SCERT AP 8th Class Social Study Material Pdf 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919
8th Class Social Studies 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ. భారత జాతీయ కాంగ్రెస్ తొలిరోజుల్లో బొంబాయి ప్రజలు మాత్రమే పాల్గొనేవారు.
ఆ. దేశంలో వివిధ ప్రాంతాలలో భారత పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పసాగారు.
ఇ. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత భారతదేశం ప్రజాస్వామిక దేశంగా మారుతుందని ఇక్కడి ప్రజలు ఆశించారు.
జవాబు:
అ. భారత జాతీయ కాంగ్రెస్ తొలిరోజుల్లో వివిధ రాష్ట్రాల మేధావులు పాల్గొనేవారు. ఆ
ఆ. స్వదేశీ ఉద్యమం వల్ల దేశంలో భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభించింది.
ఇ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంలో సంస్కరణలు అమలు అవుతాయని ఇక్కడి ప్రజలు ఆశించారు.
ప్రశ్న 2.
భారత జాతీయ కాంగ్రెస్ మితవాద, అతివాద నాయకుల మధ్య అ) ప్రధాన కోరికలు ఆ) ప్రజల సమీకరణాల దృష్ట్యా జరిగే సంభాషణ ఊహించి రాయండి.
జవాబు:
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం – లక్నో
మితవాదులు : ఇంపీరియల్ విధానసభలో మనవారికి మరికొంతమందికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుదాం.
అతివాదులు : అవకాశం అనేది మనది వారివ్వటమేమిటి, మనం పుచ్చుకోవడమేమిటి అసలు వారిని మనదేశం నుండి తరిమికొట్టాలి.
మితవాదులు : దానిని ఒప్పుకుందాం ! కాని వారు వదిలిపోయేదాకా మనం కాలం గడపాలిగా ! మన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనవారు అధికారంలో ఉండాలి. అందుకే దీనికి అనువుగా సివిల్ సర్వీసెస్ మన దేశంలోనే నిర్వహించాలని కోరుతున్నాం.
అతివాదులు : కోరికలు, విన్నపాలు, అర్జీలు, ఆందోళనలతో మనకు స్వాతంత్ర్యం రాదు. వీటివల్ల మనకు ప్రజల మద్దతు కూడా ఉండదు. మనమందరం కలుద్దాం. ఐక్యపోరాటం చేద్దాం. సమస్యను ప్రజల్లోకి తీసుకువెళదాం. వాళ్ళ మద్దతు కూడగడదాం ! బ్రిటిషువారిని తరిమికొడతాం.
మితవాదులు : సరే ! మా పంథాను, మీ పంథాను కలిపి ప్రజల పంథాగా మారుద్దాం ! వారితో చేతులు కలిపి స్వాతంత్ర్యాన్ని సాధిద్దాం !
అందరూ : “వందేమాతరం, వందేమాతరం”
ప్రశ్న 3.
ఈ అధ్యాయం చదివిన తరవాత జాతీయోద్యమం తొలిదశలో ఎక్కువగా చదువుకున్న భారతీయులు పాల్గొన్నారని మరియమ్మ అభిప్రాయపడింది. వాళ్ల భావాలు చాలావరకు పాశ్చాత్య ప్రభావం వల్ల ఏర్పడ్డాయి అని కూడా అనుకుంటోంది. ఆమెతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
మరియమ్మతో నేను ఏకీభవిస్తాను.
కారణాలు :
- పెద్ద నగరాలలో ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకుంది
- వీరు పాత సామాజికవ్యవస్థలోని అన్యాయాలను, అసమానతలను ఎత్తి చూపారు.
- చదువుకున్న భారతీయులు బ్రిటిషు పాలన స్వభావాన్ని, భారతదేశం మీద దాని ప్రభావాన్ని అర్థం చేసుకుని, బ్రిటిషు విధానాలను తీవ్రంగా విమర్శించారు.
- వీరి విమర్శలు, ఉపన్యాసాలు విన్న తరువాతే సామాన్య ప్రజానీకం జాతీయోద్యమంలో అడుగిడింది.
ప్రశ్న 4.
భారతదేశంపై బ్రిటిషు పాలన ఆర్థిక ప్రభావాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? (AS1)
జవాబు:
భారతదేశంలో బ్రిటిషు పాలన ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోకపోతే వనరుల తరలింపు ఎలా జరుగుతోందో అర్థం కాదు. మన చేతివృత్తులు ఎందుకు క్షీణిస్తున్నాయో తెలియదు. పేదరికానికి కారణాలు కానరావు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.
ప్రశ్న 5.
‘స్వదేశీ’ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? దానివల్ల ప్రభావితమైన ముఖ్యమైన రంగాలు ఏమిటి? (AS1)
జవాబు:
‘స్వదేశీ’ అంటే ‘మనదేశంలో తయారయినవి లేదా మనదేశంలోనివి’ అని నేను అర్థం చేసుకున్నాను.
ఇది ప్రభావితం చేసిన ముఖ్యమైన రంగాలు :
- రాజకీయ రంగం
- సామాజికరంగం
- వ్యాపార రంగం (జాతీయ)
- పారిశ్రామికరంగం
- విదేశీ వ్యాపార రంగం
- ఆధ్యాత్మికరంగం
- విద్యారంగం
- సాంస్కృతికరంగం
- న్యాయరంగం
ప్రశ్న 6.
బెంగాల్ విభజనకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఎలా స్పందించారు? (AS1)
జవాబు:
1903లో కర్ణన్ బెంగాల్ ను తూర్పు, పశ్చిమబెంగాల్ గా విభజించాలని చేసిన ప్రతిపాదన జాతీయ భావాలను పెద్ద ఎత్తున రగిల్చింది. బెంగాలీ ప్రజలను విడదీసి, జాతీయోద్యమాన్ని బలహీనపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రగా జాతీయవాదులు బెంగాల్ విభజనను నిరసించారు. కాని ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా 1905లో బెంగాల్ ను విభజించింది. దానికి నిరసనగా అనేక సమావేశాలు జరిగాయి. ఉప్పు, విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపుతో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. దేశమంతటా ప్రధాన పట్టణాలు, నగరాలలో, బెంగాల్ మారుమూల ప్రాంతాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, దహనం, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల పికెటింగ్ వంటివి సర్వసాధారణమైపోయాయి. విదేశీ గాజులు వేసుకోటానికీ, విదేశీ వంట పాత్రలను ఉపయోగించటానికి మహిళలు నిరాకరించారు. విదేశీయుల బట్టలను ఉతకటానికి బట్టలు ఉతికే వాళ్లు నిరాకరించారు. విదేశీ పంచదార ఉన్న నైవేద్యాన్ని తీసుకోటానికి పూజారులు కూడా నిరాకరించారు. ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు వంటి వాటిని బహిష్కరించమని కూడా పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. తమ తగాదాలను పరిష్కరించుకోటానికి సమాంతర న్యాయ స్థానాలను ఏర్పాటుచేశారు. ప్రజలు బెంగాలు విభజనకు ఈ విధంగా స్పందించారు.
ప్రశ్న 7.
భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
1. కలకత్తా (కోల్ కతా)
2. మద్రాసు (చెన్నై)
3. బొంబాయి (ముంబయి)
4. లక్నో
జవాబు:
ప్రశ్న 8.
ప్రపంచ పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
1) బ్రిటన్ 2) ఫ్రాన్స్ 3) రష్యా 4) జర్మనీ
ప్రశ్న 9.
మన దేశం కోసం తిలక్, భగత్ సింగ్, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు జీవితాలను త్యాగం చేశారు. వారు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేయకుండా ఉన్నట్లయితే ఏమి జరిగేది? (AS6)
జవాబు:
వీరి త్యాగమే లేకపోతే మనం ఇంకా బ్రిటిషు పాలనలో నరకయాతనలు పడుతూ, బానిస జీవితం గడుపుతూ ఉండేవాళ్లము.
ప్రశ్న 10.
