AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

SCERT AP 10th Class Social Study Material Pdf 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రచ్ఛన్న యుద్ధం గురించి కింద ఉన్న వ్యాఖ్యావాలలో ఏది సరైనది కాదు?
అ) అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య విరోధం.
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం
ఇ) ఆయుధ పోటీకి కారణం అవ్వటం
ఈ) రెండు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరు (AS1)
జవాబు:
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏది పశ్చిమ ఆసియా సంక్షోభంలో లేదు? అ) ఈజిప్టు ఆ) ఇండోనేషియా ఇ) బ్రిటన్ ఈ) ఇజ్రాయెల్ (AS1)
జవాబు:
ఆ) ఇండోనేషియా

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో చాలా మార్పులు వచ్చాయి.

  1. యుద్ధరంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించింది.
  2. అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచసంస్థ అనగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు.
  3. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలనలను వదులుకోవలసి వచ్చింది. ఇవి రాజకీయంగా ఆర్థికంగా బలహీనమయ్యాయి.
  4. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. అవి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం; అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారీ శిబిరం. ప్రపంచం మొత్తం ఈ రెండు కూటాలుగా విడిపోయింది. ఈ రెండు కూటాల మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 4.
ప్రపంచంలో శాంతి నెలకొల్పటానికి ఐక్యరాజ్య సమితి నిర్వహించే వివిధ పాత్రలు ఏమిటి? (AS1)
జవాబు:
ఐక్యరాజ్య సమితి 1945, అక్టోబరు 24న ఏర్పడింది. ఇది ఆరు వేరు వేరు సంస్థల ద్వారా పనిచేస్తుంది.

ఐక్యరాజ్యసమితి నిర్వహించే విధులు:

1) శాంతి భద్రతలను కాపాడటం :
అంతర్జాతీయ శాంతిని, ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షిస్తుంది. దీని కొరకు “భద్రతా మండలి” అనే సంస్థను ఏర్పాటు చేసింది.

2) విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచటం :
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక సమస్యలను చర్చిస్తుంది. ఈ అంశాలపై పరిశోధనలు చేసి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య సంబంధమైన విధానాలను సిఫారసు చేస్తుంది. ఈ విధుల నిర్వహణ కోసం ఐక్యరాజ్య సమితి, ఆర్థిక, సామాజిక మండలిని ఏర్పాటు చేసింది. ఆర్థిక సంఘం జెనీవాలో ఉంది.

3) పేదరికాన్ని నిర్మూలించటం :
ప్రపంచ దేశాలలోని పేదరికాన్ని నిర్మూలించాలని సంకల్పించి, దీని కొరకు ఆర్థిక, సామాజిక మండలిని స్థాపించింది.

4) అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించటం వంటి విధులను ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దీని కొరకు అంతర్జాతీయ న్యాయస్థానం “హేగ్”లో ఉంది.

5) ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞానశాస్త్ర, సాంస్కృతిక సంస్థ పారిలో ఉంది.

6) బాలల కొరకు ఒక అత్యవసర నిధి సంస్థను న్యూయార్క్ లో స్థాపించింది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య భావన నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవటంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనదేనా? (AS2)
జవాబు:
ప్రపంచమంతా ప్రజాస్వామ్య భావనలోకి వెళుతున్న నేపథ్యంలో ప్రపంచసంస్థ అయిన ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలకు మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనది కాదని చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం.

ప్రశ్న 6.
సైనిక ఒప్పందాలతో అగ్రరాజ్యాలు ఎలా లాభపడ్డాయి? (AS1)
జవాబు:
సైనిక ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చి లాభపడ్డాయి.

  1. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు
  2. తమ ఉత్పత్తులకు మార్కెటు, తమ పెట్టుబడులు పెట్టటానికి ప్రమాదంలేని ప్రదేశాలు
  3. తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించటానికి సైనిక స్థావరాలు
  4. తమ భావజాల వ్యాప్తి
  5. పెద్ద మొత్తంలో సైనిక ఖర్చుకి ఆర్ధిక మద్దతు.

ప్రశ్న 7.
ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఆయుధ పోటీ, ఆయుధ నియంత్రణ రెండూ ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
1) ఆయుధ పోటీ :
ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ, క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు . దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది.

