Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 5th Lesson సత్యమహిమ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 5 సత్యమహిమ
Textbook Page No. 37
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
- త్రివర్ణ పతాకం
- పాఠశాల
- పూలకుండీ
- మేఘాలు
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ?
జవాబు:
- ఉపాధ్యాయురాలు
- విధ్యార్థి
- అనేకమంది చిన్న పిల్లలు
ప్రశ్న 3.
చిత్రంలో పిల్లలు ఏమి చేస్తున్నారు ?
జవాబు:
పిల్లలు ఆడుకుంటున్నారు.
Textbook Page No. 38
సత్య మహిమ
1) ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు ఆదర్వుమాలిన బాదవా డొకడుండు
2) కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్య ప్రతంబుతో సత్యంబు జీవించు
3) ఒక నాడు వాడడవి
ఒక చెట్టు కొట్టుచో
గొడ్డలి చేజారి
పడ్డది. నీటిలోన,
4) అయ్యయ్యో! దైవమా!
అయ్యొ కుయ్యోమెట్రో
నా గొడ్డలే పోయె
నా గతి యింకేమి?
5) మా నాన్న వస్తాడు
మాకేమో తెస్తాడు
మరి గంజి పోస్తాడు
మమ్ము బ్రతికిస్తాడు
6) అనుచు తెన్నులు చూచి కనులోప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు?
7) ఉత్త చేతులు బోయి
తత్తరం బెటు దీర్తు
పిల్లల కడుపల్లి
చల్లారు నెటు తగ్గి
8) యీ ఆర్తియినుమడి
నే దీర్తు నదిపడి
కనివాని దీనత
ఆ నదీ దేవత
9) చెన్నారు కరుణతో
అన్నాయనుచు బిల్చి
రంగారు వన్నెల
బంగారు గొడ్డలి
10) చూపి నీదేనేమొ
చూడుమాయని పల్కె
మిరుమిట్లు గొలుపుచు
మెరసెడి గొడ్డలి
11) తిలకించి యతడనె
తల చేతులాడించి
అది నాది కాదమ్మా
అది నాది కాదు
12) నాది కానిది నేను
మది కోరనోయమ్మ,
ఈ మొగంబుల కేమి?
ఈ మిసిమి పసలేమి?
13) వెంటనే ఆ దేవి
వెండి గొడ్డలి చూప
అది గూడ నాది కాదని
వాడు తల తిప్పె!
14) ఇనుపగొడ్డలి తీసి
ఇది చూడుమాయన్న
వాడు నాదేయంచు
వేడె తన కిమ్మంచు
15) వాని సత్యానికి
వాని ధర్మానికి
వాని నిరాశకు
ఆ దేవి కరుణించి,
16) బంగారు గొడ్డలిని
వెండి గొడ్డలియును
బహుమానముగ నిచ్చి
పంపించె దీవించి.
Textbook Page No. 41
ఇవి చేయండి
ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు:
విధ్యార్ధి కృత్యం
ప్రశ్న 2.
గేయ కథలో ఏయే గొడ్డళ్లను ఇచ్చిందో చెప్ప౦డి?
జవాబు:
బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్ళను ఇచ్చింది.
ప్రశ్న 3.
కట్టెలు కొట్టేవాడు బంగారు గొడ్డలి ఎందుకు తీసుకోలేదో చెప్ప౦డి?
జవాబు:
నదీ దేవత బంగారు గొడ్డలి చూపించి ” ఈ గొడ్డలి నీదా!” అని అడిగినపుడు అతను. ఇది నాది కాదమ్మా! నా వంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది అని చెప్పి తీసుకోలేదు. దురాశ లేక పోవటం వలన, నిజాయితీ వలన బంగారు గొడ్డలి తీసుకోలేదు.
ప్రశ్న 4.
కట్టెలు కొట్టేవాడి స్థానంలో మీరుంటే ఏ గొడ్డలి తీసుకుంటారు? ఎందుకు?
జవాబు:
నా గొడ్డలి నేను తీసుకుంటాను. ఎందుకంటే దురాశ ద:ఖానికి చేటు. మనది కాని దాని కోసం మనం ఆశపడకూడదు. మనదైన వస్తువును వదల కూడదు.
ప్రశ్న 5.
కట్టెలు కొట్టేవాడిని మెచ్చుకున్న వనదేవత బహుమతిగా ఏమి ఇచ్చింది?
జవాబు:
బహుమతిగా.. తన (ఇనుప) అసలు గొడ్డలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా ఇచ్చి పంపింది.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది భావాలకు సరిపోయే గేయ భాగాలు గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
ఒక పల్లెలో నీతిమంతంగా ఏ ఆధారం లేకుండా బతికే పేదవాడున్నాడు.
జవాబు:
ఆ ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు, ఆదర్వుమాలిన బీదవాడొకడుండు
ప్రశ్న 2.
నా గొడ్డలి పోయింది నేనెలా బ్రతకాలి?
జవాబు:
నా గొడ్డలే పోయె, నాగతి యింకేమి?
ప్రశ్న 3.
బంగారు గొడ్డలి చూపించి ఇది నీదేనెమో చూడు.
జవాబు:
రంగారు వన్నెల, బంగారు గొడ్డలి, చూపి నీదేనేమొ చూడుమా యని పల్కె.
ప్రశ్న 4.
నాది నేను కోరను. నావంటి పేదవాడికి బంగారు గొడ్డలి ఎక్కడిది?
జవాబు:
నాది కానిది నేను, మది కోర నోయమ్మ, ఈ మొగంబుల కేమి? ఈ మిసిమి పసలేమి?
ఆ) గేయాన్ని చదవండి. ఒత్తు పదాలను గుర్తించి రాయండి.
ఉదా॥ సత్య వ్రతంబు ____________ ____________
______ ______ _______
జవాబు:
1) సత్య వ్రతంబు
2) పల్లెటూరిలో
3) ఆదర్వుమాలిన
4) నిత్యంబు
5) కనులొప్ప చేప్పేట
6) తత్తరం బెటు దీర్తు
7) గొడ్డలి
8) వాని ధర్మానికి
9) వాని సత్యానికి
Textbook Page No. 42
ఇ) కింది గేయకథ పాదాలను సరైన క్రమంలో రాయండి.
నా ముద్దు బిడ్డల.
అనుచు తెన్నులు చూచి
మోమెట్లు కనుగొందు
కనులొప్ప చెప్పేటి
జవాబు:
అనుచు తెన్నులు చూచి
కనులొప్ప చెప్పేటి
నా ముద్దు బిడ్డల
మోమెట్లు కనుగొందు
ఈ) కింది గేయకథ పాదానికి భావాన్ని రాయండి.
బంగారు గొడ్డలిని
వెండి గొడ్డలియును
బహుమానముగా నిచ్చి
పంపించె దీవించి.
భావం : అంతేకాకుండా బంగారు గొడ్డలినీ, వెండి గొడ్డలినీ కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపింది వన దేవత.
ఉ) కింది పదాలను సరైన ప్రదేశంలో రాయండి.
మేత పాలిచ్చి మెలగాలో పంజా తల్లిని సత్యసంధత లేగదూడ
ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది సాధుజంతువు. ఒకనాడు ఆ ఆవు అడవిలో………. మేస్తుండగా, ఆకలితో ఉన్న పులికంట బడింది. ఆవును చూడగానే ఒక్కసారిగా ………. విసరబోయింది. అప్పుడు ఆవు తనకో……….. ఉందని బుద్ధులు నేర్పి వస్తానని ప్రాధేయపడింది. మొదట పులి ఒప్పుకోలేదు. చివరకు సరే నంది. ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు ………. ఇతరులతో ఎలా ……… బుద్ధులు నేర్పి, పులి దగ్గరకు వెళ్తుంది. దూడ కూడా…………….. అనుసరిస్తుంది. తల్లీబిడ్డల ప్రేమాభిమానాలు, ఆవు ……………. కు పులి మెచ్చి వాటిని విడిచి పెట్టి, నీ బిడ్డతో బతకమని చెప్పింది.
జవాబు:
ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది సాధుజంతువు. ఒకనాడు ఆ ఆవు అడవిలో మేత మేస్తుండగా, ఆకలితో ఉన్న పులికంట బడింది. ఆవును చూడగానే ఒక్కసారిగా పంజా విసరబోయింది. అప్పుడు ఆవు తనకో లేగదూడ ఉందని బుద్ధులు నేర్పివస్తానని. ప్రాధేయపడింది. మొదట పులి ఒప్పుకోలేదు. చివరకు సరే నంది. ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో బుద్ధులు నేర్పి, పులి దగ్గరకు వెళ్తుంది. దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది. తల్లీబిడ్డల ప్రేమాభిమానాలు, ఆవు సత్యసంధత కు పులి మెచ్చి వాటిని విడిచి పెట్టి, నీ బిడ్డతో బతకమని చెప్పింది.
