SCERT AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 8th Lesson Questions and Answers దహనం, ఇంధనాలు మరియు మంట
8th Class Physical Science 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
దహనశీలి పదార్థాలకు 4 ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
దహనశీలి పదార్థాలు : కొవ్వొత్తి, కాగితం, కిరోసిన్, కర్రలు, పెట్రోల్, స్పిరిట్ మొ||నవి.
ప్రశ్న 2.
దహనశీలికాని పదార్థాలకు 4 ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
దహనశీలికాని పదార్థాలు : రాయి, నీరు, లోహాలు, గాజు, సిరామిక్స్ మొ||నవి.
ప్రశ్న 3.
స్పిరిట్, పెట్రోల్ ను నివాస ప్రాంతాలకు దగ్గరలో ఎందుకు నిల్వ ఉంచకూడదు? (AS1)
జవాబు:
- స్పిరిట్, పెట్రోల్ లకు జ్వలన ఉష్ణోగ్రత విలువలు చాలా తక్కువగా ఉంటాయి.
- ఇవి త్వరగా మండే పదార్థాలు కావున శీఘ్ర దహనం జరిగి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.
- కాబట్టి స్పిరిట్, పెట్రోల్ లను నివాస ప్రాంతాలకు దగ్గరలో నిల్వ ఉంచకూడదు.
ప్రశ్న 4.
ఉత్తమ ఇంధనానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఎందుకు అది ఉత్తమమైనదని మీరు భావిస్తున్నారో వివరించండి. (AS1)
జవాబు:
L.P.G. వాయువు ఉత్తమ ఇంధనం.
L.P.G. వాయువు ఉత్తమ ఇంధనంగా భావించుటకు కారణాలు :
- L.P.G. వాయువుకు ఇంధన దక్షత ఎక్కువగా ఉండుట.
- L.P.G. వాయువు ధర అందుబాటులో ఉండుట.
- వాడుటకు సౌలభ్యంగా ఉండుట.
- సులభంగా నిల్వ చేయవచ్చును.
- త్వరగా వెలిగించవచ్చును మరియు ఆర్పవచ్చును.
- ఇంధనం నిరంతరాయంగా, నిలకడగా మండేదిగా ఉండుట.
- తక్కువ కాలుష్యం కలిగించేదిగా ఉండుట.
- కెలోరిఫిక్ విలువ అత్యధికంగా ఉండుట.
- L.P.G. ఇంధనాన్ని సులభంగా రవాణా చేయవచ్చును.
- జ్వలన ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండాలి.
ప్రశ్న 5.
మండే నూనెలపై నీటిని చల్లరాదు. ఎందుకు? (AS1)
జవాబు:
నూనె వంటి పదార్థాలు మండుతున్నపుడు వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. కారణం నీరు నూనె కంటే బరువైనది. కాబట్టి నీరు నూనె యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది. పైనున్న నూనె మండుతూనే ఉంటుంది.
ప్రశ్న 6.
మంటలను నీటితో ఆర్పేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? (AS1)
జవాబు:
మంటలను నీటితో ఆర్పేటప్పుడు మందుగా విద్యుత్ సరఫరాని నిలిపివెయ్యాలి. తరువాత నీటిని చల్లి మంటలను ఆర్పా లి.
ప్రశ్న 7.
గ్యాస్ బర్నర్లలో వత్తిని ఎందుకు వాడరు? (AS1)
జవాబు:
వాయు ఇంధనాలు మాత్రమే దహనం చేస్తే మండుతాయి. ఘన, ద్రవ స్థితులలోని ఇంధనాలు వాయు స్థితికి మారిస్తే మండుతాయి. ఘన, ద్రవ స్థితులలో ఉన్న ఇంధనాలు మండిస్తే, వత్తి ద్వారా పైకి చేరి వాయువుగా మారి దహనం చెందడం ద్వారా మండుతాయి. కానీ గ్యాస్ బర్నర్లందు వాయు ఇంధనాన్ని (గ్యాస్) ఉపయోగిస్తారు. కావున గ్యాస్ బర్నర్లందు వత్తిని వాడరు.
ప్రశ్న 8.
విద్యుత్ పరికరాలు అగ్ని ప్రమాదానికి గురైతే మంటలను ఆర్పడానికి నీరు వాడరు. ఎందుకు? (AS1)
జవాబు:
నీరు విద్యుత్ వాహకం. విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నప్పుడు, నీటితో మంటలు ఆర్పడానికి ప్రయత్నించే వారికి విద్యుత్ ప్రవాహం వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. కావున విద్యుత్ పరికరాల మంటలను నీటితో ఆర్పకూడదు.
ప్రశ్న 9.
దిగువ తెలిసిన రెండు వాక్యాలను బలపరుస్తూ మరికొన్ని అభిప్రాయాలు రాయండి. (AS2)
ఎ) మంట మానవాళికి ఎంతో ఉపయోగం
బి) మంట వినాశకారి
జవాబు:
ఎ) మంట వల్ల మానవాళికి ఉపయోగాలు :
- గృహ అవసరాలకు (వంటకు) ఉపయోగపడును.
- పరిశ్రమలలో ఇంధనాలుగా ఉపయోగపడతాయి.
- వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు.
- విద్యుచ్ఛక్తి తయారుచేయుటకు ఉపయోగిస్తారు.
బి) ‘మంట’ వినాశకారి :
- అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.