ఈ మధ్యకాలంలో మీ ప్రాంతంలో ఏవైనా ఉద్యమాలు జరిగాయా? అవి ఎందుకు జరిగాయి? (AS4)
జవాబు:
ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని మా ప్రాంతీయులు ఉద్యమం చేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి, ప్రత్యేక యాసల పరిరక్షణ, వెనుకబాటుతనం నుండి బయటపడటం, సత్వర అభివృద్ధి, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమం సాగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ విభజన వద్దంటూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. అభివృద్ధి చెందిన హైదరాబాదును లక్ష్యంగా ఈ ఉద్యమం సాగింది.
8th Class Social Studies 11Ath Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 InText Questions and Answers
8th Class Social Textbook Page No.122
ప్రశ్న 1.
మీ ఊళ్లో లేదా పట్టణంలో (ఒక కులం లేదా ఒక మతానికి సంబంధించికాక) మొత్తం అందరి సమస్యల గురించి మాట్లాడే ఏదైనా సంఘం గురించి తెలుసా? వాళ్లు ఏం చర్చిస్తారు? ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ల సలహాలు ఏమిటి? కొన్ని ఉదాహరణలను మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
మా ఊళ్ళో అందరి సమస్యల గురించి మాట్లాడే సంఘం ఒకటుంది. అదే ‘మైత్రీ సంఘం’. దీనిలో అన్ని స్థాయిల నుండి, అన్ని రంగాల నుండి సభ్యులను నియమిస్తారు. వీరందరూ కలిసి గ్రామంలోని శాంతిభద్రతల వ్యవహారాలను పరిరక్షిస్తారు. ఏదైనా సమస్య వస్తే బాధితులతోను, దానికి కారణమైన వారితోనూ చర్చిస్తారు. పరిష్కారాలు సూచిస్తారు. దానిని వినక పోతే పోలీసు అధికారులకు తెలియచేస్తారు. పోలీసు వారినుండి తగిన న్యాయం, రక్షణ అందకపోతే వారిని కూడా ప్రశ్నిస్తారు. అందరికీ మేలు జరిగేలా చూస్తారు.
ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు చెప్పిన సలహా :
శత్రువు బలవంతుడు, మూర్ఖుడు అయినపుడు, వాడిని మంచి మాటలతో లొంగదీసుకుని మన మాట వినేలా చేయాలి. మనం బలం కూడగట్టుకుని, సమయం చూసి వాడిని బయటకు పంపాలి. అంతేకాని బలం తెలుసుకోక, సమయం కాని సమయంలో ఎదురు తిరిగితే మనమే వెనక్కి తగ్గాలి.
ఉదా :
తొలిరోజులలో కాంగ్రెస్ మేధావులకే పరిమితమైంది. రానురాను విద్యావంతులు, ప్రజలు దీనిలో చేరటంతో ఇది బలాన్ని పుంజుకుంది. రెండు ప్రపంచ యుద్ధాలతో బ్రిటిషు కొంచెం బలహీనమైంది. అదే సమయంలో మనం ఎక్కువ – ఎదురు తిరగటంతో స్వాతంత్ర్యం పొందాము. 1857లో బలంలేక, సరియైన సమయం కాక వెనుతిరిగాము.
8th Class Social Textbook Page No.124
ప్రశ్న 2.
భారతదేశంలో పేదరికం, కరవులకు బ్రిటిషు పాలకులు కారణమని తొలి జాతీయవాదులు ఎందుకు విశ్వసించారు? (Page No. 124)
జవాబు:
తొలి జాతీయవాదులు అందరూ విద్యావంతులు, మేధావులు. వారు బ్రిటిషు పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు, ఇతర మార్గాల ద్వారా బ్రిటిషు వాళ్ళు భారతదేశ సంపదను దోచుకుంటున్నారనీ, భారతదేశం నానాటికీ పేద దేశంగా మారుతోందని నిర్ధారించారు. దేశసంపదను బ్రిటన్‌కు తరలించారు. వారి వస్తువులను ఇక్కడ తక్కువ ధరలకు అమ్ముతూ స్వదేశీ పరిశ్రమలను కుంటుపరిచారు.
