Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 7th Lesson పద్యరత్నాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 7 పద్యరత్నాలు
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
మొదటి చిత్రంలో – ఇద్దరు పిల్లలు మొక్క నాటి నీరు పోస్తున్నారు.
రెండవ చిత్రంలో – నలుగురు పిల్లలు కలిసి ఫుట్ బాల్ ఆట ఆడుతున్నారు
మూడవ చిత్రంలో – విద్యార్ధి గురువులకు నమస్కరిస్తున్నారు.
నాల్గవ చిత్రంలో – పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు.
మధ్య పొడవు చిత్రంలో – విద్యార్థి తన ఉపాధ్యాయురాలికి (లేదా) గురువుకి నమస్కరిస్తుంటే ఆమె ఆశీస్సులందిస్తున్నది.
ప్రశ్న 2.
పిల్లలు ఏం చేస్తున్నారు ?
జవాబు:
పిల్లలు మొక్కలు నాటుతూ, ఆడుకుంటూ, చదువుకుంటూ గురువుల, పెద్దల దీవెనలందుకుంటున్నారు.
ప్రశ్న 3.
పెద్ద వారితో మీరు ఎలా మాట్లాడతారో చెప్పండి.
జవాబు:
పెద్దవారితో నేను – పద్ధతిగా, గౌరవంగా, వినయంగా, నమ్రతతో మాట్లాడతాను.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- పిల్లలు
- మొక్క
- నీరు
- నీటి డబ్బా
- బంతి
- పుస్తకాలు
- గురువు
- పెద్దలు
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
పద్యాలను రాగయుక్తంగా పాడండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు:
ముందుగా ఉపాధ్యాయకృత్యం. ఆ తరువాత తరగతి గదిలో విద్యార్థి కృత్యం.
ప్రశ్న 2.
దేశ సేన కంటె దేవతార్చన లేదు’ అనే పద్యం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో చెప్పండి.
జవాబు:
ఈ పద్యం ద్వారా :-
దేశభక్తి దేశసేవ ఎంత గొప్పవో తెలుసుకున్నాను.
మనిషికి స్వార్ధం ఉండకూడదని – దాన్ని మించిన
మరణం మరొకటి లేదని, ఇతరుల పట్ల జాలి, దయ కలిగి
ఉండాలని – అవి స్వర్గంతో సమానమని తెలుసుకున్నాను.
ప్రశ్న 3.
విజమైన స్నేహితులు ఎవరు?
జవాబు:
కష్టాలు వచ్చి మనకు దిక్కు తోచనప్పుడు సహాయం చేసే వాళ్ళే నిజమైన స్నేహితులు.
ప్రశ్న 4.
పాఠంలోని పద్యాలలో మీకు బాగా వచ్చిన పద్యం ఏది? దాని గురించి చెప్పండి.
జవాబు:
నాకు బాగా నచ్చిన పద్యం :
దేశ సేవ కంటే దేవతార్చన లేదు
స్వార్థపరత కంటె చావు లేదు
సానుభూతి కంటే స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల తెలుగు బాల
ఎందుకంటే! ఓ తెలుగుబాలా! దేశానికి సేవ చేయటం కన్నా మించిన దైవ పూజ మరొకటి లేదని – అలాగే అన్నీ తనకే కవాలనుకోవటానికి మించినది అంటే స్వార్ధానికి మించిన చావు మరొకటి లేదని, ఇతరుల పట్ల జాలి, దయ, కలిగి ఉండడం కంటే మించిన, స్వర్గం మరొకటి లేదని చెప్తూ- దేశభక్తిని, మానవ సేవను, మానవతా ధర్మాన్ని తెలియజేస్తున్నదీ పద్యం. అందుకనే ఈ పద్యం నాకు చాలా ఇష్టం.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది పద్య పాదాలను చదవండి. పాఠంలోని పద్యాలలో గుర్తించి గీత గీయండి.
ప్రశ్న 1.
చదువు, చదివెనేని సరసుడగును
జవాబు:
పాఠంలోని మూడవ పద్యంలో రెండొవ పాదం
ప్రశ్న 2.
తినగ తినగ వేము తియ్యమండు.
జవాబు:
పాఠంలోని మొదటి పద్యంలో రెండొవ పాదం.
ప్రశ్న 3.
