Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 9th Lesson కొలతలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Maths Solutions Chapter 9 కొలతలు
ఇవి చేయండి: (TextBook Page No.63)
ప్రశ్న 1.
ప్రతి రెండు బిందువుల మధ్య గల దూరాన్ని అంచనా వేయండి. స్కేలుతో కొలిచి సరిచూడండి.
జవాబు.
\(\overline{\mathrm{AB}}\) = 3 సెం.మీ. \(\overline{\mathrm{PQ}}\) = 4 సెం.మీ.
ప్రశ్న 2.
ఏ రెండు బిందువుల మధ్య దూరం ఎక్కువగా ఉంది ? దగ్గరగా ఉన్న బిందువులేవి ?
జవాబు.
A మరియు B బిందువులు ఒక్కదానికి ఒకటి దగ్గరగా ఉన్నాయి.
D మరియు J బిందువులు ఒక్కదానికి ఒకటి దూరంగా ఉన్నాయి.
ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పెన్సిల్ కన్నా ఒక సెంటీమీటరు ఎక్కువ పొడవు గల పెన్సిల్ బొమ్మను గీయండి.
జవాబు.
ప్రశ్న 4.
ఇవ్వబడిన బొమ్మ కన్న ఒక సెం.మీ. తక్కువ పొడవు గల నీళ్ళ సీసా బొమ్మ గీయండి.
జవాబు.
ఇవి చేయండి: (TextBook Page No.67)
ప్రశ్న 1.
మిల్లీ మీటర్లలో మాత్రమే కొలవగలిగిన కొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు.
1. వేరుశనగ విత్తనాలు (పల్లీలు)
2. బేబి పొటాటో (చిన్న బంగాళా దుంపలు)
3. నీటి పైపు యొక్క వ్యాసము
ఇవి చేయండి: (TextBook Page No.67)
ప్రశ్న 1.
పరీక్ష రాసేందుకు ఉపయోగించే అట్టమందం కనుగొనండి.
జవాబు.
పరీక్ష రాసే అట్టమందం 3 మి.మీ.లు.
అభ్యాసం 1:
ప్రశ్న 1.
కింది కూడికలు చేయండి.
అ) 7 సెం.మీ. + 5మి.మీ. + 9 సెం.మీ. 6 మి.మీ.
ఆ) 82 సెం.మీ. 8మి.మీ. + 92 సెం.మీ. 2మి.మీ.
జవాబు.
అ) 7 సెం.మీ. 5 మి.మీ. + 9 సెం.మీ. 6 మి.మీ. = 7 × 10మి.మీ. + 5 మి.మీ. + 9 × 10మి.మీ. + 6 మి.మీ.
= 70 + 5 + 90 + 6 = 171 మి.మీ.
ఆ) 82 సెం.మీ. 8 మి.మీ. + 92 cm 2 మి.మీ. = 82 × 10 మి.మీ. + 8 మి.మీ. + 92 × 10 మి.మీ. + 2 మి.మీ.
= 820 + 8 + 920 + 2
= 828 + 922 = 1750 మి.మీ.
ప్రశ్న 2.
తీసివేతలు చేయండి.
అ) 26 సెం.మీ. 4 మి.మీ.లను 43 సెం.మీ. 3 మి.మీల నుండి తీసివేయండి.
ఆ) 87 సెం.మీ. 6 మి.మీ.లను 91 సెం.మీ. 9 మి.మీ.ల నుండి తీసివేయండి.
జవాబు.
ప్రశ్న 3.
గుణించండి.
అ) 18 సెం.మీ. 6 మి.మీ. × 5
ఆ)54 సెం.మీ. 3 మి.మీ. × 23
జవాబు.
అ) 18 సెం.మీ. 6 మి.మీ. × 5 = 180 + 6
= 186 × 5 = 930 మి.మీ.
2), 54 సెం.మీ. 3 మి.మీ. × 23 = 540 + 3
= 543 × 23 = 12,489 మి.మీ.
ప్రశ్న 4.
క్రింది సమస్యలు సాధించండి.
అ. రఫీ “నా వేలి గోరు పొడవు 5 సెం.మీ., మరియు . నా వేలి పొడవు 7 మి.మీ.” అని అన్నాడు. రఫీ
చెప్పినది సరియైదేనా ? కారణం తెలపండి.
జవాబు.
కాదు, రఫీ చెప్పినది సరియైనది కాదు. .
కారణం : వేలి పొడవు, గోరు పొడవు కన్నా ఎక్కువ.
ఆ. గౌస్ తన జామెట్రీ బాక్స్ పొడవు 12 సెం.మీ., 5 మి.మీ. గా కొలిచాడు. బాబు “నా బాక్స్ పొడవు గౌస్ పొడవు గౌస్ బాక్స్ పొడవు కన్నా 2 సెం.మీ., 5 మి.మీ. ఎక్కువ” అన్నాడు. అయితే బాబు బాక్స్ పొడవెంత ?
జవాబు.
గౌస్ జామెట్రి బాక్స్ పొడవు = 12 సెం.మీ. 5 మి.మీ.
బాబు “నా బాక్స్ పొడవు గౌస్ బాక్స్ పొడవు కన్నా 2 సెం.మీ., 5 మి.మీ. ఎక్కువ అన్నాడు.
బాబు బాక్స్ పొడవు = 12 సెం.మీ. 5 మి.మీ. + 2 సెం.మీ. 5 మి.మీ.
= 14 సెం.మీ. + 10 మి.మీ. = 15 సెం.మీ. .
ఇ. మాధవి 80 సెం.మీ.ల పొడవైన పూలదండ అల్లింది. తరువాత 60 సెం.మీ.ల పూలదండ మొదట దానితో జత చేసింది. పూలదండ మొత్తం పొడవెంత ?
జవాబు.
మొదటి పూలదండ పొడవు = 80 సెం.మీ.
జతచేసిన పూలడండ పొడవు = 60 సెం.మీ.
పూలదండ మొత్తం పొడవు = 140 సెం.మీ.
ఈ. మైథిలి 18 సెం.మీ.ల పొడవు గల ఒక పెన్సిలను 2 ముక్కలుగా విరిచింది. అందులో ఒక ముక్క పొడవు 8 సెం.మీ.,
5 మి.మీ. అయితే రెండవ ముక్క పొడవెంత ?
జవాబు.
పెన్సిల్ అసలు పొడవు = 18 సెం.మీ. – 00 మి.మీ.
విరిచిన ముక్క పొడవు = – 8 సెం.మీ. – 50 మి.మీ.
మిగిలిన ముక్క పొడవు = 9 సెం.మీ. – 5 మి.మీ.
ఉ. శ్రీను 12 సెం.మీ.ల రేఖాఖండాన్ని గీచే క్రమంలో 8 సెం.మీ, 7 మి.మీ.ల వరకు గీశాడు. ఇంకెంత పొడవు గీయాలి?
జవాబు.
గీయవలసిన రేఖాఖండం పొడవు = 12 సెం.మీ. – 00 మి.మీ.
గీసిన రేఖాఖండం పొడవు = 8 సెం.మీ. – 07 మి.మీ.
ఇంకనూ గీయదలచిన రేఖాఖండం పొడవు = 3 సెం.మీ. – 3 మి.మీ.
ఊ. కోదండ ఒక సమస్యను ఇలా చేశాడు. అతను ఏ ప్రక్రియను ఉపయోగించారు ?
జవాబు.
కోదండ ఇచ్చిన సమస్యను సాధనకు వ్యవకలన ప్రక్రియను ఉపయోగించారు.
ఋ. సునీత ఒక విత్తనం పొడవు 6 మి.మీ.లుగా అంచనా వేసింది. రమీజా “ఒక విత్తనం పొడవు 6 మి.మీ. అయితే 4 విత్తనాల పొడవు 24 మి.మీ. అవుతుంది” అన్నది. రమీజా ఎలా సమాధానం చెప్పింది ?
జవాబు.
ఒక విత్తనం పొడవు = 6 మి.మీ.
4 విత్తనాల పొడవు = 24 మి.మీ.
రమీజా గుణకార ప్రక్రియను పాటించి సమాధానం చెప్పినది = 6 × 4 = 24 మి.మీ.
ఎ. సూరజ్ 12 గొంగళి పురుగులు ఒక వరుసలో వెళ్తుండడం గమనించాడు. అతను ఒక గొంగళి పురుగు పొడవుమ 3.5 సెంమీ.లుగా అంచనా వేస్తే, వరుస మొత్తం పొడవెంత ఉండవచ్చు ? (అంచనావేసి లెక్కచేయండి)
జవాబు.
ఒక గొంగళి పురుగు పొడవు = 3.5 సెం.మీ.
గొంగళి పురుగు సంఖ్య = 12
వరుస మొత్తం పొడవు = 12 × 3.5 = 48 సెం.మీ. (సుమారుగా)
ఏ. ఒక పిన్నీసు పొడవు 2 సెం.మీ. మేరీ 18 సెం.మీ. పొడవును కొలవాలంటే పిన్నీసును ఎన్నిమార్లు ఉపయోగించాలి?
జవాబు.
ఒక పిన్నీసు పొడవు = 2 సెం.మీ. .
కొలవవలసిన పొడవు= 18 సెం.మీ.
పిన్నీసును ఉపయోగించాల్సిన మార్లు = 18 ÷ 2 = 9 సార్లు.
అభ్యాసం 2:
ప్రశ్న 1.
కింది వాటిని కూడండి.
అ. 10 మీ. 75 సెం.మీ. మరియు 6 మీ. 65 సెం.మీ.
ఆ. 85మీ. 23 సెం.మీ. మరియు 68 మీ. 79 సెం.మీ.
జవాబు.
ప్రశ్న 2.
కింది తీసివేతలు చేయండి.
అ. 25 మీ. 25 సెం.మీ.ల నుండి 10మీ. 15 సెం.మీ.
ఆ. 100 మీ.నుండి 64 మీ. 45 సెం.మీ.
జవాబు.
ప్రశ్న 3.
గుణించండి.
అ. 25 మీ. 12 సెం.మీ. × 9
ఆ. 102 మీ. 65 సెం.మీ. × 46
ఇ. 125 మీ. 83 సెం.మీ. × 57
జవాబు.
ప్రశ్న 4.
భాగహారాలు చేయండి.
అ) 40 మీ. 8 సెం.మీ. ÷ 16
జవాబు.
4080 ÷ 16
∴ 2 మీ. – 55 సెం.మీ.
ఆ) 100 మీ. 75 సెం.మీ. ÷ 25
జవాబు.
10075 ÷ 25
∴ 4 మీ. – 03 సెం.మీ.
ఇ) 337 మీ. 5 సెం.మీ. ÷ 5
జవాబు.
337 ÷ 5
∴ 6 మీ. – 75 సెం.మీ.
ప్రశ్న 5.
కింది లెక్కలు చేయండి.
అ) భాషా చెట్టు పైన మామిడి పండు తెంపడానికి 2మీ. 50 సెం.మీ. మరియు 1 మీ. 75 సెం.మీ. పొడవులు గల రెండు కర్రలను జోడించాడు. అతడు ఎంత పొడవు గల కర్రమ తయారుచేశాడు ? (సుమారుగా).
జవాబు.
మొదటి కర్ర పొడవు = 2 మీ. 50 సెం.మీ.
రెండవ కర్ర పొడవు = 1 మీ. 75 సెం.మీ.
మొత్తం కర్ర పొడవు = 4 మీ. 25 సెం.మీ.
దాదాపు 4 మీ.ల కర్ర పొడవు కలదు.
ఆ) 5వ తరగతి విద్యార్థులు “టగ్ ఆఫ్ వార్” ఆట ఆడేందుకు 2 మీ. 75 సెం.మీ. మరియు 3 మీ. 75 పెం.మీ. పొడవులు గల రెండు తాళ్ళము ముడివేశారు. ఎంత పొడవు గల తాడు తయారయింది ? (సుమారుగా)
జవాబు.
మొదటి తాడు పొడవు = 2 మీ. 75 సెం.మీ.
రెండవ తాడు పొడవు = 3 మీ. 75 పెం.మీ
రెండు తాళ్ళ పొడవు = 6 మీ. 50 పెం.మీ
దాదాపు 7 మీ.ల తాడు కలదు.
ఇ) 5వ తరగతి పిల్లలు స్వాతంత్ర్య దినోత్సవం రోజు పాఠశాలను అలంకరించడానికి 45 మీటర్ల రంగుల ‘కాగితం కొనుగోలు చేశారు. అందులో 43 మీ. 50 పెం.మీ. కాగితం ఉపయోగిస్తే, మిగిలిన కాగితం పొడవెంత?
జవాబు.
కొన్నటువంటి కాగితం పొడవు = 45 మీటర్ల
ఉపయోగించిన కాగితం పొడవు = 43 మీ. 50 పెం.మీ.
మిగిలిన కాగితం పొడవు = 1 మీ. 50 పెం.మీ.
ఈ) ఎలక్టీషియన్ కిరణ్ 50 మీ. పొడవు గల ఎలక్ట్రిక్ (కరెంట్) తీగలో నుండి 45 మీ. 70 సెం.మీ. ను ఒక ఇంటికి వైరింగ్ చేయడానికి ఉపయోగించాడు. మిగిలిన తీగ పొడవెంత ?
సెం.మీ.
జవాబు. అసలు తీగ పొడవు = 50 మీ. 00 సెం.మీ.
ఉపయోగించిన తీగ పొడవు = 45 మీ. 70 సెం.మీ.
మిగిలిన తీగ పొడవు = 4 మీ. 30 సెం.మీ.
ఉ) కుమార్ 6 మీ. పొడవు గల చీరకు ఫాల్ కుట్టాలనుకున్నాడు. అతని దగ్గర ఉన్న 5 మీ. 50 సెం.మీ.ల ఫాల్ చీరకు కుట్టితే, ఎంత పొడవు చీరకు ఫాల్ ఉండదు ?
జవాబు.
చీర పొడవు = 6 మీ. 00 సెం.మీ.
ఫాల్ పొడవు = 5 మీ. 50 సెం.మీ.
ఫాల్ ఉండని పొడవు = 0 మీ. 50 సెం.మీ.
ఊ) డేవిడ్ ఒక జాకెట్ కుట్టడానికి 90 సెం.మీ.ల గుడ్డను ఉపయోగించాడు. అలాంటి జాకెట్లు ఇంకా 5 కుట్టాలంటే ఎంత పొడవు గుడ్డ అవసరమవుతుంది ?
జవాబు.
ఒక జాకెట్టుకు ఉపయోగించిన గుడ్డ పొడవు = 90 సెం.మీ.
కుట్టవలసిన జాకెట్ల సంఖ్య = 5
∴ 5 జాకెట్ల కుట్టడానికి అవసరమైన గుడ్డ పొడవు = 5 × 90 = 450 సెం.మీ.
ఋ) ఒక గొంగళిపురుగు 1 ని||లో 100 సెం.మీ. పాకగలదు. అది 15 ని॥లలో ఎంత దూరం పాకగలదు?
జవాబు.
1 ని||లో గొంగళి పురుగు పాకగలిగే దూరం= 100 సెం.మీ.
15 ని॥లలో గొంగళి పురుగు పాకగలిగే దూరం = 15 × 100 = 1500 సెం.మీ.
ఎ) స్వామి నలుగురికి 20 సెం.మీ. పొడవు గల చాక్లెట్ బార్ ను పంచాడు. ఒక్కొక్క ముక్క పొడవెంత ?
జవాబు.
పంచిన చాక్లెట్ల పొడవు = 20 సెం.మీ.
పంచిన వారి సంఖ్య = 4
ఒక్కొక్క చాక్లెట్లు పొడవు = 20 ÷ 4 = 5 సెం.మీ.
ఏ. అపర్ల 10 మీటర్ల పొడవున్న గుడ్డ నుండి 2 మీ.ల పొడవు గల తలుపు కర్టెన్లు చేయాలనుకుంది. ఆమె ఆ గుడ్డతో ఎన్ని కర్టెన్లు చేయగలదు ?
జవాబు.
మొత్తం గుడ్డ పొడవు = 10 మీ.
ఒక డోరు కర్టెను పొడవు = 2 మీ.
మొత్తం తయారగు కర్టెన్ల సంఖ్య = 10 ÷ 2 = 5.
అభ్యాసం 3:
ప్రశ్న 1.
ఇవి చేయండి:
అ) 15 కి.మీ. 500 మీ.లను మీటర్లలోకి మార్చండి.
జవాబు.
15 కి.మీ. = 15 × 1000 మీ. = 15,000 మీ.
