AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 5th Lesson తెలుగు వెలుగు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 5th Lesson తెలుగు వెలుగు

7th Class Telugu 5th Lesson తెలుగు వెలుగు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారని మీరనుకుంటున్నారు?
జవాబు:
చిత్రంలో తాతగారూ, ఆయన మనుమరాండ్రు ఇద్దరూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏ భాష గురించి చెబుతున్నారు?
జవాబు:
చిత్రంలో తెలుగుభాషను గురించి చెబుతున్నారు.

ప్రశ్న 3.
తాతయ్య చెప్పిన మాటలకు అర్థం ఏమిటి?
జవాబు:
“తెనుగుభాష తేనె కంటె తియ్యగా ఉంటుంది. ఆ తెలుగుభాష మన కన్నులకు వెలుగును ఇస్తుంది” అని అర్థం.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

ప్రశ్న 4.
తెలుగుభాష ఎటువంటి భాష?
జవాబు:
తెలుగుభాష చాలా అందమైన భాష. తెలుగు అన్ని భావాలను తెలిపే సామర్థ్యము గల భాష. తెలుగుభాషలో గొప్పదనం, సామెతలు, శబ్దపల్లవాలు, జాతీయాలు మొదలైన వాటిలోనూ, హరికథలు, సంకీర్తనలు మొదలయిన ప్రక్రియల్లోనూ ఉంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠ్యభాగంలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
జవాబు:
“అడిగెదనని కడు వడిఁ జను” అన్న పోతన గారి భాగవతంలోని పద్యం, నాకు బాగా నచ్చింది. ఆ చిన్న కంద పద్యంలో ‘డ’ అనే హల్లు, 23 సార్లు తిరిగి తిరిగి వచ్చింది. ఇది పోతన గారి చమత్కారం.

ప్రశ్న 2.
మనకు ఏ భాషా లేకపోతే ఏమౌతుంది? మన భాష గొప్పతనాన్ని గురించి మీరు ఏం తెలుసుకున్నారు?
జవాబు:
మనకు ఏ భాషా లేకపోతే, మన అభిప్రాయం ఇతరులకు తెలపడానికి వీలు కాదు. భాష వల్లనే ఒకరి అభిప్రాయం మరొకరికి చెప్పడానికి, ఇతరులతో మాట్లాడడానికి వీలు అవుతోంది. మనకు భాషలేకపోతే మనం జంతువులతో సమానం అవుతాం.

మన భాష తెలుగుభాష. అది. తేనె కన్న తీపిదనం కలది. ఈ భాషలో ఎన్నో చమత్కారాలున్నాయి. “దేశ భాషలలో తెలుగు లెస్స” అని, శ్రీ కృష్ణదేవరాయలు చెప్పాడు. ఈ తెలుగుభాషలో పొడుపుకథలు, సామెతలు, జాతీయాలు, శబ్దపల్లవాలు ఉన్నాయి. జోలపాటలు, సంకీర్తనలు ఉన్నాయి. జానపద గేయాలు, స్త్రీల పాటలు, హరికథలు, బుర్రకథలు ఉన్నాయి. అవధాన ప్రక్రియ ఉంది. ఆశుకవిత్వం ఉంది. తెలుగు అజంత భాష. తరగని భాష తెలుగు. మన మాతృభాష తెలుగు, మన కన్నతల్లి లాంటిది.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

ప్రశ్న 3.
‘ఎన్ని భాషలు నేర్చుకున్నా మనం మన మాతృభాషను మరవగూడదు’ అనడానికి కారణం ఏమిటి?
జవాబు:
ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి వంటిది. అందులో మన మాతృభాష మనకు అమృతం వంటిది. మాతృభాష నేర్చుకోవడం తల్లిపాలు త్రాగడం లాంటిది. అందుకే మనం మాతృభాషను ఎన్నడూ మరచిపోరాదు.

II. చదవడం -రాయడం

1. ఈ కింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు?

అ) తెలుగుభాష అంటే పద్యాలేనా తాతయ్యా?
జవాబు:
ఈ వాక్యం, ‘సురభి’, తాతగారితో అన్న వాక్యం.

ఆ) లేదమ్మా ! ఒక్కొక్క కథావిధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యం, ‘తాతయ్య’ సురభితో అన్న వాక్యం.

ఇ) ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా !
జవాబు:
ఈ వాక్యం, తాతగారు సురభితో చెప్పిన వాక్యం.

