SCERT AP 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు Exercise 1.1
ప్రశ్న 1.
కింది ఇచ్చిన సంఖ్యలలో గరిష్ఠ మరియు కనిష్ఠ సంఖ్యలను గుర్తించండి.
క్ర.సం. | సంఖ్యలు | మిక్కిలి పెద్ద సంఖ్య | మిక్కిలి చిన్న సంఖ్య |
1. | 67456, 76547, 15476, 75460 | ||
2. | 64567, 66000, 78567, 274347 | ||
3. |
3వ ఖాళీలో మీ సొంత సమస్యను రాసుకొని సమాధానం రాయండి.
సాధన.
క్ర.సం. | సంఖ్యలు | మిక్కిలి పెద్ద సంఖ్య | మిక్కిలి చిన్న సంఖ్య |
1. | 67456, 76547, 15476, 75460 | 76547 | 15476 |
2. | 64567, 66000, 78567, 274347 | 274347 | 64567 |
3. | 36470, 21364, 52392, 43470 | 52392 | 21364 |
ప్రశ్న 2.
కింది సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి.
క్ర.సం. | సంఖ్యలు | ఆరోహణ క్రమం |
1. | 75645, 77845, 24625, 85690 | |
2. | 6790, 27895, 16176, 50000 |
క్ర.సం. | సంఖ్యలు | అవరోహణ క్రమం |
1. | 75645, 77845, 24625, 85690 | |
2. | 6790, 27895, 16176, 50000 |
సాధన.
క్ర.సం. | సంఖ్యలు | ఆరోహణ క్రమం |
1. | 75645, 77845, 24625, 85690 | 24625, 75645, 77845, 85690 |
2. | 6790, 27895, 16176, 50000 | 6790, 16176, 27895, 50000 |
క్ర.సం. | సంఖ్యలు | అవరోహణ క్రమం |
1. | 75645, 77845, 24625, 85690 | 85690, 77845, 75645, 24625 |
2. | 6790, 27895, 16176, 50000 | 50000, 27895, 16176, 6790 |
ప్రశ్న 3.
కింది సంఖ్యలను అక్షర రూపంలో రాయండి.
క్ర.సం. | సంఖ్య | అక్షర రూపం |
1. | 73,062 | |
2. | 1,80,565 | |
3. | 25,45,505 | |
4. |
4వ ఖాళీలో మీ సొంత సమస్యను రాసి, జవాబులు రాయండి.
సాధన.
క్ర.సం. | సంఖ్య | అక్షర రూపం |
1. | 73,062 | డెబ్బై మూడు వేల అరవై రెండు |
2. | 1,80,565 | ఒక లక్ష ఎనభై వేల ఐదు వందల అరవై ఐదు |
3. | 25,45,505 | ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఐదు |
4. | 36,29,714 | ముఫ్పై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు |
ప్రశ్న 4.
కింది సంఖ్యలను అంకెల రూపంలో రాయండి.
క్ర.సం. | పదరూపం | సంఖ్యారూపం |
1. | అరవై వేల అరవై ఆరు | 60,066 |
2. | డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు | |
3. | తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొంభై | |
4. |
4వ ఖాళీలో నీ స్వంత సమస్యను రాసి, జవాబులు రాయండి.
సాధన.
క్ర.సం. | పదరూపం | సంఖ్యారూపం |
1. | అరవై వేల అరవై ఆరు | 60,066 |
2. | డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు | 78,414 |
3. | తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొంభై | 9,96,090 |
4. | ఇరవై నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు | 24,04,004 |
ప్రశ్న 5.
కింది ఇచ్చిన అంకెలనుపయోగించి గరిష్ఠ మరియు కనిష్ఠ సంఖ్యలను ఏర్పరచి వాటి మధ్య భేదాన్ని కనుగొనండి.
క్ర.సం. | ఇచ్చిన అంకెలు | గరిష్ఠ సంఖ్య | కనిష్ఠ సంఖ్య | భేదం |
1. | 4, 5, 6, 3 | 6543 | 3456 | 6543 – 3456 = 3087 |
2. | 5, 8, 7, 2 | |||
3. | 6, 0, 8, 9, 4 | |||
4. | 3, 4, 8, 7, 9 |
సాధన.
క్ర.సం. | ఇచ్చిన అంకెలు | గరిష్ఠ సంఖ్య | కనిష్ఠ సంఖ్య | భేదం |
1. | 4, 5, 6, 3 | 6543 | 3456 | 6543 – 3456 = 3087 |
2. | 5, 8, 7, 2 | 8,752 | 2,578 | 8,752 – 2,578 = 6,174 |
3. | 6, 0, 8, 9, 4 | 98,640 | 40,689 | 98,640 – 40,689 = 57,951 |
4. | 3, 4, 8, 7, 9 | 98,743 | 34,789 | 98,743 – 34,789 = 63,954 |
ప్రశ్న 6.
6, 0, 5, 7 అంకెలతో ఏర్పడే వీలయినన్ని 4 అంకెల సంఖ్యలను రాయండి.
సాధన.
7,056, 7,065, 7,506, 7,560, 7,605, 7,650
6,057, 6,075, 6,507, 6,570, 6,705, 6,750
5,067, 5,076_5,607, 5,670, 5,706, 5,760
ప్రశ్న 7.
కింది పట్టికను పరిశీలించి, ఖాళీగా ఉండే డబ్బాలను పూరించండి.
సాధన.
ప్రతి సోపానాన్ని పరిశీలించిన
ఒకే అంకె కలిగిన మొత్తం సంఖ్యల సంఖ్య = గరిష్ట సంఖ్య – కనిష్ట సంఖ్య + 1
ఎనిమిది అంకెలు కలిగిన మొత్తం సంఖ్యల సంఖ్య = 9,99,99,999 – 1,00,00,000 + 1 = 9,00,00,000
ఎనిమిది అంకెలు కలిగిన సంఖ్యలు 9 కోట్లు ఉన్నాయి.