AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

SCERT AP 10th Class Social Study Material Pdf 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విభిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. (AS1)
ఎ) స్వాతంత్ర్య పోరాట అనుభవాల నుంచి భారత రాజ్యాంగం ఏర్పడింది.
బి) అప్పటికే ఉన్న రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగం రూపొందింది.
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.
డి) దేశాన్ని పాలించటానికి రాజ్యాంగ సూత్రాలను, అంశాలను పేర్కొంది.
జవాబు:
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిదిద్దండి : (AS1)
ఎ) రాజ్యాంగ సభ చర్చలలో కొన్ని అంశాలపై అందరూ ఒకటే భావాన్ని వ్యక్తం చేశారు.
బి) రాజ్యాంగ నిర్మాతలు దేశంలోని కొన్ని ప్రాంతాలకే ప్రాతినిధ్యం వహించారు.
సి) రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అది అవకాశం కల్పించింది.
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను కూడా సవరించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
జవాబు:
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో సవరించకూడదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. కావున రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో మార్చకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 3.
రాజ్యాంగ సభ చర్చల నుంచి భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలను వివరించండి. (AS1)
జవాబు:
సమాఖ్య సూత్రాలు:

  1. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి.
  2. ఆ రాష్ట్రాలకు సర్వసత్తాక అధికారాలు ఉంటాయి.
  3. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ చేస్తుంది.

ఏకీకృత సూత్రాలు :

  1. కేంద్ర ప్రభుత్వం సర్వసత్తాకమైనది.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు ఉండకపోవడం.
  3. ఒకే ప్రభుత్వం ఉంటుంది. కావున అధికార విభజన ఉండదు.

ప్రశ్న 4.
ఆనాటి రాజకీయ ఘటనలను రాజ్యాంగం ఎలా ప్రతిబింబిస్తోంది ? స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి ఇంతకు ముందు అధ్యాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. (AS1)
జవాబు:
ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్పూర్తినిచ్చాయి.

రాజ్యాంగంలో ప్రతిబింబించే వివిధ సంఘటనలు :

  1. దేశంలో అధికభాగం రాచరిక పాలనలో ఉండేది. సామాజిక, సాంస్కృతిక వైవిధ్యతలే కాకుండా ధనిక-పేద మధ్య, అగ్ర-కింది కులాల మధ్య, స్త్రీ-పురుషుల మధ్య చాలా తేడాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మన రాజ్యాంగంలో అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి.
  2. దీని ప్రకారం చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా “సార్వజనీన వయోజన ఓటు హక్కు” ద్వారా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది.
  3. ఫ్రెంచి విప్లవం ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంను, అమెరికాలోని హక్కుల చట్టంను, రష్యా, చైనాలలో సోషలిస్ట్ విప్లవం ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయం వంటివి మన రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణం అయ్యాయి. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను పొందుపరుచుకున్నాం.
  4. పాశ్చాత్య ఉదార సంస్థలైన గణతంత్ర, ప్రజాస్వామ్య, ‘లౌకిక, సమాఖ్య, స్వతంత్ర్య న్యాయశాఖల వంటి సంస్థలను, ఎంతోకాలం వీటిని కొనసాగించిన బ్రిటిష్ పాలన మన దేశానికి తీసుకొచ్చింది.
  5. గాంధేయ ,తత్వాలు ఆదేశ సూత్రాల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.
  6. భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడినప్పటికి ఇంకా భారతదేశంలో అనేక మతాల ప్రజలు ఉన్నందున భారతదేశంలో “లౌకిక” అనే భావనను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినారు.
  7. భారతదేశంలో అల్పసంఖ్యాక ప్రజల రక్షణ కొరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచినారు.
  8. రైతులు, భూస్వాములకు వ్యతిరేకంగా వారి హక్కుల కొరకు చేసిన ఉద్యమాల నేపథ్యంగా ‘సామ్యవాదం’ అనే అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
రాజ్యాంగ సభను సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో ఎన్నుకుని ఉంటే రాజ్యాంగాన్ని రూపొందించటంలో అది ఎటువంటి ప్రభావాన్ని చూపించి ఉండేది? (AS1)
జవాబు:

  1. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు, రాజసంస్థానాలకూ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యం కల్పించారు. అదే విధంగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. అల్పసంఖ్యాక వర్గాల నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి కూడా సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. చైతన్యవంతులైనటువంటి నాయకులు రాజ్యాంగ సభకు ఎన్నికవడం మూలంగా, దేశంలోని ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ ప్రజలందరిని పరిగణనలోకి తీసుకొని ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు.
  2. రాజ్యాంగ సభకు, వయోజన ఓటుహక్కు ద్వారా సభ్యులను ఎన్నుకున్నట్లయితే నిష్ణాతులైన, చైతన్యవంతులైన వారు ఎన్నిక కాకపోవచ్చు. తద్వారా అందరి ప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం తయారై ఉండేది కాదు.
  3. వయోజన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మరియు వయోజనులందరు ఎన్నికలో పాల్గొనే అవకాశం వచ్చేది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 6.
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి చిన్న వ్యాసం రాయంది. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు :
1) సార్వభౌమత్వం :
భారతదేశం అంతర్గతంగా, బాహ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కలిగి ఉన్నదని తెల్పుతున్నది.

2) సామ్యవాదం :
రాజ్యం క్రమేణా అవసరం అయిన మార్పులను తెచ్చి సమసమాజాన్ని స్థాపించడం అని అర్థం. ఈ సామ్యవాదం అనే పదంను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

3) పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విధానం :
శాసన, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంపై ఆధారపడి ప్రభుత్వం ఉంటే అది “పార్లమెంటరీ విధాన”మని అంటాం. ప్రజలచేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.

4) సమాఖ్య విధానం :
ప్రభుత్వాధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయి ఉన్న ప్రభుత్వ విధానమే సమాఖ్య ప్రభుత్వం.

5) న్యాయం :
భారత రాజ్యాంగంలోని ఈ న్యాయం అనేది పౌరులకు రాజకీయ న్యాయం, ఆర్ధిక న్యాయం, సాంఘిక న్యాయం వంటి న్యాయాలను అందచేస్తుంది.

6) స్వేచ్ఛ, స్వాతంత్ర్యం :
ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మత స్వేచ్ఛ, ధర్మం మొదలైన స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పిస్తుంది.

7) సమానత్వం :
అసమానత్వాన్ని రూపుమాపకుండా వ్యక్తుల హక్కులకు హామీ ఇవ్వడం నిరర్ధకం. ప్రతి వ్యక్తి తన్ను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకొనుటకు సమానహోదా, అవకాశాలు కల్పించడం జరిగింది.

8) సంక్షేమ రాజ్యం :
ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. ప్రజల సంక్షేమానికి అవసరమైన చట్టాలను చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది.

ప్రశ్న 7.
దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఎలా నిర్వచించింది, వాటిని ఎలా మార్చింది? (AS1)
జవాబు:
రాజకీయ వ్యవస్థలకు సంబంధించి ఇతర దేశాల అనుభవాలను తీసుకొని, వాటిని మనదేశ పరిపాలనకు అనుగుణంగా మార్చుకొనుట జరిగింది. అవి :

1) పార్లమెంటరీ వ్యవస్థ :
ఈ పార్లమెంటరీ విధానాన్ని మనం బ్రిటిష్ పరిపాలన నుండి నేర్చుకున్నాం. దాదాపు 200 సంవత్సరాలు వారిచే పరిపాలించబడుట వలన ఆ విధానం మనదేశానికి అనుకూలంగా ఉంటుందని రాజ్యాంగం భావించి, పార్లమెంటరీ విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.

2) సమాఖ్య విధానం :
సమాఖ్య విధానం ప్రకారం అధికారాల విభజన అనేది మనం ‘కెనడా’ దేశం నుండి తీసుకున్నప్పటికీ, ఈ ‘అధికారాల విభజనకు మూలం అనేది “1935 భారత ప్రభుత్వ చట్టం” లోనే ఉంది. సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఈ రెండు కూడా వాటి పరిధిలో సర్వసత్తాకమైనవి. అయినప్పటికి భారత రాజ్యాంగం, ఈ సమాఖ్య విధానంలో కేంద్రాన్ని బలమైన సంస్థగా మార్చింది.

3) సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. ఈ అధ్యక్ష విధానం, అమెరికా అధ్యక్ష విధానానికి వేరుగా ఉంటుంది. ” అమెరికా అధ్యక్షుడు వాస్తవాధికారి, కాని భారత అధ్యక్షుడు ఇంగ్లాండు రాజువలె నామమాత్ర అధ్యక్షుడు. వాస్తవాధికారిగా ప్రధానమంత్రి, అతని ఆధ్వర్యంలో ఇతర మంత్రులు ఉంటారు.

4) అధికారాల విభజనలో కెనడా రాజ్యాంగాన్ని మూలంగా తీసుకొని, మన దేశానికి అనుకూలంగా మార్చుకున్నాం. ఏ విధంగా అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగాక మిగిలిన “అవశేషాధికారాలను” రాజ్యాంగం కేంద్రానికే కట్టబెట్టి బలమైన కేంద్రంగా తయారవడానికి ప్రయత్నించింది.

5) అమెరికాలో వలె మనదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు. భారతదేశంలో ఎక్కడ పుట్టినా, దేశ పౌరసత్వం లభిస్తుంది.

6) అమెరికాలో ద్వంద్వ న్యాయవ్యవస్థలున్నాయి. కాని మన సమాఖ్యలో ఏకీకృత న్యాయవ్యవస్థ మాత్రమే ఉంది.

ఈ విధంగా మన రాజ్యాంగం రాజకీయ వ్యవస్థలను నిర్వచించి, మన దేశానికి అనుగుణంగా వాటిని మార్చిందని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 8.
రాజ్యాంగంలో, మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ . వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
ఏ దేశ రాజ్యాంగంలో అయిన కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుందనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

కారణాలు:
1) భారతదేశం మత ప్రాతిపదికన 1947లో భారత్, పాలుగా విడిపోయింది. అయితే భారతదేశంలో వివిధ మతాల ప్రజలు ఉన్నారు. ముస్లిం దేశంగా పాకిస్థాన్ విడిపోయినప్పటికి ఇంకా ముస్లిం జనాభా భారత్ లో అధికంగానే ఉంది. యూరోపియన్లు పరిపాలించుట మూలంగా క్రైస్తవమతం, సిక్కులు, పార్శీలు అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. మత ఘర్షణల మూలంగా వస్తున్న ధన, ప్రాణ నష్టాలను అధిగమించడానికి “లౌకిక” వాదంను మన రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. దీని మూలంగా భారతదేశం మత ప్రమేయం లేని దేశం అయింది.

2) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాలు, బడుగు, బలహీనవర్గాలు అనాదిగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎదుర్కొనుటకు చేసిన పోరాటాల ఫలితంగా “సామ్యవాదం” ను 1976 లో రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. అయినప్పటికి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగదు. సంక్షేమ రాజ్యమే ఆధునిక దేశాల లక్ష్యం. కాబట్టి సామ్యవాదాన్ని మన రాజ్యాంగంలో చేర్చుకొనుట జరిగింది.

3) తరతరాలుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను పరిష్కరించటానికి వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించుట జరిగింది. ప్రాథమిక హక్కులను అందరూ పొందే విధంగా న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించినారు.

4) ‘అంటరానితనం’ కు ప్రజలు బలికాకూడదని, అంటరానితనం నేరమని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో 17వ ప్రకరణలో దానిని చేర్చినారు. ప్రాథమిక హక్కులలో చేర్చుట మూలంగా అంటరానితనం కొంతవరకు కనుమరుగైందని చెప్పవచ్చు.

5) భారత రాజ్యాంగం కల్పించిన అన్ని ప్రాథమిక హక్కులలో ఎక్కువ వివాదాస్పదమైనది ఆస్తి హక్కు. ఆస్తి హక్కును కొనసాగిస్తే సమానత్వాన్ని సాధించడం అసాధ్యమవుతుందని, దానిని తొలగించాలని సామ్యవాదులు భావించారు. ఆస్తి హక్కును పూర్తిగా తొలగించాలని కమ్యూనిస్టులు భావించారు. నిజమైన సామ్యవాద వ్యవస్థను స్థాపించడంలో ఆస్తి హక్కు అడ్డంకి కాకూడదని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా చేయుట జరిగింది.

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం InText Questions and Answers

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 1.
భారత రాజ్యాంగానికి …………………………. ……… ప్రధానంగా దోహదం చేశారు.
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్, డా॥ బాబు రాజేంద్రప్రసాద్, మోతిలాల్ నెహ్రూ, బి.ఎన్.రావు.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 2.
లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?
జవాబు:
“లింగం” అన్న పదాన్ని “నేపాల్” దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 3.
శాంతి కాముకతను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనబరిచింది?
జవాబు:
జపాన్ “శాంతి కాముకత”ను ఆ దేశ రాజ్యాంగ ప్రవేశికలో కనబరిచింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 4.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు ………… రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
జవాబు:
14 (ఆగస్టు 29, 1947)

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 5.
రాజ్యాంగ సభ ముందుగా …………………., ……….. …………………., …………………. వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక సంఘాలను నియమించింది.
జవాబు:

  1. యూనియన్ రాజ్యాంగ కమిటీ,
  2. కేంద్ర అధికారాల సంఘం,
  3. స్టీరింగ్ కమిటీ,
  4. రాష్ట్రాల రాజ్యాంగ సంఘం,
  5. ప్రాథమిక హక్కుల సంఘం.

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 6.
ఈ కమిటీల నివేదికలను డా॥ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న …………………… చర్చించి, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.
జవాబు:
ముసాయిదా సంఘం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 7.
డా॥ అంబేద్కర్ అధ్యక్షతన …… కమిటీ తీసుకున్న నిర్ణయాలను ముసాయిదా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
జవాబు:
డ్రాఫ్టింగ్,

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 8.
బ్రిటిష్ ప్రభుత్వం చేసిన …………….. అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది.
జవాబు:
1935 భారత ప్రభుత్వ చట్టంలోని

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 9.
ఆ తరువాత విమర్శలకు, సూచనలకు దీనిని ……… నెలల పాటు ప్రజల ముందు ఉంచారు.
జవాబు:
8 నెలలు

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 10.
ముసాయిదా రాజ్యాంగంలో ……………. అధికరణలు, …………… షెడ్యూళ్లు ఉన్నాయి.
జవాబు:
315, 8

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 11.
భారత అధ్యక్షునికి ఇచ్చిన అధికారాలు ……………. కి చెందిన ……………. కంటే …………….. కి చెందిన …………… అధికారాలకు దగ్గరగా ఉన్నాయి.
జవాబు:
అమెరికా, అధ్యక్షుడు, ఇంగ్లాండ్, రాజు

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 12.
భారత అధ్యక్షుడు ………….. సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించింది.
జవాబు:
తన మంత్రుల

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 13.
సమాఖ్య రాజ్యతంత్రంలో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉంటాయి, భారతదేశ విషయంలో అవి ….. – స్థాయిలలో ఉన్నాయి. మీరు …………. రాష్ట్రానికి, …………. దేశానికి చెందుతారు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం కేంద్రస్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, భారత

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 14.
ఏ రకమైన రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి?
జవాబు:
ఏకీకృత రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలుంటాయి.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 15.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన అధికారాలను ఏ రకమైన రాజ్యాంగం ఇస్తుంది?
జవాబు:
సమాఖ్య విధాన రాజ్యాంగం,

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 16.
భారతదేశ రాష్ట్రాలు ఏ విధంగా “కేంద్ర ప్రభుత్వ పాలనా అంగాల శాఖలు కావు”?
జవాబు:
భారతదేశంలో రెండు రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. అవి 1) కేంద్ర ప్రభుత్వం 2) రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండింటికి రాజ్యాంగం కేటాయించే రంగాలలో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి. కావున భారతదేశ రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ పాలన అంగాల శాఖలు కావు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 17.
రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వెంట్లను (అధికారులను) కలిగి ఉండే అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుందా?
జవాబు:
కల్పించుట లేదు. అఖిల భారత సివిల్ సర్వెంట్లను కేంద్రప్రభుత్వమే నియమిస్తుంది. రాష్ట్రాలకు ఆ అవకాశం రాజ్యాంగం కల్పించలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 18.
ఒక రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వాళ్లేనా?
జవాబు:
కాదు. రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వారు కాదు. కొందరిని కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. అవి అఖిల భారత సర్వీస్ కమిషన్ ద్వారా.

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 19.
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ ఏ మౌలిక ఆదర్శాలు పొందుపరచబడ్డాయి?
జవాబు:
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది మౌలిక ఆదర్నాలు పొందుపరచబడ్డాయి. ఇవి పౌరులందరికి సమానంగా వర్తిస్తాయి.

1) న్యాయం :
“పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం.”

2) స్వాతంత్ర్యం :
“ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని అందరికి అందించడం.”

3) సమానత్వం :
“అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చటం.”

4) స్వేచ్ఛ :
“పౌరులు స్వేచ్ఛాయుత జీవనం గడుపుటకు, ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన, సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛలు అందరికీ అందించడం.

5) సౌభ్రాతృత్వం :
“పౌరులందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సఖ్యత నేర్పరచుటకు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 20.
రాజ్యాంగ ప్రవేశికలో ప్రజా ఉద్యమాలు ఎలా ప్రతిబింబించాయి?
జవాబు:
1) నేపాల్ రాజ్యాంగ ప్రవేశికలో, ఇప్పటివరకు ప్రజలు చేపట్టిన ఉద్యమాలు, చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం, శాంతి, ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ వర్గ, జాతిమూలాలు, ప్రాంత, లింగ వంటి సమస్యలను పరిష్కరించి దేశాన్ని ప్రగతిశీలంగా పునః నిర్మించటానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

2) జపాన్ ప్రజా ఉద్యమాల మూలంగా ప్రజలకు శాంతి, సహకారాలు, స్వేచ్ఛ, యుద్ధభూములు లేని దేశాన్ని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించారు.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 21.
రాజకీయ వ్యవస్థ స్వరూపానికి సంబంధించి ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:

  1. భారతదేశంలో వయోజన ఓటుహక్కు ద్వారా రాజకీయ న్యాయం పొందవచ్చు. 18 సం||లు నిండిన ప్రతి పౌరుడు ఆస్తి, విద్య మరియు ఏ ఇతర అర్హతలతో నిమిత్తం లేక రాజ్యవ్యవస్థ నిర్మాణ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
  2. నేపాల్ దేశంలో వయోజనులకు ఓటు హక్కు క్రమం తప్పకుండా ఎన్నికలు, రాచరిక పాలన రద్దు వంటి వాగ్దానాలు చేయబడినవి.
  3. రాజకీయ నైతికతకు సంబంధించిన చట్టాలు విశ్వజనీనమైనవి, తమ సర్వసత్తాకతను కొనసాగిస్తూ, ఇతర దేశాలతో సర్వసత్తాక సంబంధాలను సమర్థించుకుంటూ అన్ని దేశాలు ఈ చట్టాలను గౌరవించాలి. ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని జపాన్ దేశంలో వాగ్దానాలు చేశారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 22.
ఈ దేశాల పౌరులకు ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:
ఈ దేశాల పౌరులకు ఈ క్రింది వాగ్దానాలు చేశారు :
భారతదేశ పౌరులకు :
ప్రజలందరికి అన్ని రకాలైన న్యాయం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వాలు, సౌభ్రాతృత్వం మొదలైనవి ప్రజలందరు అనుభవించుటకు వీలుగా “థమిక హక్కులను” కల్పించారు.

నేపాల్ పౌరులకు :
ప్రజలందరికి పౌరస్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వయోజనులకు ఓటుహక్కు, పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటి వాగ్దానాలు నేపాల్ వారి పౌరులకు చేసింది.

జపాన్ పౌరులకు :
శాంతియుత సహకార ఫలాలు, యుద్ధభయం రాదని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్, వారి పౌరులకు వాగ్దానం చేసింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 23.
“భారతదేశ ప్రజలమైన మేము….” అన్న పదాలతో భారతదేశ రాజ్యాంగం మొదలవుతుంది. భారతదేశ ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోవటం సమర్ధనీయమేనా?
జవాబు:
సమర్థనీయమే, ఎందుకనగా “భారత ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెల్పును. రాజ్యాంగాన్ని “చర్చించి, శాసనం చేసుకొని, మాకు మేము” సమర్పించుకుంటున్నాము అనే భావన రాజ్యాంగ పరిషత్తు – ప్రజలకు ప్రాతినిధ్యం వహించిందని తెలియచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 24.
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటే ఎవరెవరు అందులో భాగస్వాములు కావాలి, ఎలా భాగస్వాములు కావాలి?
జవాబు:
1) భాగస్వాములుగా ఉండాల్సిన వారు :
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ వర్గం నుండి కొంతమంది, ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించాలి.

2) భాగస్వామ్యం :
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) సబ్జెక్టువారీగా, ప్రతి సబ్జెక్టు నుండి ఒక ఉపాధ్యాయుడు’
సి) ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు చొప్పున భాగస్వాములుగా ఉండి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 25.
బ్రిటన్ రాజు, భారత అధ్యక్షుడి స్థానాలలో తేడా ఏమిటి?
జవాబు:

భారత అధ్యక్షుడు బ్రిటన్ రాజు
1) భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. 1)రాజ్యా నికి అధిపతి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
2) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. 2) కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కాదు. దేశాన్ని పాలించడు. అతడి స్థానం అలంకారప్రాయం.
3) భారత అధ్యక్షుడు తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. 3)రాజు ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియచేసారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 26.
భారత రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వ (దేశ, రాష్ట్ర విధానాన్ని ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థను మనం రూపొందించుకున్నప్పటికి కేంద్రానికి, రాష్ట్రానికి వేరువేరుగా రాజ్యాంగాలు లేవు. దేశానికంతటికి ఒకే రాజ్యాంగం, అదే విధంగా ఒకే పౌరసత్వాన్ని కల్పించుట జరిగింది. ఒకే పౌరసత్వం మూలంగా ప్రజలందరిలో ఐకమత్యం పెంపొందించడానికి వీలుంటుంది. దేశ సమగ్రత, దేశ సమైక్యత కూడా పటిష్ఠంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లయితే ప్రజలు దేశ పౌరసత్వానికంటే తన రాష్ట్ర పౌరసత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వాన్ని తిరస్కరించినారు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 27.
పై చర్చల్లో ఏ అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యా యి?
జవాబు:

  1. పై చర్చలో అంటరానితనానికి సంబంధించి భేదాలు వ్యక్తమయ్యాయి.
  2. ‘అంటరానితనం’ అనగా కొన్నిసార్లు ‘హరిజనులకు’ ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. కొన్నిసార్లు ‘ అది అన్ని కులాలు కలిసి భోజనం చెయ్యటంగా పరిగణించబడుతుంది.
  3. అంటరానితనం అనేది కులవ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే.
    ఈ విధమైన అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 28.
ఈ చర్చలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే, మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు?
జవాబు:
ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు లభిస్తే, ‘అంటరానితనం’ అనే పదం ఏ రూపంలో ఉన్నా నేరమని చెపుతాను. – అంటరానితనం, కులం అనే పదాలను సమూలంగా తొలగించాలంటాను. అంటరానితనం అనే దురాచారం తరతరాలుగా సమాజం నుండి అనేకమంది వెలివేయబడుతున్నారు. ఇది సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు. కావున ఈ పదాలను పూర్తిగా నిర్మూలించాలి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 29.
ఈ పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా పొందుపరచడం ఒక మంచి ఆలోచన అని మీరు భావిస్తున్నారా ? మీ వాదనకు కారణాలను తెల్పండి.
జవాబు:
‘అంటరానితనం’ అనే పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా, దానిని పొందుపరచడం మంచిదే అని నేను భావిస్తున్నాను. ఎందుకనగా విశాలమైన భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రకరకాలైన అర్థాలున్నాయి. కావున అంటరానితనాన్ని నిర్వచించకపోవడమే సమంజసం. అయితే రాజ్యాంగంలోని 17వ ప్రకరణ- అంటరానితనం నేరమని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 30.
‘కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది’ అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా ? ఇది ఏ విధంగా చేసి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది అనే విషయంతో నేను ఏకీభవిస్తాను. కులాల ప్రసక్తి లేకుండా వ్యక్తుల యొక్క ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా ప్రజలను విభజించినట్లయితే బాగుండేదని నా అభిప్రాయం. దీనివల్ల సమాజం కులాల ప్రాతిపదికన విభజింపబడేది కాదు. కులాల ప్రసక్తి వచ్చేది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 31.
భారతదేశ రాజ్యాంగ ప్రవేశికతోపాటు కింద ఇచ్చిన రెండు దేశాల ప్రవేశికలను చదివి వాటిల్లో పోలికలు, తేడాలు పేర్కొనండి. తమ దేశం ఏర్పడటానికి దారితీసిన రాజకీయ ఘటనలను ప్రతిబింబించటానికి ప్రతి రాజ్యాంగమూ ప్రయత్నిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజ్యాంగంలో చోటు చేసుకున్న వాటిని ప్రభావితం చేసిన రాజకీయ ఘటనలను గుర్తించటానికి ప్రయత్నించండి. జపాన్ నేపథ్యాన్ని అర్థం చేసుకోటానికి 13వ అధ్యాయంలో జపాను గురించి మరొకసారి చదవండి. నేపాల్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవటానికి 234వ పేజీ చూడండి.
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలోని పోలికలు :
1) ప్రాథమిక హక్కులు, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉండడం, పౌర స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, దేశ సమగ్రత, పౌరులకు స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం వంటి లక్షణాలు భారతదేశం మరియు నేపాల్ రాజ్యాంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జపాన్ రాజ్యాంగంలో సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందనే లక్షణం మాత్రమే సారూష్యంగా కనిపిస్తుంది.

తేడాలు :

భారత రాజ్యాంగం నేపాల్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం
భారత రాజ్యాంగం వ్యక్తికి స్వేచ్ఛ, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాలను అన్ని రంగాలలో ఇస్తుంది. ప్రజలకు జాతి, వర్గ, ప్రాంత, లింగం అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, రాచరిక పాలన రద్దు వంటివి నేపాల్ రాజ్యాంగం తెలుపుతుంది. జపాన్ రాజ్యాంగం, రానున్న తరాలకు వంటి యుద్ధ భయంలేని దేశాన్ని, శాంతిని, వాటి ఫలాలను అందించడానికి కృషి చేస్తామని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 32.
ఈ దేశాల రాజకీయ నేపథ్యాలలో పోలికలు, తేడాలు ఏమిటి? అంతకు ముందు ఘటనలు ఏమిటి? అంతకు ముందు పాలకులు ఎవరు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాల రాజకీయ నేపథ్యంలో ఈ క్రింది పోలికలు, తేడాలు కనిపిస్తున్నాయి.
తేడాలు :

  1. భారతదేశం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నది.
  2. నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరంతర పోరాట ఫలితంగా రాచరికం రద్దయి, ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది.
  3. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్, సామ్రాజ్యకాంక్షతో యూరోపియన్ దేశాలతో పోటీ పడుతూ ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవడానికి అనేక యుద్ధాలు చేసింది. జపాన్ ప్రజలకు యుద్ధభయాన్ని కలుగచేసింది. ఇటువంటి నేపథ్యంలో జపాన్, జపాన్ ప్రజలకు శాంతిని, యుద్ధభయం లేనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటామని జపాన్ రాజ్యాంగం తెల్పుతుంది.

పోలికలు:

  1. “ఈ మూడు దేశాల రాజ్యాంగాలను, ఆ దేశ ప్రజలు తమకు తామే ఇచ్చుకున్నాం” అనే పోలిక భారత్, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలో కనిపిస్తుంది.
  2. భారత్, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు అనేక భయాలకు, కష్టాలకు, సమస్యలకు లోనయి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.

అంతకు ముందు ఘటనలు :

  1. 1947కు ముందు భారతదేశం బ్రిటీషు వారి పరిపాలనలో ఉంది. స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి.
  2. నేపాల్ 2007కు ముందు రాచరికపాలనలో ఉంది. ప్రజాస్వామ్యం కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి.
  3. 1945కు పూర్వం రాచరిక ప్రభుత్వాల వలన జపాన్ రెండు ప్రపంచయుద్ధాలలో పాల్గొని అపార నష్టాన్ని చవిచూసింది. – 1945లో రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ ప్రజాస్వామ్య దేశమైనది.

అంతకు ముందు పాలకులు :
రాజ్యాంగాలను రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ఉంది. నేపాల్ లో నిరంకుశ రాచరికం ఉంది. జపాన్లో సామ్రాజ్యకాంక్ష ఉన్న నాయకత్వం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 33.
గతం పట్ల సమీక్షలో వివిధ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోలికలు :
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు తరతరాలుగా రాజరికం నిరంకుశ పాలనతో విసిగిపోయి ఉన్నారు. అయితే భారతదేశంలో రాచరికాలకు తోడు బ్రిటిష్ వలస పాలన కూడా తోడైంది. జపాన్లో షోగునేట్ పాలన అంతమవడంతో కొంత అభివృద్ధి జరిగింది.

తేడాలు :

  1. భారత్, నేపాల్, దేశాలలో రాచరికాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. భారతదేశంలో అయితే వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.
  2. జపాన్ “మిజి”ల పరిపాలనలో అభివృద్ధి సాధించినప్పటికీ జపాన్ చేసిన యుద్దాల మూలంగా ప్రజలలో యుద్ధభయం, 2వ ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబులు భయాన్ని పుట్టించాయి.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 34.
మూడు దేశాల్లో భవిష్యత్తు సమాజం గురించి ఎటువంటి వాగానాలు చేశారు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్లలో భవిష్యత్తు సమాజం గురించి చేసిన వాగ్దానాలు :

1) భారతదేశం :
సార్వజనీన అక్షరాస్యత, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించటం, ప్రాథమిక హక్కులను అందరికి వర్తింపచేయటం. “న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలందరికి వర్తిస్తాయని వాగ్దానం చేసింది భారత ప్రభుత్వం.

2) నేపాల్ :
పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల వంటివాటి నిర్మాణం, అధికారాలను పేర్కొనటం, ప్రభుత్వమూ, సమాజమూ కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించటం వంటి వాటిని నేపాల్ దేశం ప్రకటించింది.

3) జపాన్ :
రానున్న తరాలకు అన్ని దేశాలతో శాంతియుత సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్ తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 35.
దేశం మొత్తానికి రాజ్యాంగాన్ని రూపొందించటంలో భారతదేశ ప్రజలందరూ పాల్గొనగలరా ? ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందా లేక కొంతమంది విజ్ఞులకు ఈ బాధ్యత అప్పగిస్తే సరిపోయేదా?
జవాబు:

  1. రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోలేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే ఓటుహక్కు ఉండేది.
  2. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని ప్రజలు లేక వారి ప్రతినిధులు రూపొందిస్తారు. కావున మనదేశంలో ప్రజా ప్రతినిధులు రూపొందారు.
  3. ప్రజలందరూ రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీలంగా పాల్గొనవలసిన అవసరం లేదు. ప్రజలందరికి విద్య లేదు. విజ్ఞానం కూడా అందరికి ఉండదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు శాస్త్ర, విజ్ఞాన, విద్యా రంగాల నిష్ణాతులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. కావున ఇటువంటి విజ్ఞులు కొంతమందికి రాజ్యాంగ రూపకల్పన బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 36.
భారతీయ సమాఖ్య వ్యవస్థకూ, అమెరికా సమాఖ్య వ్యవస్థకూ మధ్యగల ముఖ్యమైన తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారత్, అమెరికాల సమాఖ్య వ్యవస్థలో ఈ క్రింది తేడాలున్నాయి.

భారత సమాఖ్య వ్యవస్థ అమెరికా సమాఖ్య వ్యవస్థ
1) పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. 1) అధ్యక్ష వ్యవస్థ ప్రభుత్వం అంటారు.
2) కేంద్రరాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖలో అంతర్భాగం. 2) ఫెడరల్ ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వమని ద్వంద్వ ప్రభుత్వాలుంటాయి. కార్యనిర్వాహకశాఖ అనగా అధ్యక్షుడు, అతని సలహాదారులు. శాసననిర్మాణం శాఖలో అంతర్భాగం కాదు.
3) భారత సమాఖ్యలో అధ్యక్షుడు, రాజ్యా నికి అధిపతి, కాని పరిపాలన బాధ్యత ఉండదు. 3) పరిపాలన బాధ్యత అంతా అధ్యక్షుడి క్రింద ఉంటుంది.
4) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. 4) అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 37.
అమెరికాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ వేరు వేరు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల న్యాయవ్యవస్థలు సమగ్ర న్యాయవ్యవస్థలో ఒక భాగం – వివరించండి.
జవాబు:
అమెరికాలో సమాఖ్య న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ రెండూ వేరు, వేటికవి స్వతంత్రమైనవి. అయితే భారత సమాఖ్యలో రాజ్యాంగం రెండు స్థాయిలలో న్యాయస్థానాలను ఏర్పాటు చేయలేదు. మనది ఏకీకృత, సమగ్ర న్యాయవ్యవస్థ.

  1. సుప్రీంకోర్టు విచారణ పరిధి కిందకు యావత్ దేశం వస్తుంది. కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తుంది.
  2. రాష్ట్రస్థాయిలో పనిచేసే హైకోర్టుకు కూడా శాసనసభ కార్యనిర్వాహక చర్యల రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం ఉంది.
  3. సుప్రీంకోర్టు, హైకోర్టులకు ‘రిట్’ లను జారీ చేసే అధికారం ఉంది.
  4. సుప్రీంకోర్టు, హైకోర్టు వాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు.
  5. సుప్రీంకోర్టు నిర్ణయాలు యావత్ భారతదేశానికి వర్తిస్తాయి. అన్ని న్యాయస్థానాలు ఈ తీర్పులను పాటించాలి.
  6. హైకోర్టులు కింది న్యాయస్థానాలపై అజమాయిషీ చేస్తాయి.
  7. అదే విధంగా ఏ న్యాయస్థానం తీర్పునైనా తాత్కాలిక నిలుపుదల ఉత్తరువు ఇవ్వవచ్చు. దానిని పరిశీలించి తిరిగి విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

ఉన్నత న్యాయవ్యవస్థ నిర్మాణం హైకోర్టులతో సహా కేంద్ర ప్రభుత్వ పరిధి కిందకు వస్తుంది. పార్లమెంటు హైకోర్టు అధికార పరిధిని పెంచవచ్చు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉంది. వీటిని బట్టి మనకర్ధమవుతున్నదేమిటంటే భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ నిర్మాణంలో ఏకీకృత పద్ధతిని అనుసరించింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 38.
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు :

  1. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదని సేథ్ వాదించారు. ముసాయిదా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదు.
  2. ముసాయిదా రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని ప్రతిపాదిస్తుంది. సేథ్ కూడా అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. అధికార కేంద్రీకరణ జరిగితే ఫాసిస్ట్ ఆదర్శాల వైపు నిరంకుశ అధికారంగా మారుతుందని అన్నాడు. మన రాజ్యాంగం కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాన్ని వికేంద్రీకరించింది.
  3. గ్రామ పంచాయితీల గురించి ప్రస్తావన లేదని సేథ్ విమర్శించారు. ముసాయిదా రాజ్యాంగంలో గాంధీజీ కలలు కన్న గ్రామాల గురించి విస్మరించినారు.

తేడాలు :

  1. సేథ్ అధికార కేంద్రీకరణ జరిగిందని వాదించారు. వాస్తవానికి ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారం అనేది పంచబడింది.
  2. అధికార కేంద్రీకరణ ఎక్కువైతే ఫాసిజం వైపు మళ్ళుతుందని సేథ్ అన్నాడు. అయితే ముసాయిదా రాజ్యాంగంలో పార్లమెంటరీ సమాఖ్య విధానంతో ప్రజాస్వామ్యం వైపు వెళుతున్నామని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 39.
రాజ్యాంగానికి 73వ సవరణ చేసిన తరువాత గ్రామాలకు ఎటువంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలుసుకోండి.
జవాబు:
1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేయుట జరిగింది.

73వ సవరణతో గ్రామాలకు స్వయంప్రతిపత్తి :

  1. గాంధీజీ ఆశించిన గ్రామాలకు రాజ్యాంగంలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. 1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేసి ఆర్టికల్ 40లో ఈ గ్రామపంచాయితీలను చేర్చారు.
  2. ఆర్టికల్ 40 నిర్దేశిక నియమాలలోనిది. గాంధీజీ ఆశించినట్లు ప్రతి గ్రామం “ఒక రామరాజ్యం ” కావాలని ఈ సవరణ చేసి గ్రామపంచాయితీలకు ప్రాధాన్యత కల్పించారు.
  3. ఈ 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీ సభ్యులు, అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావాలి.
  4. గ్రామ పంచాయితీకి అవసరం అయిన నిధులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.
  5. సర్పంచ్ వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 40.
AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 1
1950, జనవరి 26 నాటి వార్తాపత్రిక. ఈ పేజీలో ఏ ఏ అంశాలు ఉన్నాయో వ్యాఖ్యానించండి.
జవాబు:
ది స్టేట్స్మ న్ అనే వార్తాపత్రికలో క్రింది అంశాలు కనిపిస్తున్నాయి.

  1. భారతదేశం ఈ రోజు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రజలందరు ఓర్పు, సహనాలను కలిగి ఐకమత్యంగా ఉండాలని నెహ్రూ ప్రజలకు పిలుపునిచ్చాడు. అన్ని దేశాలను స్నేహ సంబంధాల కొరకు ఆహ్వానించాడు.
  2. సుకర్నో భారత ఎం.పి.లను ఉద్దేశించి మాట్లాడినాడు. భారతదేశం కొత్త గణతంత్రదేశంగా ఆవిర్భవించినందుకు శుభాకాంక్షలు తెలిపినారు.
  3. భారత రాజ్యాంగంలోని “ప్రవేశిక” ను ప్రచురించినారు.
  4. కలకతాలో ఈ రోజు ప్రోగ్రాం అనే వార్తతో ఆ రోజు కార్యక్రమాలను ఇచ్చినారు.
  5. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నారు.
  6. “హౌర” గ్రామంలో గన్‌మెన్, ఇద్దరు పోలీసులను చంపినాడు.
  7. “కలకతా నుండి గౌహతి” వెళుతున్న విమాన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించినారు.
  8. “ఇంపీరియల్ కెమికల్ ఇండియా” వారి ఫర్నీచర్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ప్రచురించబడింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.246

ప్రశ్న 41.
భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి మీరు గుర్తించిన ఉదాహరణలు, వివరణలు పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి నేను గుర్తించిన అంశాలు :
1) వయోజనులందరికి ఓటుహక్కు ఉండడం, వారి ఓటుతో తమకు కావలసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనే సార్వభౌమాధికారం ప్రజలలో ఉందని తెలుపుతుంది.

2) “సామ్యవాదం” :
ప్రజలందరూ, సమానత్వాన్ని అనుభవించాలంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి, దానిని సాధారణ, చట్ట హక్కుగా చేసినారు. ఇదంతా సామ్యవాద సమాజాన్ని స్థాపించుట కొరకే.

3) న్యాయం :
ప్రతి వ్యక్తికి రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాలను రాజ్యాంగం కల్పించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయిన వయోజనుడైతే ఎన్నికలలో పోటీచేయవచ్చు. పేదరిక నిర్మూలన సమాన ప్రాతిపదికపై సంపద పంపిణీ, కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, అల్పసంఖ్యాకులనే భేదం లేకుండా అందరికి సమాన న్యాయం కల్పించబడింది.

4) స్వేచ్ఛ :
ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ప్రతి వ్యక్తికి భావప్రకటన తన ఇష్టం వచ్చిన మతాన్ని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నది.

5) ప్రాథమిక హక్కులు :
ప్రతి వ్యక్తి రాజ్యాంగం తనకు కల్పించిన ప్రాథమిక హక్కులు అనుభవించవచ్చు. ఏ కారణాల వలన అయిన తమ హక్కులకు భంగం కలిగినట్లైతే న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు.

న్యాయస్థానాలు వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయని నేను గమనించాను.