AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

SCERT AP 7th Class Science Study Material Pdf 1st Lesson ఆహారంతో ఆరోగ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Science 1st Lesson Questions and Answers ఆహారంతో ఆరోగ్యం

7th Class Science 1st Lesson ఆహారంతో ఆరోగ్యం Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరింపుము.

1. తృణధాన్యాలు మరియు చిరుధాన్యాలలో …………….. సమృద్ధిగా ఉంటాయి. (పిండిపదార్థం)
2. పప్పుధాన్యాలలో ……………….. పుష్కలంగా ఉన్నాయి. (ప్రోటీన్స్)
3. మలబద్దకాన్ని నివారించటానికి ఎక్కువ ………… తీసుకోవాలి. (పీచుపదార్థం)
4. విటమిన్ డి లోపం వల్ల ………………. వ్యాధి కలుగుతుంది. (రికెట్స్)
5. విటమిన్ సి లోపం ………………….. వ్యా ధికి కారణమవుతుంది. (స్కర్వి)

II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.

1. రమణ నువ్వుగింజలను నలిపి, కాగితంపై రుద్దాడు. అతను రుద్దిన చోట కాగితం అర్ధపారదర్శకంగా మారింది. ఆ గింజలలో ఏ పదార్థం ఉన్నది?
A) పిండిపదార్థాలు
B) మాంసకృత్తులు
C) క్రొవ్వులు
D) నీరు
జవాబు:
C) క్రొవ్వులు

2. ఇది లోపిస్తే రక్తహీనత వ్యాధి కలుగుతుంది.
A) జింక్
B) ఇనుము
C) విటమిన్ ఎ
D) కాల్షియం
జవాబు:
B) ఇనుము

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

3. ఇది లోపించడం వలన మనకు దృష్టి లోపాలు కలుగుతాయి.
A) విటమిన్-ఎ
B) విటమిన్-బి
C) విటమిన్-సి
D) విటమిన్-డి
జవాబు:
A) విటమిన్-ఎ

VI. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
A) రేచీకటి 1) పిండిపదార్థాలు
B) శక్తినిచ్చే ఆహారం 2) ఇనుము
C) శరీర నిర్మాణ పోషకాలు 3) విటమిన్-ఎ
D) సంరక్షక ఆహారం 4) మాంసకృత్తులు
E) రక్తహీనత 5) ఖనిజ లవణాలు, విటమిన్లు
6) సోడియం

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) రేచీకటి 3) విటమిన్-ఎ
B) శక్తినిచ్చే ఆహారం 1) పిండిపదార్థాలు
C) శరీర నిర్మాణ పోషకాలు 4) మాంసకృత్తులు
D) సంరక్షక ఆహారం 5) ఖనిజ లవణాలు, విటమిన్లు
E) రక్తహీనత 2) ఇనుము

IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఆహారంలోని అంశాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఆహారంలో ప్రధానంగా 1) పిండిపదార్థాలు 2) మాంసకృత్తులు 3) క్రొవ్వులు 4) ఖనిజ లవణాలు 5) విటమిన్లు ఉంటాయి.
  2. వీటిలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు అధికపరిమాణంలో అవసరం. కావున వీటిని స్థూల పోషకాలు అంటారు.
  3. ఖనిజ లవణాలు మరియు విటమిన్లు తక్కువ పరిమాణంలో అవసరం కాబట్టి వీటిని సూక్ష్మపోషకాలు అంటారు.
  4. ఇవన్ని ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు.

ప్రశ్న 2.
మధ్యాహ్న భోజన సమయంలో నీవు తీసుకున్న ఆహార జాబితాను తయారుచేయండి. ప్రతి ఆహార పదార్థంలోని అంశాలను రాయండి.
జవాబు:

నేను తీసుకొన్న ఆహారం అందులోని అంశాలు
1. అన్నము పిండిపదార్థం
2. చపాతి పిండిపదార్థం
3. గుడు ప్రొటీన్స్
4. చికెన్ ప్రొటీన్స్
5. నూనె క్రొవ్వు
6. ఉప్పు ఖనిజలవణం

ప్రశ్న 3.
మన ఆహారంలో నీటి యొక్క పాత్ర ఏమిటి?
జవాబు:
మన రక్తంలో నీరు కూడా ఒక భాగం. కానీ నీటిలో ఏ పోషకాలూ ఉండవు. కనుక ఇది పోషకంగా గుర్తించబడదు. మన శరీర బరువులో దాదాపు మూడింట రెండు వంతులు నీరు ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. శరీరం నుండి కొన్ని వ్యర్థాలను మూత్రం మరియు చెమట రూపంలో విసర్జించడానికి ఇది సహాయపడుతుంది. అనేక జీవక్రియలకు నీరు అవసరం. జీర్ణనాళం ద్వారా ఆహారం కదిలివెళ్ళడానికి నీరు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా సహాయపడుతుంది.

ప్రశ్న 4.
పోషకాహార లోపం వల్ల కలిగే న్యూనత వ్యాధుల గురించి తెలుసుకోవటానికి పోషకాహార నిపుణుడిని నీవు ఏమి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
ప్రశ్నలు:

  1. పోషకాహార లోపం అనగానేమి?
  2. పోషకాహార లోప కారణాలు ఏమిటి?
  3. పోషకాహార లోపంలో రకాలు ఉన్నాయా?
  4. పోషకాహార లోపం అధిగమించటానికి ఏమి చేయాలి?
  5. పోషకాహార లోప ప్రభావం ఏమిటి?
  6. పిల్లలలో పోషకాహార లోపం ఉంటుందా?

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 5.
మన ఆహారంలో పీచుపదార్థాలను చేర్చకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఆహారం నుండి లభిస్తుంది.
  2. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకలు మొదలగునవి పీచుపదార్థాల యొక్క ప్రధాన వనరులు.
  3. చిలకడదుంప, బత్తాయి వంటి ఆహారపదార్థాలలో పీచుపదార్థం ఎక్కువ.
  4. ఆహారంలో పీచుపదార్థం లేకపోతే మలబద్దకం ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
గంజిలో పిండిపదార్థాలు ఉన్నాయని మేరీ ఎక్కడో చదివింది. దాన్ని నిర్ధారించటానికి ఆమె చేయవలసిన పరీక్షను వివరించండి.
జవాబు:
ఉద్దేశం : గంజిలో పిండి పదార్థాల ఉనికిని నిర్ధారించుట.

ఏం కావాలి :
1) సజల అయోడిన్ ద్రావణము (కొన్ని అయోడిన్ స్పటికాలను లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు నీటిలో కరిగించండి) 2) గంజి 3) పాత్ర 4) డ్రాపరు

ఎలా చేయాలి :
ఒక పాత్రలో గంజి తీసుకోవాలి. దానికి 2 లేదా 3 చుక్కల సజల అయొడిన్ ద్రావణాన్ని కలపండి. అయొడిన్ వేసిన తర్వాత రంగులో మార్పును గమనించండి. పిండి పదార్థం ఉంటే అది నీలం నలుపు రంగులోకి మారుతుంది.

ఏం చూశావు :
గంజి నీలి – నలుపు రంగులోకి మారింది.

ఏం నేర్చుకున్నావు :
గంజిలో పిండి పదార్థం ఉంది.

ప్రశ్న 7.
ఇవ్వబడిన ఆహారంలో ప్రోటీన్ల ఉనికిని నీవు ఎలా పరీక్షిస్తావు? (ప్రయోగశాల కృత్యం-2)
జవాబు:
ఉద్దేశం : గుడ్డు తెల్లసొనలో మాంసకృత్తుల నిర్ధారణ పరీక్ష.

ఏం కావాలి :

  1. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం (2 గ్రా. కాపర్ సల్ఫేటను 100 మి.లీ. నీటిలో కలపాలి)
  2. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం (10 గ్రా. సోడియం హైడ్రాక్సైడు 100 మి.లీ. నీటిలో కలపాలి)
  3. గుడ్డు
  4. పరీక్షనాళికలు
  5. రెండు బీకరులు
  6. డ్రాపర్.

AP Board 7th Class Science Solutions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం 1
ఎలా చేయాలి :
పరీక్ష నాళికలో పది చుక్కల గుడ్డు తెల్లసొన తీసుకోవాలి. రెండు చుక్కల కాపర్ సల్ఫేటు మరియు పది చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలను కలపాలి. బాగా కదిలించి, పరీక్షనాళికను కొన్ని నిమిషాలు స్టాండ్ లో ఉంచాలి. పదార్థం యొక్క రంగులో వచ్చే మార్పును గమనించండి. పదార్ధం ఊదారంగులోకి మారితే, అందులో మాంసకృత్తులు ఉన్నట్లు,

ఏం చూశావు :
గుడ్డులో తెల్లసొన ఊదారంగులోనికి మారింది.

ఏం నేర్చుకున్నావు :
గుడ్డులోని తెల్లసొనలో మాంసకృత్తులు ఉన్నాయి.

ప్రశ్న 8.
మన శరీరానికి ఆవశ్యకమైన పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని పోషకాలను ఒక పిరమిడ్ గా బొమ్మ గీయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం 2

ప్రశ్న 9.
మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచడంలో ఆకుకూరల పాత్రను అభినందించండి.
జవాబు:

  1. ఆకుకూరలు మన శరీరానికి అవసరమైన వివిధ రకాల ఖనిజ లవణాలను కల్గి ఉంటాయి.
  2. ఇవి శరీరం సక్రమంగా ఎదగటానికి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి.
  3. ఆకుకూరలలోని ఖనిజ లవణాలను రక్షక పోషకాలు అంటారు. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి.
  4. ఆకుకూరలు ప్రధానంగా విటమిన్-ఎ కల్గి ఉండి కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  5. ఆకుకూరలలోని పీచుపదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది.
  6. ఆకుకూరలు సులువుగా జీర్ణమై, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  7. అందుకే ఆకుకూరలు వాడదాం, ఆరోగ్యంగా ఉందాం.
  8. పచ్చని ఆకుకూరలు – ఆరోగ్యానికి మెట్లు.

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 10.
సంతులిత ఆహారం అంటే ఏమిటి?నీ రోజువారి భోజనం సంతులిత ఆహారంగా ఉండటానికి, ఏయే పదార్థాలను చేరుస్తావు?
జవాబు:

  1. అన్ని పోషకాలను అవసరమైన పరిమాణంలో కలిగి ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు.
  2. ఇది మన శరీరం సమర్థవంతంగా పనిచేయటానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
  3. సంతులిత ఆహారంలో పిండి పదార్థం ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సరైన మోతాదులో ఉండాలి.
  4. పిండిపదార్థం కోసం నేను అన్నం, చపాతిని; ప్రొటీన్స్ కోసం పాలు, గుడ్లు, మాంసాన్ని; క్రొవ్వు కొరకు నూనె, నెయ్యిని; విటమిన్లు కోసం, కాయగూరలు, పండ్లను నా ఆహారంలో చేర్చుకుంటాను.

7th Class Science 1st Lesson ఆహారంతో ఆరోగ్యం InText Questions and Answers

7th Class Science Textbook Page No.3

ప్రశ్న 1.
మధ్యాహ్న భోజనంలో మీకు వడ్డించే ఆహార పదార్థాలను పేర్కొనండి.
జవాబు:
మధ్యాహ్న భోజనంలో అన్నం, సాంబారు, గుడ్డు, చిక్కి వంటి పదార్థాలు రోజువారి మెను ప్రకారం వడ్డిస్తున్నారు.

ప్రశ్న 2.
బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించటానికి కారణం ఏమిటి?
జవాబు:
పిల్లలందరు ఆరోగ్యంగా పౌష్టికాహార లోపం లేకుండా ఉండాలని మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

7th Class Science Textbook Page No. 5

ప్రశ్న 3.
మధ్యాహ్న భోజనంలో అన్ని రోజులు ఒకే మెను ఉంటుందా?
జవాబు:
లేదు. మధ్యాహ్న భోజనం మెను వారాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది.

ప్రశ్న 4.
మధ్యాహ్న భోజనంలో ఎందుకు వివిధ రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు?
జవాబు:
వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకొన్నప్పుడే మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి.

ప్రశ్న 5.
చిక్కిలో ఏయే పోషకాలు ఉంటాయి?
జవాబు:
చిక్కిలో ప్రధానంగా ప్రొటీన్స్, నూనె పదార్థం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.

ప్రశ్న 6.
గుడ్డులో ఉండే పోషకాలు ఏమిటి?
జవాబు:
గుడ్డులో ప్రొటీన్స్, క్రొవ్వులతో పాటు, విటమిన్స్, మినరల్స్ వంటి అన్నిరకాల పోషకాలు లభిస్తున్నాయి.

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 7.
మనం తీసుకొనే ఆహారపదార్థంలోని అంశాలు ఏమిటి?
జవాబు:
మనం తీసుకొనే ఆహారపదార్ధంలో

  1. పిండిపదార్థాలు
  2. మాంసకృత్తులు
  3. క్రొవ్వులు
  4. ఖనిజ లవణాలు
  5. విటమిన్లు ఉంటాయి.

ప్రశ్న 8.
స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనగానేమి?
జవాబు:
శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు.
ఉదా : పిండిపదార్థం, మాంసకృత్తులు.

శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను ‘సూక్ష్మపోషకాలు’ అంటారు.
ఉదా : విటమిన్లు, లవణాలు.

7th Class Science Textbook Page No. 7

ప్రశ్న 9.
మ్యాచ్ విరామ సమయంలో క్రికెట్ ఆటగాళ్ళు పానీయాలు తాగే సన్నివేశం మీకు బాగా తెలుసు. వారు పానీయాలు ఎందుకు తీసుకొంటారు?
జవాబు:

  1. మనం అలసిపోయినపుడు సాధారణ స్థితికి రావడానికి మనకు శక్తి కావాలి.
  2. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఆటగాళ్ళకు నిరంతరం శక్తి కావాలి.
  3. ఆటగాళ్ళు తీసుకొనే పానీయాలలో గ్లూకోజ్ ఉంటుంది.
  4. ఇది ఆటగాళ్ళకు తక్షణ శక్తి ఇస్తుంది. అందువలన విరామసమయంలో ఆటగాళ్ళు డ్రింక్స్ సేవిస్తారు.

7th Class Science Textbook Page: No. 15

ప్రశ్న 10.
రక్తహీనతకు కారణాలు ఏమిటి?
జవాబు:
ఐరన్ లోపం వలన రక్తహీనత కలుగుతుంది.

ప్రశ్న 11.
దృష్టి సమస్యలకు కారణం ఏమిటి?
జవాబు:
విటమిన్-ఎ లోపం వలన దృష్టి సమస్యలు కలుగుతాయి.

7th Class Science Textbook Page No. 17

ప్రశ్న 12.
రేచీకటి నివారించటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
జవాబు:
విటమిన్ – ఎ వలన రేచీకటి నివారించవచ్చు.

ప్రశ్న 13.
విటమిన్-కె లోపిస్తే ఏమవుతుంది?
జవాబు:
విటమిన్-కె లోపిస్తే రక్తం త్వరగా గడ్డకట్టదు.

ప్రశ్న 14.
చంటి పిల్లలకు కొద్ది సమయం ఉదయం పూట ఎండతగిలేలా ఉంచుతారు. ఎందుకు?
జవాబు:
సూర్యరశ్మి సోకటం వలన శరీరంలో విటమిన్-డి తయారౌతుంది.

ప్రశ్న 15.
కోవిడ్-19 పరిస్థితులలో విటమిన్-సి తీసుకోవాలని సూచిస్తారు. ఎందుకు?
జవాబు:
విటమిన్-సి శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచుతుంది.

7th Class Science Textbook Page No. 23

ప్రశ్న 16.
పోషకాలలో ఏవైనా కొన్ని పోషకాలు లేని ఆహారం తీసుకొంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
పోషకాలు లేని ఆహారం తీసుకొంటే పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీని వలన శరీరం అనారోగ్యం పాలవుతుంది.

7th Class Science Textbook Page No. 27

ప్రశ్న 17.
మనం ఏ ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి?
జవాబు:
మనం పిండిపదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

ప్రశ్న 18.
ఏ ఆహారపదార్థాలను తక్కువ మొత్తంలో తీసుకోవాలి?
జవాబు:
క్రొవ్వులు లేదా నూనెలను తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Science Textbook Page No. 21

ప్రశ్న 1.
పండ్లను, కూరగాయలను తొక్కతో సహా తినడం మంచిదా ? చర్చించండి.
జవాబు:

  1. పండ్లు, కూరగాయల తొక్కలలో పీచుపదార్థం, విటమిన్స్ అధికంగా ఉంటాయి.
  2. వీటిని తీసి తినటం వలన పోషకాలను కోల్పోతాము.
  3. కాని ఇటీవల కాలంలో రసాయన సాగు వలన పండ్ల తొక్కలు రసాయన పూరితమైనాయి.
  4. వీటిని తీసి తినటమే శ్రేయస్కరంగా ఉంది.

7th Class Science Textbook Page No. 25

ప్రశ్న 2.
శిశువులు కొన్ని నెలలపాటు పాలను మాత్రమే తీసుకొని ఎలా పెరగగల్గుతున్నారు?
జవాబు:

  1. పాలు శిశువుల ప్రధాన ఆహారం.
  2. పాలలో పుష్కలంగా ప్రొటీన్స్ మరియు లిపిడ్స్ ఉంటాయి.
  3. ప్రొటీన్స్ శరీర నిర్మాణానికి లిపిడ్ శక్తిని ఇస్తాయి.
  4. పాలు ఒక సంపూర్ణ ఆహారం. అందువలన శిశువులు కేవలం పాలతోనే కొన్ని నెలలు పాటు పెరగగల్గుతున్నారు.

ప్రాజెక్ట్ పనులు

7th Class Science Textbook Page No. 35

ప్రశ్న 1.
పన్నెండేళ్ళ పిల్లలకి సమతుల్య ఆహారం అందించటానికి డైట్ చార్టు తయారుచేయండి. డైట్ చార్ట్ లో ఖరీదైనవి కాని, మీ ప్రాంతంలో సాధారణంగా లభించే ఆహారపదార్థాలు ఉండాలి.
జవాబు:
1) అన్నము 2) చపాతీ 3) గుడ్లు 4) మాంసం 5) చేప 6) నెయ్యి 7) పాలు 8) పెరుగు 9) కాయలు 10) చిక్కి 11) బెల్లం 12) వేరుశనగలు 13) పిండి వంటకాలు 14) పాయసం 15) స్వీట్లు

ప్రశ్న 2.
మీ తల్లిదండ్రులతో చర్చించి, సంప్రదాయ ఆహారపదార్థాలు – వాటి పోషక విలువలు తెలియజేసే ఒక పట్టిక తయారుచేయండి.
జవాబు:

సాంప్రదాయ ఆహారపదార్థం పోషకాలు కాలరీ
1. పూరి 100 గ్రా. 150 గ్రా.
2. రోటి 100 గ్రా. 90 గ్రా.
3. లస్సి (sweet) 200 మి.గ్రా. 90 గ్రా.
4. మిక్స్డ్ వెజిటబుల్స్ 150 గ్రా. 298 గ్రా.
5. గులా జామ్ 2 331 గ్రా.
6. చికెన్ కర్రీ 150 గ్రా. 85 గ్రా.

కృత్యాలు

కృత్యం -1

ప్రశ్న 1.
సిసిరిత, తన తమ్ముడి కోసం, అంగన్‌వాడీ వర్కర్ తెచ్చిన బాలామృతం ప్యాకెట్ పై గల ఈ క్రింది పోషకాల సమాచారాన్ని చూసింది. వాటిని అధ్యయనం చేసి, ఈ కింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. (పదాలు ఇంగ్లీషులో ఉంటాయి. వాటి తెలుగు పదాల కోసం నిఘంటువును చూడండి లేక మీ ఉపాధ్యాయుని సహకారం తీసుకోండి).
AP Board 7th Class Science Solutions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం 3
ఏయే అంశాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి? (గ్రాములలో)
జవాబు:
పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు అధిక పరిమాణంలో ఉన్నాయి.

ఏయే అంశాలు తక్కువ పరిమాణంలో ఉన్నాయి? (మి.గ్రా.లలో లేదా తక్కువ)
జవాబు:
విటమిన్లు, ఖనిజలవణాలు తక్కువ పరిమాణంలో ఉన్నాయి.

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 2.
బంగాళదుంపలో పిండిపదార్థాల ఉనికిని ఎలా నిర్ధారిస్తావు?
జవాబు:
ఉద్దేశం : బంగాళాదుంపలో పిండిపదార్థాల ఉనికిని నిర్ధారించుట.

ఏం కావాలి :

  1. సజల అయోడిన్ ద్రావణము (కొన్ని అయోడిన్ స్ఫటికాలను లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు నీటిలో కరిగించండి)
  2. బంగాళాదుంప ముక్క
  3. చాకు
  4. పళ్ళెము
  5. డ్రాపరు

AP Board 7th Class Science Solutions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం 4
ఎలా చేయాలి :
ఒక పళ్ళెం మీద బంగాళాదుంప ముక్క తీసుకోండి. బంగాళాదుంప ముక్కపై రెండు చుక్కల అయోడిన్ ద్రావణం వేయండి. అయోడిన్ వేసిన చోట రంగులో మార్పును గమనించండి. పిండిపదార్థం ఉంటే అది నీలం-నలుపు రంగు లోకి మారుతుంది.

ఏం చూశావు :
బంగాళదుంపలోని భాగం నీలం – నలుపు రంగులోకి మారింది.

ఏం నేర్చుకున్నావు :
బంగాళదుంపలో పిండి పదార్థం ఉంది. ఈ కింది ఆహార పదార్థములలో పిండి పదార్థముల ఉనికిని పరీక్షించి, నిర్ధారించుము.

ఆహార పదార్థం (పిండి పదార్థం ) ఉంది/లేదు
1. అన్నము పిండి పదార్థం ఉంది.
2. గుడ్డు సొన పిండి పదార్థం లేదు
3. గోధుమపిండి పిండి పదార్థం ఉంది

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

కృత్యం -2

ప్రశ్న 3.
వేరుశనగ గింజలలో క్రొవ్వుల ఉనికిని ఎలా నిర్ధారిస్తావు?
జవాబు:
ఉద్దేశం : వేరుశనగ గింజలలో కొవ్వుల ఉనికిని నిర్ధారించుట.

ఏం కావాలి :

  1. వేరుశనగ గింజలు
  2. తెల్లకాగితం
  3. పింగాణీ కల్వం,

ఎలా చేయాలి :
ఒక పింగాణీ కల్వంలో పది వేరుశనగ గింజలను తీసుకొని మెత్తని పేస్ట్ తయారుచేసుకోవాలి. పేస్టు తెల్ల కాగితంపై ఉంచి కొన్ని సెకన్ల పాటు రుద్దండి. కాగితంపై కొంత సమయం ఉంచండి. తెల్లకాగితం పారదర్శకంగా లేదా అర్ద పారదర్శకంగా మారితే వేరుశనగ గింజలలో క్రొవ్వు లేదా నూనె ఉంటుందని నీవు చెప్పవచ్చు.

ఏం చూశావు :
తెల్లకాగితం పారదర్శకంగా మారింది.

ఏం నేర్చుకున్నావు :
వేరుశనగ గింజలలో క్రొవ్వులు ఉన్నాయి.

ఆహారపదార్థం క్రొవ్వులు ఉన్నవి / లేవు
1. వడ/బజ్జీ క్రొవ్వులు ఉన్నవి
2. బియ్యంపిండి క్రొవ్వులు లేవు
3. పాలకోవా క్రొవ్వులు ఉన్నాయి

కృత్యం -3

ప్రశ్న 4.
వివిద ఖనిజ లవణాల వనరులను వాటి ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు:

ఖనిజ లవణాలు వనరులు ప్రాముఖ్యత
కాల్షియం (Ca) పాలు, పెరుగు, ఆకు కూరలు, చేప మొ|| దృఢమైన ఎముకలు మరియు దంతాలకు.
ఇనుము (Fe) మాంసము, ఎండిన ఫలాలు, ఆకుపచ్చని ఆకుకూరలు మొదలైనవి. రక్తం ఏర్పడడానికి, ఆక్సిజన్ రవాణాకు.
భాస్వరం (P) పాలు, పెరుగు, ధాన్యాలు, గింజలు, మాంసం మొదలైనవి. బలమైన ఎముకలు, దంతాలు తయారుకావడానికి.
అయోడిన్ (I) సముద్ర ఆహారం, అయోడిన్ ఉప్పు మొ|| థైరాయిడ్ హార్మోన్ తయారీకి. లోపించినచో, గాయిటర్ వ్యాధి కలుగుతుంది.
సోడియం (Na) ఉప్పు శరీరానికి కావలసిన నీటిని పట్టి ఉంచుతుంది.

అయోడిన్ పొందటానికి నీవు ఏ ఆహారం తీసుకొంటావు?
జవాబు:
సముద్ర ఆహారం, అయోడిన్ ఉప్పు

ఇనుము అధికంగా కలిగిన ఆహారపదార్థాలు ఏమిటి?
జవాబు:
ఎండిన ఫలాలు, ఆకుపచ్చని కూరలు

కృత్యం -4.

ప్రశ్న 5.
విటమిన్ సి నిర్ధారణ కొరకు సులువైన పరీక్ష చేద్దాం.
జవాబు:
ఉద్దేశం : నిమ్మపండ్లలో విటమిన్-సి ఉనికిని నిర్ధారించడం.

ఏం కావాలి :

  1. నిమ్మరసం
  2. అయోడిన్ ద్రావణం
  3. తెల్లకాగితం ముక్క
  4. చాకు
  5. డ్రాపర్.

ఎలా చేయాలి :
నిమ్మకాయను రెండు ముక్కలు చేయండి. తెల్లకాగితం ముక్కపై అయోడిన్ ద్రావణంను రెండు లేదా మూడు చుక్కలను వేయండి. నిమ్మకాయ ముక్కను కాగితంపై బోర్లించి ఉంచండి. కొన్ని నిమిషాలు అలా ఉంచి, గమనించండి. విటమిన్-సి ఉన్నట్లయితే, నిమ్మబద్ద క్రింద కాగితం రంగును కోల్పోతుంది.

ఏం చూశావు :
నిమ్మబద్ద క్రింద ఉన్న పేపరు రంగు మారింది. ఏం నేర్చుకున్నావు : నిమ్మకాయలో విటమిన్-సి ఉన్నది.

