AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers

ప్రశ్న 1.
కవితకు తీవ్రమైన జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ 5 రోజులకు సూక్ష్మజీవ నాశకాలు (Antibiotics) వాడమని మందులు రాశాడు. మూడు రోజులు వాడిన తరువాత జబ్బు నయం అయింది. ఆమె యాంటిబయాటిక్ మందులు వాడటం మానివేసింది. ఆమె చేసింది సరైనదేనా ? కాదా ? ఎందుకు ? కారణాలు రాయండి.
జవాబు:

  • కవిత చేసింది సరైంది కాదు.
  • ఎందుకంటే డాక్టరు ఆమె జబ్బు నయం అయ్యేందుకు అవసరమైన మోతాదు ఐదు రోజులకు సూక్ష్మజీవ నాశకాలు వాడమని అన్నారు.
  • కానీ జబ్బు మూడవ రోజు తగ్గిందని ఆమె మందులు మానింది.
  • పైకి జబ్బు తగ్గినట్లుగా వున్న, శరీరం లోపల ఇంకా ఆ వ్యాధికారక సూక్ష్మజీవులు వుంటాయి.
  • అవి పూర్తిగా నిర్మూలించబడకుండా మందులు మానివేస్తే జబ్బు తిరగబెడుతుంది.
  • ఒకవేళ మందులు మానివేయాలి అంటే అది డాక్టరు సలహా పై జరగాలి తప్ప మనంతట మనం నిర్ణయించుకోవటం మంచిది కాదు.
  • ఉదా : పచ్చ కామెర్లు తగ్గినా, దీని వ్యాధికారక క్రిమి 6 నెలల వరకు పాక్షికంగా మన శరీరంలోనే వుంటుంది. అందుకే డాక్టరు ఇచ్చిన మోతాదు తప్పక వాడాలి.

ప్రశ్న 2.
టీకాలు మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయి ?
జవాబు:
టీకాలు లేదా వ్యాక్సిన్లు మన శరీరంలో వ్యాధి రాకముందే ప్రవేశించి, రోగకారక క్రిమిని నశింపచేయటానికి తగిన రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. ఉదా : ‘పోలియో చుక్కలు’. ఈ మందు చిన్నపిల్లలకు ఇచ్చినప్పుడు ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరువాత పోలియో వైరస్ శరీరంలోకి ప్రవేశించినా అది పోలియోను కలుగచేయలేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 3.
పాశ్చరైజేషన్ అంటే ఏమిటి ? అది ఎందుకు ఉపయోగపడుతుంది ?
జవాబు:

  • “లూయీపాశ్చర్” వైన్ చెడిపోవటానికి సూక్ష్మజీవులు కారణం అని గుర్తించాడు.
  • వైన్ ను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను చంపి, ఎక్కువ కాలం వైన్ ను నిల్వ చేయవచ్చని నిరూపించాడు. ఈ విధానాన్ని ‘పాశ్చరైజేషన్’ అంటారు.
  • ఇది పాలను పెరుగుగా మార్చటానికి, ద్రాక్ష రసాన్ని పులియబెట్టి వైన్ గా మార్చటానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
మలేరియా వ్యాధిని నిర్మూలించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. ‘మలేరియా’ ఇది జ్వర రూపంలో వచ్చే వ్యాధి.
2. తీవ్రమైన చలితో కూడిన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం దీని లక్షణాలు.
3. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి దోమల నివారణకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎ) పరిసరాలలో మురుగు గుంటలు, కాలువలు లేకుండా చేయాలి.
బి) ఒకవేళ వున్నా ఆ మురికినీటిపై నూనె చుక్కలు వేస్తే అది నూనె తెట్టును ఏర్పరుస్తుంది. దీంతో ఆ నీటిలోవున్న లార్వాలు చనిపోతాయి.
సి) దోమ తెరలను వాడాలి.
డి) దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను పెట్టాలి.
ఇ) ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా వుంచుకోవటం ముఖ్యమైన విషయం.

