Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 2nd Lesson మన చుట్టూ ఉన్న మొక్కలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 2 మన చుట్టూ ఉన్న మొక్కలు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మొక్కల వివిధ భాగాలు చెప్పండి ? బొమ్మ సహాయంతో.
జవాబు.
వేర్లు, కాండము, పువ్వులు, కాయలు మరియు ఆకులు మొక్కల ” యొక్క వివిధ భాగాలు.
ప్రశ్న 2.
మొక్కకు వేర్లు ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పండి?
జవాబు.
- వేర్లు నేల దిగువ భాగంలో ఉండే మొక్క యొక్క ముఖ్యమైన భాగం.
- మొక్కను నేలలో స్థిరంగా ఉంచుతాయి.
- వేర్లు నేలలోని లవణాలను, నీటిని పీల్చుకుని కాండము, ఆకులు వంటి ఇతర భాగాలకు పంపుతాయి.
ప్రశ్న 3.
మొక్కకు కాండము ఏ విధంగా ఉపయోగపడుతుంది ?
జవాబు.
- కాండము వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను, మొక్కలోని వివిధ భాగాలకు అందజేస్తుంది.
- మొక్కకు ఊతం (బలం) ఇస్తుంది.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
సీత ఇల్లు, లక్ష్మీల ఇల్లు చూడండి. మొక్కలకు సంబంధించి మీరు వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు ?
జవాబు.
సీత నివాసంపై ప్రశ్నలు | లక్ష్మి నివాసంపై ప్రశ్నలు |
1. నీకు మొక్కలంటే ఇష్టమా ? | 1. నీకు మొక్కలంటే ఇష్టం లేదా ? |
2. మొక్కలవల్ల ఉపయోగాలు ఏంటి? | 2. మీకు మంచిగాలి వస్తుందా ? |
3. మీ పెరటి తోటలో ఏఏ మొక్కలు ఉన్నాయి? | 3. మీ ఇంటిలో వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుందా ? |
4. మీ కూరగాయలు మీరే పండిస్తారా? | 4. మీరు కాయగూరలు కొనుక్కుంటారా? |
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ పరిసర ప్రాంతంలో ఉన్న చెట్లు గుల్మాలు, పొదలు, ఎగబ్రాకేవి, నేల పై ప్రాకేవి గుర్తించి – పేర్లు రాయండి.
జవాబు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ పరిసర ప్రాంతంలో ఉన్న వాసన ఇచ్చే కొన్ని ఆకుల్ని సేకరించండి. వాటి పేర్లు రాయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
V. పటనైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమునాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం:
ప్రశ్న 7.
మీ పరిసరాలలో మీకు నచ్చిన చెట్టు బొమ్మను గీయండి. రంగులు వేయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 8.
క్రింది ఆకులకు రంగులు వేయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పృహ కల్గి ఉండడం:
ప్రశ్న 9.
చెట్ల కొమ్మలు విరిచివేయడం చూసినప్పుడు నువ్వు ఏ విధంగా అనుభూతి చెందుతావు? ఏమి చేస్తావు?
జవాబు.
చెట్ల కొమ్మలు ఎవరైనా విరిచి వేయడం చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను అలాంటప్పుడు వారికి చెట్ల ప్రాముఖ్యతను, వాటి ఉపయోగాలను తెల్పి వారి ప్రయత్నాన్ని విరమింపచేస్తాను.
ప్రశ్న 10.
మీ పాఠశాల ఆవరణలో రాలిన ఆకుల్ని చూసి నువ్వు ఏమిచేస్తావు ?
జవాబు.
మా పాఠశాల ఆవరణలో రాలిన ఆకుల్ని గమనిస్తే వాటన్నింటిని సేకరించి వాటితో క్రింది విధంగా పెరటితోటకు ఉపయోగపడే సహజ ఎరువును తయారు చేస్తాను. ఒక గుంట తీసి క్రింది పడిన ఆకులు, వాడి పారేసిన ఆహార వ్యర్థాలు, గుడ్ల పెంకులు మొదలైన వాటితో ఆ గుంటను నింపుతాను. దానిని కొన్ని రోజులు అలా వదలి వేస్తాను. అప్పుడు మొక్కల పెరుగుదలకు ఆ కుళ్ళిన పదార్థాన్ని ఎరువుగా వాడతాను.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మ్రాను అనగా ఏమిటి ?
జవాబు.
ఆ మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ, వాటి కాండాలు కూడా బలంగా మారతాయి. ఈ బలమైన కాండాన్ని “మ్రాను” అంటారు. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి.
ఉదా : మజ్జి మ్రాను, చింతమ్రాను
ప్రశ్న 2.
‘పొదలు’ అనగానేమి ?
జవాబు.
గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ‘పొదలు’ అంటారు.
ఉదా : గులాబి, మందార.
ప్రశ్న 3.
‘గుల్మా లు’ అనగా నేమి ?
జవాబు.
మెత్తగా, ఆకుపచ్చ కాండాలు కల్గి ఉన్న మొక్కల్ని “గుల్మాలు” అంటారు.
ఉదా : తలసి, గోధుమ .
ప్రశ్న 4.
“ఎగబ్రాకే మొక్కలు” అని వేనిని అంటారు ?
జవాబు.
ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని, ఎగబ్రాకే మొక్కలు’ అంటారు.
ఉదా : ద్రాక్ష, కాకర.
ప్రశ్న 5.
“పాకే మొక్కలు” అనగానేమి ?
జవాబు.
నేల పై పాకుతూ పెరిగే మొక్కల్ని, ‘పాకే మొక్కలు’ అంటారు.
ఉదా : పుచ్చకాయ, గుమ్మడికాయ
ప్రశ్న 6.
ఆకు యొక్క వివిధ భాగాలను బొమ్మ సహాయంతో తెల్పండి.
జవాబు.
ఆకులోని భాగాలు అగ్రం, అంచు, ఈనె, కాడ.
ప్రశ్న 7.
“ఆకులను ఆహార కర్మాగారాలు” అంటారు. ఎందుకు ?
జవాబు.
ఆకులను మొక్కలకు ఆహారం అందించే ‘ఆహార కర్మాగారాలు’ అంటారు. ఎందుకంటే ఆకుపచ్చని ఆకులు గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో “కిరణజన్య సంయోగక్రియ” ద్వారా తమ
ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి.
ప్రశ్న 8.
సహజ ఎరువును ఎలా తయారు చేస్తారు?
జవాబు.
సహజ ఎరువును క్రింది విధంగా తయారు చేస్తారు. ఒక గుంట తీయండి. కింద పడ్డ ఆకులు, వాడి పారేసే ఆహార పదార్థ వ్యర్థాలు గుడ్ల పెంకులు
మొదలైన వాటితో ఆ గుంటను నింపండి. దాన్ని అలా కొన్ని రోజులు వదిలి వేయండి. అక్కడ కుళ్ళి పోయిన పదార్థాన్ని మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి ఎరువుగా వాడవచ్చు.
II. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 1.
మీరు వేర్వేరు మొక్కల ఆకులను గమనించండి. అన్ని ఆకులు ఒకే ఆకారం, రంగు, పరిమాణం, వాసన కల్గి ఉంటాయా ? మీ పరిశీలనలు తెల్పండి.
జవాబు.
ఆకులు | పరిశీలనలు |
1. అరటి ఆకు | చాలా పెద్దగా ఉంటుంది. |
2. మందార ఆకు | వెడల్పుగా, అంచులు రంపం ఆకారంలో ఉంటాయి. |
3. బొప్పాయి ఆకు | హస్తం ఆకారంలో ఉంటాయి. |
4. కొబ్బరి ఆకులు | పొడవుగా ఈనెలతో ఉంటాయి. |
5. చింతచెట్లు ఆకులు | చిన్నవిగా ఉంటాయి. |
6. పుదీన, కొత్తిమీర, తులసి | మంచి వాసన కల్గి ఉంటాయి. |
ప్రశ్న 2.
కొన్ని నిమ్మ, మామిడి, వేప, తులసి, పుదీన, కొత్తిమీర ఆకులు సేకరించండి. ఆకులను ఒక్కొక్కటిగా కొంచెం నలిపి వాసన చూడండి. అన్ని ఆకులు వాసన ఒకేలా ఉందా ? మీ స్నేహితులతో చర్చించండి. మీకు ఆకులు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెల్పండి.
జవాబు.
ఈ అన్ని ఆకులు ఒకే వాసనను కల్గి ఉండవు. వేర్వేరు వాసనలు కల్గి ఉంటాయి. వివిధ ఆకులవల్ల ఉపయోగాలు:
- మనం కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకులను తింటాం.
- తేయాకులతో టీ తయారు చేసుకుంటాం.
- వేప, తులసి – ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తాం.
- అరటి, మర్రి వంటి ఆకుల్ని విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగిస్తారు.
V. పటనైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమునాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం:
ప్రశ్న 9.
ఆకుల ఆల్బం తయారు చేయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
ప్రశ్న 10.
ఈ క్రింది అందమైన చిత్రాలు గమనించండి. ఇవి వివిధ రకాల ఎండుటాకులతో తయారు చేయబడ్డాయి. వివిధ రకాల జంతువుల ఆకారాలు ఎండుటాకులతో రూపొందించి మీ నోటు పుస్తకంతో అతికించండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పృహ కల్గి ఉండడం:
ప్రశ్న 11.
మొక్కలవల్ల ఉపయోగాలేంటి ?
జవాబు.
- మొక్కలు ప్రకృతి ప్రసాదించిన వరం.
- మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి.
- స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి.
- మనం విడిచిన గాలిలోని కార్బన్-డై-ఆక్సైడ్ ను మొక్కలు పీల్చుకుని మనకు ఆక్సిజన్ ను అందిస్తాయి.
- మొక్కల వేర్లు బలంగా నేలలోకి చొచ్చుకు పోవటం వల్ల నేలకోతకు గురికాదు. భూసార నష్టం కాకుండా కాపాడతాయి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
క్రింది వానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి.
A) పుచ్చతీగ
B) గుమ్మడి తీగ
C) కొత్తిమీర
D) స్ట్రాబెర్రీ
జవాబు.
ప్రశ్న 2.
____________ లు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు.
A) కొమ్మలు
B) ఆకులు
C) కాండము
D) వేర్లు
జవాబు.
B) ఆకులు
ప్రశ్న 3.
మెత్తగా, ఆకుపచ్చని కాండాలు కల్గిన మొక్కల్ని ____________ అంటారు.
A) గుల్మాలు
B) నేల పై పాకే మొక్కలు
C) చెట్లు
D)ఎగబ్రాకే మొక్కలు
జవాబు.
A) గుల్మాలు
ప్రశ్న 4.
____________ మొక్కను నేలలో స్థిరపరుస్తాయి.
A) కాండము
B) వేర్లు
C) ఆకులు
D) పువ్వులు
జవాబు.
B) వేర్లు
ప్రశ్న 5.
బలమైన కాండాన్ని ____________ అంటాం.
A) వేర్లు
B) మ్రాను
C) గోళ్ళు
D) చెట్లు
జవాబు.
B) మ్రాను
ప్రశ్న 6.
____________ నేలలోని ‘లవణాలను, నీటిని గ్రహిస్తాయి.
A) కాండము
B) వేర్లు
C) ఆకులు
D) కొమ్మలు
జవాబు.
B) వేర్లు.
ప్రశ్న 7.
మొక్క వివిధ భాగాలకు ____________ లవణాలను, నీటిని చేరుస్తాయి.
A) వేర్లు
B) కాండము
C) ఆకులు
D) మొక్కలు
జవాబు.
B) కాండము
ప్రశ్న 8.
మొక్కలు ____________ ను గ్రహించి ____________ ను విడుదల చేస్తాయి.
A) ఆక్సిజన్, హైడ్రోజన్
B) కార్బన్-డై-ఆక్సైడ్, ఆక్సిజన్
C) హైడ్రోజన్, ఆక్సిజన్
D) ఆక్సిజన్ – కార్బన్ డై ఆక్సైడ్
జవాబు.
B) కార్బన్-డై-ఆక్సైడ్, ఆక్సిజన్
ప్రశ్న 9.
ఎరువు తయారీలో ____________ ను వాడతారు.
A) రాలిన ఆకులు
B) కొమ్మలు
C) వేర్లు
D) మొక్కలు
జవాబు.
A) రాలిన ఆకులు
ప్రశ్న 10.
క్రింది వాటిలో ఔషధాల తయారీలో వాడేవి ____________
A) కొబ్బరి, సపోటా
B) తులసి, వేప
C) మామిడి, చింత
D) మజ్జి, టీ చెట్లు
జవాబు.
B) తులసి, వేప