AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 9 మాట్లాడుకుందాం

I. విషయావగాహన:

ప్రశ్న 1.
భావ వ్యక్తీకరణ అనగానేమి? దూరంగా ఉన్న వారితో మీరు ఎలా సంభాషిస్తారు?
జవాబు.
ఇతరులకు మన భావాలను, ఆలోచనలను తెలియ పరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. చూడడం, తల ఊపడం, కాళ్ళు, చేతులు కదపటం మొదలైన శారీరక సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియచేస్తాం. ఇవి కూడా కమ్యూనికేషన్ విధానాలే.

ప్రశ్న 2.
పరోక్ష భావ వ్యక్తీకరణకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు.
పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణలు :

  1. దూరదర్శిని చూడటం
  2. పోస్టకాలు
  3. ఫోన్ కాల్
  4. మెయిల్
  5. మేట్లు మొదలైనవి.

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

ప్రశ్న 3.
వివిధ రకాల శబ్ద సంభాషణల గురించి రాయండి.
జవాబు.
శబ్ద సంబాషణలో వ్యక్తి తన బావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్త పరిస్తే, ఇతరులు అర్ధం చేసుకో గలుగుతారు.
ఉదా :

  1. శరీర కదలికలు
  2. హావ భావాల ద్వారా
  3. కంటి చూపు ద్వారా
  4. స్పర్శద్వారా (కరచాలనం మొదలైనవి.)

ప్రశ్న 4.
పూర్వ కాలంలో సంభాషించడానికి వాడిన పద్ధతుల గురించి వ్రాయండి.
జవాబు.
పూర్వ కాలంలో ప్రజలు దూరంగా ఉన్న వారికి వారు చెప్పదలచుకున్నది ఢంకాధ్వని ద్వారా, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వటం, పావురాల ద్వారా లేఖలు పంపటం, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసే వారి ద్వారా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వర్తమానాలు పంపేవారు.

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 5.
సంకేత భాష గురించి తెలుసుకోవడానికి మీ టీచరు గారిని ఏయే ప్రశ్నలు వేస్తావు?
జవాబు.

  1. సంకేత భాష అంటే ఏమటి?
  2. చీమలు ఒకదానితో ఒకటి ఎలా సంభాషిస్తాయి?
  3. వేర్వేరు జంతువుల మధ్య సంభాషణలు ఎలా జరుగుతాయి?
  4. రైతులు పొలాల్లో దిష్టి బొమ్మలను ఉంచుతారు. ఎందుకు?

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 6.
మీ పరిసరాలలోని పెంపుడు జంతువులు ఎలా వాటి భావాలను వ్యక్త పరుయో గమనించి రాయండి.
జవాబు.
వివిధ జంతువులు – వాటి భావవ్యక్తీకరణ విధానాలు :

i) దృశ్య భావ వ్యక్తీకరణ :
1. తాబేలు, నత్తలు, బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం తలను ముడుచుకుంటాయి.
2. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపుతాయి.

ii) శ్రవణ భావ వ్యక్తీకరణ :
1. ఏనుగుల ఘీంకారం
2. తోడేళ్ళు ఊళ పెట్టడం

iii)స్పర్శద్వారా భావ వ్యక్తీకరణ :
1. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకటం ద్వారా
2. కోతులు, బబూన్లు ఒకదానిని ఒకటి దువ్వు కోవటం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తాయి.

iv) రసాయనిక భావ వ్యక్తీకరణ :
1. పిల్లులు తమ వాసనను గుర్తించటానికి వస్తువుల పై రుద్దుతాయి.
2. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించటానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:

ప్రశ్న 7.
పరోక్ష భావ వ్యక్తీకరణకు వాడే సాధానాల గురించి సమాచారాన్ని సేకరించి రాయండి.
జవాబు.
విద్యార్థికృత్యము :
పరోక్ష భావ వ్యక్తీకరణకు వాడే సాధనాలైన పోస్ట్ కార్లు, ఫోన్స్, మేసేజ్ లు, మెయిల్లు వంటి వాటి గురించి సమాచారంను సేకరించి వ్రాయండి.

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 8.
పరోక్ష భావ వ్యక్తీకరణకు వాడే నాలుగు ఎమోజీలను గీయండి.
జవాబు.

AP Board 3rd Class Maths Solutions 9th Lesson మాట్లాడుకుందాం 1

VI. ప్రశంస:

ప్రశ్న 9.
చెవిటివారు సంకేత భాషలో మాట్లాడుకోవటం నువ్వు గమనించినప్పుడు ఎలా ప్రతి స్పందిస్తావు ?
జవాబు.

  1. చెవిటివారు సంకేత భాషలో మాట్లాడుకోవటం గమనించినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. వారికి నేను ముఖాముఖి మాట్లాడటం ద్వారా సహాయపడగలను.
  2. నేను వారితో నిదానంగానూ, వివరంగానూ మాట్లాడతాను. వారితో సాధారణ గొంతుతో మాట్లాడతాను. ఎక్కువగా బొమ్మలు, గ్రాఫిక్స్ ద్వారా వివరిస్తాను.

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

I. అదనపు ప్రశ్నలు – జవాబులు:

I. విషయావగాహన:

ప్రశ్న 1.
ప్రత్యక్షభావ వ్యక్తీకరణ అనగానేమి?
జవాబు.
స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడటం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా
వ్యక్తపరుస్తారు. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ.

ప్రశ్న 2.
పరోక్ష వ్యక్తీకరణ అనగానేమి?
జవాబు.
మనం ప్రత్యక్షంగా కాక ఏదేని మీడియా దూరదర్శిని ద్వారా, పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్, మెయిల్, మెసేట్లు మొదలైన వాటి ద్వారా సమాచారంను తెలుసుకొనుటను పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు.

ప్రశ్న 3.
సంకేతభాష అనగానేమి?
జవాబు.
భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరుచుటను సంకేత భాష అంటారు. మూగ, చెవిటి వారు తమ భావాలను వ్యక్తపరచుటకు “సంకేత భాష”ను’ ఉ పయోగిస్తారు. పక్షులు, జంతువులు కూడా సంకేత భాషతోనే భావాలను వ్యక్తపరచును.

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

II. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 1.
క్రింది వానిని వాని భావ వ్యక్తీకరణ విధానంతో జతపరచండి.

AP Board 3rd Class Maths Solutions 9th Lesson మాట్లాడుకుందాం 2

జవాబు.
1. c
2. d
3. a
4. b

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

ప్రశ్న 1.
____________ ను ఒకరినుండి ఇంకొకరికి చేర వేయడాన్ని భావ వ్యవస్తీకరణ అంటారు.
A) వృత్తి
B) ధనం
C) సమాచారం
D) ఏదీకాదు
జవాబు.
C) సమాచారం

ప్రశ్న 2.
జంతువులు ఈ క్రింది విధంగా భావాలను వ్యక్తీకరిస్తాయి. ____________
A) దృశ్య భావ వ్యక్తీకరణ
B) శ్రవణ భావ వ్యవస్తీకరణ
C) స్పర్శ
D) పై అన్నీ
జవాబు.
D) పై అన్నీ

ప్రశ్న 3.
జంతువుల పట్ల ____________ కనబరచాలి.
A) ప్రేమను
B) ఆప్యాయతను
C) సమాచారం
D) ఏదీకాదు
జవాబు.
C) సమాచారం

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

ప్రశ్న 4.
____________ అనేది తేనెటీగలలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ.
A) వాగల్ డాన్స్
B) ముద్ర
C) ట్రంపెట్
D) ఏదీకాదు
జవాబు.
A) వాగల్ డాన్స్

ప్రశ్న 5.
గుంపులో ఇతర తోడేళ్ళను పిలవటానికి తోడేళ్ళు ____________ చేస్తాయి.
A) ఊళ పెడతాయి
B) ఘీంకరిస్తాయి
C) స్పర్శిస్తాయి
D) ఏదీకాదు
జవాబు.
A) ఊళ పెడతాయి

ప్రశ్న 6.
ఏనుగులు ____________ ద్వారా మాట్లాడుతాయి.
A) ఘీంకారం
B) ఊళ
C) స్పర్శ
D) ఏదీకాదు
జవాబు.
A) ఘీంకారం

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

ప్రశ్న 7.
భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరుటను ____________ భాష అంటారు.
A) భాష
B) సంకేత భాష
C) స్వరం
D) ఏదీకాదు
జవాబు.
B) సంకేత భాష

ప్రశ్న 8.
డ్యాన్సర్లు భావాలను వ్యక్త పరచుటకు ……………… ను ఉపయోగిస్తారు.
A) ముద్రలు
B) స్వరాలు
C) రాగాలు
D) ఏదీకాదు
జవాబు.
A) ముద్రలు

ప్రశ్న 9.
మిణుగురు పురుగులు ____________ ను ఆకర్షించుటకు మెరుస్తాయి.
A) శత్రువులు
B) తోటి మిణునుగురులు
C) చీమలు
D) ఏవీకాదు
జవాబు.
B) తోటి మిణునుగురులు

AP Board 3rd Class EVS Solutions 9th Lesson మాట్లాడుకుందాం

ప్రశ్న 10.
AP Board 3rd Class Maths Solutions 9th Lesson మాట్లాడుకుందాం 3 ఈ గుర్తు ఏమి చూచిస్తుంది ____________
A) చిరునవ్వు
B) విచారం
C) కోపం
D) ఏదీకాదు
జవాబు.
A) చిరునవ్వు