15 కి.మీ. 500 మీ. = 15,000 + 500 = 15,500 మీ.
ఆ) 128 కి.మీ.లను మీటర్లలోకి మార్చండి.
జవాబు.
128 కి.మీ. = 128 × 1000 మీ. = 1,28,000 మీ.
ఇ) 12690 మీటర్లను కి.మీ.లోకి మార్చండి.
జవాబు.
12690 మీ. = \(\frac{12690}{1000}\)= 12.690 కి.మీ.
ఈ) 18000 మీటర్లను కి.మీ.లలోకి మార్చండి.
జవాబు.
18000 మీ. = \(\frac{18,000}{1000}\) = 18 కి.మీ. .
ప్రశ్న 2.
కింది సమస్యలు సాధించండి. అ. ఒక అబ్బాయి బడికి రావడానికి 400 మీ. డవు గల కొలను, 350 మీ. పొడవు గల పొలం, 450 మీ. పొడవు గల రోడ్డు దాటాలి. అయితే అతను బడికి రావడానికి ఎంత దూరం నడవాలి ? నడిచిన దూరం 1 కి.మీ. కంటే ఎంత ఎక్కువ ?
జవాబు.
కొలను పొడవు = 400 మీ.
పొలం పొడవు = 350 మీ.
రోడ్డు పొడవు = 450 మీ.
మొత్తం పొడవు = 1,200 మీ.
అతను బడికి రావడానికి నడిచిన దూరం = 1200 కి.మీ = 1 కి.మీ. 200 మీ.
నడిచిన దూరం 1 కి.మీ. కంటే 200 మీ. ఎక్కువ.
ఆ. సీతమ్మ 2.50 మీ. పొడవు గల వెదురుబద్దను జల్లెడ చేయడానికి 1.5 మీ. పొడవు వెదురుబద్దను బుట్ట చేయడానికి ఉపయోగించింది. ఆమె రెండింటికి కలిపి ఎంత పొడవు బద్దను ఉపయోగించింది ?
జవాబు.
జల్లెడ చేయుటకు వాడిన వెదురుబద్ద పొడవు = 2.50 మీ.
బుట్ట చేయుటకు వాడిన వెదురు బద్ద పొడవు = 1.50 మీ.
మొత్తం బద్ద పొడవు = 4.00 సెం.మీ.
ఇ. రోషన్, అనంతపురం నుండి కర్నూలు మీదుగా విజయవాడకు 540 కి.మీ.లు ప్రయాణించాడు. రాకేష్ నంద్యాల మీదుగా అనంతపురం మండి విజయవాడకు 520 కి.మీ.లు ప్రయాణించాడు. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు? ఎన్ని కి.మీ.లు ఎక్కువ
జవాబు.
రోషన్ ప్రయాణించిన దూరం = 540 కి.మీ.
రాకేష్ ప్రయాణించిన దూరం = 520 కి.మీ.
భేదము = 20 కి.మీ.
రోషన్, రాకేష్ కన్నా 20 కి.మీ.లు ఎక్కువ దూరం ప్రయాణించారు.
ఈ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గ్రామానికి 5.650 కి.మీ.ల రోడ్డు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఒక నెలలో 1.250 కి.మీ.ల రోడ్డు వేస్తే ఇంకనూ వేయవలసిన రోడ్డు పొడవెంత ?
జవాబు.
గ్రామానికి మంజూరైన రోడ్డు పొడవు = 5.650 కి.మీ.
కాంట్రాక్టర్ ఒక నెలలో వేసిన రోడ్డు 2 = 1250 కి.మీ.
ఇంకనూ వేయవలసిన రోడ్డు పొడవు = 4.400 కి.మీ.
ఉ. భాను 5 మీ. పొడవు గల గుడ్డతో 1.5 మీ. పెద్ద కుమారుడు రహీంకు, 1.2 మీ. చిన్న కుమారుడు కబీర్ కు చొక్కాలు కుట్టించింది. ఇంకా ఎంత పొడవు గుడ్డ మిగిలి ఉంటుంది ?
జవాబు.
రహీంకు ఇచ్చిన గుడ్డ పొడవు = 1.5 మీ.
కబీర్ కు ఇచ్చిన గుడ్డ పొడవు = 1.2 మీ.
మొత్తం ఇచ్చిన గుడ్డ పొడవు = 2.7 మీ.
భాను వద్ద గల గుడ్డ పొడవు = 5.00 మీ.
మిగిలిన గుడ్డ పొడవు = 2.30 మీ.
ఊ. 3 బెంచీలు ఒక వరుసలో అమర్చబడి ఉన్నాయి. ఒక బెంచీ పొడవు 1 మీ. 15 సెం.మీ. అయితే వరుస పొడవెంత ?
జవాబు.
ఒక వరుసలో గల బెంచీల సంఖ్య = 3
ఒకొక్కక్క బెంచీ పొడవు – = 1 మీ. – 15 సెం.మీ.
మొత్తం బెంచీల వరుస పొడవు = 3 × (1మీ. – 15 సెం.మీ.) = 3 మీ. – 45 సెం.మీ.
ఋ. ఒక రైలు గంటకు 50 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుంది. అదేవేగంతో అది 12 గంటలలో ఎంత దూరం ప్రయాణించగలదు ?
జవాబు.
ఒక రైలు గంటకు ప్రయాణించు దూరం = 50 కి.మీ.
ప్రయాణించిన సమయం = 12 గం||
12 గం||లలో రైలు ప్రయాణించిన దూరం = 50 × 12 = 600 కి.మీ.
ఎ. రంగయ్య తన 1500 మీ. పరిధి గల పొలానికి కంచె వేయించాలమకున్నాడు. అతను ఎన్ని కిలోమీటర్ల కంచె వేయించాలి ?
జవాబు.
పొలం పరిధి = 1500 మీ.
∴ కి.మీ.లలో పొలం పరిధి = 1500 ÷ 1000 మీ. = 1.5 కి.మీ.
ఏ. భూమి యొక్క వ్యాసం (భూమిపై ఒక బిందువు గుండి మరొక బిందువుకు కేంద్రం నుండి ప్రయాణించే దూరం) 12742 కి.మీ.లు అయితే వ్యాసార్లమెంత?
జవాబు.
భూమి యొక్క వ్యాసం = 12,742 కి.మీ.
భూమి యొక్క వ్యాసార్థం = 12742 ÷ 2 = 6,371 కి.మీ.
ఆలోచించు – చర్చించు:
ప్రశ్న 1.
ఒక దారం రీలులో ఎంత పొడవు గారం ఉంటుంది?
జవాబు.
రీలులో ఉండే దారం దాని పరిమాణం పై ఆధారపడి ఉంటుంది. దాని విలువ దాదాపు 50 మీ, 100 మీ., 200 మీ., 500 మీ. ఉంటుంది.
ప్రశ్న 2.
గాలిపటం ఎగరేసే దారం 1 కి.మీ. పొడవు కన్నా ఎక్కువగా ఉంటుందా ?
జవాబు.
గాలిపటం ఎగరేసే దారం 1 కి.మీ. కన్నా తక్కువ పొడవు ఉండవచ్చు. లేదా ఎక్కువ పొడవు వుండవచ్చు. ఎందుకనగా అది దారపు ఉండ పరిమాణంపై ఆధారపడి వుంది.
ప్రశ్న 3.
విమానాలు ఎంత ఎత్తులో ఎగురుతాయి ?
జవాబు.
విమానాలు దాదాపు 35,000 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి.
ఇవి చేయండి: (TextBook Page No.89)
కింది వాటిని సత్యమో (T), అసత్యమో (F) తెలపండి. ఒకవేళ అసత్యం అయితే కారణం తెలపండి.
ప్రశ్న 1.
నా స్నేహితుడు/రాలు బరువు 38 కి.గ్రా.
జవాబు.
(T)
కారణం : మనుష్యుల బరువులను కి.గ్రా.లలో కొలుస్తారు.
ప్రశ్న 2.
ఒక బియ్యం బస్తా బరువు 50 ________
జవాబు.
కి.గ్రా.
ప్రశ్న 3.
నా కలం బరువు 20 ________
జవాబు.
గ్రా.
ప్రశ్న 4.
నా స్కూలు సంచి (bag) బరువు 3.5 ________
జవాబు.
కి.గ్రా.
ప్రశ్న 5.
ఒక బంక సీసా (gum) బరువు 100 ________
జవాబు.
గ్రా.
ప్రశ్న 6.
నా ఖాళీ నీళ్ళ సీసా (empty water bottle) బరువు 7 ________
జవాబు.
గ్రా.
ఇవి చేయండి: (TextBook Page No.89)
ప్రశ్న 1.
కిలోగ్రాములను గ్రాములలోకి మార్చండి.
అ) 3 కి.గ్రా.
ఆ) 34 కి.గ్రా.
ఇ) 17 కి.గ్రా. 600 గ్రా.
ఈ) 38 కి.గ్రా. 720 గ్రా.
ఉ) 89 కి.గ్రా. 540 గ్రా.
జవాబు.
అ) 3 కి.గ్రా. = 3 × 1000 = 3000 గ్రా.
ఆ) 34 కి.గ్రా. = 34 × 1000 = 34,000గ్రా.
ఇ) 17 కి.గ్రా. 600గ్రా. = 17 × 1000 + 600 = 17,600 గ్రా.
ఈ) 8 కి.గ్రా. 720 గ్రా. = 38 × 1000 + 720 = 38,720 గ్రా.
ఉ) 89 కి.గ్రా. 540 గ్రా. = 89 × 1000 + 540 = 89,540 గ్రా.
ప్రశ్న 2.
గ్రాములను కి.గ్రా.లలోకి మార్చండి.
అ) 6000 గ్రా.
ఆ)7090 గ్రా.
ఇ) 8069 గ్రా.
ఈ) 12405 గ్రా.
ఉ) 2418 గ్రా.
జవాబు.
అ) 6000 గ్రా. = \(\frac{6000}{1000}\) = 6 కి.గ్రా.
ఆ) 7090 గ్రా. = \(\frac{7090}{1000}\) = 7.09 కి.గ్రా.
ఇ) 8069 గ్రా. = \(\frac{8069}{1000}\) = 8.069 కి.గ్రా.
ఈ) 12405 గ్రా. = \(\frac{12405}{1000}\) = 12.405 కి.గ్రా.
ఉ) 2418 గ్రా. = \(\frac{2418}{1000}\) = 2.418 కి.గ్రా.
అభ్యాసం 4:
ప్రశ్న 1.
కూడికలు చేయండి.
ఆ) 13 కి.గ్రా. 420 గ్రా. మరియు 24 కి.గ్రా. 600 గ్రా.
ఆ) 19 కి.గ్రా. 969 గ్రా. మరియు 98 కి.గ్రా. 327 గ్రా.
జవాబు.
ప్రశ్న 2.
తీసివేతలు చేయండి.
అ) 355 కి.గ్రా. 450 గ్రా. నుండి 235 కి.గ్రా. 250 గ్రా.
ఆ) 160 కి.గ్రా. 330 గ్రా. నుండి 21 కి.గ్రా. 62 గ్రా.
జవాబు.
ప్రశ్న 3.
గుణించండి.
అ) 8 కి.గ్రా. 750 గ్రా. × 12
ఆ) 475 కి.గ్రా. × 16
ఇ) 9850 గ్రా. × 25
జవాబు.
ప్రశ్న 4.
భాగహారాలు చేయండి.
అ) 7500 కి.గ్రా. ÷ 20
ఆ) 6600 గ్రా. ÷ 15
ఇ) 150 కి.గ్రా. 30 గ్రా. ÷ 30
జవాబు.
ప్రశ్న 5.
సుబ్బయ్య తన పొలంలో 120 కి.గ్రా. బెండకాయలు, 520 కి.గ్రా.ల బీరకాయలు, 150 కి.గ్రా.ల టొమాటోలు పండించిన మొత్తం కాయగూరల బరువెంత ?
జవాబు.
పొలంలో పండించిన బెండకాయలు బరువు = 120
పొలంలో పండించిన బీరకాయల బరువు = 520
పొలంలో పండించిన టొమటోల బరువు = 150
పొలంలో పండించిన మొత్తం కూరగాయల బరువు = 190 కి.గ్రా.
ప్రశ్న 6.
ఫర్జానా 2 కి.గ్రా. 500 గ్రా.ల లడ్డూలు, 1 కి.గ్రా హనీకేక్, 750 గ్రా జామూన్, 500 గ్రా.ల జిలేబి కొన్నది. ఆమె ఎంత బరువు గల స్వీట్లు (మిఠాయిలు) కొన్నది?
జవాబు.
లడ్డూల బరువు = 2 కి.గ్రా. 500 గ్రా.
హనీకేక్ బరువు = 1 కి.గ్రా
జామూన్ బరువు = 750 గ్రా
జిలేబి బరువు = 500 గ్రా
ఆమె కొన్న మొత్తం స్వీట్ల బరువు = 4 కి.గ్రా 750 గ్రా.
ప్రశ్న 7.
హెలెన్ 700 గ్రా.ల బరువున్న ఒక స్కూలు బ్యాగ్ (సంచి) కొన్నది. అందులో తరగతి పుస్తకాలు ఉంచి చూస్తే సంచి బరువు 3 కిలోలున్నది. పుస్తకాల బరువు ఎంత ?
జవాబు.
పుస్తకాలతో పాటు స్కూలు సంచి బరువు = 3 కి.గ్రా
ఖాళీ స్కూలు సంచి బరువు = 700 గ్రా
∴ పుస్తకాల బరువు = 2 కి.గ్రా 300 గ్రా
ప్రశ్న 8.
షఫి తన క్యాంటీన్ కోసం 22 కి.గ్రా.ల ఇడ్లీ రవ్వ కొన్నాడు. అతడు ఒక రోజులో 18 కి.గ్రా.ల 500 గ్రా.ల రవ్వ వినియోగిస్తే మిగిలిన రవ్వ ఎంత ?
జవాబు.
కొన్నటువంటి ఇడ్లీరవ్వ బరువు = 22 కి.గ్రా.
వినియోగించిన ఇడ్లీ రవ్వ బరువు = 18 కి.గ్రా.ల 500 గ్రా.
మిగిలిన ఇడ్లీరవ్వ బరువు = 3 కి.గ్రా. 500 గ్రా.
ప్రశ్న 9.
శాంసన్ 150 కి.గ్రా. బరువును, సోమిరెడ్డి 1 క్వింటాల బరువును ఎత్తారు. ఎవరు ఎక్కువ బరువు ఎత్తారు ? ఎంత బరువు ?
జవాబు.
సోమిరెడ్డి 1 క్వింటాల్ బరువు ఎత్తాడు = 1 × 100 = 100 కి.గ్రా.
శాంసన్ ఎత్తిన బరువు = 150 కి.గ్రా.
భేదం = 50 కి.గ్రా.
శాంసన్, సోమిరెడ్డి కన్నా 50 కి.గ్రా.ల బరువు ఎక్కువ ఎత్తాడు.
ప్రశ్న 10.
ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి 25.500 కి.గ్రా. లబరువు గల బిస్కెట్లను ఒక ప్యాకెట్లో సర్దాలి. అలా 15 ప్యాకెట్లలో ఎంత బరువున్న బిస్కెట్లను సర్దవచ్చు ?
జవాబు.
ఒక బిస్కెట్ ప్యాకెట్టు బరువు = 25.500 కి.గ్రా.
మొత్తం ప్యాకెట్లు = 15
15 బిస్కెట్లు ప్యాకెట్ల బరువు = 15 × 25.500 = 382.50 కి.గ్రా.
ప్రశ్న 11.
సరళ తన ఇంటిలో రోజుకు 50 గ్రా. కాఫీ పౌడర్‌ను ఉపయోగిస్తుంది. ఆమె ఒక నెలలో ఎంత కాఫీ పౌడరు
వినియోగిస్తుంది ? (30 రోజులు)
జవాబు.
ప్రతిరోజు వాడు కాఫీ పౌడర్ పరిమాణం = 50 గ్రా.
ఒక నెలలో వాడు కాఫీ పౌడర్ పరిమాణం ఒక నెలలో వాడు కాఫీ పౌడర్ పరిమాణం = 30 × 50 గ్రా. = 1500 గ్రా.
ప్రశ్న 12.
శర్మ 550 గ్రా. బరువున్న అన్నం ప్యాకెట్లను అమ్ముతారు. అలాంటివి 20 ప్యాకెట్లను తయారుచేస్తే, ఎంత బరువున్న ఆహారాన్ని ప్యాక్ చేయాలి ?
జవాబు.
ఒక్కొక్క అన్నం ప్యాకెట్టు బరువు = 550 గ్రా.
ఆహార ప్యాకెట్ల సంఖ్య = 20
మొత్తం శర్మ ప్యాకింగ్ చేసిన అన్నం ప్యాకెట్లు = 550 × 20 = 11,000 గ్రా.
ప్రశ్న 13.
ఒక దుంగ బరువు 24 కి.గ్రా. దానిని మూడు సమాన భాగాలుగా విభజిస్తే, ఒక్కొక్క ముక్క బరువు ఎంత ?
జవాబు.
దుంగ బరువు = 24 కి.గ్రా.
ముక్కల సంఖ్య = 3
ఒకొక్క ముక్క బరువు = 24 ÷ 3 = 8 కి.గ్రా.
ప్రశ్న 14.
10 బియ్యం బస్తాల బరువు 500 కి.గ్రా. అయితే ఒక బస్తా బరువు ఎం ?
జవాబు.
బస్తాల సంఖ్య = 10
10 బస్తాల బరువు = 500 కి.గ్రా.
ఒక్కొక్క బస్తా బరువు = 500 ÷ 10 = 50 కి.గ్రా.
ప్రశ్న 15.
ఒక కూరగాయల వ్యాపారి 3 కిలోల వంకాయలు ’60 లకు అమ్మాడు. ఒక్క కిలో వంకాయల ధర ఎంత ?
జవాబు.
వంకాయల పరిమణం ధర = 3 కి.గ్రా.లు
3 కి.గ్రా.ల వంకాయల ధర = 60
ఒక్క కిలో కూరగాయల ధర : 60 ÷ 3 = 20.
ఆలోచించు – చర్చించు (TextBook Page No.93)
ప్రశ్న 1.
ఒక వ్యాపారి 500 గ్రా. 200 గ్రా, 100 గ్రా, మరియు 50 గ్రా. తూనిక రాళ్ళను ఉపయోగించి 18లో బరువును ఎన్ని రకాలుగా తూయవచ్చు ? (కాళ్ళను అవసరమైతే 2వ సారి ఉపయోగించవచ్చు)
జవాబు.
మొత్తం బరువు 1 కిలో
500 గ్రా.ల బరువును వాడి 2 సార్లు కొలవవచ్చు.
200 గ్రా.ల బరువును వాడి 5 సార్లు కొలవవచ్చు.
1000 ల బరువును వాడి 10 సార్లు కొలవవచ్చు.
50 గ్రా.ల బరువును వాడి 20 సార్లు కొలవవచ్చు.
500 గ్రా. + 200 గ్రా. + 200 గ్రా. + 100 గ్రా.లను ఒకసారి వాడవచ్చును.
500 గ్రా. + 100 గ్రా. + 100 గ్రా. + 200 గ్రా. + 50 గ్రా. + 50 గ్రా.లను ఒకసారి వాడవచ్చును.
అభ్యాసం 5:
ప్రశ్న 1.
కింది వాటిని మి.లీ.లలోకి మార్చండి.
అ) 5 లీ.
ఆ) 15 లీ.
ఇ) 38.5 లీ.
ఈ) 82.7 లీ.
జవాబు.
అ) 5 లీ. = 5 × 1000 మి.లీ. = 500 మి.లీ.
ఆ) 15 లీ. = 15 × 1000 మి.లీ. = 15000 మి.లీ. .
ఇ) 38.5 లీ. = 38.5 × 1000 మి.లీ. = 8500 మి.లీ.
ఈ) 82.7 లీ. = 82.7 × 1000 మి.లీ. = 82700 మి.లీ.
ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన కొలతల జతలను < , > మరియు = గుర్తులను ఉపయోగించి పోల్చండి.
అ. 200 మి.లీ. _______ 100 మి.లీ. + 100 మి.లీ. + 100 మి.లీ.
జవాబు.
<
ఆ. 3లి. _______ 500 మి.లీ. + 500 మి.లీ. + 500 మి.లీ. + 500 మి.లీ. + 500 మి.లీ. + 500 మి.లీ.
జవాబు.
=
ఇ. 100 లీ. _______ 20లీ. + 20లీ. + 10లీ. + 50.లీ.
జవాబు.
=
ఈ. 150 లీ. _______ 50 మి.లీ. + 60 మి.లీ. + 20 మి.లీ.
జవాబు.
>
ఉ. 20 మి.లీ. _______ 5 మి.లీ. + 2 మి.లీ. + 15 మి.లీ.
జవాబు.
<
ప్రశ్న 3.
పరిమాణాన్ని లెక్కించండి.
జవాబు.
ప్రశ్న 4.
కూడండి.
అ) 12 లీ. 100 మి.లీ. మరియు 8లీ. 725 మి.లీ.
జవాబు.
ఆ) 93లి. 450 మి.లీ. మరియు 675 మి.లీ.
జవాబు.
ఇ) 33 లీ. 823 మి.లీ. మరియు 45 లీ. 202 మి.లీ.
జవాబు.
ఈ) 15 లీ. మరియు 500 మి.లీ.
జవాబు.
ప్రశ్న 5.
తీసివేయండి.
అ) 98లి. 208 మి.లీ. నుండి 83లీ. 103 మి.లీ.
జవాబు.
ఆ) 75 లీ. 725 మి.లీ. నుండి 16లీ. 540 మి.లీ.
జవాబు.
ఇ) 10 లీ. 425 మి.లీ. నుండి 2 లీ. 208 మి.లీ.
జవాబు.
ఈ) 42 లీ. 250 మి.లీ. నుండి 33 లీ. 98 మి.లీ.