కృత్యం – 5

ప్రశ్న 6.
వేర్వేరు ఆహార పదార్థాలను గుర్తుకు తెచ్చుకోండి మరియు అది కలిగి ఉన్న పీచు పదార్థ పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించండి. మీ జట్టులో చర్చించి, కింది పట్టిక నింపండి. మీ కోసం ఒక ఉదాహరణ ఇవ్వబడింది.
AP Board 7th Class Science Solutions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం 5
జవాబు:

ఎక్కువ పీచు పదార్థాలు తక్కువ పీచు పదార్థాలు పీచు పదార్థాలు లేనివి
1. నారింజ ద్రాక్ష పాలు
2. కమలాలు మామిడి నెయ్యి
3. చిలకడ దుంప సపోటా చేప
4. బీరకాయ జామ మాంసం
5. చిక్కుడుకాయ
6. తోటకూర

కృత్యం – 6

ప్రశ్న 7.
ఆహారంలో నీటి ప్రాధాన్యతను తెలపటానికి నీవు నిర్వహించే ప్రయోగం ఏమిటి?
జవాబు:
ఉద్దేశం : నీటి వాడకాన్ని తెలుసుకోవడం.

ఏం కావాలి :

  1. స్పాంజ్ ముక్క
  2. ప్లాస్టిక్ పైప్
  3. నీరు
  4. బకెట్.

ఎలా చేయాలి :
స్పాంజి ముక్క తీసుకొని పైపు ద్వారా పంపడానికి ప్రయత్నించండి. అది కొంచెం కష్టంగా కదులుతుంది. పైపు నుండి స్పాంజిని తొలగించండి. దానిని నీటిలో ముంచి, మరలా పైపు గుండా మళ్ళీ ప్రయత్నించండి.

ఏం చూశావు :
స్పాంజ్ ముక్క పైపు ద్వారా సులభంగా కదిలినది.

ఏం నేర్చుకున్నావు :
పేగు వంటి ఇరుకైన గొట్టాలలో పదార్థం సులువుగా కదలటానికి నీరు సహాయపడుతుంది.

AP Board 7th Class Science Solutions Chapter 1 ఆహారంతో ఆరోగ్యం

కృత్యం -7

ప్రశ్న 8.
ఈ కింద మనం సాధారణంగా తీసుకొనే ఆహారపదార్థాల జాబితా ఉంది. వాటిని ఈ కింది పట్టికలోని గడులలోని అంశాల ఆధారంగా వర్గీకరించి, పట్టికలో నింపండి. ధాన్యాలు, దుంపలు, నూనెలు, స్వీట్లు, కొవ్వులు, పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు.
AP Board 7th Class Science Solutions 1st Lesson ఆహారంతో ఆరోగ్యం 6
జవాబు:

శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు
(పిండిపదార్థాలు, క్రొవ్వులు)
శరీర నిర్మాణ ఆహారపదార్థాలు
(మాంసకృత్తులు)
రక్షణ ఇచ్చే ఆహారపదార్థాలు
(విటమిన్లు, ఖనిజ లవణాలు)
1. ధాన్యాలు పప్పుధాన్యాలు ఆకుకూరలు
2. దుంపలు గింజధాన్యాలు పండ్లు
3. నూనెలు విత్తనాలు కూరగాయలు
4. స్వీట్లు పాల ఉత్పత్తులు
5. క్రొవ్వులు చేపలు
గుడ్లు
మాంసం

మీరు తీసుకొనే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా?
జవాబు:
అవును.

వాటిని మీరు ఎంతెంత పరిమాణంలో తీసుకుంటున్నారు?
జవాబు:
పిండిపదార్థాలు అధిక పరిమాణంలోనూ, మాంసకృత్తులను తగు పరిమాణంలోనూ, విటమిన్స్ క్రొవ్వులను తక్కువ పరిమాణంలో తీసుకొంటున్నాము.