Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 2nd Lesson సాయం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 2 సాయం
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏం జరుగుతున్నది?
జవాబు:
చిత్రంలో ఒక విద్యార్థిని తాతగారిని రోడ్డు దాటిస్తున్నది.
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏమేం చేస్తున్నారు ?
జవాబు:
చిత్రంలో ఒక ఆటో డ్రైవరు ద్విచక్ర వాహనదారుడు, ఒక విద్యార్థిని ఒక పెద్దాయన ఉన్నారు. పెద్దాయన మరియు విద్యార్థిని రోడ్డు దాటుతున్నారు. వాహన దారులు అందుకు ఆగారు.
ప్రశ్న 3.
మీరెప్పుడైనా ఎవరికైనా సహాయం చేసారా ? అప్పుడు మీకేమనిపించింది.
జవాబు:
చేసాను. ఆ సమయంలో నాకు చాలా ఆనందం అనిపించింది. నా ఇంట్లో వాళ్ళు – స్నేహితులు నన్ను మెచ్చుకుంటారనిపించింది. అది నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. తోటివారికి సహాయంచేసే అవకాశం నాకు కలిగింది కదా! అని సంతోషం కలిగింది. అందరూ నాగురించి గొప్పగా చెప్తుంటే – నా తల్లిదండ్రులు ఆనందించారు కదా! అనిపించింది.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
రవికి పక్షులంటే ఇష్టంకదా ! మీకు ఏ ఏ పక్షులంటే ఇష్టం ?
జవాబు:
నాకు రామచిలుక, పావురం, నెమలి.
ప్రశ్న 2.
‘సాయం’ కథను సొంత మాటల్లో చెప్పండి.
జవాబు:
రవి మంచి బాలుడు. ఇతరులకు సాయంచేసే గుణం కలవాడు. రవికి పక్షులంటే చాలా ఇష్టం.
ఒకరోజు తన ఇంటిముందు ఒక చిత్రం జరిగింది. ఎక్కడినుండో ఒక పిచ్చుకల 7గుంపు ఎగురుకుంటూ వచ్చి రవి – ఇంటిముందు ఉన్న కరంటు తీగమీద వాలాయి. కొద్ది సేపటికి అన్నీ ఎగిరి పోయాయి. కాని అందులో ఒక పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవటంవల్ల ఎగరలేక అక్కడే ఉండిపోయింది. దాని బాధచూసి రవికి బాధ కలిగింది. అమ్మకు చెప్పాడు. మనం ఏం చేయగలం? అని వెళ్ళిపోయింది. నాన్నకు చెప్పాడు – ఎవరైనా కరంటాఫీసులో వాళ్ళకు చెప్తే వాళ్ళు కరెంటాపి, స్తంభం ఎక్కి పిచ్చుకను కాపాడతారు. అంతేకానీ మనమేంచేయగలం ? నువ్వు స్కూల్ కి వెళ్ళమని చెప్పాడు
రవి నేరుగా నాన్న చెప్పిన ప్రకారం చేసి – కరంటు వాళ్ళని పిలిచి ఆ పిచ్చుకను కాపాడాడు. ఆ పిచ్చుక ఆనందంగా గాలిలో ఎగిరిపోతుంటే ఎంతో ఆనందించాడు. (ఇతరులకు చేసిన సాయం ఎంతో ఆనందాన్నిస్తుంది.)
ప్రశ్న 3.
మీ స్నేహితులకు మీరు చేసిన ఏదైనా సాయం గురించి చెప్పండి.
జవాబు:
ఈ రోజు నేను పాఠశాలకొస్తూ దారి పక్కనే ఒక ముసలి అవ్వను చూసాను. కాళ్ళకు దెబ్బ తగిలిందేమో లేవలేకపోతోంది, చూడలేకపోతోంది. కళ్ళు కనపడవనుకుంటా. అవ్వ ఆకలి అరపు విని జాలి కలిగింది. అందరూ అవ్వను చూస్తూ వెళ్తున్నారే కాని సాయం చేయడం లేదు. నా జేబులో డబ్బులు ఉన్నాయి. నాన్న నన్ను కొనుక్కోమని ఇచ్చినవి.
అవి తీసి అవ్వచేతిలో పెట్టాను. తడుముకుంటూ అవి చూసుకుని అవ్వ చాలా ఆనందించింది. అవ్వ మొహంలో ఆనందంచూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఇంతవరకూ ఎప్పుడూ కలగని ఆనందం కలిగింది. అప్పుడు అనుకున్నాను. ఇతరులకు చేసిన సాయం ఎంతో ఆనందాన్నిస్తుంది కదా ! అని.
పదజాలం
ఆ) ఈ కింది ఒత్తు ఉన్న పదాలను రాయండి.
క్క _____________
గ్గ _____________
చ్చ _____________
జ్జ _____________
ట్ట _____________
త్త _____________
ద్ద _____________
ప్ప _____________
మ్మ _____________
య్య _____________
ర్ర _____________
ల్ల _____________
జవాబు:
క్క అక్క
గ్గ మొగ్గ
చ్చ పచ్చిక, వెచ్చని
జ్జ ముజ్జగము
ట్ట బుట్ట
త్త అత్త
ద్ద గ్రద్ద
ప్ప చిప్ప
మ్మ అమ్మ
య్య అయ్య
ర్ర కర్ర
ల్ల చిల్లర
ప్రాజెక్టు పని
మీ పాఠశాల గ్రంథాలయంలో ఇతరులకు సాయం చేసే అంశం ఉన్న కథలు సేకరించండి. మీ తరగతిగదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
సాధారణ చేద్దాం
గువ్వ కొరకు మేనుకోసి యా శిబిరాజు
వార్త విడువరాక కీర్తి కెక్కె
ఓగు నెంచబోవ రుషకారి నెంతురు.
ఈ విశ్వదాభిరామ వినుర వేమ !
భావం :
తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు. – చెడ్డవారిని ఎవరూ తలుచుకోరు. ఉపకారం చేసే వారిని అందరూ గుర్తుంచుకుంటారు.
– వేమన
జవాబు:
విద్యార్థులు పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని భావయుక్తంగా ధారణ చేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులోని నీతిని విషయాన్ని వంటపట్టించుకోవాలి.
కవి పరిచయం
కవి : జాక్ కోప్
కాలము : 1913 నుండి 1991 వరకు
విశేషాంశాలు : జాక్ కోప్ దక్షిణాఫ్రికా నవలా రచయిత. కథారచయిత. కవి సంపాదకుడు. ఈ పాఠం ఒక అనువాద కథ.
పదాలు – అర్థాలు
దృశ్యం = చూడదగినది
కష్టం = ఇబ్బంది
ఆత్రం = తొందర
అవధులు = హద్దులు
గుంపు = సమూహం
ఆసక్తి = అపేక్ష
చదువు – అర్థం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
అనకు కనకు వినకు
అది సబర్మతీ ఆశ్రమం. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చెక్క పెట్టెమీద పెట్టారు. నిన్న ! ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ. మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు.
తదేక ధ్యానంగా ప్రతిమవైపు చూస్తున్న బాపూజీని చూచాడు. ఎకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుకనుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. బాపూ వెనక్కు తిరిగి చూచారు. మహదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు.
“మహదేవ్ భాయీ! రా ! కూర్చో! ఎందుకు నవ్వుతున్నావు?” అన్నాడు గాంధీజీ. ! మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టెమీద బోమ్మనే చూస్తుంటే నాకునవ్వు వచ్చింది బాపూజీ!” అని ! దేశాయ్ మళ్లీ పకపకా నవ్వటం మొదలెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ “అసలీ బొమ్మను చూశావా ? ఎంత గొప్పగా ఉన్నదో!” అన్నాడు.
“అవును మూడు కోతులూ చాలా అందంగా ఉన్నాయి” అన్నాడు దేశాయ్. “కోతులు కాదు, అవి నా గురువులు” అని, గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ దేశాయ్ కి చూపిస్తూ ! “ఇదుగో చూడు ఈ బొమ్మలో మూడు కోతులు కన్నిస్తున్నాయి కదా! అవి మూడు పనులు | చేస్తూ మనకు మూడు విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి. “మొదటి బొమ్మ చూడు రెండు చేతులతో ! నోరుమూసుకొని కూర్చుంది. అంటే చెడు మాట్లాడవద్దు అని, రెండో బొమ్మ రెండు చేతులతో రెండు కళ్ళూ ! – మూసుకొని కూర్చుంది. అంటే చెడు చూడకు అని అర్థం” అన్నాడు గాంధీజీ.
గాంధీజీ మాటలు విని మహాదేవ దేశాయ్ ఆశ్చర్య చకితుడయ్యాడు.
“మూడో బొమ్మ వైపు చూచి ఏం చేస్తున్నదో చెప్పు” అన్నాడు మళ్లీ గాంధీజీ. “అది తన రెండు చేతులతో గట్టిగా రెండు చెవులు మూసుకుంది” అన్నాడు దేశాయ్.
“దానర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ మూడు కోతులూ ‘చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు” అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశం. ఏమంటావ్?” అన్నాడు.
“బాపూజీ! మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు. అందుకనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి” అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహాదేవ్జీ.
కవి పరిచయం
కవి : జంధ్యాల పాపయశాస్త్రి
కాలము : (4-08-1912 – 21-06-1992)
రచించినవి : తెలుగుబాల శతకం
ఖండకావ్యాలు: ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు
బిరుదు : కరుణశ్రీ