ప్రశ్న 5.
వ్యాక్సిన్ తీసుకోవటానికి, యాంటిబయాటిక్ తీసుకోవడానికి సరైన సమయం ఏది ? ఎందుకు ?
జవాబు:

  • వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందును ‘వ్యాక్సిన్’ అంటారు.
  • వ్యాధి వచ్చిన తరువాత అది తగ్గటానికి తీసుకునే మందులే యాంటిబయాటిక్స్.
  • కాబట్టి చిన్న వయస్సులో పెద్దలు, డాక్టర్ల సూచనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలి.
  • ఉదా : 1) ధనుర్వాతం, మశూచి మొ॥ రాకుండా చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీకాలు వేస్తారు.
    2) పచ్చ కామెర్లు రాకుండా 10-15 సం॥ పిల్లలలో, పెద్దలకు కూడా Hepatitis – B వ్యాక్సిన్ ఇస్తారు.
  • ఇక యాంటిబయాటిక ను జబ్బు లక్షణాలు కనిపించిన తరువాత డాక్టరు నిర్ణయించిన మోతాదు ప్రకారం మాత్రమే మందులను వేసుకోవాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 6.
వ్యాక్సిను, యాంటిబయాటిక్ తేడాలు ఏమిటి?
జవాబు:

వ్యాక్సిన్ యాంటిబయాటిక్
1) చైతన్య రహిత సూక్ష్మజీవులను శరీరంలోనికి ఎక్కించే ప్రక్రియను వాక్సిన్ అంటారు. 1) సూక్ష్మజీవులను చంపే రసాయన పదార్థాలను సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటిబయాటిక్స్ అంటారు.
2) వ్యాధినిరోధక వ్యవస్థను పెంచుతుంది. 2) వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు యాంటిబయాటిక్స్ వాడతారు.
3) ప్రతిరక్షకాలు తయారవుతాయి. 3) ప్రతిరక్షకాలు తయారుకావు.
4) దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. 4) ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది.
5) వ్యాధి రాకుండానే వాక్సిన్ ఇస్తారు. 5) వ్యాధి వచ్చిన తరువాత యాంటిబయాటిక్స్ వాడతారు.
6) వ్యాక్సిన్స్ వ్యాధి రాకుండా ఉండటానికి తోడ్పడతాయి. 6) యాంటిబయాటిక్స్ వ్యాధిని తగ్గించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 7.
‘పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుండి రక్షించింది’ దీనిని వివరించండి.
జవాబు:

  • ‘పెన్సిలిన్’ అంటే యాంటిబయాటిక్ మందు.
  • దీనిని సూక్ష్మజీవ నాశకం అని కూడా అంటారు.
  • దీనిని డా॥ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కనిపెట్టాడు.
  • గాయపడిన సైనికులు సూక్ష్మజీవుల బారినపడి మరణిస్తుంటే, వీటిపై ప్రయోగాలు చేసి ఈ మందును కనిపెట్టాడు.
  • ఎందరో సైనికులను వ్యాధుల నుండి కాపాడాడు.
  • తరువాత కాలంలో ఇది మరెన్నో కోట్ల మందిని మరణం నుంచి, వ్యాధుల నుంచి కాపాడింది.
  • అందుకే పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుంచి రక్షించింది.

ప్రశ్న 8.
ప్రతిరక్షకాలు అంటే ఏమిటి ? ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి ? ఎలా మనకు సహాయపడతాయి ?
జవాబు:

  • వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి మనల్ని రక్షించేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది.
  • వీటినే ప్రతిరక్షకాలు అంటారు.
  • ఇవి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి.
  • ఇవి వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 9.
రాజీ తన పక్కింటి వారితో “మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి” అని చెప్పింది. ఈ సమయంలో ఆమె వ్యాధుల గురించి ఏమేమి వివరాలు చెప్పి ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:

  • మురుగునీరు నిల్వ ఉంటే దానిలో దోమలు, వాటి లార్వాలు పెరుగుతాయి.
  • వాటి ద్వారా వ్యాధులు ప్రబలుతాయి.
  • ఉదాహరణకు ‘మలేరియా’ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • టైఫాయిడ్ కూడా క్యూలెక్స్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • మలేరియా చలితో వచ్చే జ్వరం. కానీ టైఫాయిడ్ తక్కువ జ్వరంతో చాలా రోజులు బాధపెడు.
  • ఈ రెండు వ్యాధులకు మురుగునీరు ఒక రిజర్వాయర్ లాంటిది. దీనిలో వీటి లార్వాలు పెరిగి వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి.
  • ఇవి రెండు కాకుండా పోలియో, కలరా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధి లాంటి వ్యాధులన్నింటికీ దోమలు వాహకాలు.
  • మురుగునీరు దోమలకు ఆవాసం. కాబట్టి మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి అని రాజీ చెప్పిన విషయం సరైనదే.

ప్రశ్న 10.
మూడు గిన్నెలు తీసుకుని A, B, C గా గుర్తించండి. వాటిలో గోరువెచ్చని పాలు, వేడి పాలు, చల్లని పాలు వరుసగా పోయండి. మూడింటిలో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పెరుగు తోడు వేయండి. కదపకుండా 5-6 గంటల సేపు ఉంచండి. తరువాత మూతలు తీసి పాలలో వచ్చిన మార్పులు గమనించండి.
1. గిన్నెలో పాలు పెరుగుగా మారాయి ?
2. ఏ రెండు గిన్నెలలో పాలు పెరుగుగా మారలేదు ?
జవాబు:

  • గోరువెచ్చని పాలు వున్న ‘A’ గిన్నెలో పెరుగు తయారయింది.
  • ‘B’ గిన్నెలో వేడి పాలు వున్నాయి. అంత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లాక్టోబాసిల్లస్’ బాక్టీరియా చనిపోతుంది. కాబట్టి కిణ్వనం జరపలేదు. అందుకే పెరుగు తయారవ్వలేదు. పాలు అడలి పోయినట్లు అయిపోతాయి.
  • ‘C’ గిన్నెలో చల్లని పాలు ఉన్నాయి. బాక్టీరియాకు అవసరమైన ఉష్ణోగ్రత కన్నా తక్కువ పాలలో వుంది. కాబట్టి బాక్టీరియా ఎదుగుదల అతి తక్కువ కాబట్టి పెరుగు తయారవ్వలేదు సరికదా పాలు విరిగిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 11.
మైక్రోబయాలజీకి సంబంధించిన విషయాలు కనుగొన్న శాస్త్రవేత్తల గురించి సమాచారాన్ని సేకరించండి. ఈ ఆవిష్కరణలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయో సూచించే చార్టును రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

వ.సం. శాస్త్రవేత్త పేరు కనుగొన్న అంశం
1. ఆంథోనివాన్ ల్యూవెన్ హాక్ బాక్టీరియా
2. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్
3. డా॥ యల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్
4. డా॥ జోసన్ సాక్
డా॥ ఆల్బర్ట్ సాచిన్ పోలియో
పోలియో వ్యాక్సిన్
(చుక్కల మందు)
5. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి టీకా మందు
6. లూయీ పాశ్చర్ కుక్క కాటుకి టీకా పాశ్చరైజేషన్
7. డా॥ రోనాల్డ్ రాస్ మలేరియా దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పాడు.

ప్రశ్న 12.
మైక్రోబయాలజీ (సూక్ష్మజీవుల శాస్త్రం) లో ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల ఫోటోలతో ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 1

ప్రశ్న 13.
మీ దగ్గరలో వున్న పాల డైరీని లేదా గ్రంథాలయాన్ని సందర్శించండి. పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని వివరించే ప్రాజెక్టు తయారుచేయండి.
జవాబు:
పాశ్చరైజేషన్ : నిర్వచనం : ఆహార పదార్థాలను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను తొలగించి వాటిని ఎక్కువ సమయం నిల్వ చేయటాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీనిని లూయీపాశ్చర్ కనిపెట్టారు.

విధానం : పాలను నిల్వ చేయటం : 1. మొదట పాలను 70°C వరకు 30 సెకన్ల పాటు వేడి చేస్తారు. 2. తరువాత పాలను చల్లార్చి నిల్వ చేస్తారు.

వైన్ ను నిల్వ చేయటం : 1. మొదట వైన్ ను వేడి చేసి తరువాత చల్లబరుస్తారు. 2. ఆపై దానిని నిల్వచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 14.
మీ గ్రామంలోని పశువుల ఆసుపత్రిని సందర్శించి అక్కడి డాక్టర్ ని అడిగి పశువులు, గొర్రెలు మరియు మేకలలో వచ్చే జబ్బుల జాబితా తయారుచేయండి.
జవాబు:

జబ్బులు
1. పశువులు జబ్బులు గాలికుంటు వ్యాధి, నోటి వ్యాధులు, సెప్టిసీమియ
2. గొర్రెలు ఆంధ్రాక్స్
3. మేకలు ఆంధ్రాక్స్

ప్రశ్న 15.
“సూక్ష్మజీవులు లేకపోతే భూమి చెత్తాచెదారం, జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది” అని సమీర్ వాళ్ళ నాన్నతో అన్నాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా ? ఎందుకు ?
జవాబు:

  • సమీర్ తో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే సూక్ష్మజీవులు కొన్ని ఉపయోగకరమైనవి. మరికొన్ని అపాయకరమైనవి.
  • అపాయకరమైన సూక్ష్మజీవులు వ్యాధులు కలుగచేస్తాయి. ఆహారం తదితరాలను పాడుచేస్తాయి.
  • కానీ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఇంటిలోను, పరిశ్రమలలోను, పరిసరాలలోని పర్యావరణాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి.
  • భూమిపై నున్న చెత్తను కుళ్ళింపచేయటానికి సూక్ష్మజీవులే కారణం.
  • తద్వారా ఆ చెత్తను భూమి మృత్తికలో కలసి పోయేలా చేస్తాయి.
  • జంతువుల మృత కళేబరాలు కుళ్ళి భూమిలో (మృత్తికలో) కలసిపోవటానికి కూడా ఈ సూక్ష్మజీవులే కారణం.
  • ఇవే కనుక లేకపోతే భూమి అంతా చెత్తచెదారం జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది.

ప్రశ్న 16.
ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా కనుగొనే క్రమంలో కౌపాక్స్ సోకిన వ్యక్తి బొబ్బల నుండి ద్రవం తీసి 8 సంవత్సరాల బాలుడికి ఎక్కించాడు. తరువాత ఆ బాలునికి మశూచి రాదని ప్రయోగ పూర్వకంగా నిరూపించాడు. ఎడ్వర్డ్ జెన్నర్ ధైర్యంతో కూడిన నిశిత పరిశీలనలను ఎలా అభినందిస్తావు ?
జవాబు:

  • ఎడ్వర్డ్ జెన్నర ను ముందుగా అతని ధైర్యానికి అభినందించాలి.
  • అలాగే తన ప్రయోగాలు, పరికల్పనలపై ఆయనకున్న నమ్మకాన్ని మనం అభినందించాలి.
  • శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరికల్పనలు చేస్తుంటారు.
  • జెన్నర్ లాంటి డాక్టర్ల ప్రయోగాలు ముందు జంతువుల పై, తరువాత అనుమతితో మనుషులపై చేస్తున్నప్పుడు ఎంతో ఉద్విగ్నత కలుగుతుంది.
  • 8 సం॥ బాలుడిపై ప్రయోగం కోసం అతను ఆ పిల్లాడి తల్లిదండ్రులను ఎలా ఒప్పించగలగాడో ? ఆ రోజుల్లో అదొక అద్భుతం. వారు ఒప్పుకుని జెన్నర్ విజయంలో భాగస్వాములయ్యారు. అందుకు వారు అభినందనీయులు.
  • కౌపాక్స్, చికెన్ పాక్స్ వచ్చిన ఇద్దరు వేరు వేరు రోగులను నిశితంగా పరిశీలించి, వాటి కారణాల కోసం ఎంతో ఉత్తమమైన పరికల్పనలు చేసిన జెన్నర్ నిశిత పరిశీలన ఈనాటి డాక్టర్లకు కావలసిన ముఖ్య లక్షణం. అందుకు డా॥ జెన్నర ను నేను ఎంతో అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 17.
‘చికిత్స కంటే నివారణే మేలు’ దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:

  • ‘చికిత్స’ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం తీసుకునే వైద్యం.
  • ‘నివారణ’ అంటే ఆ జబ్బు రాకుండా తీసుకునే ‘ముందు జాగ్రత్త’ కాబట్టి నివారణకే మనం ప్రాధాన్యత నివ్వాలి.
  • ప్రతి వ్యాధికి ఈ రోజున నివారణా పద్ధతులు వున్నాయి.
  • వ్యాధి బారిన పడి బాధపడే కంటే నివారణోపాయాలు తెలుసుకుని వ్యాక్సిన్లు, జాగ్రత్తలు పాటించి మనల్ని మనం ఆరోగ్యవంతులుగా ఉంచుకోవటం మంచిది అని నా అభిప్రాయం.

ప్రశ్న 18.
“చాక్లెట్స్, ఐస్ క్రీములు తిన్న తరువాత నోరు బాగా పుక్కిలించాలి” అని లత తన సోదరుడు రాజేష్ తో చెప్పింది. లత చెప్పింది నిజమేనా ? ఎందుకు ?
జవాబు:

  • లత రాజేష్ తో చెప్పింది నిజమే.
  • కారణం ఏమిటంటే – చాక్లెట్, ఐస్ క్రీమ్ లు తిన్నప్పుడు అవి దంతాల మధ్యలో, చిగుళ్ళలో ఇరుక్కుపోతాయి.
  • నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం ద్వారా సూక్ష్మజీవులు చేరకుండా చూసుకోవచ్చు.
  • చాక్లెట్, ఐస్ క్రీమ్ లో చక్కెర శాతం ఎక్కువ మరియు రెండూ అతి మెత్తని ఆహార పదార్థాలు.
  • వీటిని తిన్నప్పుడు నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం తప్పనిసరి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 InText Questions and Answers

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
లాక్టోబాసిల్లస్ బాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • పెరుగులో లాక్టోబాసిల్లస్ బాక్టీరియా ఉంటుంది.
  • ఈ పెరుగు గోరువెచ్చని పాలలో కలిసినప్పుడు ఈ బాక్టీరియా పాలలో పెరిగి పాలను పెరుగుగా మారుస్తుంది.
  • ఈ బాక్టీరియా లేకపోతే పాలు విరిగిపోతాయి తప్ప పెరుగు రాదు.

కృత్యం – 2

ప్రశ్న 2.
ఇడ్లీ, దోసెల పిండి ఉదయానికల్లా పొంగుతుంది ? ఎందువల్ల ?
జవాబు:

  • ఇడ్లీ, దోసెల పిండిలలో మినపపప్పు, బియ్యం, (ఉప్పుడు బియ్యపు రవ్వ) వేసి కలిపి అలా వుంచుతారు.
  • గాలిలో బాక్టీరియా వుంటుంది కదా ! ఆ బాక్టీరియాలో ‘ఈస్ట్’ వుంటుంది.
  • ఇది ఇడ్లీ, దోసెల పిండి పై చర్య (కిణ్వనం) జరిపి CO2 ను తయారుచేస్తుంది.
  • ఇది పిండితో కలసి ఆ పిండి పరిమాణం ఎక్కువయ్యేలా చేస్తుంది.
  • తద్వారా ఉదయానికల్లా ఇడ్లీ, దోసెల పిండి పొంగుతుంది.

కృత్యం – 3

ప్రశ్న 3.
సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 2
కృత్యం : రెండు చిన్న గిన్నెలు లేదా బీకర్లు తీసుకోవలెను. రెండింటిలో సగం వరకు నీరు పోయవలెను. వాటికి 5 నుండి 10 చెంచాల చక్కెర కలపవలెను. ఒకదానికి 2 నుండి 3 చెంచాల ఈస్టును కలపవలెను. రెండు గిన్నెలపై మూతలు పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచవలెను. 3 లేదా 4 గంటల తరువాత మూతలు తీసి వాసన చూడవలెను.

గమనించినది : ఈస్టు కలిపిన గిన్నె నుండి ఆల్కహాలు వాసన వచ్చింది. ఈస్టు కలపని గిన్నె నుండి ఎటువంటి వాసన లేదు.

కారణము : చక్కెరను ఈస్టులు ఆల్కహాలుగా మార్చుతాయి. కాబట్టి ఈస్టు కలిపిన చక్కెర నుండి ‘ఆల్కహాలు’ వాసన వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 4

ప్రశ్న 4.
మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తను లేదా డాక్టర్‌ను కలవండి. వివిధ వ్యాధుల రాకుండా ఏ వయస్సులో ఏ టీకాలు ఇస్తారో తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారాన్ని పట్టిక తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

టీకా నిరోధక వ్యాధి వయస్సు
బిసిజి క్షయ పుట్టినప్పుడు, 10 సం॥లకు
డిటిపి డిప్తీరియా
కోరింతదగ్గు
ధనుర్వాతము
6వ వారం, 10వ వారం,
14వ వారం , 18వ నెల
హెపాటిటిస్ – బి హెపాటిటిస్ – బి పుట్టినప్పుడు, 6వ వారం, 14వ వారం
ఒపివి పోలియో పుట్టినప్పుడు, 6వ వారం, 10వ వారం, 14వ వారం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
ఎంఎంఆర్ తడపర, గవదబిళ్ళలు, రూబెల్లా 9వ నెల, 15వ నెలలో బూస్టర్ డోస్
పిసివి న్యూమోనియా 6వ వారం, 10వ వారం, 14వ వారం, 15వ నెలలో బూస్టర్ డోస్
టైఫాయిడ్ టైఫాయిడ్ 2వ సంవత్సరం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
వరిసెల్లా ఆటలమ్మ మొదటి సంవత్సరం

కృత్యం – 5

ప్రశ్న 5.
నేల సారాన్ని సూక్ష్మజీవులు పెంచుతాయి. అని ఎలా చెప్పగలరు ?
జవాబు:

  • గాలిలో 78% నత్రజని వుంది.
  • మొక్కలు పోషకాలు తయారుచేయటానికి నత్రజని అవసరం.
  • కానీ మొక్కలు నేరుగా గాలిలో వున్న నత్రజనిని ఉపయోగించుకోలేవు.
  • దీనికి ‘రైజోబియం’ అనే బాక్టీరియా గాలిలో నత్రజనిని నైట్రేట్లుగా మార్చి భూసారాన్ని పెంచుతుంది.
  • రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలో నత్రజనిని, నత్రితా సమ్మేళనాలుగా మార్చి నేలకు పోషక పదార్థాలు అందచేస్తాయి.
  • చిక్కుడు జాతి మొక్కల వేర్లలో ‘వేరు బొడిపెలు’ వుంటాయి. వాటిలో ‘రైజోబియం’ బాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది.
  • అందుకే రైతులు వీటి వేళ్ళను భూమిలోనే వుంచి దున్నుతాయి. అందువల్ల భూసారం పెరుగుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 6

ప్రశ్న 6.
కంపోస్టు గుంట :
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 3
మీ పాఠశాల బడితోటలో ఒక మూలన లేదా మీ ఇంటిలో గల ఖాళీ స్థలములో రెండు గుంటలు తవ్వండి లేదా 2 ఖాళీ కుండలు తీసుకోండి. వీటిని సగం వరకు మట్టితో నింపండి. దీనిలో రాలిన ఆకులు, వృథా అయిన కూరగాయలు, కాగితం ముక్కలు, చెత్తాచెదారంతో నింపండి. రెండవ దానిలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు, వస్తువులను పాలిథీన్ సంచులను, గాజు ముక్కలతో నింపండి. ఇప్పుడు రెండు కుండలను లేదా గుంతలను మట్టితో కప్పండి. వాటిపై నీటిని చల్లండి. ఈ విధంగా ప్రతిరోజు నీరు చల్లండి. మూడు, నాలుగు వారాల తర్వాత గుంతల కుండలపై మట్టిని తొలగించండి.

గమనించినది : మొదటి కుండలోని పదార్థాలు కుళ్ళాయి. దీనిలో వేసిన ఆకులు, కాగితం ముక్కలు, కూరగాయలు మొదలైనవి నేలలో కలసిపోయే పదార్థాలు. ఇవి సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం కాబడతాయి. రెండవ కుండలోని మార్పుచెందని లేదా కుళ్ళని పదార్థాల వలన నేల స్వభావం మారుతుంది. నేల ఆరోగ్యం క్షీణించి, నేల కాలుష్యానికి దారి తీస్తుంది.

కృత్యం – 7

ప్రశ్న 7.
మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా డాక్టరును సందర్శించి, సూక్ష్మజీవుల వలన వచ్చే వివిధ రకాల వ్యాధులను గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 4