SCERT AP 7th Class Social Study Material Pdf 4th Lesson ఢిల్లీ సుల్తానులు Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Social Solutions 4th Lesson ఢిల్లీ సుల్తానులు
7th Class Social 4th Lesson ఢిల్లీ సుల్తానులు Textbook Questions and Answers
కింది తరగతులలోని విషయ పునశ్చరణ
పటమును పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు స్పందించండి.
ప్రశ్న 1.
ఇవ్వబడిన పటానికి ఒక శీర్షికను సూచించండి.
జవాబు:
పూర్వ మధ్యయుగం నాటి భారతదేశంలోని రాజ్యాలు.
ప్రశ్న 2.
దక్షిణ భారతదేశంలోని వివిధ రాజ్యాలను గుర్తించి, వాటి జాబితా తయారు చేయండి.
జవాబు:
విజయనగర సామ్రాజ్యం, (కాకతీయ సామ్రాజ్యం), కళింగ రాజ్యము, చోళ రాజ్యము, పాండ్య రాజ్యము, పల్లవ సామ్రాజ్యము మొదలైనవి.
ప్రశ్న 3.
పటంలో ప్రస్తుత కాలానికి చెందిన ఏవేని రెండు నగరాలను గుర్తించండి.
జవాబు:
అమరావతి, పాటలీపుత్ర, బెంగాల్, ప్రయాగ, సాంచి, సారనాథ్ మొదలైనవి.
ప్రశ్న 4.
పటంలో ఢిల్లీని గుర్తించండి. ఢిల్లీ ప్రాధాన్యతను చర్చించండి.
జవాబు:
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరంగా మధ్య యుగం నాటి నుండి ఉంటోంది.
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. క్రింది ప్రశ్నలకు సమాధానం వ్రాయండి.
ప్రశ్న 1.
ఇల్ టుట్ మిష్ ప్రవేశపెట్టిన బందగాన్ పద్ధతి గురించి వ్రాయండి.
జవాబు:
ఇల్ టుట్ మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని ‘బందగాన్’ అని పిలుస్తారు. శత్రువులను అణచివేయడానికి ఇతను నిరంతరం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. శూన్యం నుంచి ప్రారంభం చేసి మహత్తర సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఇల్ టుట్ మిష్ తన సైన్యాన్ని పటిష్ఠపరచుకొనుటకు ఈ ‘బందగాన్’ పద్ధతిని అనుసరించాడు.
ప్రశ్న 2.
క్రింది వాటిని మీకివ్వబడిన భారతదేశ పటంలో గుర్తించండి.
ఎ) ఢిల్లీ
బి) నేపాల్
సి) ఆఫ్ఘనిస్తాన్
డి) దౌలతాబాద్
ఇ) గుజరాత్
జవాబు:
ప్రశ్న 3.
ఢిల్లీ సుల్తానుల పాలనలోని ఐదుగురు పాలకుల చిత్రాలను సేకరించి వారి పాలన గురించి చార్టులో రాయండి.
జవాబు:
1) ఇల్-టుట్ మిష్ (క్రీ.శ. 1211-1236):
కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీని పాలించాడు. ఇతని కాలంలోనే రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చబడింది. ఇతను ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు. ఇతని పాలనలోనే రాజ్యమును ఇకాలను ఏర్పాటు చేసాడు. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసాడు. పర్షియాలో ఈ పద్దతిని బందగాన్ అని పిలుస్తారు. ఇతని కాలంలో చిహల్ గని సర్దారులు కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ సుల్తానుల వాస్తు నిర్మాణానికి గీటు రాయి లాంటి కుతుబ్ మీనార్ నిర్మాణం ప్రారంభించాడు.
2) సుల్తానా రజియా (క్రీ.శ. 1236-1239):
సుల్తానా రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. మహిళా పాలకురాలిగా వజీరులు, చిహల్గనుల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగింది. టర్కీ ప్రభువుల నుండి, స్వంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది.
3) అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1296-1316):
ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తరువాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థులను అణచివేయడానికి, మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్ధవంతమైన గూఢచారి వ్యవస్థను స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంభోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. కాని అతడు చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయినాడు. 1316వ సంవత్సరంలో అతడు మరణించిన వెంటనే శిశోడియాలు దానిని తిరిగి, ఆక్రమించినారు. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత, దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు.
4) ఫియాజుద్దీన్ తుగ్లక్ (క్రీ.శ. 1320-1324):
అల్లా ఉద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఢిల్లీ సింహాసనమధిష్టించెను. ఇతని పాలనాకాలంలో భూమిశిస్తును తగ్గించెను. వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు త్రవ్వించి, అధికోత్పత్తిని సాధించెను. నూతన రహదారులను నిర్మించి, దొంగల బారి నుండి ప్రజలను రక్షించుటకు మార్గ మధ్యమున సైనిక దుర్గములు నిర్మించెను. గుర్రములపై వార్తలను పంపు తపాలా విధానమును ప్రవేశపెట్టెను. ఘియాజుద్దీన్ నిరాడంబర జీవి. ప్రజాహిత సంస్కరణలు గావించి, మంగోలుల దండయాత్రలను విజయవంతముగ ఎదుర్కొని, ఢిల్లీ సుల్తాన్ ఔన్నత్యమునకు ఎటువంటి మచ్చ రాకుండా కాపాడెను.
5) మహ్మద్ బీన్ తుగ్లక్ (క్రీ.శ. 1324-1351):
మహ్మద్ బీన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. ఇతడు తత్వశాస్త్రం, గణితశాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. ఇతడు గొప్ప యుద్ధ వీరుడు మరియు నూతన పరిపాలనా పద్దతులు ప్రవేశపెట్టిన పరిపాలనాదక్షుడు. కాని, నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. మహ్మద్, తురుష్క ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి (దౌలతాబాద్)కి మార్చాడు.
అతడు తన ప్రజలందరిని వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావలసినదిగా ఆదేశించాడు. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారు. దేవగిరికి చేరిన తరువాత మరికొందరు మరణించారు.
ఇతడు రాగి నాణేలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమై చివరకు మహ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని ఋజువు చేశాయి.
ప్రశ్న 4.
ఢిల్లీ సుల్తానుల పాలన గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల పరిపాలన :
- రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి.
- షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది.
- రాజ్యాన్ని ఇక్షాలు, పరగణాలు, షికు మరియు గ్రామాలుగా విభజించారు.
- గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు.
- పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది.
- రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్ దే.
- ఇల్ టుట్ మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు.
- ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్దతిని కొనసాగించేవారు.
- బందగా లోని వారిలో సుల్తానకు నమ్మకస్తులైన వారిని గవర్నర్లు మరియు సైనికాధికారులుగా నియమించేవారు.
- ఇల్ టుట్ మిష్ కాలంలో, చిహల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించారు.
ప్రశ్న 5.
తుగ్లక్ ల కాలంలో రాగి, ఇత్తడి నాణేలను ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
- తుగ్లక్ యొక్క అతిసాహసిక పరిపాలనా చర్యలలో రాగి నాణెములు ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైన చర్య.
- సైనిక ఖర్చు పెరుగుట, రాజధాని మార్పిడి ఖర్చు, కరువుకాటకాల కారణంగా ఈ సంస్కరణను అమలు జరిపెను.
- అయితే ఆనాటి పరిస్థితులకు అనగా వెండి కొరతగా ఉండటం వలన ఈ చర్య సమంజసమైనదే.
- చైనా కుబ్లయి ఖాన్, మంగోలు పాలకుడు గైఖాతులు అప్పటికే ఈ నామమాత్రపు కరెన్సీని అమలు చేయటంలో విజయం సాధించారు.
- తుగ్లక్ విఫలమవ్వటానికి కారణం, తన మంత్రులను సంప్రదించక అధికార దాహంతో ఈ సంస్కరణను అమలు చేయాలని తాపత్రయపడుట, ప్రజలు స్వార్థపరులగుట, ప్రభుత్వము నాణెముల ముద్రణను గుత్తాధికారముగ అమలు జరపకపోవుట.
ప్రశ్న 6.
ఇకా పద్ధతి గురించి వ్రాయండి.
జవాబు:
ఇకా పద్ధతి:
- ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు.
- వీరిని ఇకాదార్లు లేదా ముక్తిలు అని అంటారు.
- వీరు తమ ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటుగా సుల్తానుకు సైనిక, రెవెన్యూ సేవలు అందించేవారు.
- ఇకాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయమును పరిపాలన అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు.
- ఇకాదార్ పదవి వారసత్వముగా వుండేది కాదు. పైగా వారికి తరుచుగా ఒక ఇక్తా నుండి మరొక చోటికి బదిలీ వుండేది.
ప్రశ్న 7.
ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక జీవనం గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
సామాజిక జీవనము:
- విదేశీ ఇస్లామీయులు సమాజములో ప్రముఖ స్థానంలో వుంటూ అనేక సదుపాయాలు పొందుతూ, పాలనను ప్రభావితము చేయగలిగేవారు.
- భారతీయ ముస్లింలు భోదకులుగాను, న్యాయాధికారులుగాను, ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానములో వుండేవారు.
- ఇతర ప్రజలలో చేతివృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలగు వారు శ్రామికవర్గంగా పరిగణించబడేవారు.
- విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే రెండు శాఖలు వుండేవి.
ఆర్ధిక జీవనము:
- వ్యవసాయము ప్రధాన వృత్తి.
- రైతులు పండిన పంటలో 1/3వ వంతు భాగాన్ని శిస్తు రూపములో చెల్లించవలసి వచ్చేది.
- వస్త్ర పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ.
- వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్యానాలను సుల్తానులు స్థాపించారు.
- దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమలులో వుండేది.
- ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యములో ముఖ్య నగరాలు.
- ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యము కొనసాగింది.
- పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి ప్రధాన ఎగుమతులు.
- టంకా (వెండి) నాణేలు, జిటాల్ (రాగి) నాణేలు ప్రామాణిక నాణేలుగా వాడుకలో ఉండేవి.
ప్రశ్న 8.
మహ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనా వైఫల్యాలను వివరించండి.
జవాబు:
మహ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనా వైఫల్యాలు :
- సాహసోపేతమైన ప్రయోగాల్లో, దేశ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చడం.
- గంగా-మైదాన ప్రాంతాల్లో భూమిశిస్తు పెంచడంతో సహా అనేక రెవెన్యూ సంస్కరణలు.
- కరెన్సీ సంస్కరణల్లో భాగంగా రాగి నాణేలను ప్రవేశపెట్టడం.
- కులీన వంశాల్లో కొత్తవారిని చేర్చడం మొదలైనవి.
II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.
1. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు.
ఎ) మండలాలు
బి) ఇకాలు
సి) నాడులు
డి) పలనాడులు
జవాబు:
బి) ఇకాలు
2. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు.
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ
బి) బాల్బన్
సి) మహమ్మద్ బీన్ తుగ్లక్
డి) ఇబ్రహీం లోడి
జవాబు:
సి) మహమ్మద్ బీన్ తుగ్లక్
3. ఈ క్రింది సంఘటన అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినది.
ఎ) గుర్రాలకు ముద్ర వేయించడం
బి) రాజధాని మార్పు
సి) ఖిల్జీ వంశస్థాపన
డి) పైవన్నీ
జవాబు:
ఎ) గుర్రాలకు ముద్ర వేయించడం
4. అలై దర్వాజాను నిర్మించినవారు
ఎ) మహమ్మద్ బీన్ తుగ్లక్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) ఘియాజుద్దీన్ బాల్బన్
డి) సికిందర్ లోడి
జవాబు:
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
5. ఇకాలు వీరి పాలనలో ఉండేవి.
ఎ) ముక్తి
బి) గవర్నర్
సి) వజీరులు
డి) క్వా జీ
జవాబు:
ఎ) ముక్తి
III. జతపరచండి.
విభాగం-ఎ | విభాగం-బి |
1. బానిస వంశం | ఎ) బహలాల్ లోడి |
2. తుగ్లక్ వంశం | బి) కిజర్ ఖాన్ |
3. ఖిల్జీ వంశం | సి) గియాజుద్దీన్ |
4. లోడి వంశం | డి) కుతుబుద్దీన్ ఐబక్ |
5. సయ్యద్ వంశం | ఇ) జలాలుద్దీన్ |
జవాబు:
విభాగం-ఎ | విభాగం-బి |
1. బానిస వంశం | డి) కుతుబుద్దీన్ ఐబక్ |
2. తుగ్లక్ వంశం | సి) గియాజుద్దీన్ |
3. ఖిల్జీ వంశం | ఇ) జలాలుద్దీన్ |
4. లోడి వంశం | ఎ) బహలాల్ లోడి |
5. సయ్యద్ వంశం | బి) కిజర్ ఖాన్ |
IV. క్రింద ఇవ్వబడిన వివరాలతో సంబంధం ఉన్న పాలకులను గుర్తించి వ్రాయండి.
ప్రసిద్ధ మహిళా పాలకురాలు | |
బానిస వంశ స్థాపకుడు | |
తుగ్లక్ కాలంలో దోహా (ద్విపదలు) రచించినవారు | |
రాజధాని తరలింపు చేసినవారు | |
ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు | |
మొఘలు పాలనలో మొదటివాడు |
జవాబు:
ప్రసిద్ధ మహిళా పాలకురాలు | రజియా సుల్తానా |
బానిస వంశ స్థాపకుడు | కుతుబుద్దీన్ ఐబక్ |
తుగ్లక్ కాలంలో దోహా (ద్విపదలు) రచించినవారు | అమీర్ ఖుస్రూ |
రాజధాని తరలింపు చేసినవారు | మహ్మద్ బీన్ తుగ్లక్ |
ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు | ఇబ్రహీం లోడి |
మొఘలు పాలనలో మొదటివాడు | బాబర్ |
పదకోశం
ఇచ్చిన సూచనలకు సంబంధించిన పదాలతో పజిల్ ను పూరించండి.
నిలువు
2. ప్రసిద్ధ ముస్లిం పాలకురాలు (6)
3. మామ్లుక్ వంశానికి గల ఇంకో పేరు (5)
4. ఢిల్లీ సుల్తానులలో చివరివాడు (5)
అడ్డం
1. పరిపాలన ఈ ఇస్లాం నిబంధనలకు లోబడి ఉండేది (4)
5. దౌలతాబాద్ ఈ రాష్ట్రంలో ఉంది (4)
6. ఢిల్లీ సుల్తానుల మొదటి రాజధాని (3)
7. దోహా (ద్విపదలు) రచించిన వారు (5)
జవాబు:
7th Class Social Studies 4th Lesson ఢిల్లీ సుల్తానులు InText Questions and Answers
7th Class Social Textbook Page No.101
ప్రశ్న 1.
మధ్యయుగ సాహిత్యానికి చెందిన కొన్ని రచనల పేర్లను సేకరించి చార్టులో వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చార్టుపై వ్రాయగలరు. ఉదా:
- అబుల్ ఫజల్ – అక్బర్నామా, ఐనీ అక్బరీ
- అల్ బెరూని – తారిక్-ఉల్-హిందూ
- అమీరుఖుస్రూ – ఖాజీ ఇన్ ఉల్ ఫిల్
- జియాఉద్దీన్ బరానీ – తారిఖ్ ఇ ఫిరోజ్ షాహి
- జాయపసేనాని – నృత్యరత్నాకరము.
- అల్లసాని పెద్దన – మను చరిత్ర
- శ్రీనాథుడు – పల్నాటి వీర చరిత్రము
- విద్యానాథుడు – ప్రతాపరుద్ర యశోభూషణం
- నంది తిమ్మన – జైమినీ భారతము
- తెనాలి రామకృష్ణుడు – పాండురంగ మహత్యము
- బదేని – ముంతాక్వా ఉల్ తవారిక్
- శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద మొదలైనవి.
ప్రశ్న 2.
ఏదైనా చారిత్రక ప్రదేశాన్ని సందర్శించారా? దానికి సంబంధించిన యాత్రా కథనాన్ని వ్రాయడానికి ప్రయత్నించండి.
జవాబు:
- నేను మా దగ్గరలో ఉన్న ‘కొండవీడు’ కోటను సందర్శించాను.
- నేను మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర మిత్రులమంతా కలిసి చారిత్రక ప్రదేశమయిన ఈ కోటను సందర్శించాము.
- నాటి రెడ్డి రాజుల కోట గురించి, వారి చరిత్ర గురించి మా ఉపాధ్యాయులు చక్కగా వివరించారు.
- కోట గోడలు, బావి కొన్ని కట్టడాలు మమ్ములను చాలా ఆశ్చర్యపరచినవి.
