SCERT AP 7th Class Social Study Material Pdf 6th Lesson విజయనగర సామ్రాజ్యం Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Social Solutions 6th Lesson విజయనగర సామ్రాజ్యం
7th Class Social 6th Lesson విజయనగర సామ్రాజ్యం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రశ్న 1.
విజయనగరము మరియు బహమనీ రాజ్యాల మధ్య సంఘర్షణను గురించి చర్చించుము.
జవాబు:
- బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు మూడు ప్రాంతాలపై ఆధిపత్యం గురించి నిరంతరం ఘర్షణ పడేవారు.
- తుంగభద్ర మాగాణి ప్రాంతంపై, కృష్ణా గోదావరి డెల్టాలపై, మరట్వాడాపై ఆధిపత్యానికి ఈ పోరాటాలు జరిగాయి.
- ఈ రెండు రాజ్యాలు ఉన్నంత కాలం వీటి మధ్య సైనిక యుద్ధాలు జరుగుతుండేవి. ఈ యుద్ధాల వలన విపరీతమైన జన నష్టం, ఆస్తి నష్టం జరిగింది.
- ఒకటో బుక్కరాయల కాలంలో క్రీ.శ. 1367లో వీరి మధ్య మొదటిసారిగా పెద్ద యుద్ధం ప్రారంభమయింది.
- ‘జిహాద్’ పేరుతో విజయ నగర సామ్రాజ్యంపై మత యుద్ధం ప్రకటించిన బహమనీ సైన్యాలను మొట్టమొదటగా శ్రీకృష్ణ దేవరాయలు తిప్పికొట్టవలసి వచ్చింది.
- ఈ విధంగా నిరంతరము విజయనగరము మరియు బహమనీ రాజ్యాల మధ్య సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రశ్న 2.
విజయనగర రాజ్యంలో నాయంకర వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:
- విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు.
- వీరు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ అనేక సందర్భాల్లో రైతులు స్థిరపడటానికి కావలసిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలసి వీరు అన్వేషిస్తుంటారు.
- వీరిని నాయక అని పిలుస్తారు.
- విజయనగర సామ్రాజ్యంలో అమర నాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ.
- అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు. వీరు పాలించడానికి రాజుచే కొంత భూభాగం ఇవ్వబడుతుంది.
ప్రశ్న 3.
విజయనగర పాలన కాలంలో వాణిజ్య అభివృద్ధిని గూర్చి వివరించండి.
జవాబు:
- విజయనగర సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా విలసిల్లింది. “వరాహ” అనునది ప్రధాన బంగారు నాణెం.
- రాజ్యం లోపల తీరప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం వల్ల సామ్రాజ్యం సుసంపన్నంగా ఉండేది.
- మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది కన్ననూర్.
- పశ్చిమాన అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ మరియు తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాయి.
- పత్తి మరియు పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, సురేకారం మరియు చక్కెర ఎగుమతులలో ప్రధాన వస్తువులు.
- విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసం, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకొన్నారు.
- ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది.
ప్రశ్న 4.
ఈ పాఠంలోని “కళలు మరియు సంగీతం” అనే పేరాను చదివి ప్రస్తుత కళారూపాలతో పోల్చండి.
జవాబు:
కళలు మరియు సంగీతం :
- విజయనగర రాజుల కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది.
- విద్యారణ్యస్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాశారు.
- ప్రౌఢ దేవరాయలు రాసిన మహానాటక సుధానిధి అను రచన కూడా సంగీతానికి చెందినదే.
- కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి తంజావూరు ఆస్థానానికి చెందినవారు.
నృత్య రూపాలు :
- అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపమైన భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడింది.
- భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగి ఉన్న నాట్యశాస్త్ర పుస్తకాన్ని భరతముని రచించారు.
- సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి ఇతర ప్రసిద్ధ నృత్య రూపాలు, కాకతీయుల యొక్క నృత్య రూపమైన పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యం పొందింది.
- భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో యక్షగానమనే నృత్య రూపకం కూడా ప్రజాదరణ పొందింది.
ప్రశ్న 5.
శ్రీకృష్ణదేవరాయల పరిపాలనను గురించి వ్రాయుము.
జవాబు:
శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన :
- వీరి కాలంలో పరిపాలనా వ్యవస్థ చక్కగా రూపుదిద్దుకుంది. ఇతడు సమర్థుడైన పాలకుడు.
- కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాలలో రాజు సంపూర్ణ అధికారాన్ని కల్గి ఉండేవాడు.
- రోజువారీ పరిపాలనలో సహాయంగా మంత్రిమండలి ఉంటుంది. తిమ్మరుసు తెలివైన మంత్రి.
- సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు.
- పరిపాలనలో అధికారులకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు.
- భూమి శిస్తు 1/6వ వంతు, ఎగుమతి – దిగుమతి పన్ను, వాణిజ్య పన్ను, వృత్తి పన్ను వసూలు చేసేవారు.
- సైనిక వ్యవస్థను పటిష్ఠపరచి, అశ్విక, పదతి, ఫిరంగులు మరియు ఏనుగులుండేవి.
- అమర నాయక విధానం అమలులో ఉంది. గొప్ప సైనిక సామర్థ్యం కలిగి ఉండేవాడు.
- సాహిత్యం మరియు కళలను పోషించి “ఆంధ్ర భోజుడు” అని పిలువబడ్డాడు.
- “దేశ భాషలందు తెలుగు లెస్స” అని పలికి, తన ఆస్థానంను అష్టదిగ్గజాలతో అలంకరించాడు.
- అనేక దేవాలయాలు, కట్టడాలు నిర్మించాడు.
ప్రశ్న 6.
శ్రీకృష్ణ దేవరాయల సాహితీ సేవను వివరించండి.
జవాబు:
- శ్రీకృష్ణ దేవరాయలు, సాహిత్యం మరియు కళలను గొప్పగా పోషించాడు. అతను ‘ఆంధ్ర భోజుడు’ అని పిలువబడ్డాడు.
- అతడు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని పలికాడు. అష్టదిగ్గజములు అని పిలువబడే ఎనిమిది మంది ప్రముఖ పండితులు అతని ఆస్థానంలో ఉండేవారు.
- అందులో అల్లసాని పెద్దన గొప్పవాడు. అతనిని “ఆంధ్ర కవితా పితామహుడు” అని పిలిచేవారు. అతని రచనలలో మనుచరిత్ర మరియు హరికథాసారం ముఖ్యమైనవి.
- పింగళి సూరన, ధూర్జటి మరియు తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైన పండితులు.
- శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. తెలుగులో ‘ఆముక్తమాల్యద’, సంస్కృతంలో జాంబవతీ కళ్యాణం, ఉషాపరిణయం ఈయన ముఖ్యమైన రచనలు. ఈ విధంగా సాహిత్యానికి ఎనలేని సేవలనందించాడు.
ప్రశ్న 7.
భారతదేశ పటంలో విజయనగర సామ్రాజ్యం యొక్క సరిహద్దులను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 8.
విజయనగర వాస్తు శిల్పులకు స్ఫూర్తినిచ్చిన నిర్మాణ సాంప్రదాయాలు ఏమిటి?
జవాబు:
- విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు మరింతగా ఊపందుకున్నాయి.
- ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు విజయనగర వాస్తు శిల్పం యొక్క ముఖ్య లక్షణాలు.
- స్తంభాలపై ఉన్న శిల్పాలను విలక్షణమైన లక్షణాలతో చెక్కారు.
- ఈ స్తంభాలలో కనిపించే సాధారణ జంతువు గుర్రం.
- కొన్ని దేవాలయాలలో పెద్ద మండపాలు ఉన్నాయి. కొన్ని పెద్ద దేవాలయాలలో వంద నుండి వెయ్యి స్తంభాలు ఉన్నాయి.
- విజయనగరం యొక్క శిల్పకళా శైలిలోని అతిముఖ్యమైన దేవాలయాలు విజయనగరంలోను, హంపి శిథిలాలలోను కనుగొనబడ్డాయి.
- విఠలస్వామి దేవాలయము మరియు హజార రామాలయం దేవాలయాలు ఈ శైలికి చెందినవే.
- కాంచీపురంలోని వరదరాజ దేవాలయము మరియు ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి.
- తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు.
- విజయనగర రాజులు దేవాలయ నిర్మాణానికి అనుసరించిన పద్ధతులు ‘విజయనగర శైలిగా’ ప్రసిద్ధి చెందాయి.
- ఈ శైలిని ద్రవిడ పద్ధతిగా కొందరు పేర్కొన్నారు.
- విజయనగర రాజులు నిర్మించిన ఆలయాలలో చాళుక్య శైలి స్పష్టంగా కన్పిస్తుంది.
- క్రమముగా వీరి శైలిలో చోళ సాంప్రదాయాలు చోటు చేసికొన్నాయి.
ప్రశ్న 9.
బహమనీ రాజ్యం ఎందువలన విడిపోయింది? దాని పరిణామం ఏమిటి?
జవాబు:
బహమనీ రాజ్యం విడిపోవటానికి కారణం :
- సుల్తాను యొక్క అధికారాన్ని పెంచడం కోసం మహ్మద్ గవాన్ ప్రతి రాష్ట్రంలో అధికారులను నియమించాడు.
- ప్రభువుల ప్రాంతాలపై సుల్తాన్ నియంత్రణను పెంచడమే దీని ఉద్దేశం. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలో ఉన్నాయి.
- బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు తగ్గించబడ్డాయి. ఇది ప్రభువులకు నచ్చలేదు.
- దక్కన్ ప్రభువులు గవాన కు వ్యతిరేకంగా కుట్ర పన్నినారు. మరణశిక్ష విధించవలసిందిగా సుల్తాన్ ను ప్రేరేపించారు.
- మూడవ మహమ్మద్ షా క్రీ.శ. 1482లో మరణించాడు.
- అతని తరువాత రాజ్యపాలన చేసినవారంతా బలహీనులు. అందువల్ల బహమనీ సామ్రాజ్యం
1. అహ్మద్ నగర్,
2. బీరార్,
3. బీదర్,
4. బీజాపూర్
5. గోల్కొండ అనే ఐదు భాగాలుగా విడిపోయింది.
ప్రశ్న 10.
రెడ్డిరాజులు ప్రజలకు చేసిన సేవలను వివరించండి.
జవాబు:
- రెడ్డి రాజులు హిందూ మతాన్ని ఆదరించి రక్షించారు.
- రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం బాగా వికసించింది.
- ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.
- రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించారు.
- పరిపాలన “ధర్మ సూత్రాలు” ఆధారంగా జరిగింది.
- వ్యవసాయ మిగులులో ఆరింట ఒక వంతు (1/6) పన్ను విధించారు.
- అనపోతా రెడ్డి పాలనలో కస్టమ్ సుంకాలు మరియు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి. ఫలితంగా వాణిజ్యం వృద్ధి చెందింది.
- మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం జరిగింది.
II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.
1. శ్రీకృష్ణదేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవాడు.
ఎ) సాళువ
బి) తుళువ
సి) అరవీడు
డి) సంగమ
జవాబు:
బి) తుళువ
2. ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది?
ఎ) అల్లాఉద్దీన్ ఖిల్జీ
బి) మహమ్మద్ బీన్ తుగ్లక్
సి) ఫిరోజ్ షా తుగ్లక్’
డి) గియాజుద్దీన్ తుగ్లక్
జవాబు:
బి) మహమ్మద్ బీన్ తుగ్లక్
3. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తళ్ళికోట యుద్ధం జరిగింది?
ఎ) క్రీ.శ. 1563
బి) క్రీ.శ. 1564
సి) క్రీ.శ. 1565
డి) క్రీ.శ. 1566
జవాబు:
సి) క్రీ.శ. 1565
4. ‘మధుర విజయం’ అను పుస్తకాన్ని రాసినవారు
ఎ) గంగాదేవి
బి) తిరుమలమ్మ
సి) హనుమాయమ్మ
డి) నాగలాంబ
జవాబు:
ఎ) గంగాదేవి
5. బహమనీ రాజ్య స్థాపకుడు
ఎ) అల్లాఉద్దీన్ ముజాహిద్ షా
బి) అహమ్మద్ షా
సి) అల్లాఉద్దీన్ బహమన్ షా
డి) ఫిరోజ్ షా
జవాబు:
సి) అల్లాఉద్దీన్ బహమన్ షా
III. జతపరుచుము.
గ్రూపు-ఎ గ్రూపు-బి 1. శ్రీకృష్ణదేవరాయలు (సి) ఎ) ముఖ్యమంత్రి 2. మహ్మద్ గవాన్ (ఎ) బి) బహమనీ రాజధాని నగరం 3. విజయనగర సామ్రాజ్యం (ఇ) సి) ఆంధ్ర భోజ 4. గుల్బర్గా (బి) డి) పర్షియన్ 5. అబ్దుల్ రజాక్ (డి) ఇ) తుంగభద్ర
జవాబు:
7th Class Social Studies 6th Lesson విజయనగర సామ్రాజ్యం InText Questions and Answers
7th Class Social Textbook Page No.157
ప్రశ్న 1.
మీ లైబ్రరీ లేదా ఇంటర్నెట్ నుండి భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్ గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
- 1767లో బెంగాల్ ప్రెసిడెన్సీని సర్వే చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ జేమ్స్ రన్నెల్ ను నియమించింది. లార్డ్ క్లైవ్ ఇతన్ని సర్వేయర్ జనరల్ గా నియమించాడు.
- తర్వాత 1810లో కొలిన్ మెకంజీ మద్రాసు ప్రెసిడెన్సీకి సర్వేయర్ జనరల్ గా నియమితులయ్యారు.
- అయితే ఈ పోస్టులు 1815లో రద్దు చేయబడ్డాయి మరియు మెకంజీని భారతదేశంలో మొదటి సర్వేయర్ జనరల్ గా నియమించారు.
- ఇతను దక్షిణ భారతదేశాన్ని సర్వే చేసాడు.
- వేలాది మాన్యుస్క్రిప్టు, శాసనాలు, నాణేలు (పెయింటింగ్లు), పురావస్తు ఆధారాల గమనికతో మొదటి మ్యాన్లను రూపొందించాడు.
7th Class Social Textbook Page No.167
ప్రశ్న 3.
చాలా మంది ప్రాచీన మరియు ఆధునిక భారతీయ మహిళలు మనకు ఆదర్శంగా ఉన్నారు. మీ ఉపాధ్యాయుడు లేదా తల్లిదండ్రుల సహాయంతో గొప్ప ఖ్యాతి గడించిన భారత మహిళల జాబితాను సిద్ధం చేయండి.
జవాబు:
1. అనిబిసెంట్ :
లండన్లో జన్మించినటువంటి ఐరిష్ మహిళ. 1893వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినారు. ఈమె ప్రఖ్యాతి గాంచిన విద్యావేత్త, జర్నలిస్టు, సోషల్ వర్కర్, మరియు ఆధ్యాత్మిక వేత్త. ఈమె థియోసాఫికల్ సొసైటీ (దివ్య జ్ఞానసమాజము) ను స్థాపించారు. భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటకాలంలో హోమ్ రూల్ లీగ్ ను ప్రారంభించారు. అంతేగాక, న్యూయిండియా’ కు సంపాదకత్వం వహించారు. భారతీయ బాలుర స్కౌట్ ఆసోసియేషన్‌ను కూడా ప్రారంభించారు. 86 సం||ల వయస్సులో ఈమె మరణించారు.
2. కరణం మల్లేశ్వరి :
భారతదేశ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్ లో భారతదేశం తరపున మెడల్ సాధించిన తొలి మహిళ. 2000సం||రం సిడ్నీ ఒలింపిక్స్ లో ఈమె పతకాన్ని సాధించింది. 1994 – 95 సం||రానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందింది. మహిళ అయివుండి పురుషులు ఎక్కువగా పాల్గొనే వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ పతకం గెలవడమంటే ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చి ఉంటుందో ఊహించండి.
3. ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి:
మధురైషణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి 16-09-1916లో మధురైలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో నైటింగేలని అంటారు. ఈమె 1954లో ‘పద్మభూషణ్’, 1974లో రామన్ మెగ్ సేసే అవార్డు, 1975లో ‘పద్మ విభూషణ్’ లతో గౌరవించబడ్డారు. 1998లో భారతరత్న అవార్డును కూడా పొందారు. మహిళలు అంతగా బయటకి రాని రోజుల్లోనే. ఆమె సంగీత కచేరీలు చేశారు. 88 సం||రాల వయసులో ఈమె మరణించారు.
4. శశిప్రభ :
28 సంవత్సరాల యువతి మొట్టమొదటి బస్సు డ్రైవర్. భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఒక ప్రైవేటు ట్రాన్స్ పోర్టు కంపెనీ వారు ఈమెను బస్సు డ్రైవర్ గా నియమించారు.
5. ఇందిరాగాంధీ :
మొట్టమొదటి మహిళా ప్రధాని, అలహాబాదులో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ‘వానరసేన’ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు. ఆమె ప్రధాన మంత్రిగా ఉన్నపుడు బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ, 20 పాయింట్ ప్రోగ్రామ్ మొదలైనవి జరిపించారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని 1971లో పొందారు. 31-10-1984లో ఇందిరాగాంధీ తన స్వంత గార్డులచే కాల్చి చంపబడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహిళ.
6. కల్పనాచావ్లా :
జననం 1 – 7 – 1961, మరణం 1 – 2 – 2003 ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. కొలంబియా స్పేస్ షటిల్ లో మరణించిన ఏడుగురు వ్యోమగాములలో ఈమె కూడా ఒకరు. ఈమెకు నాసా అనేక మెడల్స్ యిచ్చింది. మరణం తథ్యమని తెలిసినా కూడా స్పేస్ షటిల్ లో ఆమె ప్రవర్తన, ధైర్యం చిరస్మరణీయం.
7. మేథాపాట్కర్ :
01-12-1954 లో జన్మించారు. సామాజిక వేత్త. ప్రముఖ పర్యావరణవేత్త, ముంబయి వాసి. ‘నర్మదా బచావో’ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. 1991లో రైట్ లైవలీహుద్ అవార్డును పొందారు.
8. తస్లీమా నస్క్రీన్ :
25-08-1962 లో బంగ్లాదేశ్ లో జన్మించారు. ప్రముఖ ఫెమినిస్టు. మతాలకతీతంగా స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలని ‘అక్షర యుద్ధం’ చేస్తున్నారు. ఈమె వ్రాసిన ‘లజ్జా’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. దీని మూలంగా ఆమె అనేక దాడులకు గురయింది. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ను వదిలి పెట్టి ప్రవాసంలో జీవితాన్ని గడుపుతున్నారు.
9. కిరణ్ బేడి :
09-06-1949లో జన్మించారు. విశ్రాంత ఐ.పి.యస్ ఆఫీసర్. మొట్టమొదటి మహిళా ఆఫీసర్, 1994లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. పంజాబ్ అమృతసర్ లో జన్మించారు. తన విధి నిర్వహణలో అనేక యిబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహిళ.
7th Class Social Textbook Page No.173
ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ పటంలో “కొండపల్లి, రాజమండ్రి, కొండవీడు, వినుకొండ మరియు అద్దంకి” ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Social Textbook Page No.155
ప్రశ్న 1.
విద్యారణ్యస్వామి వారు తుంగభద్రా నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని ఎందుకు స్థాపించారు?
జవాబు:
తుంగభద్రా నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం.
- విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహంతో తుంగభద్రా నదికి దక్షిణం వైపు ‘విద్యానగరం’ అనే పేరుతో విజయనగర నిర్మాణాన్ని ప్రారంభించారు.
- ఆనాటి విపత్కర పరిస్థితులలో తుంగభద్ర తీరంలో ప్రకృతి సహజమైన ‘రక్షణ వలయంలో దీనిని నిర్మించారు.
- సారవంతమైన తుంగభద్రా మాగాణి ప్రాంతం సస్యశ్యామలంగా ఉండి, పంటలకు అనుకూలంగా ఉంటుంది.
ప్రశ్న 2.
ఏ రాజ వంశ పాలనలో మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు పనిచేశారు?
జవాబు:
మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్క రాయలు మొదటగా వరంగల్లుకు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాప రుద్రుని ఆస్థానంలో క్రీ.శ. 1323లో పనిచేశారు. అంటే కాకతీయవంశంలో పనిచేశారు.
7th Class Social Textbook Page No.163
ప్రశ్న 3.
విజయ నగర రాజులకు సమకాలీన మహ్మదీయ రాజులకు యుద్ధాలు ఎందుకు జరిగాయి?
జవాబు:
- విజయనగర రాజులు మరియు మదురై సుల్తానుల మధ్య పోరాటం సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగింది.
- మొదటి బుక్కరాయల కుమారుడైన కుమార కంపన మదురై సుల్తాన్లను నాశనం చేసి అతని దుర్భర పాలన నుంచి ప్రజలను విముక్తులను చేసినాడు.
- ఫలితంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించింది.
- విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి.
- కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణ – గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూరు దోఆబ్ పై వివాదం సుదీర్ఘ కాల సంఘర్షణలకు దారితీసింది.
ప్రశ్న 4.
తళ్ళికోట యుద్ధ ఫలితాల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
- తళ్ళికోట యుద్ధము భారతదేశ చరిత్ర గతిని మార్చి వేసిన యుద్ధాలలో ఒకటి.
- ఈ యుద్ధం వలన తుళువ వంశం, విజయనగర సామ్రాజ్య వైభవం పతనమయ్యింది.
- విజయనగర పతనముతో దక్షిణ భారతములో ముస్లింల విజృంభణకు అడ్డుగోడ తొలగింది. కాని అంత: కలహాల వల్ల మొఘల్స్ వారిని లొంగదీశారు.
- తళ్ళికోట యుద్ధం వల్ల జరిగిన ఒక ముఖ్య పరిణామం పోర్చుగీసు వారి వర్తక వాణిజ్యాలు దెబ్బతిన్నాయి.
(పోర్చుగీసు వారి వాణిజ్యంలో ఎక్కువ భాగము విజయనగరం గుండా జరిగేది). - తుళువ వంశం తరువాత వచ్చిన అరవీటి వంశస్థులు తమ రాజధానిగా ‘పెనుగొండ’ను చేసుకోవటంతో విజయనగరం రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయింది.
7th Class Social Textbook Page No.171
ప్రశ్న 5.
భారతీయ కళ మరియు వాస్తు శిల్పానికి విజయనగర సామ్రాజ్యం అందించిన సహకారం గురించి చర్చించండి.
జవాబు:
- విజయనగర రాజులు లలిత కళలన్నింటిని సమానముగా ఆదరించారు.
- వీరి ఆధ్వర్యములో హిందూ దేవాలయ వాస్తు కళ పరాకాష్టను అందుకున్నది.
- విజయనగర దేవాలయాలు ప్రఖ్యాత చారిత్రక నగరం, వారి రాజధాని నగరమైన హంపిలో కన్పిస్తాయి.
- హంపి విజయనగరంలోని విఠల ఆలయం, హజార రామాలయం, దసరా దిబ్బ, పద్మమహల్, ఏనుగుశాల, ఏకశిలారథం, ఇతర రాజప్రాసాద దుర్గ నిర్మాణాలు.
- పెనుగొండ, చంద్రగిరి, నెల్లూరు రాజ ప్రాసాదాలు : కంచి, తాడిపత్రి, శ్రీరంగం, కదిరి మొదలైనవి.
- ఆలయాలు, వాటి గోపురాలు, కళ్యాణ మంటపాలు, కుడ్య శిల్పాలు, చిత్రలేఖనం నాటి కళా వైభవానికి చిహ్నాలు (తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఆలయాలకు గోపురాలు సమకూర్చారు).
- దక్షిణ భారత వాస్తు శిల్పకళలను బహుళ వ్యాప్తంగా ప్రచారం చేసినవి విజయనగర రాజులచే నిర్మించబడిన ఆలయాలు.
- హంపి, లేపాక్షిలోని ఆలయాలు, శిల్పాలు నాటి శిల్పుల శిల్ప కళా చాతుర్యానికి తార్కాణాలు.
- విజయనగర రాజులు లలిత కళలను విశేషంగా ఆదరించారు.
ప్రాజెక్టు పని
విజయనగర శైలి ప్రభావంతో నిర్మించబడిన ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విజయనగర శైలి ప్రభావంతో నిర్మించబడిన దేవాలయాలు :
- తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మరియు తిరుపతిలోని ఆలయాలు.
- మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము.
- సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము.
- లేపాక్షి దేవాలయం
- శ్రీశైలం శ్రీ మల్లికార్జుని దేవాలయం.
- అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంపై ఆలయాల గోపురాలు (రాయగోపురాలు) విజయనగర శైలికి చెందినవి.