AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

SCERT AP 8th Class Social Study Material Pdf 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

8th Class Social Studies 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మొదటి ఎన్నికలు నిర్వహించటం ఎందుకు కష్టమయ్యింది? సాధ్యమైనన్ని కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఎన్నికలకు ఏర్పాట్లు చేయటం చాలా పెద్ద, సంక్లిష్టమైన పని. ముందుగా అర్హులైన ఓటర్లను నమోదు చేయటానికి ఇంటింటికి సర్వే చేశారు.

రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు, స్వతంత్రులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తులను ఓటు వేయాల్సిన బ్యాలెట్ పెట్టెల పై అతికించారు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ బ్యాలెట్ పెట్టెలో ఓటరు బ్యాలెట్ పేపర్ ను వేయాలి. ఈ ఓటింగు ప్రక్రియ రహస్యంగా ఉంచటానికి తెరలు ఏర్పాటు చేశారు.

దేశ వ్యాప్తంగా 2,24,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,00,000కు పైగా ఉక్కు బ్యాలెట్ పెట్టెలు చేశారు. సుమారు 62,00,00,000 బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఇంచుమించు 10 లక్షల అధికారులు ఎన్నికలు పర్యవేక్షించారు. దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతిమంగా మొదటి లోక్ సభకు 489 సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, చాలా క్రమశిక్షణతో నిర్వహించారు. హింసాత్మక ఘటనలు నామమాత్రంగా జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం సంక్లిష్టమైన పని అయింది.

ప్రశ్న 2.
ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎందుకుండాలి? (AS1)
జవాబు:
ఎన్నికలల్లో గెలిచిన వ్యక్తులు ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వారి ఎన్నికను ఏ ఆకర్షణీయమైన అంశాలు లేదా ఒత్తిళ్ళు ప్రభావితం చేయరాదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
క్రింది విషయాలలో వేటికి పార్లమెంటు చట్టాలు చేస్తుంది. వేటికి రాష్ట్ర శాసనసభలు చేస్తాయి. వీటికి రెండూ చేయవచ్చు: వ్యవసాయం, రైల్వేలు, గ్రామ ఆసుపత్రులు, పోలీసు, తంతి తపాలా, విద్యుత్తు, కర్మాగారాలు. (AS1)
జవాబు:

  1. వ్యవసాయం – రాష్ట్రం
  2. రైల్వేలు – కేంద్రం
  3. గ్రామ ఆసుపత్రులు – రాష్ట్రం
  4. పోలీసు – రాష్ట్రం
  5. తంతి తపాలా – కేంద్రం
  6. విద్యుత్తు – ఉమ్మడి జాబితా
  7. కర్మాగారాలు – ఉమ్మడి జాబితా

ప్రశ్న 4.
పార్లమెంటు రెండు సభలను పేర్కొనంది. కింది విషయాలలో రెండింటికీ మధ్య తేడాలు / పోలికలు చూపిస్తూ పట్టిక తయారు చేయండి. సభ్యత్వకాలం, సభ్యుల సంఖ్య, అధికారాలలో ఎక్కువ, తక్కువ, ఎన్నికయ్యే విధానం, రాష్ట్రపతికి ఎన్నికల్లో ఓటింగు. (AS3)
జవాబు:
పార్లమెంటులో లోకసభ, రాజ్యసభ అని రెండూ ఉంటాయి.

విషయాలు లోకసభ రాజ్య సభ
1) సభ్యత్వ కాలం 5 సం||లు 6 సం||లు
2) సభ్యుల సంఖ్య 545 250
3) అధికారంలో ఎక్కువ, తక్కువ ఎక్కువ తక్కువ
4) ఎన్నికయ్యే విధానం ప్రత్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక
5) రాష్ట్రపతికి ఎన్నికల్లో ఓటింగ్ ఎన్నికైన వారందరికీ ఉంటుంది ఎన్నికైన వారందరికీ ఉంటుంది.

ప్రశ్న 5.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు? మీ టీచరు సహాయంతో చర్చించి దాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో వారు భావస్వారూప్యం కలిగిన ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ గా ఏర్పడి ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ కలదు.

ప్రశ్న 6.
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత ఎవరిది? (AS1)
జవాబు:
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది.

ప్రశ్న 7.
కింద ఇచ్చిన పట్టికలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. మీ టీచరుతో చర్చించి ఖాళీలను పూరించండి. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 2

ప్రశ్న 8.
ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఇంకా ఎక్కువ మహిళా అభ్యర్థులను పోటీకి నిలిపేలా చేయాలా? ఎందుకు? (AS1)
జవాబు:
అవును. ఎక్కువ మహిళా అభ్యర్థులను పోటీకి నిలపాలి. ఎందుకంటే చట్ట సభలలో మహిళలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు, వేదింపులు, సమాజం చూస్తున్న వివక్షతను ఎదిరించేందుకు ఎక్కువ మహిళా అభ్యర్ధులను నిలపాలి.

ప్రశ్న 9.
భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల పార్లమెంటు సభలలో మహిళల ప్రాతినిధ్యంపై జరిగిన అధ్యయనం ఇది. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 3
పై సమాచారం ఆధారంగా దిగువ అంశాలను విశ్లేషిస్తూ ఒక వ్యాసం రాయండి.
ఎ. మన చట్ట సభలలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం ఉందా?
జవాబు:
లేదు.

బి. ప్రజాస్వామ్య భావనకు ప్రాతినిధ్య భావన ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
ప్రజాస్వామ్యమంటే ప్రజల పరిపాలన అని అర్థం. అందుకే దీనికి వారి ప్రాతినిధ్య భావన ముఖ్యమైనది. ప్రజలు అంటే ప్రత్యేకించి ఏ ఒక్కరూ కారు. అందరూ అని అర్ధం.

సి. మీరు పార్లమెంటు సభ్యులైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? కొన్ని దేశాలు పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఎలా సాధించగలిగాయి?
జవాబు:
నేనే పార్లమెంటు సభ్యురాల్నైతే మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దాని ద్వారా ఈ సమస్యను సాధిస్తాను. రాజకీయాలలో మహిళలను ప్రోత్సహించి అవకాశాలు కల్పించడమే దీనికి పరిష్కారం. కొన్ని దేశాలు పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఈ విధంగానే సాధించగలిగాయి అని నేను భావిస్తున్నాను.

8th Class Social Studies 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం InText Questions and Answers

8th Class Social Textbook Page No.161

ప్రశ్న 1.
పార్లమెంటు చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు, విధానాల గురించి తెలుసుకోండి. వాటి గురించి తరగతిలో వివరించండి. Page No. 161
జవాబు:
పార్లమెంటు చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు :

  1. వరకట్న నిషేధ చట్టం – 2 1961
  2. తీవ్రవాద కలాపాల నిరోధ చట్టం – 2002 (POTA) మొదలైనవి.

చట్టాలు చేసే విధానం :
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 6

8th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వంతో కూడుకున్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం వల్ల ప్రయోజనాలు ఏమిటి? Page No.162
జవాబు:
ప్రయోజనాలు : ఈ విధానంలో

  1. చట్టాలు చేయటం వేగవంతం మరియు తేలిక.
  2. అధికార విభజన జరుగుతుంది.
  3. ప్రధానమంత్రిని పదవి నుండి తప్పించే విధానం చాలా సులభతరం.
  4. జవాబుదారీతనం అధికంగా ఉంటుంది.

ప్రశ్న 3.
పార్లమెంటు చట్టాలు మాత్రం చేసి ప్రభుత్వాన్ని నియంత్రించకుండా ఉంటే సరిపోతుందా? తరగతిలో చర్చించండి.
జవాబు:
పార్లమెంటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు జరగాలంటే ప్రభుత్వంపై నియంత్రణ ఉండాలి. లేనిచో వాటి అమలు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే తన చర్యలకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందాలని నియమం రూపొందించడమైనది.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, జవాబుదారీ కానీ ఇతర ప్రభుత్వ రూపాలు ఉన్నాయేమో తెలుసుకోండి. Page No 162)
జవాబు:
రాచరికము, నిరంకుశత్వము మొదలైన ప్రభుత్వ రూపాలు పార్లమెంటుకి కానీ, శాసనసభకు కానీ, జవాబుదారీ కానీ వహించవు.

8th Class Social Textbook Page No.163, 164

ప్రశ్న 5.
క్రింది పటం మరియు పట్టిక చూసి కింది ప్రశ్నలకు సమాధానాలు యివ్వంది.
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 7
1. మీ రాష్ట్రంలో, పొరుగునున్న రెండు రాష్ట్రాలలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
జవాబు:
మా రాష్ట్రంలో 25, తెలంగాణలో 17 ఒడిశా 21 నియోజక వర్గాలున్నాయి.

2. 30 కంటే ఎక్కువ లోకసభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలేవి?
జవాబు:
బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్.

3. చాలా రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
చాలా రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి.

4. కొన్ని నియోజకవర్గ ప్రాంతాలు చిన్నగా ఉండగా, కొన్ని పెద్దగా ఎందుకున్నాయి?
జవాబు:
కొన్ని నియోజక వర్గాలు విస్తీర్ణంలో పెద్దవి, కొన్ని చిన్నవి.

5. షెడ్యూల్డు కులాలు, తెగలకు రిజర్వు చేసిన నియోజకవర్గాలు దేశమంతా సమంగా విస్తరించి ఉన్నాయా, లేదా కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయా?
జవాబు:
షెడ్యూల్ కులాలు దేశమంతా దాదాపు సమానంగా విస్తరించి ఉన్నాయి. షెడ్యూల్ తెగలు మాత్రం కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నాయి.

8th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
రాజ్యసభ, లోక్ సభల మధ్య మౌలిక తేడాలను గుర్తించండి.
జవాబు:

లోకసభ రాజ్య సభ
1) దీనిని దిగువసభ అని కూడా అంటారు. 1) దీనిని ఎగువసభ అని కూడా అంటారు.
2) దీంట్లో 545 సీట్లు ఉన్నాయి. 2) దీంట్లో 250 సీట్లు ఉన్నాయి.
3) ఈ సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకుంటారు. 3) కొంతమంది ఎన్నుకోబడతారు, కొంతమంది నియమించ బడతారు.
4) వీరి పదవీ కాలం 5 సం||లు 4) వీరి పదవీకాలం 6 సం||లు.
5) ఈ సభ 5 సం||ల కొకసారి రద్దయి తిరిగి ఎన్నుకోబడుతుంది. 5) ఇది నిరంతర సభ. ఇందులో సభ్యులు ప్రతి రెండు సం||ల కొకసారి 1/3 వంతు రిటైరై తిరిగి ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మేధావులు రాజ్యసభలో ఉంటారు కాబట్టి దానికి ఎక్కువ అధికారాలు ఉండాలని , అజహర్ భావిస్తాడు. రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు కాబట్టి వాళ్లకి అంతకంటే ఎక్కువ అధికారాలు ఇవ్వగూడదని ముంతాజ్ అంటుంది. మీరు ఎవరి వైపున వాదిస్తారు? వీరి భావనలపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
నేను యిరువురి వాదనలను సమర్థిస్తాను. మేధావుల ఆలోచనలు ఎల్లప్పుడూ సమర్థనీయమే. వారికి ఎక్కువ అధికారాలు ఉండాలని భావిస్తాను. అలాగే వారిని ప్రజలు నేరుగా ఎన్నుకోరన్న మాట కూడా యథార్థమే. కాబట్టి మేధావులనే ఎన్నికలలో ఓట్లేసి ప్రజలు గెలిపించుకోవాలని నా వాదన.

ప్రశ్న 8.
కింది చిత్రంలో పార్లమెంట్ ఒకవైపు, ప్రజలు మరోవైపు ఎందుకు ఉన్నారో ఊహించగలరా?
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 5
జవాబు:
ప్రజల సంఖ్య, పార్లమెంటు సభ్యుల సంఖ్య నిష్పత్తిలో ఉంటాయి. ప్రజల మద్దతు లేకపోతే పార్లమెంటు బలహీనమయి పైకి పోతుంది అని దీని అర్థం.

8th Class Social Textbook Page No.165

ప్రశ్న 9.
మీరు ఆ సమయంలో ఉండి ఉంటే పై వాదనలలో దేనితో ఏకీభవించి ఉండేవారు? అందరికీ ఓటు హక్కు ఉండి, ఎన్నికలు నిర్వహించటానికి భారతదేశం ప్రయత్నించటం సరైన ఆలోచన అనే భావించేవారా? కారణాలు ఇవ్వండి.
జవాబు:
నేను ఆ సమయంలో ఉండి ఉంటే ఆశాభావం వ్యక్తపరచిన వారితో ఏకీభవిస్తాను.

ఎలాంటి కార్యానికైనా ఏవో కొన్ని యిబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఏవో కొన్ని సమస్యలుంటాయని మనం మంచికి దూరం కారాదు. అందువలన నేను వారితోనే ఏకీభవిస్తాను. భారతదేశానికి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించడం సరైన ఆలోచనే అంటాను.

8th Class Social Textbook Page No.166

ప్రశ్న 10.
క్రింది వాటి అర్థాలను మీ టీచరుతో చర్చించండి.
1) అభ్యర్థి, 2) నియోజక వర్గం, 3) బ్యాలెట్, 4) ఈ.వి.ఎం, ‘5) ఎన్నికల ప్రచారం, 6) ఎన్నికల సంఘం, 7) ఓటర్ల జాబితా, 8) ఓటింగు విధానం, 9) స్వేచ్చగా స్వతంత్రంగా ఎన్నికలు.
జవాబు:
1) అభ్యర్థి : ఎన్నికలలో పోటీ చేసినవారు.

2) నియోజక వర్గం : రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నియోజక వర్గాలుగా విభజిస్తారు.

3) బ్యా లెట్ : ఓటరు ఓటు వేసే ఎన్నికల గుర్తులున్న పేపరు.

4) ఈ.వి.ఎం : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషను.

5) ఎన్నికల ప్రచారం : ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి తనకు ఓటు వేయమని అభ్యర్థించడం.

6) ఎన్నికల సంఘం : ఎన్నికలను నిర్వహించు స్వతంత్ర ప్రతిపత్తి గల సంఘం.

7) ఓటర్ల జాబితా : ఒక నియోజక వర్గంలోని ఓటర్ల పేర్లు రాయబడ్డ జాబితా.

8) ఓటింగ్ విధానం : ఎన్నికల రోజున ఓటర్లు తమ పోలింగ్ బూత్ లలో ఓటు వేసే విధానం.

9) స్వేచ్చగా స్వతంత్రంగా ఎన్నికలు : ఓటర్లు ఎటువంటి ఒత్తిళ్ళకూ (ధన, కులత, రాజకీయాలకు) లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేసే విధానంతో కూడిన ఎన్నికలు.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 11.
ప్రస్తుతం ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారో మీ తల్లిదండ్రులు, టీచర్లతో చర్చించండి.
జవాబు:
ప్రస్తుతం ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తున్నారు.
ఎన్నికలు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 4
పైన చెప్పిన పద్ధతిలో ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రశ్న 12.
మొదటి ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల మధ్య తేడాలు రాయండి – బ్యాలెట్ పెట్టె, బ్యాలెట్ పత్రాలు, ఓటు హక్కు వయసు.
జవాబు:

అంశాలు మొదటి ఎన్నికలు ప్రస్తుత ఎన్నికలు
1. బ్యా లెట్ పెట్టె ఇనుప పెట్టెలను సీలు వేసి ఉపయోగించారు. పెట్టెలు లేవు. ఈ.వి.ఎం.లు ఉపయోగిస్తున్నారు.
2. బ్యాలెట్ పత్రాలు కాగితంపై గుర్తులు, పేర్లు ముద్రించి బ్యాలెట్ పత్రంగా ఉపయోగించేవారు. నేడు బ్యా లెట్ పత్రాలు లేవు. ఈ.వి.ఎం.లోనే ఓట్లు నమోదు అయి ఉంటాయి.
3. ఓటు హక్కు వయస్సు 21 సం||లు 18 సం||లు

ప్రశ్న 13.
మీ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులు ఎవరు? మీ రాష్ట్రం నుంచి, లేదా పొరుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన కొంతమంది లోక్ సభ సభ్యుల పేర్లు చెప్పండి. వాళ్లు ఏ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళో తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతం నుంచి ఎన్నికైన లోకసభ సభ్యులు :
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 8

ప్రశ్న 14.
ప్రస్తుత రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. తెలుగుదేశం – సైకిలు గుర్తు
  2. వై.ఎస్.ఆర్. సి.పి. – ఫ్యాను గుర్తు
  3. తెలంగాణ రాష్ట్ర సమితి – కారు గుర్తు
  4. కాంగ్రెసు పార్టీ – హస్తం గుర్తు
  5. భారతీయ జనతా పార్టీ. – కమలం గుర్తు
  6. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ – ఏనుగు గుర్తు
  7. కమ్యూనిస్టులు – సుత్తి, కొడవలి / కంకి, కొడవలి

ప్రశ్న 15.
ఓటింగు రహస్యంగా ఎందుకుండాలి?
జవాబు:
ఓటర్ల ఆత్మస్టెర్యం స్థిరంగా ఉండాలంటే ఓటింగు రహస్యంగా ఉండాలి.

8th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
లోకసభకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి?
జవాబు:
లోక్ సభకు 2014 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 17.
ఎంతశాతం ఓటర్లు ఓటు వేశారో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది మనకు ఏం చెబుతుంది?
జవాబు:
ఎంతశాతం ఓటర్లు ఓటువేశారో తెలుసుకోవడం వలన ఎంతమందికి వారు ఎన్నుకోబోయే ప్రభుత్వం యొక్క పని తీరు మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. దీనివలన పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని వారు ఎవరు ఎక్కువగా ప్రభుత్వ పథకాలను ఆదరిస్తున్నారు మరియు వాటి వలన ఎంతమంది ప్రయోజనం పొందుతారో తెలుస్తుంది. ఓటువేసే వారు వారి అభ్యర్థులను గురించి ఆలోచిస్తున్నారో లేదో కూడా తెలుస్తుంది. ఎక్కువమంది అత్యున్నత కులస్తులైన ఉద్యోగస్తులు, సంపన్నులు, కులీనులుగా భావించేవారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారు ఓటువేయడానికి ఆసక్తి కనపరచరు. వారు ప్రభుత్వ పథకాల వలన తమకు ప్రయోజనం ఉండదని భావిస్తారు.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 18.
ఓటు ఉన్న వాళ్ళల్లో చాలా మంది తమ హక్కును ఎందుకు ఉపయోగించుకోవటం లేదు. కారణాలు ఏమై ఉండవచ్చో చర్చించండి.
జవాబు:
ఓటు ఉన్న వారు చాలామంది ఓటు పట్ల నిరాసక్తతతో ఉన్నారు అని చెప్పవచ్చు. ఎవరు గెలిచినా తమ స్థితి యింతే అని భావించి ఓటు వేయకపోయి ఉండవచ్చు.

ప్రశ్న 19.
మొదటి ఎన్నికల సమయంలో వివిధ వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాలు ఏమిటి?
జవాబు:
వివిధ వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాలు : “ఈ ఎన్నికలు ‘చీకటిలో ముందుకు దూకటం’ వంటిది. భారతదేశంలాంటి దేశానికి ఇది అనువైనది కాదు. భారతదేశం కుల ప్రాతిపదికన ఏర్పడిన సమాజం, అందరూ సమానమనే భావనను – అధికశాతం ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరపటం సాధ్యం కాదు,” అని కొంతమంది అన్నారు.

ఆశాభావం వ్యక్తపరచిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు, “బ్రిటిష్ వాళ్ళనుంచి విముక్తం చేయటానికి భారతీయులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వాళ్ళనుకుంటున్నారు. అందరినీ సమానంగా చూసే సమాజం కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరచాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోటానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండాలి” అని అన్నారు. ఇటువంటి వాళ్లకు ఎన్నికలు ‘విశ్వాసంతో కూడిన చర్య’ అవుతాయి.

8th Class Social Textbook Page No.168

ప్రశ్న 20.
1996 ఎన్నికల్లో నిరక్షరాస్యులు, పేదలు అయిన ప్రజల్లో 61 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఒక సర్వే ద్వారా తెలిసింది. అయితే పట్టభద్రులలో ఇది 53 శాతం మాత్రమే. ఈ తేడాకు కారణాలు ఏమై ఉంటాయి? చర్చించండి.
జవాబు:
ఎన్నికలలో నెగ్గిన వారు ఆ తర్వాత ప్రజలకు ఏమీ చేయటం లేదు. చాలావరకు మంత్రులు, ఎమ్.పి. లు వారి బంధుప్రీతిని చూపించి, అధికార దుర్వినియోగాన్ని చేస్తున్నారని పట్టభద్రుల భావన అయి వుండవచ్చు. ఆ నైరాశ్యమే ఈ తేడాకు కారణమై ఉండవచ్చు.

8th Class Social Textbook Page No.169

ప్రశ్న 21.
గత సం||రం చదివిన చట్టాలను గుర్తు చేసుకోండి. రాష్ట్ర శాసనసభలలో లేదా పార్లమెంటు గత సమావేశంలో చర్చించిన కొత్త చట్టాల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. పార్లమెంటు గత సమావేశంలో మహిళా కోర్టుల ఏర్పాటు బిల్లు.
  2. లైంగిక వేధింపులకు పాల్పడిన వారు మైనర్లు అయితే వారిలో పదహారు సం||రములు దాటిన వారిని జువెనైల్ కోర్టులు లేక, మామూలు క్రిమినల్ కోర్టులు విచారించే విషయమై బిల్లు.

ఈ రెండు విషయాలపై, ఇంకా యితర విషయాలపై పార్లమెంటు చర్చించింది.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 22.
తప్పు వాక్యాలను సరిచేయండి.
1) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఒకే రకం వ్యక్తులు ఎన్నుకుంటారు.
2) దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
3) రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పాల్గొంటారు.
4) అన్ని శాసనసభల సభ్యులు (ఢిల్లీ, పాండిచ్చేరిలతో సహా) రాజ్యసభ, లోకసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
జవాబు:
1) అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయసభల ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
2) దేశంలో ఓటువేసిన ప్రతి ఓటరు పరోక్షంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
3) రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు పాల్గొంటారు.
4) అన్ని శాసనసభల సభ్యులు రాజ్యసభ, లోకసభ సభ్యులు ఎన్నికైన వారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

8th Class Social Textbook Page No.170

ప్రశ్న 23.
కింద పేర్కొన్న వారికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను సేకరించి ఆయా డబ్బాలలో అతికించండి.
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 9
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 11 a

ప్రశ్న 24.
ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు ? అంతకు ముందు ప్రధానమంత్రుల నుంచి కొంతమంది పేర్లు చెప్పండి.
జవాబు:
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందు వారు –

  1. డా|| మన్మో హన్ సింగ్
  2. శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి
  3. శ్రీ రాజీవ్ గాంధీ
  4. శ్రీమతి ఇందిరాగాంధీ
  5. శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ
  6. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి

ప్రశ్న 25.
మీ రాష్ట్రం నుంచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ల పేర్లు చెప్పండి.
జవాబు:
మా రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్లు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ మరియు అశోక గజపతి రాజు.

ప్రశ్న 26.
కొన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను, కేంద్ర ప్రభుత్వంలో వాటి మంత్రులను పేర్కొనంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 11

8th Class Social Textbook Page No.170, 171

ప్రశ్న 27.
ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనది ఏది?
1) రాష్ట్రపతి మద్దతు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
2) పార్లమెంటులో అధిక సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
3) పార్లమెంటులో సగానికి పైగా సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
4) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని ఎన్నికల కమిషన్ ఎంపిక చేస్తుంది.
5) లోక్ సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు.
జవాబు:
2) పార్లమెంటులో అధిక సీట్లు ఉన్న పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

పట నైపుణ్యాలు

28. క్రింద ఈయబడిన పటమును గమనించి సమాధానములు రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 12
1. మొత్తం నియోజక వర్గాలు ఎన్ని?
జవాబు:
543

2. SC, ST లలో ఏవి ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
SC ఎక్కువగా ఉన్నాయి.

3. SC ఎక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు?
జవాబు:
ఈశాన్య ప్రాంతం

4. ST లు ఎక్కడ అస్సలు లేవని చెప్పవచ్చు?
జవాబు:
తమిళనాడు, కేరళ, కర్ణాటక.

ప్రశ్న 29.
ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలల్లో గెలిచిన వ్యక్తులు ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వారి ఎన్నికను ఏ ఆకర్షణీయమైన అంశాలు లేదా ఒత్తిళ్ళు ప్రభావితం చేయరాదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 30.
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత ఎవరిది?
జవాబు:
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది.

ప్రశ్న 31.
పార్లమెంటు చట్టాలు మాత్రం చేసి ప్రభుత్వాన్ని నియంత్రించకుండా ఉంటే సరిపోతుందా?
జవాబు:
పార్లమెంటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు జరగాలంటే ప్రభుత్వంపై నియంత్రణ ఉండాలి. లేనిచో వాటి అమలు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే తన చర్యలకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందాలని నియమం రూపొందించడమైనది.

ప్రశ్న 32.
ఎంత శాతం ఓటర్లు ఓటు వేశారో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది మనకు ఏం చెబుతుంది?
జవాబు:
ఇది ఓటింగు సరళిని తెలియజేస్తుంది. ఎన్నికల పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇది ముఖ్యం.

ప్రశ్న 33.
ప్రజాస్వామ్య భావనకు ప్రాతినిధ్య భావన ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
ప్రజాస్వామ్యమంటే ప్రజల స్వామ్యమని అర్థం. అందుకే దీనికి వారి ప్రాతినిధ్య భావన ముఖ్యమైనది. ప్రజలు అంటే ప్రత్యేకించి ఏ ఒక్కరూ కారు. అందరూ అని అర్థం.

AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 34.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు?
జవాబు:
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో వారు భావస్వారూప్యం కలిగిన ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ గా ఏర్పడి ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ కలదు.

ప్రాజెక్టు

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రేడియో లేదా టెలివిజన్ లో వార్తలు విని లేదా దినపత్రికలు చదివి జరిగిన ఘటనల జాబితా తయారుచేయండి. పార్లమెంటులో చర్చ జరిగిన అంశంపై ఒక వ్యాసం రాయండి లేదా దానిని చర్చిస్తున్నప్పుడు పార్లమెంటులోని దృశ్యాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం 13