SCERT AP 7th Class Science Study Material Pdf 5th Lesson చలనం – కాలం Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Science 5th Lesson Questions and Answers చలనం – కాలం
7th Class Science 5th Lesson చలనం – కాలం Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరింపుము.
1. వడి యొక్క ప్రమాణాలు (మీ/సె)
2. ఒక వస్తువు సమాన దూరాన్ని సమాన కాల వ్యవధిలో ప్రయాణిస్తే, దానిని ……. చలనం అంటారు. (సమ)
3. 60 నిమిషాలు = ………….. సెకనులు. (8,600)
4. సగటు వడి = ప్రయాణించిన మొత్తం దూరం / ……………. (ప్రయాణించిన కాలం)
5. ISRO అంటే ………. (భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రము)
6. జియో స్టేషనరీ ఉపగ్రహాలు ………… కొరకు ఉపయోగిస్తారు. (సమాచార ప్రసరణ)
II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.
1. వడి, దూరం మరియు కాలం మధ్య సరైన సంబంధం
A) వడి = దూరం/కాలం
B) వడి = కాలం/దూరం
C) కాలం = వడి/దూరం
D) దూరం = వడి/కాలం
జవాబు:
A) వడి = దూరం/కాలం
2. కింది వాటిలో సాధారణ విషయం ఏమిటి?
ఎగిరే హెలికాప్టర్ యొక్క ప్రొపెల్లర్ కదలిక, గడియారం యొక్క నిమిషాల ముల్లు, జెయింట్ వీల్ చలనం.
A) అన్నీ స్థానాంతర చలనానికి ఉదాహరణలు
B) అన్నీ డోలన చలనానికి ఉదాహరణలు
C) అన్నీ భ్రమణ చలనానికి ఉదాహరణలు
D) A మరియు C
జవాబు:
C) అన్నీ భ్రమణ చలనానికి ఉదాహరణలు
3. కింది వాటిలో ఏది డోలన చలనం కాదు?
A) విద్యుత్ గంటలో సుత్తి చలనం
B) పరుగెత్తుతున్నప్పుడు మీ చేతుల చలనం
C) తూగుటూయల మీద పిల్లల చలనం
D) బండి లాగునప్పుడు గుర్రం యొక్క చలనం
జవాబు:
D) బండి లాగునప్పుడు గుర్రం యొక్క చలనం
4. కిందివాటిలో ఏది సరైనది కాదు?
A) సమయం యొక్క ప్రాథమిక ప్రమాణం సెకన్
B) ప్రతి వస్తువు యొక్క చలనం సమచలనం.
C) 1 కి.మీ/గం = 5/18 మీ/సె.
D) వేగమును కి.మీ/గం. లలో వ్యక్తపరుస్తారు.
జవాబు:
C) 1 కి.మీ/గం = 5/18 మీ/సె.
III. జతపరచండి.
గ్రూపు – A | గ్రూపు – B |
A) భ్రమణ చలనం | 1) రాకెట్ |
B) డోలన చలనం | 2) రైల్వే స్టేషన్లోకి ప్రవేశించే రైలు బండి |
C) స్థానాంతర చలనం | 3) కుట్టు యంత్రంలో సూది చలనం |
D) 100 సంవత్సరాలు | 4) దశాబ్దం |
E) పది సంవత్సరాలు | 5) రిస్ట్ వాచీలో ముల్లు చలనం |
6) శతాబ్దం |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) భ్రమణ చలనం | 5) రిస్ట్ వాచీలో ముల్లు చలనం |
B) డోలన చలనం | 3) కుట్టు యంత్రంలో సూది చలనం |
C) స్థానాంతర చలనం | 1) రాకెట్ |
D) 100 సంవత్సరాలు | 6) శతాబ్దం |
E) పది సంవత్సరాలు | 4) దశాబ్దం |
IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
రెండు స్టేషన్ల మధ్య దూరం 240 కిమీ. ఈ దూరాన్ని పూర్తి చేయడానికి ఒక రైలుకు 4 గంటలు పడుతుంది.
రైలు వేగాన్ని మీటర్/సెకనులలో లెక్కించండి.
జవాబు:
ప్రశ్న 2.
ఒక వస్తువు ఒకే సమయంలో స్థానాంతర మరియు భ్రమణ చలనాలను కలిగి ఉంటుందా? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- ఒక వస్తువు ఒకే సమయంలో స్థానాంతర మరియు భ్రమణ చలనాలను కల్గి ఉంటుంది.
- దొర్లుతున్న బంతి గాని కదులుతున్న సైకిల్ కాని వాటి స్థానం నుండి ముందుకు కదులుతూ స్థానాంతర చలనాన్ని చూపుతాయి.
- అదే సమయంలో ఆ వస్తువులు గుండ్రంగా తిరుగుతూ భ్రమణ చలనం ప్రదర్శిస్తాయి.
ప్రశ్న 3.
టైలర్లు ఉపయోగించే కుట్టు యంత్రంలో, అది నడుస్తున్నప్పుడు కుట్టు యంత్రాల భాగాల చలన రకాన్ని పేర్కొనండి.
ఎ) చక్రం
బి) సూది
సి) వస్త్రం
జవాబు:
ఎ) చక్రం – భ్రమణ చలనం
బి) సూది – డోలన చలనం
సి) వస్త్రం – స్థానాంతర చలనం
ప్రశ్న 4.
సైకిల్ చలనంలో ఉన్నప్పుడు దాని వివిధ భాగాల చలనాలను తెలియజేయండి.
ఎ) చక్రం
బి) సైకిల్ చైన్
సి)పెడల్ చలనం
డి) సైకిల్ తో పాటు నడిపే వ్యక్తి చలనం
జవాబు:
సైకిల్ చలనంలో ఉన్నప్పుడు వివిధ భాగాలు వేరు వేరు చలనాలను చూపుతాయి.
ఎ) చక్రం – భ్రమణ చలనం
బి) సైకిల్ చైన్ – దీర్ఘవృత్తాకార చలనం
సి) పెడల్ – వృత్తాకార చలనం
డి) సైకిల్ నడిపే వ్యక్తి – స్థానాంతర చలనం
ప్రశ్న 5.
జాన్ ఒక రాయికి తీగను కట్టి దానిని గిరగిర తిప్పాడు. అక్కడ మీరు ఏ రకమైన చలనాన్ని పరిశీలిస్తారు?
జవాబు:
రాయికి తీగను కట్టి గిరగిరా తిప్పినపుడు అది వృత్తాకార మార్గంలో భ్రమణ చలనాన్ని ప్రదర్శిస్తుంది.
ప్రశ్న 6.
సమచలనం మరియు అసమచలనము అంటే ఏమిటి? ప్రతి చలనానికి నాలుగు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సమచలనం :
ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించినట్లయితే, దానిని సమచలనం అంటారు.
ఉదా :
- గడియారంలో ముళ్ళు చలనం
- తిరుగుతున్న ఫ్యాన్
- ఒకే వేగంతో వెళుతున్న రైలు
- ఒకే వేగంతో వెళుతున్న కారు
అసమచలనం :
ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో అసమాన దూరాలు ప్రయాణించినట్లయితే దానిని అసమ చలనం అంటారు.
ఉదా :
- సీతాకోక చిలుక ప్రయాణం
- ట్రాఫిక్ లో కదులుతున్న కారు
- స్టేషన్ లోకి వస్తున్న రైలు
- ఎత్తు నుండి దొర్లుతున్న రాయి
ప్రశ్న 7.
రాకెట్ యొక్క చలనం వేగవంతమైన చలనం అని మీ స్నేహితుడు మీకు చెప్పారు. మీరు అంగీకరిస్తారా? వస్తువు యొక్క చలనం నెమ్మదిగా ఉందా లేదా వేగంగా ఉందా అని మీరు ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
- రాకెట్ చాలా వేగంతో ప్రయాణిస్తుంది. దాని వేగం సెకను సుమారు 12 కి.మీ. ఉంటుంది. ఇది అద్భుతమైన వేగం.
- ఒక వస్తువు యొక్క చలనము నెమ్మదిగా ఉందో వేగంగా ఉందో నిర్ణయించటానికి అది ప్రయాణించిన దూరం, అందుకు పట్టిన సమయం ఆధారంగా నిర్ణయించవచ్చు.
- ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరాన్ని దాని వడిగా పిలుస్తారు.
- వడి = ప్రయాణించిన మొత్తం దూరం / ప్రయాణించిన కాలం.
- దీనికి ప్రమాణాలు మీటర్/ సెకన్ లేదా కిలోమీటరు / గంట.
- 1 కిలోమీటరు / గంట = 5/18 మీటర్/ సెకన్.
- వస్తువు యొక్క వడి ఆధారంగా అది వేగంగా ప్రయాణిస్తుందా లేదా నెమ్మదిగా ప్రయాణిస్తుందా అని నిర్ధారించవచ్చు.
- వస్తువు యొక్క వేగాన్ని సూచించటానికి వాహనాలలో స్పీడో మీటరు ఉంటుంది.
ప్రశ్న 8.
కాలాన్ని కొలవడంలో లేదా అంచనా వేయడంలో గడియారాలు మరియు వాచను మీరు ఏవిధంగా అభినందిస్తారు?
జవాబు:
కాలం ఒక అద్భుతం
దాన్ని కొలవగలగటం మహా అదృష్టం
అందుకు ఉందిగా గడియారం
తెలుపుతుంది నీకది సమయం
చేయకు నీవు కాలాన్ని దుబారా
విలువ తెలిసిన జీవితం అమూల్యం
7th Class Science 5th Lesson చలనం – కాలం InText Questions and Answers
7th Class Science Textbook Page No. 137
ప్రశ్న 1.
అన్ని వస్తువుల కదలికలు ఒకే విధమైనవా?
జవాబు:
కాదు. వస్తువుల చలనం ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది.
ప్రశ్న 2.
వస్తువులు కదిలేలా, కదిలే వస్తువు విరామస్థితికి వచ్చేలా చేసేది ఏమిటి?
జవాబు:
బలం వస్తువులను కదిలేలా, కదిలే వస్తువు విరామ స్థితికి వచ్చేలా చేస్తుంది.
ప్రశ్న 3.
రైలు సరళరేఖ వెంబడి కదిలితే ఆ చలనాన్ని ఏమంటారు?
జవాబు:
రైలు సరళరేఖ వెంబడి కదిలితే ఆ చలనాన్ని స్థానాంతర చలనం అంటారు.
ప్రశ్న 4.
పక్షులు చలించే దిశ, వాటి రెక్కల కదలిక ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
లేదు. పక్షులు ముందుకు కదులుతూ స్థానాంతర చలనం చూపితే, వాటి రెక్కలు పైకి క్రిందకు కదులుతూ కంపన చలనం చూపుతాయి.
7th Class Science Textbook Page No. 149
ప్రశ్న 5.
ఒక వస్తువు ఏక కాలంలో స్థానాంతర మరియు భ్రమణ చలనం రెండింటిని కల్గి ఉంటుందా? వివరించండి.
జవాబు:
సైకిల్ ఒక సరళరేఖలో కదులుతున్నప్పుడు దాని చక్రం చలనాన్ని పరిశీలించండి.
సరళరేఖా మార్గంలో కదులుతున్న సైకిల్ టైర్ యొక్క చలనాన్ని మీరు పరిశీలిస్తే ఆ టైర్ లోని అన్ని భాగాలు ఒకే మార్గంలో కదులుతున్నాయి. అందువల్ల అది స్థానాంతర చలనంలో ఉందని చెప్పవచ్చు.