కష్టదినముల నే దిక్కు గాంచనప్పుడు
జవాబు:
పాఠంలోని తొమ్మిదవ పద్యంలో మూడొవ పాదం
ప్రశ్న 4.
చలి చెలను మేలుగాదా.
జవాబు:
పాఠంలోని ఏడొవ పద్యంలో మూడవ పాదం
ఆ) కింది పద్య భాగాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఓ గువ్వలచెన్నా! ధనవంతుడైన పిసినారికంటే దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే అనంతమైన ఉప్పునీరు గల సముద్రముకన్నా, తాగడానికి పనికివచ్చే మంచినీరు ఉన్న చిన్నగొయ్యి మంచిది కదా!
ప్రశ్న 1.
పై పేరాలో ఉన్న ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
- గువ్వ (ద్విత్వ)
- చెన్నా (ద్విత్వ)
- ఉప్పు (ద్విత్వ)
- సముద్రము (సంయుక్త)
- కన్నా (ద్విత్వ)
- పనికివచ్చే (ద్విత్వ)
- ఉన్న (ద్విత్వ)
- చిన్న (ద్విత్వ,
- గొయ్యి (ద్విత్వ)
ప్రశ్న 2.
దాన గుణం గల పేదవాడిని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
తాగడానికి పనికి వచ్చే మంచినీరు ఉన్న చిన్న గొయ్యితో పోల్చాడు.
ప్రశ్న 3.
కవి ధనవంతుడైన పిసినారి కంటే ఎవరు మేలని చెప్పాడు?
జవాబు:
దాన గుణం కల పేదవాడు మేలని చెప్పాడు.
ప్రశ్న 4.
పై భావంలో ‘అంభోధి’ అనే పదానికి సమానార్థాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
సముద్రము.
ఇ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పిల్లలూ! తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె ‘సుభద్రా కళ్యాణం’ అనే కావ్యాన్ని రాసింది. ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరిచేత ప్రశంసలందుకుంది.
అ) పై పేరాలో ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను రాయండి.
జవాబు:
- పిల్లలూ (ద్విత్వ)
- 2. తాళ్ళపాక (ద్విత్వ)
- తిమ్మక్క (ద్విత్వ)
- కవయిత్రి (సంయుక్త)
- తిరుమలమ్మ (ద్విత్వ)
- అన్నమా (ద్విత్వ)
- చార్యులు (సంయుక్త)
- భార్య (సంయుక్త)
- సుభద్రా (సంయుక్తా)
- కళ్యాణం (సంయుక్త)
- కావ్యాన్ని (ద్విత్వ)
- కావ్యం (సంయుక్త)
- ప్రశంస (సంయుక్త)
ఆ) తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరేమిటి?
జవాబు:
తాళ్ళపాక తిరుమలమ్మ.
ఇ) తాళ్ళపాక తిమ్మక్క రాసిన కావ్యం పేరు ఏమిటి?
జవాబు:
సుభద్రా కళ్యాణం
ఈ) ఆమె రాసిన కావ్యం ఎలాంటి పదాలతో ఉంది?
జవాబు:
తేట తెలుగు పదాలతో ఉంది.
పై పేరా ఆధారంగా ఒప్పు (✓), తప్పు (✗) లను గుర్తించండి.
అ) తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. ( )
ఆ) “సుభద్రా కళ్యాణం” కావ్యాన్ని తిక్కన్న రచించాడు. ( )
ఇ) తెలుగులో మొదటి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. ( )
ఈ) “సుభద్రా కళ్యాణం” తేట తెలుగు పదాలతో చెప్పబడింది. ( )
జవాబు:
అ) తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. (✓)
ఆ) “సుభద్రా కళ్యాణం” కావ్యాన్ని తిక్కన్న రచించాడు. (✗)
ఇ) తెలుగులో మొదటి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. (✓ )
ఈ) “సుభద్రా కళ్యాణం” తేట తెలుగు పదాలతో చెప్పబడింది. (✓)
పదజాలం
అ) కింది పదాలలో దాగివున్న పదాలను రాయండి.
ఉదా : 1. సుమతి : సుమ మతి
2. మైదానం: _______ _______
3. వావరం : _______ _______
4. వసతి : _______ _______
5. గోదారి : _______ _______
6. పవస : _______ _______
7. తారకం : _______ _______
8. రమణి : _______ _______
9. కలత : _______ _______
10. లక్షణం: _______ _______
జవాబు:
1. సుమతి : సుమ మతి
2. మైదానం: మైదా దానం
3. వావరం : వాన నరం
4. వసతి : వస సతి
5. గోదారి : గోదా దారి
6. పవస : పన నస
7. తారకం : తార రకం
8. రమణి : రమ మణి
9. కలత : కల లత
10. లక్షణం: లక్ష క్షణం
ఆ) కింది పదాల ఆధారంగా పొంతవాక్యాలు రాయండి.
ప్రశ్న 1.
వేము, చేదు
జవాబు:
వేము చేదుగా ఉంటుంది.
ప్రశ్న 2.
మిత్రుడు, సహాయం
జవాబు:
మిత్రుడు సహాయం చేస్తాడు
ప్రశ్న 3.
మేలు, పొరుగువారు
జవాబు:
మేలు చేయాలి, పొరుగువారికి
ప్రశ్న 4.
ఓర్పు, కష్టం
జవాబు:
ఓర్పుతో కష్టాన్ని జయించాలి
ఇ) కింది ఆధారాలను జతపరచి సరదాగా ఒక పద్యాన్ని రాద్దాం .
జవాబు:
- పాత రేడియోలు పాటలన్ వినిపించు
- నేటి టెలివిజనులు నీతి పంచు
- కొత్త ఫోనునందు కోరుకున్నది దక్కు
- నిజమిదేగదయ్య నేటి బాల
స్వీయరచన
అ) కింది పద్య పాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి.
ప్రశ్న 1.
బహుళ కావ్యములను పరికింపగావచ్చు.
జవాబు:
అనేక రకాల కావ్యాలు చదివి ఉండవచ్చు.
ప్రశ్న 2.
‘సాధనమువ పమలు సమకూరు ధరలో’
జవాబు:
సాధన చేయటం వల్ల ఎన్నో పనులు సమకూరుతాయి.
ప్రశ్న 3.
‘స్వార్థపరతకంటె చావులేదు’
జవాబు:
అన్నీ తనకే కవాలనకునే స్వార్థం కంటే మించిన చావు మరొకటి లేదు.
ఆ) వేమన చదువు గురించి ఏమని చెప్పాడో రాయండి.
జవాబు:
మనం సఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటిని చక్కగా గ్రహించగలుగుతాడు. కానీ చదువంటే – వాటి నిజమైన భావం తెలుసుకుని చదవటమే నిజమైన చదువు – అని వేమన చదువు గురించి చెప్పాడు.
ఇ) ‘దేశ సేవకంటె’ పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
దేశానికి సేవ చేయటం కంటే మించిన భగవంతుని పూజ లేదు. అంతా ‘నాకే’ – నాదే అనే స్వార్ధాన్ని మించిన చావు మరొకటి లేదు. ‘జాలి-దయ’ కంటే మించిన స్వర్గం మరొకటి లేదు.
సృజనాత్మకత
కింది చిత్రాల ఆధారంగా కథమ రాయండి.
జవాబు:
ఒకరోజు అడవిలోని జంతువులలో ‘కుందేలు – తాబేలు’ పరుగు పందెం పెట్టుకున్నాయి.
జవాబు:
మిగతా జంతువులన్నీ చూస్తున్నాయి. కుందేలు ముందుగా తొందరగా పరిగెడుతోంది. తాబేలు వెనుక పడింది.
జవాబు:
కొంత దూరం వెళ్ళాక అలసిపోయిన కుందేలు -చెట్టుకింది విశ్రాంతి తీసుకుంది.
అదే అదనుగా తీసుకుని తాబేలు కుందేలుని దాటి ముందుగా గమ్యాన్ని చేరుకుంది.
నీతి : ఎదుటి వారి శక్తిని ఎప్పుడూ తక్కువగా అందచనా వేయకూడదు.
ప్రశంస
పాఠంలోని పద్యాలు పాడుకున్నారు కదూ! మీ తరగతిలో పద్యాలు, పాటలు బాగా పాడేవారిని మీరు ఎలా మెచ్చుకుంటారో చెప్పండి?
జవాబు:
రామీ! నీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ బహుమతులన్నీ గెలిచింది నువ్వేనటగా! చాలా సంతోషం. నిన్న నువ్వు నేర్పించిన పాట పాడి మా అమ్మాయి, వాళ్ళ స్కూల్లో ప్రథమ బహుమతి సాధించింది. నిన్ను చూసి అభినందించి వెళ్ళదామని వచ్చాను. మీ అమ్మగారు నువ్వు పాడిన పాటలు స్పీకరు పెట్టి వినిపించారు.
ఎంతో కమ్మగా పాడావు. నీగొంతు చాలా చక్కగా ఉంది. అంతేకాదు – నువ్వు సేకరించిన జానపద గీతాలన్నింటిని చూపించింది. నీ పాటల సేకరణ ఎంతో మంది చిన్నలకు – మావంటి పెద్దలకూ ఆదర్శం. స్ఫూర్తి దాయకం. రాబోయే తరాలకు వీటిని అందించాలనే నీ సంకల్పం ఆశయం మంచింది.
లేదా
రామీ, నీకు నా అభినందనలు. నువ్వు పాడిన పాట చాలా బాగుంది. ఈ జానపద గీతం మా అందరికీ నేర్పించవా! మొన్న నువ్వు నేర్పిన పాట చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. త్వరలో జరగబోయే నవంబరు-14 బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగే పాటల పోటీలో – బృందగానంలో మన తరగతికే బహుమతి రావాలి. నిన్ను చూసి మేమందరం స్పూర్తి పొందుతున్నాము. నీలా ఎన్నో జానపద గీతాలు నేర్చుకోవడం-సేకరిచడం చేస్తాము. అందుకనే నిన్ను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. నీకు నా అభినందనలు.
భాషాంశాలు
అ) కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలను గమనించండి.
1. అమ్మ అన్నం వండింది.
2. నాన్నకు బజారుకు వెళ్ళాడు
3. అమ్మమ్మ కథ చెప్పింది.
4. చెల్లి జామపండు కోసింది.
పైన గీత గీసిన పదాలు అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి చేసిన పనులను తెలియ జేస్తున్నాయిగదా! ఇలా పనులను తెలియజేసే పదాలను క్రియా పదాలు’ అంటారు.
చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు,
వండుతున్నాడు, చేస్తున్నారు, గీసింది మొదలయినవి క్రియాపదాలు
జవాబు:
ఇది ఉపాధ్యాయుని బోధనాంశము తరువాత విద్యార్థి కృత్యము.
ఆ) ఇలాంటి క్రియా పదాలను ‘పొదుపు-విదుపు’ పాఠంలో గుర్తించి రాయండి.
జవాబు:
- పడుకున్నారు
- చేశారు.
- విప్పండి
- వినండి
- చెప్పుకోండి
- పొడుస్తాను
- చెప్పాలి
- కేకేసింది
- జారుకున్నారు
- సమాధానం చెప్పాలి
- చదువుకుంటున్నాడు
ఇ) కింది వాక్యాలు పరిశీలించండి. క్రియా పదాలు ఎప్పుడెప్పుడు ఎలా మారాయో గమనించండి.
పద్య రత్నాలు
1.
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తియ్య నుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
అర్ధాలు :
అనగననగ = పాడగా పాడగా,
అతిశయిల్లు = అభివృద్ధి చెందుతుంది.
వేము = వేప
సాధనము = అభ్యాసం
సమకూరు = నేరవేరుతుంది
ధర = భూమి, నేల
భావం:
ఓవేమా! సాధన చేయగా, చేయగా రాగాన్ని బాగా తీయగల్గుతాం. తినగ తినగా వేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలికగా చేయగల్గుతాం.
2.
బహుళ కావ్యములను పరికింపంగా వచ్చు
బహుళ శబ్దచయము పలుకవచ్చు
సహవ మొక్కటబ్బ చాల కష్టంబురా
విశ్వదాభిరామ విమర వేమ!
అర్ధాలు :
బహుళ = అనేక
కావ్యములు = గ్రంథాలు;
పరికించు = పరిశీలించు
శబ్దచయము = పదాల సమూహం
సహనము = ఓర్పు
అబ్బు = అలవాటగు
భావం:
ఓ వేమా! అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును. ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు. కాని ‘ఓర్పు కలిగిఉండడం’ అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవరచుకోవాలి.
3.
చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు
చదువు చదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదివిన చదువురా
విశ్వదాభిరామ వినుర వేమ!
అర్థాలు :
చదువు = విద్య
చదవకున్న = నేర్చుకోకపోతే
సౌఖ్యం = సుఖం
సరసుడు = మంచిని గ్రహించగలవాడు
మర్మము = సారం, భావం, రహస్యం
భావం :
ఓ వేమా! మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటిని చక్కగా గ్రహించగలుగుతాడు. కాని, అసలు చదువు అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవటమే కాదు. వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు.
4.
ఐకమత్యమొక్క టావశ్యకంజెస్టు
దాని బలిమి నెంత యైన గూడు
గడ్డి వెంటి బెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినుర వేమ!
అర్థాలు :
ఐకమ్యతం = కలసి ఉండడం,
ఆవశ్యకం = అవసరం
ఎపు = ఎల్లప్పుడు
బలిమి = బలం
భావం:
ఐకమత్యమొక్కటే ఎప్పుడూ అవసరం. దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటినన్నింటిని కలిపి వెంటివేనితే, ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు.
5.
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
తమతము నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులౌట తథ్యము సుమతీ!
అర్ధాలు :
కమలములు = తామరపూలు
కమలాప్తుడు = సూర్యుడు (తామరలకు మిత్రుడు)
రశ్మి = కిరణము, వేడి
సోకి = తాకి, తగిలి
నెలవు = చోటు
భావం :
సుమతీ! తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడిచేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి, ఉండకూడని చోట ఉంటే, తమ స్నేహితులే శత్రువులు అవుతారు. ఇది నిజం.
6.
లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడె బలవంతుండా
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ.
అర్థాలు :
సుమతీ = మంచిబుద్ధిగలవాడా,
లావు = బలం/శక్తి
భావింపగ = ఆలోచింపగ, నీతిపరుడె = తెలివిగలవ వాడే,
గ్రావం = కొండ,
గజము= ఎనుగు,
మావటివాడు = ఏనుగును నడిపించేవాడు,
మహి = భూమి
భావం :
సుమతీ! శరీర బలం ఉన్నవాడికంటె తెలివి తేటలు ఉన్నవాడే బలంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసుకొని నడిపిస్తాడు కదా!
7.
కలిమి గల లోభి కన్నము
విలసితముగ పేద మేలు వితరణియైనన్
చలి చెలము మేలుగాదా
కులనిధి యంభోధి కన్న గువ్వల చెన్నా!
అర్ధాలు :
కలిమి = సంపద,
లోభి = పిసినారి,
విలసితముగ = చక్కగా
పేద = బీదవాడు
వితరణ = దాత,
చలిచెలమ = మంచినీటి గుంట,
కులనిధి = ఎక్కువ నీరు కలిగినది,
అంభోధి = సముద్రం
భావం :
ఓ గువ్వలచెన్నా! దనంతుడైన పిసినారికంటే, దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటిగుంట మంచిది కదా!
8.
దేశసేన కంటె దేవతార్చన లేదు
స్వార్థపరత కంటె చావు లేదు
సానుభూతి కంటే స్వర్గంబు లేదురా
లలిత సుగుణ జాల తెలుగు బాల
అర్ధాలు :
అర్చన = పూజ, సేవ
స్వార్థపరత = అన్నీ తనకే కావాలనుకోటం,
చావు = మరణం, చనిపోవటం
సానుభూతి = దయకలిగి ఉండటం,
స్వర్గం = సుఖం
భావం :
ఓ తెలుగుబాల! దేశానికి సేవ చయడంకంటె మించిన దైవ పూజ లేదు. అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడంకంటే మించిన స్వర్గం లేదు.
9.
సంపదల తేలునప్పుడిచ్చకములాడి
అన్న, తమ్ముడు యమువారలాప్తవరులె
కష్టదినముల వే దిక్కుగాంచనప్పుడు
చేయి యందిచ్చు వారెపో చెలిమికాండ్రు
అర్ధాలు :
ఇచ్చకములు = ప్రయమైన మాటలు,
ఆప్తవరులు = హితులు,
కాంచు = చూచు
చెలిమికాండ్రు = స్నేహితులు
భావం :
మనం సంపదలతో తులతూగేటప్పుడు అన్నా తమ్ముడా అని పిలిచేవాళ్లు, మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్లు మనకు ఆప్తులు కారు. కష్టాలు వచ్చి మనకు దిక్కుతోచనప్పుడు సహాయం చేసేవాళ్లే నిజమైన స్నేహితులు.
