AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

SCERT AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 9th Lesson Questions and Answers ద్రవాల విద్యుత్ వాహకత

8th Class Physical Science 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఘన, ద్రవ విద్యుత్ వాహకాలకు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
1. ఘన విద్యుత్ వాహకాలు : లోహాలన్నీ విద్యుత్ వాహకాలు.
లోహాలు : అల్యూమినియం, రాగి, బంగారం, ఇనుము మొదలగునవి.

2. ద్రవ విద్యుత్ వాహకాలు (విద్యుత్ విశ్లేష్య పదార్థాలు) :
a) ఆమ్లాలు : హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం.
b) క్షారాలు : సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్,
C) లవణ ద్రావణాలు : సోడియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్ ద్రావణం, కాల్షియం సల్ఫేట్ ద్రావణం .

ప్రశ్న 2.
ఘన, ద్రవ విద్యుత్ బంధకాలకు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
1. ఘన విద్యుత్ బంధకాలు :
చెక్క రబ్బరు, కాగితం, ప్లాస్టిక్, చాక్ పీస్.

2. ద్రవ విద్యుత్ బంధకాలు (అవిద్యుత్ విశ్లేష్యాలు) :
స్వేదనజలం, కొబ్బరినూనె, వెనిగర్, చక్కెర ద్రావణం, గ్లూకోజ్ ద్రావణం, బెంజీన్.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 3.
స్వేదనజలం గుండా విద్యుత్ ప్రవహించాలంటే నీవేమి కలుపుతావు? (AS1)
జవాబు:
స్వేదనజలం గుండా విద్యుత్ ప్రవహించాలంటే స్వేదన జలానికి ఆమ్లాలు లేదా క్షారాలు లేదా లవణాలు కలపాలి.

ప్రశ్న 4.
విద్యుత్ విశ్లేష్యం అంటే ఏమిటి? (AS1)
జవాబు:
విద్యుత్ విశ్లేష్యం :
విద్యుత్ ను తమగుండా ప్రసరింపనిచ్చే ద్రావణాన్ని విద్యుత్ విశ్లేష్యం అంటారు.

ప్రశ్న 5.
బల్బు వెలగడానికి ఘటం (Cell)లోని ఏ శక్తి కారణం? (AS1)
జవాబు:
ఘటంలోని రసాయనశక్తి విద్యుత్ శక్తిగా మారటం వల్ల బల్బు వెలుగుతుంది.

ప్రశ్న 6.
ఎలక్ట్రోప్లేటింగ్ ఉపయోగాలను తెలపండి. (AS1)
జవాబు:
ఎలక్ట్రోప్లేటింగ్ ఉపయోగాలు :

  1. ఇనుముతో తయారైన వస్తువులు తుప్పు పట్టకుండా ఉండుటకు నికెల్ లేదా క్రోమియం లోహాలతో పూత పూస్తారు.
  2. యంత్రాల భాగాలు తుప్పు పట్టకుండా ఉండడానికి, మెరవడానికి తరచుగా క్రోమియం పూతపూస్తారు.
  3. యంత్రాల పైభాగాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగుచేయడానికి వాటి పైభాగంలో కావలసిన లోహాన్ని పూతపూస్తారు.
  4. రాగి లేదా దాని మిశ్రమ లోహంతో తయారుచేయబడిన ఆభరణాలు, అలంకరణ వస్తువులపై వెండి లేదా బంగారం లోహాల పూత పూస్తారు.
  5. తినుబండారాలను నిల్వ ఉంచడానికి తగరం పూత పూయబడిన ఇనుప డబ్బాలను వాడతారు.
  6. వంతెనల నిర్మాణంలోనూ, వాహన పరికరాల తయారీలోనూ జింక్ పూత పూయబడిన ఇనుమును వాడుతారు.

