AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

SCERT AP 7th Class Social Study Material Pdf 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం

7th Class Social 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 1
పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిత్రంలో నీవేమి గమనించావు?
జవాబు:
చిత్రంలో ప్రభుత్వం ద్వారా కట్టించబడిన ఇళ్ళు ఒకే మాదిరిగా ఉన్న ఇళ్లు, సౌర దీపాలు, మంచినీటి రిజర్వాయరు, ప్రభుత్వ పాఠశాల, వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, పిల్లల వినోదానికి ఉద్యానవనం గమనించాను.

ప్రశ్న 2.
చిత్రంలో ఏ ప్రజా సౌకర్యాలను గమనిస్తున్నావు?
జవాబు:
విద్యుత్, పారిశుద్ధ్య, విద్య, వినోద, మంచినీటి సౌకర్యాలను గమనించాను.

ప్రశ్న 3.
ఈ ప్రజా సౌకర్యాలను ఎవరు కల్పిస్తారు?
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వం ఈ సౌకర్యాలను కల్పిస్తుంది.

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
ప్రభుత్వం అంటే ఏమిటి?
జవాబు:
ప్రభుత్వమనేది రాజ్యం యొక్క ఒక లక్షణం. ఒక చట్టపరమైన నిర్మితి లేదా వ్యవస్థ.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి.

ప్రశ్న 1.
స్థానిక ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:

  1. రాష్ట్ర ప్రభుత్వమునకు అధికారాలు రాజ్యాంగబద్దంగా, (రాజ్యాంగంలో) పొందుపరచబడ్డాయి. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత చేస్తాయి.
  2. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం అంతటికి వర్తించే చట్టాలు చేస్తాయి. స్థానిక ప్రభుత్వాలు అలా చేయలేవు, వాని పరిధి చాలా తక్కువ.
  3. రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేయగలవు. స్థానిక ప్రభుత్వాలు చేయలేవు.

ప్రశ్న 2.
నియోజక వర్గం అంటే ఏమిటి?
జవాబు:
అక్కడ నివసిస్తున్న ఓటర్లు అందరూ (బృందం) చట్ట సభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఒక నిర్దిష్ట ప్రాంతంను నియోజక వర్గం అంటారు.

ప్రశ్న 3.
ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, ముఖ్యమంత్రి ఎలా అవుతారు? వివరించండి.
జవాబు:
సాధారణ ఎన్నికల తరువాత, మెజారిటీ పార్టీ లేక సంకీర్ణ పార్టీల నాయకుణ్ణి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నరు ఆహ్వానిస్తారు. గవర్నరు ముఖ్యమంత్రిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాక, ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

ప్రశ్న 4.
ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులను ఎవరు నియమిస్తారు?
జవాబు:
ముఖ్యమంత్రిని మరియు ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని గవర్నర్ నియమిస్తారు.

ప్రశ్న 5.
మీరు శాసనసభ సభ్యుడి MLAగా ఎన్నికైనట్లయితే, మీ నియోజక వర్గం కోసం మీరు ఏమి చేస్తారు?
జవాబు:
నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనట్లయితే, మా నియోజక వర్గ ప్రజల కోసం క్రింది పనులు చేస్తాను.

  1. చట్టసభకు కచ్చితంగా హాజరవుతాను. మా నియోజక వర్గ సమస్యలను అక్కడ చర్చిస్తాను.
  2. అందరికి అన్ని ప్రాంతాలకు త్రాగునీరు అందేలా చేస్తాను.
  3. అందరికి అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూస్తాను.
  4. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ చేస్తాను.
  5. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మురుగునీటి కాల్వల నిర్మాణం, నిర్వహణ చేస్తాను.
  6. నియోజకవర్గంలోని ప్రజలందరికీ రేషన్, పించను అందేలా చూస్తాను.
  7. ప్రభుత్వం చేసిన చట్టాలను సక్రమంగా అమలయ్యేలా చూస్తాను.
  8. శాంతి భద్రతలు కాపాడేలా చూస్తాను, ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను.

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
బిల్లును గవర్నర్ ఆమోదించకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
రాష్ట్ర ఉభయ సభలైన శాసన సభ మరియు శాసన మండలిలో ఒక బిల్లు మెజారిటీ సభ్యుల యొక్క ఆమోదం పొంది గవర్నర్ ఆమోదానికి చేరితే, సదరు బిల్లు ఆర్థిక బిల్లు కాకపోతే గవర్నర్ దానిని పునఃపరిశీలనకుగాను చట్ట సభలకు పంపవచ్చును. తరువాత చట్ట సభలు మరల ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపితే ఈసారి కచ్చితంగా గవర్నరు ఆమోదించి తీరాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 దీని గురించి వివరిస్తుంది.

ప్రశ్న 7.
రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాల పేర్లు రాయండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని విభాగాల పేర్లు :

1. డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్31. డిపార్ట్ మెంట్ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్
2. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్32. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ
3. డిపార్ట్ మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్33. డిపార్ట్ మెంట్ ఆఫ్ హౌసింగ్
4. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ & జియాలజి34. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ & టెక్స్ టైల్స్
5. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం35. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలెప్ మెంట్
6. డిపార్ట్మెంట్ ఆఫ్ వుమెన్స్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్36. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, ఎంప్లాయిమెంట్ & డెవలెప్ మెంట్
7. డిపార్ట్ మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్37. డిపార్ట్ మెంట్ ఆఫ్ లా
8. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హజ్బండరీ, డెయిరీ డెవలెప్మెంట్38. డిపార్ట్ మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్
9. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్39. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్
10. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిషరీస్40. డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్
11. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీ కల్చర్41. డిపార్ట్మెంట్ ఆఫ్ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్
12. డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్42. డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూస్
13. డిపార్ట్ మెంట్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్43. డిపార్ట్ మెంట్ ఆఫ్ రోడ్ & బిల్డింగ్స్
14. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్44. డిపార్ట్ మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్
15. డిపార్ట్ మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్45. డిపార్ట్ మెంట్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్
16. డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్46. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
17. డిపార్ట్ మెంట్ ఆఫ్ మార్కెటింగ్47. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమీషన్
18. డిపార్ట్ మెంట్ ఆఫ్ సెరికల్చర్48. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమీషన్
19. డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్49. ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ కమీషన్
20. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్50. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమీషన్
21. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్51. ఆంధ్రప్రదేశ్ వుమెన్ కమీషన్
22. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్స్52. ఆంధ్రప్రదేశ్ కమీషన్ ఫర్ SC & STS
23. డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రెజరీస్ & అకౌంట్స్53. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమీషన్
24. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆడిట్54. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB)
25. డిపార్ట్ మెంట్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్55. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్
26. డిపార్ట్ మెంట్ ఆఫ్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్56. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పోరేషన్
27. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్57. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్
28. డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రోటోకాల్58. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ ఫ్యాక్టరీస్
29. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్59. ఆంధ్రప్రదేశ్ TRANSCO
30. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్60. ఆంధ్రప్రదేశ్ GENCO

ప్రశ్న 8.
లోక్ అదాలత్ గురించి రాయండి.
జవాబు:
ప్రజా న్యాయస్థానం (లోక్ అదాలత్) :

  1. ఇది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో ఒకటి.
  2. ఇది న్యాయస్థానంలో లేదా ప్రీ-లిటిగేషన్ స్థితిలో పెండింగ్ లో ఉన్న వివాదాలు / కేసులు స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే / రాజీపడే వేదిక.
  3. లోక్ అదాలతకు, లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ – 1987 ప్రకారం చట్టబద్ధమైన హోదా ఇవ్వబడింది.
  4. సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు నురియు చిన్న నేరాలకు సంబంధించిన కేసులను ప్రధానంగా లోక్ అదాలత్ కు సూచిస్తారు.

ప్రశ్న 9.
జిల్లా కలెక్టర్ విధులను ఒక పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:
రెవెన్యూ పాలన

  1. భూమి శిస్తు వసూలు.
    రెవెన్యూ రికార్డుల నిర్వహణ పర్యవేక్షణ.
  2. వ్యవసాయ గణాంక సేకరణ.
  3. బంజరు భూముల విస్తీర్ణం అంచనా,
  4. పబ్లిక్ ఎస్టేట్స్ నిర్వహణ మొదలైన రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ.

మెజిస్త్రీయల్ అధికారాలు

  1. అల్లర్లు సంభవించినపుడు నిషేధాజ్ఞల విధింపు.
  2. సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ.
  3. పోలీసు స్టేషన్ల తనిఖీ.
  4. ఖైదీలకు కనీస సదుపాయాల కల్పన.
  5. కార్మిక సమస్యల పరిష్కారం.
  6. వార్తాపత్రికల ప్రారంభానికి అనుమతివ్వడం.
  7. పేలుడు పదార్థాల తయారీకి, పెట్రోలు బంకులు, సినిమా హాళ్ళ నిర్మాణానికి NOC జారీ చేయుట మొదలైనవి.

