SCERT AP 8th Class Biology Study Material Pdf 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 4th Lesson Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి
8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
ప్రకృతిలో అన్ని జీవులు ప్రత్యుత్పత్తిని ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
- ప్రత్యుత్పత్తి అనేది సజీవులలో ఒక ముఖ్యమైన జీవనక్రియ.
- దీనివల్ల ప్రౌఢ జీవులు, పిల్ల జీవులను ఉత్పత్తి చేసి తమ తమ జాతులను, వాటి జనాభాను పెంచుకుంటూ ఈ జీవావరణంలో తమ ప్రభావం కోల్పోకుండా చూసుకుంటాయి.
- దీనివల్ల పాత తరం స్థానంలో కొత్త తరం వచ్చి ఆవరణ వ్యవస్థలో వాటి పాత్రను పూర్తిచేసి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి.
- ప్రత్యుత్పత్తిని జీవులు ఆపివేస్తే, ఉన్న జీవులు ముసలివై కొంతకాలం తర్వాత చనిపోతాయి. తరువాత వాటి స్థానాన్ని భర్తీచేసే కొత్తతరం ఉండదు.
- కాబట్టి ‘ప్రకృతిలో సమతుల్యత’ దెబ్బతిని సృష్టి అంతానికి కారణమవుతుంది.
ప్రశ్న 2.
ఈ కింది వాటిలో తేడాలను తెలపండి.
ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి | అలైంగిక ప్రత్యుత్పత్తి |
1. ఒక జీవి లేదా స్త్రీ పురుష జీవులు అవసరం. | 1. ఒక జీవి మాత్రమే అవసరమవుతుంది. |
2. స్త్రీ పురుష బీజకణాలు ఏర్పడతాయి. | 2. బీజ కణాలు ఏర్పడవు. |
3. సంయుక్త బీజం ఏర్పడుతుంది. | 3. సంయుక్తబీజం ఏర్పడదు. |
4. సగం తల్లి లక్షణాలు, సగం తండ్రి లక్షణాలు వస్తాయి. | 4. ఇవి తల్లి జీవి నకలు (జిరాక్స్) గా ఉంటాయి. |
బి) సంయోగ బీజం, సంయుక్త బీజం
జవాబు:
సంయోగ బీజం | సంయుక్త బీజం |
1. ఇది స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల నుండి తయారవుతుంది. | 1. ఇది స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల ఏర్పడుతుంది. |
2. ఇది ఏకస్థితికం. | 2. ఇది ద్వయ స్థితికం. |
3. ఇది ఫలదీకరణలో పాల్గొంటుంది. | 3. ఫలదీకరణ తరువాత మాత్రమే ఇది ఏర్పడుతుంది. తద్వారా జీవి పెరుగుదల మొదలవుతుంది. |
సి) బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణ
జవాబు:
బాహ్య ఫలదీకరణ | అంతర ఫలదీకరణ |
1. శరీరం బయట జరుగు ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అంటారు. | 1. శరీరం లోపల (స్త్రీ జీవిలో) జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణ అంటారు. |
2. సంయుక్తబీజం బయట (గాలి, నీరు, నేల) అభివృద్ధి చెందుతుంది. ఉదా : కప్ప, చేప | 2. సంయుక్త బీజం స్త్రీ జీవి శరీరంలోపల అభివృద్ధి చెందుతుంది. ఉదా : క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మొ॥నవి. |
డి) అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు
జవాబు:
అండోత్పాదకాలు | శిశోత్పాదకాలు |
1. గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు. | 1. పిల్లల్ని కని, పెంచి తరువాతి తరాన్ని అభివృద్ధి చేసే వాటిని శిశోత్పాదకాలు అంటారు. |
2. వీటిలో అంతర ఫలదీకరణ జరుగును. ఉదా : పక్షులు, సరీసృపాలు |
2. వీటిలో కూడా అంతర ఫలదీకరణ జరుగును. ఉదా : క్షీరదాలు, గబ్బిలం (ఎగిరే క్షీరదం) |
ప్రశ్న 3.
హైడ్రా, అమీబాల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను పోల్చండి.
జవాబు:
హైడ్రా ప్రత్యుత్పత్తి | అమీబాలో ప్రత్యుత్పత్తి |
1. ఇది బహుకణ జీవి. | 1. ఇది ఏకకణ జీవి. |
2. దీనిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. | 2. దీనిలో కూడా అలైంగిక పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. |
3. ఈ పద్ధతిని మొగ్గ తొడగడం లేదా ‘కోరకీ భవనం’ అంటారు. | 3. ఇది ద్విధావిచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తిల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. |
4. ప్రత్యుత్పత్తి తరువాత తల్లిజీవి అంతరించిపోదు. | 4. కానీ దీనిలో మాత్రం ద్విధా లేదా బహుధా విచ్ఛిత్తి తల్లిజీవి, పిల్లజీవి రెండూ జీవనం కొనసాగిస్తాయి. తరువాత తల్లి కణం అంతర్ధానమయ్యి పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. |
ప్రశ్న 4.
సంయుక్తబీజం ఏర్పరచకుండానే జంతువులు వాటి సంతతిని ఉత్పత్తి చేయగలవా ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:
- లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడి, దాని నుండి జీవులు ఏర్పడతాయి.
- కాని అన్ని జంతువులు లైంగిక ప్రత్యుత్పత్తిని అనుసరించవు.
- కొన్ని జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడకుండానే సంతతిని ఉత్పత్తి చేస్తాయి.
- ఉదా : అమీబా – ద్విదావిచ్ఛిత్తి
హైడ్రా – మొగ్గతొడగటం
ప్రశ్న 5.
బాహ్య లక్షణాలు పరిశీలించి ఒక జీవి అండోత్పాదకమో, శిశోత్పాదకమో ఎలా గుర్తించగలవు ?
జవాబు:
1) అండోత్పాదక జీవిలో
- చెవులు బయటకు కనిపించవు.
- చర్మంపై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి.
- ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.
2) శిశోత్పాదక జీవిలో
- చెవులు బయటకు కనిపిస్తాయి.
- చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి.
- ఉదా : క్షీరదాలు.
ప్రశ్న 6.
నేను ఎవరిని ?
i) నేను పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడతాను.
జవాబు:
సంయుక్త బీజము అంటారు.
ii) నాకు తోక ఉంటుంది. అండంతో సంయోగం చెందుతాను.
జవాబు:
శుక్రకణం అంటారు.
iii) తల్లి గర్భాశయంలో పూర్తిగా ఎదిగిన పిండాన్ని నేను.
జవాబు:
భ్రూణం అంటారు.
ప్రశ్న 7.
అనేక భూచరాలలో అంతర ఫలదీకరణ జరుగుటకు కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
- బాహ్య ఫలదీకరణలో నీరు మాధ్యమంగా పనిచేస్తుంది.
- అందువలన సంయోగబీజాలు ఎండిపోయి చనిపోవటం జరగదు.
- వీటి చలనానికి నీరు దోహదపడుతుంది.
- భూచర జీవులు భూమిమీద నివశిస్తాయి.
- నేలమీద సంయోగబీజాలు చలించలేవు.
- వేడికి, గాలికి సంయోగబీజాలు చనిపోతాయి.
- అందువలన భూచరజీవులు అంతర ఫలదీకరణను అవలంబిస్తాయి.
ప్రశ్న 8.
కింది పటం సహాయంతో అందులోని జీవి యొక్క జీవిత చరిత్రలో వివిధ దశలను గుర్తించండి. ఈ జీవిలో రూపవిక్రియ ఎలా జరుగుతుందో వివరించండి.
జవాబు:
- ఈ పటంలో ఉన్నది ‘పట్టు పురుగు’ జీవిత చక్రంనకు సంబంధించినది.
- దీనిలో ఎ) ప్రౌఢజీవి b) గుడ్ల దశ c) లార్వా దశ d) ప్యూపా దశలు ఉన్నాయి.
- పట్టు పురుగు నందు అంతర ఫలదీకరణ జరిగి సంయుక్త బీలు – స్త్రీ జీవిలో ఏర్పడతాయి.
- ఇది మల్బరీ ఆకుల వెనుకభాగాన గుడ్లు దశలు దశలుగా, గుంపులుగా పెడుతుంది.
- ఇవి ‘సూర్యరశ్మి’ సమక్షంలో పొదగబడి లార్వా దశకు చేరుకుంటాయి.
- ఇది ‘గొంగళి పురుగు’ మాదిరిగా ఉండి మల్బరీ ఆకులను తింటూ జీవిస్తుంది.
- తరువాత ‘ప్యూపాదశ’లో ఈ డింభకం ఒక సంచి వంటి కోశాన్ని నిర్మించి దానిలో సుప్తావస్థలోకి వెళ్తుంది.
- తరువాత అది కోశం నుండి ‘ప్రౌఢజీవి’ గా అభివృద్ధి చెందుతుంది.
- ప్రౌఢజీవి లక్షణాలు లార్వా, ప్యూపా దశలలో లేనప్పటికీ చివరికి మరలా తల్లి లక్షణాలతో జీవి అభివృద్ధి చెందింది. దీనిని రూపవిక్రియ అంటారు.
ప్రశ్న 9.
జతపరచండి.
జవాబు:
ఎ) 2
బి) 1
సి) 4
డి) 3
ప్రశ్న 10.
ఈ కింది ఖాళీలను పూరింపుము.
ఎ) పిల్లలను కనే జంతువులను ……………….. అంటాం.
బి) మానవులలో శిశువు పెరుగుదల …………………. లో జరుగుతుంది.
సి) అండాలు ……………………… నుండి విడుదలవుతాయి.
డి) టాడ్ పోల్ అనేది ……………………… యొక్క ప్రాథమిక రూపం.
ఇ) కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి …………………… ప్రత్యుత్పత్తి విధానాలు.
జవాబు:
ఎ) శిశోత్పాదక జీవులు
బి) స్త్రీ జీవి గర్భాశయం
సి) స్త్రీ జీవి బీజకోశం
డి) కప్ప
ఇ) అలైంగిక
ప్రశ్న 11.
అమీర్ ఒక చెరువులో టాడ్ పోల్ ను చేపగా భావించి జాగ్రత్తగా అక్వేరియంలో ఉంచాడు. కొన్ని రోజుల తరువాత అమీర్ దానిలో ఏమేమి మార్పులు గమనిస్తాడో రాయండి.
జవాబు:
- ‘టాడ్పేల్’ అచ్చం చేపపిల్ల లక్షణాలు కలిగిన ‘కప్ప డింభకం’.
- పిల్లలు (అమీర్) దానిని చెరువులో చూసి చేపపిల్ల అనుకుని ఆక్వేరియంలో ఉంచాడు.
- ముందు దీనికి జిగురు ముద్ద లాంటి మూతి ఉండటం గమనించాడు.
- అది నీళ్ళలో నాచును, అక్వేరియంలో గోడలను అంటిపెట్టుకోవటానికి పనికి వస్తుందని గమనించాడు.
- దీనికి ఉన్న తోక సాయంతో ఈదగలుగుతుందని గమనించాడు.
- ఇది బాహ్య మొప్పల ద్వారా ‘జల శ్వాసక్రియ’ జరుపుతుందని తెలుసుకున్నాడు.
- నెమ్మదిగా ముందున్న శ్లేష్మస్థర ముద్ద నోరుగా పై క్రింది పెదవులుగా విడిపోవటం చూసాడు.
- తరువాత మొప్పలపై ఉపరికుల ఏర్పడింది.
- తరువాత దీని తోక కొంచెం కొంచెం పొడవు తగ్గటాన్ని గమనించాడు.
- ఉపరికుల, బాహ్య మొప్పల స్థానంలో ముందు కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
- తరువాత తోక మొదలైన స్థానం నుంచి ఇరుపక్కల వెనుక కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
- తల కింది భాగంలో ఇరువైపులా ఉన్న బాహ్య మొప్పలు అంతరించిపోయాయి.
- తోక పూర్తిగా కుంచించుకుపోయింది.
- ముందు, వెనుక కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందాయి.
- ఊపిరితిత్తులు ఏర్పడి ఇది నీటి పైకి మూతి పెట్టి బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోవటం గమనించాడు.
- ఇది ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెంది కప్ప పిల్లగా మారిపోవడాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయాడు.
ప్రశ్న 12.
చేపలు, కప్పలు అధిక సంఖ్యలో అండాలను ఎందుకు విడుదల చేస్తాయి ? మానవుని వంటి క్షీరదాలు అధిక సంఖ్యలో అండాలు విడుదల చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:
- చేపలు, కప్పలలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది.
- కావున ఇవి అండాలు, శుక్రకణాలను నీటిలోనికి విడుదల చేస్తాయి.
- నీటి ప్రవాహానికి వర్షాలకు ఇతర జీవుల ఆహారంగా కొన్ని అండాలు నశిస్తాయి.
- అందువలన అండాలలో ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. కావున ఈ జీవులు అధిక సంఖ్యలో అండాలను ఉత్పత్తి చేస్తాయి.
- మానవుని వంటి క్షీరదాలలో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
- అండాలు నశించటం ఉండదు. ఫలదీకరణ అవకాశాలు అధికం.
- కావున క్షీరదాలలో అండాలు తక్కువ సంఖ్యలో విడుదల అవుతాయి.
ప్రశ్న 13.
మీ గ్రంథాలయము నుండి గాని, ఇతర వనరుల నుండి గానీ తేనెటీగ యొక్క జీవిత చరిత్రను సేకరించి, పాఠశాల సింపోసియంలో ఆ అంశాలను చర్చించండి.
జవాబు:
- తేనెటీగ ‘ఆర్థోపొడ’ వర్గానికి చెందిన జీవి.
- ఇవి చాలా కష్టజీవులు. పువ్వుల నుండి మకరందం సేకరించి ‘తేనె’ తయారు చేస్తాయి.
- క్రమ శిక్షణకు, నాయకత్వ విధేయతకు, మాతృసామ్య వ్యవస్థ మూలాలకు ఈ తేనెటీగలు మంచి ఉదాహరణ.
- వీని జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. a) గుడ్లు b) లార్వా c) ప్యూపా d) ప్రౌఢజీవి.
- ఆడ ఈగలు ప్రత్యుత్పత్తి తర్వాత గుడ్లు పెడతాయి.
- ఇవి పొదగబడిన తరువాత వాటి నుండి లార్వాలు వస్తాయి.
- ఈ లార్వాలు తేనెటీగలు ఏర్పరచుకున్న తెట్టులోగానీ, పుట్టలోగానీ ఉంచబడతాయి.
- ఇవి తరువాత పొదగబడి పౌడజీవులుగా ఏర్పడతాయని తెలుసుకున్నాను.
ప్రశ్న 14.
కింది పటాలను గమనించి బొమ్మలు గీయండి. వాటి విధులు రాయండి.
జవాబు:
ముష్కము విధులు :
- ముష్కము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగం.
- ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
- పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేస్తుంది.
- మగ పిల్లలలో యుక్తవయస్సుకు రాగానే “ద్వితీయ లైంగిక” లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ముష్కము
- ఇది పీయూష గ్రంథి ఆజ్ఞల ప్రకారం పని చేస్తుంది.
స్త్రీ బీజకోశాలు-విధులు :
- స్త్రీ బీజకోశాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగాలు.
- వీటిలో ‘అండ పుటికలు’ ఉంటాయి.
- ఇవి యుక్త వయసు వచ్చిన తర్వాత నుండీ మోనోపాజ్ దశ వరకు ప్రతి 28 రోజులకొకసారి ఒక పుటిక పక్వానికి వచ్చి అండాన్ని విడుదల చేస్తుంది.
- పగిలిన పుటిక స్త్రీ లైంగిక హార్మోన్లయిన 1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.
ఫాలోపియన్ నాళాలు-విధులు :
- ఇవి ఆడపిల్లలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని జరిపిస్తాయి.
- తల్లుల ఆరోగ్యానికి, గర్భం దాల్చినప్పుడు మార్పులకు, బిడ్డకు పాలివ్వటానికి ప్రొజెస్టిరాన్ సహకరిస్తుంది.
- అండం గర్భాశయానికి చేరటానికి సహకరిస్తాయి.
- ఫలదీకరణకు అవకాశమిస్తాయి.
మానవ శుక్రకణం-విధులు :
- ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ‘ముష్కము’ నుండి విడుదల అవుతుంది.
- ఇది ఏక స్థితికం.
- కదలగలిగి ఉంటుంది. (దీని తోక సాయంతో)
- అండాన్ని గర్భాశయంలో కనుగొని ఫలదీకరణ చెందించేందుకు పనిచేస్తుంది.
- దీని జీవితకాలం 24-72 గంటలు.
అండం-విధులు :
- ఇది స్త్రీ బీజకణం.
- స్త్రీ బీజకోశాలలోని అండ పుటికలు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
- ఇది ఫాలోపియల్ నాళం గుండా ప్రయాణించే సమయంలోనే ఫలదీకరణ చెందేందుకు అవకాశం ఉంటుంది.
- దీని జీవిత కాలం 24 గం॥ మాత్రమే.
ప్రశ్న 15.
మానవ పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 16.
కప్ప జీవిత చరిత్ర పటం గీచి దానిలో ఏవి శాఖాహార దశలో గుర్తించండి.
జవాబు:
- కప్ప లార్వాను చిరుకప్ప లేదా టాడ్ పోల్ అంటారు.
- ఈ దశలో కప్ప చేపను పోలి ఉండి శాకాహారిగా ఉంటుంది.
8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి InText Questions and Answers
8th Class Biology Textbook Page No. 54
ప్రశ్న 1.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించి జ్ఞాపకం తెచ్చుకుని పట్టిక నింపండి.
(లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, బల్లి, కాకి, పాము, ఏనుగు, పిల్లి)
జవాబు:
క్ర.సం. | చెవి బయటకు కనిపించే జీవులు | చెవులు బయటకు కనిపించని జీవులు |
1. | లేడి | చేప |
2. | చిరుత | కప్ప |
3. | పంది | బల్లి |
4. | గేదె | కాకి |
5. | జిరాఫీ | పాము |
6. | ఏనుగు | |
7. | పిల్లి | |
ఇవన్నీ శిశోత్పాదక జీవులు | ఇవన్నీ అండోత్పాదక జీవులు |
a) చెవులు బయటకు కనిపించకపోయినా ఈ జీవులు ఎట్లా వినగల్గుతున్నాయి ?
జవాబు:
- చెవి నిర్మాణంలో, వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే మూడు నిర్మాణాలు ఉంటాయి.
- వినటంలో కీలక పాత్ర వహించేది లోపలి చెవి.
- గుడ్లు పెట్టే జంతువులలో బాహ్య చెవి మాత్రమే ఉండదు. మధ్య చెవి, లోపలి చెవి ఉంటుంది.
- అందువలన ఇవి ధ్వని వినగల్గుతాయి.
8th Class Biology Textbook Page No. 54
ప్రశ్న 2.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ పట్టికను నింపండి.
(ఆవు, ఎలుక, కాకి, పంది, నక్క కోడి, ఒంటె, బాతు, కప్ప, ఏనుగు, గేదె, పావురం, పిల్లి, నెమలి, బల్లి )
జవాబు:
8th Class Biology Textbook Page No. 57
ప్రశ్న 3.
ఈ క్రింది దానిమ్మ పుష్పాలు పరిశీలించి వాటి ప్రత్యుత్పత్తి భాగాలు రాయండి. (పేజీ నెం. 57)
ఎ) మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) కేసరము
2) కేసర దండము
3) పరాగ కోశము
4) పరాగ రేణువులు
5) సంయోజకము
6) కేసరావళి
బి) మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వాటి భాగాలు
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) అండకోశము
2) అండాశయము
3) కీలము
4) కీలాగ్రము
5) అండన్యాస స్థానము
6) అండాలు
8th Class Biology Textbook Page No. 59
ప్రశ్న 4.
ఈ క్రింది స్లో చార్టును పూరించండి.
జవాబు:
a) శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
జవాబు:
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.
b) కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
జవాబు:
పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.
c) జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తికావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.
8th Class Biology Textbook Page No. 61
ప్రశ్న 5.
టాడ్ పోల్ లార్వాలు ఏ ఏ ఋతువులలో కనిపిస్తాయో చెప్పండి.
జవాబు:
- టాడ్ పోల్ లార్వాలు వర్షాకాలంలో బాగా కనిపిస్తాయి.
- వర్షాకాలంలో కప్ప వర్షపు నీటిలో ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
- అందువలన కప్ప అండాలు బాహ్యఫలదీకరణం చెందుతాయి.
- ఇవి సూర్యరశ్శికి పొదిగి టాడ్ పోల్ లార్వాలను ఉత్పత్తి చేస్తాయి..
- ఇవి చేపల వలె నీటిలో ఈదుతూ రూపవిక్రియ చెంది కప్పలుగా మారతాయి.
ప్రశ్న 6.
వర్షాకాలంలో కప్పలు ఎందుకు బెక బెకమని శబ్దాలు చేస్తాయి ?
జవాబు:
- వర్షాకాలం కప్పల ప్రత్యుత్పత్తికి అనుకూల సమయం.
- ఈ కాలంలో మగకప్ప బెక బెకమని శబ్దాలు చేసి ఆడకప్పను ఆకర్షిస్తుంది.
- ఆడ, మగ, కప్పలు కలిసి వర్షపు నీటిలో శుక్రకణాలు, అండాలను విడుదల చేస్తాయి.
8th Class Biology Textbook Page No. 62
ప్రశ్న 7.
కప్ప జీవిత చక్రాన్ని పరిశీలించటానికి నీవు చేయు ప్రాజెక్ట్ వివరాలు తెలపండి.
జవాబు:
ఉద్దేశం : కప్ప జీవిత చక్రం పరిశీలించుట.
పరికరాలు : వెడల్పు మూతిగల తొట్టి లేదా గాజుసీసా, పారదర్శక గ్లాసు, డ్రాపర్, పెట్రెడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.
విధానము :
- వర్షాకాలంలో దగ్గర ఉన్న చెరువు వద్దకు వెళ్ళి నురగ వంటి కప్ప గుడ్లను పరిశీలించాను.
- దానిని జాగ్రత్తగా వెడల్పు మూతిగల సీసాలోనికి తీసుకున్నాను.
- ఇలా సేకరించిన అండాలను 15 సెం.మీ. లోతు, 8 – 10 సెం.మీ. వ్యాసార్ధం కలిగిన తొట్టిలోకి మార్చాను.
- భూతద్దం సహాయంతో అండాలను పరిశీలించాను.
- అండం మధ్య భాగంలో చుక్కవంటి నిర్మాణం గమనించాను. అదే కప్ప పిండం.
- గుడ్లు పొదిగి కొన్ని రోజులకు, టాడ్ పోల్ లార్వాలు బయటకు వచ్చాయి.
- ఈ లార్వాలు చేపను పోలి ఉన్నాయి.
- వీటి తల భాగంలో మొప్పలు ఉన్నాయి.
- ఇవి క్రమేణా అనేక శారీరక మార్పులు చెందాయి.
- పరిమాణంలో పెరిగి కాళ్ళు, చేతులు ఏర్పరచుకున్నాయి.
- తోక అంతరించిపోయింది.
- మొప్పలు అదృశ్యమైపోయాయి. ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి.
- చివరికి అది తోక కలిగిన కప్ప ఆకారం నుండి కప్పగా మార్పు చెందింది.
- ఈ ప్రక్రియనే రూపవిక్రియ అంటారు.
ప్రశ్న 8.
a) గుడ్లు పొదగటానికి ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
గుడ్లు పొదగటానికి వారం రోజులు పట్టింది. (7 నుండి 9 రోజులు)
b) టాడ్పల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
జవాబు:
టాడ్ పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.
c) ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
జవాబు:
గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కల్గి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కల్గి ఉంది.
d) సేకరించిన ఎన్ని రోజులకు టాడ్ పోల్ కు కింది అవయవాలు కనిపించాయి ?
జవాబు:
గుండె – 2వ వారము (14 రోజులు తరువాత)
ప్రేగులు – 3వ వారము (21 రోజులు)
ఎముకలు – 4వ వారము (28 రోజులు)
పురీషనాళం – 3వ వారము (21 రోజులు)
ముందు కాళ్ళు – 9వ వారము (63 రోజులు)
వెనుక కాళ్ళు – 10వ వారము (70 రోజులు)
e) టాడ్ పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించకుండాపోయాయి ?
జవాబు:
28 రోజులు (నాలుగు వారాలు) తరువాత మొప్ప చీలికలు అదృశ్యమైనాయి.
f) ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించకుండా పోయింది ?
జవాబు:
84 రోజులు (12 వారాలు) తరువాత తోక కనిపించకుండా పోతుంది.
g) టాడ్ పోల్ లార్వా కప్పగా మారుటకు ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
టాడిపోల్ లార్వా కప్పగా మారుటకు 48 రోజులు పట్టింది.
ఆలోచించండి – చర్చించండి
ప్రశ్న 1.
అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
జవాబు:
లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.
ప్రశ్న 2.
ఏ ఏ జంతువులు పిల్లల్నికంటాయి ?
జవాబు:
క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.
ప్రశ్న 3.
ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.
ప్రశ్న 4.
అలా తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
మీ ప్రయోగశాలలో ఉన్న హైడ్రా సైడ్ ను చూస్తే, దానిపై ఉబ్బెత్తు బుడిపెలు కనపడ్డాయా ? అవి ఏమిటి ? మీ పరిశీలన ఆ రాయండి.
జవాబు:
1) హైడ్రా సైడ్ ను పరిశీలిస్తున్నప్పుడు ఈ ఉబ్బెత్తు భాగాలను పరిశీలించాను.
2) మా టీచరు వాటిని ‘మొగ్గలు’ (కోరకాలు) అన్నారు.
3) అవి ఎలా ఏర్పడతాయి ?
4) లైబ్రరీ నందున్న జీవశాస్త్ర పుస్తకంలో ఈ కింది విధానం ఉంది. గమనించండి.
- ముందుగా హైడ్రా శరీరంపై ఉన్న ఒక భాగం జీవ పదార్థ పీడనం వల్ల బయటకు నెట్టబడుతుంది.
- తరువాత దీని లోపలి గోడలపై కొత్త కణాలు, కణ ద్రవ్యం ఏర్పడి దాని పరిమాణం పెరుగుతుంది.
- తరువాత ఈ ఉబ్బెత్తు భాగం చివర కళాభాలు మొలుస్తాయి.
- దానిని సంపూర్ణ పిల్ల హైడ్రాగా మనం చూడవచ్చు.
- ఇది తల్లి నుండి వేరై, స్వతంత్రంగా జీవనం సాగిస్తుంది.
కృత్యం – 2
ప్రశ్న 2.
అమీబాలో ‘ద్విధావిచ్ఛిత్తి’ జరుగుతుందని చెప్పే బొమ్మలను పరిశీలించి మార్పులు పొందుపరచండి. (లేదా) అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి ? దానిని పటం ద్వారా చూపుము.
జవాబు:
పటం – 1
- అమీబా కేంద్రకం మామూలుగా ఉంది.
- శరీరం (అంటే కణకవచం) సాధారణంగా ఉంది.
పటం – 2
- అమీబా శరీరం గుండ్రని ఆకృతి పొందింది.
- మిద్యాపాదాలు చాలా వరకు లేవు.
- కేంద్రకం సాగి, మధ్యలో నొక్కు ఏర్పడింది.
పటం – 3
- కేంద్రకం రెండుగా విడిపోయింది.
- శరీరం మధ్యలో నొక్కు ఏర్పడి అది కణం మధ్య వైపునకు పెరుగుతుంది.
- పెరుగుదల రెండు పక్కలా అంటే కింది నుంచి, పై నుంచి కూడా ఉంది.
పటం – 4
- కణం మధ్యలో నొక్కు బాగా దగ్గర వచ్చింది.
పటం – 5
- నొక్కు ఇంకా దగ్గరకు వచ్చింది.
- అటు పక్క, ఇటు పక్క మిద్యాపాదాలు ఏర్పడటం గమనించాను.
పటం – 6
- రెండుగా విడిపోయాయి.
- తద్వారా తల్లి కణం అంతరించి రెండు పిల్లకణాలు ఉద్భవించాయి.
ఇలా అమీబాలో ద్విధావిచ్ఛిత్తి జరగటం నేను గమనించాను.
కృత్యం – 3
ప్రశ్న 3.
ఐదారుగురు విద్యార్థులతో జట్టుగా ఏర్పడండి. మీ జట్టు సభ్యుల తల్లిదండ్రుల ఫోటోలను సేకరించండి. ఆ ఫోటోలతో వారిని పోల్చండి. ఏ ఏ భాగాలు / అవయవాలు, తల్లి లేదా తండ్రిని పోలిఉన్నాయో పరిశీలించి, పట్టికలో నమోదు చేయండి. (పాఠ్యాంశంలోని ప్రశ్న పేజీ నెం. 60)
జవాబు: