Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 11th Lesson మనమెక్కడ ఉన్నాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 11 మనమెక్కడ ఉన్నాం
I. విషయావగాహన :
ప్రశ్న 1.
భూమిపై ఎన్ని ఖండాలున్నాయి? అవి ఏవి?
జవాబు.
భూమి పై ఏడు ఖాండాలున్నాయి. అవి
- ఆసియా
- ఆఫ్రికా
- ఆస్ట్రేలియా
- ఐరోపా
- ఉత్తర అమెరికా
- దక్షిణ అమెరికా
- అంటార్కిటికా
ప్రశ్న 2.
భూమి పై మహాసముద్రాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు.
భూమి పై ఐదు మహాసముద్రాలు ఉన్నాయి. అవి
- పసిఫిక్ మహ సముద్రం
- అట్లాంటిక్ సముద్రం
- హిందూ మహా సముద్రం
- ఆర్కిటిక్ సముద్రం
- అంటార్కిటికా సముద్రం.
ప్రశ్న 3.
భూ భ్రమణం అనగా నేమి? భూ పరిభ్రమణం అనగా నేమి?
జవాబు.
- భూభ్రమణం :- భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు.
- భూపరిభ్రమణం :- భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
అరుణ విజయ్ ఇంటికి వెళ్ళాలనుకున్నది. ఆమె ఆ చిరునామాకు చేరడం కోసం ఏయే ప్రశ్నలు అడుగుతుంది?
జవాబు.
- అతని చరునామా ఏమిటి?
- వాళ్ళ ఊరి పిన్ కోడ్ నెంబర్ ఎంత?
- విజయ్ వాళ్ళ ఇంటికి లాండ్ మార్క్ ఏమిటి?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ గ్రామంలోని గ్రామ పంచాయితీకి వెళ్ళి, అక్కడ జరిగే పనులను గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు.
గ్రామ పంచాయితీ కార్యాలయం వారు.
- స్థానిక పన్నులను వసూలు చేస్తారు
- నీటి వనరులు, డ్రైనీజి మరియు రోడ్ల పనులను చూస్తారు.
- రోడ్లమీద పబ్లిక్ స్థలాలో వీధి దీపాలను ఏర్పాటు చేస్తారు.
- ప్రభుత్వ పథకాలను గ్రామాలలో అమలు చేస్తారు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ ఇంటి నుండి స్కూలుకు రోడ్ మ్యాపు గీయండి.
జవాబు.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
చార్టుపై ఖండాలు, మహాసముద్రాలతో కూడిన ప్రపంచ పటం గీసి రంగులు దిద్దండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
భూమిని సంరక్షించడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు.
- భూమిని కాపాడుదాం – భవిష్యత్తును ఉంచుకుందాం
- నేల కాలుష్యం – జీవజాతికి అంతం
- పచ్చని చెట్లు … – ప్రగతికి మెట్లు
- పుడమితల్లి గర్భంలో జలం – ప్రాణం పోదాం అందరం.
ఆలోచించండి – చర్చించండి: (TextBook Page No.88, 89, 90, 91, 92)
ప్రశ్న 1.
మీ గ్రామం పేరేమిటి. మీ గ్రామానికి ఎల్లలు ఏవి?
జవాబు.
మా గ్రామం పేరు రామవరప్పాడు. మా గ్రామానికి ఎల్లలు
- తూర్పు – నిడమానూరు
- పడమర – గుణదల
- ఉత్తరం – నున్న
- దక్షిణం – అటోనగర్.
ప్రశ్న 2.
మీ మండలం పేరు ఏమిటి? మీ మండలానికి సరిహద్దులు ఏవి?
జవాబు.
మా మండలం పేరు గన్నవరం. మా మండలానికి సరిహద్దులు
- తూర్పు – బాపులపాడు మండలం
- పడమర – విజయవాడ అర్బన్
- ఉత్తరం – ఆగిరిపల్లి మండలం
- దక్షిణం – ఉంగుటూరు మండలం.
ప్రశ్న 3.
మీ జిల్లా పేరు ఏమిటి? మీ జిల్లా సరిహద్దులను తెలియజేమండి?
జవాబు.
మాది కృష్ణా జిల్లా. మా జిల్లా సరిహద్దులు :
- తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లా
- పడమర – నల్గొండ జిల్లా
- ఉత్తరం – ఖమ్మం జిల్లా
- దక్షిణం – బంగాళఖాతం
ప్రశ్న 4.
మన దేశం పేరు ఏమిటి? మన దేశానికి సరిహదులు ఏవి?
జవాబు.
మన దేశం పేరు భారత దేశం. మన దేశానికి సరిహద్దులు :
- తూర్పు – బంగాళ ఖాతం
- పడమర – అరేబియా సముద్రం
- ఉత్తారం – హిమాలయ పర్వతాలు
- దక్షిణం – హిందు మహా సముద్రం
ప్రశ్న 5.
భారత్, అమెరికాల మధ్య పగలు, రాత్రి వేళలలో భేదాలు ఎందుకున్నాయి?
జవాబు.
భూమి గుండ్రంగా తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నపుడు సూర్యునికి ఎదుదుగా ఉన్న భూభాగంలో పగటి పూట ఉంటుంది. సూర్యునికి ఎదురుగా లేని ప్రదేశాలో రాత్రి పూట ఉంటుంది.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
గ్రామం అంటే ఏమిటి?
జవాబు.
ప్రజలు కలసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అంటారు.
ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల ప్రధాన కేంద్రాలను రాయండి?
జవాబు.
ప్రశ్న 3.
మన రాష్ట్రం దాని సరిహద్దుల గురించి రాయండి?
జవాబు.
మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర రాజధాని అమరావతి మన రాష్ట్ర సరిహద్దులు.
- తూర్పు – బంగాళఖాతం
- పడమర – కర్నాటక రాష్ట్రం
- ఉత్తారం – ఒడిస్సా, తెలంగాణ, ఛత్తఘడ్ రాష్ట్రాలు
- దక్షిణం – తమిళనాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. విస్తీర్ణం పరంగా మనదేశంలో 7వ స్థానంలో ఉంది.
ప్రశ్న 4.
భారతదేశం గురించి క్లుప్తంగా రాయండి?
జవాబు.
మన దేశం భారతదేశం. మన దేశ రాజధాని స్యూఢిల్లీ. మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని జనాభా పరంగా 2వ స్థానాన్ని కలిగి ఉంది.
ప్రశ్న 5.
మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానులను ఒక పట్టిక రూపంలో రాయండి?
జవాబు.
ప్రశ్న 6.
ప్రపంచంలో పెద్ద మరిము చిన్న పిండాల పేర్లను రాయండి.
జవాబు.
ప్రపంచంలో అతి పెద్ద ఖండము – ఆసియా.
చిన్న ఖండము – ఆస్ట్రేలియా.
ప్రశ్న 7.
భూమి యొక్క భౌగోళిక నిర్మాణాన్ని ఫ్లో చార్ట్ రూపంలో రాయండి.
జవాబు.
ప్రశ్న 8.
క్రింది పట్టికను పూరించండి.
జవాబు.
మన ఇల్లు – కరెన్సీ నగర్
మన గ్రాయం – రామవరప్పాడు
మన మండలం – గన్నవరం
మన జిల్లా – కృష్ణా
మన రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్
మన దేశం – భారతదేశం .
ప్రశ్న 9.
నక్షత్రరాశి అంటే ఏమిటి?
నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి. ఉంటాయి. ఈ ఆకారాలను నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు.
ప్రశ్న 10.
అమావాస్య, పౌర్ణమిలను ఎప్పుడు అంటారు?
జవాబు.
పౌర్ణమి :-
రాత్రివేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజును పౌర్ణమి అంటారు.
అమావాస్య :-
రాత్రివేళ చంద్రుడు కనిపించని రోజును ఆమావాస్య అంటారు.
ప్రశ్న 11.
చంద్రదశలు అంటే ఏమిటి?
జవాబు.
చంద్రుని ఆకారం రోజు రోజుకూ మారుతోంది. ఈ మార్పులను చంద్రదశలు అంటారు. ఈ 4వ తరగతి – పరిసరాల విజ్ఞానం (A.P) – 241
ప్రశ్న 12.
రాత్రి – పగలు ఏర్పడటానికి కారణం ఏమిటి?
జవాబు.
భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
కొన్ని _________ సమూహాన్ని మండలం అంటారు?
A) గ్రామాల
B) రాష్ట్రాల
C) దేశాల
D) జిల్లాలు
జవాబు.
A) గ్రామాల
ప్రశ్న 2.
శ్రీకాకుళం జిల్లాకు తూర్పు సరిహద్దు
A) విజయనగరం జిల్లా
B) బంగాళఖాతం
C) ఒడిస్సా
D) ఖమ్మం జిల్లా
జవాబు.
B) బంగాళఖాతం
ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య _________.
A) 27
B) 10
C) 13
D) 8
జవాబు.
C) 13
ప్రశ్న 4.
ప్రకాశం జిల్లాకు ప్రధాన కేంద్రం _________
A) మఛిలీపట్నం
B) కాకినాడ
C) ఏలూరు
D) ఒంగోలు
జవాబు.
D) ఒంగోలు
ప్రశ్న 5.
వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ . దేశంలో _________ వ స్థానంలో ఉంది.
A) 2
B) 5
C) 7
D) 1
జవాబు.
C) 7
ప్రశ్న 6.
భారతదేశంలో _________ రాష్ట్రాలు _________ కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి…
A) 28, 8
B ) 8, 28
C) 27, 9
D) 9, 27
జవాబు.
A) 28, 8
ప్రశ్న 7.
ప్రపంచంలో, భారతదేశం _________ పరంగా రెండవ స్థానంలో ఉంది.
A) విస్తీర్ణం
B) జనాభా
C) అక్షరాస్యత
D) ఆర్ధిక
జవాబు.
B) జనాభా
ప్రశ్న 8.
భారతదేశ రాజధాని .
A) అమరావతి
B) ముంబాయి
C) న్యూఢిల్లి
D) హైదరాబాదు
జవాబు.
C) న్యూఢిల్లి
ప్రశ్న 9.
_________ సముద్రం లోతైన సముద్రము.
A) హిందూ మహా
B) ఆర్కిటిక్
C) పసిఫిక్
D) అంటార్కిటికా
జవాబు.
C) పసిఫిక్
ప్రశ్న 10.
ఇండాల సంఖ్య _________
A) 5
B) 4
C) 10
D) 7
జవాబు.
D) 7
ప్రశ్న 11.
_________ ఖండాన్ని పక్షుల ఖండం అంటారు.
A) ఆసియా
B) దక్షిణ అమెరికా
C) యూరప్
D) ఆస్ట్రేలియా
జవాబు.
B) దక్షిణ అమెరికా
ప్రశ్న 12.
భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని _________ అంటారు
A) పరిభ్రమణం
B) భ్రమణం
C) ఊగడం
D) దోర్లడం
జవాబు.
B) భ్రమణం
ప్రశ్న 13.
భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని _________ అంటారు.
A) పరిభ్రమణం
B) భ్రమణం
C) ఊగడం.
D) దొర్లడం
జవాబు.
A) పరిభ్రమణం
ప్రశ్న 14.
రాత్రి పగలు ఏర్పడడానికి కారణం.
A) పరిభ్రమణం
B) ఊగడం
C) భ్రమణం
D) దొర్లడం
జవాబు.
C) భ్రమణం
ప్రశ్న 15.
నక్షత్రాలు గుంపుగా ఒక ఆకారంలో అమరి ఉంటాయి. ఈ ఆకారాలను _________ అంటారు.
A) ప్రపంచం
B) ఆకాశం
C) గ్రహాలు
D) నక్షత్రరాశి
జవాబు.
D) నక్షత్రరాశి
ప్రశ్న 16.
చంద్రుని ఆకారంలోని మార్పులను _________ అంటారు.
A) పౌర్ణమి
B) అమావాస్య
C) నక్షత్రరాశి
D) చంద్రదశలు
జవాబు.
D) చంద్రదశలు
ప్రశ్న 17.
_________ రోజున చంద్రుడు పూర్తిగా కనిపాస్తాడు. :
A) పౌర్ణమి
B) అమావాస్య
C) ఎ మరియు బి
D) నక్షత్రరాశి
జవాబు.
A) పౌర్ణమి
ప్రశ్న 18.
_________ రోజున చంద్రుడు కనబడడు.
A) పౌర్ణమి
B) అమావాస్య
C) ఎ మరియు.బి
D) నక్షత్రరాశి
జవాబు.
B) అమావాస్య