గుండ్రంగా తిరుగుతున్న సైకిల్ టైరును మీరు గమనిస్తే అది దాని అక్షం పరంగా వక్రమార్గంలో (వృత్తాకారం) కదులుతుంది. కాబట్టి సైకిల్ టైరు భ్రమణ చలనంలో ఉందని చెప్పవచ్చు.
సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తున్న సైకిల్ టైరు స్థానాంతర చలనము మరియు భ్రమణ చలనాన్ని కలిగి ఉంటుంది.
7th Class Science Textbook Page No. 153
ప్రశ్న 6.
సగటు వడిని ఎలా లెక్కిస్తారు?
జవాబు:
సగటు వడి వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం మరియు పట్టిన కాలముల నిష్పత్తితో లెక్కిస్తారు.
7th Class Science Textbook Page No. 155
ప్రశ్న 7.
ఏ భారతీయ సంస్థ రాకెట్ కొరకు పని చేస్తుంది?
జవాబు:
ISRO సంస్థ భారతదేశంలో రాకెట్ల కొరకు పనిచేస్తుంది.
7th Class Science Textbook Page No. 159
ప్రశ్న 8.
వాతావరణ నివేదికలు ఎలా తయారుచేయగల్గుతున్నారు?
జవాబు:
- కృత్రిమ ఉపగ్రహాల ద్వారా శాస్త్రవేత్తలు భూవాతావరణాన్ని అధ్యయనం చేస్తారు.
- ఉపగ్రహాలు అందించే ఈ సమాచారాన్ని విశ్లేషించి ఒక ప్రాంత వాతావరణాన్ని, వర్షపాతాన్ని, తేమను అంచనా వేయగలరు.
- వీటితోపాటు తుపానుల రాక, వాటి గమనాన్ని నిశితంగా పరిశీలించగలరు.
ప్రశ్న 9.
గూగుల్ మ్యాప్స్ మార్గాలను ఎలా ఇవ్వగల్గుతున్నాయి?
జవాబు:
- గూగుల్ మ్యాప్స్ అనేవి, మార్గాలను చూపించే అంతర్జాల వేదికలు.
- ఇవి శాటిలైట్ అందించే చిత్రాలను మన స్థానాలను మ్యాపింగ్ చేసి కృత్రిమ మేథ ద్వారా మార్గాలను చూపుతాయి.
ప్రాజెక్ట్ పనులు
7th Class Science Textbook Page No. 163
ప్రశ్న 1.
ఒక టెన్నిస్ బంతి లేక క్రికెట్ బంతిని స్థానాంతర, భ్రమణ మరియు డోలన చలనాలు చేయించండి. దానిపై ఒక నోట్స్ వ్రాసి మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:
- ఒక క్రికెట్ బంతిని తీసుకొని దూరంగా ఉన్న మా స్నేహితునికి క్యాచ్ విసిరేసాను – ఇది స్థానాంతర చలనాన్ని సూచిస్తుంది.
- అదే బంతిని గుండ్రంగా తిప్పుతూ చేతి వ్రేళ్ళపై నిలబెట్టటానికి ప్రయత్నించాను – ఇది భ్రమణ చలనాన్ని సూచిస్తుంది.
- క్రికెట్ బంతిని నేలపై దొర్లే విధంగా మిత్రుని వైపుకి విసిరాను. ఇది భ్రమణ మరియు స్థానాంతర చలనాలను చూపుతుంది.
- బంతిని ఒక త్రాడుకు కట్టి అటూ ఇటూ ఊపాను. ఇది డోలన చలనాన్ని సూచిస్తుంది.
ప్రశ్న 2.
నీటి గడియారం లేదా ఇసుక గడియారం తయారు చేసి, కాలాన్ని తెలుసుకోవడానికి దాన్ని ఉపయోగించండి.
జవాబు:
- రెండు గాజు సీసాలను తీసుకొని వాటి మూతలకు సన్నని రంధ్రము చేశాను.
- సన్నని ఇసుకను తీసుకొని ఒక బాటిల్ లో పోసాను.