జవాబు.
ప్రశ్న 6.
నాగరాజు 2 లీ. 220 మి.లీ. నీలం రంగు, 3 లీ. 500 మి.లీ. తెలుపు రంగును మరియు 750 మి.లీ. ఎరుపు రంగు పెయింట్లను ఒక ఇంటికి వినియోగించాడు. అతను ఎంత పెయింట్ వినియోగించాడు ?
జవాబు.
నాగరాజు వినియోగించిన నీలంరంగు పరిమాణం = 2 లీ. 220 మి.లీ.
తెలుపు రంగు పరిమాణము = 3 లీ. 500 మి.లీ.
ఎరుపు రంగు పరిమాణము = 750 మి.లీ.
అతను వినియోగించిన మొత్తం పెయింట్ పరిమాణం = 6 లీ. 470 మి.లీ.
ప్రశ్న 7.
శాంసన్ దగ్గర గల ఆవు ఒక రోజుకు 3 లీ. 500 మి.లీ. పాలు, క ను అందుకు ఆయన ముందు గేదె 5 లీ. 680 మి.లీ.ల పాలు ఇస్తాయి. అయితే శాంసన్ రెండింటి నుండి ఎన్ని పాలు సేకరిస్తాడు ?
జవాబు.
లీ. – మి.లీ. ఒక రోజుకు ఆవు ఇచ్చే పాలపరిమాణం = 3 లీ. 500 మి.లీ.
ఒక రోజుకు గేదె ఇచ్చే పాలపరిమాణం = 5 లీ. 680 మి.లీ.
శాంసన్ ఒకరోజుకు సేకరించిన పాల పరిమాణం = 9 లీ. 180 మి.లీ.
ప్రశ్న 8.
ఒక పాల వ్యాపారి ఒక టీస్టాల్ కు 20 లీ. పాలు పోస్తాడు. టీ స్టాలోని వ్యక్తి 15 లీ. 125 మి.లీ. ల పాలు వినియోగిస్తే, క్యాన్ లో మిగిలే పాలెన్ని?
జవాబు.
పాల వ్యాపారి నుండి సేకరించు పాలపరిమాణం = 20 లీ. 000 మి.లీ.
స్టాలో వినియోగించిన పాలపరిమాణం = 15 లీ. 125 మి.లీ.
క్యాలో, మిగిలిన పాల పరిమాణం = . 4 లీ. 875 మి.లీ.
ప్రశ్న 9.
పాత రకం టాయిలెట్‌కు 8 లీ. నీరు అవసరం. కొత్త టాయిలెట్‌కు 3.5 లీ. నీరు అవసరం. అయితే కొత్తరకం టాయిలెట్ ఒక్కసారికి ఎన్ని లీటర్ల నీటిని ఆదా చేస్తుంది ?
జవాబు.
పాతరకం టాయిలెట్ కు అవసరమైన నీటి పరిమాణం . = 8.0 లీ.
కొత్తరకం టాయిలెట్ కు అవసరమైన నీటి పరిమాణం = 3.5 లీ.
కొత్తరకం టాయిలెట్ కు ఆదాచేయు నీటి పరిమాణం = 4.5 లీ.
ప్రశ్న 10.
ఒక ఏనుగు రోజుకు 190 లీటర్ల నీరు తాగుతుంది. నెల రోజులకు దానికి ఎన్ని లీటర్ల నీరు అవసరమవుతాయి? (1 నెల = 31 రోజులుగా తీసుకోండి)
జవాబు.
ఒక ఏనుగు రోజుకు తాగు నీటి పరిమాణం = 190 లీ.
1 నెల = 31 రోజులు
31 రోజులలో ఏనుగుకు అవసరమగు నీటి పరిమాణం = 190 × 31 = 5,890 లీ.
ప్రశ్న 11.
జాన్ 150 మి.లీ. ఐస్ క్రీమ్ కప్పులను అమ్ముతాడు. ఒకవేళ అతను అలాంటివి 18 కప్పులను అమ్మితే ఎంత పరిమాణం గల ఐస్ క్రీమ్ ను అమ్మినట్లు ?
జవాబు.
ప్రతీ ఐస్ క్రీమ్ కప్పు పరిమాణం . = 150 మి.లీ.
మొత్తం ఐస్ క్రీమ్ కప్పుల సంఖ్య = 18
అమ్మిన ఐస్క్రీమ్ పరిమాణం . . = 150 × 18 = 2700 మి.లీ.
ప్రశ్న 12.
ఒక పళ్ళరసం సీసాలో 2.2 లీ. రసం ఉంది. ఆ పళ్ళ రసాన్ని ఎన్ని 200 మి.లీ.ల పరిమాణంగా కప్పులలో నింపవచ్చు?
జవాబు.
సీసాలోని పళ్ళరసం పరిమాణం = 2.2 లీ. = 2.2 × 1000 = 22000 మి.లీ.
ఒక కప్పు పరిమాణం = 200 మి.లీ.
అవసరమగు కప్పుల సంఖ్య = 22000 ÷ 200 మి.లీ. = 11
ప్రశ్న 13.
రేష్మా ఒక షాంపూ ప్యాకెట్లో 5 మి.లీ. షాంపూ ఉందని గమనించింది. 400 మి.లీ.ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అవుతాయి ?
జవాబు.
ఒక షాంపూ ప్యాకెట్ పరిమాణం = 5 మి.లీ.
సీసా పరిమాణం = 400 మి.లీ.
కావలసిన షాంపూ ప్యాకెట్ల సంఖ్య = 400 ÷ 5 = 80 ప్యాకెట్లు.