Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 7th Lesson మన ఇల్లు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 7 మన ఇల్లు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
కచ్చా ఇంటికి, పక్కా ఇంటికి గల తేడాలేవి ?
జవాబు.
కచ్చా ఇల్లు | పక్కా ఇల్లు |
1. మట్టి మరియు గడ్డితో నిర్మించిన ఇళ్ళు . | 1. ఇటుకలు, ఇసుక, సిమెంట్ మరియు ఇనుముతో నిర్మించిన ఇళ్ళు. |
2. ఇవి దృఢమైనవి కావు. | 2. ఇవి దృఢమైనవి. |
3. ఉదా : గుడిసెలు, పూరిళ్ళు | 3. ఉదా : డాబాఇళ్ళు, అపార్ట్మెంట్స్ |
ప్రశ్న 2.
మనకు నివశించుటకు ఇల్లు ఎందుకు అవసరం ?
జవాబు.
మనం నివశించే ప్రదేశాన్ని ఇల్లు అంటారు. జీవులన్నింటికి అనగా పక్షులు, జంతువులు, మనుషులు, నవివశించుటకు ఇళ్ళు అవసరం. ఇల్లు ఎండ, వాన, చలి, దుమ్ము, కృరమృగాల నుంచి రక్షణ ఇస్తుంది.
ప్రశ్న 3.
గుడారాలు మరియు పైపులలో నివశించే ప్రజలకు ఏమి సహాయం చేయవచ్చు?
జవాబు.
గుడారాలు మరియు పైపులలో నివశించే ప్రజలకు బట్టలు, దుప్పట్లు కోట్లు, పుస్తకాలు, చిన్న చిన్న వంట సామాన్లు ఇవ్వటం ద్వారా సహాయం చేయవచ్చు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
దీప్తి చెట్టుపైన ఉన్న తేనె పట్టును గమనించండి. ఆమె తేనె పట్టు గురించి తెలుసుకోవాలని అనుకుంది. ఆమె ఉపాధ్యాయుని ఏయే ప్రశ్నలు అడుగుతుంది.
జవాబు.
దీప్తి తేనె పట్టు గురించి తెలుసుకోటానికి టీచరు. క్రింది విధంగా ప్రశ్నించి ‘ఉంటుంది.
- తేనెపట్టు అంటే ఏమిటి?
- ఖాళీ తేనెపట్టు, తేనెటీగలను ఆకర్షిస్తుందా?
- ఏ చెట్లపై తేనె పట్టుకు రక్షణ ఉంటుంది?
- తేనెపట్టు దేనికి సంకేతం?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
వివిధ రకాల జంతువుల, పక్షుల, కీటకాల నివాసాలను గమనించి వాటి పేర్లను తెల్పండి.
(a) వివిధ జంతువులు వాటి నివాసాలు.
జవాబు.
జంతువు | నివాసాలు |
1. కుక్క | కెన్నెల్ |
2. ఆవు, గేదె | షెడ్ |
3. పంది | స్ట్ |
4. గుఱ్ఱం | గుఱ్ఱపు శాల |
5. కోతి | చెట్టు |
6. పాము | పుట్ట |
7. సింహాం | బోను |
(b) వివిధ పక్షులు వాటి నివాసాలు.
జవాబు.
పక్షులు | నివాసాలు |
1. పిచ్చుక | గూడు |
2. కోడి | కూప్ (బుట్ట) |
3. వడ్రంగి పిట్ట | చెట్ల తొర్రలు |
(c) కీటకాలు వాటి నివాసాలు.
జవాబు.
కీటకం | నివాసం |
1. తేనెటీగ | తేనెపట్టు |
2. సాలీడు | సాలెగూడు |
3. పట్టు పురుగు | పట్టు పురుగు గూడు |
4. చీమ | పుట్ట |
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్ళ పై కప్పులను గమనించి క్రింది పట్టికను పూరించండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
ఐస్క్రీం పుల్లలు, అగ్గిపుల్లలతో ఒక గుడిసె నమూనాను తయారు చేయండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
నీకు పక్షి/పిల్లి/కుక్క వంటి పెంపుడు ప్రాణి ఉన్నట్లైతే దానిని నీవు ఎలా పంరక్షిస్తావు?
జవాబు.
నాకు ఏదైనా పక్షి, పిల్లి లేక కుక్క వంటి పెంపుడు జంతువు ఉన్నట్లైతే దానిని క్రింది విధంగా సంరక్షిస్తాను.
- నా పెంపుడు జంతువుకు మంచి ఆహారాన్నిస్తాను.
- ప్రతిరోజూ బయటికి తీసుకు వెళ్తాను.
- సకాలంలో వాటికి వ్యాక్సిన్లు వేయిస్తాను.
- పరిశుభ్రమైన, ఆరోగ్యకర వాతావరణంలో వాటిని ఉంచుతాను.
- వాటిని ఒంటరిగా ఎక్కువ రోజులు వదిలి వెళ్ళను. అలా వెళ్ళాల్సి వస్తే వాటి బాధ్యత ఎవరికైనా అప్ప చెప్తాను.