- అధికంగా ఇంధనాలను మండిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా ఉష్ణతాపం ఏర్పడుతుంది.
- అడవులలో అగ్ని ప్రమాదాలు జరిగితే అడవులన్నీ అంతరించడం వల్ల వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటుంది.
- పరిశ్రమలలో, వాహనాలలో ఇంధనాలు మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.
ప్రశ్న 10.
దహనచర్యకు ఆక్సిజన్ దోహదకారి కాకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. ఒకవేళ అదే నిజమైతే ఇంధనాలు ఇంకా ఏయే పనులకు పనికొస్తాయి? (AS2)
జవాబు:
- ఆక్సిజన్ మండుటకు ఉపయోగపడకపోతే దహనచర్య జరగదు.
- అంతేకాదు ఏ జీవరాశి భూమి మీద మనుగడ సాగించదు.
- ఇంధనాలు ఎన్ని ఉన్నప్పటికి వృథాయే.
ప్రశ్న 11.
మీరు చంద్రునిపై ఉన్నారనుకోండి. ఒక భూతద్దం. సహాయంతో సూర్యకాంతిని ఒక కాగితంపై కేంద్రీకరింపచేస్తే ఆ కాగితం మండుతుందా? లేదా? ఎందుకు? (AS2)
జవాబు:
- చంద్రునిపై ఒక భూతద్దం సహాయంతో సూర్యకాంతిని ఒక కాగితంపై కేంద్రీకరింపచేస్తే ఆ కాగితం మండదు.
- ఎందుకంటే చంద్రునిపై ఆక్సిజన్ లేదు కావున కాగితం మండదు.
ప్రశ్న 12.
కాగితపు పాత్రలో గల నీటిని వేడిచేయగలరా? అది ఎలా సాధ్యం? (AS3)
జవాబు:
ఒక కాగితపు పాత్రలో నీరు పోయండి. పక్క పటంలో చూపిన విధంగా త్రిపాదిపై కాగితపు పాత్రను ఉంచి కొవ్వొత్తితో వేడి చేయండి. కాగితపు పాత్రలోని నీరు వేడి ఎక్కుతుంది. ఎందుకంటే కొవ్వొత్తి ఇచ్చే ఉష్ణాన్ని కాగితపు పాత్ర నీటికి అందిస్తుంది. నీటి సమక్షంలో కాగితపు పాత్ర జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోదు. కాబట్టి కాగితపు పాత్ర మండకుండా, నీరు వేడెక్కుతుంది.
ప్రశ్న 13.
ఆక్సిజన్ లేకుండా దహన చర్య వీలవుతుందా? (AS3)
(లేదా)
పదార్థాలు మండుటకు ఆక్సిజన్ ఉపయోగపడుతుంది అని ఒక ప్రయోగము ద్వారా వివరించండి. (ప్రయోగశాల కృత్యం)
(లేదా)
మండడానికి ఆక్సిజన్ అవసరం – అని నిరూపించు కృత్యమును ఏ విధంగా నిర్వహిస్తావు? వివరించండి.
జవాబు:
ఉద్దేశం : ఆక్సిజన్ లేకుండా దహనచర్య వీలగునో లేదో నిరూపించుట.
కావలసిన పరికరాలు :
పరీక్షనాళిక, పట్టుకారు, సారాయి దీపం, అగ్గిపెట్టె, అగరుబత్తి, పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు (KMnO4),
నిర్వహణ పద్దతి :
ఒక అగరుబత్తి వెలిగించండి. దానిని 10 సెకన్లు వరకు మండనిచ్చి మంటను ఆర్పి ఒక ప్రక్కన ఉంచుకోండి. ఒక పరీక్షనాళికలో కొంత పొటాషియం పర్మాంగనేట్ స్పటికాలను తీసుకోండి. పట్టుకారు సహాయంతో పరీక్ష నాళికను పట్టుకొని సారాయి దీపంతో వేడిచేయండి.
పరిశీలన :
పొటాషియం పర్మాంగనేట్ ను వేడిచేస్తే ఆక్సిజన్ వాయువు వెలువడును. నిప్పు కలిగిన అగరుబత్తిని పరీక్ష నాళికలోనికి చొప్పించి పరిశీలిస్తే, నిప్పు కలిగిన అగరుబత్తి నుండి మంట రావడం గమనించవచ్చును. అంటే ఆక్సిజన్ దహనక్రియకు దోహదం చేయడం వలననే అగరువత్తికి మంట వచ్చి ప్రకాశవంతంగా మండుతుంది.
ఫలితము :
దీనిని బట్టి “ఆక్సిజన్ లేకుండా దహనచర్య వీలుకాదు” అని తెలుస్తుంది.
ప్రశ్న 14.
కింద ఇవ్వబడిన ఏ సందర్భంలో నీరు తక్కువ సమయంలో వేడెక్కుతుంది? ఊహించండి. చేసి చూసి సమాధానమివ్వండి. (AS3)
ఎ) శ్రీకర్ మంట యొక్క పసుపు ప్రాంతం (Yellow zone) కు దగ్గరగా నీరు గల బీకరు ఉంచి వేడి చేశాడు.
బి) సోను మంట యొక్క బయటి ప్రాంతం (Blue zone) లో నీరు గల బీకరు ఉంచి వేడిచేశాడు.
