AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం

Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class EVS Solutions Lesson 10 భారత స్వాతంత్ర్యోద్యమం

I. విషయావగాహన:

ప్రశ్న 1.
స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్రం కోసం త్యాగం చేయకపోతే ఏం జరిగి ఉండేదో వివరించండి?
జవాబు:

  1. స్వాతంత్ర్యసమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనం అను భవిస్తున్న స్వాతంత్ర్యము మరియు స్వేచ్ఛాజీవితము.
  2. స్వాతంత్ర్యము అనగా ప్రజలకు స్వేచ్చగా, మాట్లాడుటకు, సంతోషంగా జీవించుటకు ఎలాంటి అవరోధాలు లేకుండా జీవించుటకు కల్పించబడిన అవకాశం స్వాతంత్ర్యము అనేది ఉన్నత జీవితం గడపటానికి మూలం..

ప్రశ్న 2.
భారత స్వాతంత్రోద్యమాన్ని క్లుప్తంగా వివరించండి?
జవాబు:

  1. 1498 లో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. పోర్చుగీను , డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వారు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వర్తకం కోసం వచ్చారు.
  2. బ్రిటీష్ వారు మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. భారతీయ రాజ్యాలను, జయించి 1757 లో పాలించటం ప్రారంబించారు. 1857 లో భారత్ లోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బ్రిటీష్ వారి పై తిరుగుబాటు చేసారు. దీనినే మొదటిస్వాతంత్ర్య సంగ్రామంగా చెబుతారు.
  3. 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. భారతీయుల హక్కుల కోసం బ్రిటిష్ వారి పై పోరాటం చేసింది.
  4. 1919 లో గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. సహాయనిరాకరణోద్యమం (1922) మరియు, ఉప్పు సత్యాగ్రహం (1930) చేపట్టారు.
  5. 1942 లో భారత జాతీయ కాంగ్రెస్ భారత దేశాన్ని వదలి వెళ్ళాలని బ్రిటీష్ వారిని డిమాండ్ చేసింది దాని ఫలితంగా వారు ఆగష్టు 14 1947 అర్థరాత్రి భారత్ ను వదిలి వెళ్ళారు. కావున మనం ప్రతి సంవత్సరం ఆగష్టు 15 ను స్వాతంత్ర్యదినోత్సవంగా జరుపుకుంటాం

ప్రశ్న 3.
మీకు తెలిసిన కొందరు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు చెప్పండి?
జవాబు:
భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర తిలక్, రాణీ లక్ష్మీ భాయ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, పటేల్, పొట్టిశ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, మొదలగువారు.

AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 4.
మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికానుంచి బారత దేశం వచ్చి ఉండక పోతే ఏమి జరిగి ఉండేది?
జవాబు:
గాంధీజీ ఒక ప్రముఖ భారతీయ జాతీయ వాద సిద్ధాంత కర్త మరియు సమాజ నిర్వాహకుడిగా ఒక అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. గాంధీజీ ” డు ఆర్ డై ” అనే నినాదాన్ని చ్చారు. గాంధీజీ అనేక స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలను నడిపారు.

వాటి ఫలితంగా భారత దేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది. వారు అహింసావాదాన్ని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకున్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి వచ్చి ఉండక పోతే 1947 నాటికి భారత్ స్వాతంత్ర్యం సాధించి ఉండేది కాదు. .

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 5.
ప్రజలు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేస్తారు?
జవాబు:
ప్రజలు ఒక ప్రత్యేక వ్యక్తి (స్వాతంత్ర సమరయోధులు) లేదా సంఘటనను గౌరవించటానికి విగ్రహాలను వ్యవస్థాపించారు. గొప్ప వ్యక్తుల విగ్రహాలు ప్రేరణలకు మూలం. వారు సమాజానికి, దేశానికి చేసిన సేవలు మరియు వారి విలువలను కొనియాడుటయే విగ్రహల. ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:

ప్రశ్న 6.
స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు సేకరించి ఆల్బమ్ తయారు చేయండి?
జవాబు:
విద్యార్ధికృత్యము.

AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 7.
జాతీయ పతాకం చిత్రం గీసి రంగులు వేయండి.
జవాబు:
విద్యార్ధికృత్యము

VI. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పృహ కల్గి ఉండడం:

ప్రశ్న 8.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నీవు ఎలా ప్రశంసిస్తావు?
జవాబు:
భారతీయ స్వాతంత్ర సమరయోధులు, వారి చరిత్రలు, వారి పోరాటాలు ప్రజలకు స్ఫూర్తిని ప్రేరణను ఇస్తాయి. మనకు స్వాతంత్ర్యం సాధించి పెట్టుటకు వారు తమ జీవితాలను – త్యాగం చేశారు భారతదేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించటం అనేది వారికల.వారి ద్వారా పొందిన స్వాతంత్ర్యాన్ని సరియైన మార్గంలో అనుభవించటం అంటే మనం నైతిక విలువలతో సమాజాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళేలా ప్రవర్తించాలి. ”

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
చారిత్రక కట్టడాలు అనగానేమి ఉదాహరణ లివ్వండి?
జవాబు:
ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవ సూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని ” చారిత్రక కట్టడం” అంటారు.
ఉదా: తాజ్ మహల్, ఎర్రకోట, హవామహల్, సాంచి స్థూపం మొదలైనవి కొన్ని చారిత్రక కట్టడాలు.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్వాతంత్ర్య సమరయోధుల పేర్లను పేర్కొనండి?
జవాబు:
అల్లూరి సీతారామరాజు ‘, దుగ్గిరాల గోపాలకృష్ణ , దువ్వూరి సుబ్బమ్మ, గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, కొండా వెంకటప్పయ్య, పొనక కనకమ్మ పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలగువారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు.

AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

సరియైన సమాధానాలను గుర్తించండి:

ప్రశ్న 1.
…………………… లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నాడు .
(A) 1947
(B) 1498
(C) 1489
(D) ఏదీకాదు
జవాబు:
(B) 1498

ప్రశ్న 2.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించ బడిన సంవత్సరం ……………………
(A) 1985
(B) 1880
(C) 1885
(D) 1785
జవాబు:
(C) 1885

ప్రశ్న 3.
గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సంవత్సరం ……………………
(A) 1910
(B) 1919
(C) 1719
(D) 1819
జవాబు:
(B) 1919

AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం

ప్రశ్న 4.
స్వాతంత్ర్య దినోత్సవం ……………………
(A) 15 ఆగష్టు 1947
(B) 26 జనవరి 1950
(C) 15 ఆగష్టు 1942
(D) 1919
జవాబు:

ప్రశ్న 5.
రిపబ్లిక్ దినోత్సవం ……………………
(A) 15 ఆగష్టు 1947
(B) 26 జనవరి 1950
(C) 15 ఆగష్టు 1942
(D) 1919
జవాబు:

ప్రశ్న 6.
…………………… తిరుగుబాటుని మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అంటారు
(A) 1757
(B) 1887
(C) 1947
(D) 1857
జవాబు:
(D) 1857

AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం

బి. క్రింది సంఘటనలను వాటి సంవత్సరాలతో జతపరచండి.

AP Board 5th Class EVS Solutions 10th Lesson భారత స్వాతంత్ర్యోద్యమం 1

జవాబు:
1. E
2. D
3. B
4. A
5. C