SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 6th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 6.2
ప్రశ్న 1.
క్రింది దత్తాంశములకు బాహుళకము కనుగొనుము.
(i) 2, 3, 7, 5, 3, 2, 6, 7, 1, 2.
సాధన.
2, 3, 7, 5, 3, 2, 6, 7, 1, 2.
దత్తాంశాన్ని క్రమపద్ధతిలో అమర్చగా, 1, 2, 2, 2, 3, 3, 5, 6, 7, 7.
మిగతా రాశులకన్నా 2 ఎక్కువసార్లు వచ్చినది.
∴ బాహుళకం = 2
(ii) K, A, B, C, B, C, D, K, B, D, B, K, A, K.
సాధన.
K, A, B, C, B, C, D, K, B, D, B, K, A, K
ఇచ్చిన దత్తాంశాన్ని (అక్షరాలను) క్రమపద్ధతిలో అమర్చగా, A, A, B, B, B, B, C, C, D, D, K, K, K, K.
మిగతా వానికన్నా B మరియు K ఎక్కువసార్లు (4సార్లు) పునరావృతం అయినవి.
∴ బాహుళకం = B మరియు K.
(iii) మొదటి 10 సహజ సంఖ్యలు
సాధన.
మొదటి 10 సహజ సంఖ్యలు : 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
ఏ రాశి కూడా పునరావృతం కాలేదు.
కావున, ఇచ్చిన దత్తాంశమునకు బాహుళకం లేదు.
(iv) 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8.
సాధన.
2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8. .
దత్తాంశంలోని అన్ని రాశులు సమాన సంఖ్యలో పునరావృతం (అన్ని రాశులు 2 సార్లు పునరావృతం అయినవి). కావున, ఇచ్చిన దత్తాంశమునకు బాహుళకం లేదు.
ప్రశ్న 2.
20 మంది విద్యార్ధులు “స్వచ్ఛ భారత్ అభియాన్” కార్యక్రమములో పాల్గొన్నారు. విద్యార్ధులు పాల్గొన్న రోజుల సంఖ్య వరుసగా 5, 1, 2, 4, 1, 2, 3, 2, 1, 2, 3, 2, 5, 3, 4, 2, 1, 3, 4 మరియు 5 అయిన బాహుళకము ఎంత ?
సాధన.
5, 1, 2, 4, 1, 2, 3, 2, 1, 2, 3, 2, 5, 3, 4, 2, 1, 3, 4, 5.
రోజుల సంఖ్యను క్రమపద్ధతిలో అమర్చగా, 1, 1, 1, 1, 2, 2, 2, 2, 2, 2, 3, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5.
మిగతావాటి కన్నా ఎక్కువసార్లు పునరావృతం (6 సార్లు) అయినది.
∴ బాహుళకం = 2.
ప్రశ్న 3.
ఒక ఫుట్ బాల్ జట్టు వివిధ మ్యాచ్ లో సాధించిన గోల్స్ సంఖ్య 3, 2, 4, 6, 1, 3, 2, 4, 1 మరియు 6. అయిన బాహుళకం కనుగొనుము.
సాధన.
3, 2, 4, 6, 1, 3, 2, 4, 1, 6.
ఫుట్ బాల్ జట్టు సాధించిన గోల ను క్రమపద్ధతిలో అమర్చగా, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 6, 6.
దత్తాంశములోని అన్ని రాశులు సమానంగా పునరావృతం అయినవి.
కావున, బాహుళకం లేదు.
ప్రశ్న 4.
క్రింది పటములోని ఇంగ్లీష్ అక్షరాల బాహుళకము కనుగొనుము. ఇది ఏక బాహుళక దత్తాంశమా లేక ద్విబాహుళక దత్తాంశమా?
సాధన.
S, A, H, S, A, M, S, T, M, T, H, T, A, T, S, M, H, O, A, S, T, M, A, T, S, T, H, M.
ఇచ్చిన పటంలోని అక్షరాల సంఖ్య అక్షరము
ఎక్కువసార్లు పునరావృతం అయిన అక్షరం T. కావున బాహుళకం = T (ఏకబాహుళక దత్తాంశము).