Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 10th Lesson చూసివద్దాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 10
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మీ గ్రామంలో జరుపుకునే కొన్ని పండుగల పేర్లు రాయండి.
జవాబు.
మా గ్రామంలో ఉగాది, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్టమస్, హోలి మొదలైన పండుగలను జరుపుకుంటాము.
ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరుపుకునే జాతీయ పండుగల పేర్లను రాయండి.
జవాబు.
మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవము, రిపబ్లిక్ డే మొదలైన జాతీయ పండుగలను జరుపుకుంటాము.
ప్రశ్న 3.
నీవు ఏ ప్రదేశాలను సందర్శించాలనుకుంటావు?
జవాబు.
నేను జూ, ఖిల్లా, చారిత్రక ప్రదేశాలు, గుహలు మరియు జంతు, పక్షుల సంరక్షణ కేంద్రాలను సందర్శించాలని అనుకుంటాను.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
పక్షి సంరక్షణా కేంద్రాల ఆవశ్యకతను గురించి, మీ టీచరు ఏమేం ప్రశ్నలడుగుతావు?
జవాబు.
- పక్షి సంరక్షణా కేంద్రాల అవసరం ఏమిటి?
- పక్షి సంరక్షణా కేంద్రాలు లేకపోతే ఏమవుతుంది?
- పక్షులు ఎల్లప్పుడూ పక్షి సంరక్షణా కేంద్రాలలోనే ఉంటాయా?
- ఇతర దేశాల నుండి, పక్షులు సంరక్షణా కేంద్రాలకు ఎందుకు వస్తాయి.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ గ్రామంలో పవితమైన ప్రదేశాలను సందర్శించండి. మీరేం తెలుసుకున్నారో రాయండి.
జవాబు.
నేను విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించాను. ఇది హిందువుల పవిత్ర ప్రదేశం. దసరా ఉత్సవాలలో కనక దుర్గ అమ్మవారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ గ్రామ పరిసరాలలోని చారిత్రక ప్రదేశాలను జాబితాగా రాయండి.
జవాబు.
నేను కృష్ణాజిల్లాలోని రామవరప్పాడులో నివసిస్తాను. మాకు దగ్గరలో ఉన్న చారిత్రక ప్రదేశాలు :
చారిత్రక ప్రదేశాలు | ఉన్న ప్రదేశం |
1. గాంధీ కొండ | విజయవాడ |
2. కొండపల్లి ఖిల్లా | కొండపల్లి |
3. ఉండవల్లి గుహలు | ఉండవల్లి |
4. విక్టోరియా మ్యూజియం | విజయవాడ |
5. మొఘలరాజపురం గుహలు | విజయవాడ |
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
దీపావళి దీపాల డిజైన్, క్రిస్మస్ చెట్టు, నెలవంక బొమ్మలు గీయండి.
జవాబు.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
మీరెప్పుడైనా జాతరను చూశారా? జాతరలో మీకు ఆనందాన్నిచ్చే విషయాలు ఏమిటి?
జవాబు.
నేను చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం, రంగం పేట గ్రామంలో జరిగే గంగమ్మ జాతరను చూశాను. ప్రజల భీమ నదిలోని మట్టిని తెచ్చి గంగమ్మ ప్రతిమను తయారు చేశారు. ప్రజలు పంటలు బాగా పండేందుకు ఈ జాతరను చేస్తారు. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
కృత్యము: (TextBook Page No.78)
మీ గ్రామంలో లేదా జిల్లాలో ఏదయినా జాతర వేడుక జరుగుతుందా? మీ స్నేహితులతో చర్చించి, కింది పట్టికను పూరించండి.
జవాబు.
గ్రామం పేరు : పెడన
జాతర పేరు : పైడమ్మ జాతర
దేవత పేరు : పైడమ్మ అమ్మవారు
జాతర తేది : . డిశంబరు (12వ నెల)
జాతర ఎలా జరుపుతారు : ఈ జాతరను ప్రతి సంవత్సరం 12వ నెలలో 12 రోజుల పాటు జరుపుకుంటారు. 12వ రోజు సిడిమువ్వం ఉత్సవాన్ని జరుపుతారు.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సాధారణంగా జరిపే పండుగల పేర్లను చెప్పండి.
జవాబు.
దీపావళి, హోళి, సంక్రాంతి, క్రిస్టమస్, రంజాన్ పండుగలను మా ప్రాంతంలో జరుపుకుంటారు.
ప్రశ్న 2.
మీకు బాగా తెలిసిన మతపరమైన పండుగల పేర్లను చెప్పండి.
జవాబు.
శ్రీరామ నవమి, క్రిస్టమస్, రంజాన్, బుద్ధ పూర్ణిమ, గురునానక్ జయంతి మొదలైనవి మతపరమైన పండుగలు.
ప్రశ్న 3.
నీకు ఇష్టమైన పండుగ ఏది? ఎందుకని?
జవాబు.
నాకు బాగా ఇష్టమైన పండుగ దీపావళి. ఎందుకంటే దీపావళి పండుగనాడు నేను చాలా టపాసులు కాల్చుతాను నాకు టపాసుల వెలుగలు వాటి రంగలు అంటే చాలా ఇష్టం. దీపావళి అనేది దీపాల పండుగ.
ప్రశ్న 4.
మోదుకొండమ్మ జాతర ప్రత్యేకత ఏమిటి?
జవాబు.
- మోదుకొండమ్మ జాతరలో ప్రజలు మోదుకొండమ్మ తల్లిని పూజిస్తారు.
- ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలలో ఇది ప్రధానమైనది.
- జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది.
- గుడి ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి దేవతకు సమర్పిస్తారు.
ప్రశ్న 5.
బండపల్లి గ్రామానికి ఆ పేరు రావడానికి గల చరిత్రను రాయండి.
జవాబు.
- బండపల్లి గ్రామంలో ఒక పెద్దరాయి(బండ) ఉంది.
- గ్రామ దేవత ప్రతిరోజు రాత్రివేళ ఈ బండను సందర్శిస్తుందని ప్రజలు నమ్ముతారు.
- ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి, ఆ ఊరిని బండపల్లి అని పిలుస్తారు.
ప్రశ్న 6.
లేపాక్షి లేదా లేపాక్షి బసవన్న గురించి సమాచారాన్ని సేకరించి రాయండి.
జవాబు.
- అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుని గుడి ఉన్నది.
- 1530లో విజయనగర రాజ్య గవర్నరైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు.
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన “నంది” విగ్రహం ఇక్కడ ఉంది.
- ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు.
ప్రశ్న 7.
చంద్రగిరి కోట చారిత్రక వైభవాన్ని రాయండి.
జవాబు.
- చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది.
- కోటలో రాజమహల్, రాణి మహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం గొప్ప విషయం.
ప్రశ్న 8.
సిద్ధవటం కోట గురించి రాయండి.
జవాబు.
- సిద్ధవటం కోట Y.S.R. కడప జిల్లాలో పెన్నానది ఒడ్డున ఉన్నది
- దీనిని క్రీ.శ. 1303లో నిర్మించారు.
- ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు.
ప్రశ్న 9.
రోళ్ళపాడు పక్షి సంరక్షణా కేంద్రము యొక్క ప్రత్యేకత ఏమటి?
జవాబు.
- రోళ్ళపాడు పక్షి సంరక్షణా కేంద్రం కర్నూలు జిల్లాలో ఉంది.
- బట్టమేక పిట్టకు ఈ ప్రదేశం ఆవాసము.
ప్రశ్న 10.
కొల్లేరు సరస్సు గురించి రాయండి.
జవాబు.
- భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సులో కొల్లేరు ఒకటి.
- గోదావరి-కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్నది.
- కొల్లేటి సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణా కేంద్రం ఉన్నది.
- ఈ పక్షి సంరక్షణా కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టార్క్ అను వలస పక్షులకు సంరక్షణా ప్రదేశం.
ప్రశ్న 11.
బొర్రా గుహల గురించి సమాచారాన్ని సేకరించి రాయండి.
జవాబు.
- బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండలలో ఉన్నాయి.
- బొర్రా గుహలు భారతదేశంలోని లోతైన పెద్దగుహలలో ఒకటి.
- ఈ బొర్రా గుహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తనీ నది కారణంగా ఏర్పడినాయి.
ప్రశ్న 12.
కొండపల్లి కోట గురించి రాయండి.
జవాబు.
- కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో, విజయవాడకు దగ్గరలో ఉంది.
- ఈ కోటను ముసునూరి నాయకులు కట్టించారు.
- 1370లో కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు.
- కొండపల్లి గ్రామం, కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి.
ప్రశ్న 13.
అమరావతి స్థూపం చారిత్రకతను రాయండి.
జవాబు.
