Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 4th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 4 జ్ఞానేంద్రియాలు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మనకు జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు.
మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి
- కళ్ళు (చూడడానికి)
- ముక్కు (వాసన)
- చెవులు – (వినికిడి)
- నాలుక (రుచి)
- చర్మర (స్పర్శ)
ప్రశ్న 2.
మనకు జ్ఞానేంద్రియాలు ఎందుకు ప్రధానమైనవి?
జవాబు.
- జ్ఞానేంద్రియాలు మనం వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి ఉపయోగపడతాయి.
- ఈ జ్ఞానేంద్రియాలు చాలా సున్నితమైనవి.
- జ్ఞానేంద్రియాల సహాయంతో మనం చూడ ఉగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి, వాసన, స్పర్శలు తెలుసుకోగలుగుతున్నాం.
- ఈ జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేయడమే మన శరీరం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనం.
- కాబట్టి మనకు జ్ఞానేంద్రియాలు ప్రధానమైనవి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 3.
విభిన్న సామర్థ్యాలున్న వారు జీవిత సవాళ్ళను ఎలా ఎదుర్కొటున్నారో తెలుసుకోవడానికి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు.
నేను చూపులేని (విభిన్న సామర్థ్యాలున్న) వ్యకిని ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను.
- మీరు రోడ్డును ఎలా దాటతారు?
- మీరు ఎలా చదువుతారు?
- మీరు మీకు తెలిసిన వ్యక్తులను ఎలా గుర్తిస్తారు?
- మీకు చెందిన వస్తువులను మీరు ఎలా గుర్తిస్తారు?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 4.
మీ వంట గదిలో ఉన్న ఆహార పదార్థాలను రుచి చూసి వాటి రుచులను పట్టిక రూపంలో రాయండి?
జవాబు.
క్రమ సంఖ్య | ఆహార పదార్థాలు | రుచి |
1. | పంచదార | తీపి |
2. | మిరపకాయ | కారం |
3. | చింతపండు | పులుపు |
4. | పచ్చడి | కారం |
5. | ఉప్పు | ఉప్పు |
6. | బియ్యం(అన్నం) | తీపి |
7. | వెనిగర్ | పులుపు |
8. | కాకరకాయ, పసుపు | చేదు |
ప్రశ్న 5.
మీ స్నేహితుల నుండి సమాచారాన్ని సేకరించి, క్రింది పట్టికలో నింపండి?
జవాబు.
క్రమ సంఖ్య | పేరు | అంగవైకల్యం |
1. | హెల్లన్ కిల్లర్ | మూగ – అంధత్వం |
2. | సుధా చంద్రన్ | ఒక కాలు జైపూర్ కాలు |
3. | స్టిఫన్ హాకింగ్స్ | మోటార్ న్యూరన్ డిసీజ్ (లేదా) ఎ ల్ ఎస్ |
4. | రవీంద్ర జైన్ | అంధత్వం |
5. | ఎస్. జైపాల్ రెడ్డి | పోలియో |
6. | నిక్ వుజిసిక్ | ఫోకోమిలియా (కాళ్ళు చేతులు, లేకుండా) |
IV. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 6.
మీ ముఖాన్ని గీసి, దానిలో జ్ఞానేంద్రియాలను గుర్తించండి?
జవాబు.
VI. ప్రశంస:
ప్రశ్న 7.
నీవు చెడు స్పర్శకు గురైనట్లైతే నీ తల్లిదండ్రులకు ఏమని చెబుతావు?
జవాబు.
- నేను చెడు స్పర్శకు గురైనట్లైతే దాని గురించి వెంటనే నా తల్లిదండ్రులకు చెప్తాను.
- మరొక సారి ఆ వ్యక్తి కనబడితే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేస్తాను.
కృత్యం 1 ( మన జ్ఞానములు): (TextBook Page No.29)
క్రింది వాటిని చూడండి. వీటిని తెలుసుకునేందుకు ఏ శరీర భాగాలను ఉపయోగిస్తారు. ఇచ్చిన గీతలపై రాయండి.
