
B) HCl
C) LiCl
D) KCl
జవాబు:
B) HCl
6. నీటిలో కరిగే క్షారాలను ఇలా పిలుస్తారు.
A) తటస్థ
B) క్షార
C) ఆమ్ల
D) క్షారయుత
జవాబు:
D) క్షారయుత
7. ఈ కింది వానిలో ఒక జత పదార్థాలు సాధారణ లవణాన్ని ఇస్తాయి.
A) సోడియం థయోసల్ఫేట్, సల్ఫర్ డై ఆక్సైడ్
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్
C) క్లోరిన్, ఆక్సిజన్ వాయువు
D) నత్రికామ్లం, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్
జవాబు:
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్
8. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక pH సూచికతో ఏర్పరచే రంగు (pH = 1) ……
A) ఆరెంజ్
B) ఊదా
C) పసుపు
D) ఎరుపు
జవాబు:
D) ఎరుపు
9. ఈ క్రింది వానిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు ?
A) ఆంటీబయోటిక్
B) ఎనాలిజిస్టిక్
C) ఆంటాసిడ్
D) యాంటీ సెప్టిక్
జవాబు:
C) ఆంటాసిడ్
10. మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వలన ఏర్పడే వాయువు
A) హైడ్రోజన్
B) ఆక్సిజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) క్లోరిన్
జవాబు:
A) హైడ్రోజన్
11. ఈ కింది వానిలో తటస్థీకరణ ప్రక్రియను ఖచ్చితంగా చూపించేది
A) ఆమ్లం + క్షారం → ఆమ్లం – క్షార ద్రావణం
B) ఆమ్లం + క్షారం → లవణం + నీరు
C) ఆమ్లం + క్షారం → సోడియం క్లోరైడ్ + హైడ్రోజన్
D) ఆమ్లం + క్షారం → తటస్థ ద్రావణం
జవాబు:
B) ఆమ్లం + క్షారం → లవణం + నీరు
పరికరాల జాబితా
పరీక్షనాళికలు, వాచ్ గ్లాసులు, డ్రాపర్, లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ సూచికలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, ఉల్లిపాయ, ప్లాస్టిక్ సంచి, గుడ్డముక్క లవంగం నూనె, వెనిలా ఎసెన్స్, కొవ్వొత్తి, సబ్బునీరు, పరీక్ష నాళిక, రబ్బరు బిరడా, వాయు వాహకనాళం, గాజుతొట్టె, స్టాండు, జింకు ముక్కలు, జల హైడ్రోక్లోరికామ్లం, సోడియం, హైడ్రాక్సైడ్, థిసిల్ గరాటు, కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బొనేట్, గాజు కడ్డీ, కాపర్ ఆక్సెడ్, గ్రాఫైట్ కడ్డీలు, వైర్లు, బ్యాటరీ, బల్బు, వడపోత కాగితం, సార్వత్రిక సూచిక, పిహెచ్ పేపరు, పొడి పరీక్ష నాళిక, బుస్సెన్ బర్నర్, పట్టుకారు, కాపర్ సల్ఫేట్.
10th Class Physical Science 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Textbook InText Questions and Answers
10th Class Physical Science Textbook Page No. 26
ప్రశ్న 1.
ఆంటాసిడ్ గుళిక (టాబ్లెట్)లో ఉన్న పదార్థం ఆమ్లమా? గొరమా?
జవాబు:
ఆంటాసిడ్ గుళికలో ఉన్న పదార్థం క్షారము.
ప్రశ్న 2.
ఆంటాసిడ్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కడుపులో ఎటువంటి చర్య జరుగుతుంది?
జవాబు:
ఆంటాసిడ్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కడుపులో తటస్థీకరణ చర్య జరుగుతుంది.
10th Class Physical Science Textbook Page No. 27
ప్రశ్న 3.
మీకు ఒక్కొక్క దానిలో వేర్వేరుగా స్వేదన జలం, ఒక ఆమ్లం మరియు ఒక క్షారం గల మూడు పరీక్ష నాళికలు ఇవ్వబడ్డాయి. ఒకవేళ మీకు నీలిలిట్మస్ కాగితం మాత్రమే ఇస్తే, దాని సహాయంతో ఆ మూడు పరీక్ష నాళికలలో ఉండే ద్రావణాలను ఎలా గుర్తిస్తావు?