ప్రశ్న 7.
ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు అగ్నిమాపకదళంవారు నీటితో మంటలను ఆర్పడానికి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఎందుకు? (AS1)
జవాబు:
అగ్నిమాపకదళంవారు ఉపయోగించే నీరు స్వేదన జలం కాదు. నీరు విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. కాబట్టి మంటలను ఆర్పడానికి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 8.
కొన్ని రకాల ఇనుప వస్తువులకు ప్లాస్టిక్ తొడుగులు ఉండటం మనం చూస్తుంటాం. ఆ ఇనుప వస్తువులపై ప్లాస్టిక్ తొడుగును ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలోనే అమర్చుతారా? ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా లోహాలపై ప్లాస్టిక్ పూతను ఎందుకు పూయలేం? (AS1)
జవాబు:

  1. ఇనుప వస్తువుపై ప్లాస్టిక్ తొడుగును ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో అమర్చలేరు.
  2. విద్యుత్ విశ్లేష్య పదార్థాలను మాత్రమే ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా లోహాల పై పూత పూయగలం. ప్లాస్టిక్ అవిద్యుత్ విశ్లేష్య పదార్థం. కావున ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా లోహాలపై ప్లాస్టిక్ పూత పూయలేము.

ప్రశ్న 9.
పూర్తిగా వాడిన బ్యాటరీని కావ్య వాళ్ళ నాన్న కొన్ని గంటలు ఎండలో ఉంచి ఉపయోగిస్తే LED వెలిగింది. అది చూశాక ఆమె మదిలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమయినవి. ఆ ప్రశ్నలేమిటో మీరు ఊహించగలరా? (AS2)
జవాబు:

  1. ఇంకా ఎక్కువ గంటలు ఎండలో ఉంచితే ఇంకా ఎన్ని గంటలు ఎక్కువ LED బల్బు వెలుగుతుంది?
  2. వాడిన బ్యాటరీను ఎండబెట్టితే ఎందుకు పనిచేస్తుంది?
  3. ఎన్ని గంటలు LED బల్బు వెలుగుతుంది?
  4. ఎన్నోసార్లు వాడేసిన బ్యాటరీని ఎండబెట్టినా LED బల్బు వెలుగుతుందా?
  5. వాడిన బ్యాటరీని ఫ్రిజ్ లో ఉంచితే ఎందుకు పనిచేయదు?

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 10.
ఇనుపతాళం చెవిపై రాగిపూత పూసే పద్ధతిని వివరించండి. అందుకు ఏర్పాటు చేసే వలయాన్ని బొమ్మగీయండి. (ప్రయోగశాల కృత్యం) (AS3)
(లేదా)
ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియను చూపే పటం గీయండి. నాణ్యమైన పూత ఏర్పడటానికి అవసరమైన ఏదేని ఒక అంశాన్ని రాయండి.
(లేదా)
కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, ఇనుప మేకు, రాగి తీగలను నీకు ఇచ్చినపుడు రాగి ఇనుముల చర్యా శీలతలను పరిశీలించుటకు నీవు చేసే కృత్యమును వివరింపుము. ఈ కృత్యము ద్వారా నీవు పరిశీలించిన అంశాలు ఏమిటి?
జవాబు:
ఉద్దేశం :
ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో ఇనుప తాళం చెవిపై రాగిపూతను పూయడం.

కావలసిన వస్తువులు :
రాగి పలక, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు, ఇనుప తాళం చెవి, గాజు బీకరు, నీరు, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, కొన్ని రాగి తీగలు మరియు బ్యాటరీ మొదలగునవి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 1

ప్రయోగ పద్ధతి :
నీటిలో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను కలిపి గాఢ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారుచేయండి. ఈ ద్రావణాన్ని గాజు బీకరులో పోసి దానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపండి. రాగి పలకను, ఇనుపతాళం చెవిని రాగి తీగలకు కట్టి ద్రావణంలో వేలాడదీయండి. ప్రక్క పటంలో చూపినట్లు బ్యాటరీ మరియు స్విచ్ తో వలయాన్ని ఏర్పాటు చేయండి.