- రెండు బాటిలకు మూతలు పెట్టి వాటి రంధ్రాలు కలిసే విధంగా అతికించాను.
- ఇప్పుడు ఇసుక ఉన్న బాటిలను పైకి తిప్పి బోర్లించినపుడు సన్నని రంధ్రం ద్వారా ఇసుక క్రింది బాటిల్ లోనికి చేరటం ప్రారంభించింది.
- మొత్తం ఇసుక పై నుండి కిందకు కారటానికి పట్టే సమయం కొలిచాను.
- బాటిల్ ఇసుకను చేర్చటం లేదా కొంత తొలగించటం ద్వారా నిర్దిష్ట కాలాన్ని కొలిచే ఇసుక గడియారం తయారుచేయవచ్చు.
కృత్యాలు
కృత్యం – 1
ప్రశ్న 1.
కొన్ని వస్తువులను చలనము మరియు విరామస్థితి ఆధారంగా వర్గీకరించే ఒక కృత్యమును చేద్దాం.
విరామస్థితిలో ఉన్న వస్తువులు | చలనంలో ఉన్న వస్తువులు |
జవాబు:
విరామస్థితిలో ఉన్న వస్తువులు | చలనంలో ఉన్న వస్తువులు |
1. బల్ల | 1. సీతాకోక చిలుక |
2. ఇల్లు | 2. పక్షి |
3. సంచి | 3. రంగుల రాట్నం |
కృత్యం – 2
ప్రశ్న 2.
ఒక ఫుట్ బాల్ తీసుకోండి, మీ స్నేహితులతో మీ స్కూలు గ్రౌండకు వెళ్లండి. పటంలో చూపించిన విధంగా త్రిభుజాకారంలో నిలబడండి. బంతిని మీ దిశలో తన్నమని మీ స్నేహితుడిని అడగండి. మీరు బంతిని మరో స్నేహితుడి వైపుకు అందించడానికి ప్రయత్నించండి. ఆ బంతిని ఆపమని అతడికి చెప్పండి. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
మీ స్నేహితుడు బంతిని కదిలించటానికి దానిపై ఏం ప్రయోగించాడు?
జవాబు:
బలం
ఆ బంతి దిశను మార్చటానికి నీవు దానిపై ఏం ప్రయోగించావు?
జవాబు:
బలం
మీ స్నేహితుడు కదులుతున్న ఐంతిని ఆపడానికి దానిపై ఏం ప్రయోగించాడు ?
జవాబు:
బలం.
బలాన్ని ఎలా నిర్వచించవచ్చు?
జవాబు:
వస్తువు గమన స్థితి నుండి. నిశ్చల స్థితికి, నిశ్చల స్థితి నుండి గమన స్థితికి, దాని దిశను మార్చటానికి తోడ్పడునది బలం.
కృత్యం – 3
ప్రశ్న 3.
దూరం మరియు గమ్యస్థానంను వివరించడానికి ఏదైనా కృత్యంను నిర్వహించండి.
జవాబు:
మీ స్కూలులో మధ్యాహ్న భోజనమును వడ్డించే స్థలానికి, మీ బెంచ్ కి మధ్య దూరాన్ని లెక్కించడానికి ప్రయత్నించండి. దాని విలువ ఎంత?
మీ గమ్యస్థానం యొక్క దూరం మరియు దిశను తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాపన్ను ఉపయోగించారా ?
ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ స్వస్థలం నుంచి జిల్లా కేంద్రానికి మధ్య దూరాన్ని తెలుసుకోండి. దాని విలువ ఎంత?
జవాబు:
……………. కి.మీ. (సూచన : విద్యార్థి ఈ కృత్యంను స్వయంగా నిర్వహించాలి)
చిత్రాన్ని పరిశీలించండి. కవిత తన స్కూలుకు రెండు విధాలుగా చేరుకోవచ్చు. A, B రోడ్లలో ఏ మార్గం ద్వారా ఆమె స్కూలుకు త్వరగా చేరుకోవడానికి ఏ మార్గాన్ని మీరు సూచిస్తారు?’ మీరు తక్కువ దూరం కలిగిన మార్గమైన రోడ్డు Aను సూచిస్తారు కదా.