జవాబు:
మూడు పరీక్షనాళికలలో నీలిలిట్మస్ పేపరును ముంచి ఏ పరీక్షనాళికలో ముంచినపుడు నీలిలిట్మస్, ఎర్రలిట్మస్ గా మారిందో గమనిస్తాను. దీనిని ఆమ్లంగా పరిగణించి స్టాండులో ఉంచుతాను. ఇపుడు రెండు పరీక్షనాళికలలో ఎర్రలిట్మస్ పేపర్‌ను ముంచి ఏ పరీక్ష నాళికలో నీలి రంగుకు మారిందో గమనించి, దానిని క్షారంగా పరిగణిస్తాను. ఇక మిగిలిన మూడో పరీక్ష నాళికలో స్వేదనజలంగా గుర్తిస్తాను.
ప్రశ్న 4.
ఆమ్లం, లోహంతో చర్య జరిపినపుడు సాధారణంగా వెలువడే వాయువు ఏది? దానిని ఎలా గుర్తిస్తావు?
జవాబు:
ఆమ్లం, లోహంతో చర్య జరిపినపుడు వెలువడే వాయువు హైడ్రోజన్. ఈ వాయువు దగ్గరకు మండుతున్న అగ్గిపుల్లను తీసుకువస్తే టప్ మనే శబ్దం చేస్తూ ఆరిపోతుంది.
ప్రశ్న 5.
కాల్షియం సమ్మేళనం, సజల HCl ఆమ్లంతో చర్య జరిగినపుడు బుసబుస పొంగుతూ బుడగల రూపంలో వాయువు విడుదలౌతుంది. ఈ చర్యలో విడుదలైన వాయువు మండుచున్న కొవ్వొత్తిని ఆర్పుతుంది. మరియు సున్నపు నీటిని పాలవలె మారుస్తుంది. ఈ చర్యలో ఏర్పడిన ఒక సమ్మేళనం కాల్షియం క్లోరైడ్ అయితే జరిగిన చర్యకు తుల్యసమీకరణం రాయండి.
జవాబు:
2HCl + CaCO3 → CaCl2 + H2O + CO2 ↑
10th Class Physical Science Textbook Page No. 31
ప్రశ్న 6.
జల ద్రావణాలలో HCl, HNO3 మొదలైనవి ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఆల్కహాల్, గ్లూకోజ్ వంటి ద్రావణాలు ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించవు. ఎందుకు?
జవాబు:
జల ద్రావణాలలో HCl, HNO3 ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కారణం ఆమ్లాలను నీటిలో కలపగానే ఆమ్లాలు వెంటనే అయనీకరణం చెంది H+ అయాన్లను విడుదల చేస్తాయి. ఆమ్ల ధర్మాలకు కారణం ఈ H+ అయాన్. కానీ ఆల్కహాల్, గ్లూకోజ్ వంటి ద్రావణాలు అయనీకరణం చెందవు. అందువలన అయాన్లు ఉండవు. ఈ కారణంగా ఆమధర్మాలను ప్రదర్శించవు.
ప్రశ్న 7.
గాఢ ఆమ్లాన్ని సజల ఆమ్లంగా మార్చడానికి ఆమ్లాన్ని నీటికి చుక్కలుగా కలపాలి. కానీ నీటిని ఆమ్లానికి కలుపకూడదని సలహా ఇస్తారు – ఎందుకు?
జవాబు:
ఎప్పుడూ ఆమ్లాన్ని నీటికి చుక్కలుగానే కలపాలి. అలా కాకుండా ఆమ్లానికి నీటిని కలిపితే అధిక ఆమ్లాలు-క్షారాలు-లవణాలు విడుదలై పాత్ర నుండి పైకి చిమ్మడం వలన చర్మం మీద మరియు కళ్ళలో పడి ప్రమాదం సంభవిస్తుంది. ఒక్కొక్కసారి అధిక వేడి వలన గాజు పాత్ర పగిలిపోవచ్చు.
10th Class Physical Science Textbook Page No. 35
ప్రశ్న 8.
మన శరీరంలో ఉండే రసాయనాల pH విలువ పెరిగితే ఏం జరుగుతుంది?
జవాబు:
మానవ శరీరంలో ఉండే రసాయనాల pH విలువ పెరిగితే శరీరంలో ప్రతిరోజూ జరిగే జీవక్రియలకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థలోనూ, రక్తంలోనూ, లాలాజలం మరియు అనేక శరీర ద్రవాల ధర్మాలు మారి, తీవ్ర అనారోగ్యాలు సంభవిస్తాయి.
ప్రశ్న 9.
జీవులకు pH పరిధి అతి స్వల్పంగా ఎందుకుంది?
జవాబు:
జీవులకు pH పరిధి అతిస్వల్పంగానే ఉంటుంది. pH పరిధి ఎక్కువగా ఉంటే జీవులు మనుగడ సాగించలేవు. నిరంతరం జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రతి అవయవంలోనూ అంతర్గత సమస్యలు ఏర్పడతాయి.
10th Class Physical Science Textbook Page No. 36
ప్రశ్న 10.
రైతులు వ్యవసాయ క్షేత్రంలో ఏ విధమైన మట్టి ఉన్నప్పుడు దానికి సున్నపు పొడిని లేదా కాల్షియం కార్బొనేట్ ను కలుపుతారు?
జవాబు:
రైతులు వ్యవసాయ క్షేత్రాలలో మట్టికి ఆమ్లగుణం ఉన్నప్పుడు తటస్థీకరించటానికి సున్నం కలుపుతారు.
10th Class Physical Science Textbook Page No. 22
ప్రశ్న 11.
ఊరగాయలను, పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో ఎందుకు నిలువ ఉంచరాదు?
జవాబు:
ఊరగాయలు, పుల్లని పదార్థాలు బలహీన ఆమ్లాలుగా పనిచేస్తాయి. వీటిని ఇత్తడి, రాగి వంటి లోహ పాత్రలలో నిల్వ ఉంచితే పాత్రలతో రసాయన చర్య జరిపి ఇత్తడి, రాగి సంబంధిత లవణాలను ఏర్పరుస్తాయి. ఈ లవణాలు విషపూరిత స్వభావాలు కలిగి ఉంటాయి. ఈ పదార్థాలను ఆహారంగా వాడితే ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందువలన ఊరగాయలను, పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి పాత్రలలో కాకుండా గాజు సీసాలలో భద్రపరుస్తారు.
10th Class Physical Science 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
సూచికలతో వివిధ రసాయన పదార్థాల ప్రతిస్పందన తెల్పుము.
జవాబు:
- హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నత్రికామ్లం HNO3, ఎసిటిక్ ఆమ్లం CH3COOH, లను సేకరించుము.
- అదే విధంగా సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ Ca(OH)2, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ Mg(OH)2, అమ్మోనియం హైడ్రాక్సెడ్ NH4OH, KOH లాంటి క్షారాలను సేకరించుము.
- పై ఆమ్లాలకు, క్షారాలకు నీటిని కలిపి సజల ద్రావణాలను తయారు చెయ్యండి.
- నాలుగు వాచ్ గ్లాసులను తీసుకొని ప్రతి వాచ్ గ్లాస్ పై ఒక్కొక్క చుక్క చొప్పున HCl ద్రావణాన్ని తీసుకోండి.
- మొదటి వాచ్ లో ఉన్న ద్రావణ బిందువును నీలి లిట్మస్ పేపరుతో అద్దండి.
- రెండవ వా గ్లాలోని ద్రావణానికి బిందువును ఎర్ర లిటస్మతో అద్దండి.
- మూడవ వా గ్లాలోని ద్రావణానికి ఒక చుక్క మిథైల్ ఆరెంజ్ కలపండి.
- నాల్గవ వా గ్లాస్ లోని ద్రావణంకు ఒక చుక్క ఫినాఫ్తలీన్ కలపండి.
- రంగులలో వచ్చే మార్పులను గమనించి పట్టికలో నమోదు చెయ్యండి.
పట్టికలో నమోదు చేసిన పరిశీలనల నుండి నీవు ఏమి నిర్ధారిస్తావు?
జవాబు:
ఆమ్లాలు :
నీలి లిట్మసను ఎరుపురంగులోనికి మార్చును. మిథైల్ ఆరెంజ్ ను ఎరుపురంగులోనికి మార్చును.
క్షారాలు :
ఎర్ర లిట్మసన్ను నీలిరంగులోనికి మార్చును. మిథైల్ ఆరెంజ్ రంగును పసుపురంగులోనికి మార్చును. ఫినాఫ్తలీనను పింక్ రంగులోనికి మార్చును.
