SCERT AP 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Unit Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 2nd Lesson పూర్ణాంకాలు Unit Exercise
ప్రశ్న 1.
< లేదా > సరియైన గుర్తును ఎంపిక చేసుకొని కింది ఖాళీలను పూరించండి.
అ) 8 ……….. 7 ఆ) 5 ……….. 2 ఇ) 0 ………. 1 ఈ) 10 ………..5
సాధన.
అ) 8 …..>…… 7 ఆ) 5 ……>……2 ఇ) 0 ……<…… 1 ఈ) 10 ……>….. 5
ప్రశ్న 2.
11 యొక్క ఉత్తర సంఖ్య మరియు 5 యొక్క పూర్వ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించండి.
సాధన.
11 యొక్క ఉత్తర సంఖ్య = 12.
5 యొక్క పూర్వ సంఖ్య = 4.
ప్రశ్న 3.
కింది ప్రవచనాలలో ఏది సత్యమో, ఏది అసత్యమో కనుగొని అసత్య ప్రవచనాలను సరిచేసి రాయండి.
అ) పూర్వ సంఖ్యలేని ఒక సహజ సంఖ్య గలదు.
ఆ) ‘0’ అనునది కనిష్ఠ పూర్ణాంకం.
ఇ) సంఖ్యారేఖపై ఏదేని పూర్ణాంకమునకు ఎడమవైపు గల పూర్ణాంకము ఆ పూర్ణాంకము కంటే పెద్ద సంఖ్య.
సాధన.
అ)పూర్వ సంఖ్యలేని ఒక సహజ సంఖ్య గలదు. (సత్యం)
(పూర్వసంఖ్యలేని సహజసంఖ్య 1)
ఆ) ‘0’ అనునది కనిష్ఠ పూర్ణాంకం. (సత్యం )
ఇ) సంఖ్యారేఖ పై ఏదేని పూర్ణాంకమునకు ఎడమవైపు గల పూర్ణాంకము ఆ పూర్ణాంకము కంటే పెద్ద సంఖ్య. (అసత్యం)
సరిచేసి రాయగా:
సంఖ్యారేఖ పై ఏదేని పూర్ణాంకమునకు ఎడమవైపు గల పూర్ణాంకము ఆ పూర్ణాంకము కంటే చిన్న సంఖ్య.
ప్రశ్న 4.
ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించకుండా చెప్పండి.
అ) 28 × 19 = 532 అయితే 19 × 28 =
ఆ) a × b = c అయితే b × a =
ఇ) 85 + 0 = 85 అయితే 0 + 85 =
సాధన.
అ) 28 × 19 = 532 అయితే 19 × 28 = 532
ఆ) a × b = అయితే b × a = c
ఇ) 85 + 0 = 85 అయితే 0 + 85 = 85
ప్రశ్న 5.
కింది వాటి విలువలను కనుగొనండి.
అ) 368 × 12 + 18 × 368
ఆ) 79 × 4319 + 4319 × 11
సాధన.
అ) 368 × 12 + 18 × 368 = 368 × (12 + 18) (విభాగ న్యా యం )
= 368 × 30 = 11040
ఆ) 79 × 4319 + 4319 × 11 = 4319 × (79 + 11) (విభాగ న్యాయం)
= 4319 × 90
= 388710
ప్రశ్న 6.
చందన, వేణులు వరుసగా 12 నోటు పుస్తకాలు, 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర ₹ 15. అయితే దుకాణదారునికి ఎంత డబ్బు ఇవ్వాలి?
సాధన.
చందన కొన్న నోటు పుస్తకాలు = 12
వేణు కొన్న నోటు పుస్తకాలు = 10
ఒక్కొక్క నోటు పుస్తకం ధర = ₹15
దుకాణదారునికి ఇవ్వాల్సిన డబ్బు = (12 + 10) × 15
= 12 × 15 + 10 × 15
= 180 + 150
= ₹ 330
ప్రశ్న 7.
జతపరండి.
సాధన.
అ) iii,
ఆ) v,
ఇ) ii,
ఈ) i,
ఉ) iv
ప్రశ్న 8.
కింది అమరికను పరిశీలించండి.
91 × 11 × 1 = 1001
91 × 11 × 2 = 2002
91 × 11 × 3 = 3003
తర్వాత వచ్చే ఏడు సోపానాలు రాయండి. ఫలితం సరియైనదేమో సరి చూడండి.
సాధన.
91 × 11 × 4 = 4004
91 × 11 × 5 = 5005
91 × 11 × 6 = 6006
91 × 11 × 7 = 7007
91 × 11 × 8 = 8008
91 × 11 × 9 = 9009
91 × 11 × 10 = 10010