- అక్కడి శిథిలాలు చూస్తూ నాటి రాజుల పాలనను గుర్తుచేసుకున్నాం.
ప్రశ్న 3.
మీ పరిసరాలలోని చారిత్రక ప్రదేశాల వివరాలను క్రింద తెలిపిన విధంగా పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:
చారిత్రక ప్రదేశం పేరు | జిల్లా మరియు మండలం | చారిత్రక ప్రాధాన్యం |
కొండవీడు | గుంటూరు | రెడ్డిరాజుల కాలం నాటి శిథిలమైన కోట కలదు. |
ఉండవల్లి గుహలు | గుంటూరు | ప్రాచీన కాలం నాటి గుహాలయాలు కలవు. |
7th Class Social Textbook Page No.107
ప్రశ్న 4.
పటం 4.2 ఆధారంగా, అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో దండయాత్రలు జరిపిన ప్రదేశం మరియు , సంవత్సరమును పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
సంవత్సరము | దండయాత్ర జరిపిన ప్రదేశం |
1299 | గుజరాత్ ఆక్రమణ |
1301 | రణతంబోర్ పై దాడి |
1303 | చిత్తోడి పై దాడి |
1305 | మాండుపై దాడి |
1296/1305 | దేవగిరిపై దాడి |
1311 | యాదవరాజ్యంపై దాడి |
1311 | వరంగల్‌పై దాడి |
1311 | ద్వార సముద్రంపై దాడి |
1311 | మధులపై దాడి |
7th Class Social Textbook Page No.113
ప్రశ్న 5.
వివిధ రాజ వంశాలకు చెందిన నాణేల చిత్రాలను సేకరించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. ఈ క్రింది ఉదాహరణ ఆధారంగా
7th Class Social Textbook Page No.117
ప్రశ్న 6.
“ఢిల్లీ సుల్తానుల నిర్మాణ శైలికి కుతుబ్ మినార్ మచ్చుతునక,” చర్చించండి.
జవాబు:
- ‘యునెస్కో’ ఈ మినారు ప్రపంచ వారసత్వంగా ప్రకటించింది. అంటే దీని నిర్మాణ శైలి అద్భుతం.
- ఈ నిర్మాణం కువ్వత్-ఉల్-ఇస్లాం ఆవరణలో నిర్మించి సూఫీ సన్యాసి అయిన భక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చారు.
- 74.1 మీ|| ఎత్తులో ఉన్న నాలుగు అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడిన అంతస్తులతో విలక్షణంగా ఉంది.
- కుతుబుద్దీన్ ఐబక్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటి అంతస్తు పూర్తి చేయగా, తర్వాత ఇల్-టుట్-మిష్ – నిర్మాణాన్ని పూర్తి చేసాడు.
ప్రశ్న 7.
ఢిల్లీ సుల్తానులలో ప్రముఖ పాలకుల వివరాలు మరియు వారి పాలనలోని ముఖ్యమైన అంశాలను పట్టిక రూపంలో తయారుచేయండి.
జవాబు:
ప్రముఖ పాలకుడు | పాలనలోని ముఖ్యమైన అంశాలు |
1) కుతుబుద్దీన్ ఐబక్ (క్రీ.శ. 1206-1210) | 1) ఢిల్లీ సల్తానత్, బానిస వంశాన్ని క్రీ.శ. 1206లో స్థాపించాడు. 2) లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 3) అనేక దానధర్మములు గావించి ‘లక్ బక్ష’ అని కీర్తి గడించెను. 4) కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించెను. |
2) ఇల్‌టుట్-మిష్ (క్రీ.శ. 1211-1236) | 1) నిజమైన బానిస వంశ స్థాపకుడు. 2) రాజ్యమును ‘ఇకా’లనే సైనిక రాష్ట్రములుగా విభజించాడు. 3) ఢిల్లీలో తురుష్క సామ్రాజ్యమునకు నిజమైన పునాదులు వేసినాడు. 4) కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేసాడు. 5) బంద్ గాన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. |