వ్యాక్సిన్లు వావరణంలో వెళ్ళను.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
ఇళ్ళ పరిణామక్రమాన్ని తెలియ చేయండి.
జవాబు.
గుహలు → పూరిళ్ళు → మట్టి ఇళ్ళు → పెంకుల ఇల్లు → పక్క ఇల్లు → అపార్ట్మెంట్స్
ప్రశ్న 2.
ఇండ్ల నిర్మాణం ఏఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది ? ఇళ్ళు కట్టుకోవడం క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
జవాబు.
- వాతావరణం
- ఆర్థిక పరిస్థితి
- లభ్యమయ్యే సామాగ్రి
- స్థలం లభ్యత.
ప్రశ్న 3.
వివిధ రకాల ఇండ్లను గూర్చి టేబుల్ లో తెల్పండి.
జవాబు.
ప్రశ్న 4.
ఇళ్ళ పై కప్పులు వాలుగా నిర్మిస్తారు. ఎందుకు?
జవాబు.
ఆ ఇళ్ళ పైకప్పులు ఏటవాలుగా నిర్మిస్తారు ఎందుకంటే మంచు, వర్షపునీరు నిల్వ ఉండకుండా ప్రవహించేందుకు వీలుగా.
ప్రశ్న 5.
ఇళ్ళను పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి ?
జవాబు.
ఇల్లు గుడిసె ఐనా, పెంకుటిల్లు ఐనా, డాబాఐనా మనం ఇంటిని సర్దుకున్న విధానంను బట్టి ఆ ఇల్లు శుభ్రంగా, అందంగా కనిపిస్తుంది. చెత్త చెదారం ఎప్పటికప్పుడు తొలగించి దూరంగా పడేయాలి. శుభ్రంగా ఉన్న ఇల్లు ఆరోగ్యాన్నిస్తుంది.
ప్రశ్న 6.
ఇంటి చుట్టూ చెత్తను వేస్తే ఏమి జరుగును?
జవాబు.
ఇంటి చుట్టూ చెత్తను వేస్తే దుర్వాసన వస్తుంది. దోమలు, ఈగలు, వృద్ధి చెందుతాయి. మనం ఎప్పుడూ చెత్తను ఇంటికి దూరంగా పడేయాలి. ఎప్పటికప్పుడు ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
నీకిష్టమైన ఇంటి బొమ్మను గీచి రంగులు వేయి.
జవాబు.
విద్యార్థికృత్యము.
VI. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 8.
మీ పొరిగింటికి వెళ్ళి ఏయే సౌకర్యాలున్నాయో గమనించండి ? క్రింది పట్టికలో, కొన్ని వసతులు ఇవ్వబడ్డాయి. వాటి కెదురుగా (✓) గుర్తు పెట్టండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
_____________ మనకు నీడను, రక్షణను ఇస్తుంది.
A) చెట్టు
B) ఇల్లు
C) పెంపుడు జంతువు
D) ఏదీకాదు
జవాబు.
B) ఇల్లు
ప్రశ్న 2.
సంచార జీవనం చేయువారు _____________ లో నివశిస్తారు.
A) పక్కా ఇల్లు
B) డాబా
C) టెంట్స్
D) ఏదీకాదు
జవాబు.
C) టెంట్స్
.ప్రశ్న 3.
చక్రాల పై ఇల్లును _____________ అంటారు.
A) టెంట్
B) కారవాన్
C) ఇగ్లు
D) అన్నీ
జవాబు.
B) కారవాన్
ప్రశ్న 4.
ప్రదేశాలను మారుస్తూ ఉండే ఇళ్ళు _____________
A) తాత్కా లికమైనవి
B) శాశ్వత ఇళ్ళు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు.
A) తాత్కా లికమైనవి
ప్రశ్న 5.
ఇంటి పై భాగాన్ని _____________ అంటారు.
A) గోడ
B) నేల
C) ఫౌండీషన్
D) పై కప్పు
జవాబు.
D) పై కప్పు
ప్రశ్న 6.
రాతి ఇళ్ళు ఎక్కువగా _____________ ప్రాంతాల్లో ఉంటాయి.
A) ఆంధ్ర
B) రాయలసీమ
C) తెలంగాణ
D) ఏదీకాదు
జవాబు.
B) రాయలసీమ
ప్రశ్న 7.
సింహాలు, ఎలుగుబంట్లు నివశించే _____________
A) గూడు
B) నామంత ఇరు
C) బారియలు
D) ఏదీకాదు
జవాబు.
B) నామంత ఇరు
ప్రశ్న 8.
కుందేళ్ళు, ఉడతలు _____________ లో నివశిస్తాయి.
A) గూడు
B) గుహలు
C) బారియలు
D) ఏదీకాదు
జవాబు.
C) బారియలు
ప్రశ్న 9.
ఇల్లు లేని జంతువులు _____________
A) ఏనుగులు
B) కోతులు
C) జిరాఫీలు
D) పై అన్నీ
జవాబు.
D) పై అన్నీ
ప్రశ్న 10.
తాత్కాలిక ఇళ్ళు ఇలాంటి సమయంలో నిర్మించుకుంటారు _____________
A) వరదలు
B) తుఫానులు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు.
C) A మరియు B