జవాబు.
కృత్యం 2: (TextBook Page No.36)
ఒక స్పర్శ నన్ను అభద్రతకు, భయానికి గురిచేసినట్టయితే నేను ఇలా చెప్తాను.
జవాబు.
వద్దు
వీరికి ఈ విషయాన్ని తెలియజేస్తాను.
జవాబు.
తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు
కృత్యం 3: (TextBook Page No.37)
క్రింది చిత్రాలను పరిశీలించి ఏవి మంచి స్పరో, ఏది చెడు స్పరో చెప్పండి.
జవాబు.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
ఏ అవయవం సహాయంతో చాక్లెట్ రుచిని గ్రహిస్తారు ?
జవాబు.
చాకెట్ల రుచిని గ్రహించడానికి నాలుకను ఉపయోగిస్తారు.
ప్రశ్న 2.
సెంట్ (పెర్ఫ్యూమ్) యొక్క సువాసను గ్రహించడానికి ఏ అవయవాన్ని ఉపయోగిస్తారు?
జవాబు.
సువాసనను గ్రహించడానికి ముక్కు ను ఉపయోగిస్తారు,
ప్రశ్న 3.
మన కళ్ళతో మనం ఏఏ పనులు చేయగలము?
జవాబు.
- కళ్ళు మనకు చూడటానికి ఉపయోగపడుతున్నాయి.
- కళ్ళతో మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని చూడగల్గుతున్నాం.
- మనం టీవి చూడటం, సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం’ కళ్లతో చేస్తున్నాము.
ప్రశ్న 4.
మన కంటిని మనం ఎలా సంరక్షించుకోవాలి ?
జవాబు.
- తగినంత కాంతిలో చదవాలి. మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం.
- కనీసం 6 అడుగుల దూరం నుండి టీవిని వీక్షించాలి.
- కంటిలో దురద కలిగినట్టయితే, కంటిని రుద్ద కూడదు. కంటిని నెమ్మదిగా, శుభ్రమైన, చల్లని నీటితో కడగాలి.
- పదునైన వస్తువులతో ఆడకూడదు.
- సూర్యుని ,వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూడడం వల్ల కంటి చూపు దెబ్బతినవచ్చు.
ప్రశ్న 5.
ఒక వేళ కంటి చూపు లేని వ్యక్తి రోడ్డు దాటడానికి ప్రయత్నించడం నీవు చూసావనుకుందాం నీవేవి చేస్తావు ?
జవాబు.
ఒక వేళ కంటి చూపు లేని వ్యక్తి రోడ్డు దాటడానికి ప్రయత్నించటం నేను చూస్తే, నేను. అతని చేతిని పట్టుకుని జాగ్రత్తగా రోడ్డును దాటిస్తాను.
ప్రశ్న 6.
నీ ముక్కును సంరక్షించడానికి నీవు ఏ జాగ్రత్తలు తీసుకుంటావు ?
జవాబు.
- ముక్కులో ఎటువంటి వస్తువులను ఉంచుకోకూడదు.
- ఏదైనా వస్తువు ముక్కలోనికి వెళ్ళినట్లైతే ఆ వస్తువు బయటకు వచ్చేలా గాలి బయటకు వదలాలి. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.
- జలుబుతో ముక్కు పూడుకుపోయినట్లైతే ఆవిరి పట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
- ముక్కులో వేళ్ళను పెట్టుకోకూడదు.
- ఎల్లపుడు ముక్కతోనే గాలిని పీల్చాలి. నోటితో పిల్చకూడదు.
ప్రశ్న 7.
మన వినికిడి జ్ఞానం ఏ విధంగా దెబ్బతింటుంది ?
జవాబు.
- చెవిలో ఉండే కర్ణభేరి చాలా సున్నితంగా ఉంటుంది.
- పెద్ద శబ్దాలైన ఉరుములు, పిడుగుల శబ్దాలు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్లు వినడం వల్ల మన వినికిడి శక్తి దెబ్బతింటుంది.
ప్రశ్న 8.
మన చెవుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు.
- హెయిర్ పిన్నులు, అగ్గి పుల్లలు వంటి పదునైన వస్తువులతో చెవులను శుభ్రం చేయకూడదు. వాటి వల్ల చెవులకు హాని జరుగుతుంది.
- స్నానం చేసిన తరువాత, మెత్తని పొడి గుడ్డతో చెవులను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే చెవిలోనికి వెళ్ళిన నీరు హాని కలిగించవచ్చు.
- చెవిలో పెన్సిళ్ళు, బలపాలను పెట్టుకోకూడదు.
- మన చెవులకు హాని చేసే పెద్ద పెద్ద శబ్దాలను వినకూడదు.
ప్రశ్న 9.
మంచి రుచికరమైన ఆహారాన్ని తిన్నపుడు ఎలా అనుభూతి చెందుతావు ?
జవాబు.
తీపి, చేదు, పులుపు మొదలైన రుచులను నాలుక గ్రహిస్తుంది. నాలుక పై ఉండే రుచి మొగ్గలు మనకు వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని కనుగొనడానికి సహాయపడతాయి.
ప్రశ్న 10.
వేరు వేరు జంతువులు వాటి నాలుకను ఎలా వినియోగించుకుంటాయి?
జవాబు.
- కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి తమ నాలుకను ఉపయోగిస్తాయి.
- పములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి.
ప్రశ్న 11.
మన నాలుకను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి ?
జవాబు.
- బ్రష్ చేసే సమయంలో ప్రతిరోజు నాలుక బద్దతో నాలుకను శుభ్రం చేసుకోవాలి.
- బాగా వేడిగా ఉన్న లేదా బాగా చల్లగా ఉన్న ఆహారాన్ని తిన కూడదు. అలా తినడం వల్ల నాలుక లేదా దంతాలకు హాని కలగవచ్చు.
ప్రశ్న 12.
నీవు నీ వ్యక్తిగత శుభ్రతను ఎలా పాటిస్తావు?
జవాబు.
- వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండటం ద్వారా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలం.
- వ్యక్తిగత పరిశుభ్రత అనగా స్నానం చేయడం, దంతాలు శుభ్రపరచుకోవడం, ఆ చేతులను కడుకోవడం.
- వ్యక్తిగత పరిశుభ్రత మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రశ్న 13
మీ స్నేహితులు ఎల్లప్పుడూ అనారోగ్యంగా బలహీనంగా ఉంటాడు. అతను బలంగా ఆరోగ్యంగా ఉండడానికి నీవేమి సలహాలు ఇస్తావు?
జవాబు.
ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి:
- వారానికి కనీసం రెండూ సార్లు తలస్నానం చేయాలి.
- క్రమం తప్పకుండా గోళ్ళను కత్తిరించుకోవాలి.
- తుమ్మినపుడు ముక్కుకి, దగ్గినపుడు నోటికి చేతి రుమాలును అడ్డు పెట్టుకోవాలి.
- ఆహారం తినేముందు తిన్న తరువాత చేతులను శుభ్రపరచుకోవాలి. . .
- మరుగుదొడ్లను ఉపయోగించిన తరువాత సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలి.
ప్రశ్న 14.
విభిన్న ప్రతిభ గల వ్యక్తులు ఎవరు?వారితో ఎలా ప్రపర్తించాలి?
జవాబు.
- నడువలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని “దివ్యాంగులు” లేదా “విభిన్న ప్రతిభ గల వ్యక్తులు” అంటారు.
- వీరిని తమ జీవితంలో ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోనేలా మనం ప్రోత్సహించాలి.
- వీరికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలి.
- వీరిని మనం అవహేళన చేయకూడదు. వారిని మారు పేరు పెట్టి పిలవకూడదు. వీరితో స్నేహంగా మెలగాలి.
ప్రశ్న 15.
మంచి స్పర్శ – చెడు స్పర్శలను వివరించండి?
జవాబు.
1. మంచి స్పర్శ :
భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు. ఈ
ఉదా :- ప్రేమగా తలను నిమరడం, అభినందనలతో హత్తుకోవడం.
2. చెడు స్పర్శ :
అభద్రతా భావాన్ని కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు.
ఉదా :- రహస్య భాగాలను స్పర్శించడం, ఛాతి, పిరుదులను స్పర్శించడం.
ప్రశ్న 16.
ఎవరైనా మిమ్మల్ని తప్పుడు విధానంతో తాకినట్లైతే మీరేం చేస్తారు?
జవాబు.
ఎవరైనా నన్ను తప్పుడు విధానంతో తాకితే
- వద్దని చెప్తాను
- వారి నుండి దూరంగా వెళ్తాను.
- మా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు, నమ్మకం ఉన్న వారికి దాని గురించి చెప్తాను.
- సహాయం కోసం పిలుస్తాను లేదా గట్టిగా అరుస్తాను.
ప్రశ్న 17.
పిల్లలో చెడు స్పర్శ సంకేతాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎలా గుర్తిస్తారు?
జవాబు.
చెడు స్పర్శకు గురైన పిల్లలు.
- ఒంటరిగా విచారంగా ఉంటారు.
- భయ పెట్టిన వ్యక్తుల పట్ల భయంతో బెరుకుగా ఉంటారు.
- ఎక్కడకు వెళ్ళాలన్నా తోడు రమ్మంటారు.
- చదువులో శ్రద్ధ చూపించరు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
క్రింది వానిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి ___________
A) ముక్కు
B) నాలుక
C) పళ్ళు
D) చర్మము
జవాబు.
C) పళ్ళు
ప్రశ్న 2.
చిమ్మ చీకటిలో కూడా చూడగల పక్షి ___________
A) గుడ్లుగూబ
B) గద్ద
C) గబ్బిలం
D) కాకి
జవాబు.
A) గుడ్లుగూబ
ప్రశ్న 3.
ఐదు కళ్ళను కలిగి ఉండే జీవి ___________
A) చీమ
B ) మిడత
C) తేనెటీగ
D) రాబందు
జవాబు.
C) తేనెటీగ
ప్రశ్న 4.
అంధులు చదవడానికి ఉపయోగించే లిపి ఏది ___________
A) తెలుగు
B) బ్రెయిలీ
C) దేవనాగరి
D) ఆంగ్లము
జవాబు.
B) బ్రెయిలీ
ప్రశ్న 5.
అంధుల కోసం ప్రత్యేకమైన లిపిని కనుగొన్నవారు ___________
A) న్యూటన్
B) ఐన్స్టీన్
C) గ్రహంబెల్
D) లూయిస్ బ్రెయిలీ
జవాబు.
D) లూయిస్ బ్రెయిలీ
ప్రశ్న 6.
మన శరీరంలో ___________ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.
A) 5
B) 6
C) 4
D) 10
జవాబు.
A) 5
ప్రశ్న 7.
రుచిని గ్రహించడానికి నాలుక పై ఉండే ___________ సహయపడతాయి.
A) రుచి విత్తులు
B) రుచి మొగ్గలు
C) రుచి పత్రాలు
D) రుచి పుష్పాలు
జవాబు.
B) రుచి మొగ్గలు
ప్రశ్న 8.
క్రింది వానిలో ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించేవి ___________
A) కప్పలు
B) బల్లులు
C) ఊసరవెల్లులు
D) అన్ని
జవాబు.
D) అన్ని
ప్రశ్న 9.
మీ రహస్య భాగాలను తాకడం అనేది ___________ స్పర్శ.
A) మంచి
B) చెడు స్పర్శ
C) A మరియు B
D) చెప్పలేము
జవాబు.
B) చెడు స్పర్శ