ఈ) అజంత భాష అనీ పేరు వచ్చింది.
జవాబు:
ఈ వాక్యం, తాతగారు శ్రీనిధికి చెప్పిన వాక్యం.

2. కింది పేరాలోని సామెతలను గుర్తించి రాయండి.

అ) “అప్పుచేసి పప్పుకూడు తినకుండా, కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి, ఏదో ఒక విద్యను నేర్చుకొని, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మాని, మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితంలో వృద్ధి చెందాలి”.
జవాబు:
పై పేరాలోని సామెతలు ఇవి :
1) అప్పుచేసి పప్పుకూడు
2) కోటి విద్యలు కూటి కొరకే
3) తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం
4) మూడు పువ్వులు ఆరుకాయలు

3. కింది ప్రశ్నలకు పాఠాన్ని చదివి, జవాబులు రాయండి.

అ) జాతీయాలు, శబ్దపల్లవాలు అంటే ఏమిటి? వాటికి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
జాతీయాలు :
ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధమును జాతీయం అంటాం. ‘పలుకుబడి’ అనే పేరుతో కూడా జాతీయాన్ని పిలుస్తాం.
ఉదా :

  1. నెమరువేయటం,
  2. అడవిగాచిన వెన్నెల,
  3. అరికాళ్ళ మంట నెత్తికెక్కడం మొదలయినవి.

శబ్దపల్లవం :
రెండు వేరు వేరు అర్థాలున్న పదాలు కలిసి, ఇంకో అర్థం వచ్చే కొత్త పదాన్ని శబ్దపల్లవం అంటారు. నామవాచకానికి క్రియచేరిన పదాలనే, శబ్ద పల్లవాలంటారు.
ఉదా : మేలుకొను

ఆ) నెమరువేయడం అంటే భాషాపరంగా అర్థం ఏమిటి?
జవాబు:
నెమరువేయడం అంటే, జ్ఞప్తికి తెచ్చుకోవటం అని భాషా విషయకంగా అర్థం చెప్పాలి.

ఇ) జానపద గేయాలు అంటే ఏమిటి?
జవాబు:
మన పల్లెల్లో ఉన్న జానపదులు, ఆనందంగా పాడుకొనే పాటలను “జానపద గేయాలు” అంటారు. ఈ గేయాలు మౌఖికంగా, ఆశువుగా చెప్పినవి. అంటే అప్పటికప్పుడు ఊహించుకొని పాడినవి. జానపదగేయం ఫలానావాడు రాశాడు అని చెప్పలేము.

ఈ) ఇటలీ భాషను, తెలుగు భాషతో పోల్చవచ్చా? ఎందువల్ల?
జవాబు:
ఇటలీ భాష తెలుగు భాషలాగే, అజంత భాష. అందువల్ల ఇటలీ భాషను తెలుగుభాషతో పోల్చవచ్చు. తెలుగుభాష ఇటలీ భాషలాగా అజంతంగా ఉంటుంది కాబట్టే పాశ్చాత్యులు మన తెలుగును, “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని మెచ్చుకున్నారు.

ఉ) తెలుగు సాహిత్యంలోని కొన్ని రకాల ప్రక్రియల పేర్లను తెలపండి.
జవాబు:
తెలుగులో పద్యం, గద్యం, పొడుపు కథలు, సంకీర్తనలు, జోలపాటలు, జానపద గేయాలు, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, డప్పు కథ, పజిల్స్, సమస్యాపూరణలు, అవధానాలు, గేయాలు, పాటలు, స్త్రీల పాటలు మొదలయిన ప్రక్రియలు ఉన్నాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో ఆలోచించి జవాబులు రాయండి.

అ) మీ ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే తెలుగు తీరుకూ, మీ పాఠ్యపుస్తకంలోని తెలుగు తీరుకూ తేడాలు కనిపిస్తున్నాయా? వాటిని గుర్తించి రాయండి.
జవాబు:
మా ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే తెలుగు తీరుకూ, మా పాఠ్యపుస్తకంలోని తెలుగు తీరుకూ కొద్దిగా భేదం ఉంది. పాఠ్యపుస్తకాన్ని విద్యావంతులైన ఉపాధ్యాయులు తయారుచేస్తారు. అందువల్ల పాఠ్యపుస్తకంలోని తెలుగు శుద్ధ వ్యావహరికంలో ఉంటుంది. మా ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే తెలుగు ఇండ్లలో మాట్లాడే వాడుకభాషకు దగ్గరగా ఉంటుంది.

ఆ) మన భాషలో మీకు తెలిసిన కవుల పేర్లు రాయండి.
జవాబు:
నన్నయభట్టు తెలుగులో ఆదికవి. తిక్కన, ఎఱ్ఱ ప్రగడ, శ్రీనాథుడు, పోతన, అనంతామాత్యుడు, బాలగంగాధర్ తిలక్, గురజాడ, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, దాశరథి, జాషువ – నారాయణరెడ్డి వంటి తెలుగుకవుల పేర్లు నాకు తెలుసు.

ఇ) టీ.వీ, రేడియో, మీ ఇల్లు, తరగతి గది – వీటిలో ఏ ప్రదేశంలో మీకు భాష బాగా అర్థమవుతున్నదో, రాయండి. ఏ ప్రదేశంలో ఎందుకు అర్థంకావడం లేదో రాయండి.
జవాబు:
మా ఇంటిలో మాట్లాడే భాష మాకు బాగా అర్థం అవుతుంది. మా తరగతి గదిలో భాష కూడా చాలా వరకు అర్థం అవుతుంది. కాని టీవీ, రేడియోల ‘భాష పూర్తిగా అర్థం కాదు.

మా ఇంటిలో భాష మేము పుట్టినప్పటి నుండి వింటాము. కాబట్టి ఆ భాష మాకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక తరగతిలో మాట్లాడే భాష, మేము బడిలో చేరినప్పటి నుండి వింటున్నాము. అయితే ఒక్కొక్క టీచరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. అయినా చాలావరకు అది అలవాటై, అర్థం అవుతుంది.

కాని టీవీ, రేడియోలలో మాట్లాడేవారిలో అనేక రకాల గొంతుకలు, శైలి కలవారు ఉంటారు. ఒక్కొక్కరి ఉచ్ఛారణ వేగం, మాటతీరు ఒక్కొక్క తీరుగా ఉంటుంది. వారి భాషలో ఒక రకం భాషాశైలి ఉంటుంది. కాబట్టి దాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకోలేము.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

2. కింది ప్రశ్నలకు పదేసీ పంక్తుల్లో జవాబులు రాయండి.

అ) భాష వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని గురించి రాయండి.
జవాబు:
భాషాప్రయోజనాలు :
మనలోని భావాన్ని, ఇతరులకు తెలపడానికి మానవులు రూపొందించుకున్న ప్రధాన సాధనం “భాష”. భాష లేకపోతే, మనిషికీ, పశువుకు తేడా ఉండదు. జంతువులు తమ అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పలేవు. మనిషికి భాష ఉంది కాబట్టి తన అభిప్రాయాన్ని ఇతరులకు అర్థం అయ్యేలా చెపుతున్నాడు. ప్రపంచంలో భాషలేని మనుషులు లేరు.

తెలుగుభాష గొప్పతనం :
తెలుగుభాష తేనెవలె తియ్యని భాష, అమృతం వంటిది. దీన్ని పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకున్నారు. తెలుగు అజంత భాష. సంగీతానికి అనువయినది. శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కీర్తించాడు.

తెలుగులో పద్యగద్యాల వంటి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. తెలుగులో అష్టావధానం, శతావధానం వంటి ప్రక్రియలు ఉన్నాయి. తెలుగులో ఆశుకవిత, సమస్యా పూరణలు, పొడుపుకథలు, జాతీయాలు, జానపదగేయాలు ఉన్నాయి.

తెలుగులో త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య వంటి సంకీర్తనాచార్యులు ఉన్నారు. జోల, లాలిపాటలు ఉన్నాయి. కవిత్రయము, శ్రీనాథ ,పోతనల వంటి కవులు ఉన్నారు. కాబట్టి తెలుగు భాష గొప్పది.

ఆ) తెలుగు భాషను కాపాడడానికి మీరు ఏం చేస్తారో రాయండి.
జవాబు:
అంతర్జాతీయ సంస్థ “యునెస్కో” తెలుగుభాష మృతభాష కాబోతోందని ప్రకటించింది. మన తెలుగును మనం కాపాడాలి.

  1. నేను తెలుగువాడిని అనే భావంతో మెలగుతాను.
  2. ఇంటా, బయటా, చుట్టాలతో, స్నేహితులతో చక్కగా తెలుగులోనే మాట్లాడతాను.
  3. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చే పాఠశాలలోనే చేరతాను.
  4. ఉన్నత పాఠశాల చదువు వరకైనా, అన్ని సబ్జక్టులూ తెలుగులోనే నేర్చుకుంటాను.
  5. డిగ్రీ చదివే వరకూ నేను రెండవ భాషగా తెలుగునే చదువుతాను.
  6. తెలుగులోని శతకములు, పోతన గారి పద్యాలు బాగా చదువుతాను.
  7. ప్రభుత్వం కూడా పరిపాలనలో తెలుగునే ప్రోత్సహించేలా మిత్రులతో కలసి పోరాడతాను.
  8. సమావేశాల్లో తెలుగులోనే మాట్లాడతాను. మిత్రులకు, బంధువులకు తెలుగులోనే ఉత్తరాలు రాస్తాను.
  9. పోటీ పరీక్షలను తెలుగు మీడియంలోనే రాస్తాను.
  10. తెలుగు సాహిత్య సమావేశాలకు తప్పక వెడతాను. తెలుగులో వచ్చే దినపత్రికలు, వారపత్రికలు, దానిలో కథలు చదువుతాను.
  11. తెలుగు వచ్చిన స్నేహితులతో తెలుగులోనే మాట్లాడతాను.

IV. పదజాలం

1. కింది పట్టికలోని పదబంధాల్లో గల జాతీయాలను గుర్తించండి. వాటితో వాక్యాలు రాయండి.

భగీరథ ప్రయత్నంగుండె కరిగిందితలపండిన
కొట్టిన పిండికంటికి కాపలాకాలికి బుద్ధి చెప్పటం
అన్నం అరగటంవీనుల విందుకాయలు కాయటం
తలలో నాలుకనా ప్రయత్నంతుమ్మితే ఊడే ముక్కు
పెళ్ళి విందుపుక్కిటి పురాణంచెప్పులరగటం
కలగాపులగంకళ్ళు కాయలు కాయటంచెవిలో పోరు

ఉదా :
తలపండిన :
రామయ్య వ్యవసాయం చేయడంలో తలపండినవాడు, కాబట్టి ప్రతి ఏటా మంచి పంట పండిస్తున్నాడు.
జవాబు:
1) భగీరథ ప్రయత్నం ( అమోఘమైన కార్యదీక్ష) :
మా తమ్ముడు “భగీరథ ప్రయత్నం ” చేసి, ఐ.ఎ.ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.

2) కొట్టిన పిండి (తన వశములోనే ఉన్నది) :
“ఇంద్రజాల విద్య” అంతా, నా స్నేహితుడికి “కొట్టిన పిండి”.

3) తలలో నాలుక (ఎక్కువ అణకువ గలిగియుండుట) :
నా మిత్రుడు గురువులందరికీ “తలలో నాలుకగా” మసలుకొనేవాడు.

4) కలగాపులగం (అన్నీ కలిపేయడం) :
అన్నం తినేటప్పుడు ..మా అబ్బాయి కూరలూ, పచ్చళ్ళూ అన్ని “కలగాపులగం” చేసి పారవేస్తాడు.

5) కాలికి బుద్ధి చెప్పటం (పారిపోవడం) :
పోలీసులను చూసి, దొంగలు కాలికి బుద్ధి చెప్పారు.

6) కళ్ళు కాయలు కాయడం (ఎంతో ఓపికగా ఎదురుచూడడం) :
మా అబ్బాయి రాక కోసం, మేము “కళ్ళు కాయలు కాచేలా” ఎదురుచూశాము.

7) పుక్కిటి పురాణం (విలువలేని మాటలు) :
నేను పుక్కిటి పురాణాలను పట్టించుకోను.

8) వీనుల విందు (చెవులకు ఇంపు) :
మల్లీశ్వరి సినిమాలో, పాటలు “వీనుల విందుగా” ఉంటాయి.

9) చెవిలో పోరు (ఎంతగానో శ్రద్ధగా చెప్పు) :
పెళ్ళి చేసుకోమని నేను “చెవిలో పోరి” చెప్పినా, నా తమ్ముడు వినలేదు.

10) చెప్పులరగడం (ఎక్కువ శ్రమ) :
“చెప్పులరిగిపోయేలా” తిరిగినా, నా చెల్లెలు పెళ్ళి ఇంకా చేయలేకపోయాను.

11) తలపండిన (పెద్దయైన) :
వ్యవసాయం చేయడంలో నా “తలపండిపోయింది.”

12) గుండె కరిగింది (జాలి పడింది) :
మా కష్టగాథ వింటే, ఎవరికైనా “గుండె కరుగుతుంది.”

13) కాయలు కాయటం (బిడ్డలు పుట్టడం) :
మా కోడలు కడుపున, “నాలుగు కాయలు కాస్తే,” చూసి సంతోషిస్తాను.

14) తుమ్మితే ఊడే ముక్కు (తేలికగా తప్పుకొను) :
“తుమ్మితే ఊడే ముక్కు” వంటి వాడి స్నేహం విషయం గూర్చి అంతగా పట్టించుకోవలసిన పనిలేదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

2. కింది వృత్తంలోని పదాల ఆధారంగా శబ్దపల్లవాల్ని రాయండి. సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
ఉదా : బయటపడు : కిషన్ కష్టపడి సమస్యల నుండి బయటపడ్డాడు.
AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు 2

శబ్దపల్లవాలు :

  1. బుద్ధిచెప్పు
  2. ఏరుకొను
  3. బయటపడు
  4. కూరుచుండు

వాక్య ప్రయోగాలు :

  1. ఉపాధ్యాయుడు పిల్లలకు బాగా బుద్ధి చెప్పాడు.
  2. పారు సముద్రతీరాన గులకరాళ్ళను ఏరుకొన్నారు.
  3. నేను ఎలాగో ఆ చిక్కుల నుండి బయటపడ్డాను.
  4. నేను బల్లపై కూర్చోడానికి ఇష్టపడతాను.

3. కింది వాక్యాలను చదవండి. వీటిని పట్టికలోనున్న తెలుగు భాషాప్రక్రియలలో సరైన వాటితో జతపరచి వాటిని వాక్యాలుగా రాయండి.

అ) ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు ………………….హరికథ
ఆ) అదిగో అల్లదిగో శ్రీహరి వాసము ………………….సంకీర్తన
ఇ) నేను అన్నం తిని బడికి వెళతాను ………………….బుర్రకథ
ఈ) బొబ్బిలిపులిని నేనురా – సై
వచనం దేశరక్షణ చేసెదరా – సై ………………….
వచనం
ఉ) శ్రీమద్రమారమణ గోవిందో హరి ………………….పద్యం

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు 3

ఉదా : ‘ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు’ అనేది పద్యప్రక్రియ
జవాబు:
అ) ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు : పద్యం

ఆ) అదిగో అల్లదిగో శ్రీహరి వాసము : సంకీర్తన

ఇ) నేను అన్నం తిని బడికి వెళతాను : వచనం

ఈ) బొబ్బిలిపులిని నేనురా – సై
దేశరక్షణ చేసెదరా – సై : బుర్రకథ

ఉ) శ్రీమద్రమారమణ గోవిందో హరి : హరికథ

4. కింది వాటిని ఉదాహరణలో చూపిన విధంగా ఒకే పదంగా కూర్చండి.
ఉదా : తెలుగు అనే పేరు గల భాష = తెలుగుభాష

అ) కోపము, అనెడి అగ్ని = కోపాగ్ని
ఆ) హరి యొక్క కథ = హరికథ
ఇ) దేశము నందలి భాషలు = దేశభాషలు

V. సృజనాత్మకత

* కింది జాతీయాలను ఉపయోగించి, ఓక కథ రాయండి.
1) చెవిలో ఇల్లు కట్టుకొని, 2) కంటికి కాపలా, 3) తల పండిన, 4) వీనుల విందు, 5) తలలో నాలుక, 6) కాలికి . బుద్ధి చెప్పు, 7) చేతులు ముడుచుకోవడం, 8) కొట్టినపిండి.
జవాబు:
రామాపురంలో మా తాతగారు ఉండేవారు. ఆయన వ్యవసాయం చేయడంలో (3) తలపండినవాడు. ఆయనకు వేద విద్య అంతా (8) కొట్టిన పిండి. ఆయన శిష్యుడు రామావధాన్లు ఆయన దగ్గర (5) తలలో నాలుకలా మసలేవాడు. మా తాతగారు శిష్యుడికి వేదమంత్రాలు (1) చెవిలో ఇల్లు కట్టుకొని పోరి చెప్పేవారు. ఆ శిష్యుడు మా తాతగారికి (2)కంటికి కాపలాగా ఉండేవాడు. ఎప్పుడూ మా తాతగారి ఇంటిలో వేదమంత్రాలు (4) వీనుల విందుగా వినబడేవి. శిష్యుడు మాత్రం ఏ పనీ చేయకుండా (7) చేతులు ముడుచుకోవడం తాతగారికి ఇష్టం లేదు. ఒక రోజు ఆ శిష్యుడు గురువుగారి వద్ద 10 రూపాయలు దొంగిలించి, (6) కాలికి బుద్ధి చెప్పాడు.

(లేదా)
* ‘తెలుగు భాష’ గొప్పదనాన్ని గురించి, కాపాడడాన్ని గురించి నినాదాలు రాయండి.
జవాబు:

  1. తెలుగుభాష మాట్లాడడం – తల్లి దండ్రులను గౌరవించడంతో, సమానం
  2. తెలుగు తల్లి – మన చల్లని తల్లి
  3. తెలుగు మాట్లాడు – కన్నతల్లిని చల్లగా చూడు
  4. తెలుగును మాట్లాడదాం – తల్లిని రక్షిద్దాం
  5. తేనెలాంటి భాష – మన తెలుగుభాష
  6. దేశభాషల్లో – తెలుగు భాష గొప్పది
  7. తెలుగు నేలలో – తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం
  8. తెలుగు భాషాతల్లిని – రక్షించుకుందాం
  9. తెలుగును విడిస్తే – తెల్ల మొహం వేస్తావు.

VI. ప్రశంస

* కింది సామెతల్ని మీకు తెలిసిన ఇతర భాషల్లో ఏమంటారో తెలుసుకోండి.

అ) మనసుంటే మార్గముంటుంది.
జవాబు:
Where there is a will, there is a way.

ఆ) సాధనమున పనులు సమకూరు ధరలోన
జవాబు:
‘Practice makes the men perfect. .

ఇ) మెరిసేదంతా బంగారం కాదు.
జవాబు:
All glitters is not gold.

ఈ) నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.
జవాబు:
Pleasant words please all.
(or)
A good tongue is a good weapon.

VII. ప్రాజెక్టు పని

* తెలుగుభాష/మాతృభాష గొప్పదనాన్ని గురించి తెలిపే పద్యాలు, పాటలు, గేయాలు సేకరించండి. వాటిని పాడి
వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీయండి. సంధి పేరు తెల్పండి.

అ) అయ్యయ్యో = అయ్యో + అయ్యో = ఆమ్రేడిత సంధి
ఆ) కుట్టుసురు = కుఱు + ఉసురు = ద్విరుక్తటకార సంధి
ఇ) కొట్టకొన = కొన + కొన = ఆమ్రేడిత సంధి
ఈ) పట్టపగలు = పగలు + పగలు = ఆమ్రేడిత సంధి
ఉ) అన్నన్న = అన్న + అన్న = ఆమ్రేడిత సంధి
ఊ) చిట్టెలుక = చిఱు + ఎలుక = ద్విరుక్తటకార సంధి
ఋ) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = ఆమ్రేడిత సంధి
ఋ) అహాహా = అహా + అహా = ఆమ్రేడిత సంధి.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

2. కింది పదాలు ఏ సంధి సూత్రానికి వర్తిస్తాయో గుర్తించి, ఆ సంధి పేరు రాసి సూత్రం రాయండి.

అ) అచ్చు ………………… ఆమ్రేడితం …………………….. తరచు.
‘సంధిపేరు : ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగు.

ఆ) బి, డ లు ………….. అచ్చు …………………. ద్విరుక్తటకారం …………………. ఆదేశం …………. కు ఱు, చిఱు, కడు, నిడు, నడు.
సంధి పేరు : ద్విరుక్తటకార సంధి.
సూత్రం : కుటు, చిఱు, కడు, నడు, నిడు శబ్దములందలి అడలకు అచ్చు పరమగునపుడు, ద్విరుక్తటకారంబు ఆదేశంబగు.

1. కింది పదాలను విడదీసి సంధి నామములను రాయండి.

1. తాతయ్య = తాత + అయ్య = (అ + అ = అ) – అత్వసంధి
2. అదేమిటి = అది + ఏమిటి = (ఇ + ఏ = ఏ) – ఇకారసంధి
3. ఏమిటది = ఏమిటి + అది = (ఇ + అ = అ) – ఇకారసంధి
4. పచ్చిదొకటి = పచ్చిది + ఒకటి = (ఇ + ఒ = ఒ) – ఇకార సంధి
5. అచ్చుతానంద = అచ్యుత + ఆనంద = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
6. పల్లెటూళ్ళు = పల్లె + ఊళ్ళు = (పల్లె + టు + ఊళ్ళు) – టుగాగమ సంధి
7. ప్రత్యేక = ప్రతి + ఏక = (ఇ + ఏ = యే) – యణాదేశ సంధి
8. ఏకాగ్రత = ఏక + అగ్రత = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
9. అష్టావధానం = అష్ట + అవధానం = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
10. శతావధానం = శత + అవధానం = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
11. సహస్రావధానం = సహస్ర + అవధానం = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
12. మహానుభావులు = మహా + అనుభావులు = (ఆ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహం తెలిపి సమాసాల పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1. పద బంధముపదము యొక్క బంధముషష్ఠీ తత్పురుష సమాసం
2. దేశభాషలుదేశమందలి భాషలుసప్తమీ తత్పురుష సమాసం
3.  తెలుగుభాషతెలుగు అనే పేరుగల భాషసంభావనా పూర్వపద కర్మధారయం
4. తొంభై ఆమడలుతొంభై (90) సంఖ్య గల ఆమడలుద్విగు సమాస, సమాసం
5. కొత్తపదంకొత్తదయిన పదంవిశేషణ పూర్వపద కర్మధారయం
6. పదసంపదపదముల యొక్క సంపదషష్ఠీ తత్పురుష సమాసం
7. సమస్యాపూరణంసమస్య యొక్క పూరణషష్ఠీ తత్పురుష సమాసం
8. నలుదిక్కులునాలుగు (4) సంఖ్య గల దిక్కులుద్విగు సమాసం
9. ఆరాధ్య భాషఆరాధ్యమయిన భాషవిశేషణ పూర్వపద కర్మధారయం
10. మంచి చెడులుమంచి, చెడుద్వంద్వ సమాసం

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

3. ఈ కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

1. ఆహారము (ప్రకృతి) – ఓగిరము (వికృతి)
2. సొంతము (వికృతి) – స్వతంత్రము (ప్రకృతి)
3. పద్యము , (ప్రకృతి) – పద్దెము (వికృతి)
4. . బంగారము (వికృతి) – భృంగారము (ప్రకృతి)
5. అమ్మ (వికృతి) – అంబ (ప్రకృతి)
6. రాత్రి (ప్రకృతి) – రాతిరి, రే, రేయి (వికృతి)
7. కథ (ప్రకృతి) – కత (వికృతి)
8. పుస్తకము (ప్రకృతి) – పొత్తము (వికృతి)
9. ధర్మము (ప్రకృతి) – దమ్మము (వికృతి)
10. బరువు (వికృతి) – భారము (ప్రకృతి)
11. భాష (ప్రకృతి) – బాస (వికృతి)
12. బువి (వికృతి) – భూమి, భువి (ప్రకృతి)

4. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. నెమరువేయు : గురువులు బోధించిన పద్యాలను పిల్లలు నెమరువేయాలి.
2. పలుకుబడి : తెలుగుభాష పలుకుబడిలో కమ్మదనం ఉంది.
3. ఫిర్యాదు చేయు : తన సైకిలు పోయిందని, పోలీసు స్టేషనులో రామయ్య ఫిర్యాదు చేశాడు.
4. మేలుకొను : తెలుగు జాతి త్వరగా మేలుకొనకపోతే తెలుగు మృతభాషలలో చేరుతుంది.
5. మౌఖికంగా : పరీక్షలలో ప్రశ్నలను మౌఖికంగా అడుగుతారు.
6. ఆశువు : తిరుపతి వెంకటకవులు గంటకు నూరు పద్యాలు ఆశువుగా చెప్పేవారు
7. ఆబాలగోపాలము : మా గ్రామంలో ఆబాల గోపాలమూ దేవుని పెండ్లి వేడుకల్లో పాల్గొన్నారు.
8. ఏకాగ్రత : అవధాన ప్రక్రియలో ఏకాగ్రతకు, ధారణకు ప్రాధాన్యం.
9. ఆధునికము : ఆధునికంగా వస్తున్న మార్పులను పాతతరం వారు అంగీకరించాలి.
10. ప్రాచీనము : సంస్కృత భాష, ప్రాచీనమయిన భాష.

కొత్త పదాలు-అర్థాలు

చిట్టి = చిన్నది
తాతయ్య చదివిన పద్యం :
“అడిగెదనని కడు వడిఁ జను …… నడుగిడు నెడలన్ ” అనేది

గమనిక :
ఈ పద్యం, పోతన మహాకవి రచించిన ‘ఆంధ్ర మహాభాగవతములో గజేంద్రమోక్షములోనిది. విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, తొందరగా గజేంద్రుణ్ణి రక్షించడానికి, తన చేతితో పట్టుకున్న లక్ష్మీదేవి కొంగును కూడా విడిచిపెట్టకుండా, ముందుకు వెడుతున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణువు వెనకాలే వెడుతూ ఉంది. అప్పటి లక్ష్మీదేవి స్థితిని పోతనగారు ఈ పద్యంలో వర్ణించారు.

పద్యభావం :
ఎక్కడకు వెడుతున్నారని భర్తను అడుగుతానని లక్ష్మీదేవి మిక్కిలి వేగంగా ముందుకు నడుస్తూ వెళ్ళింది. అడిగినా విష్ణువు జవాబు చెప్పడని తలచి, నడవడం మానింది. ఇంతలో విషయం తెలిసికోవాలనే తొందరతో, తిరిగి ముందుకు అడుగులు వేస్తోంది. ఇంతలో మ్రాన్పాటు కలిగి, ముందడుగు వేయడం మానింది.

గమనిక :
ఈ పద్యంలో ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది. ఈ చిన్న కందపద్యంలో ‘డ’ అనే హల్లు 23 సార్లు తిరిగి తిరిగి వచ్చింది. అదే ఈ పద్యంలోని చమత్కారం.

నెమరువేయు = తిన్న పదార్థాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నమలు
జాతీయము = ఒక జాతికి సంబంధించిన పదబంధము లేక పలుకుబడి
లెస్స = మంచిది
ఫిర్యాదు = కంప్లైస్ట్ (Complaint)
చర్య = యాక్షన్ (Action)

పొడుపుకథ పద్యం

పండిన వెండిన దొక్కటి : షండినది, ఎండినది అంటే ‘వక్క’ అనగా పోకచెక్క. (పోక కాయ పండి, అది ఎండిన తర్వాత, దాన్ని వక్కలుగా చేస్తారు.

ఖండించిన పచ్చిదొకటి : చెట్టునుండి కోసిన పచ్చిది ‘తమలపాకు’.

కాలినదొకటై : ఆల్చిప్పలను కాలిస్తే ‘సున్నం’ వస్తుంది.

తిండికి రుచిగానుండును : వక్క తమలపాకు, సున్నం కలిపిన తాంబూలము, తినడానికి రుచికరం.

తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోయింది : ఈ పొడుపు కథకు సమాధానం, ‘ఉత్తరం’.

మొక్కె వంగనిది మానై వంగుతుందా? : చిన్న మొక్కగా ఉన్నపుడే అది వంగుతుంది. చెట్టు మానుగా అయిన తరువాత అది వంగదు.

జాగృతము + అవడం = మేల్కోవడం
జో జో అచ్యుత + ఆనంద = అచ్యుతా ! ఆనందా ! నీకు జోల
జోజో ముకుంద = ముకుందా ! విష్ణుమూర్తీ ! నీకు జోల
‘పలుకే బంగారమాయెనా?’ = ఈ పాటను రామదాసు అనే కంచెర్ల గోపన్న రాశాడు. (ఒక మాట మాట్లాడడం నీకు బంగారం లాంటిదా?) (తనతో మాట్లాడుమని ప్రార్థన)
మౌఖికం = ముఖం నుండి వచ్చేది
ఆశువు = అప్పటికప్పుడు, ఏ ప్రయత్నము లేకుండా చెప్పే పద్యం
ఆబాలగోపాలం = పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ
ఫణివరుండు = పెద్దపాము
సమస్యాపూరణం = సమస్యను పూర్తిచేయుట
ధారణ = జ్ఞాపకము చేసికోవడం
అవధానం = ఏకాగ్రత
అష్టావధానం (అష్ట + అవధానం) = ఎనిమిది విషయాలలో ఏకాగ్రత చూపడం
శతావధానం (శత + అవధానం) = నూరు మంది అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం
సహస్రావధానం (సహస్ర + అవధానం) = వేయి మంది ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం
ప్రతిభ = తెలివి
“మా నిజాం రాజు తరతరాల బూజు” = ఈ పద్యం చెప్పిన కవి “దాశరథి” నైజాం నవాబును గూర్చి ఆయన అలా చెప్పాడు.
“వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ = ఈ గేయం పంక్తులు, గురజాడ అప్పారావు గారి ‘దేశభక్తి’ గేయం లోనివి.
మాతృభాష = తల్లి భాష
ఆరాధ్య భాష = పూజింపదగిన భాష
మహానుభావులు = గొప్పవారు
ఆధునికము = నవీనము
భువి = భూమి