SCERT AP 8th Class Biology Study Material Pdf 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 9th Lesson Questions and Answers జంతువుల నుండి ఆహారోత్పత్తి
8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers
ప్రశ్న 1.
ఒక తేనెపట్టులో వివిధ రకాల తేనెటీగలు ఉంటాయి ? అవి ఏవి ? అవి ఒకదానికంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి ?
జవాబు:
ఒక తేనెపట్టులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి. అంటే
కూలీ ఈగలు : కొన్ని తేనెటీగలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి కూలీ ఈగలు. తేనెపట్టు పెట్టి, తేనెటీగల పిల్లలను పోషించి, తేనెను సేకరించును. రాణి ఈగ : తేనెటీగల సమూహంలో ఒక్క రాణి ఈగ ఉంటుంది. ఇది ప్రతిరోజు 800-1200 గుడ్లను పెడుతుంది.
డ్రోన్ ఈగలు : ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని మగ ఈగలు అంటారు. ఇవి సోమరులు.
ప్రశ్న 2.
మీ గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలను రాయండి.
జవాబు:
మా గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలు :
- చక్కని శరీర నిర్మాణం కలిగి ఉంటాయి.
- శరీర బరువు ఎక్కువగా ఉంటుంది.
- అధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి.
- మంచి ఆరోగ్యం కలిగి ఉంటాయి.
- శారీరక రోగాలు కలిగి ఉండవు.
- గేదెల చూపు చక్కగా ఉంటుంది.
- గేదెలు చక్కని పొదుగు నిర్మాణం ఉండి మరియు పాలు తీయుటకు తేలికగా ఉండును.
- ఆహారం (మేత) ఎక్కువగా తీసుకొనును.
- సన్నని మెడ కలిగి ఉంటాయి.
ప్రశ్న 3.
గ్రామీణ ప్రాంతాలలో గుడ్లను పొదిగే విధానాన్ని వివరించండి.
జవాబు:
గ్రామాలలో గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైన పని. గ్రామాలలో కోళ్ళకు పొదిగే కాలం రాగానే ఒక పెద్ద గంపలో గడ్డి పరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లను పొదుగుతాయి.
ప్రశ్న 4.
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు, పరిశ్రమల గురించి రాయండి.
జవాబు:
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు :
మాంసం, పేడ, తోళ్ళు, ఎముకలు, చర్మం, వాటి కొమ్ములు.
పరిశ్రమలు :
- డైరీ పరిశ్రమ : దీనిలో పాలు, పాల ఉత్పత్తులు చేస్తారు.
- కబేల (పశువధశాల) : ఎద్దు మాంసం ఇక్కడ తయారుచేస్తారు.
- తోళ్ళ పరిశ్రమ : ఇక్కడ తోళ్లను శుభ్రపరిచి పర్సులు, బెల్ట్ లు, చెప్పులు తయారుచేస్తారు.
- ఎరువుల పరిశ్రమ : పేడను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేస్తారు.
- బయోగ్యాస్ పరిశ్రమ : పశువుల ఎముకలను ఎరువుల కర్మాగారాలలో వాడతారు.
- వస్తువులు తయారుచేసే పరిశ్రమ : పశువుల చర్మం, కొమ్ములను ఉపయోగించి వివిధ రకాల ఆట మరియు అలంకార వస్తువులు తయారుచేస్తారు.
ప్రశ్న 5.
మీ గ్రామంలో ఎక్కడైనా కోళ్ళ ఫారం ఉందా ? గ్రుడ్లను ఎలా మార్కెట్ కి ఎగుమతి చేస్తారు ? ప్యాకింగ్ కు ఏ రకమైన పదార్థాలను వాడతారు ?
జవాబు:
మా గ్రామంలో కోళ్ళ ఫారం ఉంది. గ్రుడ్లు, మార్కెట్ కి ఎగుమతి చేయుటకు 30 గ్రుడ్లు పట్టే ట్రేలో ఉంచుతారు. ఇలాంటి 10 ట్రేలను ఒక అట్టపెట్టిలో పెట్టి దూరంను బట్టి లారీ కాని, ఆటో కాని లేదా రిక్షాలో కాని పెడతారు. ఈ ట్రేలో గ్రుడ్లు ఆకారంలో గుంటలు ఉంటాయి. ప్యాకింగ్ కు కాగితం, వేస్ట్ ప్లాస్టిక్, అట్టలు (మొక్కజొన్న ఆకుల నుండి తయారు చేస్తారు) వంటివి వాడతారు.
ప్రశ్న 6.
నదీముఖ ద్వారాలు అనగానేమి ? అవి సముద్రపు మరియు నీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటాయి ?
జవాబు:
నదీముఖ ద్వారాలు అనగా నదులు సముద్రంలో కలిసే చోటు. నదీముఖ ద్వారాలలో సముద్రపు మరియు మంచినీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటుంది అంటే ఈ ప్రాంతాలలో నివసించే చేపలు లవణీయత వ్యత్యాసాన్ని తట్టుకొనే శక్తిని కలిగి ఉంటాయి.
ప్రశ్న 7.
అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి ? ఎందుకు ? కారణాలను చర్చించి రాయండి.
జవాబు:
1. ఈ నెలలందు తయారు అయిన గుడ్లు పొదగటానికి ఉపయోగించరు. కారణం ఉష్ణోగ్రత 38.39°C ఉండదు.
2. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి గ్రుడ్లు చెడిపోవు.
3. అంతేకాక అక్టోబర్ లో సాధారణంగా దసరా మరియు దీపావళి పండుగలు వచ్చును. నవంబర్ కార్తీకమాసం ప్రభావం వలన ఎక్కువమంది మాంసాహారాన్ని తినరు. పై కారణాల వలన అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి.
ప్రశ్న 8.
ఈ క్రింది పదాలను గురించి రాయండి.
శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఎపిస్ టింక్చర్, హాల్ స్టీన్.
జవాబు:
శ్వేత విప్లవం : పాల ఉత్పత్తిని పెంచటం. పాల నుండి లభించే ఇతర పదార్థాల నాణ్యతని, పరిమాణాన్ని పెంచి, సాధ్యమైనంత తక్కువ ధరలో అందరికీ అందించటానికి జరిగిన ప్రయత్నమే శ్వేత విప్లవం అంటారు.
నీలి విప్లవం : చేపల పెంపకం. దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు. ఎపిస్ టింక్చర్ : తేనెటీగల విషంతో తయారుచేయబడిన హోమియో మందుని ఎపిస్ టింక్చర్ అంటారు.
హాల్ స్టీన్ : ప్రతిరోజు 25 లీటర్ల పాలు ఇచ్చే డెన్మార్క్ దేశానికి చెందిన ఆవు జాతి పేరు.
ప్రశ్న 9.
చేపలను నిలవ చేయడంలో పాటించే పద్ధతులను వివరించండి.
జవాబు:
చేపలు నిలువ చేయడంలో పాటించే పద్ధతులు
- ఎండలో ఎండబెట్టడం
- పాక్షికంగా ఎండబెట్టడం
- పొగ బెట్టడం
- ఉప్పులో ఊరబెట్టడం
ప్రశ్న 10.
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నీవు ఏ రకమైన అనుమానాలు నివృత్తి చేసుకుంటావు ? వాటి జాబితా తయారుచేయండి.
జవాబు:
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నేను ఈ అనుమానాలు నివృత్తి చేసుకొనుటకు తయారుచేసిన జాబితా.
అవి:
- పాలశీతలీకరణ కేంద్రాలలో ఉన్న పాలు ఎందుకు తొందరగా పాడు అవ్వవు?
- పాశ్చరైజేషన్ ఎలా చేస్తారు ?
- పాల కేంద్రాలలో పాల శుద్ధితో పాటు ఇతర పదార్థాలు ఏవైనా తయారుచేస్తారా ?
- శీతాకాలంలో అధికంగా వచ్చిన పాలను ఏమి చేస్తారు ?
- పాలపొడి ఎలా చేస్తారు?
- పాలను, పాల పొడిని ఎందుకు సూక్ష్మజీవ రహిత ప్లాస్టిక్ కవరులలోను, డబ్బాలలో నిల్వచేస్తారు ?
ప్రశ్న 11.
కోళ్ళ/ఈము/చేపల/పశువుల/తేనెటీగల పెంపకంలో ఏదో ఒకదానిని సందర్శించి, అక్కడి రైతులనడిగి యాజమాన్య పద్ధతులపై ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కోళ్ళ పరిశ్రమను సందర్శించాను. కోళ్ళ పెంపక విధానంలో యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవటం గమనించాను.
- నేల క్రింది భాగంలో తడి, తేమను నివారించటానికి, నేలను పొట్టుతో కప్పారు.
- నేల సహజత్వాన్ని కాపాడటానికి సున్నం చల్లుతున్నారు. ఇది వ్యర్థాల వలన ఏర్పడే ఆమ్లత్వాన్ని నివారించటానికి తోడ్పడుతుంది.
- నీరు, ఆహారం వృధా కాకుండా తొట్టెలను ఎత్తులో అమర్చారు.
- రాత్రివేళలో సరైన ఉష్ణోగ్రతను నెలకొల్పటానికి విద్యుత్ దీపాలను ఉంచారు.
- కోడిపిల్లలు పొడుచుకోకుండా, డీబికింగ్ (ముక్కు కత్తిరించటం) చేస్తున్నారు.
- రోజు ఆహారాన్ని నిర్ణీత మోతాదులో నిర్ణీత వేళకు అందిస్తున్నారు.
- వేడిని నివారించటానికి, కోళ్ళ షెడ్ ను కొబ్బరి మట్టలతో కప్పారు. పరిసరాలలో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు.
- కోడి వయస్సును బట్టి ఆహార మోతాదు మార్చి అందిస్తున్నారు. మూడు నెలల వయస్సు నుండి కోళ్ళ పెరుగుదల అధికంగా ఉంటుంది కావున పౌష్ఠిక ఆహారం అందిస్తున్నారు.
ప్రశ్న 12.
వార్తాపత్రికల నుండి పాల ఉత్పత్తికి, పాలలో కలుషితాలకు సంబంధించిన వార్తను సేకరించి నివేదికను తయారుచేసి గోడపత్రికపై ప్రదర్శించండి.
జవాబు:
పాల ఉత్పత్తికి తీసుకోవలసిన చర్యలు :
- రైతులు ముందుగా మంచి పాలు ఇచ్చే పశువులను ఎంచుకోవాలి.
- పచ్చిమేత 20 కేజీల వరకు రోజూ పెట్టాలి.
- ఆ పశువులు పాలిచ్చే దానిని బట్టి దాణా పెట్టాలి. సుమారుగా ప్రతి పది లీటర్ల పాలకు నాలుగు కిలోల మిశ్రమ దాణా పెట్టాలి.
- పశువులు నివసించే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.
- కాలం బట్టి వచ్చే వ్యాధులు నివారించుటకు టీకాలు ఇప్పించాలి.
పాలలో కలుషితాలకు సంబంధించిన నివేదిక :
- పాలలో ఈ క్రింది పేర్కొన్న కలుషితాలు కలుపుతున్నారు.
- సోడియం బై కార్బొనేట్, గంజిపిండి, సబ్బునీళ్ళు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, మెలనిన్.
- కొన్ని ప్రాంతాలలో కలుషితమైన ఆహారము పశువులకు పెట్టుట వలన పాలు కలుషితం అవుతున్నాయి.
ఉదా : మెలనిన్ ఉన్న పాలు త్రాగుట వలన పిల్లలు చనిపోవుదురు. కొందరిలో మూత్రపిండాలు చెడిపోవును.
ప్రశ్న 13.
సముద్రపు కలుపుమొక్కలకు సంబంధించిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం నుంచి సేకరించండి. ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
- సముద్రపు కలుపు మొక్కలు గోధుమవర్ణ శైవలాలకు చెందినవి.
- సముద్రంలో ఇవి అతిపెద్ద పరిమాణంలో తుట్టలు తుట్టలుగా, సమూహంగా పెరుగుతాయి.
- వీటిని కెర్బ్స్ అంటారు. వీటివలనే అనేక ఉపయోగాలు ఉన్నాయి.
- పశువుల మేతగా ఉపయోగపడును (సముద్రపు కలుపుమొక్క)
- బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క)
- పైకో కొల్లాయిడ్ ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క అగార్ – అగార్)
పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.
ప్రశ్న 14.
సాధారణంగా ఏ కాలంలో తేనెపట్టునుండి తేనెను సేకరిస్తారు. తేనెను సేకరించడానికి తియ్యడానికి అనుసరించే విధానాన్ని రాయండి.
జవాబు:
సాధారణంగా మా గ్రామంలో తేనెపట్టును పువ్వులు బాగా పూసే కాలమైన అక్టోబరు / నవంబరు మరియు ఫిబ్రవరి / జూన్ సీజన్లో చూస్తాము. తేనెపట్టు నుంచి తేనెను తీయడానికి అనుసరించే విధానము :
పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.
ప్రశ్న 15.
ఎండిన తేనెపట్టును పరిశీలించండి. అది ఎలా నిర్మితమైనదో పరిశీలించి, బొమ్మను గీయండి.
జవాబు:
ఎండిన తేనెపట్టును పరిశీలించితిని. అది అనేక చిన్న చిన్న గదులతో విభజింపబడి ఉండును. తేనెపట్టు మైనపు పధార్థం వలన చిన్నచిన్న గదులు ఏర్పడుటకు సహాయపడును. ఈ మైనం కూలీ ఈగలు స్రవించి తయారుచేస్తాయి.
ప్రశ్న 16.
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు (వ్యర్థ పదార్థాలు) కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ వినూత్న విషయాన్ని ఎలా అభినందిస్తారు ?
జవాబు:
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు పేడ మనకు బాగా ఉపయోగపడును. దీనిని ఎరువుగా పొలంలో వేయవచ్చు. పూర్వపు రోజులలో పిడకల కోసం పేడను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ పేడను కుళ్ళబెట్టి బయోగ్యాస్ తయారుచేస్తున్నారు. దానితో ఇంధన కొరత కొంత వరకు అధిగమించవచ్చు మరియు కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది. అంతేకాక విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేయవచ్చు.
ఆహారంతో పాటు కాలుష్యాన్ని, ఇంధన కొరతలను తగ్గించిన పశువులను చూస్తే నాకు చాలా ఆనందంగా, కొంత ఆశ్చర్యంగాను ఉంది. అందుకే కొంతమంది వాటికి ప్రేమతో పేర్లు కూడా పెట్టి పిలుస్తారు.
ప్రశ్న 17.
రాజు పశుపోషణకు, వ్యవసాయానికి సంబంధం ఉంది అని తెలిపాడు. నీవు అతడిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:
- పశుపోషణకు, వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది.
- ఈ రెండూ పరస్పరం ఆధారనీయమైనవే గాక, ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ వంటివి.
- వ్యవసాయ ఉత్పత్తులైన గడ్డి, ధాన్యం వంటి పదార్థాలు పశుపోషణలో ఆహారంగా ఉపయోగపడతాయి.
- జంతువుల వ్యర్థాలైన పేడ, మూత్రం వ్యవసాయ రంగంలో ఎరువులుగా వాడతారు.
- ఎద్దులు, దున్నల వంటి జంతువుల ఆధారంగా చాలా వ్యవసాయపనులు జరుగుతుంటాయి.
- దుక్కిదున్నటం, చదునుచేయటం, రవాణా వంటి వ్యవసాయ పనులకు నేడు ఇంకా జంతువులను ఉపయోగిస్తున్నారు.
- తేనెటీగల పరిశ్రమ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. మొక్కలు బాగా పుష్పించినపుడే తేనెటీగలు తేనెను బాగా ఉత్పత్తి చేయగలవు.
- తేనెటీగలు మొక్కలలో ఫలదీకరణ రేటును పెంచి పంట దిగుబడిని పెంచుతాయి. కావున వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.
ప్రశ్న 18.
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. ఎందుకంటే వ్యవసాయంలోని పచ్చగడ్డి, ఎండిన పశు గ్రాసం, ధాన్యం ఇంకా ఇతర ఉత్పత్తులు పశువుల దాణాగా ఉపయోగిస్తారు. అదే విధంగా పశువులను ముఖ్యంగా ఎద్దులను నేల దున్నుటకు, నూర్పిడిలోను, పశువుల పేడను ఎరువుగాను, పండిన పంటను కూడా ఇంటికి చేర్చుటకు ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయిన రెండోది లేదు. కాబట్టి వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు.
ప్రశ్న 19.
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది. ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ సమస్యపై చర్చలో పాల్గొనటానికి మీ అభిప్రాయాలను తెల్పండి.
జవాబు:
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది మరియు ఆహారపు కొరతను ఎదుర్కొంటాము. అందుకు నా అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. పొలంలో వరి మొక్కలు ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి వాతావరణంలోనికి ఆక్సిజన్ విడుదల అవుతుంది. కాని చేపకుంట వలన ఆ విధంగా జరగదు.
2. చేపలు కూడా నీటిలోకి CO2 విడుదల చేస్తాయి. దాని వలన వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగును.
3. చేప కుంటలో ఎక్కువగా చేపల కోసం వేసిన ఆహారం వలన, వాటి రక్షణకు ఉపయోగించే రసాయనాల వలన నీటి కాలుష్యం, భూకాలుష్యం వచ్చును.
4. చేపల కుంటలుగా మార్చుట వలన ముఖ్యంగా వరి పంట దెబ్బతిని ఆహారపు కొరత వచ్చును.
8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers
కృత్యములు
1. పశువుల పెంపకం :
(a) తరగతిలో ఐదుగురు విద్యార్థుల చొప్పున కొన్ని జట్లుగా ఏర్పడండి. రైతులు పశువులను ఎందుకు పెంచుతారో, కారణాలు చర్చించి రాయండి. మీరు పరిశీలించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
రైతులు పశువులను పెంచుటకు కారణాలు :
1. వారికి పశువులను పెంచుట వలన కొంత ఆదాయం వచ్చును.
2. వారికి వ్యవసాయంలో సహాయపడును. (దున్నుటకు, నూర్పిడులకు)
3. వ్యవసాయంలో లభించిన పశుగ్రాసం తిరిగి పశువుల మేతగా వాడుటకు.
(b) మీ గ్రామంలో పశువులను ఎక్కడికి తోలుకుపోతారు. పశువులను పెంచే వ్యక్తితో మాట్లాడి పశువుల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. ఈ క్రింది ప్రశ్నల సహాయంతో
(ఎ) ఇక్కడ ఏ ఏ రకాల పశువులను పెంచుతారు ?