పై కృత్యంలో పరిశీలించిన ద్రావణాల్లో ఆమ్ల, క్షార ద్రావణాలను గుర్తించండి.
జవాబు:
ఆమ్లాలు : HCl, H2SO4, HNO3, CH3COOH.
క్షారాలు : NaOH, KOH, Mg(OH)2, NH4OH, Ca(OH)2, KOH.
కృత్యం – 2
ప్రశ్న 2.
ఉల్లిపాయ, వెనీలా, సుగంధద్రవ్యం , లవంగ నూనెలలో వేటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలుగా వాడవచ్చో వివరింపుము.
జవాబు:
- సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కొన్నింటిని శుభ్రమైన చిన్న గుడ్డముక్కలతో సహా ప్లాస్టిక్ సంచిలో ఉంచండి. సంచి మూతిని బిగుతుగా కట్టి రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టండి.
- మరుసటి రోజు బయటకు తీసి శుభ్రమైన గచ్చుపై రెండు గుడ్డ ముక్కలను ఉంచండి. ఒక ముక్కపై సజల HCl ను మరోక ముక్కపై కొన్ని చుక్కల NaOH ను పోయండి.
- రెండు గుడ్డ ముక్కలను వేర్వేరు స్వేదన జలంతో పులిమి వాటి వాసనలు పరిశీలించి నమోదు చెయ్యండి.
- ఆమ్లంతో కలిపినప్పుడు గుడ్డముక్క వాసనలో మార్పు ఉండదు. ఉల్లిపాయ వాసన అలానే ఉంటుంది లేదా కొద్దిగా వేయించిన ఉల్లిపాయ వాసన వస్తుంది. క్షారంతో కలిపినప్పుడు గుడ్డకున్న ఉల్లిపాయ వాసన పోతుంది.
- అదే విధంగా లవంగనూనె, వెనీలా ఎసెన్స్, సుగంధ ద్రవ్యాలను తీసుకోండి.
- రెండు పరీక్ష నాళికలలో HCl, NaOHలను తీసుకోండి. రెండు పరీక్షనాళికలలో సజల వెనీలా ఎసెన్స్ కలిపి పూర్తిగా కరుగునట్లు కదుపుతూ వాటి వాసనలను పరిశీలించండి.
- అదే విధంగా లవంగనూనెను కూడా తీసుకొని చెయ్యండి.
నిర్ధారణ :
ఉల్లిపాయ, వెనీలా ఎసెన్స్, లవంగ నూనెలను ఓల్ ఫ్యాక్టరీ సూచికలుగా వాడవచ్చు.
ప్రయోగశాల కృత్యం
ప్రశ్న 3.
ఆమ్లాలు, లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. వివరించుము.
(లేదా)
మనోభిరామ్, ఆమ్లంను చర్యాశీలత గల లోహమునకు కలిపిన విడుదలగు వాయువు ఏమిటి? దీని నిరూపణకు అవసరమైన పరికరాలు మరియు కృత్యం ద్వారా వివరింపుము.
(లేదా)
HCl ఆమ్లంతో ‘Zn’ ముక్కల చర్య వలన హైడ్రోజన్ వాయువు విడుదల అగును అను చూపు ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితాను రాసి, ప్రయోగ విధానంను రాయండి.
జవాబు:
కావలసిన పరికరాలు : పరీక్షనాళిక, వాయు వాహక నాళం, డెలివరీ గొటం, గాజుతొటె, కొవ్వొత్తి, సబ్బునీరు, సజల HCl, జింకు ముక్కలు, రబ్బరు బిరడా, స్టాండ్.
పద్ధతి :
- పరికరాలను పటంలో చూపిన విధంగా అమర్చండి.
- పరీక్షనాళికలో 10 మి.మీ. జల HClను తీసుకోండి. దానికి కొన్ని జింకు ముక్కలు కలపండి.
- పరీక్షనాళికలో వెలువడిన వాయువును సబ్బు నీటి గుండా పంపండి.
- సబ్బునీటి గుండా వచ్చే వాయువు బుడగల దగ్గరకు వెలుగుతున్న కొవ్వొత్తిని దగ్గరకు తీసుకురండి.
- వెలువడిన వాయువును మండించినపుడు టప్ మనే శబ్దం రావటాన్ని మీరు గమనిస్తారు. దీనినిబట్టి వెలువడిన వాయువు హైడ్రోజన్ (H2) అని చెప్పవచ్చు.
- ఈ రసాయన చర్యను ఈ కింది విధంగా రాయవచ్చు.
ఆమ్లం + లోహం → లవణం + హైడ్రోజన్. - పై కృత్యాన్ని H2SO4, HNO3 వంటి ఆమ్లాలతో నిర్వహించండి.
- సజల HNO3 హైడ్రోజన్ వాయువును విడుదల చేయదు.
నిర్ధారణ : ఆమ్లాలు, లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
కృత్యం – 3
ప్రశ్న 4.
జింక్ లోహం NaOHతో రసాయన చర్యను కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
క్షారాలు, లోహాలతో చర్యను తెలిపే ఒక కృత్యాన్ని వ్రాయండి.
(లేదా)
క్షారాలకు, లోహాలను కలిపిన అవి H2 వాయువును విడుదల చేయునని చూపు కృత్యం వివరించుము.
జవాబు:
ఉద్దేశం : క్షారాలు లోహాలతో చర్య.
పరికరాలు :
పరీక్షనాళిక, వాయువాహక నాళం, గాజు తొట్టె, కొవ్వొత్తి, సబ్బు నీరు, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, జింక్ ముక్కలు, ఒంటి రంధ్రపు రబ్బరు బిరడా, స్టాండు.
విధానం :
- శుభ్రపరచిన ఒక ఖాళీ పరీక్షనాళికలో జింక్ ముక్కలను తీసుకొని 10 మి.లీ. NaOH ద్రావణాన్ని కలపండి. పరీక్ష నాళికను వేడి చెయ్యండి.
- పరీక్ష నాళిక నుండి వెలువడే వాయువును వాయు వాహక గొట్టం ద్వారా సబ్బు నీటిలోకి పంపండి.
- ఏర్పడ్డ వాయుబుడగల వద్దకు వెలుగుతున్న కొవ్వొత్తిని తీసుకొని వస్తే ‘టప్’మనే శబ్దం రావడం గమనించవచ్చు.
- ఈ కృత్వంలో వెలువడిన వాయువు హైడ్రోజన్ (H2) అని మీరు గుర్తిస్తారు.
- ఏర్పడిన లవణం సోడియం జింకేటి. ఈ కృత్యంలో జరిగిన రసాయన చర్యను ఈ కింది విధంగా రాయవచ్చు.
2NaOH + Zn → Na2ZnO2 + H2 - ఇటువంటి రసాయన చర్యలు అన్నీ లోహాలతో సాధ్యం కావు.
కృత్యం – 4
ప్రశ్న 5.
సోడియం కార్బొనేట్లు, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్లు, ఆమ్లాలతో చర్య జరిపి CO2, నీటిని విడుదల చేస్తాయి. నిరూపించండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
రెండు పరీక్షనాళికలు, సోడియం కార్బొనేట్, సోడియం బై కార్బొనేట్. రెండు రంధ్రాలు గల రబ్బరు బిరడా, థిసిల్ గరాటు, వాయు వాహక నాళం, స్టాండు.
- రెండు పరీక్షనాళికలను తీసుకొని వాటిపై A మరియు రబ్బరు బిరడా B అక్షరాలను రాసిన కాగితాలు అతికించండి.
- A పరీక్ష నాళికలో 0.5 గ్రా|| సోడియం కార్బొ నేట్ ను, B పరీక్షనాళికలో 0.5 గ్రా|| సోడియం బైకార్బొనేట్ ను తీసుకోండి.
- రెండు పరీక్ష నాళికలకు 2 మి.లీ. చొప్పున సజల HCl ద్రావణాన్ని కలపండి.
- రెండు పరీక్షనాళికలలో నుండి వెలువడిన వాయువులను వేర్వేరుగా సున్నపుతేట ద్వారా పటంలో చూపినట్లు పంపి మీ పరిశీలనలు నమోదు చెయ్యండి.
- ఈ కృత్యాలలో జరిగిన చర్యలను ఈ కింది విధంగా రాయవచ్చు.
Na2CO3 + 2HCl → 2Nacl + H2O + CO2
NaHCO3 + HCl → NaCl + H2O + CO2 - పై కృత్యం నుండి అన్నీ లోహకార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆయా లోహలవణాలతో పాటు CO2 వాయువును మరియు నీటిని ఏర్పరుస్తాయని మీరు నిర్ధారించగలరు.
- పై రసాయన చర్యల సాధారణ రూపాలను ఈ విధంగా రాయవచ్చు.
- లోహ కార్బొనేట్ + ఆమ్లం → లవణం + CO2 + నీరు
- లోహ హైడ్రోజన్ కార్బొనేట్ + ఆమ్లం → లవణం + CO2 + నీరు
కృత్యం – 5 తటస్థ చర్యలు
ప్రశ్న 6.
తటస్థీకరణ చర్యలు అనగానేమి? ఒక కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపినపుడు సూచికరంగులో జరుగు మార్పును తెలుపు కృత్యంను వ్రాయుము.
జవాబు:
క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు. సాధారణంగా తటస్థీకరణ చర్యను ఈ కింది విధంగా రాయవచ్చు.
ఆమ్లం + క్షారం → లవణం + నీరు
ఆమ్లం – క్షారం తటస్థీకరణ చర్య :
- శుభ్రపరచిన పరీక్షనాళికలో 2 మి.లీ. సజల NaOH ద్రావణాన్ని తీసుకొని దానికి ఒక చుక్క ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని కలపండి. ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది.
- ఈ రంగు ద్రావణానికి సజల HCl ద్రావణాన్ని చుక్కలుగా కలుపుతూ మార్పులను గమనించండి. ద్రావణం రంగు పోవడం గమనించవచ్చు. ఈ మిశ్రమానికి మరలా ఒకటి లేదా రెండు చుక్కలు NaOH ను కలపండి.
- ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది.
- పై కృత్యంలో పరీక్షనాళికలోని ద్రావణానికి HCl ద్రావణాన్ని కలిపినపుడు ఆ ద్రావణం పింక్ రంగును కోల్పోతుంది.
- దీనికి కారణం ద్రావణంలోని HClతో NaOH పూర్తిగా చర్యనొందడం. ఈ చర్యలో క్షారం యొక్క ప్రభావం ఆమ్లం చేత తటస్థీకరించబడుతుంది.
- ఈ స్థితిలో ఉన్న ద్రావణానికి కొన్ని చుక్కల NaOH ద్రావణంను కలిపితే ఆ ద్రావణం తిరిగి క్షార లక్షణాన్ని పొంది మరలా పింక్ రంగులోనికి మారుతుంది.
NaOH + HCl → Nacl + H2O
కృత్యం – 6
ప్రశ్న 7.
లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
లోహ ఆక్సైడ్లు, ఆమ్లంతో చర్య జరిపిన అది ఒక తటస్థీకరణ చర్య అని కృత్యం ద్వారా తెలుపుము.
జవాబు:
ఆమ్లాలతో లోహ ఆక్సైడ్ చర్య :
- కొద్ది పరిమాణంలో కాపర్ ఆక్సెడ్ ను గాజు బీకరులో తీసుకోండి.
- దీనిని గాజు కడ్డీతో కలియబెడుతూ నెమ్మదిగా HCl ఆమ్లాన్ని కలపండి. మార్పులను పరిశీలించండి. ద్రావణపు రంగును నమోదు చెయ్యండి.
- బీకరులో గల కాపర్ ఆక్సెడ్, సజల HCl లో కరుగుతుందని, ద్రావణపు రంగు నీరు నీలి – ఆకుపచ్చ రంగులోకి మారుతుందని మీరు గమనించండి. ఈ చర్యలో కాపర్ క్లోరైడ్ ఏర్పడటమే ఈ మార్పునకు కారణం.
లోహ ఆక్సెడ్ + ఆమ్లం → లవణం + నీరు - పై చర్యలో లోహ ఆక్సెడ్ ఆమ్లంతో చర్య జరిపి నీటిని, లవణాన్ని ఇస్తుంది.
- ఆమ్ల, క్షారాల మధ్య చర్య వలన లవణం, నీరు ఏర్పడే చర్యను పోలి ఉంటుంది.
- రెండు చర్యలలోనూ నీరు, లవణాలను క్రియాజనకాలుగా పొందుతాం. లోహ ఆక్సెలు, లోహ హైడ్రైడులు ఆమ్లంతో చర్యజరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి.
- కావున లోహ ఆక్సెలు, లోహ హైడ్రైడుల వలె క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని మనం నిర్ధారించవచ్చు.
కృత్యం – 8
ప్రశ్న 8.
ఆమ్లాలు జలద్రావణంలో మాత్రమే అయాన్లను ఏర్పరుస్తాయా? కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
జల ద్రావణాలలో ఆమ్లాలు, అయానులను ఉత్పత్తి చేస్తాయా? నిరూపించుము.
జవాబు:
- 1 గ్రా|| ఘన NaClను శుభ్రపరచి పొడి పరీక్షనాళికలోకి తీసుకోండి.
- కొద్దిగా గాఢ H2SO4 ఆమ్లాన్ని పరీక్ష నాళికలోని NaClకు కలపండి.
- ఈ చర్యను సమీకరణం ద్వారా రాస్తే ఈ కింది విధంగా ఉండును.
- వెలువడిన వాయువును ముందుగా పొడి నీలిలిట్మస్ కాగితంతోనూ, పిదప తడి నీలిలిట్మస్ కాగితంతోనూ పరీక్షించండి.
- పొడి HCl వాయువు ఆమ్లంకాదని మీరు నిర్ధారించగలరు. ఎందుకంటే పొడిలిట్మస్ కాగితం రంగులో ఎటువంటి – మార్పూ లేదని మీరు గమనిస్తారు.
- కానీ సజల HCl ద్రావణం ఒక ఆమ్లం. ఎందుకంటే తడిగా ఉండే నీలిలిట్మస్ కాగితం ఎరుపురంగులోనికి మారుతుంది.
నిర్ధారణ : - ఈ ప్రయోగాన్ని బట్టి నీటి సమక్షంలో HCA వియోగం చెంది హైడ్రోజన్ అయాన్ ఏర్పరుస్తుంది. కానీ నీరు లేనప్పుడు వియోగం చెందదు, అయానులను ఏర్పరచదు అని మనకు తెలుస్తుంది.
- నీటిలో HCl ఈ విధంగా వియోగం చెందుతుంది.
HCl + H2O → H2O+ + Cl– (జల ద్రావణం)
కృత్యం – 9
ప్రశ్న 9.
ఆమ్లాలు, క్షారాలు నీటిలో కలిపినపుడు ఏం జరుగుతుంది? కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
ఆమ్లంను నీటిలో కరిగించుట ఒక ఉష్ణమోచక చర్యా (లేక) ఉష్ణగ్రాహక చర్యా అని నిరూపించు ప్రయోగంను వ్రాయుము.
జవాబు:
- ఒక పరీక్ష నాళికలో 10 మి.లీ. నీటిని తీసుకోండి.
- కొన్ని చుక్కలు గాఢ H2SO4 ను పరీక్షనాళికలోని నీటికి కలపండి. పరీక్షనాళికను నెమ్మదిగా కదపండి.
- ఇదే కృత్యాన్ని H2SO4 కు బదులుగా NaOH పలుకులను ఉపయోగించి నిర్వహించండి. మీ పరిశీలనలు నమోదు చెయ్యండి.
- ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఉష్ణమోచక చర్య. గాఢ ఆమ్లాలు, క్షారాలను కలిగి ఉండే పాత్రలపై ఉండే హెచ్చరిక గుర్తు
గమనిక :
- గాఢ HNO3 లేదా H2SO4 ఆమ్లాన్ని నీటిలో కలిపినపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఆమ్లాన్ని కొద్దికొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలియబెట్టాలి.
- అలా కాకుండా నీటిని గాఢ ఆమ్లానికి ఒక్కసారిగా కలిపినట్లయితే వెలువడే అధిక ఆమ్లాలు-క్షారాలు-లవణాలు వలన ప్రమాదాలు సంభవించవచ్చు.
కృత్యం – 10
ప్రశ్న 10.
ఆమ్లము, క్షారాలలో బలమైన, బలహీనమైన ఆమ్ల, క్షారాలను ఏ విధంగా గుర్తిస్తావు ? కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
- A, B అనే రెండు బీకరులను తీసుకోండి.
- A బీకరులో సజల CH3COOH ను, B బీకరులో సజల HCl ను తీసుకోండి.
- రెండు వేర్వేరు రంగులు గల విద్యుత్ తీగలకు గ్రాఫైట్ కడ్డీలను కలపండి. వీటిని 100 మి.లీ. గాజు బీకరులో పటంలో చూపినట్లు అమర్చండి. ఇదేవిధమైన అమరికను రెండవ (B) గాజు బీకరు కూడా అమర్చండి.
- రెండు ద్రావణాల ద్వారా ఒకేసారి విద్యుత్ పంపి పరిశీలించండి.
- HCl ద్రావణాన్ని ఉపయోగించినపుడు బల్బు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది.
- CH3COOH ద్రావణాన్ని ఉపయోగించినపుడు బల్బు తక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది.
- దీనినిబట్టి HCl ద్రావణంలో ఎక్కువ అయానులుఉన్నాయని, ఎసిటిక్ ఆమ్ల ద్రావణంలో తక్కువ అయానులు ఉన్నాయని తెలుస్తుంది.
- HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు ఉన్నాయంటే ఎక్కువ H3O+ అయాన్లు ఉన్నాయని తెలుస్తుంది. కావున ఇది బలమైన ఆమ్లం.
- అదే విధంగా ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ H3O+ అయానులు ఉంటాయి. కాబట్టి ఇది బలహీన ఆమ్లం.
కృత్యం – 11
ప్రశ్న 11.
పట్టికలో ఇవ్వబడిన ద్రావణాల pH విలువలను లిట్మస్ పేపర్‌ను ఉపయోగించి కనుక్కోండి.
జవాబు:
కృత్యం – 12
ప్రశ్న 12.
ఏంటాసిడ్ ఏ విధంగా పని చేస్తుందో కృత్యం ద్వారా వివరించుము.
జవాబు:
- బీకరులో కొద్దిగా సజల HClను తీసుకొని దానికి 2 లేదా 3 చుక్కలు మిథైల్ ఆరెంజ్ సూచికను కలపండి.
- ద్రావణం రంగును ఎరుపుగా నమోదు చెయ్యండి.
- ద్రావణానికి జెలూసిల్ లేదా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా పౌడరును కలపండి.
- ద్రావణంలోని ఎరుపురంగు పోయి రంగులేని ద్రావణం ఏర్పడుతుంది.
- దీనికి కారణం ద్రావణంలోని ఆమ్ల గుణాన్ని ఏంటాసిడ్ అనే క్షారం తటస్థీకరిస్తుంది.
కృత్యం – 13
ప్రశ్న 13.
మీ ప్రాంతంలో మొక్కల పెరుగుదల కోసం ఉపయోగించే మట్టి pH విలువలను నీవెలా నిర్ధారిస్తావు?
జవాబు:
- కొద్ది పరిమాణంలో మట్టిని ఒక పరీక్ష నాళికలోనికి తీసుకొని దానికి 5 మి.లీ. నీటిని కలపండి.
- పరీక్షనాళిక మూతిని మూసి నాళికను కుదపండి.
- ద్రావణాన్ని వడపోయండి. అవక్షేపాన్ని మరొక పరీక్ష నాళికలోకి తీసుకోండి.
- సార్వత్రిక సూచిక లేదా pH పేపరు సహాయంతో అవక్షేపం యొక్క pHను పరీక్షించండి.
కృత్యం – 14
ప్రశ్న 14.
ఈ కింది లవణాల సాంకేతికాలను రాయండి.
జవాబు:
పై లవణాలు ఏ ఆమ్ల, క్షారాల కలయిక వలన ఏర్పడును?
ప్రశ్న 15.
లవణాల pH విలువను లెక్కించుము.
జవాబు:
- NaCl, AlCl3, CuSO4, CH3COONa, NH4Cl, NaHCO3, NaCO3, 10H2O లవణాలను సేకరించండి.
- వాటిని విడివిడిగా స్వేదన జలంతో కరిగించి ఏర్పడిన ద్రావణం యొక్క స్వభావాన్ని లిట్మస్ కాగితాల సహాయంతో తటస్థం
- pH కాగితంను ఉపయోగించి వాటి pH విలువలను కూడా నమోదు చెయ్యండి.
- వాటి pH విలువల ఆధారంగా వానిని ఆమ్లాలు, క్షారాలు, తటస్థ లక్షణం గల పదార్థాలుగా వర్గీకరించండి.
- ఆయా లవణాలు ఏర్పడటానికి ఉపయోగించిన ఆమ్ల – క్షార జంటలను గుర్తించండి.’ పట్టికను పూర్తి చెయ్యండి.