కవి పరిచయం
1. కవి : వేమన (1, 2, 3, 4 పద్యాలు)
జననం : 17-18 శతాబ్దల మధ్య కాలం
జన్మస్థలం : కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు.
వేనున సమాధి : అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె.
శతకం : వేమన శతకం
2. కవి : బద్దెన ( 5, 6 పద్యాలు)
కాలం : 13వ శతాబ్దల
శతకం : సుమతీ శతకం
3. కవి : గువ్వల చెన్నడు (7వ పద్యం)
కాలం : క్రీ.శ. 17 – 18 శతాబ్దాలకు చెందిన కవి
జన్మస్థలం : కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం
మకుటం : గువ్వల చెన్నా
4. కవి : జంధ్యాల పాపయ్యశాస్త్రి (8వ పద్యం)
జననం : 4-8-1912 – 12-06-1992
జన్మస్థలం : గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మం॥ కొమ్మూరు గ్రామంలో జన్మించారు.
ఇతర రచనలు: విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ,మొదలైన కావ్యాలు రచించారు.
5. కని : దువ్వూరి రామిరెడ్డి (9వ పద్యం)
కాలం : 9-11-1895 – 11-09-1947
జన్మస్థలం : నెల్లూరు జిల్లా
రచనలు : కృషీవలుడు, జలదాంగన, గులాబితోట, పానశాల మొదలైనవి.
ఈ మాసపు పాట
అందమైన పాట
ఆవు పాల వంటిది అందమైన పాట
పుట్ట తేన వంటిది చిట్టి పాప మాట
అమ్మపాట పాపలకు కమ్మని చెవివిందు
బొమ్మలాట పాపలకు కమ్మని కనువిందు
పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి
దేశమాత మనసులోని ఆశలకే బలిమి
పాటపాడి బుజ్జిపాప పారవశ్యమొందాలి
మాటలాడి ముద్దుపాప మనుగడ సాధించాలి
అందాలను చందాలను పందిరిగా వేయాలి
అందులోన లతలవోలె అల్లుకుంటు పోవాలి
కన్నతల్లి ముద్దులోని వెన్నలారగించాలి
కన్నతండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి
చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి
తెలుగువాణి తియ్యదనము నలుమూలల తెలపాలి
కవి పరిచయం
కవి : జి.వి. సుబ్రహ్యణ్యం
కాలము : (01-9-1935 – 15-8-2006)
రచనలు : ‘వీరరసము’, ‘రసోల్లాసము’,
విశేషాలు : విద్వాంసులు, విమర్శకులు తెలుగులో నవ్యసంప్రదాయ దృష్టితో – విమర్శ సాహిత్య చేపట్టారు. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు.
ఈ మాసపు కథ
దిలీపుని కథ
దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణా దేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్టునికి చెప్పుకున్నాడు. గురువు అయనకు నందిని అనే ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు.
మహారాజు దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజూ స్వయంగా దాన్ని సమీపంలోని అడవికి మేతకు తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే దిలీపుడు నందినిని అడవికి తీసుకొని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి, ఒక సింహం గుహలోని వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడింది. దానిని తినబోయింది.
నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహవద్దకు వచ్చాడు. ఆవును విడిచి పెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి,” ఓ మహారాజా! నేను ఆకులు,గడ్డి తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా! దేశాన్ని ఏలే రాజువు. నీకు తెలియదా! మరి నన్ను ఏం తిని బతకమంటావు? నువ్వే చెప్పు”. అంది.
రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూసి “ ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచి పెట్టు దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు”. అని ప్రాధేయపడ్డాడు.
దిలీపుని మాటలు విని , సింహం ఆశ్చర్యపోయింది. “నీవు బతికి ఉంటే వెయ్యి ఆవులను దానం చేయగలవు. నీ ప్రాణాలు వదులుకుంటావా?” అని ప్రశ్నించింది. అపుడు ” ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను?” అని వినయంగా బదులిచ్చాడు.
సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే! అతనిపై పూల వాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ” ఓ రాజా! నీ ధర్మనిరతిని పరిక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు” అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందినిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘు మహారాజు. ఈ వంశం వాడే శ్రీ రాముడు.