జవాబు:
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొదలైన పశువులు పెంచుతారు.
(బి) పశుగ్రాసం ఉన్న ప్రాంతాలు. ఎక్కడ ఉన్నాయి ?
జవాబు:
ఊరికి చివర ఉన్న పొలాలు, పచ్చిక బయళ్ళ దగ్గర ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి.
(సి) నీరు ఉన్న ప్రాంతం ఎక్కడ ఉన్నది ?
జవాబు:
పొలాలకు దగ్గరగా.
(డి) ఆవు, గేదెలు, మేక, గొర్రెల పెంపకంలో ఏమైనా తేడాలున్నాయా ?
జవాబు:
ఆవు, గేదెలు, ఎండిన గడ్డితో పాటు పచ్చిగడ్డి తింటాయి. మేకలు చెట్ల ఆకులను, పచ్చిగడ్డిని ఆహారంగా తీసుకొంటాయి. గొర్రెలు పచ్చిగడ్డిని, నూకలను ఆహారంగా తీసుకుంటాయి.
(ఇ) పశువులను పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలేవి ?
జవాబు:
అనావృష్టి పరిస్థితులలో పశుగ్రాసం కొరత పశువులు పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య.
(c) పశువైద్యుని దగ్గరకు వెళ్ళి పశువులకు వచ్చే సాధారణ వ్యాధుల సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
పాఠ్యాంశములోని ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆదిమానవుడు కొన్ని జంతువులను మాత్రమే ఎందుకు మచ్చిక చేసుకున్నాడు ? (పేజి.నెం. 141)
జవాబు:
ఆదిమానవుడు కొన్ని జంతువులు (ఉదా : కుక్క, పిల్లి, పశువులు, పక్షులు, కోళ్ళు, చిలుక మొదలైన) వాటివలన తనకు కలుగు ఉపయోగాలు గ్రహించి వాటిని మచ్చిక చేసుకున్నాడు. అందువలన ఆదిమానవుడు కొన్ని జంతువులనే మచ్చిక చేసుకున్నాడు.
ప్రశ్న 2.
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్రద్ధ, గుడ్లగూబ వంటి పక్షులను ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు ? (పేజి.నెం.141)
జవాబు:
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్ర, గుడ్లగూబ వంటి పక్షులను ఆదిమానవుడు ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు అంటే ఏనుగు, పులి, సింహం క్రూరజంతువులు మరియు ఆ పక్షుల వలన లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి.
ప్రశ్న 3.
జంతువులను మచ్చిక చేసుకోవడానికి ఆనాటి మానవుడు ఏ ఏ విధానాలను పాటించి ఉంటాడో జట్లలో చర్చించి రాయండి. (పేజి.నెం. 142)
జవాబు:
- జంతువులు మచ్చికకు అలవాటు పడతాయి.
- మచ్చిక చేసుకొనుటకు పట్టుకాలం
- మచ్చిక వలన ఆ జంతువుకు అయ్యే ఖర్చు
- మచ్చిక చేసుకున్నాక అతనికి వచ్చే లాభం మొదలైన అంశాలను ఆనాటి మానవుడు జంతువులను మచ్చిక చేసుకొనేటపుడు పాటించిన పద్దతులు.
ప్రశ్న 4.
వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారా ? (పేజి.నెం. 142)
జవాబు:
ఇంచుమించు వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారు.
ప్రశ్న 5.
వ్యవసాయానికి, పశుపోషణకు ఏమైనా సంబంధం ఉందా ? (పేజి.నెం. 142)
జవాబు:
వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.
ప్రశ్న 6.
ఎద్దులను, దున్నపోతులను ఉపయోగించి ఏమేమి వ్యవసాయ పనులు చేస్తారో రాయండి. (పేజి.నెం. 143)
జవాబు:
1. ఎద్దులను ఉపయోగించి పొలం, దుక్కి దున్నుతారు. పంట నూర్పిడి సమయంలో కూడా ఎద్దులను ఉపయోగిస్తారు.
2. దున్నపోతులను ప్రాచీన పద్ధతులలో నీటి పారుదలకు, పంట నూర్పిడి యందు ఉపయోగిస్తారు.
ప్రశ్న 7.
మీ ప్రాంతంలో పశువైద్యశాల ఎక్కడ ఉంది ? (పేజి.నెం. 143)
జవాబు:
మా ప్రాంతంలో పంచాయతీ రాజ్ ఆఫీసుకు దగ్గరగా ఉంది.
గమనిక : ఎవరి ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడే పేరు వ్రాసుకోవాలి.
ప్రశ్న 8.