ద్రావణంలో వేలాడే రాగి పలక, ఇనుప తాళంచెవి ఒకదాని కొకటి తాకకుండా జాగ్రత్త వహించండి. స్విచ్ ఆన్ చేసి 10 నిమిషాల పాటు విద్యుత్ ప్రవాహం జరపండి. తర్వాత స్విచ్ :”ఆఫ్” చేసి తాళం చెవిని బయటకు తీయండి.

పరిశీలన :
తాళం చెవిపై ముదురు గోధుమ రంగు పూత ఏర్పడి ఉంటుంది.

కారణం :
కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించినపుడు రసాయన చర్య వలన అది కాపర్ (Cu2+), సల్ఫేట్ (SO2-4) అయాన్లుగా విడిపోయింది. కాపర్ అయాన్లు బ్యాటరీ ఋణ ధృవం వైపు ప్రయాణించి, ఇనుప తాళం చెవిపై గోధమరంగు పూతను ఏర్పరచినాయి.

ప్రశ్న 11.
విద్యుతను నిల్వ ఉంచడానికి వీలుగా సెల్ ను రూపొందించడంలో “గాల్వాని, ఓల్టా” ల కృషిని మీరెలా అభినందిస్తారు? (AS6)
జవాబు:
1780 సం||లో ఇటలీ దేశపు “బోలోనా” ప్రాంత వాసియైన “లూయీ గాల్వానీ” అనే శాస్త్రవేత్త రాగి కొక్కానికి వేలాడదీసిన చనిపోయిన కప్ప కాలు వేరొక లోహానికి తగిలినప్పుడు బాగా వణకడం గమనించాడు. తర్వాత గాల్వాని కప్ప కాళ్ళతో అనేక ప్రయోగాలు చేసి చనిపోయిన జీవులనుండి “జీవ విద్యుత్”ను తయారు చేయవచ్చని భావించినాడు. గాల్వాని ప్రయోగం చాలా మంది ఐరోపా శాస్త్రవేత్తలలో వివిధ జంతువులతో ప్రయోగాలు నిర్వహించడానికి ఆసక్తి రేపింది. వారిలో ఇటలీ దేశానికి చెందిన అలెసాండ్ ఓల్టా ఒకరు.

ఓల్టా జీవ పదార్థాలకు బదులుగా ద్రవాలను తీసుకుని అనేక ప్రయోగాలు చేశాడు. “ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక ద్రవంలో ఉంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చ”ని కనుగొన్నాడు.

ఓల్టా 1800 సం||లో రాగి, జింక్ పలకలు మరియు సల్ఫ్యూరికామ్లంతో ఒక ప్రాథమిక ఘటాన్ని తయారుచేశాడు. దీనిని “ఓల్టా ఘటం” అని పిలుస్తారు. ఓల్టా ఘటములో రసాయనశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. గాల్వానీ, ఓల్టా కృషి ఫలితంగా ఎన్నో ఘటాలను కనుగొనడం జరిగినది. కాబట్టి గాల్వానీ, ఓల్టాల కృషి మరువలేనిదిగా చెప్పవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 12.
మీ పరిసరాలలోని వస్తువులను పరిశీలించి విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా జాబితా తయారుచేయండి. ఈ సమాచారాన్ని మీరు మీ దైనందిన కార్యక్రమాలలో ఎలా వినియోగించుకుంటారో చెప్పండి. (AS7)
జవాబు:
విద్యుత్ వాహకాలు :

  1. లోహాలు ఉదా : రాగి, ఇనుము, అల్యూమినియం, సీసం, వెండి మొదలగునవి.
  2. విద్యుత్ విశ్లేష్య పదార్థాలు (ఆమ్లాలు, క్షారాలు, లవణ ద్రావణాలు).

విద్యుత్ వాహకాల ఉపయోగాలు :

  1. లోహాలను విద్యుత్ తీగలుగా ఉపయోగిస్తారు.
  2. విద్యుత్ విశ్లేష్య పదార్థాలను ఉపయోగించి ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు.
  3. లోహ సంగ్రహణలో విద్యుత్ క్షయకరణ వలన లోహాలను తయారుచేస్తారు.
  4. లోహాలను విద్యుత్ విశ్లేషణ ద్వారా శుద్ధి చేస్తారు.

