Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 2nd Lesson వాతావరణ మార్పు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 2 వాతావరణ మార్పు
అ) విషయావగాహన:
ప్రశ్న 1.
వాతావరణం అంటే ఏమిటి?
జవాబు:
సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను “వాతావరణం” అంటారు.
ప్రశ్న 2.
వాతావరణ మార్పువలన మనం ఎదుర్కొనే సమస్యలు ఏవి? వాతవరణ మార్పు వలన ఎదుర్కోనే సమస్యలు.
జవాబు:
- వాతావరణ మార్పుల వలన వర్షాలు సకాలంలో కురవక కరవు ఏర్పడుతుంది.
- పెను తుఫానులు, సునామీలు సంభవించవచ్చు. 5వ తరగతి – పరిసరాల విజ్ఞానం
- ధృవ ప్రాంతాలలో మంచు కరగడం వలన సముద్రమట్టాలు పెరిగి సముద్రతీరాలలోని ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతాయి.
- సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం వలన సముద్ర జీవులు, మొక్కలు చనిపోతాయి.
ప్రశ్న 3.
వాతవరణ మార్పుకు కారణాలు తెల్పండి?
జవాబు
- భవనాలనిర్మాణం, రోడ్లు వెడల్పుకోసం చెట్లు నరికి వేయటం.
- గాలి కాలుఫ్యానికి కారణమయ్యే వాహనాలను వాడడం వలన హానికర రసాయనాలు విడుదల ఔతున్నాయి.
- నీటిలో మురుగుని వదలడం.
- భూమిలో కలిసిపోలేని ప్లాస్టిక్ ని ఆధిక మొత్తాలలో వాడటం.
- సహజవనరులను విపరితంగా వాడటం (బొగ్గు, పెట్రోలువంటివి)
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
మీ గ్రామంలో ప్రజలు కరువుతో బాధపడుతుంటే, దానికి కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి? మా ప్రాంత ప్రజలు కరువు తో భాధ పడటానికి కారణాలు.
జవాబు:
- వాతావరణ మార్పుల వల్ల సకాలంలో వర్షాలు కురవక పోపటం.
- వాతావరణ మార్పులకు మాప్రాంత ప్రజలు చేసే ‘చెట్లను నరకటం.
వాహనాలద్వారా, ఫ్యాక్టరీల ద్వారా అధికమొత్తాలలో ప్రమాదకరవాయువులు వాతావరణంలోకి వదలటం, ప్లాస్టిక్ వాడకం వంటి అన్ని చర్యలు వాటి ఫలితంగా ఏర్పడే వాతావరణ కాలుష్యాలు కారణం
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ ఇంటిలో చెత్తను తొలగించే విధానాన్ని పరిశీలించండి. ఒక నివేదిక తయారు చేయండి?
జవాబు:
మా ఇంటిలో చెత్తను తొలగించే విధానం క్రింది విధంగా ఉంటుంది.
- వంటగదిలోని చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా విభజించి రెండు బుట్టల్లో వేస్తాము.
- రెండు చెత్త కవర్లలో ఒక దానిలో ప్లాస్టిక్, పేపరు వంటి పొడి వ్యర్థాలు, ఇతర చెత్తను వేరే కవరులో వేస్తాము.
- తడి చెత్తను ఎప్పటి కప్పుడు పారవేయటం చేస్తాము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
ప్లాస్టిక్ సీసాల బదులుగా స్టీల్ సీసాలు వాడే విద్యార్థుల వివరాలు సేకరించండి?
జవాబు:
విధ్యార్ధికృత్యము
ప్రశ్న 7.
ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించి పెన్ స్టాండ్, పూలకుండీ తయారుచేయండి?
జవాబు:
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 8.
‘పర్యావరణ పరిరక్షణ పై నినాదాలు తయారుచేయండి. తరగతి గదిలో ప్రదర్శించండి?
జవాబు:
- ప్రకృతిని రక్షించండి – భవిష్యత్తును రక్షించండి
- మొక్కలను కాపాడండి – జీవితాన్ని కాపాడండి.
- భూమిని కాపాడండి – మీమ్మల్ని మీరు కాపాడుకోండి
- స్వచ్చమైన ,గాలికోసం మీ వంతు పాటుపడండి.
- పిల్లల భవిష్యత్తుకోసం సహజవనరులను కాపాడండి.
అదనపు ప్రశ్నలు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మొక్కలను సంరక్షించుటలో మన పాత్ర ఏమిటి?
జవాబు:
మొక్కలను సంరక్షించుటలో మన పాత్ర:
1. చెట్లను నరకరాదు.
2.మన పరిసరాల్లో, వీధుల్లో, పాఠశాలల్లో చెట్లను నాటాలి. . .
3. చెట్లకు రక్షక కవచాలు నిర్మించాలి.
ప్రశ్న 2.
“ గ్లోబల్ వార్మింగ్ ” అనగానేమి? గ్లోబల్ వార్మింగ్ కు కారణాలేంటి?