అధిక భూమిశిస్తు, ఆహారధాన్యాల ఎగుమతి వంటి బ్రిటిషు విధానాల వల్లనే కరువు, పేదరికం వంటి సమస్యలు ఎదురౌతున్నాయని అర్థం చేసుకున్నారు. అందువల్ల భారతదేశంలో పేదరికం, కరవులకు బ్రిటిషు పాలకులు కారణమని విశ్వసించారు.
ప్రశ్న 3.
భారతదేశపు పురాతన రాజుల పాలనను తిరిగి స్థాపించాలని తొలి జాతీయవాదులు ఎందుకు అనుకోలేదు? బ్రిటిషు పాలన కంటే అది మెరుగ్గా ఉండేది కాదా?
జవాబు:
అది కచ్చితంగా మెరుగ్గా ఉండదు. కారణాలు:
- జాతీయవాదులు భారత జాతిని ఐక్యజాతిగా భావించారు. పురాతన రాజులు చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు.
- బ్రిటిషు వారి పాలన పెనం లాంటిది, రాజుల పాలన పొయ్యి లాంటిది.
- రాజులు చాలామంది విదేశీయులే. స్వదేశీ పాలన వీరి లక్ష్యం.
8th Class Social Textbook Page No.126
ప్రశ్న 4.
విదేశీ బట్టలు తగులబెడుతున్న దాంట్లో పాల్గొంటున్న విద్యార్థిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆరోజు ఏమి జరిగి ఉంటుంది? అప్పుడు మీ ఉద్వేగాలు ఎలా ఉంటాయో వివరించండి.
జవాబు:
నా పేరు శరత్ చంద్ర ఛటర్జీ. కలకత్తాలోని కళాశాలలో బి.ఎ. మొదటి సంవత్సరం చదువుతున్నాను. బ్రిటిషు వారు మన దేశాన్ని ఆక్రమించి, ఇన్నేళ్ళు పాలించటమే కాక ఇప్పుడు దీన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ భారతీయులందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవించారు. ఇక ఊరుకునేది లేదని మేము వారికి చెప్పదలిచాము. నాతోటి విద్యార్థులు, మా ఇరుగుపొరుగు వారు ఈ రోజు ‘విదేశీ వస్తువుల, దహనకాండ’ను జరపాలని నిశ్చయించుకున్నాము. . సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. అప్పటి దాకా నిర్మానుష్యంగా ఉన్న మా వీధి కూడలి ఒక్కసారిగా జన కడలిగా మారింది. కూడలి మధ్యలో నిప్పు రాజేశాము. మా ఇళ్లల్లోని విదేశీ వస్త్రాలు, వస్తువులు ఒకటేమిటి అన్నీ తెచ్చి నిప్పుల్లో వేశాము. మంట ఆకాశాన్నంటింది. ‘వందేమాతరం’ నినాదం ‘ఓం’కారనాదంలా మ్రోగింది. మా కళ్ళమ్మట నీరు ఉప్పొంగి ఎగసింది. ఆ అగ్ని తన నాలుకలను నలుదిక్కులా చాచింది. ఆ కాంతి మా స్వాతంత్ర్యకాంక్షను ప్రపంచానికి తెలియచెప్పింది. ఆవేశంతో కూడిన మా ఆగ్రహం బ్రిటిషు వారి గుండెల్లో నగారాలు మోగించింది. మా ప్రాణాలు యిచ్చి అయినా సరే మా స్వరాజ్యాన్ని సాధిస్తామని ప్రమాణం చేశాము.
“వందేమాతరం”
“వందేమాతరం”.
ప్రశ్న 5.
ప్రజల న్యాయమైన కోరికలను అధికారులు ఒప్పుకోకపోతే ప్రజలు ఏం చేయాలి?
జవాబు:
కోరికలు న్యాయమైనవే కాక చట్టపరంగా కూడా అధికారులు చేయగలిగేలా ఉండాలి. అలాంటి కోరికలను అధికారులు ఒప్పుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వారిని ఎదిరించి పోరాడి సాధించాలి.
8th Class Social Textbook Page No.127
ప్రశ్న 6.
ఆ సమయంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఇతర దేశాలతో శాంతిని పునరుద్ధరించమని తమ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. అలా చేయడం సరైనదేనా? పెద్దఎతున ఉద్యమించారు. అలా చేయడం సరైనదేనా?
జవాబు:
సరైనదే. ఎందుకంటే, జర్మనీతో కాని, దాని మిత్రదేశాలతో కాని భారతదేశానికి ఎటువంటి వైరం లేదు. బ్రిటిషు వారినే మనం దేశం వదిలి పొమ్మంటుంటే, వారి కోసం ఇతరులతో యుద్ధం చేయడం హాస్యాస్పదం. కాబట్టి అలా చేయడం సరైనదే.
ప్రశ్న 7.
మొదటి ప్రపంచ యుద్ధం గురించి, సామాన్య ప్రజలపై దాని ప్రభావం గురించి మరింత తెలుసుకోండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం పెట్టుబడిదారులకు, కమ్యూనిస్టులకు మధ్య జరిగింది అని చెప్పవచ్చును. ఇది ఆరునెలలనుకున్నది. 5 ఏళ్ళు సాగింది. ప్రపంచంలోని ప్రజలందరూ దీనిలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ దాదాపు 1,00,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 65,00,000 మంది గాయపడ్డారు. 60,00,000 మంది కనబడకుండా పోయారు. లేదా యుద్ధ ఖైదీలయ్యారు. అందరికీ ఆహారం, ఆరోగ్యం కరువయ్యింది. ప్రపంచం మొత్తం అభద్రతా భావంతో అల్లల్లాడారు.
ప్రశ్న 8.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
మరుసటి సంవత్సరం (1905) కాంగ్రెస్ సమావేశంలో అతివాద జాతీయ నాయకులైన తిలక్, బిపిన్ చంద్రపాల్, లజ్ పత్ రాయ్ వంటి వాళ్లు, బెంగాల్ విభజన రద్దు చేయమనే కాకుండా సంపూర్ణ స్వాతంత్ర్యం, అంటే ‘స్వరాజ్యం’ కోరుతూ ఉద్యమాన్ని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని భావించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను’ అనే ప్రఖ్యాత నినాదాన్ని బాలగంగాధర్ తిలక్ ఇచ్చాడు. ఇంతకు ముందులాగా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వటం కాకుండా బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి దేశం విడిచి వెళ్లిపోయేలా చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంతకు ముందు చేపట్టిన విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల వాళ్లని ‘అతివాద జాతీయవాదులు’ అని పిలవసాగారు.
1. ఎవరేని ఇద్దరు అతివాదుల పేర్లు తెలపండి.
జవాబు:
తిలక్, బిపిన్ చంద్రపాల్.
2. స్వరాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం.
3. తిలక్ నినాదం ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను.
4. మితవాదుల విధానాన్ని వీరు ఎలా వర్ణించారు?
జవాబు:
వీరు మితవాదుల విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా వర్ణించారు.
5. మితవాదులు ఏం చేశారు?
జవాబు:
వారు బ్రిటిషు వారికి వినతిపత్రాలు సమర్పించారు.
ప్రశ్న 9.
కింది పేరాను చదివి ఒక అర్థవంతమైన ‘ప్రశ్న’ను రాయుము.
7వ తరగతిలో మీరు 1857 తిరుగుబాటు గురించి చదివారు. దీంట్లో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా సైనికులు, సాధారణ రైతులు, చేతివృత్తుల వాళ్లు, రాజులు సైతం చేతులు కలిపారు. ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనను వ్యతిరేకించింది కానీ దేశానికి ఒక కొత్త దార్శనికతను అది ఇవ్వలేకపోయింది. వాస్తవానికి అది పాతకాలపు రాజులు, రాణుల పాలనను, కుల ఆధారిత సమాజాన్ని కోరుకుంది.
జవాబు:
ప్రశ్న : 1857 విప్లవం ఎందుకు విఫలమయ్యింది?
ప్రశ్న 10.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.
మచిలీపట్నం నుండి కృష్ణా పత్రిక.
కృష్ణా పత్రికను 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. దాని స్థాపకులలో ముట్నూరు కృష్ణారావు ఒకరు. అతను 1902లో ఆ పత్రికకు ఉపసంపాదకుడిగా చేరాడు. 1907లో దాని సంపాదకుడై 1945లో అతడు చనిపోయే దాకా పత్రిక కోసం కృషి చేసాడు. వందేమాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసింది.
1. కృష్ణా పత్రికను ఎక్కడ స్థాపించారు?
జవాబు:
మచిలీపట్నంలో
2. కృష్ణా పత్రిక స్థాపకులెవరు?
జవాబు:
ముట్నూరు కృష్ణారావు.
3. ఉపసంపాదకుడిగా కృష్ణారావు ఎప్పుడు పనిచేశారు?
జవాబు:
1902
4. కృష్ణారావు ఎప్పుడు చనిపోయాడు?
జవాబు:
1945
5. స్వాతంత్ర్య ఉద్యమంలో కృష్ణా పత్రిక పాత్ర?
జవాబు:
క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రజా చైతన్యం.
ప్రశ్న 11.
‘స్వదేశీ’ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు?
జవాబు:
‘స్వదేశీ’ అంటే ‘మనదేశంలో తయారయినవి లేదా మనదేశంలోనివి’ అని నేను అర్థం చేసుకున్నాను.
ప్రశ్న 12.
స్వదేశీ వల్ల ప్రభావితమైన ముఖ్యమైన రంగాలు ఏమిటి?
జవాబు:
- రాజకీయ రంగం
- సామాజికరంగం
- వ్యాపారరంగం (జాతీయ)
- పారిశ్రామికరంగం
- విదేశీ వ్యాపారరంగం
- ఆధ్యాత్మికరంగం
- విద్యారంగం
- సాంస్కృతికరంగం
- న్యాయ రంగం
ప్రశ్న 13.
ఎవరేని ఇద్దరు అతివాదుల పేర్లు తెలపండి.
జవాబు:
తిలక్, బిపిన్ చంద్రపాల్.
ప్రశ్న 14.
స్వరాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం.
ప్రశ్న 15.
తిలక్ నినాదం ఏమిటి?
జవాబు:
స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరతాను.
ప్రశ్న 16.
మితవాదుల విధానాన్ని అతివాదులు ఎలా వర్ణించారు?
జవాబు:
అతివాదులు మితవాదుల విధానాన్ని ‘బిచ్చం అడుక్కోవటం’గా వర్ణించారు.
ప్రశ్న 17.
మితవాదులు ఇద్దరి పేర్లు రాయండి?
జవాబు:
గోపాలకృష్ణ గోఖలే, సుబ్రమణ్యం అయ్యంగార్.
ప్రశ్న 18.
హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు.
జవాబు:
తిలక్ మరియు అనిబి సెంట్.
ప్రాజెక్టు పని
ప్రశ్న 1.
భారత జాతీయోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకుల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారుచేయండి. దానిపై ఒక నివేదిక తయారు చేసి ప్రదర్శించండి.
జవాబు:
- భారతదేశంలో జాతీయోద్యమం ఒక చారిత్రాత్మక ఘటన.
- ఇది సమాజంలోని విభిన్న ప్రజలు, వర్గాలను ఒక్కతాటి కిందకు తెచ్చి బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా ఒక నూతన దేశ నిర్మాణానికి కృషి సలిపేలా చేసింది.
- 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో కొత్త చైతన్యానికి పునాదులు పడ్డాయి.
- చదువుకున్న భారతీయులు బ్రిటిషుపాలన స్వభావాన్ని అర్థం చేసుకుని బ్రిటిషువారి మీద పోరాడటానికి స్వాతంత్ర్యోద్యమంలో చేరడం జరిగింది.
- భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయ్ నౌరోజి, W.C. బెనర్జీ, ఫిరోజ్ షా మెహతాలాంటివారు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి, అన్ని కులాల, మతాల వారిని ఒక గొడుగు క్రిందకు తీసుకురావడానికి ఇది ప్రయత్నించాయి.