విద్యుత్ బంధకాలు :
కర్రలు, రబ్బరు, ప్లాస్టికు మొ||నవి. కర్రలు, రబ్బరు, ప్లాస్టిక్ లను విద్యుత్ పరికరాలకు పిడులుగా వాడుతారు.

ప్రశ్న 13.
నాలుగు నిమ్మకాయలతో సెల్ తయారుచేసి, అది పనిచేస్తుందో లేదో LED సహాడుంతో పరీక్షించండి. (AS3)
(లేదా)
నాలుగు నిమ్మకాయలను ఉపయోగించి ఘటాన్ని ఎలా తయారు చేస్తారు? కాంతి ఉద్గార డయోడ్ లో (LED) ఘటాన్ని ప్రయోగశాలలో ఎలా పరీక్షిస్తారో రాయండి.
జవాబు:
నాలుగు నిమ్మకాయలను తీసుకొని వాటిని రెండు ముక్కలుగా కోయండి. ఒక్కొక్క నిమ్మకాయ .నుండి ఒక్కొక్క ముక్క తీసుకొనండి. ఆ ముక్కలలో రెండు రాగి తీగలను గుచ్చి, వాటిని శ్రేణి పద్ధతిలో కలపండి. ఈ వలయానికి ఒక LEDని కలిపి, వలయాన్ని పూర్తిచేయండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 2

వలయంలో విద్యుత్ ఉండుట వలన LED వెలుగుతుంది. ఇక్కడ నిమ్మరసం అంటే సిట్రిక్ యాసిడ్ విద్యుద్విశ్లేష్యంగాను, రాగి తీగలు విద్యుత్ వాహకంగాను పనిచేస్తాయి. అందువలన రాగి తీగలు గుచ్చబడిన ఒక్కొక్క నిమ్మకాయముక్క ఒక్కొక్క ఘటంగా పనిచేస్తుంది. ఇవి శ్రేణిలో సంధానం చేయబడిన బ్యాటరీలలాగా పనిచేస్తాయి.

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలోని కృత్యం – 3 ని గమనించండి. స్వేదన జలంతో ప్రారంభించండి. LED వెలగదు. ఇపుడు కొన్ని చుక్కల ఆమ్లాన్ని కలపండి. LED వెలుగుతుంది. మరికొన్ని చుక్కల ఆమ్లాన్ని కలపండి. LED వెలుగును పరీక్షించండి. ప్రతిసారి రెండు లేక మూడు చుక్కల ఆమ్లాలు కలుపుతూ 5 లేక 6 సార్లు ఈ కృత్యాన్ని చేయండి. నీటిలో ఆమ్లాన్ని కలుపుతూ పోతున్న కొద్దీ LED వెలిగే తీవ్రతలో ఏమైనా మార్పు గమనించారా? మీ పరిశీలనబట్టి ఏం చెప్పగలరు? పై కృత్యాన్ని వంటసోడా తీసుకొని దానిని స్వేదన జలానికి కలుపుతూ చేయండి. రెండు సందర్భాలకు గల పోలికలు, భేదాలను వ్రాయండి. (AS3)
జవాబు:

స్వేదన జలం + ఆమ్లం స్వేదన జలం + వంటసోడా
1) స్వేదన జలానికి కొన్ని చుక్కల ఆమ్లం కలిపినపుడు ఏర్పడే ద్రావణాన్ని LED బల్బుగల టెస్టతో టెస్ట్ చేసినపుడు LED వెలిగింది. 1) స్వేదన జలానికి కొద్దిగా వంటసోడా కలుపగా ఏర్పడే ద్రావణాన్ని LED బల్బుగల టెస్టర్తో టెస్ట్ చేసినపుడు LED బల్బు వెలిగింది.
2) స్వేదన జలానికి అదనంగా మరికొంత ఆమ్లాన్ని కలిపి, LED టెస్ట ర్తో టెస్ట్ చేస్తే LED బల్బు తీవ్రత పెరిగినది. 2) స్వేదన జలానికి మరికొంత వంటసోడా కలిపి LED టెస్టర్తో టెస్ట్ చేసినపుడు LED బల్బు కాంతి తీవ్రత తగ్గింది.
3) స్వేదన జలానికి ఆమ్లాన్ని కలిపే కొద్దీ విద్యుత్ వాహకత పెరిగినది. 3) స్వేదన జలానికి వంటసోడా కలిపే కొద్దీ విద్యుత్ వాహకత తగ్గినది.
4) స్వేదన జలానికి ఆమ్లాన్ని కలిపినపుడు బీకరు ఉష్ణోగ్రత పెరిగినది. 4) స్వేదన జలానికి వంటసోడా కలిపినపుడు బీకరు ఉష్ణోగ్రత తగ్గింది.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 15.
ఈ పాఠ్యాంశంలోని అనేక కృత్యాలలో LED తో తయారుచేసిన “టెస్టర్”ను వినియోగించారు కదా ! LED కి బదులుగా మరేదైనా వాడి టెస్టర్ తయారు చేయవచ్చా? LED కి బదులుగా అయస్కాంత దిక్సూచిని వాడవచ్చు. విద్యుత్ ప్రవహిస్తున్న తీగ దగ్గరగా ఉన్నపుడు అయస్కాంత సూచిలో అపవర్తనం కలుగుతుందని మనకు తెలుసు. ఈ విషయం ఆధారంగా దిక్సూచిని వాడి టెస్టర్ తయారు చేయండి. కింద ఇవ్వబడిన పటాన్ని వినియోగించుకోండి. (AS4)
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 3
జవాబు:
LED బదులుగా దిక్చూచిని ఉపయోగించి టెస్టరు తయారు చేయవచ్చును. “విద్యుత్ ప్రవహిస్తున్న తీగ దగ్గరగా దిక్సూచి ఉన్నపుడు దిక్సూచిలోని అయస్కాంత సూచి అపవర్తనం చెందును”. అయస్కాంత సూచి అపవర్తనం చెందినట్లు అయితే . ‘ఆ తీగ గుండా విద్యుత్ ప్రవహించినట్లుగా తెలుస్తుంది.

పరికరాలు :
దిక్సూచి, డ్రైసెల్, లోహపు సూదులు, ఇంజక్షన్ బాటిల్ యొక్క రబ్బరు మూత మరియు రాగి తీగలు.

విధానము :
మొదట ఒక దిక్సూచిని తీసుకొని దానికి అనేక చుట్లు రాగి తీగతో చుట్టండి. ఒక రబ్బరు మూతకు రెండు ఇంజక్షన్ సూదులను పటంలో చూపిన విధంగా గుచ్చండి. ఒక ఇంజక్షన్ సూదిని రాగి తీగతో కలిపి, రాగితీగ రెండవ చివరను, దిక్సూచికి చుట్టిన తీగచుట్ట యొక్క ఒక చివర కలుపవలెను. తీగచుట్ట యొక్క రెండవ చివరను బ్యాటరీకి పటంలో చూపిన విధంగా కలపండి. రెండవ ఇంజక్షన్ సూధికి మరొక తీగ కలిపి ఈ తీగ రెండవ చివరను బ్యాటరీ యొక్క రెండవ చివర, పటంలో చూపిన విధంగా కలపండి. రెండు ఇంజక్షన్ సూదులను ఒకదానిని మరొకటి తాకునట్లు చేసినచో దిక్సూచిలోని సూచి అపవర్తనం చెందును. సూదులను విడదీయగానే సూచిలో అపవర్తనం ఉండదు. దీన్ని బట్టి దిక్సూచి టెస్టర్ గా పనిచేస్తుందని తెలుస్తుంది. దీనిని టెస్టర్ గా ఉపయోగించవచ్చును.

మనం టెస్ట్ చేయవలసిన ద్రావణాన్ని రబ్బరు మూతలో పోసి, దిక్సూచిలోని సూచిక అపవర్తనం చెందిందో లేదో తెలుసుకొని, విద్యుత్ వాహకమా లేదా విద్యుత్ బంధకమా అని నిర్ధారించవచ్చును.

పరికరాల జాబితా

ఇనుపసీల, చాక్ పీసు, స్ట్రా ముక్క, కాగితం ముక్క, పెన్సిల్ రబ్బరు, పెన్సిల్ గ్రాఫైట్ కడ్డీ, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ ముక్క, స్వేదన జలం, త్రాగునీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం, వెనిగర్, కిరోసిన్, వెజిటబుల్ ఆయిల్, చక్కెర ద్రావణం, పాలు, పెరుగు,ఉప్పు, ఆలుగడ్డ, ఖాళీ ఇంజక్షన్ బాటిల్స్, ఇనుపతాళం చెవి, బ్యాటరీ, బల్బు, వైర్లు, రబ్బరుమూత, రాగి తీగలు, జింకు | తీగలు, గాజు బీకరు, కాపర్ సల్ఫేట్, జల సల్ఫ్యూరికామ్లం, నీరు.

8th Class Physical Science 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 123

ప్రశ్న 1.
కొన్ని రకాల పదార్థాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపనిస్తాయి, కొన్ని పదార్థాలు ప్రసరింపనీయవు. ఎందుకు?
జవాబు:
ఏ పదార్థాలు అయితే విద్యుత్ ను ప్రసరింపచేసినపుడు అయనీకరణం చెందునో ఆ పదార్థాలు విద్యుత్ ను ప్రసరింపచేస్తాయి. ఏ పదార్థాలగుండా విద్యుతను ప్రసరింపచేసినపుడు అయనీకరణం చెందవో ఆ పదార్థాలు తమగుండా విద్యుత్ను ప్రసరింపచేయవు.

8th Class Physical Science Textbook Page No. 127

ప్రశ్న 2.
ఒక బ్యాటరీ సెల్ ను చిన్న పెట్టెలో ఉంచి దాని రెండు ధ్రువాలకు అతుకబడిన రెండు తీగలను మాత్రమే బయటకు కనబడేట్లు ఉంచారు. వాటిలో ఏది ధన ధ్రువం నుండి వచ్చినదో, ఏది ఋణ ధ్రువం నుండి వచ్చిందో మీరెలా కనుగొంటారు?
జవాబు:
ఒక ఆలుగడ్డ ముక్కను తీసుకొని, బ్యాటరీ ధ్రువాల నుండి వచ్చిన రెండు తీగలను ఆలుగడ్డ ముక్కలో గుచ్చండి. 20 నుండి 30 నిమిషాల తరువాత ఆలుగడ్డ ముక్కను పరిశీలించండి. ఆలుగడ్డ ముక్కలో నీలం – ఆకుపచ్చరంగు ఏ తీగ వద్ద ఏర్పడిందో ఆ తీగ బ్యాటరీ యొక్క ధనధ్రువం అవుతుంది. రెండో తీగ ఋణ ధ్రువం.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

8th Class Physical Science Textbook Page No. 130

ప్రశ్న 3.
విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటే ఏమిటి?
జవాబు:
ద్రావణాల గుండా విద్యుత్ ప్రవహింపచేయడం వలన, అవి వాటి ఘటక మూలకాలుగా వియోగం చెందే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటారు.

8th Class Physical Science 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook Activities

కృత్యం – 1 ఏయే పదార్థాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపనిస్తాయో పరీక్షించుట :

ప్రశ్న 1.
ఏయే పదార్థాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపనిస్తాయో పరీక్షించుట :
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 4
ఒక టార్చిలైట్ బల్బు లేదా LED, నిర్జల ఘటం (dry cell), చెక్క పలక, రెండు డ్రాయింగ్ పిన్నులు, ఒక పిన్నీసు మరియు వలయాన్ని కలపడానికి కొన్ని రాగి తీగలు సేకరించి, పటంలో చూపిన విధంగా సాధారణ విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేయండి. పిన్నీసును రెండు డ్రాయింగ్ పిన్నులకు ఆనిస్తే బల్బు వెలుగుతుంది.

పిన్నీసుకు బదులుగా చాక్ పీస్, స్ట్రా, కాగితం, పెన్సిల్ రబ్బరు, పెన్సిల్ లోని గ్రాఫైట్, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ ముక్క వంటి వివిధ వస్తువులను ఉంచుతూ బల్బు వెలుగుతుందో లేదో చూడండి. బల్బు వెలిగితే విద్యుత్ వాహకం. బల్బు వెలగకపోతే విద్యుత్ బంధకంగా ఈ కింది పట్టికలో వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 5

కృత్యం – 2 ద్రవాల విద్యుత్ వాహకతను పరిశీలించుట :

ప్రశ్న 2.
ద్రవాల విద్యుత్ వాహకతను పరిశీలించుట :
జవాబు:
ఒక LED, డ్రైసెల్, లోహపు సూదులు, ఇంజక్షన్ బాటిల్ యొక్క రబ్బరు మూత మరియు వలయాన్ని కలపడానికి రాగి తీగలు సేకరించండి. పటంలో చూపిన విధంగా వలయాన్ని కలిపి టెస్టర్ తయారుచేయండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 6

రబ్బరుమూతకు గుచ్చిన సూదుల మధ్య దూరం చాలా తక్కువగా అంటే 2 మి.మీ. మాత్రమే ఉండవలెను. అంటే సూదులు అతి దగ్గరగా ఉండాలి కాని అవి ఒకదానికొకటి తాకరాదు. అలాగే ఆ రెండు సూదులను తాకించనంత వరకు వలయంలోని LED వెలగరాదు.

ఇప్పుడు ఒకసారి ఆ సూదులను ఒకదానికొకటి అతికించి LED వెలుగుతుందో లేదో పరీక్షించవలెను. అలాగే రెండు సూదులను విడదీయగానే LED వెలగడం ఆగిపోవాలి. అప్పుడు మనకు టెస్టరు తయారైనట్లు.

ఈ టెస్టర్ యొక్క రబ్బరు మూతలో ఈ కింది పట్టికలో ఇచ్చిన ఒక్కొక్క ద్రావణం తీసుకొని అవి విద్యుత్ వాహకమా, విద్యుత్ బంధకమా తెలుసుకొని పట్టికలో నమోదు చేయండి.

ద్రవం LED వెలిగినది/ వెలగలేదు ద్రవం విద్యుత్ వాహకం/బంధకం
1. స్వేదన జలం వెలగలేదు విద్యుత్ బంధకము
2. త్రాగునీరు వెలిగినది విద్యుత్ వాహకము
3. కొబ్బరినూనె వెలగలేదు విద్యుత్ బంధకము
4. నిమ్మరసం వెలిగినది విద్యుత్ వాహకము
5. వెనిగర్ వెలిగినది విద్యుత్ వాహకము
6. కిరోసిన్ వెలగలేదు విద్యుత్ బంధకము
7. చక్కెర ద్రావణం వెలగలేదు విద్యుత్ బంధకము
8. తేనె వెలగలేదు విద్యుత్ బంధకము

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

కృత్యం – 3 విద్యుత్ విశ్లేష్యం యొక్క విద్యుత్ వాహకత :

ప్రశ్న 3.
విద్యుత్ విశ్లేష్యం యొక్క విద్యుత్ వాహకత.
జవాబు:
సమాన ఘనపరిమాణం గల స్వేదనజలాన్ని 3 వేర్వేరు పాత్రలలో తీసుకోండి. మొదటి దానికి సాధారణ ఉప్పు, రెండవ దానికి కాపర్ సల్ఫేట్, 3వ దానికి నిమ్మరసాన్ని కొద్ది మోతాదులో కలపండి. మీరు తయారుచేసిన టెస్టర్ సహాయంతో పరీక్షించి పట్టికలో నమోదు చేయండి.

పదార్థం LED వెలిగినది/ వెలగలేదు పదార్థం విద్యుత్ వాహకం/బంధకం
1. స్వేదన జలం వెలగలేదు విద్యుత్ బంధకం
2. స్వేదన జలం + ఉప్పు వెలిగినది విద్యుత్ వాహకం
3. స్వేదన జలం + కాపర్ సల్ఫేట్ వెలిగినది విద్యుత్ వాహకం
4. స్వేదన జలం + నిమ్మరసం వెలిగినది విద్యుత్ వాహకం

కృత్యం – 4 ఆలుగడ్డపై విద్యుత్ ప్రవాహ ఫలితాన్ని పరీక్షించుట :

ప్రశ్న 4.
మీరు తయారు చేసిన టెస్టర్ ను ఉపయోగించి ఆలుగడ్డపై విద్యుత్ ప్రవాహ ఫలితాన్ని పరీక్షించి ఫలితాలు మరియు మీ పరిశీలనలు తెల్పండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 7
జవాబు:
ఒక ఆలుగడ్డ ముక్కను తీసుకున్నాను. LED, బ్యాటరీ, రాగి తీగలతో ఒక టెస్టర్ తయారుచేసి రెండు రాగి తీగలను ఆలుగడ్డలో 1 సెం.మీ. దూరంలో గుచ్చాను. ఈ అమరికను 20 నుండి 30 నిమిషాలు ఉంచాను.

బ్యాటరీ ధనధ్రువం నుండి వచ్చిన రాగి తీగ ఆలుగడ్డను గుచ్చుకున్న ప్రదేశంలో నీలం – ఆకుపచ్చ రంగు మచ్చ ఏర్పడింది. ఇలాంటి మచ్చ బ్యాటరీ ఋణ ధ్రువం నుండి వచ్చిన రాగి తీగ గుచ్చిన చోట రాలేదు. ఇది ఆలుగడ్డలో జరిగిన రసాయన మార్పు వల్ల ఏర్పడినది.

ఈ కృత్యం వల్ల ఆలుగడ్డను ఉపయోగించి బ్యాటరీ యొక్క ధన ధ్రువమును తెలుసుకొనవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

కృత్యం – 5 విద్యుత్ ఘటాన్ని (Electrolytic cell) తయారు చేద్దాం :

ప్రశ్న 5.
సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ఒక విద్యుత్ ఘటాన్ని (Electrolytic cell) తయారుచేయండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
LED బల్బు, రాగి తీగలు, రెండు ఇంజక్షన్ సీసాలు, రెండు కాపర్ కడ్డీలు, రెండు జింక్ కడ్డీలు, ఇంజక్షన్ సీసాల రబ్బరు మూతలు.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 8

విధానము :
ఒక్కొక్క ఇంజక్షన్ బాటిల్ రబ్బరు మూతకు ఒక రాగి తీగ ముక్క, ఒక జింక్ తీగ ముక్క చొప్పున గుచ్చండి. రాగి, జింక్ ముక్కలు ఒకదానికొకటి తాకకుండా జాగ్రత్త వహించండి. రెండు ఇంజక్షన్ సీసాలలోనూ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పోసి జాగ్రత్తగా రబ్బరు మూతలు పెట్టండి.

ఒక సీసాలోని రాగి తీగ ముక్క మరొక సీసాలోని జింక్ రేకు ముక్కకు కలిసే విధంగా, పటంలో చూపినట్లు వలయాన్ని కలపండి. ఒక LED సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం బల్బును తీసుకొని దాని రెండు ఎలక్ట్రోడ్లకు రెండు తీగలు కలపండి. ఇందులో ఒకదానిని మొదటి ఇంజక్షన్ సీసాలో విడిగా ఉన్న రాగి తీగకు, రెండవ దానిని సీసాలోని జింక్ ముక్కకు కలపండి. LED బల్బు వెలిగిందా? వెలగకపోతే కనెక్షన్స్ మార్చి చూడండి. ఇపుడు LED బల్బు వెలుగుతుంది. ఈ విధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో విద్యుత్ ఘటాన్ని తయారుచేయవచ్చును.