- అమరావతి స్థూపం శిధిలావస్థకు చేరిన బౌద్ధస్థూపం.
- అమరావతి, ధరణి కోటలు ఆంధ్ర శాతవాహనుల రాజధానులు.
- శాతవాహనులు బౌద్ధమతాన్ని అనుసరించి అనేక స్థూపాలను నిర్మించారు.
ప్రశ్న 14.
“తేలనీపురం” పక్షి సంరక్షణా కేంద్రం గురించి రాయండి.
జవాబు.
- తేలనీపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి.
- ప్రతి సంవత్సరం సుమారు 3,000 పెలికాన్ మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఈ గ్రామాలను సెప్టెంబర్ నుండి మార్చి వరకు సందర్శిస్తూ ఉంటాయి..
ప్రశ్న 15.
బొబ్బిలి కోట ప్రాముఖ్యతను రాయండి.
జవాబు.
- బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉంది.
- ఈ కోటను బొబ్బిలిలో 19వ శతాబ్ది మధ్య కాలంలో నిర్మించారు.
- ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వీణను తయారు చేస్తున్నారు.
ప్రశ్న 16.
ఆంధ్రప్రదేశ్ లో రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది?
జవాబు.
- సతీష్ థావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) రాకెట్ ప్రయోగ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్ళూరు పేటలో ఉంది.
- కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఇక్కడ నుండి అంతరిక్షంలోకి పంపుతుంటారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
క్రింది వానిలో జాతీయ పండుగ ఏది?
A) రిపబ్లిక్ డే
B) సంక్రాంతి
C) ఓనం
D) దీపావళి
జవాబు.
A) రిపబ్లిక్ డే
ప్రశ్న 2.
క్రింది వానిలో మతపరమైన పండుగ ఏది?
A) రంజాన్
B) క్రిస్టమస్
C) దసరా
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 3.
లేపాక్షి నంది ____________ గా పిలువబడుతుంది.
A) వీరభద్ర
B) లేపాక్షి బసవన్న
C) లేపాక్షి వీరన్న నంది
D) గంగిరెద్దు
జవాబు.
B) లేపాక్షి బసవన్న
ప్రశ్న 4.
చంద్రగిరి కోటను నిర్మించిన వారు ____________
A) ఆంధ్రశాతవాహనులు
B) ముసునూరి నాయకులు
C) యాదవ నాయకులు
D) బొబ్బిలి రాజులు
జవాబు.
C) యాదవ నాయకులు
ప్రశ్న 5.
బొర్రాగుహలు ____________ లోయలో ఉన్నాయి.
A) ఆరకు
B) బ్రహ్మపుత్ర
C) బంగస్
D) కాశ్మీర్
జవాబు.
A) ఆరకు
ప్రశ్న 6.
____________ పక్షి సంరక్షణా కేంద్రం బట్టమేక పిట్టలకు ప్రసిద్ధి..
A) కొల్లేరు
B) పులికాట్
C) తేలుకుంచి
D) రోళ్ళపాడు
జవాబు.
D) రోళ్ళపాడు
ప్రశ్న 7.
____________ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు.
A) బొబ్బిలి
B) కొండపల్లి
C) సిద్దవటం
D) చంద్రగిరి
జవాబు.
C) సిద్దవటం
ప్రశ్న 8.
అమరావతి మరియు ధరణి కోటలు ____________ కు రాజధానులగా ఉండేవి.
A) ఆంధ్ర శాతవాహనుల
B) కొండవీడు రెడ్డి రాజుల
C) ముసునూరి నాయకుల
D) విజయనగర సామ్రాజ్యం
జవాబు.
A) ఆంధ్ర శాతవాహనుల
ప్రశ్న 9.
పెలికాన్ పక్షులు ____________ నుండి వలస వస్తాయి.
A) అమెరికా
B) ఆస్ట్రేలియా
C) సైబీరియా
D) నైజీరియా
జవాబు.
C) సైబీరియా
ప్రశ్న 10.
మోటుపల్లి ____________కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం
A) విజయనగర రాజుల
B) కొండవీడు రెడ్డి రాజుల
C) శాతావాహనుల
D) కాకతీయుల
జవాబు.
D) కాకతీయుల
ప్రశ్న 11.
సలీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ____________ దగ్గర ఉంది.
A) ధరణికోట
B) శ్రీ హరికోట
C) బొబ్బిలికోట
D) రాజకోట
జవాబు.
B) శ్రీ హరికోట