2) ఆయుధ నియంత్రణ :
కాలం గడుస్తున్న కొద్దీ ఆయుధ పోటీని తగ్గించి, అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్, అమెరికాలపై ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయసాగారు. దీని ఫలితంగా ఈ రెండు దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధ పోటీని, నిల్వలను తగ్గించుకోవలసి వచ్చింది. చివరికి 1985-1991 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 8.
ప్రపంచంలో ఘర్షణలకు కేంద్రంగా పశ్చిమ ఆసియా ఎందుకు మారింది? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా ఘర్షణలకు ముఖ్య కారణాలు :
1) యూరపు, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలెం యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్రస్థలం.

2) యూదులు పాలస్తీనాని తమ ‘వాగ్రత్త భూమి’గా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసలు పోయారు.

3) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూడులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (వీళ్లల్లో ఎక్కువమంది అరబ్బు ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

4) మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ప్రాభవంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతర దేశాలు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి.

ప్రశ్న 9.
20వ శతాబ్దం చివరి నాటికి ఒక్క దేశమే ప్రపంచం మీద పెత్తనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో అలీనోద్యమం పాత్ర ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
ప్రస్తుత కాలంలో అలీనోద్యమం నిర్వహిస్తున్న పాత్ర :

  1. ప్రపంచం ఏకధృవంగా ఉన్న నేపథ్యంలో చైనా కూడా మరో ధృవంగా ఎదుగుతోంది. రష్యా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిలో తమ వీటో అధికారం ద్వారా అమెరికాను నియంత్రిస్తున్నాయి.
  2. ఇటీవలి సంవత్సరాలలో పోర్టారికో మరియు పశ్చిమ సహారా ప్రాంతాల గురించి అమెరికా వైఖరిని తప్పుబట్టాయి. ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అలీనోద్యమం కృషి చేస్తుంది.
  3. మానవ హక్కుల పరంగా బాగా వెనుకబడిన తమ సభ్య దేశాలలో మానవ హక్కుల ఉద్దరణకు అలీనోద్యమం కృషి చేయవలసిన అవసరం ఉంది.
  4. అగ్ర దేశాలు కలుగచేసుకోలేని కొన్ని సమస్యలున్న దేశాల సమస్యలను అలీనోద్యమం పరిష్కరించవచ్చు.
    ఉదా : పాలస్తీనా, సోమాలియా, సూడాన్.
    ఈ విధంగా అలీనోద్యమం తన పాత్రను నిర్వహించవచ్చు.

ప్రశ్న 10.
“కేవలం సైనిక ఒప్పందాల నేపథ్యంలోనే కాకుండా ఆర్థిక విధానాల నేపథ్యంలో కూడా అలీనోద్యమం ఏర్పడింది”. దీనిని సమర్ధించండి. (AS1)
జవాబు:
ఆసియా, ఆఫ్రికా, ఆ తరువాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల గురించి చర్చించడం జరిగింది.

  1. 1961 బెల్ గ్రేడ్ సమావేశంలో ప్రతి దేశానికి ఆర్థిక సమానత్వం ఉండాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక ద్రవ్యనిధిని ఏర్పాటుచేయాలని సూచించింది.
  2. 1970 లుసాకా సమావేశంలో రాజకీయ విషయాలతో బాటు ఆర్థిక విషయాలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని, త్వరితగతిని ఆర్థికాభివృద్ధికి సహకరించే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని, ఆర్థికాభివృద్ధిని అంతర్జాతీయ సమతాదృక్పథంతో పరిశీలించాలని ఐక్యరాజ్య సమితి కోరింది.
  3. 1973 అల్జీర్స్ సమావేశంలో అలీన దేశాల ఆర్థికాభివృద్ధికి, పునర్నిర్మాణానికి, ఐదు రకాల విధులు ఏర్పాటు చేయడానికి తీర్మానం జరిగింది.
  4. 1979 హవానా సమావేశంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాలను తగ్గించాలని సూచించింది.
  5. 1992 జకార్తా సమావేశం అలీనోద్యమం తన దృష్టిని G7 మరియు యూరోపియను యూనియన్ల వైపు దృష్టి సారించాయి.

ఈ విధంగా అనేక అలీనరాజ్యా ల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు వివిధ సూచనలను చేసింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 11.
భారతదేశానికి పొరుగుదేశాలతో ఈ దిగువ అంశాలతో సంబంధాన్ని చూపటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి. ఘర్షణకు కారణమైన అంశాలు; యుద్ధ సంఘటనలు; సహాయ, సహకార ఘటనలు. (AS3)
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణలు, యుద్ధ సంఘటనలు, సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ క్రింది పట్టికలో చూపబడినాయి.

మన పొరుగు దేశాలతో ఘర్షణకు కారణమైన అంశాలు యుద్ధ సంఘటనలు సహాయ, సహకార ఘటనలు
1) టిబెట్లో జరిగిన తిరుగుబాటును చైనా అణిచివేసింది. ఆ సమయంలో దలైలామాతో సహా వేలాది టిబెటన్లు భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. దీంతో భారత్-చైనాల మధ్య వైరుధ్యం మొదలైంది. లడక్ ప్రాంతంలోని ఆక్సాయ్-చిన్ సరిహద్దు వివాదం, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది. 1) 1962 అక్టోబరులో భారతదేశంపై చైనా దండెత్తింది. భారతదేశం తీవ్ర నష్టాలు ఎదుర్కొవలసి వచ్చింది. 1) శాంతిపట్ల తన నిబద్ధతను చాటటానికి జవహర్‌లాల్ నెహ్రూ తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. ఈ పంచశీల ఒప్పందంపై చైనా-భారత్లు 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి.
2) పాకిస్తాన్-భారతదేశం మత ప్రాతిపదికన విడిపోయాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. సరిహద్దు రాష్ట్రాలలో వేర్పాటు ఉద్యమాలకు పాకిస్తాన్ సహకరిస్తుందనే ఆరోపణలున్నాయి. 2) కాశ్మీర్ కోసం, పాక్-భారత్ ల మధ్య మొదటిసారి 1947-48 మధ్య జరిగింది. రెండోసారి 1965లో పాక్-భారత్ ల మధ్య యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ కు సహకారంగా 1971లో భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయింది. కార్గిల్ యుద్ధం ఇరుదేశాల మధ్య జరిగింది 2) 1966లో తాష్మెంట్ లో భారత్-పాకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. 1971లో కూడా సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహ సంబంధాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
3) బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల పంపకం వంటి అంశాలపై బంగ్లాదేశ్ భారత మధ్య విభేదాలున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్దంగా భారతదేశంలోకి రాకుండా తీసుకున్న భారతదేశ చర్యలు బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది. 3) 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినపుడు భారతదేశం సహాయపడుతూ, పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. 3) 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం కావటానికి – భారత్ సహకరించింది. 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఆర్థిక రంగంలో ఈ రెండు దేశాలు సహకరించు కుంటున్నాయి.
4) శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు భారత్-శ్రీలంకల మధ్య ముల్లు మాదిరి తయారయ్యింది. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. 4) శ్రీలంకలో శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపింది. దీనికి ప్రతీకారంలో తమిళ తీవ్రవాదులు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చంపినారు. 4) క్రీడలు, పర్యాటక రంగం వాణిజ్యం ద్వారా భారత్, శ్రీలంకల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి.

ప్రశ్న 12.
“శ్రీలంకలో జాతి వైరుధ్యాలు భారతదేశంతో దాని సంబంధాలను ప్రభావితం చేశాయి.” వివరించండి. (AS1)
జవాబు:

  1. పురాణ కాలం నుండి భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ఆర్థిక, సాంస్కృతిక, జాతిపరమైన సంబంధాలున్నాయి.
  2. శ్రీలంకలో అల్పసంఖ్యాకులైన తమిళం మాట్లాడే ప్రజలపట్ల ప్రభుత్వం అవలంబించిన వైఖరియే ఈ రెండు జాతుల మధ్య వైరుధ్యానికి కారణం.
  3. వీరిలో చాలామంది భారతదేశానికి శరణార్థులుగా రావడంతో భారతదేశానికి అది సమస్యగా పరిణమించింది.
  4. ఈ సమస్య పరిష్కారం కోసం భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి శ్రీలంకతో ఒక ఒప్పందం చేసుకొన్నది. దాని ప్రకారం ఈ సమస్య పరిష్కారం కోసం “భారత శాంతి సేన” ను శ్రీలంకకు పంపింది.
  5. ఈ చర్యకు ప్రతిగా తమిళ తీవ్రవాదులు ఎట్టిఇ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చారు.