ఎన్నికల పర్యవేక్షణ అధికారం

  1. జిల్లా స్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తాడు.
  2. ఓటర్ల జాబితా తయారీ, సవరణ, తుది జాబితా ప్రకటన మొ|| విధుల పర్యవేక్షణ.
  3. రిటర్నింగ్ అధికారుల నియామకం.
  4. జిల్లా సహకార బ్యాంకులు, పాల కేంద్రాలు, నీటి వినియోగ సంఘాలు మొదలైన సంస్థల్లో ఎన్నికల నిర్వహణ.
  5. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షణ చేయుట.

ప్రకృతి ఉపద్రవాలను

  1. తుఫానులు, వరదలు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడం సంభవించినపుడు కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తాడు. (డిజాస్టర్ మేనేజ్ మెంట్)
  2. ఉపశమన, సహాయక చర్యలు చేపడతాడు. అభివృద్ధి కార్యక్రమాల అమలు
  3. వివిధ అధికారుల మధ్య సమన్వయ కార్యకర్తగా వ్యవహరిస్తారు.
  4. జిల్లాలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాడు.
  5. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వాహకులతో సమీక్షించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించేలా చేయడం.
  6. జిల్లాలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేటట్లు చూస్తాడు.

జనాభా లెక్కలు

  1. కలెక్టరు జిల్లా స్థాయిలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా వ్యవహరిస్తాడు.
  2. జిల్లాలో జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకొంటాడు.
  3. అలాగే జిల్లాలో పాడి గేదెలు, పెంపుడు జంతువులు, ఫల వృక్షాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తారు.

వివిధ పథకాలకు అధ్యక్షులు

  1. కుటుంబ సంక్షేమం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్యం పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తారు.
  2. MGNREGA అమలుకు కృషి.
  3. SSA, DRDA మొదలగు పథకాలు అమలు.

స్థానిక సంస్థల పర్యవేక్షణ

  1. జిల్లాలోని స్థానిక సంస్థల సమావేశాలకు కలెక్టరు పదవీరిత్యా సభ్యుడిగా, శాశ్వత ఆహ్వానితుడి హోదాలో పాల్గొంటాడు.
  2. జిల్లా పరిషత్తు సమావేశాలను ఏర్పాటు చేస్తాడు.
  3. ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారి (Special Officer) గా వ్యవహరిస్తాడు.

ఇతర అధికారాలు

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సమీక్ష జరపడం.
  2. నీటి పారుదల వసతుల కల్పన.
  3. ట్రెజరీలపై పర్యవేక్షణ.
  4. కేంద్ర ప్రభుత్వ శాఖల విధుల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం.
  5. నిత్యావసర వస్తువుల సక్రమ సరఫరా.
  6. శాంతిభద్రతలపై పర్యవేక్షణ.
  7. ముఖ్య ప్రోటోకాల్ అధికారిగా వ్యవహరించడం.
  8. జిల్లాలోని అన్ని జిల్లా సంస్థల అధికారులపై పర్యవేక్షణ.

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 10.
శాసన సభ నియోజకవర్గాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 2

ప్రశ్న 11.
జిల్లా అభివృద్ధిలో, జిల్లా కలెక్టర్ పాత్రను ప్రశంసించండి.
జవాబు:
జిల్లా కలెక్టర్, జిల్లా పరిపాలనకు అధిపతి. కేంద్ర ప్రభుత్వం వీరిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఎంపిక చేసి, రాష్ట్రాలకు కేటాయిస్తుంది. రెవెన్యూ (భూ రికార్డులు, మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు), శాంతిభద్రతల నిర్వహణ మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం, స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ (విపత్తుల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం మరియు నష్టాన్ని నివారించడం లేక తగ్గించడం), మరియు ఎన్నికల విధులు (జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం) మొదలగు వాటిని, జిల్లాలో వివిధ విభాగాల బాధ్యతను ఆయన తీసుకోవాలి.

ప్రశ్న 12.
ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.
జవాబు:

  1. నేటి ఆధునిక దేశాలన్నీ దాదాపు ప్రజాస్వామ్య దేశాలే, అవి కూడా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశాలే.
  2. జనాభా ఎక్కువగా ఉన్న ఇలాంటి దేశాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు అసాధ్యం. కనుక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే అమల్లో ఉంది.
  3. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకం. తమ పాలకులను ఎన్నుకొనుట బాధ్యతాయుత పౌర లక్షణం.
  4. ప్రజలందరూ పాలనలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవ్వలేరు కనుక తమ ప్రతినిధులను ఎన్నుకొని పాలనలో పరోక్ష భాగస్వామ్యులవుతారు.

II. సరియైన సమాధానాన్ని ఎంచుకోండి.

1. రాష్ట్ర ప్రభుత్వం అనగా
ఎ) రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు
బి) శాసన సభ
సి) శాసన మండలి
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ

2. భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని?
ఎ) 29
బి) 28
సి) 27
డి) 30
జవాబు:
బి) 28

3. రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ అధికారాలు ఎవరి చేతులలో ఉంటాయి?
ఎ) స్పీకర్
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) పై వారందరూ
జవాబు:
సి) ముఖ్యమంత్రి

4. క్రింది వారిలో ముఖ్యమంత్రి ఎవరు?
ఎ) ప్రతిపక్ష పార్టీ నాయకుడు
బి) మెజారిటీ పార్టీ నాయకుడు
సి) విధానసభ సభ్యుడు
డి) స్పీకర్
జవాబు:
బి) మెజారిటీ పార్టీ నాయకుడు

III. జతపరచండి.

1. ముఖ్యమంత్రి (iv) i) శాసనసభ 2. గవర్నర్ ( iii ) ii) శాసనమండలి 3. ఎమ్.ఎల్.ఎ (i) iii) రాష్ట్రాధినేత 4. ఎమ్.ఎల్.సి (ii) iv) ప్రభుత్వా ధినేత 5. కలెక్టర్ ( v) v) జిల్లా మేజిస్ట్రేట్
జవాబు:

IV.1 దిగువనీయబడిన అంశాలను ఆయా శాఖల వారీగా వేరు చేసి తగిన శీర్షిక క్రింద వ్రాయండి.
స్పీకర్, న్యాయమూర్తి, మంత్రి, శాసనసభ సభ్యుడు, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి

న్యాయశాఖశాసన నిర్మాణ శాఖ

జవాబు:

న్యాయశాఖశాసన నిర్మాణ శాఖ
ప్రధాన న్యాయమూర్తి
న్యాయమూర్తి
న్యాయవాది
స్పీకర్
మంత్రి
శాసనసభ సభ్యుడు

IV. 2 దిగువనీయబడిన అంశాలను ఆయా అంశాల వారీగా వేరు చేసి తగిన శీర్షిక క్రింద వ్రాయండి. 175 మంది సభ్యులు, శాసన సభ సభ్యులు, స్పీకర్, 58 మంది సభ్యులు, 5 సంవత్సరాలు, శాసన మండలి సభ్యులు, 6 సంవత్సరాలు, ఛైర్మన్

అంశంశాసన సభశాసన మండలి
పదవీ కాలం
సభ్యుల సంఖ్య
అధ్యక్షత వహిస్తారు
ప్రజా ప్రతినిధి

జవాబు:

అంశంశాసన సభశాసన మండలి
పదవీ కాలం5 సం||లు6 సం||లు
సభ్యుల సంఖ్య17558
అధ్యక్షత వహిస్తారుస్పీకర్చైర్మన్
ప్రజా ప్రతినిధిశాసనసభ సభ్యులు (MLA)శాసన మండలి సభ్యులు (MLC)

7th Class Social Studies 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం InText Questions and Answers

7th Class Social Textbook Page No.89

ప్రశ్న 1.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన వారి జాబితా తయారుచేయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన వారి జాబితా :

1. శ్రీ సి.ఎమ్. త్రివేది1953-1957
2. శ్రీ భీమ్ సేన్ సచార్1957-1962
3. జనరల్ శ్రీ ఎస్.ఎమ్. శ్రీనగేష్1962-1964
4. శ్రీ పి.ఎ. తనూ పిళ్ళె1964-1968
5. శ్రీ భాండూబాయ్ కసాంజి దేశాయ్1968-1975
6. శ్రీ జస్టిస్ ఎస్. ఓబుల్ రెడ్డి1975-1976
7. శ్రీ మోహన్ లాల్ సుఖడియా1976-1976
8. శ్రీ ఆర్.డి. భండారి1976-1977
9. శ్రీ జస్టిస్ బి.జె. దివాన్1977-1977
10. శ్రీమతి శారదా ముఖర్జీ1977-1978
11. శ్రీ కె.సి. అబ్రహామ్1978-1983
12. శ్రీ రామ లాల్1983-1984
13. డా|| శంకర్‌దయాళ్ శర్మ1984-1985
14. శ్రీమతి కుమ్బున్ మనిష్ జోషి1985-1990
15. శ్రీ కిషన్ కాంత్1990-1997
16. శ్రీ జి. రామానుజన్1997-1997
17. డా|| సి. రంగరాజన్1977-2003
18. శ్రీ సుర్జీత్ సింగ్ బర్నాలా2003-2004
19. శ్రీ సుశీల్ కుమార్ షిండే2004-2006
20. శ్రీ రామేశ్వర్ ఠాకూర్2006-2007
21. శ్రీ నారాయణ్ దత్ తివారి2007-2009
22. శ్రీ ఈ.ఎస్.ఎల్. నరసింహన్2009-2019
23. బిశ్వభూషణ్ హరిచందన్2019

7th Class Social Textbook Page No.91

ప్రశ్న 2.
మీ స్థానిక నియోజకవర్గ శాసనసభ్యున్ని ఇంటర్వ్యూ చేయండి.
జవాబు:
మా నియోజక వర్గం ప్రత్తిపాడు. మా నియోజక వర్గం శాసన సభ్యులు గౌ|| మేకతోటి సుచరిత గారు.
నేను : నమస్కారం MLA గారు.

MLA : నమస్కారం బాబు.

నేను : మేడమ్ మన నియోజక వర్గంలో ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి?

MLA : మన నగరంలో రోడ్ల మరమ్మతు, పాఠశాలల పునర్నిర్మాణం (MBNN), మరమ్మతుల నిర్వహణ, నగరంలో ప్రధాన రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానించే ప్రక్రియలో భాగంగా రోడ్లను వైడెన్ చేయడం, అన్ని కాలనీలకు త్రాగునీటి సౌకర్యం కల్పించటం మొదలైనవి.

నేను : చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మేడమ్, అలాగే ప్రభుత్వ పథకాలు అన్నీ లబ్దిదారులకు సక్రమంగా చేరటానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు.

MLA : BPL దిగువన ఉన్న వారందరికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నాం……
(ఈ విధంగా విద్యార్థులు తమ MLA ని ఇంటర్వ్యూ చేయండి)

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

7th Class Social Textbook Page No.93

ప్రశ్న 3.
మీ జిల్లాలోని నియోజక వర్గాల జాబితా తయారు చేయండి.
జవాబు:
మాది గుంటూరు జిల్లా, నియోజక వర్గాల జాబితా :

  1. పెదకూరపాడు,
  2. తాడికొండ,
  3. మంగళగిరి,
  4. పొన్నూరు,
  5. వేమూరు,
  6. రేపల్లె,
  7. తెనాలి,
  8. బాపట్ల,
  9. ప్రత్తిపాడు,
  10. గుంటూరు వెస్ట్,
  11. గుంటూరు ఈస్ట్,
  12. నర్సరావుపేట,
  13. చిలకలూరిపేట,
  14. సత్తెనపల్లి,
  15. వినుకొండ,
  16. గురజాల,
  17. మాచర్ల

ప్రశ్న 4.
మీ తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డును పరిశీలించి, నీ అన్ని వివరాలతో నమూనా ఓటరు కార్డును తయారు చేయండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం 3

7th Class Social Textbook Page No.97

ప్రశ్న 5.
మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల యొక్క జాబితాను తయారుచేయండి.
జవాబు:
మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు:

  1. అక్రమ రవాణా నిరోధక చట్టం (1956) సవరణ 2006
  2. వరకట్న వేధింపుల చట్టం – 1961
  3. గృహ హింస నుండి మహిళా రక్షణ చట్టం – 2005
  4. బాల్య వివాహాల నిషేధ చట్టం – 2006
  5. నిర్భయ చట్టం – 2013
  6. లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013
  7. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం (ట్రిపుల్ తలాక్) – 2019.

7th Class Social Textbook Page No.99

ప్రశ్న 6.
ముఖ్యమంత్రిని వాస్తవ, రాష్ట్ర ప్రభుత్వాధినేత అని ఎందుకు అంటారు? తరగతిలో చర్చించండి మరియు కారణాల జాబితా తయారుచేయండి.
జవాబు:
ముఖ్యమంత్రిని వాస్తవ, రాష్ట్ర ప్రభుత్వాధినేత అనటానికి కారణాలు :

  1. ఎన్నికలలో (అత్యధిక) మెజారిటీ ప్రజల ఆదరణ పొందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం.
  2. రాజ్యాంగ గవర్నర్ నామమాత్రపు అధికారిగా, ముఖ్యమంత్రి వాస్తవ అధికారిగా రూపకల్పన చేయటం.
  3. మనది పార్లమెంటరీ వ్యవస్థ (కేంద్ర స్థాయిలో) అలాగే రాష్ట్రంలో శాసనసభలో మెజారిటీ సీట్లు సాధించిన వారు తమలో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరుగుతుంది.

ఆలోచించండి ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.89

ప్రశ్న 1.
ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్ ఎవరు?
జవాబు:
విశ్వభూషణ్ హరిచందన్.

7th Class Social Textbook Page No.91

ప్రశ్న 2.
మీ శాసనసభ నియోజక వర్గం నుండి మీరు పోటీ చేసినట్లయితే, మీ ఎన్నికల మ్యానిఫెస్టో ఏవిధంగా ఉంటుంది?
జవాబు:
నా ఎన్నికల మ్యానిఫెస్టో :

  1. రైతులందరికి పంట వేసుకోవడానికి వడ్డీరహిత రుణాలు, కొంత పెట్టుబడి ఉచితం.
  2. కార్మికులందరికి ఉచిత నివాసాలు.
  3. త్రాగునీటి సమస్య (ఏ కాలంలోను) లేకుండా చేయటం.
  4. నిరుద్యోగులందరికి స్వయం ఉపాధి ఏర్పాటు, ఆసక్తి కల వారికి ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.
  5. నియోజక వర్గంలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టుట.
  6. నియోజక వర్గంలో సాగు నీటి కాల్వల నిర్మాణం నిర్వహణ చేపట్టుట మొదలైనవి.
  7. ప్రజలందరికి ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి తేవటం.

7th Class Social Textbook Page No.95

ప్రశ్న 3.
ఎ) మీ అసెంబ్లీ నియోజకవర్గం ఏది?
జవాబు:
ప్రత్తిపాడు.

బి) మీ నియోజక వర్గ ప్రస్తుత శాసనసభ సభ్యుని పేరేమిటి?
జవాబు:
ఉదాహరణకి :

  1. మా నియోజక వర్గం ప్రత్తిపాడు.
  2. మా నియోజక వర్గం శాసన సభ్యులు గౌ|| మేకతోటి సుచరితగారు.

7th Class Social Textbook Page No.97

ప్రశ్న 4.
ఏదైనా ఒక సభ బిల్లును ఆమోదించకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
వివిధ సందర్భాలలో ఒక సభ బిల్లును ఆమోదించకపోతే జరుగు పరిణామాలు.
సందర్భం 1 – ద్విసభా విధానంలో శాసనసభలో బిల్లు ఆమోదింపబడి, శాసన మండలిలో బిల్లు ఆమోదించక పునఃపరిశీలనకు పంపితే మరల శాసనసభ సవరించి తిప్పి పంపుతుంది. అప్పుడు కూడా ఎగువ సభ ఆమోదించకపోతే ప్రతిస్తంభన ఏర్పడుతుంది.

సందర్భం 2 – శాసన సభలోనే బిల్లు ఆమోదం పొందకపోతే, అంటే బిల్లు వీగిపోతే ప్రభుత్వం పడిపోయే అవకాశం కలదు. (అది ప్రభుత్వ బిల్లు అయితే) ప్రయివేటు బిల్లు వీగిపోయినా ఏమీ కాదు.

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

7th Class Social Textbook Page No.99

ప్రశ్న 5.
మీకు మంత్రి పదవి పొందే అవకాశం వస్తే, మీకు ఏ శాఖ ఎక్కువ ఇష్టం ? మీరు ఏయే విధానాలను అమలు చేస్తారు?
జవాబు:
నాకు మంత్రి పదవి పొందే అవకాశం వస్తే నేను ‘విద్యాశాఖ’ను ఇష్టపడతాను.

  1. ఉచిత విద్యా విధానం అమలుచేస్తాను.
  2. ఉచిత పుస్తకాల పంపిణీ, స్కాలర్షిన్లను అందిస్తాను.
  3. భావితరాలకు బంగారు బాట వేసేది విద్యే.
  4. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి విద్యా విధానాలు అమలుచేస్తాను.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.87

ప్రశ్న 1.
సమాఖ్యవ్యవస్థ గురించి మరింత సమాచారాన్ని మీ ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకోండి.
జవాబు:
ప్రభుత్వాధికారాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయితే దానిని సమాఖ్య వ్యవస్థ అనవచ్చు.

సమాఖ్య లక్షణాలు:
1) రెండు స్థాయిలలో ప్రభుత్వాలు :
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో సర్వసత్తాకమైన వేర్వేరు ప్రభుత్వాలుంటాయి.

2) అధికార విభజన :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. జాతీయ ప్రాధాన్యం ఉన్న దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలా, రవాణా మొదలైనవి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.

3) లిఖిత రాజ్యాంగం :
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలను నిర్ణయించి, నిర్దేశించేది లిఖిత రాజ్యాంగమే.

4) దృఢ రాజ్యాంగం :
కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని ఏకపక్షంగా రాజ్యాంగాన్ని మార్చలేవు.

5) రాజ్యాంగ ఆధిక్యత :
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగమే అత్యున్నతమైన శాసనం. రాజ్యాంగం వీధించే పరిమితులకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను చెలాయిస్తాయి.

6) స్వతంత్ర న్యాయశాఖ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించి, సమాఖ్యను సరిగ్గా నడిపించడానికి, రాజ్యాంగం ఆధిక్యాన్ని పరిరక్షించడానికి స్వతంత్ర ప్రతిపత్తి, సర్వాధికారాలు ఉన్న ఒక ఉన్నత న్యాయవ్యవస్థ ఉంటుంది.

7) ద్వంద్వ పౌరసత్వం :
సమాఖ్య రాజ్యాల్లో పౌరులకు రెండు పౌరసత్వాలు ఉంటాయి. అవి
1) వారి రాష్ట్ర పౌరసత్వం,
2) దేశ పౌరసత్వం. కాని భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే ఉంది. అదే దేశ పౌరసత్వం.

7th Class Social Textbook Page No.93

ప్రశ్న 2.
రహస్య ఓటింగ్ విధానం గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. ఎన్నికల ప్రక్రియలో రహస్య ఓటింగ్ విధానం అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశం. ఓటరు తన ఓటు హక్కును రహస్యంగా (ఎవ్వరు చూడకుండునట్లుగా) వినియోగించుకోవటమే రహస్య ఓటింగ్.
  2. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాపూరిత, భయరహిత వాతావరణంలో జరగటానికి ఈ రహస్య ఓటింగ్ సహాయపడుతుంది.
  3. అలాగే ఓటర్లు ప్రలోభ పడకుండా, ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఇది సహకరిస్తుంది.
  4. ఎన్నికల సందర్భంలో ఓటరు తన ఓటు హక్కును రహస్యంగా వినియోగించుకునేట్లు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి సందర్భాలలోనే ఓటరు ఎవ్వరికి భయపడకుండా తన ఓటును తనకు నచ్చిన వారికి వేసుకుంటాడు.

7th Class Social Textbook Page No.95

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల సంఖ్య గురించి తెలుసుకోండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల సంఖ్య – 58.

AP Board 7th Class Social Solutions Chapter 10 రాష్ట్ర ప్రభుత్వం

7th Class Social Textbook Page No.103

ప్రశ్న 4.
జిల్లా కలెక్టర్ మేజిస్టీరియల్ అధికారాల గురించి తెలుసుకోండి.
జవాబు:
జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ అధికారాలు :

  1. అల్లర్లు సంభవించినపుడు నిషేధాజ్ఞల విధింపు.
  2. సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ.
  3. పోలీసు స్టేషన్ల తనిఖీ.
  4. ఖైదీలకు కనీస సదుపాయాల కల్పన.
  5. కార్మిక సమస్యల పరిష్కారం.
  6. వార్తా పత్రికల ప్రారంభానికి అనుమతివ్వడం.
  7. పేలుడు పదార్థాల తయారీకి, పెట్రోలు బంకులు, సినిమా హాళ్ళ నిర్మాణానికి NOC జారీ చేయుట మొదలైనవి.