జవాబు:
మంట యొక్క బయటి ప్రాంతంలో నీరు గల బీకరు నుంచి వేడి చేసిన సోను బీకరు తక్కువ సమయంలో వేడి ఎక్కుతుంది.
ప్రశ్న 15.
మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళం వారు అవలంబించే వివిధ పద్ధతులను తెల్పండి. (AS4)
జవాబు:
మంటలను అదుపు చేయడానికి పాటించవలసిన నియమాలు :
- దహనశీల పదార్థాలను వేరు చేయుట (కానీ మండుచున్న దహనశీల పదార్థాలను వేరుచేయలేము).
- గాలిని (ఆక్సిజన్) తగలకుండా చేయుట.
- ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రతల కంటే తక్కువ అయ్యే విధంగా చేయుట.
పై నియమాల ఆధారంగా అగ్నిమాపక దళం వారు రెండు పద్ధతులలో మంటలను ఆర్పుతారు.
- నీటితో మంటలను అదుపుచేయుట.
- కార్బన్ డై ఆక్సైడ్ వాయువుతో మంటలను అదుపుచేయుట.
1. నీటితో మంటలు అదుపుచేయుట :
అగ్నిమాపక దళం వారు విద్యుత్ సరఫరా ఆపిన తరువాతనే మంటలు అదుపు చేయడం మొదలు పెడతారు. తరువాత నీటిని చల్లి మంటలను అదుపు చేస్తారు.
- మొదట నీరు దహనశీలి పదార్థాన్ని చల్లబరచి దాని ఉష్ణోగ్రతను ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ అయ్యే విధంగా చేస్తుంది. అందువల్ల మంటలు వ్యాపించకుండా నిరోధింపబడతాయి.
- అక్కడ ఉండే ఉష్ణోగ్రత వల్ల నీరు ఆవిరై దహనం చెందుతున్న పదార్థం చుట్టూ నీటి ఆవిరి చేరుతుంది. తద్వారా మండుతున్న పదార్థానికి గాలి, ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది.
2. కార్బన్ డై ఆక్సైడ్ (CO2) వాయువు ద్వారా :
సిలిండర్లలో ద్రవరూపంలో నిల్వ ఉంచిన CO2 వాయువును మంటపైకి వదిలినపుడు వ్యాకోచించిన మంట ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంతేగాక ఇది మంటను ఒక కంబళివలె కప్పివేసి మంటకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. తద్వారా మంటలు అదుపు చేయబడతాయి. నూనె, పెట్రోల్ మరియు విద్యుత్ పరికరాలకు సంబంధించిన మంటలను ఆర్పడానికి కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉత్తమమైనది.
ప్రశ్న 16.
వివిధ రకాల ఇంధనాల ధర (ఒక కిలోగ్రాము)లను సేకరించండి. వాటి కెలోరిఫిక్ విలువలను, ధరలను పోల్చండి. (AS4)
జవాబు:
ఇంధనం | ధర | కెలోరిఫిక్ విలువను (కిలో ఔల్ / కి.గ్రా.) |
1. పెట్రోలు | 1 లీటరు ₹ 74.17 | 45,000 |
2. డీజిల్ | 1 లీటరు ₹ 52.46 | 45,000 |
3. CNG | 1 కిలోగ్రాము ₹ 46 | 50,000 |
4. LPG | 1 కిలోగ్రాము ₹ 58 | 35,000 – 40,000 |
5. కర్ర | 1 కిలోగ్రాము ₹ 4 | 17,000 – 22,000 |
ప్రశ్న 17.
కొవ్వొత్తి మంట బొమ్మ గీసి, అందులోని వివిధ ప్రాంతాలను గుర్తించండి. (AS3)
(లేదా)
క్రొవ్వొత్తి మంట యొక్క ఆకృతిని తెలుపు పటం గీచి భాగాలను గుర్తించండి. మంట యొక్క ఏ ప్రాంతంలో అసంపూర్తి దహనం జరుగుతుంది.
(లేదా)
క్రొవ్వొత్తి మంటను చూపే పటం గీచి భాగాలు గుర్తించండి. మంటలోని చీకటి ప్రాంతంలో ఏం జరుగుతుంది.
జవాబు:
i) మంట యొక్క అతిబాహ్య ప్రాంతంలో అసంపూర్తి దహనం జరుగుతుంది.
ii) మంటలోని చీకటి ప్రాంతంలో ఇంధనం భాష్పంగా మారుతుంది.
ప్రశ్న 18.
స్వతస్సిద్ధ దహనం, శీఘ్ర దహనాలను నిత్యజీవితంలో ఎక్కడ గమనిస్తారు? (AS7)
జవాబు:
స్వతస్సిద్ధ దహనాలు :
- ఫాస్ఫరస్ గాలిలో స్వతసిద్ధ దహనం అవుతుంది.
- వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నపుడు ఎండుగడ్డి దానంతట అదే మండును.
- ఎండా కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు ఎండుటాకులు మండి తద్వారా అడవి అంతా మండును.
శీఘ్ర దహనాలు :
- అగ్గిపుల్లను, అగ్గిపెట్టె గరుకు తలంపై రుద్దినపుడు అగ్గిపుల్ల మండుట.
- లైటర్ తో గ్యాస్ స్టాప్ ను మండించుట.
- కర్పూరం, స్పిరిట్ మరియు పెట్రోలు వంటి పదార్థాలను గ్యాస్ లైటర్ తో మండించుట.
ప్రశ్న 19.
జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఇంధనాలతో మీ నిత్యజీవిత కార్యక్రమాలను సరైన రీతిలో ఎలా నిర్వర్తిస్తారు? (AS7)
జవాబు:
- శిలాజ ఇంధనాలను వాడుతున్నపుడు. వాటి నుండి కాలుష్య కారకాలైన పదార్థాలను ముందుగానే తొలగించవలెను.
- వాహనాలకు పెట్రోల్, డీజిలకు బదులుగా కాలుష్యరహిత CNG వాయువును వాడవలెను.
- శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలైన సౌరశక్తి, జలశక్తిలను వినియోగించాలి.
- వాతావరణ కాలుష్యం చేసే డీజిల్ కు బదులుగా బయో డీజిల్ వాడవలెను.
- వాహనాలు సౌరశక్తి లేదా విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాలను ఉపయోగించాలి.
- వాతావరణ కాలుష్యం తగ్గించుటకు అధిక సంఖ్యలో చెట్లను పెంచవలెను.
- వాతావరణ, జల, భూమి కాలుష్యం కాకుండా చూడాలి.
ప్రశ్న 20.
ఇంధనాలు మానవ జీవితంలో ఒక భాగమైపోవడం పట్ల నీ స్పందన ఏమి? (AS7)
జవాబు:
మానవ జీవితంలో జీవన అవసరాలను, కోరికలను తీర్చే సాధనాలలో అతి ముఖ్యమైనది ఇంధనం. ఇంధనాలు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలలో మరియు వివిధ వస్తువుల ఉత్పత్తులలో ఎంతగానో ఉపయోగిస్తారు. మానవ పురోగతి, దేశ అభివృద్ధి ఇంధనాలపై ఆధారపడి ఉన్నది. నిత్య జీవితంలో మానవ అవసరాలను తీర్చే ప్రతి వస్తువూ ఇంధనంపై ఆధారపడటం వలన ఇంధనాలు మానవ జీవితంలో ఒక భాగమైపోయాయనడం అతిశయోక్తి కాదు. కావున ఇంధనాలను పొదుపుగా వాడుకోవటమేగాక, శిలాజ ఇంధనాలు తరిగిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ – ఇంధనాలపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రశ్న 21.
ఎండుగడ్డి కంటే పచ్చగడ్డిని మండించడం కష్టం ఎందుకు? (AS1)
జవాబు:
ఎండుగడ్డి మండించినపుడు తక్కువ ఉష్ణం గ్రహించి మండుతుంది. పచ్చిగడ్డిని మండించడం చాలా కష్టం. ఎందుకంటే పచ్చిగడ్డికి అందించిన ఉష్ణం పచ్చిగడ్డిలోని నీటికి చేరవేయబడుతుంది కావున పచ్చిగడ్డికి ఇచ్చిన ఉష్ణం జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోలేకపోవడం వల్ల పచ్చిగడ్డి మండదు.
ప్రశ్న 22.
రాబోయే కొద్ది కాలంలో భూమిలోని అన్ని ఇంధనాలు అడుగంటిపోతున్నాయి. అప్పుడు మానవాళి జీవనం ఎలా ఉంటుందో ఊహించండి? (AS2)
జవాబు:
ప్రస్తుత మానవాళి భూమిలోని ఇంధనాలపై 90% ఆధారపడి ఉన్నది. ఈ ఇంధనాలు పూర్తిగా అడుగంటిపోతే మానవాళి జీవనం ఈ కింది విధంగా ఉంటుంది.
- రవాణా వ్యవస్థలేని జీవనం.
- విద్యుచ్ఛక్తి లేని జీవనం.
- పరిశ్రమలు పనిచేయవు. తద్వారా మానవ మనుగడకు ఉపయోగపడే వస్తువుల ఉత్పత్తి ఉండదు.
- ఆహార పదార్థాలను తయారుచేయలేము.
- వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనుటకు శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ శక్తివనరులను (సౌరశక్తి. జలశక్తి) అన్వేషించాలి.
ప్రశ్న 23.
ఇంధనాలు అతిగా వాడటంవల్ల కాలుష్యం పెరిగి మానవాళికేగాక భూమిపైనున్న సమస్త జీవజాలానికి నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు తగు సూచనలివ్వండి. (AS2)
జవాబు:
కాలుష్య నివారణ చర్యలు :
- ఇంధనాలను పొదుపుగా వాడాలి.
- వాయు కాలుష్య కారకాలైన పదార్థాలను ఇంధనాల నుండి తొలగించాలి.
ఉదా : ఇంధనాలలో సల్ఫర్‌ను తొలగించడం వలన SO<sub>2</sub> కాలుష్యాన్ని నిరోధించవచ్చును. - పెట్రోల్‌కు బదులు CNG వాయువును వాడవలెను.
- పరిశ్రమలలో వెలువడే వాయువులలో లోహ అయాన్లు, కాలుష్య కణాలను తొలగించడానికి బ్యాగు ఫిల్టర్లు, ఎలక్ట్రోస్టాటిక్ అవక్షేపాలను, సబ్బర్లను ఉపయోగించాలి.
- పరిశ్రమల ప్రాంతాలలో చెట్లను ఎక్కువగా పెంచాలి.
- శిలాజ ఇంధనాలకు బదులుగా సంప్రదాయేతర ఇంధనాలను వాడాలి.
ప్రశ్న 24.
జోసఫ్ ప్రిస్టీ నిర్వహించిన ప్రయోగాలు, కనుగొన్న అంశాల గురించి మీ పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలు లేదా అంతర్జాలం (Internet) ద్వారా తెలుసుకోండి. దహనచర్యకు ఆక్సిజన్ అవసరమని ప్రిస్టీ చేసిన ప్రాయోగిక నిరూపణపై రెండు పేజీల నివేదికను తయారుచేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. (AS3)
జవాబు:
జోసెఫ్ ప్రిస్టీ ప్రయోగాలలో ముఖ్యాంశాలు :
- అతడు పొటాషియం క్లోరేటును వేడి చేస్తే అధిక ఉష్ణోగ్రత వద్దగాని ఆక్సిజన్ వెలువడలేదు.
- తర్వాత అనేక మార్పులను, చేర్పులను చేసి చివరకు పొటాషియం క్లోరేటుతో, మాంగనీసు డై ఆక్సెడ్ ను మిశ్రమం చేసి 450°C వద్దనే ఆక్సిజన్ విడుదల కావడం గమనించాడు.
- ఇలాగే పొటాషియం నైట్రేటు, సోడియం నైట్రేటు వంటి సంయోగ పదార్థాలను వేడిచేసి వాటి నుండి ఆక్సిజన్ వెలువడటం గుర్తించాడు.
- ఒక మండుతున్న పుల్లను ఆక్సిజన్’ వెలువడుతున్నప్పుడే పరీక్ష నాళికలోనికి చొప్పించి, మంట కాంతివంతంగా వెలగటాన్ని గమనించాడు.
- అతని పరిశోధనల ఫలితంగానే ఆక్సిజన్ దహన దోహదకారి అనే ప్రధాన ధర్మం ఆవిష్కరింపబడింది.
ప్రశ్న 25.
ప్రపంచవ్యాప్తంగా వివిధ అవసరాలకు ఒక సంవత్సరంలో ఖర్చుచేసే ఇంధనాల వివరాలను సేకరించండి. మనకు అందుబాటులో ఉన్న ఇంధనాలు ఎంత కాలం సరిపోతాయో లెక్కించండి. ఈ వివరాలతో ఒక పోస్టరును తయారుచేసి ఇంధనాన్ని పొదుపు చేయవలసిన అవసరాన్ని తెలియపరచండి. (AS4)
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా వివిధ అవసరాలకు ఒక సంవత్సరంలో ఖర్చు చేసే ఇంధనాల వివరాలను చూపే పట్టిక
ఇంధనాన్ని పొదుపు చేయవలసిన అవసరం :
- ఇంధనాలను పొదుపు చేయకపోతే భావితరాలవారు అనేక ఇబ్బందులు పడతారు.
- తిరిగి ఆదిమ జాతి మానవుడి జీవితం పునరావృతమవుతుంది.
- ప్రయాణ సాధనాలు లేక, మానవులు తాము ఉన్న చోటు నుండి వేరొక చోటికి ప్రయాణాలు చేయటం అసాధ్యం.
- విదేశీయానం పూర్తిగా ఆగిపోతుంది.
- ఒకే ప్రదేశానికి కట్టుబడి ఉండటం వలన మానవులలో ప్రపంచ విజ్ఞానం గురించిన అవగాహన తగ్గిపోతుంది.
పరికరాల జాబితా
కాగితం, బొగ్గు, మెగ్నీషియం రిబ్బన్, స్ట్రా, నూలు గుడ్డ, నైలాన్ గుడ్డ, ఎండుకర్ర, రాయి, మైనం, ప్లాస్టిక్ ముక్క, కొబ్బరి నూనె, ఆవనూనె, కిరోసిన్, స్పిరిట్, పెట్రోలు, కొవ్వొత్తి, అగ్గిపెట్టె, అగరుబత్తి, కాగితపు కళ్లు, నేలబొగ్గు, కర్ర బొగ్గు, మెగ్నీషియం, కర్ర, పిడకలు, కర్పూరం, నూనెదీపం, వలీ, కిరోసిన్ స్టా వత్తి, పట్టుకారు, లోహపు గిన్నెలు ,లేదా పింగాణీ గిన్నెలు, సారాయి దీపం, గాజు గ్లాసు, పరీక్ష నాళిక, భూతద్ధం, త్రిపాది, గాజు గొట్టం, స్లెడ్, రాగితీగ.
8th Class Physical Science 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 111
ప్రశ్న 1.
కొన్ని పదార్థాలు మండడానికి, మరికొన్ని పదార్థాలు మండకపోవడానికి కారణం రాయండి.
జవాబు:
I. కొన్ని పదార్థాలు మండడానికి కారణాలు :
- పదార్థం దహనశీల పదార్థం కావడం.
- మండుతున్న పదార్థానికి గాలి (ఆక్సిజన్) సరఫరా కావడం.
- పదార్ధ జ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండటం.
II. కొన్ని పదార్థాలు మండక పోవడానికి కారణాలు :
- పదార్థాలు దహనశీల పదార్థాలు కాకపోవడం.
- మండుతున్న పదార్థాలకు గాలి (ఆక్సిజన్) సరిగా అందకపోవడం.
- పదార్థాల జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణం దగ్గర ఉండటం.
ప్రశ్న 2.
సాధారణ ఉష్ణోగ్రత వద్ద మండని కొన్ని పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఎందుకు మండుతాయి?
జవాబు:
జ్వలన ఉష్ణోగ్రత అధికంగా గల పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద మండుతాయి.
8th Class Physical Science Textbook Page No. 112
ప్రశ్న 3.
మండుతున్న కొవ్వొత్తిపై బోర్లించిన గ్లాసును బల్ల ఉపరితలం నుండి 1 సెం.మీ. ఎత్తు వరకు ఎత్తితే ఏం జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
మండుతున్న కొవ్వొత్తి పై బోర్లించిన గ్లాసును బల్ల ఉపరితలం నుండి 1 సెం.మీ. ఎత్తు వరకు ఎత్తి ఉంచిన మండుతున్న కొవ్వొత్తి ఆరిపోవును. ఎందుకంటే కొవ్వొత్తి నుండి విడుదలైన వేడిగా ఉండే కార్బన్ డై ఆక్సైడ్ (CO2), నీటి ఆవిరి గ్లాసులో ఆక్రమించి, మంటకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. కావున మంట ఆరిపోతుంది.
8th Class Physical Science Textbook Page No. 113
ప్రశ్న 4.
వాయుపాత్రలోగల వాయువు ఆక్సిజనే అని మీరెలా చెప్పగలరు?
జవాబు:
మండుతున్న పుల్లను లేదా నిప్పుగల అగరుబత్తిని వాయుపాత్రలో ఉంచినట్లు అయితే అది కాంతివంతంగా మండుతుంది. దీనిని బట్టి వాయుపాత్రలో ఉన్నది ఆక్సిజన్ వాయువు అని నిర్ధారించవచ్చును.
ప్రశ్న 5.
ఆక్సిజన్ విడుదల చేయడానికి పొటాషియం పర్మాంగనేట్ కు బదులుగా వేరే ఏ పదార్థాన్నైనా వాడవచ్చా?
జవాబు:
పొటాషియం పర్మాంగనేట్ కు బదులుగా పొటాషియం రేట్ (KClO3) లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2) లేదా పొటాషియం నైటీ (KNO3) లేదా మెర్యురిక్ ఆక్సెడ్ (HgO) లను వాడవచ్చును.
ప్రశ్న 6.
దహనానికి ఆక్సిజన్ దోహదపడుతుందని నిరూపించడానికి మరొక పద్ధతి ఏదైనా ఉందా?
జవాబు:
మండుతున్న పదార్థంపై ఇసుకపోసిన లేదా నీరు పోసిన ఆరిపోతుంది. కారణం మండుతున్న పదార్థానికి ఆక్సిజన్ అందకపోవుట వలన ఆరిపోతుంది. కాబట్టి దహనానికి ఆక్సిజన్ దోహదపడుతుంది.
8th Class Physical Science Textbook Page No. 115
ప్రశ్న 7.
ఫాస్ఫరస్ ను మనం ఎందుకు నీటిలో నిల్వ ఉంచుతాము?
జవాబు:
ఫాస్ఫరసకు జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద స్వతసిద్ధ దహనం జరుగుతుంది. కావున ఫాస్ఫరస ను నీటిలో నిల్వ చేస్తారు.
ప్రశ్న 8.
కిరోసిన్ పౌలకు, మీ ప్రయోగశాలలోని బున్ సెన్ బర్నర్ లకు చిన్న రంధ్రాలు ఉంటాయి. ఎందుకు?
జవాబు:
దహన చర్యకు ఆక్సిజన్ అవసరం. కావున చిన్న రంధ్రాల గుండా గాలి (ఆక్సిజన్) వెళ్ళుటకు కిరోసిన్ స్టాలకు, బున్ సెన్ బర్నర్లకు చిన్న రంధ్రాలు ఉంటాయి.
ప్రశ్న 9.
వర్షాకాలంలో అగ్గిపుల్లను వెలిగించడం కష్టం ఎందుకు?
జవాబు:
అగ్గిపుల్లను గరకుతలంపై రుద్దినప్పుడు ఎర్రఫాస్ఫరస్, తెలుపు ఫాస్ఫరస్ గా మారి వెంటనే అగ్గిపుల్లపై పొటాషియం క్లోరేటుతో చర్యనొందడం వలన ఉద్భవించిన ఉష్ణం ఆంటిమోని సల్ఫైడ్ ను మండించటం వలన అగ్గిపుల్ల మండుతుంది. కానీ వర్షాకాలంలో గది ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. పొటాషియం క్లోరేట్ విడుదల చేసిన ఉష్ణం, ఆంటిమోని సల్ఫైడ్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండుట వలన అగ్గిపుల్లను వెలిగించడం కష్టం.
8th Class Physical Science Textbook Page No. 118
ప్రశ్న 10.
కొవ్వొత్తి మంట పసుపు రంగులో ఉంటుంది. వంటగ్యాస్ మంట నీలిరంగులో ఉంటుంది. ఎందువలన?
జవాబు:
ఏదైనా దహనశీల వాయు పదార్థం తగినంత ఆక్సిజన్ లో దహనమైనపుడు నీలిరంగు మంటలో మండుతుంది. కొవ్వొత్తి మంటలోని లోపలి ప్రాంతంలో ద్రవ మైనం బాష్పంగా మారుతుంది. మధ్య ప్రాంతంలో బాష్ప మైనం దహనమగుటకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొవ్వొత్తి పసుపు రంగులో మండును.