పై కృత్యం, ఉదాహరణల ద్వారా ఒక వస్తువు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించినప్పుడు, ఆ మార్గం పొడవును కొలవవచ్చు. అది ఆ రెండు స్థానాల మధ్య గల దూరం అవుతుంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వస్తువు సరళరేఖా మార్గంలో ప్రయాణించినప్పుడు, అది త్వరగా చేరుకుంటుంది. సరళరేఖ మార్గం , యొక్క పొడవు రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరం. దీనిని స్థానభ్రంశం అంటారు.
కృత్యం – 4
ప్రశ్న 4.
మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సహాయంతో 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించండి. ప్రతి విద్యార్థి పరుగుపందెం పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని లెక్కించడం కొరకు మొబైల్ ఫోన్ లో స్టాప్ వాచ్ ను లేదా ప్రయోగశాలలోని స్టాప్ వాచ్ ను ఉపయోగించండి. కింద ఇవ్వబడిన పట్టికను నింపండి.
జవాబు:
విద్యార్ధి పేరు | పరుగుపందెం పూర్తి చేయటానికి పట్టే కాలం |
1. వివేక్ | 50 సెకనులు |
2. లిఖిత | 1 నిముషం 10 సెకనులు |
3. రాము | 46 సెకనులు |
4. ప్రకాష్ | 58 సెకనులు |
5. సీత | 1 నిముషం |
6. ఆచారి | 1 నిముషం 3 సెకనులు |
కృత్యం – 5
ప్రశ్న 5.
రాబర్ట్ మరియు కమల వారి పాఠశాలకి వచ్చేటప్పుడు వారు ప్రయాణించిన దూరం, అందుకు పట్టిన సమయము లెక్కించారు. ఆ దత్తాంశము ఈ క్రింద పట్టికలో చూపబడినది.
జవాబు:
కాలం (నిమిషాలు) | దూరం (మీ) |
1. 0 | 0 |
2. 1 | 100 |
3. 2 | 200 |
4. 3 | 300 |
5. 4 | 400 |
6. 5 | 500 |
కింద చూపిన దశలను అనుసరించి మీరు అను గీయవచ్చు:
- రెండు అక్షాలను సూచించడానికి రెండు లంబ రేఖలను గీయండి. వాటిని OX, OYగా గుర్తించండి. OXను కాలం అక్షంగాను, OYను దూరం అక్షంగాను గుర్తించండి.
- గ్రాఫ్ పేపర్ మీద దూరాన్ని మరియు కాలాన్ని సూచించడానికి స్కేల్‌ను ఎంచుకోండి.
కాలం : 1 నిమిషం = 1 సెం. మీ.
దూరం : 100 మీ. = 1 సెం. మీ. - మీరు ఎంచుకున్న స్కేల్ ప్రకారం సంబంధిత అక్షాలపై దూరం, కాలం విలువలను గుర్తించండి.
- ప్రతి జత విలువను సూచించడానికి బిందువులను గుర్తించి, వాటిని కలపండి. ఇది ఇవ్వబడిన చలనానికి దూరం – కాలం ను సూచిస్తుంది.
- దూరం – కాలం గ్రాఫ్ సరళరేఖ అయితే, వస్తువు స్థిరమైన వడితో కదులుతున్నట్లు సూచిస్తుంది. వస్తువు, యొక్క వడి మారుతూ ఉంటే, గ్రాఫ్ సరళ రేఖ కాకుండా ఏదైనా ఇతర ఆకారంలో ఉంటుంది.
- దూరం కాలం గ్రాఫ్ నుండి ఏ సమయంలోనైనా వస్తువు ప్రయాణించిన దూరాన్ని మనం కనుగొనవచ్చు.