జవాబు:
గ్లోబల్ వార్మింగ్ :- వాతావరణంలో మార్పుల వల్ల భూమి సరాసరి ఉష్ణోగ్రత
పెరుగుదలను “గ్లోబల్ వార్మింగ్ ” అంటారు.
గ్లోబల్ వార్మింగ్ కు కారణాలు :-
- నీరు, బొగ్గు ఇంధనం మొదలైన సహజవనరులు విచక్షణారహితంగా వాడటం.
- కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదల చేసే వాహనాలు, ఫ్యాక్టరీల వినియోగం.
- చెట్లకు నరకటం.
II. ప్రశంస:
ప్రశ్న 3.
పర్యావరణ హితం అనగానేమి? నీవు ఎలా తోడ్పడతావు?
జవాబు:
పర్యావరణ హితం అనగా వాతావరణానికి ప్రమాదకరం కానిది అని అర్థం.
పర్యావరణ హితానికి నాతోడ్పాడు:-
- పేపరు, జనపనార, వస్త్రముతో చేసిన సంచులనే వాడతాను.
- తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చెత్త బుట్టలో వేస్తాను.
- ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా స్టీలు, రాగి బాటిల్స్ వాడతాను.
- వంటగదిలోని చెత్తను సహజ ఎరువుగా వాడతాను.
- పేపరును వృధా చేయను.
- మొక్కలను నాటతాను.
- పండుగలప్పుడు పర్యావరణ హితమైన బోమ్మలు, రంగులు వినియోగిస్తాను.
ప్రశ్న 4.
” చిప్కో ఉద్యమం” అనగానేమి? ఎవరు ప్రారంభించిరి?
జవాబు:
1970 మధ్య కాలంలో భారతదేశంలో కొంతమంది అడవుల నరికివేత ను అడ్డుకున్నారు. ఇది అలా ఒక ఉద్యమంలా మారింది. దీనిలో భాగంగా చెట్లను నరకవద్దని స్థానికులు చెట్లను హత్తుకుని చుట్టూ నిలబడేవారు. దీన్ని ‘చిప్కో ఉద్యమం” అంటారు. దీనిని ‘ సుందర్ లాల్ బహుగుణ”అనే పర్యావరణ వేత్త ప్రారంభించారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు సూచన :
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాత పరిస్థితులను ……………………….. అంటారు.
(A) వర్షం
(B) కరువు
(C) వాతావరణం
(D) ఏదీకాదు
జవాబు:
(C) వాతావరణం
ప్రశ్న 2.
క్రింది వానిలో వాతావరణం మార్పులకు కారణాలు ………………………..
(A) వరదలు
(B) మంచుకరగటం
(C) అడవుల్లో కార్చిచ్చు
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ
ప్రశ్న 3.
ఒక ప్రాంత వాతావరణం క్రింది పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది ………………………..
(A) సాంధ్రత
(B) ఉష్ణోగ్రత
(C) గాలిపీడనం
(D) వర్షపాతం
(E) పైవన్నీ
జవాబు:
(E) పైవన్నీ
ప్రశ్న 4.
……………………….. భూమి యొక్క ఊపిరితిత్తులు. .
(A) అడవులు
(B) వాతావరణం
(C) వర్షం
(D) ఏదీ కాదు
జవాబు:
(A) అడవులు
ప్రశ్న 5.
……………………….. జీవారణ సమతుల్యతను కాపాడుతూ నేలకోతను అరికడతాయి.
(A) నదులు
(B) చెట్లు
(C) వాతావరణం
(D) ఏదీ కాదు
జవాబు:
(B) చెట్లు
ప్రశ్న 6.
స్వీడన్‌కు చెందిన ……………………….. అను పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పుల పై ఉద్యమం చేపట్టింది (UNCCCలో).
(A) గ్రెటా గ్లెన్ బర్గ్
(B) సుందర్ లాల్ బహుగుణ
(C) A మరియు B
(D) ఎవరూ కాదు
జవాబు:
(A) గ్రెటా గ్లెన్ బర్గ్
ప్రశ్న 7.
చిప్కో ఉద్యమ వేత్త ………………………..
(A) గ్రెటా థెన్ బర్గ్ .
(B) సుందర్ లాల్ బహుగుణ
(C) పై ఇద్దరూ
(D) ఎవరూ కాదు
జవాబు:
(B) సుందర్ లాల్ బహుగుణ
ప్రశ్న 8.
కాగితం ……………………….. తో తయారగును.
(A) ఆకులు
(B) చెట్టు గుజ్జు
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
ప్రశ్న 9.
“చిప్కో ఉద్యమం” ఏ పదం నుంచి వచ్చింది.
(A) చిప్
(B) హత్తుకోవటం
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(B) హత్తుకోవటం
ప్రశ్న 10.
పర్యావరణహితం కాని ……………………….. వాడకానికి ‘ No’ చెప్పాలి .
(A) మొక్కలు
(B) పేపరు
(C) ప్లాస్టిక్
(D) ఏదీకాదు
జవాబు:
(C) ప్లాస్టిక్