SCERT AP 10th Class Social Study Material Pdf 11th Lesson ఆహార భద్రత Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Social Solutions 11th Lesson ఆహార భద్రత
10th Class Social Studies 11th Lesson ఆహార భద్రత Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరి చేయండి. (AS1)
* ఆహార భద్రత సాధించటానికి ఆహార ఉత్పత్తిని మాత్రమే పెంచితే సరిపోతుంది.
* ఆహార భద్రత సాధించటానికి ఒకే పంటసాగును ప్రోత్సహించాలి.
* తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో తక్కువ కాలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది.
* ఆహార భద్రతను సాధించటంలో చట్ట సభల ప్రాధాన్యత ఎక్కువ.
* పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచెయ్యటానికి ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించవచ్చు.
జవాబు:
- ఆహార భద్రత సాధించటానికి ఆహార ఉత్పత్తి ఒక్కటే పెంచితే సరిపోదు; ఉత్పత్తితో పాటు ఆహార ధాన్యాల లభ్యతా, ఆహార అందుబాటు కూడా ముఖ్యం.
- ఆహార భద్రత సాధించటానికి ఒకే పంటసాగును కాక ఇతర పంటల దిగుబడి కూడా పెంచేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకు వరి, గోధుమలతో పాటు జొన్న, నూనెగింజల దిగుబడులు కూడా పెరుగుతున్నాయి.
- తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో ‘తక్కువ కాలరీల వినియోగం’ ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న (పేద) ప్రజలకు కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది. ఆహార ధాన్యాల కొనుగోలు, వినియోగం తక్కువ ఉంటుంది. ఆ ఆహారం వల్ల వారు పొందే కాలరీలు కూడా సహజంగా తక్కువగానే ఉంటాయి.
- ఆహార భద్రతను సాధించటంలో చట్ట సభలతో పాటు న్యాయస్థానాల ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మధ్యాహ్న భోజన పథకం అమలుపై న్యాయ వ్యవస్థ ఆదేశాలు.
- పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచెయ్యటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ కంటే ఎక్కువగా అంగన్‌వాడీలు (ICDS), మధ్యాహ్న భోజన పథకమును ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న 2.
గ్రామీణ ప్రాంతాలలో కాలరీల వినియోగం గత కొద్ది కాలంగా ……. 2004-05 లో తలసరి సగటు కాలరీల వినియోగం అవసరమైన దానికంటే ….. ఉంది. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకు కనీసం 2100 కాలరీలు అవసరం. పటణ ప్రాంతంలో 2004-05 లో కాలరీల అవసరం, వినియోగం మధ్య అంతరం ……… (AS1)
జవాబు:
తగ్గుతోంది. తక్కువగా, పెరిగింది.
ప్రశ్న 3.
ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అనుకుందాం. ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? (AS4)
(లేదా)
ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినపుడు, ఆహార ధాన్యాల లభ్యత పెరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
ఆహార ధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు :
- ఆహార ధాన్యాల లభ్యత పెంచటానికి ‘దిగుమతులు’ ఒక ముఖ్య మార్గం.
- ఆహార లభ్యతను పెంచటానికి ప్రభుత్వ నిల్వల (బఫర్ నిల్వలు)’ ను ఉపయోగించుకోవటం మరో ముఖ్యమైన మార్గం. (FCI ధాన్యాగారాలలోని నిల్వలను ఉపయోగించుకోవాలి.)
- ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల లభ్యతను అందుబాటులోకి తేవాలి.
- నల్ల బజారు (Black Market), అక్రమ నిల్వలను అరికట్టాలి.
- ఎగుమతులను నిషేధించుట మరియు అవసరమైన ఆంక్షలు విధించుట. (ధరలను అదుపులో ఉంచాలి.)
- తర్వాతి సంవత్సరంలో మంచి దిగుబడులు సాధించటానికి అవసరమైన చర్యలు చేపట్టడం చేయాలి.
ఉదా : హరిత విప్లవం
ప్రశ్న 4.
బరువు తక్కువగా ఉండటానికి, ఆహార అందుబాటుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయటానికి మీ ప్రాంతం నుంచి ఒక ఊహాజనిత ఉదాహరణను ఇవ్వండి. జ. సరిపడా ఆహారం ఉంటే ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కానీ, తక్కువ ఎత్తుగానీ ఉండరు. దీనికి ఉదాహరణ, మా గ్రామం ప్రాంతంలోని సంఘటన. (AS4)
జవాబు:
- మా ప్రాంతంలోని ప్రజా వైద్యశాలకు తక్కువ బరువు ఉన్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారు.
- అక్కడి డాక్టరు ఈ పరిస్థితిని వివరించారు.
- కుటుంబానికి నెలకు రేషను దుకాణం ద్వారా లభించే ఆహార ధాన్యాలు అయిదుగురు ఉన్న కుటుంబంలో 11 రోజులకు సరిపోతాయి.
- మిగిలిన రోజులకు వాళ్లు తాము పండించిన ఆహారంపైన లేదా మార్కెట్లో కొన్న దానిపైన ఆధారపడాలి.
- వ్యవసాయ కూలీల, ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దె, కరెంటు ఇతరత్రా అవసరాలకు ఖర్చు అయిపోతుంది. కాబట్టి వీరు రిటైల్ మార్కెట్లో ఆహారధాన్యాల కొనుగోలు చేయలేకపోతున్నారు.
- ఈ విధంగా సరిపడినంత ఆహారం తీసుకోలేకపోతున్నారు, కనుక వీరు తీవ్ర శక్తి లోపం (BMI-18.5) కలిగి ఉన్నారు. (తక్కువ బరువు సమస్య తీవ్రంగా ఉంది.)
- అధిక శాతం ప్రజలు వారికి కావల్సిన దానికంటే తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు, కారణం పేదరికం వల్ల ఆహారం అందుబాటులో లేకపోవడమేనని నేను గుర్తించాను.
ప్రశ్న 5.
వారం రోజుల మీ కుటుంబ ఆహార అలవాట్లను విశ్లేషించండి. దాంట్లోని పోషకాలను వివరించటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఆధారం:
ప్రశ్న 6.
ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహార భద్రతకు మధ్యగల సంబంధాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతల మధ్య సంబంధాన్ని వివరించుము.
జవాబు:
ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహార భద్రతకు మధ్య అవినాభావ సంబంధముందని చెప్పవచ్చు.
- రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేటంత ఆహార పదార్థాల ఉత్పత్తి కచ్చితంగా ఉండటం ఆహార భద్రతకు ముఖ్యమైన అవసరం.
- ఆహార ఉత్పత్తి పెరిగినట్లయితే దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతుంది.
- ఆహార లభ్యత పెరిగినట్లయితే ప్రజలకు ఆహారం అందుబాటులో ఉంటుంది.
- ఆహారం అందుబాటులో ఉంటే ఆహార భద్రత సాధించినట్లే.
- ఆహార ఉత్పత్తి పెరిగితే బఫర్ నిల్వలు పెరుగుతాయి; ప్రజాపంపిణీ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుంది, కొనుగోలు శక్తి తద్వారా వినియోగించే స్థితి పెరుగుతుంది. పోషకాహార స్థాయి పెరుగుతుంది. ఈ విధంగా ఆహార భద్రత సమర్ధవంతంగా కల్పించవచ్చు.
ప్రశ్న 7.
“ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు.” ఈ వ్యాఖ్యానానికి మద్దతుగా వాదనలు పేర్కొనండి. (AS1)
(లేదా)
“ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదనే” వాక్యాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:
- ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు ప్రధానమయినవి. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించేవి చౌకధరల దుకాణాలు.
- భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి, ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
- చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎక్కువ శాతమే ఉంది.
- అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే శక్తి పెంచుటకుగాను (ధరల యంత్రాంగం ద్వారా) ధరలను అదుపులో ఉంచుతుంది. తద్వారా ఆహార పదార్థాల అందుబాటు గుణాత్మకంగాను, పరిమాణాత్మకం గాను పెరుగుతుంది.
- పేదలకు, అత్యంత పేదలకు సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తూ (PDS ద్వారా) వారికి ఆహార భద్రత కల్పిస్తుంది.
- గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75 శాతానికి, పట్టణ జనాభాలో 50 శాతానికి ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది.
ప్రశ్న 8.
ఆహార భద్రత గురించి పై పోస్టరు ఏమి తెలియజేస్తున్నది? (AS1)
జవాబు:
ఆహార భద్రత గురించి పై పోస్టరు మనలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారని, ఇంక ఇలా ఉండాల్సిన అవసరం లేదని తెలియచేస్తోంది. ఆ ఒక్కరూ కూడా ఆహారాన్ని తీసుకొని హాయిగా నిద్రిస్తారని తెలియచేస్తోంది.
ప్రశ్న 9.
ఆహార భద్రత గురించి ఇటువంటిదే ఒక పోస్టరు తయారుచెయ్యండి. (AS6)
జవాబు:
ఆధారం:
10th Class Social Studies 11th Lesson ఆహార భద్రత InText Questions and Answers
10th Class Social Textbook Page No.147
ప్రశ్న 1.
కింది వాక్యాలను చదివి హెక్టారుకు వరి, గోధుమల దిగుబడులు ఎలా ఉన్నాయో వివరించండి.
…………….., ……….. పంటల దిగుబడులు వరి, గోధుమలతో పోలిస్తే ఎప్పుడూ తక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పంటల దిగుబడులు మెల్లగా పెరుగుతున్నాయి.
జవాబు:
జొన్న, నూనెగింజలు.
10th Class Social Textbook Page No.147
ప్రశ్న 2.
దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి ఏ అంశాలు దోహదం చేశాయి?
జవాబు:
దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి దోహదం చేసిన అంశాలు
- మేలు జాతి, సంకర జాతి విత్తనాలు వాడటం (ఉదా : ‘SRI’ వరి)
- నాణ్యమైన పురుగు మందులు వాడుట ద్వారా సస్యరక్షణ చేపట్టడం.
- విస్తృతంగా రసాయన ఎరువులను వాడటం. (ఉదా : పొటాషియం, నైట్రోజన్ ఎరువులు)
- సాగునీటి వసతులను విస్తరించటం. (ఉదా : కాలువలు, గొట్టపు బావుల తవ్వకం)
- విత్తుటకు, దున్నుటకు, పంట కోత మొ||న వాటికి యంత్రాల వాడకం. (ఉదా : ట్రాక్టర్, కంబైన్డ్ హార్వెస్టర్)
10th Class Social Textbook Page No.152
ప్రశ్న 3.
దేశంలో అధిక శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యటం సరైనదేనా?
జవాబు:
సరియైన విధానం కాదు, దేశంలో అధిక ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యడం సరికాదు.
- ఎగుమతులు పెరిగినట్లయితే ఆహార ధాన్యాల ధరలు పెరిగి, పేదలకు ఆహార అందుబాటు ఇంకా దూరమవుతుంది.
- ఆహార ధాన్యాల నిల్వలు పెంచకుండా, ఎగుమతులు చేసినట్లయితే PDS ద్వారా పంపిణీకి ధాన్యాల కొరత ఏర్పడుతుంది.
- కరవుకాటకాలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినట్లయితే ఆహార ధాన్యాల దిగుబడి తగ్గుతుంది, లభ్యత, అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అవసరమైతే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి.
10th Class Social Textbook Page No.152
ప్రశ్న 4.
క్రింది రేఖాచిత్రపటాన్ని పరిశీలించండి.
రేఖాచిత్రపటం : 2009-10 లో బియ్యం, గోధుమల కొనుగోళ్ళలో రేషను దుకాణాల నుంచి కొన్న శాతం
ఖాళీలను పూరించండి :
అఖిల భారతానికి ప్రజల మొత్తం వినియోగంలో …….. (1)……… శాతం బియ్యం , ……… (2)…….. శాతం గోధుమ చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. దీని అర్థం ప్రజలు తమ ఆహార ధాన్యాల అవసరంలో అధిక భాగం …. (3)…… నుంచి కొనుక్కోవాలి. అయితే …… (4)…………….. (5)…….. రాష్ట్రాలలో పరిస్థితి బాగుంది. …… (6)…….. ……(7)……… …. (8)……. రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలను నామమాత్రంగా తీరుస్తోంది.
జవాబు:
- 39,
- 28,
- రిటైల్ మార్కెట్,
- తమిళనాడు,
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
- బీహార్,
- రాజస్థాన్,
- పంజాబ్.
10th Class Social Textbook Page No.155
ప్రశ్న 5.
బడిలో చేరే వయస్సు రాని పిల్లలకు పోషకాహార శాస్త్రజ్ఞులు మూడు చార్జులను ఉపయోగిస్తారు. ఈ మూడు వేరు వేరు సూచికలు మనకు పిల్లల పోషకాహార స్థాయికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాయి. వాటిని కింద ఇచ్చాం.
జవాబు:
10th Class Social Textbook Page No.155
ప్రశ్న 6.
ఈ గణాంకాల నుంచి ఎటువంటి నిర్ధారణలకు వస్తారు ? ఒక పేరా రాయండి.
జవాబు:
ఈ గణాంకాల నుంచి నిర్ధారణలకు వచ్చిన అంశాలు :
- 45% మంది పిల్లలు వయస్సుకు తగ్గ బరువు ఉండటం లేదు.
- 41% మంది పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు లేరు.
- 21% మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. అంటే సరైన BMI కలిగి లేరు.
- ఎక్కువ మంది పిల్లలు పోషకాహార లోపం కలిగి ఉన్నారు.
- చాలా మంది పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంది.
- అంగన్‌వాడీ (ICDS) లాంటి పథకాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడాలి.
10th Class Social Textbook Page No.146
ప్రశ్న 7.
పాఠం 9 (రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ) లోని “భూమి, ఇతర సహజ వనరులు” అనే భాగాన్ని మళ్ళీ చదవండి. భూమి నుంచి పంట ఉత్పత్తి పెంచటానికి ఏ ఏ విధానాలు ఉన్నాయి?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉందని మనకు తెలుసు, కాబట్టి భూమి నుంచి పంట ఉత్పత్తి పెంచటం ముఖ్యం.
- హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచటానికి అవసరమైన ఉత్పాదకాలను (ఉదా : HYV విత్తనాలు) సక్రమంగా వినియోగించుకోవాలి.
- సాగునీటి వసతులను (సక్రమ జల నిర్వహణ ద్వారా) పెంచటం. అయితే ఈ కీలక వనరు. అందరికీ అందేలా పంచుకునే పద్ధతిలో వినియోగించాలి. (ఉదా : గొట్టపు బావులు త్రవ్వడం).
- వర్షాభావ పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తటం, వర్షపు నీటిని నిల్వ చేయటం, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలి.
- సరియైన ‘సస్య రక్షణ’ చర్యలు చేపట్టాలి. ఉదా : నాణ్యమైన పురుగు మందులు వాడుట.
- అవసరమైన మేర ‘ఎరువుల వాడకం చేపట్టడం. ఉదా : రసాయన, సేంద్రియ ఎరువులను వాడుట.
- నేల సారాన్ని పెంచి, దిగుబడులను పెంచే బహుళ పంటల నమూనాను అనుసరించాలి. అంటే ఒకే పంట పొలంలో – గోధుమ, సజ్జ, బంగాళదుంప మొ||న పంటలను ఒకేసారి పండించటం.
- కంబైన్డ్ హార్వెస్టర్ లాంటి ఆధునిక యంత్రాలను వాడుట ద్వారా పంటకాలము ఆదా అవుతుంది. నూర్పిడి సమయంలో జరిగే ధాన్యాల వృథాను తగ్గిస్తుంది.
10th Class Social Textbook Page No.146
ప్రశ్న 8.
ఇవ్వబడిన రేఖాచిత్ర పటమును పరిశీలించి ఖాళీలను పూరించండి (ప్రతి బిందువు దగ్గర కచ్చితమైన విలువను తెలుసుకోటానికి ‘వై’ అక్షం మీది స్కేలుని ఉపయోగించండి).
ఆహారధాన్యాల ఉత్పత్తి 1970-71 నుండి ……(1)…… కు పెరిగింది. వరి ఉత్పత్తి 1970-71 నాటి 40 మిలియన్ టన్నుల నుండి 2010-11 నాటికి ….. (2)…… మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ 40 ఏళ్ల కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన మరొక ముఖ్యమైన ఆహారపంట …. (3)…… . వరి, గోధుమలతో పోలిస్తే 1970-2011 కాలంలో …..(4)……. ఉత్పత్తి పెరగలేదు. దీనికి కారణం …. (5)……. అయి ఉండవచ్చు.
జవాబు:
1) 2010-11 వరకు
2) 95 3 ) గోధుమ
4) జొన్న, నూనె గింజలు
5) i) ప్రాధాన్యతనివ్వకపోవడం,
ii) వర్షాధార పంటలు కావడం,
10th Class Social Textbook Page No.147
ప్రశ్న 9.
జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలి? చర్చించండి.
జవాబు:
జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలంటే –
- జొన్నను మంచి పోషక ధాన్యంగా వ్యవహరిస్తున్నారు.
- జొన్న పంటను వర్షాధార ప్రాంతాలలో కూడా సాగుచేయవచ్చు.
- నేల, ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా, క్షీణతకు గురికాకుండా చూడటానికి.
- ఆహార భద్రత, ఆహారధాన్యాల అందుబాటు పెంచుటకు.
- పురుగు మందులు, రసాయన ఎరువులు ఎక్కువగా వాడనవసరం లేదు.
- సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా జొన్న పంటను పండించవచ్చు.
- జొన్నలకు మార్కెట్ కూడా బాగా ఉంది. లక్షలాది ప్రజల ప్రధాన ఆహారం జొన్న.
10th Class Social Textbook Page No.148
ప్రశ్న 10.
1971కి చూపించిన విధంగా, 1991, 2011 సంవత్సరాలకు తలసరి సగటు ఆహార ధాన్యాల అందుబాటును లెక్కగట్టండి.
గమనిక : 1 టన్ను = 1000 కిలోలు; 1 కిలో = 1000 గ్రాములు; # = మిలియన్ టన్నులు
* మీరు లెక్కించిన దాని ఆధారంగా ఖాళీలను పూరించండి : 1971 నుంచి 1991 నాటికి తలసరి ఆహారధాన్యాల లభ్యత ………….. (పెరిగింది/తగ్గింది), కానీ 2011లో ఇది ……………. (ఎక్కువ | తక్కువగా) ఉంది. ఇటీవల దశాబ్దాలలో జనాభావృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహారధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం. ………………. చర్యలు చేపట్టాలి.
జవాబు:
గమనిక : 1 టన్ను = 1000 కిలోలు; 1 కిలో = 1000 గ్రాములు; # = మిలియన్ టన్నులు.
మీరు లెక్కించిన దాని ఆధారంగా ఖాళీలను పూరించండి : 1971 నుంచి 1991 నాటికి తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరిగింది (పెరిగింది/తగ్గింది), కానీ 2011లో ఇది తక్కువగా (ఎక్కువ తక్కువగా) ఉంది. ఇటీవల దశాబ్దాలలో జనాభావృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహారధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం ఉత్పత్తి పెంచటం, , దిగుమతులు పెంచటం లాంటి చర్యలు చేపట్టాలి.
10th Class Social Textbook Page No.150
ప్రశ్న 11.
వ్యవసాయ వైవిధ్యీకరణకు సంబంధించిన పదాలు, వాక్యాల కింద గీత గీసి భారతీయ రైతులకు ఇది ఎందుకు అవసరమో వివరించండి.
జవాబు:
భారతీయ రైతులకు వ్యవసాయ వైవిధ్యీకరణ అవసరం; ఎందుకంటే,
- భారతీయ రైతులు ఎక్కువ శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
- ఎక్కువ మంది పేద రైతులే, వారి ఆదాయం పెరగాలంటే ఇది అవసరం.
- అధిక దిగుబడులు పొందడానికి,
- భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాలపై ఆధారపడి ఉంది కనుక వర్షాభావ కాలంలో, వర్షాభావ ప్రాంతంలో ఈ విధమైన వ్యవసాయం ఎంతో అవసరం.
- అల్ప ఉపాధి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత నివారణకు కూడా ఇది ఎంతో అవసరం.
- అల్ప ఆదాయ సన్న, చిన్నకారు రైతులకు ఆహార భద్రత కల్పించుటకు.
10th Class Social Textbook Page No.150
ప్రశ్న 12.
మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన గ్రామంలో వ్యవసాయ వైవిధ్యీకరణను వివరించండి.
జవాబు:
నాకు తెలిసిన ‘బేతపూడి’ గ్రామంలోని వ్యవసాయ వైవిధ్యీకరణ గురించి వివరిస్తాను.
- ఈ గ్రామంలోని అన్ని భూములకు సాగునీటి వసతులు (కాలువలు లేదా బోరుబావులు) ఉన్నాయి.
- ఈ గ్రామంలో వ్యవసాయ పెట్టుబడులకుగాను ఋణసౌకర్యం అందించుటకు బ్యాంక్ సౌకర్యం కలదు.
- ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సాంకేతిక విజ్ఞానం చాలా బాగుంది.
- వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వంటి ఆహార ధాన్యాలతోపాటు ప్రత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు.
- పంటల మధ్య కాలంలో కూరగాయలు పండిస్తున్నారు. బెండ, వంగ, దోస, టమోట పండిస్తున్నారు.
- అంతర్ పంటలుగా ‘కందులు’ (కందిపప్పు) ను పండిస్తున్నారు.
- దాదాపుగా అందరికి 2-3 గేదెలు ఉన్నాయి. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
- గ్రామంలో 4 కంబైన్డ్ హార్వెస్టర్లు, దాదాపు 16 ట్రాక్టర్లు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ జరిగింది.
- వివిధ మార్కెట్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగి ఉన్నది.
సూచన : విద్యార్థులు తాము చూసిన గ్రామం గురించి స్వయంగా రాయగలరు.
10th Class Social Textbook Page No.150
ప్రశ్న 13.
ఎనిమిదవ తరగతిలోని ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చను గుర్తుకు తెచ్చుకోండి. ప్రజాపంపిణీ వ్యవస్థకు, ప్రజల ఆహార భద్రతకు గల సంబంధం ఏమిటి?
(లేదా)
భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఇది ప్రజా పంపిణి వ్యవస్థను అందరికి వర్తింపచేసిన రాష్ట్రాలు కావటము గమనించవలసిన విషయం. ఇవి అందరికి తక్కువ ధరలలో ఆహార ధాన్యాలను అందించాయి. ఇందుకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలు పేదవాళ్ళను గుర్తించి ఆహార ధాన్యాలను పేదలకు, పేదలు కాని వాళ్ళకు వేరు వేరు ధరలకు అమ్మాయి. పేదలలో కూడ అత్యంత పేదలకు కూడ వేరే హక్కులు ఉన్నాయి. వాళ్ళకు అందించే మోతాదు వేరు.
ప్రజాపంపిణీ వ్యవస్థకు, ప్రజల ఆహార భద్రతకు మధ్య గల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)కు, ప్రజల ఆహార భద్రతకు ఎంతో దగ్గరి సంబంధముంది.
- ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
- పేదలకు, అత్యంత పేదలకు సబ్సిడి ధరకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తూ ఆహార పదార్థాల అందుబాటుకు తద్వారా ఆహారభద్రతకు PDS ఎంతో తోడ్పడుతుంది.
- వివిధ పథకాలు (మధ్యాహ్న భోజన పథకం, MNREP, FFW, AAY, ICDS మొ||నవి) ద్వారా పేద ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ ఆహారం అందుబాటులోకి తెస్తుంది.
- ధరలను అదుపులో ఉంచుట ద్వారా అల్ప ఆదాయ వర్గాల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆహార ధాన్యాల అందుబాటు పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా పెరుగుతుంది.
10th Class Social Textbook Page No.153
ప్రశ్న 14.
సమర్థంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రం ఈ పరిస్థితిని ఎలా సరిదిద్దగలదు ? చర్చించండి.
జవాబు:
మన దేశంలో మొత్తం మీద 16% పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి ఉంది. మొత్తంగా 45% పిల్లలు తక్కువ బరువు ఉన్నారు. 1-3 సం||రాల పిల్లలతో పోలిస్తే, 3-5 సం||రాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. సమరంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రం ఈ పరిస్తితిని చాలా వరకు సరిదిద్దగలదు.
- అంగన్‌వాడీల్లో 1-5 సం||రాల పిల్లలు ఎక్కువగా ఉంటారు, వీరు శిక్షణ పొందిన ఆయాల సంరక్షణలో ఉంటారు.
- ప్రభుత్వం పౌష్టికాహారం (పోషకాహారం)ను అంగన్‌వాడీల ద్వారానే సరఫరా చేస్తుంది.
- పిల్లల యొక్క ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు పరీక్షించి, తగుచర్యలు తీసుకుంటారు.
- పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సూచనలు అందించబడతాయి, వ్యాక్సినేషన్ ఉంటుంది.
- ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వలన పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
- అంగన్‌వాడీ కేంద్రంలో సరఫరా చేయు గ్రుడ్లు, ప్రోటీన్స్ (సోయాబీన్స్ పొడి), సమతౌల్య ఆహారం పొడి మొ||నవి పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.