SCERT AP 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.3 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 2nd Lesson పూర్ణాంకాలు Exercise 2.3
ప్రశ్న 1.
కింది అమరికను పరిశీలించండి.
1 × 8 + 1 = 9
12 × 8 + 2 = 98
123 × 8 + 3 = 987
1234 × 8 + 4 = 9876
12345 × 8 + 5 = 98765
తర్వాత వచ్చే నాలుగు సోపానాలు రాయండి. ఈ అమరిక తర్వాత సంఖ్యలకు ఎలా వస్తుందో చెప్పగలరా?
సాధన.
తర్వాత వచ్చే నాలుగు సోపానాలు
123456 × 8 + 6 = 987654
1234567 × 8 + 7 = 9876543
12345678 × 8 + 8 = 98765432
123456789 × 8 + 9 = 987654321
L.H.S లో ఉన్న సంఖ్యల అమరిక పెరుగుతుంది. మరియు R.H.S లో ఉన్న ఫలితంలో కుడివైపున ఉన్న సంఖ్యలు తగ్గుతున్నాయి.
ప్రశ్న 2.
13680347, 35702369, 25692359 సంఖ్యలను 9తో గుణించి, ఎటువంటి అమరిక వస్తుందో పరిశీలించండి.
సాధన.
i) 13680347 × 9 = 13680347 × (10 – 1)
వ్యవకలనం మీద గుణకార విభాగన్యాయం ప్రకారం,
= 13680347 × 10 – 13680347 × 1
= 136803470 – 13680347
= 123123123
ii) 35702369 × 9 = 35702369 × (10 – 1)
వ్యవకలనం మీద గుణకార విభాగన్యాయం ప్రకారం,
= 35702369 × 10 – 35702369 × 1
= 357023690 – 35702369
= 321321321
iii) 25692359 × 9 = 25692359 × (10 – 1)
వ్యవకలనం మీద గుణకార విభాగన్యాయం ప్రకారం,
= 25692359 × 10 – 25692359 × 1
= 256923590 – 25692359
= 231231231