అక్కడ (పశు వైద్యశాలలో) ఎవరు పనిచేస్తున్నారు ? ఏ పని చేస్తారు ? (పేజి.నెం. 143)
జవాబు:
అక్కడ (పశు వైద్యశాలలో) పశువైద్యులు పనిచేస్తారు. పశువుల వైద్యం, ఆరోగ్యం గురించి చూస్తారు.
ప్రశ్న 9.
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడి నుండి వస్తుంది ? (పేజి.నెం. 144)
జవాబు:
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా గ్రామాల నుండి వస్తుంది.
ప్రశ్న 10.
ఒంటె పాలను ఏ ప్రాంతంవారు ఉపయోగిస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
ఎడారి ప్రాంతంవారు ఒంటె పాలను ఉపయోగిస్తారు.
ప్రశ్న 11.
గాడిద పాలను ఉపయోగించటం చూశారా ? (పేజి.నెం. 144)
జవాబు:
గాడిద పాలను ఉపయోగించటం చూడలేదు.
గమనిక : ఈ మధ్య గాడిద పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాము అని పుకార్లు బాగా వచ్చినాయి. పుకార్లు అని ఎందుకు అన్నాము అంటే శాస్త్రవేత్తలు ఎవరూ అవి మంచివి అని చెప్పలేదు కాబట్టి.
ప్రశ్న 12.
మీ గ్రామంలో రైతులు ఏ రకమైన పశుగ్రాసాన్ని వాడతారు ? (పేజి.నెం. 144)
జవాబు:
మా గ్రామంలో రైతులు వరిగడ్డి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఉలవలు మొదలైనవి పశుగ్రాసంగా వాడతారు.
ప్రశ్న 13.
పంటకోత కోసిన తరువాత పశుగ్రాసాన్ని ఎలా భద్రపరుస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
పంటకోత కోసిన తరువాత దానిని రెండు లేక మూడు రోజులు ఎండలో ఆరబెట్టి ధాన్యాన్ని నూర్పిడి చేసి వచ్చిన గడ్డి కట్టలు క్రింద కట్టి ఇంటికి తీసుకువచ్చి గడ్డివాముగా వేసి భద్రపరుస్తారు.
ప్రశ్న 14.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి. ఇది వివిధ దేశాలలో పాల ఉత్పత్తిని సూచిస్తుంది. మనదేశంలో పాల ఉత్పత్తిని పరిశీలించండి. మిగతా దేశాలతో పోల్చినప్పుడు పాల ఉత్పత్తిలో మనము ఎందుకు వెనుకబడి ఉన్నామో జట్లలో చర్చించండి. (పేజి.నెం. 144)
జవాబు:
1. పాల ఉత్పత్తిలో ఇజ్రాయిల్ అగ్రస్థానంలో ఉంది.
2. మన ఇండియా అన్నింటికన్నా దిగువస్థానంలో ఉంది.
కారణాలు :
- మనదేశంలో పాడిపరిశ్రమ ఇంకా గ్రామీణ కుటీర పరిశ్రమగానే ఉంది.
- పాడి పరిశ్రమను ఒక వ్యాపారాత్మకంగా లాభసాటిగా భావించటం లేదు.
- కేవలం వ్యవసాయంలో అంతర్భాగంగానే, పాడిపరిశ్రమ నడుస్తుంది.
- దేశీయ గేదెలనే ఎక్కువ ప్రాంతాలలో మేపుతున్నారు.
- పశువుల పెంపకంలో మెలకువలకు, పోషణ విధానంపై సరైన అవగాహన లేదు.
- వ్యాధుల విషయంలో రైతులకు పరిజ్ఞానం లేదు.
ప్రశ్న 15.
మీ గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉందా ? (పేజి.నెం. 145)
జవాబు:
మా గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉంది.
ప్రశ్న 16.
పాలను సేకరించి ఎలా ఎగుమతి చేస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలను పాలు సేకరించు కేంద్రం నుంచి 40 లీటర్ల క్యాన్ నింపి వాటిని పాల శీతలీకరణ కేంద్రంనకు ఎగుమతి చేస్తారు.
ప్రశ్న 17.
పాలధరను ఎలా నిర్ణయిస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలధరను పాల శీతలీకరణ కేంద్రం యొక్క చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పాలలో గల వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు.
ప్రశ్న 18.
మీ ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం ఎక్కడ ఉంది ? (పేజి.నెం.145)
జవాబు:
మా ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం విజయవాడలో ఉంది :
గమనిక : మీ ప్రాంతంలో ఇంకా దగ్గరలో ఏది, ఉంటే అది వ్రాయాలి.
ప్రశ్న 19.
పాల ఉత్పత్తి ఏ నెలలో అధికంగా ఉంటుందో చెప్పగలరా ? (పేజి.నెం. 145)
జవాబు:
పాల ఉత్పత్తి నవంబరు నెలలో అధికంగా ఉంటుంది.
ప్రశ్న 20.
ఏ నెలల్లో పాల ఉత్పత్తి ఎందుకు అధికంగా ఉంటుందో కారణాలను మీ తరగతిలో చర్చించండి. (పేజి.నెం. 145)
జవాబు:
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండుటకు కారణాలు :
1. గేదెలు జులై నుంచి సెప్టెంబరు మధ్య ఎక్కువగా ఈనుతాయి. ఈనిన మొదటి మూడు నెలల్లో పాలు ఎక్కువ ఇస్తాయి.
2. పచ్చిమేత ఎక్కువగా అందుబాటులో ఉండును.
3. వాతావరణం కూడా పశువుల పెరుగుదలకు, ఈనుటకు, మేతను ఎక్కువగా తీసుకొనుటకు చాలా అనుకూలంగా ఉండును.
ప్రశ్న 21.
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉంటాయా ? (పేజి.నెం. 148)
జవాబు:
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉండవు.
ప్రశ్న 22.
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిదా ? కాదా ? ఆలోచించండి. (పేజి.నెం. 148)
జవాబు:
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిది కాదు.
ప్రశ్న 23.
చికెన్-65 అంటే ఏమిటో తెలుసా ? అలా ఎందుకు అంటారు ? (పేజి.నెం. 148)
జవాబు:
చికెన్ – 65 అంటే అదో వంటకం పేరు. అలా ఎందుకు అంటారు అంటే దీనిని 1965వ సంవత్సరంలో చెన్నైలోని బుహారి హోటల్ లో మొదటగా తయారుచేస్తారు.
ప్రశ్న 24.
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం ఎంతో మీకు తెలుసా ? (పేజి. నెం. 149)
జవాబు:
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం 21 రోజులు అని నాకు తెలుసు.
ప్రశ్న 25.
మీ గ్రామాలలో గుడ్లను పొదిగే విధానంపై నివేదిక తయారుచేయండి. బొమ్మలు కూడా గీయండి. (పేజి.నెం. 149)
జవాబు:
మా గ్రామాలలో పొదిగే కాలం రాగానే గంపలో గడ్డిపరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లన పొదుగుతాయి. . విద్యార్థి స్వయంకృత్యం
ప్రశ్న 26.
పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎలా తోడ్పడతాయి ? (పేజి.నెం. 150)
జవాబు:
తేనెటీగలు మకరందం కోసం ఒక పువ్వుపై వాలుతాయి. అప్పుడు దాని శరీరానికి పరాగరేణువులు అంటుకొని ఉంటాయి. అది తర్వాత వేరే పుష్పంపై మకరందం కోసం వెళితే ఆ పరాగరేణువులు ఆ పుష్పంలోని కీలాగ్రంపై చేరును.
ఈ విధంగా తేనెటీగలు పరాగసంపర్కానికి సహాయపడును.
ప్రశ్న 27.
మీ పరిసరాలలో తేనెపట్టును ఎక్కడ గమనించారు ? (పేజి.నెం. 152)
జవాబు:
మా పరిసరాల్లో పెద్ద పెద్ద చెట్లకు మరియు పెద్ద పెద్ద భవనాలకు తేనెపట్టు ఉండటం గమనించాం.
ప్రశ్న 28.
తేనెపట్టును ఏ కాలంలో ఎక్కువగా చూడవచ్చు ? (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఏ కాలంలో అయితే ఎక్కువగా మొక్కలకు పూలు పూస్తాయో ఆ కాలంలో చూస్తాము. అది వర్షాకాలం, ఎండకాలానికి ముందు (శిశిర ఋతువు) పూలు బాగా పూస్తాయి.
ప్రశ్న 29.
తేనెపట్టు నుంచి తేనె సేకరించడం జాగ్రత్తగా చేసే పని. తేనెపట్టు నుంచి తేనె ఎలా సేకరిస్తారో, సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఉన్న చోట పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్లించి తేనె తీయడం “జరుగును. ఈగలు ప్రక్కకు వెళ్ళిన ఆ తరువాత తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనెను తీస్తారు. తేనె తీసే మనిషి గోనె సంచి ఒంటినిండా కప్పుకుంటారు.
ప్రశ్న 30.
కృత్రిమ మరియు సహజ తేనెపట్టుల మధ్య గల వ్యత్యాసాలను గురించి చర్చించండి. (పేజి.నెం. 152)
జవాబు:
ప్రశ్న 31.
తేనెటీగల మైనం యొక్క ఉపయోగాలు వ్రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెటీగల మైనంతో అలంకరణ సామగ్రి, గోళ్ళ రంగు, కొవ్వొత్తులు, చెప్పుల పాలిష్ మొదలైనవి తయారుచేస్తారు.
ప్రశ్న 32.
మీ చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల జాబితాను తయారుచేయండి. స్థానిక పేర్లను మాత్రమే రాయండి. (పేజి.నెం. 153)
జవాబు:
మా చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల స్థానిక పేర్లు :
- బొచ్చె
- రాహు, ఎర్రగండు
- రాగండి
- ఎర్రమోసు
- పెద్ద బొచ్చె
- వాలుగ
- మట్ట గిడస
- పులస
- సొర
ప్రశ్న 33.
మీకు కొలనులో చేపలను ఎలా పట్టాలో తెలుసా ? (పేజి.నెం. 153)
జవాబు:
తెలుసు, మేము కొలనులో చేపలను పట్టుటకు ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ రాడ్స్ ఉపయోగిస్తాము.
ప్రశ్న 34.
అధిక మొత్తంలో చేపలను పట్టడానికి ఏం చేస్తారు ? (పేజి.నెం. 153)
జవాబు:
అధిక మొత్తంలో చేపలు పట్టడానికి ఈ క్రింది విధంగా చేస్తాము.
1. అధిక మొత్తంలో చేపలు పట్టుకొనుటకు నైలాన్ వలలు ఉపయోగిస్తారు. .
2. పెద్ద వలలను, మోటార్ పడవలను ఉపయోగిస్తారు.
ప్రశ్న 35.
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరంగా కొనసాగిస్తే ఏం జరుగుతుంది ? (పేజి.నెం. 153)
జవాబు:
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరం కొనసాగిస్తే
- సహజ వనరుల దుర్వినియోగం జరుగును.
- కొన్ని చేపల జాతులు అంతరించును.
- చేపలను ఆహారంగా తినే ఇతర జీవులకు హాని కలుగును.
- ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థ అస్తవ్యస్థం అగును.
ప్రశ్న 36.
ఆలుచిప్పలు వలన కలిగే ఉపయోగాలను మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి. (పేజి.నెం.153)
జవాబు:
- ఆలుచిప్పలు విటమిన్ – డి, కాల్షియం, విటమిన్ – బి, ప్రొటీన్లు, మంచి కొలెస్ట్రాల్, ఇనుమును కలిగి ఉంటాయి.
- నీటిని వడకట్టి శుభ్రపరుస్తాయి.
- ఆలుచిప్పలు తినుటవలన లైంగిక సామర్థ్యం పెరుగును.
- కొన్ని ఆలుచిప్పలు ముత్యాల తయారీలో ఉపయోగపడును.
ప్రశ్న 37.
మన సముద్ర జలాలలో “టూనా” అనే ముఖ్యమైన చేప లభిస్తుంది. టూనా చేపకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజి.నెం. 153).
జవాబు:
టూనా చేప 1 నుంచి 10 అడుగుల వరకు పెరుగును. 600 కేజీల బరువు ఉండును. 70 కి.మీ. వేగంతో ఈదును. 26°C ఉష్ణోగ్రత వద్ద నివసించును. దీనిలో ముఖ్యంగా 3 ఓమెగో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు. క్రొవ్వులు కూడా తక్కువగా (8 గ్రాములు) ఉండును. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండును.
ఈ “టూనా” చేపల ఉపయోగాలు :
- గుండెపోటు రాకుండా చేయును.
- పిల్లలలోను ఆస్మా తగ్గించును.
- మానసిక ఒత్తిడులను తగ్గించును.
- కీళ్ళ నొప్పులను తగ్గించును.
- పక్షవాతం నుంచి వ్యక్తి తొందరగా కోలుకొనుటకు సహాయపడును.
ప్రశ్న 38.
నీలి విప్లవం అనగానేమి ? దాని ప్రభావాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చర్చించండి. (పేజి.నెం. 154)
జవాబు:
చేపల పెంపకం, దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు.
నీలి విప్లవం ప్రభావం :
- పెరుగుతున్న జనాభా అవసరానికి సరిపోవును.
- ఎగుమతులకు సరిపోయినన్ని చేపలు లభించును.
- సముద్రాలలో ఆవరణ వ్యవస్థ అంతగా పాడవదు.
- వ్యవసాయదారులకు రెండవ పంటగా ఉపయోగపడును.
ప్రశ్న 39.
మీ ప్రాంతంలో చేపలను నిల్వచేసే పద్ధతుల జాబితా రాయండి. (పేజి.నెం. 155)
జవాబు:
మా ప్రాంతంలో చేపలను క్రింది పద్ధతుల్లో నిల్వ చేస్తారు.
- ఎండలో ఎండబెట్టడం
- పాక్షికంగా ఎండబెట్టడం
- ఉప్పులో ఊరబెట్టడం
- పొగబెట్టడం