ఊ) పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆవు తన లేగదూడతో ఏమని చెప్పి ఉంటుంది?
జవాబు:
ఒంటరిగా ఎటూ వెళ్ళకూ, తోటి వారితో స్నేహంగా ఉండు, రేపటి నుండి నీకు తోడుగా నేనుండను. నీకు నువ్వే ధైర్యంగా బ్రతకాలి అని చెప్పి ఉంటుంది.
ప్రశ్న 2.
ఆవుకు పులి ఎక్కడ ఎదుటపడింది?
జవాబు:
అడవిలో మేస్తుండగా ఎదుటపడింది.
ప్రశ్న 3.
పులి ఆవును ఎందుకు విడిచి పెట్టింది ?
జవాబు:
తల్లీబిడ్డల ప్రేమాభిమానాలకు, ఆవు సత్యసంధతకు మెచ్చి పులి విడిచి పెట్టింది.
Textbook Page No. 43
పదజాలం
అ) గేయంలో ప్రాస పదాలను రాయండి.
నింపుకొనుచు – జీవించు
__________ _________ __________
__________ _________ __________
జవాబు:
1. అకలంక చరితుండు – బీదవాడొకడుండు
2. వస్తాడు – తెస్తాడు
3. గంజిపోస్తాడు – బ్రతికిస్తాడు
4. కడుపల్లి – తగ్గి
5. యినుమడి – నదిపడి
6. దీనత – దేవత
ఆ) కింది పదాలకు బహువచన ‘రూపాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.
1. చెట్టు : చెట్లు
ఉదా॥ మనం చెట్లను పెంచాలి
2. బహుమానం : _______
____________
జవాబు:
బహుమానాలు
నా పుట్టిన రోజుకు నా మిత్రులు ఎన్నో బహుమానాలు యిచ్చారు.
3. దేవత : _______
____________
జవాబు:
దేవతలు,
దేవతలు వరాలిస్తారు.
4. పిల్లవాడు : ______
_________
జవాబు:
పిల్లలు
పిల్లలు ఆటలను ఇష్టపడతారు.
5. నది : ______
_________
జవాబు:
నదులు
నదులు జీవనాధారం.
ఇ) కింది పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా॥ నిత్యము = ప్రతిరోజు
సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు.
1. బీదవాడు : ________
_________________
జవాబు:
లేనివాడు, పేదవాడు.
లేనివాడికి (పేదవాడికి) అత్యాశ ఉండదు.
Textbook Page No. 44
2. పల్లెటూరు : ______
_____________
జవాబు:
గ్రామం
గ్రామాలు ప్రజలకు తల్లిలాంటివి
3. మోము : _________
___________
జవాబు:
ముఖము
శరీరంలో ముఖము చందమామలా అందంగా ఉంటుంది.
4. తిలకించు : _______
_____________
జవాబు:
చూచి. చూసి
నాన్న నా మార్కులు చూచి మెచ్చుకున్నారు.
ఈ) సత్యం పలకడం ఒక మంచి లక్షణం. అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండడంవల్ల మనం మంచివాళ్ళుగా తయారవుతాము.
కింది మంచి లక్షణాలు చదవండి. వీటిలో మీరు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో వాటికి (✓) పెట్టండి.
జవాబు:
ఉ) కింది పదాల ఆధారాలతో కొత్త పదాన్ని కనుగొనండి.
1. క్షీరాన్నం
పా____ ____ ము
జవాబు:
పాలన్నము
2. ఒక శరీర భాగం
పా ____ ము
జవాబు:
పాదము
3. పుణ్యం కానిది
పా_____ము
జవాబు:
పాపము
4. ఒక పక్షి
పా___ ____ము
జవాబు:
పావురము
5. రాయి
పా___ ____ము
జవాబు:
పాషనము
6. పక్క భాగం
పా____ము
జవాబు:
పార్ష్వము
7. బెల్లంతో చేసేది
పా ___ ____ ము
జవాబు:
పానకము
Textbook Page No. 45
స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పేదవాడు ఎలాంటి వాడో నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
కల్లాకపటం లేనివాడు. కట్టెలు కొట్టుకుని అమ్ముకునేవాడు. సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. అత్యాశలేనివాడు. తనకు కాని వస్తువును ఆశించడు.
ప్రశ్న 2.
నదీ దేవత పేదవాడితో ఏమని పలికింది?
జవాబు:
నాయనా! నీ సత్యమైన ధర్మమైన, బుద్ధికి ఆశలేని ఆలోచన నాకు మెచ్చు వచ్చెనని పలికింది.
ప్రశ్న 3.
పేదవానికి నదిదేవత బహుమతిగా ఏమిచ్చింది?
జవాబు:
తన ఇనుప గొడ్డలితో పాటు, బంగారు, వెండి ! గొడ్డళ్ళను బహుమతిగా ఇచ్చింది.
ప్రశ్న 4.
గేయం ఆధారంగా “సత్యమహిమ” కథను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఒక పల్లెటూరిలో కల్లాకపటం లేని ఒక బీదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒక రోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది.
అయ్యో! దేవుడా! నా గొడ్డలి నీళ్ళల్లో పడింది. నేనెట్లా బతకాలి. “నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంటచేసి మాకు పెడుతుంది. అని నా పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. నేను వట్టి చేతులతో వెళ్లే వారికి ఆకలి ఎలా తీరుతుంది?” అని బాధపడ్డాడు.
అతని బాధ, చూసి నదీ దేవతకు మనస్సు కరిగింది. సాయం చేయాలనుకొని అ నదిలో ప్రత్యక్షం అయింది. నదిలోనుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” అని అడిగింది. అతను “కాదమ్మా! ఇది నాది కాదు. నావంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది?” అని చెప్పాడు. దేవత మళ్ళీ నదిలోనుంచి ఒక వెండి గొడ్డలి తీసింది. ” ఈ గొడ్డలి నీదా”? “కాదమ్మా, ఇది కూడా నాది కాదు” అని అతను బదులు చెప్పాడు. దేవత ఇనుప గొడ్డలి తీసింది. ఇది నీదా?” అని అడిగింది. “ఇదేనమ్మా నాది” అంటూ చేతులు జాపాడు.
నదీదేవత అతని నిజాయితీని మెచ్చుకుని, అతని ఇనుప గొడ్డలిని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డలినీ, వెండి గొడ్డలినీ కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది.
ఆ) గేయం ఆధారంగా నదీదేవతకు, పేదవాడికి మధ్య జరిగిన సంభాషణలు రాయండి.
పేదవాడు : తల్లీ! నదీదేవతా! నా గొడ్డలి పోయిందమ్మా!
నదీదేవత : ఈ బంగారు గొడ్డలి నీదా?
పేదవాడు : ఇది నాది కాదమ్మా !
నదీదేవత : ఈ వెండి గొడ్డలి నీదా!
పేదవాడు : ఇది నాది కాదమ్మా !
నదీదేవత : ఈ ఇనుప గొడ్డలి నీదా! 4
పేదవాడు : ఇదేనమ్మా! నాది.
నదీదేవత : నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను.
పేదవాడు : ధన్యుడను తల్లీ!
నదీదేవత : ఇదిగో నీ ఇనుప గొడ్డలి.
పేదవాడు : సంతోషం తల్లీ. ఇదే నా జీవనాధారం.
నదీదేవత : దీంతో పాటు నీకు బహుమతిగా ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా ఇస్తున్నాను. తీసుకో !
పేదవాడు : చాలా సంతోషం తల్లీ. వీటికంటే నీ దీవెనెలే నాకు గొప్ప బహుమతి తల్లీ!
Textbook Page No. 46
ప్రాజెక్టు పని
అ) మీ దగ్గరలో గ్రంథాలయాన్ని సందర్శించి నీతి కథలను సేకరించండి. మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
భాషాంశాలు
అ) కింది వాక్యాలు చదవండి.
1. రాజు, రాము తోటకు వెళ్ళారు.
2. మామిడికాయలు కోసారు.
3. ఇంటికి తెచ్చారు.
4. అమ్మకు ఇచ్చారు.
పై వాక్యాలలో వెళ్ళారు, కోసారు, తెచ్చారు, ఇచ్చారు లాంటి పదాలు జరగడాన్ని తెలియజేస్తున్నాయి. అలాంటి పదాలను ‘క్రియాపదాలు’ అంటారు.
కింది వాక్యాలలో క్రియా పదాలు గుర్తించి గీత గీయండి.
1. మా నాన్న బొమ్మలు కొన్నాడు
జవాబు: కొన్నాడు
2. పిల్లలందరూ ఆటలు ఆడారు.
జవాబు: ఆడారు
3. అత్త ఉత్తరం రాసింది.
జవాబు: రాసింది
4. ప్రవల్లిక నాట్యం చేసింది.
జవాబు: చేసింది
5. తరుణ్ చిత్రం గీసాడు.
జవాబు: గీసాడు
6. మురళి పాటలు పాడాడు.
జవాబు: పాడాడు
ఆ) కింది ఖాళీలను క్రియా పదాలతో పూరించండి.
1. గీత కవితలు _________
జవాబు: వ్రాసింది
2. హర్షిత చిత్రాలు _______
జవాబు: గీసింది.
3. చంద్ర అన్నం ____
జవాబు: తిన్నది
4. రాబర్ట్ సైకిల్ _____
జవాబు: తొక్కుతున్నాడు
5. అహ్మద్ ఈత _______
జవాబు: కొడుతున్నాడు
కవి పరిచయం :
అవధాని రమేష్ కాలము : 20వ శతాబ్దం
రచనలు : ‘కాసుల పేరు’, ‘ప్రతీకారం’, ‘మూడు మంచి కథలు’
విశేషాలు : ఈ గేయకథ అవధాని రమేష్ గారి రచన ‘గుజ్జనగూళ్ళు’ నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశాస్త్రి, సావిత్రమ్మ.
పదాలు – అర్థాలు
మహిమ = గొప్పతనం
అకలంక = మచ్చలేని, చెడుగణాలు లేనట్టి
చరితుండు = చరిత్రకలవాడు, ప్రవర్తన కలవాడు
సత్యవ్రతంబు = ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం
నిత్యంబు = ఎల్లప్పుడు
గతి = జీవితం గడిచే విధానం
తెన్నులు చూచి = ఎదురు చూసి
మోము = ముఖం
తత్తరం = గాబరా
ఆర్తి = దు:ఖం
కని = చూసి
దీనత = దారిద్ర్యం
కరుణ = దయ, జాలి
మిరుమిట్లు = మెరుగులు
తిలకించి = చూసి
మది = మనసు, బుద్ధి
మొగంబు = ముఖం
మిసిమి = నూతన కాంతి
బహుమానం = కానుక
వన్నె = అందం, రంగు
చెన్ను = అందం
భావం
ఒక పల్లెటూరిలో కల్లాకపటం లేని ఒక బీదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒక రోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది.
అయ్యో! దేవుడా! నా గొడ్డలి నీళ్ళల్లో పడింది. నేనెట్లా బతకాలి. “నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంటచేసి మాకు పెడుతుంది. అని నా పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. నేను వట్టిచేతులతో | వెళ్లే వారికి ఆకలి ఎలా తీరుతుంది?” అని బాధపడ్డాడు.
అతని బాధ, చూసి నదీ దేవతకు మనస్సు కరిగింది. సాయం చేయాలనుకొని అ నదిలో ప్రత్యక్షం అయింది. నదిలోనుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” అని అడిగింది. అతను “కాదమ్మా! ఇది నాది కాదు. నావంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది?” అని చెప్పాడు. దేవత మళ్ళీ నదిలోనుంచి ఒక వెండి గొడ్డలి తీసింది. ” ఈ గొడ్డలి నీదా”? “కాదమ్మా, ఇది కూడా నాది కాదు” అని అతను బదులు చెప్పాడు. దేవత ఇనుప గొడ్డలి తీసింది. “ఇది నీదా?” అని అడిగింది. “ఇదేనమ్మా నాది” అంటూ చేతులు జాపాడు.
నదీదేవత అతని, నిజాయితీని మెచ్చుకుని, అతని ఇనుప గొడ్డలిని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డలినీ, వెండి గొడ్డలినీ కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది.
ఈ మాసపు గేయం
కన్నడ గేయం
ఓ చెలువిన … ఆ ముద్దిన…
‘చెలువిన ముద్దిన మక్కలే’
|| ఓ చెలు||
మనెయనెయా అంగలదే
అరలిరువా పూవుగళే
నా ళె దినా నాడిదను ‘నడెసువరు నీవుగళే’
|| ఓ చెలు||
చ||
తందె తాయ హేళిద రీతి నడెయులు బేకు
శాలెయ గురుగళు కలిసిద పాఠ కలియలు బేకు
దొడ్డవరల్లి భక్తి గౌరవ తోరలు బేకు
నడెనుడియల్లి ‘సత్యవ ఎందు పాలిసబేకు’
|| ఓ చెలు ||
స్నేహితరల్లి ప్రీతియతోరి సోదరభావదినోడి
సోమారియాగదె కొట్టి హ కెలసవ తప్పదె మాడి
యారె ఆగలీ కష్టదల్లిద్దరే
సహాయ హస్తవ నీడి
భేదవ తొరెదు బారిలి
|| ఓ చెలు ||
భావం
ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా! ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ మీ అంతట మీరు నడవటం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చూపిన బాటలో, నేర్పిన రీతిలో నడుచుకుంటారు, అనుసరిస్తారు. గురువులు చెప్పిన పాఠాలను చక్కగా నేర్చుకుంటారు. పెద్దల పట్ల భక్తి, గౌరవం ప్రదర్శిస్తూ ఉంటారు. నిత్యం సత్యాన్నే పలుకుతూ సత్యమార్గంలోనే పయనిస్తూ ఉంటారు.
ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా! ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు. స్నేహితులతో ప్రేమ పూర్వకంగా సోదర భావంతో మెలుగుతూ ఉంటారు. పేదవారికి, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు. తన పర భేద భావమే లేకుండా మనమంతా ఒక్కటనే భావంలో ఉంటారు. ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు.
మాసపు కథ
ఏకాలుది నేరం?
ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములొచ్చారు. వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు. ” మేము నలుగురమూ అన్నదమ్ములమే. పెద్దవాళ్లం ముగ్గురమూ ఫిర్యాదీలం. చిన్నవాడు మాద్దాయి. మీ తీర్పుకోసం వచ్చాం.” అన్నాడు నలుగురిలోనూ పెద్దవాడు.
” మీ ఫిర్యాదేమిటి ?” చెప్పమన్నట్లు పెద్దవాడివైవు చూశాడు రామన్న. అతను ఇట్లా చెప్పసాగాడు. “మేము నలుగురమూ కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాము. ఆ పిల్లి అంటే మాకందరికీ చాలా ఇష్టం. దాని నాలుగు కాళ్లను నలుగురమూ పంచుకొని, ఎవరి కాలికి వాళ్ళం అలంకారాలు తగిలించాం. కొన్ని రోజులు గడిచక మాలో నాల్గవవాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది. గాయం అయింది. ఆ కాలు , తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చూట్టాడు. గుడ్డచుట్టిన కాలి తో పిల్లి దీపం దగ్గరికి వెళ్లింది. గుడ్డ అంటుకుంది. దాంతో అది కంగారుపడిపోయి కొట్టంలో దూరింది. దూది కి మంటలు అంటుకుని కొట్టం అంతా తగలబడిపోయింది.
రామన్నగారు! ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు. కనుక మిగిలిన ముగ్గురికీ అతను నష్ట పరిహారం చెల్లించాలి. అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం ” అని ముగించాడు.
రామన్న ముద్దాయి అయిన కడపటివాడివైపు చూశాడు – ‘ ఏమంటావు’? అన్నట్లుగా. నాల్గవవాడు ముందుకొచ్చి “తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది. మరి దానికి నష్ట పరిహార మిచ్చేది ఎవరు? అది వదిలేసినా వీ|రికి పరిహారం చెల్లించటానికైనా నా దగ్గర డబ్బు లేదు” అన్నాడు. సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబబుగా తోచింది. చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి. అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి.
“మీ ముగ్గురన్నదమ్ములూ చిన్నవాడికి పరిహారం చెల్లించాలి” అన్నాడు రామన్న. వాళ్లూ, వాళ్లతోపాటు సభలోని వారూ కూడా తెల్లబోయారు, ఆ తీర్పుకు. రామన్న తెలివిక్కువ తీర్పు చెప్పాడనే భావించారు. తమలో తాము గుస గుస లాడుకోసాగారు.
అప్పుడు రామున్న తన తీర్పును ఇలా వివరించాడు. ” అయ్యలారా! దూది కాలటం నిజమే కాని ఆ ప్రమాదం మీ తమ్ముడికి వాటా కొచ్చిన కాలు వల్ల జరగలేదు. మీ వాటా కాళ్ల వల్లే జరిగింది. ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయమవడం వల్ల ఆ అవిటికాలుతో పిల్లి కొట్టంలోకి వెళ్లలేదుగదా! ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్ళినవి మిగిలిన మూడు కాళ్లు మాత్రమే. ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక. అంటే… పిల్లి… మీ వాటా కాళ్ల వల్లనే కొట్టం వరకూ వెళ్లింది. అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత సూత్రమూ కాదు. అందుకనే మీరు ముగ్గురూ అతనికి పరాహారం చెల్లించాలి.”
ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది. ఎంతో సమంజసంగా ఉ ందనిపించింది. అందరూ రావన్నను అభినందించారు.