Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 6th Lesson పెన్నేటి పాట Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 6 పెన్నేటి పాట
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు:
చిత్రంలో ఇంద్ర దనస్సు, మేఘాలు, కొండలు, కొండల మధ్య నుండి వాగు, చెట్లు, కాడిఎడ్లు, చిన్న గ్రామం, రైతు, పశువులు, ఆడుకుంటున్న పిల్లలు, గంప తలకెత్తుకున్న ఆడ మనిషి, పక్షులు కనిపిస్తున్నాయి.
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ?
జవాబు:
చిత్రంలో ఒక ఆడమనిషి తల పైన గంప పెట్టుకుని గంపలో పండ్లు పెట్టుకుని వెళోంది. ఆ ప్రక్కనే ఐదుగురు చిన్న పిల్లలు ఒకరిచేతులు మరొకరు పట్టుకుని ఆడుకుంటున్నారు. వాగుకు అవతలివైపు రైతు తన ఎడం భుజం పైన మోపును పెట్టుకుని, కుడిచేతితో కొడవలిని పట్టుకుని నడుస్తున్నాడు. జోడెద్దులు మెడ పైన కాడివేసి రైతు వంతెన దాటిస్తున్నాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
పాటను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
కోటిగొంతుల
కిన్నెర మీటుకొనుచు
కోటిగుండెల
కంజర కొట్టుకొనుచు
వినిపింతునింక
నేటిరాయలసీమపెన్నేటిపాట
ఏదీ పెన్న! ఏదీపెన్న!
ఏదీ పినాకినీ?
ఇదే పెన్న! ఇదే పెన్న!
ఇదే పినాకినీ!
ఏదీ నీరు? ఏదీపూరు?
ఏదీ నీటిజాలు ?
ఇదే నీరు! ఇదే పూరు!
ఇదే ఇసుక వాలు!
అదే పెన్న! అదే పెన్న!
నిదానించి నడు!
విదారించు నెదన్, వట్టి
ఎడారి తమ్ముడు
కుండపోతల వానలు
గురియనేమి?
పట్టుమని పదినాళ్ళలో
పారబోసి
ఇసుక బొక్కసమున
మిగులెల్లదాచి,
పెన్నపండుకొను
నీ నేల దిన్నెమీద!
ఈ ఏటి నీటిలో
క్రమ్మదనములూరుచుండు
దోసిట నొక్కమారు
పుక్కిలించిన చాలు
నీ పుట్టువునకు, సార్థకత్వమ్ము
నిష్కల్మషత్వ మబ్బు!
ఇంతమంది కన్నతల్లి
ఎందుకిట్లు మారెనో?
ఇంతమంచి పెన్నతల్లి
ఎందుకెండిపోయెనో?
ప్రశ్న 2.
పాట భావం సొంత మాటల్లో చెప్పండి.
జవాబు:
ఇది రాయలసీమ లోని పెన్నేటిపాట. ఇక్కడ నివసించే కోటి గొంతుల కిన్నెర వీణల తీగలను మీటుకుంటూ, కోటి గుండెల కంజరులను మోగిస్తూ మీకు ఈ పెన్నేటి పాటను వినిపిస్తాను అంటున్నాడు కవి)
ఏదీ ! ఇక్కడ ప్రవహించే పెన్న ఏదీ కనిపించదే పినాకిని (పెన్నకు మరో పేరు). ఓ ! ఇదే పెన్న. ఇదే పినాకినీ. ఆ మహా ప్రవాహం ఇప్పుడు లేదు. ఈ ఎండిపోయిన ఇసుక నేలయే ఆ పినాకిని. ఏది ! ఆ నీరు! ఆ హోరు, ఆ ప్రవాహం . ఓ ఇదే ఆ నీరు, ఆహోరు, ఆ ప్రవాహం. ఓ! తమ్ముడా! నిదానించి నడు. హృదయం చీల్చుకుపోయే బాధ కలిగించే ఒట్టి ఎడారి ఇది.
కుండపోతగా వర్షం కురిసినా! ఇట్టే పట్టుమని పది రోజులలో ఈ ఇసుక సందుల బొక్కసాల్లోకి ఇంకి పోతుంది. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది.
కానీ ఈ ఏటి నీటిలో కమ్మదనముంటుంది. దోసిలితో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్ధకత ఏర్పడుతుంది. మనసులోని కల్మషం పోయి నిష్కల్మషత్యం అబ్బుతుంది.
అలాంటిది ఇంత మందిని కన్న తల్లి, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిలా మారిపోయిందో! ఎందుకిలా ఎండిపోయిందో, తమ్ముడు. ఇదే పెన్నేటిపాట.
ప్రశ్న 3.
మీకు తెలిసిన నది/ సెలయేరు / చెరువు / కాలువల గురించి మాట్లాడండి.
జవాబు:
నాకు తెలిసిన నది – కృష్ణానది :
కృష్ణానది భారతదేశంలోని అతి పెద్ద పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్దనది. నీటి ప్రవాహం పరంగా కృష్ణానది మన దేశంలో నాల్గవది. తెలుగు ప్రాంతం వారు కృష్ణానదినే ‘కృష్ణవేణి’ అని గూడా పిలుస్తారు.
ఈ నది మహాబలేశ్వరంలో పుట్టి హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తోంది. పుట్టిన ప్రదేశం నుండి తనలో – కొయినా, వర్ణ, పంచగంగ, దూద గంగ, ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, మూసి, పాలేరు, మున్నేరు, మొదలైన చిన్న చిన్న నదులను తనలో కలుపుకుంటూ విజయవాడ ప్రకాశం బ్యారేజిని దాటి దివిసీమలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతం సారవంతమై, సకల మానవాళికి అన్నదాత అయినది.
చదవడం – వ్యక్త పరచడం
అ) గేయం ఆధారంగా ప్రాస పదాలు గుర్తించండి, రాయండి.
జవాబు:
- మీటుకొనుచు – కొట్టుకొనుచు
- “ఏది పెన్న – ఏది పెన్న” – “ ఇదే పెన్న – ఇదే పెన్న”
- ఏది? నీరు – ఏది హోరు?
- నీటి జాలు – ఇసుక వాలు
- నిదానించి నడు – ఎడారి తమ్ముడు
- ఎందుకిట్లు మారెనో – ఎందుకెండిపోయెనో !
ఆ) పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో “నాగావళి” ముఖ్యమైన నది. ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి.
ప్రశ్న 1.
నాగావళి నది ఏ ప్రాంతానికి చెందినది?
జవాబు:
నాగావళి నది ‘ఒడిశా’ ప్రాంతానికి చెందినది.
ప్రశ్న 2.
నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది?
జవాబు:
నాగావళి నది శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
ప్రశ్న 3.
నదుల వలన నునకు కలిగే ఉపయోగమేంటి?
జవాబు:
నదుల వలన మనకు తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుతాయి.
ఇ) కిండి లేఖను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి.
పత్రికా సంయుకు,
నమస్కారములు !
గూటాల
తేది : 03-01-2020
మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది. ప్రక్కనే గోదావరి సది. ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేసారు. గోదావరిలో నానా చెత్తా చెదారం వేసి కలుషితం చేస్తున్నారు. ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదు. పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు. అడవులు, నదుల రక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి. దీనికి అందరూ బాధ్యత సహించాలి. దీన్ని పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయ కొడుకులు అందుకు వరం వలసినదిగా కోరుతున్నాను.
కృతజ్ఞతలతో
ఇట్లు
అభిరామ్
జవాబు:
ప్రశ్నలు:
- వాళ్ళ ఊరు దేనికి దగ్గరగా ఉంటుంది ?
- ఊరికి దగ్గరగా ఏ నది ప్రవహిస్తున్నది ?
- జీవన విధానంలో ఏది భాగం కావాలి ?
- పర్యావరణాన్ని పాడు చేస్తే ఏం జరుగుతుంది ?
పదజాలం
ఇ) కింది గేయ వాక్యాలు చదవండి.
ఏదీ కృష్ణ? ఏదీ కృష్ణ ? – ఏదీ కృష్ణవేణి?
ఇదే కృష్ణ? ఇదే కృష్ణ ? , ఇదే కృష్ణవేణి?
కృష్ణను కృష్ణవేణి అని అంటారు. ఇలాగే ‘గోదావరిని గౌతమి’ అని, ‘గంగను భాగిరథి’ అని కూడా అంటారు. వీటిని ఉపయోగించి మీరు గేయాలు రాయండి.
ప్రశ్న 1.
ఏదీ? గౌతమి? ఏదీ? గౌతమి? . ఏది గోదావరి ?
జవాబు:
ఇదే? గౌతమి? ఇదే? గౌతమి? – ఇదే గోదావరి ?
ప్రశ్న 2.
ఏదీ? గంగ? ఏదీ? గంగ? . ఏదీ భాగీరధి ?
జవాబు:
ఇదే? గంగ ? ఇదే? గంగ? ఇదే భాగీరధి ?
స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కవి పెన్నా పూర్వవైభవం గురించి ఏమని ప్రశ్నించాడు ?
జవాబు:
ఏది పెన్న? ఏది? పెన్న? – ఏది పినాకిని ?
ఏది నీరు? ఏది హోరు? – ఏది నీటి జాలు ?
అని కవి పెన్న పూర్వ వైభవాన్ని ప్రశ్నించాడు.
ప్రశ్న 2.
పెన్నా నీటిని కవి ఎలా వర్ణించాడు ?
జవాబు:
కుండపోతలుగా వర్షం కురిసినా! ఇట్టే పట్టుమని పది రోజులలోనే ఈ ఇసుక సందులలోని బొక్కసాల్లోకి ఇంకి పోతుంది. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తుంది. కానీ ఈ ఏటి నీటిలో కమ్మదనముంటుంది. దోసిలితో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు పుట్టుకకు సార్థకత ఏర్పడుతుంది. అని కవి పెన్నను వర్ణించాడు.
ప్రశ్న 3.
నదులలో నీళ్ళు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
నదులలో నీళ్ళు లేకపోతే త్రాగునీరు కష్టమవుతుంది. సాగునీరు కష్టమవుతుంది. త్రాగటానికి నీరు లేకపోతే మనిషి జీవించడం కష్టమవుతుంది. సాగునీరు లేకపోతే రైతులకు పంటలు పండించడం కష్టమవుతుంది. పంటలు పండకపోతే మనిషికి తిండి కరువౌతుంది. మనిషి జీవించడం కష్టమవుతుంది. కనుక నదులలోని నీళ్ళు జీవనాధారం.
సృజనాత్మకత
అ) కింది గోడ పత్రికను చదవండి.
ఆ) ఇదే విధంగా నేడు ప్లాస్టిక్ సంచుల వల్ల కాలుష్యం పెరుగుతుంది. దానికి బదులుగా కాగితం, జనపనార సంచుల వినియోగపు అవసరాన్ని తెలియచేస్తూ గోడ పత్రికను తయారు చేయండి.
జవాబు:
గ్రామ ప్రజలకు విజ్ఞప్తి
ప్లాస్టిక్ సంచులు నివారిద్దాం – కాలుష్యాన్ని అరికడదాం
- ప్లాస్టిక్ సంచులు ప్రాణహానికి కారణమవుతున్నాయి.
- వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.
- తెలిసి తప్పు చేస్తున్నాం – భవిష్యతరాలకు ముప్పు తెస్తున్నాం.
- మట్టిలో కలిసిపోయే కాగితపు సంచులు వాడదాం – కాలుష్యం నివారిద్దాం
- జనపనార సంచులు ఉపయోగిద్దాం – జగతికి మేలు చేద్దాం
- చేతి సంచులు వాడదాం – భూమికి చేతనైన సాయం చేద్దాం.
ఇట్లు
గ్రామ పంచాయితీ
రావులపాలెం.
ప్రశంస
అ) మీ స్నేహితులు పాఠశాల కుళాయిల్లో నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుతుంటే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
ప్రియమైన నా మిత్రులందరికీ శుభోదయం నాతో పాటు చదువుతున్న మీ అందరికీ ఈ రోజు నా అభినందనలు. ఎందుకంటే పాఠశాలలోని కుళాయి నీటిని వృధా చేయకుండా వాడుతున్నారు మీరు. చేతులు కడగటం, పాత్రలు కడగటం ఇలా త్రాగునీరు వృధా చేయకుండా కేవలం త్రాగటానికి మాత్రం ఉపయోగిస్తున్నారు.
నీరు ప్రాణాధారం అని మీకు తెలుసు. ఎప్పటికప్పుడు కుళాయి పంపు కట్టి ఉంచుతున్నారు. కనుకనే మన పాఠశాల ప్రధానధ్యాపకులు మన తరగతిని, నీరు పొదుపుగా – వృధాకాకుండా వాడినందుకు ఉత్తమ తరగతిగా ప్రకటించారు. అందుకని ఈరోజు మిమ్మల్నందరినీ నేను ప్రశంసిస్తున్నాను. మీ అందరికీ నా అభినందనలు.
నీటిని వృధా కానికండి – నీరు ప్రాణధారం
భాషాంశాలు
అ) కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు గమనించండి.
ప్రశ్న 1.
చందన్ కథల పుస్తకం చదివాడు.
జవాబు:
[ ‘చదివాడు’ అనేది జరిగిపోయిన పనిని సూచిచే క్రియా పదం]
ప్రశ్న 2.
చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు.
జవాబు:
[ ‘చదువుతున్నాడు’ అనేది జరుగుతున్న పనిని సూచిచే క్రియా పదం]
ప్రశ్న 3.
చందన్ కథల పుస్తకం చదువుతాడు.
జవాబు:
[ ‘చదువుతాడు’ అనేది జరగబోయే పనిని సూచిచే క్రియా పదం]
అంటే వాక్యాలలోని కాలాలను బట్టి ” క్రియాపదాల రూపాలు ” మారు నాకు
ఈ కాలాలను మూడు విధాలుగా విభజించవచ్చు.
- జరిగిపోయిన కాలం – దీనినే ‘ భూతకాలం’ అంటారు.
- జరుగుతున్న కాలం – కూత దీనినే ‘వర్తమాన కాలం’ అంటారు.
- జరగబోయే కాలం – దీనినే ‘ భవిష్యత్ కాలం’ అంటారు.
ఆ) ఇంతవరకు మీరు చదివిన పాఠాల ఆధారంగా కింద పట్టికను పూరించండి. వారిలో రాయండి.
జవాబు:
భూతకాల పదాలు:
జీవం పోశారు : వారు కళలకు జీవం పోశారు .
మలచినావు : మనిషిని మనిషిగా మలచినావు
వర్తమాన కాల పదాలు:
చేస్తున్నాయి : రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి.
పారుతున్నాయి. కొన్ని నీటి పాయలు పారుతున్నాయి.
వేస్తున్నాడు : సూర్య దానికి తాళం వేస్తున్నాడు.
భవిష్యత్ కాల పదాలు :
చేస్తారు . వీటిని ముఖతః పారాయణం చేస్తారు.
ఎగిరిపోతుంది : కాసే పైతే అదే ఎగిరి పోతుంది లేరా!
ధారణ చేస్తాం
సాధువులగు జంతువులకు
బాధలు గావించు ఖలుల భంజింపని రా
జాధము నాయుస్స్వర్గ
శ్రీధనములు వీగి బోవు సిద్ధము తల్లీ. అందుకు
భావం :
తల్లీ! సాధు జంతువలను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన నా న తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన అధముడైన రాజు జీవితం ఆయుషు, ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనేమాట నిజం.
జవాబు:
విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తం. గా, అర్థవంతంగా ధారణచేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులో ని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.
కవి పరిచయం
కవి : విద్వాన్ విశ్వం
కాలము : 21-10-1915 నుండి 19-10-1987 వరకు
రచనలు : పెన్నేటి పాట, విలాసిని, రాతలు-గీతలు
విశేషాంశాలు : విద్యాన్ విశ్వం కవి, కథకుడు, సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. వీరి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన ‘పెన్నేటి పాట’ నుండి ఖండికను తీసుకున్నాం.
పదాలు – అర్థాలు
హోరు = శబ్దం
నిదానించు = నెమ్మదిగా
జాలు = ప్రవాహం
విదారించు = చీల్చుకుంటూ
ఎద = హృదయం
బొక్కసం = ధనాగారం
నాళ్లు = రోజులు, ప్రాంతాలు
కంజర = ఒక రకమైన వాయిద్యం
చదువు – అర్థం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
మూడు చేపలు
ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి. అందులో ఒకదాని పేరు దీర్ఘదర్శి, మరోకదాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు. ఇంకోకదాని పేరు దీర్ఘ సూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవికాలం సమీపించింది. ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండిటితో ” ఈ మడుగు చాలా చిన్నది. వేసవిలో ఎండిపోతుంది.
కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం” అంది. ఇది విని ప్రాప్త కాజ్ఞుడు “వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒక వేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో కొ ఉపాయం తోచక పోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది. ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచివెళ్ళడం మంచిది కాదు” అంది.
ఇది విని దీర్ఘ సూత్రుడు ” మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రంవలె పెద్దది. అనవసరంగా భయపడుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు” అంది. దీర్ఘదర్శకి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో ఇక్కడ ఉ ండడం అపాయకరమని ఈనుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్లకాలువలో ప్రవేశించింది. అక్కడ నుండి పెద్దకాలువలోకి దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ నిశ్చింతగా గడపసాగింది.
ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకుని జాలరులు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందా. జాలర్లుకు దొరికిపోయాయి. దొరికిన చేపలన్నిటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు. ఈది చూచి ప్రాప్తకాలజ్ఞుడు “అయో ! పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి” అని తీవ్రంగా ఆలోచించింది.
ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలరి పచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరచి పట్టుకుంటా. జాలరి నన్ను చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది.
ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు అలోచిస్తున్న దీర్ఘ సూత్రుని జాలరి పట్టుకుని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్ళకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. బురదతో ఉ న్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలవలోకి దిగారు.
ప్రాప్తకాలుడు వెంటనే ఆ తాడును వరిలి పెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుంది. చూశారా! అపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్పూర్తతో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘ సూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది.