SCERT AP 8th Class Maths Solutions Chapter 3 చతుర్భుజాల నిర్మాణాలు Ex 3.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 8th Class Maths Solutions 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు Exercise 3.2
కింద ఇవ్వబడిన కొలతలను ఉపయోగించి చతుర్భుజాల నిర్మాణాలను చేయండి.
(a) ABCD చతుర్భుజములో AB = 4.5 సెం.మీ., BC = 5.5 సెం.మీ., CD = 4 సెం.మీ., AD = 6 సెం.మీ., మరియు AC = 7 సెం.మీ.
సాధన.
నిర్మాణ క్రమం :
1. 4.5 సెం.మీ. వ్యాసార్ధంతో ఒక \(\overline{\mathrm{AB}}\) రేఖాఖండాన్ని నిర్మించితిని.
2. A, B లు కేంద్రాలుగా వరుసగా 7 సెం.మీ., 5.5 సెం.మీ. వ్యాసార్దాలుగా గీచిన చాపాల ఖండన బిందువు ‘C’ గా గుర్తించితిని.
3. A. C లను, B, C లను కలిపితిని.
4. C, A లు కేంద్రాలుగా వరుసగా 4 సెం.మీ., 6 సెం.మీ. వ్యాసార్ధాలతో గీచిన చాపాల ఖండన బిందువు ‘D’ గా గుర్తించితిని.
5. D, C లను, A, D లను కలిపితిని.
∴ ABCD చతుర్భుజం ఏర్పడినది.
(b) PQRS చతుర్భుజములో PQ = 3.5 సెం.మీ., QR = 4 సెం.మీ., RS = 5 సెం.మీ., PS = 4.5 సెం.మీ., మరియు QS = 6.5 సెం.మీ.
సాధన.
నిర్మాణ క్రమం :
1. 3.5 సెం.మీ. వ్యాసార్ధంతో \(\overline{\mathrm{PQ}}\) రేఖాఖండాన్ని గీచితిని.
2. P, Q లు కేంద్రాలుగా వరుసగా 4.5 సెం.మీ., 6.5 సెం.మీ. లచే రెండు చాపాలను గీయగా వాటి ఖండన బిందువును ‘S’ గా గుర్తించితిని.
3. S, Q లు కేంద్రాలుగా 5 సెం.మీ., 4 సెం.మీ. వ్యాసార్ధంతో గీచిన చాపాలు ఖండించుకొనగా, వాటి ఖండన బిందువును ‘R’ గా గుర్తించితిని.
4. P, S లను Q, S లను కలిపితిని. అదేవిధంగా S, Rలను Q, Rలను కలిపితిని.
∴ చతుర్భుజం PARS ఏర్పడినది.
(c) సమాంతర చతుర్భుజం ABCD లో AB = 6.సెం.మీ., BC = 4.5 సెం.మీ. మరియు BD = 7.5 సెం.మీ.
సాధన.
ABCD సమాంతర చతుర్భుజంలో
AB = CD = 6 సెం.మీ.
BC = AD = 4.5 సెం.మీ.
నిర్మాణ క్రమం :
1. 6 సెం.మీ. వ్యాసార్ధంతో \(\overline{\mathrm{AB}}\) రేఖాఖండాన్ని గీచితిని.
2. A, B లు కేంద్రాలుగా 4.5 సెం.మీ., 7.5 సెం.మీ. వ్యాసార్ధంతో గీచిన చాపాల ఖండన బిందువులను ‘D’ గా గుర్తించితిని. A, D మరియు B, D లను కలిపితిని.
3. D, B లు కేంద్రాలుగా 6. సెం.మీ., 4.5 సెం.మీ. వ్యాసార్ధాలతో గీచిన చాపాల ఖండన బిందువును ‘C’ గా గుర్తించితిని.
4. B, C మరియు D, C లను కలిపితిని.
∴ సమాంతర చతుర్భుజం ABCD ఏర్పడినది.
(d) సమచతుర్భుజం (రాంబస్) NICE లో NI = 4 సెం.మీ. మరియు IE = 5.6 సెం.మీ.
సాధన.
NI = IC = CE = NE = 4 సెం.మీ., IE = 5.6 సెం.మీ.
నిర్మాణ క్రమం :
1. 4 సెం.మీ. వ్యాసార్ధంతో \(\overline{\mathrm{NI}}\) రేఖాఖండాన్ని గీచితిని.
2. N, I లు కేంద్రాలుగా వరుసగా 4 సెం.మీ., 5.6 సెం.మీ. వ్యాసార్ధాలతో రెండు చాపాలను గీయగా వాటి ఖండన బిందువును ‘E’ గా గుర్తించితిని. N, E మరియు I, E లను కలిపితిని.
3. E, Iలు కేంద్రాలుగా వరుసగా 4 సెం.మీ., వ్యాసార్ధాలతో గీచిన రెండు చాపాల ఖండన బిందువును ‘C’ గా గుర్తించితిని.
4. E, C లను, I, C లను కలిపితిని.
∴ NICE రాంబస్ ఏర్పడినది.