గ్యాస్ బర్న లందు సన్నని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా వంటగ్యాస్ వచ్చినపుడు తగినంత ఆక్సిజన్ అందడం వల్ల వంటగ్యాస్ దహనమై నీలి రంగులో మండును.
8th Class Physical Science Textbook Page No. 111
ప్రశ్న 11.
నీటిని మండించే ప్రయత్నం :
ఒక పళ్ళెంలో 2 మి.లీ. నీటిని తీసుకోవలెను. ప్రక్కపటంలో చూపినట్లు మండుచున్న అగ్గిపుల్లను నీటి వద్దకు తీసుకువెళ్ళవలెను.
ఎ) నీటిని మండించడానికి చేసిన ప్రయత్నంలో మనమేం గమనించగలం?
జవాబు:
నీటిని మండించడానికి చేసిన ప్రయత్నంలో పుల్లకు ఉన్న మంటయే ఆరిపోయింది.
బి) పుల్లకు ఉన్న మంటలో ఏమైనా తేడా ఉందా?
జవాబు:
పుల్లకు ఉన్న మంట కూడా పూర్తిగా ఆరిపోయింది.
సి) మండుచున్న పుల్లను పళ్ళెంలో గల నీటి దగ్గరకు తెస్తే ఏం జరిగింది?
జవాబు:
మంట యొక్క కాంతి తగ్గింది.
8th Class Physical Science Textbook Page No. 113
ప్రశ్న 12.
నిప్పుల పైకి గాలి ఊదితే మంట ఏర్పడుతుంది. కాని వెలుగుతున్న క్రొవ్వొత్తి పైకి గాలిని ఊదితే దాని మంట ఆరిపోతుంది. ఎందుకు?
జవాబు:
నిప్పుల పై భాగంలో అప్పటికే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు కప్పి ఉంటుంది. మనం గాలి ఊదితే ఆ వాయువు తొలగింపబడి దాని స్థానంలో ఏర్పడిన ఖాళీలోకి చుట్టూ ఉన్న గాలి వచ్చి చేరడంతో, ఆ గాలిలోని ఆక్సిజన్ మంటను ఏర్పరచింది. కాని అప్పటికే వెలుగుతున్న క్రొవ్వొత్తి పైకి గాలిని ఊదితే, మనం బయటకు వదిలే గాలిలో కార్బన్ డయాక్సెడ్ అధికంగా ఉంటుంది కనుకనూ, మరియూ ఈ వాయువుకు మంటలను ఆర్పివేసే ధర్మం ఉండటంవల్లనూ మంట ఆరిపోతుంది.
ప్రశ్న 13.
ఎక్కువ మొత్తంలో ఎండుగడ్డి మండుతుంటే దానిని ఆర్పడం కష్టం. ఎందుకు?
జవాబు:
ఎక్కువ మొత్తంలో ఎండుగడ్డి మండుతుంటే, ఆ ప్రదేశంలో ఏర్పడిన శూన్య ప్రదేశంలోకి పరిసరాలలోని గాలి వేగంగా దూసుకువస్తుంది. అందులోని ఆక్సిజన్ ప్రభావం వల్ల మంట పెద్దదవుతుంది కనుక ఆర్పడం కష్టం.
ప్రశ్న 14.
ఏదైనా వస్తువు మండుతున్నప్పుడు దానిపై ఇసుక పోసి లేదా కంబళి కప్పి మంటను ఆర్పుతారు. ఎందుకు?
జవాబు:
మంటపై ఇసుక పోసినా లేదా కంబళి కప్పినా మంటకు గాలి తగలదు. అందువల్ల ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది.
8th Class Physical Science Textbook Page No. 116
ప్రశ్న 15.
అగ్నిమాపక దళం వారు విద్యుత్ సరఫరా ఆపిన తర్వాతనే మంటలను అదుపుచేయడం మొదలు పెట్టడానికి కారణమేమి?
జవాబు:
అగ్నిమాపకదళంవారు ఉపయోగించే నీరు స్వేదన జలం కాదు. నీరు విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. కాబట్టి మంటలను ఆర్పడానికి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.
8th Class Physical Science 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook Activities
కృత్యం – 1
ప్రశ్న 1.
అన్ని పదార్థాలు మండుతాయా?
జవాబు:
బొగ్గు, మెగ్నీషియం రిబ్బన్, స్ట్రా, నూలుగుడ్డ, నైలాన్ గుడ్డ, ఎండు కర్ర, రాయి, మైనం, ప్లాస్టిక్ ముక్క మొదలగు పదార్థాలను ఒక్కొక్కటిగా మంటపై ఉంచి వాటిలో వచ్చే మార్పులను ఈ కింది పట్టికలో (✓) నమోదు చేయండి.
కృత్యం – 2
ప్రశ్న 2.
పదార్థాలు మండుటకు గాలి ఆవశ్యకతను పరీక్షించుట.
జవాబు:
ఒక కొవ్వొత్తిని వెలిగించి బల్లపై పెట్టండి. దానిపై ఒక గాజు గ్లాసును బోర్లించండి. కొవ్వొత్తి కొద్దిసేపు మండి తర్వాత దాని మంట రెపరెపలాడుతూ చివరికి ఆరిపోతుంది.
గాజు గ్లాసును తీసి కొవ్వొత్తిని మరొకసారి వెలిగించండి. దానిపై మరల గాజు గ్లాసును బోర్లించండి. కొవ్వొత్తి మంట రెపరెప లాడుతూ ఆరిపోతుందనిపించినపుడు గ్లాసును తొలగించండి. గ్లాసు బోర్లించడం వలన గాలి అందక కొవ్వొత్తి ఆరిపోయిందని మనకు తెలుస్తుంది.
కృత్యం – 3
ప్రశ్న 3.
సూర్యుని కిరణాలతో కాగితాన్ని మండించుట.
జవాబు:
ఎండ బాగా ఉన్న రోజున ఆరు బయట భూతద్దం (కుంభాకార కటకం) సహాయంతో సూర్యుని కిరణాలు కాగితంపై కేంద్రీకరించండి. కొంత సమయం తర్వాత సూర్యకిరణాలు కాగితంపై కేంద్రీకరింపబడిన చోట మంటమండును. దీనిని బట్టి “సూర్యుని కిరణాలతో కాగితాన్ని మండించవచ్చును” అని తెలుసు కోవచ్చును.
కృత్యం – 4
ప్రశ్న 4.
జ్వలన ఉష్ణోగ్రతను అవగాహన చేసుకొనుటకు ఒక ప్రయోగాన్ని చేయండి.
జవాబు:
రెండు కాగితపు కప్పులలో రెండవ కప్పులో నీరు పోయండి. ఈ రెండు కప్పులను రెండు వేరువేరు త్రిపాదులపై ఉంచి ఒకే పరిమాణం గల కొవ్వొతులతో వేడి చేయండి. మొదటి కప్పు మండుతుంది. రెండవ కప్పు మండలేదు. రెండవ కప్పునకు అందించిన ఉష్ణం నీటికి చేరవేయబడినది. కావున నీటి సమక్షంలో రెండవ కప్పు జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోలేక పోవుట చేత మండలేదు.
కృత్యం – 5
ప్రశ్న 5.
ఈ కింది పట్టికలోని ఘన పదార్థాలను సేకరించి, ఒకే సారాయి దీపం మంటపై ఉంచి ఒకదాని తర్వాత ఒకటి మండిస్తూ అవి మంటను అందుకోవడానికి ఎంత సమయం పడుతుందో నమోదుచేయండి.
జవాబు:
పదార్థం | మంటను ఏర్పరచింది | మంటను ఏర్పరచలేదు |
కొవ్వొత్తి | ✓ | |
మెగ్నీషియం | ✓ | |
పిడక | ✓ | |
కర్రబొగ్గు | ✓ | |
వంటగ్యాస్ | ✓ | |
కర్పూరం | ✓ | |
కిరోసిన్ స్టా వత్తి | ✓ |
కృత్యం – 6
ప్రశ్న 6.
ఒక కొవ్వొత్తిని వెలిగించి దాని మంటలోని వివిధ రంగుల ప్రాంతాలను నిశితంగా గమనించండి. మంటలో ఎన్ని రంగులున్నాయి?
జవాబు:
- మంట లోపల మధ్య భాగంలో నల్లని ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఇంధనం బాష్పంగా మారుతుంది.
- మంట కింది భాగంలో బాష్పంగా మారిన మైనం ఆక్సిజన్ తో చర్య జరిపి నీలిరంగులో మండుతుంది.
కృత్యం – 7
7. కొవ్వొత్తి మంటలోని వివిధ ప్రాంతాలలో ఏం జరుగుతుందో పరిశీలించి ఈ కింద నమోదు చేయండి.
జవాబు:
1) ఒక కొవ్వొత్తిని వెలిగించండి. ఒక గాజు గొట్టాన్ని పట్టుకారుతో పట్టుకొని మంట యొక్క నల్లని ప్రాంతం వరకు తీసుకెళ్లండి. గాజు గొట్టం రెండవ చివర మండుతున్న అగ్గిపుల్లను ఉంచండి, అగ్గిపుల్ల మండుతూనే ఉంటుంది. ఎందుకో గమనించండి.
వేడిగా ఉన్న ఒత్తి దగ్గరలోని మైనం త్వరగా ద్రవస్థితిలోకి రావడం వల్ల, నల్లని ప్రాంతంలో వాయువుగా మారి గాజు గొట్టం రెండవ చివర మండును.
2) కొవ్వొత్తి మంట నిలకడగా ఉన్నపుడు. పసుపు మంట ప్రాంతం (Yellow zone) లో ఒక శుభ్రమైన సైడ్ ను 10 సెకన్ల సేపు ఉంచి, ఏం జరిగిందో గమనించండి. స్లెడ్ పై నలుపు రంగు వలయం ఏర్పడినది. మంట యొక్క Yellow zone ప్రాంతంలో కూడా ఇంకా కొంత మండని కార్బన్ కణాలు ఉన్నాయని అర్థమౌతుంది. ఈ ప్రాంతంలో దహనచర్య పూర్తిగా జరగలేదు.
3) ఒక పొడవాటి రాగి తీగను కొవ్వొత్తి మంటలో చివరి ఉపరితలంపై (మంట వెలుపల) ఒక అరనిమిషం సేపు పట్టుకోండి. ఏం గమనించారు? రాగి తీగ బాగా వేడెక్కడం గమనించవచ్చును. అనగా మంట వెలుపలి ఉపరితల భాగం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇది నీలి రంగులో మండును. కారణం ఈ ప్రాంతంలో గాలిలో ఆక్సిజన్ బాగా అందడం వలన దహనచర్య సంపూర్ణంగా జరుగుతుంది.