ఈ కారణంగా సింహళీయులు, తమిళుల మధ్య ప్రారంభమైన పౌర సంఘర్షణలు ఒక వైపు రక్తపాతానికి దారితీయగా మరోవైపు శ్రీలంక భారత సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం InText Questions and Answers

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 1.
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదేనా?
జవాబు:
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదే.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 2.
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనదేనా?
జవాబు:
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 3.
వలసపాలన నుంచి విముక్తి అంటే ఏమిటి?
జవాబు:
సామ్రాజ్యకాంక్ష కలిగిన బలవంతమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వారి ఆధిపత్యంలో ఉంచుకున్నారు. ఈ దేశాలలోని ప్రజలు జాతీయోద్యమాలు చేసి వారి పాలిత దేశాల నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొనుటనే వలసపాలన నుంచి విముక్తి అంటారు.

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 4.
రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీతో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి?
జవాబు:

  1. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిజం మధ్య (అమెరికా – రష్యాల మధ్య) విభజింపబడిన ప్రపంచాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.
  2. ఈ దేశాలు తమ అభివృద్ధికి సొంతమార్గం అనుసరించనివ్వకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి చేయసాగాయి.
  3. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలను కొన్ని దేశాలు తమకు సానుకూలంగా వాడుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 5.
యుద్ధాలకూ, పేదరికం, సమాన అభివృద్ధి లేకపోవటం, దేశాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికీ మధ్య సంబంధం. ఏమైనా ఉందా?
జవాబు:
బలవంతమైన దేశాలు సామ్రాజ్య కాంక్షతో అనేక చిన్న దేశాలపై దాడులు చేశాయి. అధికార కాంక్షతో కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. అనేక దేశాలలో పేదరికం మరియు దేశాలన్నీ సమాన అభివృద్ధి సాధించకుండా కొన్ని దేశాలు ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనకబడి ఉండడం వంటి కారణాలతో అభివృద్ధిని సాధించిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై దాడిచేసి, యుద్ధాలు చేసి ఆ దేశాలను వలసలుగా ఏర్పరచుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 4.
అయిదు దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు అప్రజాస్వామికం కాబట్టి వాటిని రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుంటారు. అయితే ఈ దేశాలకు ప్రత్యేక అధికారాలు లేకపోతే ఐక్యరాజ్య సమితి సాఫీగా పనిచేయలేదని కొంతమంది అంటారు. చర్చించండి.
జవాబు:
ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామిక దేశాలు, ఇటువంటి నేపథ్యంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండడం సరైనది కాదు. మరియు ఈ ప్రత్యేక వీటో అధికారంతో ఆ దేశాలు ఐక్యరాజ్య సమితి విధులకు అడ్డు పడుతున్నాయి.. ఐక్యరాజ్య సమితి నిష్పక్షపాతంగా పనిచేయకుండా ఈ వీటో అధికారం ఉన్న దేశాలు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 5.
1955 బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలసపాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. మరియు కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల అభద్రతాభావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఇదే 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 6.
అలీనోద్యమ సూత్రాలకు అగ్రరాజ్యాలు ఎలా స్పందించాయి?
జవాబు:

  1. రెండు అగ్రరాజ్యాలు అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి.
  2. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది.
    ఉదా : ఆఫ్ఘనిస్థాన్ పై నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 7.
అలీనోద్యమ దేశాలను మూడవ ప్రపంచ దేశాలని ఎందుకంటారు?
జవాబు:

  1. రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు అధికార కూటములుగా విడిపోయింది. అవే రష్యా, అమెరికాలు. ఆ దేశాలు ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తులుగా అవతరించాయి.
  2. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఆసియా, ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం సంపాదించుకొని, ఈ రెండు అగ్రరాజ్యాల శక్తి కూటములలో చేరలేదు. ఈ దేశాలు చాలావరకు అలీనోద్యమ విధానాన్ని స్వీకరించాయి.
  3. ఈ దేశాలు పెద్ద రాజ్యాల విధానాల మీద తమదైన రీతిలో ప్రభావం చూపాయి. వీటి విస్తీర్ణం, జనాభా వ్యూహాత్మకమైన, కీలకమైన స్థానాల కారణంగా ఇవి మూడవ ప్రపంచదేశాలని పేరు తెచ్చుకున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 8.
ఘర్షణలలో పాలస్తీనియన్లకు ఈజిప్టు ఎందుకు మద్దతు నిచ్చింది?
జవాబు:

  1. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబ్బు దేశాలలో కాందిశీకులుగా ఆశ్రయం పొందారు. ఈ అరబ్బులందరినీ ఏకం చేయాలని ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్జెల్ నాసర్ ప్రయత్నించి పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చాడు.
  2. ఈజిప్టుకు ఇజ్రాయెల్ కు మధ్యన ఉన్న వైరం మూలంగా ఇజ్రాయెల్ శత్రుదేశమైన ‘పాలస్తీనాకు ఈజిప్టు మద్దతు ఇచ్చిందని అనుకోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.290

ప్రశ్న 9.
శరణార్థుల శిబిరాలలో ఉంటూ నిరంతరం యుద్ధభయమూ, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల జీవన పరిస్థితుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రజలందరూ పేదవారు. నిరక్షరాస్యులు ఎక్కువ.
  2. నిరంతర యుద్ధాల వల్ల ప్రజలు శరణార్థుల శిబిరాలలో నివసించవలసి వచ్చింది.
  3. నిరంతరం యుద్ధభయం కారణంగా ప్రజలు ప్రశాంత జీవితాన్ని కోల్పోయారు.
  4. ఇతర జీవనాధారాలు లేక ప్రజలు పేదరికంలో మగ్గిపోసాగారు.

ఈ విధంగా ఆనాడు పాలస్తీనియన్లు దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 10.
సరిహద్దులకు సంబంధించి గత వైరుధ్యాలను మరచి రెండు దేశాలు ఎంత వరకు అర్థవంత సహకారాన్ని, మిత్రత్వాన్ని సాధించగలవని అనుకుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం రెండు దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తింపబడుతున్నాయి. ఈ ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం రెండు దేశాలకూ ఉంది. దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ, ఆర్థిక పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి. సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి, సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 11.
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు కారణాలు ఏమిటి?
జవాబు:
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు ఇవి కారణాలు :

  1. పాలస్తీనా యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్ర స్థలం, అరబ్బులు, ఇజ్రాయెల్ ని చట్టబద్ద దేశంగా గుర్తించటానికి తిరస్కరించారు.
  2. యూదులు పాలస్తీనాని తమ వాగత భూమిగా పరిగణిస్తారు.
  3. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జిమానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది.
  4. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (ఎక్కువమంది అరబ్బు, ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ మొదలయ్యింది.
  5. అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనటంతో ఇరువర్గాల మధ్యే కాకుండా అమెరికా, రష్యాలు కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించడం ఘర్షణలకు కారణాలయ్యాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 12.
కొంతమంది పాలస్తీనియన్లు ఉగ్రవాద పంథాని ఎందుకు ఎంచుకున్నారు? దాని ఫలితాలు ఏమిటి?
జవాబు:
1964లో జోర్డాన్లో “పాలస్తీనా విముక్తి సంఘం” (పిఎల్‌ఓ) ఆవిర్భవించింది. దీని ముఖ్య ఉద్దేశం అరబ్బు బృందాలన్నింటిని ఏకం చేయడం, కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగిపొందటం. దీని నాయకుడు “యాసర్ అరాఫత్”.

ఇది ఉగ్రవాద పంథాని ఎంచుకోవడానికి కారణం :

  1. 1967లో పాలస్తీనా విముక్తి సంఘం (పిఎల్ఓ)- ఇజ్రాయెల్ పై దాడి చెయ్యాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబ్బు దేశాలు అంత ఉత్సాహం చూపలేదు.
  2. అరబ్బు దేశాల సహకారం లేకపోవడంతో పాలస్తీనా విముక్తి సంఘంలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి ఉగ్రవాద పంథాని ఎంచుకున్నది.

దీని వల్ల ఫలితాలు :

  1. దాడులు, ప్రతిదాడులతో నిత్యం యుద్ధ వాతావరణంతోటి, ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది.
  2. పిఎల్‌ఓ పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది.
  3. చివరకు అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్‌ను గుర్తించటం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించాడు.
  4. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 13.
అరబ్బు సోషలిస్టు జాతీయతావాదానికీ, మతపర జాతీయతావాదానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అరబ్బు సోషలిస్టు జాతీయవాదానికీ, మతపర జాతీయవాదానికీ మధ్య తేడాలు.

సోషలిస్టు జాతీయవాదం మతపర జాతీయవాదం
1) సోషలిజం అంటే అరబ్బుల ఉద్దేశంలో చమురు వనరుల జాతీయకరణ చేయడం. 1) అనేక ప్రాంతాలలో అమెరికాకు, అమెరికా మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలకు వ్యతిరేకత, మతపరమైన రంగు సంతరించుకుంది.
2) చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చుచేయటం. 2) సంపదను, అవకాశాలను అందరికీ సమంగా పంచాలన్న భావనకు జాతీయవాద శక్తులు రాకుండా ఆయా దేశాలలో మత ఛాందసవాదులు అధికారంలోకి రావడానికి మద్దతునిచ్చాయి.
ఉదా : ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 14.
ఇరాన్ లోనూ, తాలిబన్ల కింద ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోనూ సంభవించిన పరిణామాలను తెలుసుకుని మతపర ప్రభుత్వాలు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోండి.
జవాబు:
1) ఇరాన్ :
1979లో ఇరాన్లో విప్లవం సంభవించి, ఇరాన్ రాజుని తొలగించి, షియా ఇస్లామిక్ మత గురువులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

2) ఆఫ్ఘనిస్తాన్ :
ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మతపర ప్రభుత్వాల పని విధానం :

  1. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మత గ్రంథాలలో ఉన్న నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను బలవంతం చేయసాగారు.
  2. దీని మూలంగా మహిళలకు, మతపర అల్ప సంఖ్యాక ప్రజలకు మౌలిక స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి.
  3. అరబ్బులలో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా మతపర ఉగ్రవాదం అధికమైంది. కొంత మంది అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన రెండు విమానాలను హై జాక్ చేసి వాటితో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్ళడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేలమంది మరణించారు. ఈ విధంగా మతపరప్రభుత్వాల మూలంగా అనేక విధ్వంపాలు జరుగుతున్నాయని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.293

ప్రశ్న 15.
రెండు ధృవాల, ఏకధృవ ప్రపంచం అన్న పదాలను వివరించండి.
జవాబు:
1) రెండు ధృవాల ప్రపంచం :
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు దేశాలను ‘రెండు ధృవాల’ ప్రపంచమని అంటారు.

2) ఏకధృవ ప్రపంచం :
1991 అధ్యక్ష ఎన్నికలలో గోర్బచెవ్ గెలుపొంది, యుఎస్ఎస్ఆర్ ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు. పాత యుఎస్ఎస్ఆర్ లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్’ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. దీనినే ఏకధృవ ప్రపంచం అని అంటాము.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 16.
రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొనటానికి భారతదేశం, పాకిస్తాన్లు ఏ చర్యలు తీసుకోవాలి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనడానికి ఈ కింది చర్యలు తీసుకోవచ్చు.

  1. పాకిస్తాన్ కూడా లౌకిక రాజ్యం కావాలి. మతతత్వ భావనను విడనాడాలి.
  2. పాకిస్తాన్ మత ఛాందసవాదాన్ని విడిచి పెట్టి ప్రజలకు స్వేచ్ఛను కలిగించాలి. దీని వల్ల ఇరు రాజ్యా లూ మత ప్రసక్తి లేని వాతావరణంలో సంప్రదింపులు జరుపుకోవచ్చు.
  3. రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెంచాలి.
  4. రెండు దేశాల ప్రజలలో సామరస్య దోరణులు కలిగేలా చర్యలు తీసుకోవాలి.
  5. తాము ఉపఖండ దేశాలమని, భారతదేశం, పాకిస్తాన్ దేశాలు కలసి కొన్ని వందల సంవత్సరాలు సహజీవనం సాగించామని గుర్తుకు తెచ్చుకోవాలి.
  6. క్రీడలు, సినిమాలు, వాణిజ్యం, పర్యటన, సాంస్కృతిక సంబంధాలు, వివాహ సంబంధాలతో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంచవచ్చు.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 17.
భారతదేశం, పాకిస్తాన్ల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరం ఏమిటి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్‌ అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరమే. ఎందుకనగా………
1) యుద్ధ ఖర్చు :
ఈ రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతుండడంతో ఇరు దేశాలు ఆయుధాలను, సైనికసంపత్తిని సమీకరించుకొనుటకు అధిక ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటే యుద్ధ ఖర్చు తగ్గుతుంది.

2) ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది :
ఇరు దేశాల మధ్య యుద్ధ భయం లేకపోతే ఇరు దేశాల ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో జీవిస్తారు.

3) సరిహద్దు రాష్ట్రాలలో యుద్ధభీతి తగ్గుతుంది :
సరిహద్దు రాష్ట్రాల వాళ్లు యుద్ధ భయం లేకుండా ప్రశాంత జీవనం సాగించవచ్చు.

4) సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరుదేశాలకూ ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం, శాంతి నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 18.
పొరుగునున్న పెద్ద దేశాలు ‘పెద్దన్న లాగా’ వ్యవహరిస్తున్నాయని అనేక దేశాలు ఆరోపిస్తూ ఉంటాయి. దీని అర్థం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. భారతదేశపు పొరుగు దేశాలలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పెద్ద దేశాలు, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి చిన్న దేశాలు ఉన్నాయి.
  2. భారతదేశం విశాలమైన దేశమైనందున పొరుగు దేశాలు మన పట్ల అపోహలు పెంపొందించుకోవడం, మన చర్యలను అపార్థం చేసుకోవడం జరుగుతుంది.
  3. చిన్న దేశాలు, పెద్ద దేశమైన భారతదేశం తమ మీద ఆధిపత్యం చేస్తుందని, భారతదేశం “పెద్దన్న పాత్ర” పోషిస్తుందని అంటున్నాయి.
    ఉదా : బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించటాన్ని బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది. తీరప్రాంతాలలో భారతదేశం ‘పెద్దన్న పాత్ర’ పోషిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 19.
భారతదేశం, బంగ్లాదేశ్ ఉన్న పటం చూసి రెండు దేశాల మధ్య సహకారం ఆ రెండింటికీ ఎందుకు కీలకమైనదో పేర్కొనండి.
జవాబు:
భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య సహకారం ఆ రెండు దేశాలకూ చాలా కీలకమైనది. ఎందుకనగా

  1. బంగ్లాదేశ్ చుట్టూ సరిహద్దుగా భారతదేశ రాష్ట్రాలున్నాయి. ఈ సరిహద్దు రాష్ట్రాలలో బంగ్లాదేశ్ ఏమైనా అసాంఘిక చర్యలు చేపట్టినట్లయితే భారతదేశ జాతీయ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుంది. కావున ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు అవసరం.
  2. బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల విషయం ఇరుదేశాలకు సంబంధించింది. కావున జలాల పంపిణీ సక్రమంగా, సమస్యలు లేకుండా జరగాలన్నా ఇరు దేశాల మధ్య స్నేహ, సహకారాలు అవసరమే.
  3. బంగ్లాదేశ్ తో మనకు స్నేహ, సహకారాలు లోపిస్తే బంగ్లాదేశ్ ఇతర అగ్ర రాజ్యాల ఆధిపత్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. కావున బంగ్లాదేశ్, భారతదేశాల మధ్య సహకారం చాలా కీలకమైనదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.297

ప్రశ్న 20.
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతుని, శ్రీలంకలో దాని పాత్రని పోల్చండి. రెండు దేశాలలో పరిస్థితి ఒకే రకంగా ఉందా, తేడాలు ఉన్నాయా?
జవాబు:
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతు వేరు. శ్రీలంక పరిస్థితి వేరు.

  1. బంగాదేశ్ భారతదేశ సహాయంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది. భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంది.
  2. శ్రీలంక కూడా వలసపాలన నుంచి 1948లో స్వాతంత్ర్యం పొందింది. అయితే శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం చిన్నచూపు మూలంగా తమిళుల్లో తాము వేరు అన్న భావన ఏర్పడింది. దీనికి ప్రభుత్వమే కారణం.
  3. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. దీంతో శ్రీలంకలో శాంతిని నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించినందుకు తమిళ తీవ్రవాదులు ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపారు. కావున బంగ్లాదేశ్ కి మనమిచ్చే మద్దతు వేరు. శ్రీలంకకు మనమిచ్చిన మద్దతు వేరు.