3) రజియా సుల్తానా (క్రీ.శ. 1236-1240) | 1) భారతదేశమును పాలించిన మొదటి ముస్లిం పాలకురాలు. 2) ఢిల్లీ సర్దారులు (చిహల్గని) ప్రాబల్యమును అణచివేసెను. 3) ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. |
4) బాల్బన్ (క్రీ.శ. 1266-1287) | 1) తన కొలువులో అనేక పారశీక సాంప్రదాయాలను ప్రవేశపెట్టెను. 2) రాజు ముందు సాష్టాంగ దండ ప్రమాణము మొదలైనవి ప్రవేశపెట్టెను. 3) మంగోలుల దండయాత్రకు గురయ్యెను. |
5) జలాలుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1290-1296) | 1) ఖిల్జీ వంశ స్థాపకుడు. 2) దగ్గుల ప్రాబల్యమును అణచివేసెను. 3) మంగోలుల దాడినరికట్టెను. |
6) అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1296-1316) | 1) సమర్థవంతమైన గూఢఛారి వ్యవస్థను స్థాపించెను. 2) సిద్ధ సైన్యాన్ని నియమించెను. 3) సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించెను. 4) మార్కెట్ సంస్కరణలు చేపట్టెను. ధరలను నియంత్రించెను. 5) గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టెను. 6) అలైదర్వాజాను నిర్మించెను. |
7) ఘియాజుద్దీన్ తుగ్లక్ (క్రీ.శ. 1320-1324) | 1) భూమిశిస్తును తగ్గించెను. 2) వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు త్రవ్వించెను. 3) నూతన రహదారులను నిర్మించెను. 4) గుర్రములపై వార్తలను పంపు తపాలా విధానమును ప్రవేశపెట్టెను. |
8) మహ్మద్ బీన్ తుగ్లక్ (క్రీ.శ. 1324-1351) | 1) గంగ-యమున అంతర్వేదిలో పన్నులు పెంచుట. 2) రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదు మార్చెను. 3) రాగి నాణెములను చెలామణిలోకి తీసుకువచ్చెను. 4) వ్యవసాయాభివృద్ధికై చర్యలు తీసుకోవటం. 5) సతీ సహగమనము తొలగించుటకు ప్రయత్నించెను. |
9) ఫిరోజ్ షా తుగ్లక్ (క్రీ.శ. 1351-1388) | 1) నిరుద్యోగ సమస్యను పరిష్కరించుటకు ‘ప్రత్యేక ఉద్యోగశాఖ’ను రూపొందించెను. 2) వృద్ధులకు, వితంతువులకు, అనాథల కొరకు ప్రత్యేక ధర్మ సంస్థను ఏర్పాటు చేసెను. 3) వ్యవసాయాభివృద్ధికై కాలువలు త్రవ్వించెను. 4) సైనికులకు జీతాల బదులు జాగీరులిచ్చు విధానము ప్రవేశపెట్టెను. 5) ప్రత్యేక బానిస శాఖను ఏర్పాటు చేసెను. |
10) కిజర్ ఖాన్ (క్రీ.శ. 1414-1421) | 1) సయ్యద్ వంశ స్థాపకుడు. 2) కొన్ని తిరుగుబాట్లను అణచివేసెను. |
11) బహలు లోడి (క్రీ.శ. 1451-1489) | 1) లోడి వంశ స్థాపకుడు. 2) సమర్థవంతమైన న్యాయవ్యవస్థను ఏర్పరచెను. |
12) ఇబ్రహీం లోడి (క్రీ.శ. 1517-1526) | 1) ఢిల్లీ సల్తనత్ చివరి పాలకుడు. 2) సర్దారులను సామాన్యులుగా పరిగణించెను. 3) బాబర్ తో 1526లో మొదటి పానిపట్టు యుద్ధం చేసెను. |
ఆలోచించండి & ప్రతిస్పందించండి
7th Class Social Textbook Page No.101
ప్రశ్న 1.
చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారాలు ఏ విధంగా సహాయపడతాయి?
జవాబు:
చరిత్రను విపులముగా తెలుసుకొనుటకు లిఖిత ఆధారముల కంటే పురావస్తు ఆధారములు అత్యంత విశ్వాస యోగ్యములు. పురావస్తు ఆధారాలు ప్రధానంగా నాలుగు రకాలుగా కలవు. అవి :
ఎ) శాసనములు,
బి) నాణెములు,
సి) స్మారకాలు,
డి) కళాఖండములు. ఇవి చరిత్ర అధ్యయనానికి క్రింది విధంగా సహాయపడతాయి.
ఎ) శాసనములు :
చరిత్ర పునర్నిర్మాణమునకు శాసనములు చాలా ముఖ్యమైన ఆధారాలు. ఈ శాసనములు సామాన్యముగా రాజులు గావించిన దానధర్మములనుగాని, వారి విజయములను గురించి గానీ, వారి వారి పాలనలో జరిగిన ముఖ్య సంఘటనలనుగానీ, వివిధ ఉత్తర్వులు, ఆజ్ఞల గురించి గానీ తెలియజేయును. సాధారణంగా ఈ శాసనములు కొండశిలల మీద, శిలా స్తంభముల మీద, ఇనుప స్తంభాల మీద, కొండ గుహలలో, దేవాలయ గోడల మీద, రాగి, కంచు ఫలకముల మీద వ్రాయబడెను.
బి) నాణెములు :
శాసనముల తర్వాత ప్రామాణికమైనవి నాణెములు. ఇవి ఆయా రాజుల పాలనా కాలమంధు చలామణిలో యున్నట్లు తెలియును. ఈ నాణెములు పాలకుల సామ్రాజ్య పరిధిని, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత విషయములను గురించి వారి అభిరుచుల గురించి తెలియజేయును. విదేశీ వ్యాపారం గురించి తెలియజేయును.
సి) స్మారకాలు, కళాఖండములు :
స్మారకాలు, కళాఖండములు అంటే శిథిల భవనములు, ప్రాచీనులు ఉపయోగించిన సామానులు, పనిముట్లు, కుండ పాత్రలు, శిల్పాలు, చిత్రలేఖనము మొదలైనవి. వీటి ద్వారా గతించిన ప్రాచీన
భారతదేశ చరిత్రను పునర్నిర్మింపవచ్చును.
7th Class Social Textbook Page No.105
ప్రశ్న 2.
ఆకాలంలో పాలనాధికారం వారసత్వంగా సంక్రమించేది. కానీ కొన్ని సమయాల్లో అల్లుళ్ళు మరియు మామలు కూడా రాజ్యాన్ని ఆక్రమించేవారు. ఇందుకు గల కారణాలను ఊహించండి.
జవాబు:
కొన్ని సమయాల్లో అల్లుళ్ళు మరియు మామలు రాజ్యాన్ని ఆక్రమించటానికి కారణాలు:
- రాజుకు వారసులు లేకపోవడం ప్రధాన కారణం.
- వారసులు అసమర్ధులగుట వలన.
- అధికార దాహం, అధికారం పట్ల వ్యామోహం, స్వార్థపరత్వం.
- చెప్పుడు మాటలు వినటం, వీరిని ప్రక్కవారు ప్రభావితం చేయటం మొదలైనవి.
ప్రశ్న 3.
ఓ మహిళా పాలకురాలిగా రజియా సుల్తానా వివక్షను, కుట్రలను భరించవలసి వచ్చింది. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషుల్లా తమకు నచ్చినట్లు తాము వ్యవహరించగలుగుతున్నారా?
జవాబు:
ప్రస్తుత కాలంలో మహిళలు పురుషుల్లా తమకు నచ్చినట్లు తాము వ్యవహరించలేకపోతున్నారు. కారణం, మహిళకు సంబంధించిన (భర్త, కుమారుడు లేదా తండ్రి) పురుషుల ప్రభావం వారి మీద ఉంది. వారు మహిళలకు నీడ లాగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవటంలో ప్రభావితం చేస్తున్నారు మరియు మన సంప్రదాయాలు, ఆచారాలు, మూఢవిశ్వాసాలు కూడా వీనికి తోడై మహిళలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు.
7th Class Social Textbook Page No.107
ప్రశ్న 4.
అవినీతి అనగా ఏమి? దీనిని ఎలా నియంత్రిస్తావు?
జవాబు:
1) అవినీతి :
అక్రమ మార్గాల ద్వారా లేదా అక్రమ పద్ధతుల ద్వారా డబ్బును సంపాదించడాన్ని ‘అవినీతి’ అంటారు.
2) నియంత్రణ :
- ప్రజలకు ఉపయోగపడే ఆర్థిక సంస్కరణలు చేయడం ద్వారా
- పరిపాలనలో ఖచ్చితత్వాన్ని పెంచడం ద్వారా
- ప్రభుత్వానికి, పరిపాలనను ప్రత్యక్షముగా అనుసంధానం చేయడం ద్వారా
- కొన్ని సంస్థల పర్యవేక్షణలో జవాబుదారీతనాన్ని పెంచడం ద్వారా అవినీతిని నియంత్రించవచ్చు.
