AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 12th Lesson దత్తాంశ నిర్వహణ InText Questions

ప్రయత్నించండి [పేజి నెం. 163]

ప్రశ్న 1.
సంఖ్యాత్మక విలువలు గల దత్తాంశానికి రెండు ఉదాహరణలివ్వండి.
సాధన.
1. 6వ తరగతిలోని 25 మంది విద్యార్థులకు 20 మార్కుల పరీక్షలో వచ్చిన మార్కులు.
14, 16, 8, 20, 17, 9, 12, 13, 16, 19, 17, 10, 11, 9, 13, 17, 10, 18, 20, 9, 15, 14, 10, 15, 11
2. ఒకరోజు కోవిడ్ – 19 పరీక్షలకు హాజరైన 30 మంది వ్యక్తుల వయస్సు (సంవత్సరాలలో)
46, 53, 19, 84, 41, 37, 25, 31, 28, 71, 62, 35, 28, 53, 13, 73, 64, 32, 45, 31, 27, 54, 61, 54, 49, 23, 39, 44, 55, 30.

AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions

ప్రశ్న 2.
వివరణాత్మక విలువలు గల దత్తాంశానికి రెండు ఉదాహరణలివ్వండి.
సాధన.
1.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 1
2. ఉదయం 7 గంటల నుండి 9.30 మధ్య ఒక రైల్వే గేటును దాటిన వాహనాలు – లారీ, బస్సు, లారీ, కారు, ఆటో, జీపు, సైకిల్, స్కూటరు, స్కూటరు, ఆటో, లారీ, కారు, కారు, లారీ, బస్సు, స్కూటరు, ఆటో, స్కూటరు, జీపు, లారీ, స్కూటరు, స్కూటరు.

ఇవి చేయండి [పేజి నెం. 165]

ఒక పాచికను దొర్లించి, వచ్చిన సంఖ్యను నమోదు చేయండి. ఇలా 40 సార్లు పాచికను దొర్లించి సంఖ్యలు నమోదు చేయండి. ఈ దత్తాంశాన్ని గణన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య విభాజన పట్టికలో చూపండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 2

AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions

పేజి నెం. 168

ప్రశ్న 1.
పటచిత్రం కన్న కమ్మీ రేఖా చిత్రం ఏ విధంగా ఉత్తమమైనది?
సాధన.
కమ్మీరేఖాచిత్రాలు ఖచ్చిత సంఖ్యా విలువలను చూపు మంచి సూచికలు. ధన విలువలను, ఋణ విలువలను కూడా చూపు మంచి సూచిక ఈ కమ్మీరేఖాచిత్రం.

ఉదాహరణలు

ప్రశ్న 1.
10 మార్కుల పరీక్షలో ఒక తరగతిలోని 25 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఉన్నవి. 5, 6, 7,
5, 4, 2, 2, 9, 10, 2, 4, 7, 4, 6, 9, 5, 5, 4, 7, 9, 5, 2, 4, 5, 7.
(i) పై దత్తాంశాన్ని వర్గీకరించి, గణన చిహ్నాలతో పౌనఃపున్య విభాజన పట్టికలో చూపండి.
(ii) తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు పొందిన మార్కులు ఎన్ని?
(iii) తరగతిలో ఎంతమంది విద్యార్థులు కనిష్ఠ మార్కులు పొందారు?
(iv) ఎంత మంది విద్యార్థులు 8 మార్కులు పొందారు?
సాధన.
(i)
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 3
(ii) తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు (6) పొందిన మార్కులు 5.
(iii)తరగతిలో కనిష్ఠ మార్కులు (2) పొందిన విద్యార్థుల సంఖ్య 4.
(iv) 8 మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ‘0’ (తరగతిలోని ఏ విద్యార్థి 8 మార్కులు పొందలేదు).

AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions

ప్రశ్న 2.
25 మంది గల ఒక తరగతిలోని విద్యార్థులు వివిధ ఆటలు ఆడతారు. (ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఆటను మాత్రమే ఆడును). ఆటగాళ్ళ సంఖ్యాత్మక వివరాలు పట చిత్రంలో చూపబడింది.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 4
(i) ఎంతమంది విద్యార్థులు బ్యాడ్మింటన్ ఆడతారు?
(ii) ఎక్కువ మంది విద్యార్థులు ఆడే ఆట ఏది?
(iii) తక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపే ఆట ఏది?
(iv) ఏ ఆటనూ ఆడని విద్యార్థుల సంఖ్య ఎంత?
సాధన.
(i) 5 మంది విద్యార్థులు బ్యాడ్మింటన్ ఆడతారు.
(ii) ఎక్కువ మంది విద్యార్థులు (7) ఆడే ఆట కబడ్డీ.
(iii) తక్కువ మంది విద్యార్థులు (4) ఆసక్తి చూపే ఆట టెన్నికాయిట్.
(iv) మొత్తం ఆటగాళ్ళ సంఖ్య = 7 + 4 + 5 + 6 = 22
మొత్తం విద్యార్థుల సంఖ్య = 25
ఏ ఆటనూ ఆడని విద్యార్థుల సంఖ్య = 25 – 22 = 3

ప్రశ్న 3.
ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పటత్రంగా చూపుదాం.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 5
35 మంది విద్యార్థులను సూచించుటకు 35 బొమ్మలు వేయడం సమంజసమా ? కావున ప్రతి 5 మంది విద్యార్థులను ఒక బొమ్మ సూచిస్తుందని అనుకుంటే, ఆ సూచనను ‘స్కేలు’ అంటాం. సాధారణంగా ‘సులు దత్తాంశంలోని అన్ని పౌనఃపున్యాల యొక్క గ.సా.భాను తీసుకుంటాం.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 6
పై దత్తాంశమును సూచించు పట చిత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 7

AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions

ప్రశ్న 4.
కింది పట చిత్రం ఐదు గ్రామాల్లో గల ట్రాక్టర్ల సంఖ్యను చూపుతున్నది.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ InText Questions 8
(i) ఏ గ్రామములో కనిష్ఠ సంఖ్యలో ట్రాక్టర్లు కలవు?
(ii) ఏ గ్రామములో గరిష్ఠ సంఖ్యలో ట్రాక్టర్లు కలవు?
(iii) గ్రామము B కన్నా గ్రామము C లో ఎన్ని ట్రాక్టర్లు ఎక్కువ కలవు?
(iv) ఐదు గ్రామాలలోనూ గల మొత్తం ట్రాక్టర్ల సంఖ్య ఎంత?
సాధన.
(i) B మరియు E గ్రామములలో కనిష్ఠ సంఖ్యలో (8) ట్రాక్టర్లు కలవు.
(ii) D గ్రామములో గరిష్ఠ సంఖ్యలో (20) ట్రాక్టర్లు కలవు.
(iii) B గ్రామము కంటే C గ్రామములో అధికముగా గల ట్రాక్టర్ల సంఖ్య 10.
(iv) ఐదు గ్రామాలలోనూ గల మొత్తం ట్రాక్టర్ల సంఖ్య (66).