ప్రశ్న 5.
రాజులు లేదా పాలకులు ఇతర రాజ్యాలు లేదా ప్రాంతాలపై దండయాత్రలు చేయుటకు కారణాలు తెలుసుకోండి.
జవాబు:
రాజులు లేదా పాలకులు ఇతర రాజ్యాలపై దండయాత్రలు చేయుటకు కారణాలు:
- రాజ్యకాంక్ష, తమ రాజ్యాన్ని విస్తరింపచేయాలని అనుకోవటం.
- ప్రక్క రాజ్యాలలోని సంపదను కొల్లగొట్టుటకు.
- వ్యాపారాభివృద్ధికి, (ప్రక్క రాజులతో వ్యాపారం చేయుటకు, ఆ రాజు అనుమతినివ్వకపోవటం)
- పన్నులు, కప్పంల రూపంలో ధనాన్ని ప్రోగుచేసుకొనేందుకు.
7th Class Social Textbook Page No.109
ప్రశ్న 6.
రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదు తరలించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదు తరలించడానికి గల కారణాలు:
- నాటి సువిశాల తుగ్లక్ సామ్రాజ్యానికి రాజధానియైన ఢిల్లీ మారుమూలలో గలదు.
- రాజ్యములోని వివిధ ప్రాంతాలను పాలించుటకు తగిన రవాణా, వార్తా సౌకర్యాలు కూడా లేవు.
- దీనికి తోడు సరిహద్దు ఢిల్లీ సమీపములో ఉండుటచే తరచు మంగోలులు దాడి చేయుచూ, అపార నష్టము కల్గించుచుండిరి.
- ఢిల్లీకి సుదూరంలో గల దక్షిణాది రాష్ట్రాలు తరచూ తిరుగుబాటు జేయుచుండిరి. వారిని అణచివేయుటకు.
- బలవంతులైన ఢిల్లీ సర్దారుల ప్రాబల్యము నుండి విముక్తి పొందాలని ఆశించుట.
ప్రశ్న 7.
ఢిల్లీ నుండి దౌలతాబాద్ ప్రయాణములో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు తెలుసుకోండి.
జవాబు:
తుగ్లక్ ఢిల్లీలోని కార్యాలయాలు, సిబ్బందినే కాక ఢిల్లీలోని పౌరులందరిని తమ ఆస్తిపాస్తులతో బాటు దౌలతాబాద్ తరలివెళ్ళమని ఆజ్ఞాపించెను. ఢిల్లీ నుండి దౌలతాబాద్ మధ్య దూరము సుమారు 700 మైళ్ళు. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్వేషించండి
7th Class Social Textbook Page No.117
ప్రశ్న 1.
ఢిల్లీ సుల్తానుల కళలు, వాస్తు నిర్మాణాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సందర్శించండి.
జవాబు:
కళలు-వాస్తు శిల్పం :
- ఢిల్లీ సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి.
- హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలీగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి.
- స్వదేశీ నిర్మాణాలలో ట్రూబీట్ పద్దతిని పాటించేవారు. తర్వాత అర్క్యుట్ పద్ధతి’ ప్రవేశపెట్టబడింది.
- భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్పకళాకారులను నియమించారు.
- ఆవిధంగా ఇండో – ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది. కుతుబ్ మినార్, అలై దర్వాజ, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో ప్రసిద్ది చెందిన నిర్మాణాలు.
కుతుబ్ మినార్ :
- కువ్వత్ – ఉల్ – ఇస్లాం మసీదు ఆవరణలో ఈ నిర్మాణం చేయబడినది.
- కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్ టుట్ మిష్ కుతుబ్ మినారను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ భక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చారు.
- 74.1 మీటర్ల ఎత్తులో ఉన్న నాలుగు అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడిన అంతస్తులతో విలక్షణంగా ఉంది.
అలై దర్వాజ :
- అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని ‘కువ్వత్ – ఉల్ – ఇస్లామ్’ మసీదుకు దక్షిణ ద్వారం వలే నిర్మించాడు.
- దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి.