SCERT AP 8th Class Social Study Material Pdf 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం
8th Class Social Studies 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) ఎఫ్.ఐ.ఆర్ ను కోర్టులో దాఖలు చేస్తారు. (తప్పు)
జవాబు:
ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా పోలీసు స్టేషనులోని రిజిస్టరులో నేరం వివరాలను పొందుపరచాలి. (ఒప్పు)
2) పోలీసులు అరెస్టు చేయడమంటే శిక్షింపబడటంతో సమానం. (తప్పు)
జవాబు:
పోలీసులు అరెస్టు చేయడమంటే విచారణకు తీసుకెళ్ళారని అర్ధం. (ఒప్పు)
3) హామీల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తారు. (ఒప్పు)
4) దేశంలో అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు. (ఒప్పు)
ప్రశ్న 2.
రవి విషయంలో మొదటి విచారణ నుంచి హై కోర్టులో తుది తీర్పు వరకు ఏం జరిగిందో ఈ పట్టికలో వివరించండి. (AS1)
జవాబు:
సాక్షుల పాత్ర | ఇచ్చిన శిక్ష | రవి హాజరు కావలసిన అవసరం |
వాయిదాకు కొద్దిమందిని | 4 సం||లు. విచారించేవారు. |
తప్పనిసరి జైలుశిక్ష |
హాజరు కానవసరం లేదు | 1 సం|| జైలుశిక్ష | ఒకసారి హాజరయితే చాలు. |
హాజరు కానవసరం లేదు | 1 సం|| జైలుశిక్ష | అసలు హాజరు కానవసరం లేదు. |
ప్రశ్న 3.
క్రిమినల్, సివిల్ కేసుల మధ్య తేడాల దృష్ట్యా వీటి గురించి ఒక్కొక్క వాక్యం రాయండి.
అ) శిక్ష, జైలు ఆ) ప్రభుత్వ న్యాయవాదులు ఇ) ఎఫ్.ఐ. ఆర్. నమోదు (AS1)
జవాబు:
అంశాలు | క్రిమినల్ | సివిల్ |
అ) శిక్ష, జైలు | సాధారణంగా దోషులకు జైలు శిక్ష విధిస్తారు. | సివిల్ వాదాలలో జైలు శిక్ష వేయకపోవచ్చు. |
ఆ) ప్రభుత్వ న్యాయవాదులు | ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు. ప్రభుత్వం తరఫున వాదనలు చేస్తారు. | వీరి పాత్ర ఏమీ ఉండదు |
ఇ) ఎఫ్. ఐ. ఆర్. నమోదు | FIR ను పోలీసువారి రిజిష్టరులో నమోదుచేయాలి. | FIR ఉండదు. |
ప్రశ్న 4.
హైకోర్టు నిర్ణయాన్ని సెషన్సు లేదా జిల్లా కోర్టు మార్చగలవా? ఎందుకు? (AS1)
జవాబు:
హైకోర్టు నిర్ణయాన్ని దాని కన్నా క్రిందస్థాయి కోర్టులైన సెషన్సు లేదా జిల్లా కోర్టులు మార్చలేవు. ఎందుకంటే క్రిందస్థాయిలో జరిగిన వాదనలు, విచారణలు సంతృప్తి చెందకపోతే పై కోర్టుకు వెళ్ళవచ్చుగాని క్రింద కోర్టుకు వెళ్ళలేరు. హైకోర్టు తీర్పు సంతృప్తిగా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చుగాని క్రింద కోర్టుకు వెళ్ళలేరు.
ప్రశ్న 5.
సెషన్సు కోర్టు, హైకోర్టు తీర్పులతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్లు ఏం చేయవచ్చు? (AS1)
జవాబు:
సెషన్సు కోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయవచ్చు.
ప్రశ్న 6.
ఎస్. హెచ్.ఓ, మెజిస్ట్రేట్ల పాత్రలలో తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఎస్. హెచ్.ఓ పోలీసు స్టేషను స్థాయి అధికారి. మేజిస్ట్రేట్ అంతకన్నా పై స్థాయి అధికారి. S.I తాను అరెస్టు చేసిన వ్యక్తిని విచారణ చేసి 24 గం||ల లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.
ప్రశ్న 7.
మీ అభిప్రాయంలో రవి విషయంలో తీర్పు ఎలా ఉండాలి? (AS2)
జవాబు:
రవి విషయంలో తీర్పును నేను సమర్థిస్తున్నాను. కానీ విచారణ మరింత వేగవంతంగా జరిగితే బాగుండేదని భావిస్తున్నాను.
ప్రశ్న 8.
ఒక వ్యక్తి పోలీసు స్టేషనులో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని ఆరు నెలలపాటు నిర్బంధంలో ఉంచారు. ఇది సరైన విధానమేనా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
ఇది సరైన విధానం కాదు. తన నేరాన్ని ఒప్పుకున్నాక అతనిని కోర్టుకు అప్పచెప్పాలి. అంతేకాని తమ నిర్బంధంలో ఉంచుకోకూడదు. అది న్యాయవిరుద్ధం అవుతుంది.
ప్రశ్న 9.
ఈ అధ్యాయంలో ఇచ్చిన కార్యనిర్వాహక, న్యాయవర్గాల భిన్న పాత్రలను గుర్తించండి. (AS1)
జవాబు:
పోలీసువారు కార్యనిర్వాహక వర్గంలోకి వస్తారు. కేసును నమోదు చేసుకోవడం, ప్రాథమిక విచారణ చేయడం మొదలైన పనులన్నీ వీరిచే నిర్వహించబడ్డాయి.
న్యాయవిచారణ, సాక్షుల విచారణ, తీర్పు మొదలైన అంశాలన్నీ న్యాయవర్గాలు నిర్వహిస్తాయి.
ఈ విధంగా వీరిరువురూ ఒకరి అధికారాలలో ఒకరు జోక్యం చేసుకోకుండా వ్యవహరిస్తారు.
8th Class Social Studies 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం InText Questions and Answers
8th Class Social Textbook Page No.173
ప్రశ్న 1.
పోలీసుస్టేషనులో రవిపై క్రాంతి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో క్రింద పేర్కొన్న వివరాలు ఉండాలి :
1. పోలీసు స్టేషను అధికారి (ఎసీహెచ్ఓ)ని సంభోదిస్తూ ఫిర్యాదు రాయాలి.
జవాబు:
S.H.O గారికి,
2. ఫిర్యాదు వివరాలు.
జవాబు:
క్రిమినల్ కేసు.
3. నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం.
జవాబు:
10.8.2013 గం|| 8.30 ని॥లు రవి ఇంటివద్ద.
4. ఏం జరిగింది?
జవాబు:
రవి సాంబను అనగా నన్ను కొట్టాడు.
5. నిందితుల పేరు, లింగం, చిరునామా, మొ||నవి.
జవాబు:
రవి, పురుషుడు, x x x x
6. సాక్షుల పేర్లు (నేరం ఎవరి సమక్షంలో జరిగింది?)
జవాబు:
రవి పక్కింటి వ్యక్తి, రవి స్నేహితుడు సాంబ కొడుకు క్రాంతి.
7. విన్నపం (నిందితులను చట్టం ప్రకారం శిక్షించమని కోరటం, తెలిసి ఉంటే వర్తించే సెక్షన్ సంఖ్యను సూచించాలి).
జవాబు:
చట్ట ప్రకారం అతనిని తగినవిధంగా శిక్షించవలసిందిగా విన్నపం.
8. ఫిర్యాదుదారు సంతకం, చిరునామా, ఇతర వివరాలు.
జవాబు:
సాంబ, x x x x సహకార సంఘంలో ప్యూను.
8th Class Social Textbook Page No.174
ప్రశ్న 2.
ప్రతి పోలీసు స్టేషను కింద కొంత ప్రాంతము ఉంటుంది. మీ యిల్లు ఏ పోలీసుస్టేషను పరిధిలోకి వస్తుందో తెలుసుకోండి.
జవాబు:
మా ఇల్లు తిరుపతి, వటౌన్ పోలీసుస్టేషను పరిధిలో ఉన్నది.
ప్రశ్న 3.
ఎస్ హెచ్ఓ/ఎస్ఎ వచ్చే వరకు వాళ్లు ఎందుకు వేచి ఉన్నారు? ఇటువంటి నివేదిక మీరు రాయాల్సి వస్తే అందులో మీరు ఏమి రాస్తారు?
జవాబు:
ఎహెచ్ఓ ను స్టేషనుకు పెద్ద అధికారి. ఎఐఆర్ నమోదు చేయాలంటే ఆయన తప్పనిసరిగా ఉండాలి. అందుకే వేచి ఉన్నారు. నేను ఇటువంటి నివేదిక రాయాల్సి వస్తే జరిగిన విషయాలన్నీ వివరిస్తాను. గొడవ ఎలా జరిగింది, ఎవరెవరికి జరిగింది, సాక్షులు ఎవరు, చిరునామాలు మొదలైనవి రాస్తాను.
ప్రశ్న 4.
ఎఫ్.ఐ.ఆర్ ఇచ్చిన వ్యక్తి దాని ప్రతిని తీసుకోవడం ఎందుకు ముఖ్యం?
జవాబు:
ఎఫ్.ఐ.ఆర్ ఇచ్చిన వ్యక్తి తాను ఫిర్యాదు ఇచ్చినట్లు ఋజువుగా దాని ప్రతిని తీసుకోవాలి. దానిని దాఖలు చేసిన తరువాత కేసుని పరిశోధించి, పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులది.
8th Class Social Textbook Page No.175
ప్రశ్న 5.
నేరాన్ని ఎవరు విచారించారు? ఎలా విచారించారు?
జవాబు:
నేరాన్ని ఎస్.ఐ విచారించారు.
ఈ కేసులో ఎస్.ఐ ఆ ఊరికి వెళ్లి విచారణ మొదలుపెట్టాడు. ముందుగా సాంబకి అయిన గాయాలు చూశాడు. దెబ్బలు బాగానే తగిలాయని ఆసుపత్రి నివేదిక తెలుపుతుంది. తరవాత అతడు రవి ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వాళ్లను విచారించాడు. జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను చుట్టుపక్కలవాళ్లు ఇచ్చారు. సాంబ మీద రవి దాడి చేసి, గాయపరిచాడని ఎటువంటి అనుమానానికి తావులేకుండా స్పష్టమయ్యింది.
అప్పుడు ఎస్.ఐ రవి వాళ్ల ఇంటికి వెళ్లి సాంబ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఆరోపణపై అతడిని అరెస్టు చేస్తున్నామని చెప్పాడు. అతడు రవిని అరెస్టు చేసి మండల పోలీసు స్టేషనుకి తీసుకెళ్లి అక్కడ అతన్ని ప్రశ్నించాడు. సాంబను కొట్టానని రవి ఒప్పుకోలేదు. రవితోటి అతడి నేరాన్ని అంగీకరింపచేయటానికి ఎస్.ఐ ప్రయత్నించాడు కానీ అతడు ఒప్పుకోలేదు. మరునాడు మెజిస్ట్రేటు ముందు హాజరుపరచటానికి రవిని పోలీసు లాకప్లో నిర్బంధించాడు.
ప్రశ్న 6.
నిందితుడు అంటే ఏమిటి ? ఈ కథలో నిందితుడు ఎవరు?
జవాబు:
నేరం మోపబడిన వ్యక్తిని నిందితుడు అంటారు. ఈ కథలో నిందితుడు రవి.
ప్రశ్న 7.
నిందితుడిపై మోపిన ఆరోపణలు ఏమిటి?
జవాబు:
నిందితుడిపై
- ప్లాటుకు డబ్బు కట్టించుకుని అదివేరే వారికి ఇచ్చి మోసం చేసాడని.
- డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని మరియు
- సాంబపై తీవ్రంగా దాడి చేసి, గాయపరిచాడని ఆరోపణలు చేశారు.
ప్రశ్న 8.
రవిని శిక్షించడానికి ఎస్.ఐ అతడిని నిర్బంధించాడని సాంబ అనుకున్నాడు. అది నిజమేనా?
జవాబు:
అది నిజం కాదు. శిక్ష వేసే అధికారం కోర్టులకే తప్ప పోలీసులకు లేదు.
8th Class Social Textbook Page No.176
ప్రశ్న 9.
1) సాంబ ప్లాటుని రవి మరొక వ్యక్తికి అమ్మినపుడు అది సివిల్ నేరం. (క్రిమినల్ లేదా సివిల్)
2) సాంబని రవి కొట్టినపుడు అది క్రిమినల్ నేరం. (క్రిమినల్ లేదా సివిల్)
8th Class Social Textbook Page No.177
ప్రశ్న 10.
నేర, పౌర చట్టాల గురించి మీరు అర్థం చేసుకున్నదాని ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
ఘటన వివరణ | ఏ చట్టం | అనుసరించే విధానం |
1. బడికి వెళుతున్న దారిలో బాలికల బృందాన్ని ఒక బాలుర బృందం నిత్యం వేధిస్తూ ఉంది. | నేరచట్టం | పోలీసులు బాలుర బృందంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. బాలురు దోషులు అని ఋజువు అయినట్లయితే వారికి జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. |
2. ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయిదారు దావా వేయటం. | పౌరచట్టం | కిరాయిదారు న్యాయస్థానంలో దావా వేస్తారు. కోర్టు నష్టానికి గురి అయిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. |
8th Class Social Textbook Page No.178
ప్రశ్న 11.
న్యాయమైన విచారణ అంటే ఏమిటి? అది అవసరమా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతోంది. ఒకరు దోషులో కాదో నిర్ణయించటానికి అతడు/ ఆమెపై న్యాయమైన, నిష్పాక్షికమైన బహిరంగ విచారణ జరుపుతారు. నేర విచారణ ‘అమాయకులు అన్న భావన’తో మొదలవుతుంది. ఎటువంటి అనుమానానికి తావులేకుండా నేరం నిరూపింపబడాలి.
ఈ విధంగా విచారించడాన్నే న్యాయమైన విచారణ అంటారు.
న్యాయమైన విచారణ అవసరమే. బాధితులకు సరియైన న్యాయం జరుగకపోతే ప్రజలలో న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లుతుంది. అరాచకం పెరిగిపోతుంది. తమకు న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉంటేనే ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.
8th Class Social Textbook Page No.179
ప్రశ్న 12.
స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి?
జవాబు:
న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ప్రభుత్వం తరఫున పనిచేయవు. పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. ఇలా న్యాయశాఖ స్వతంత్రంగా , ఉండే విధానాన్నే స్వతంత్ర్య న్యాయవ్యవస్థ అంటారు.
ప్రశ్న 13.
తీర్పును ప్రభావితం చేయడంలో రాజకీయ నాయకులకు ఏమైనా ఆస్కారం ఉందా? ఎందుకని?
జవాబు:
తీర్పును ప్రభావితం చేయడంలో రాజకీయ అధికారులకు ఆస్కారం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు – స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినది. కాబట్టి ఇందులో ఎవరూ కలిగించుకోలేరు. న్యాయమూర్తి కూడా విచారణను నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు.
ప్రశ్న 14.
రవి కేసును ఏ న్యాయస్థానం విచారిస్తోంది?
జవాబు:
రవి కేసును జ్యుడీషియల్ మేజిస్ట్రేటు కోర్టు విచారిస్తోంది.
ప్రశ్న 15.
మొదటి వాయిదాలో ఏమయ్యింది?
జవాబు:
చాలాసేపు వేచి ఉన్న తరువాత రవి, సాంబలను విచారణకు పిలిచారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేటు ముందు ఇదే మొదటి వాయిదా.
ఎస్ఎఆర్ ప్రతిని, పోలీసుల నివేదికను రవి న్యాయవాదికి ఎస్ఎ ఇచ్చాడు. దీనివల్ల తన క్లయింటుపై మోపబడిన ఆరోపణలు ఏమిటో అతడికి తెలుస్తాయి. ఈ నివేదికల ద్వారా రవికి వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు ఏమిటో కూడా అతడికి తెలుస్తాయి. ఈ కేసులో నిందితుడైన రవి తరపున అతని న్యాయవాది వాదించటానికి ఇదంతా దోహదపడుతుంది.
మొదటి వాయిదాలో తీవ్రంగా గాయపరిచాడంటూ రవిపై జ్యుడీషియల్ మెజిస్టేటు నేరారోపణ చేశాడు. ఈ నేరం రుజువైతే 4 సంవత్సరాల దాకా జైలుశిక్ష పడవచ్చు. రవి నేరాన్ని అంగీకరించలేదు. దాంతో మెజిస్ట్రేటు తరవాత విచారణను 15 రోజులకు వాయిదా వేశాడు.
ప్రశ్న 16.
ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదిని ఏమంటారు?
జవాబు:
పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ప్రభుత్వ న్యాయవాది అంటారు.
8th Class Social Textbook Page No.180
ప్రశ్న 17.
ఏ కేసులోనైనా సాక్షులు చెప్పే వాటిని వినాల్సిన అవసరం ఏమిటో చర్చించండి.
జవాబు:
ఏ కేసులోనైనా నిందితులు, బాధితులు ఎవరికి అనుకూలంగా వారే మాట్లాడుతారు. కావున సత్యం తెలియదు. సాక్షులు చెప్పేవాటిని వింటే సత్యం తెలుస్తుంది. అందుకే వారు చెప్పినది వినాలి.
8th Class Social Textbook Page No.181
ప్రశ్న 18.
మీ టీచరు సహాయంతో మీ ప్రాంతానికి సంబంధించి ఈ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి?
జవాబు:
మా ప్రాంతానికి సంబంధించి జిల్లా కోర్టులు విజయవాడలోను, హైకోర్టు మచిలీపట్నంలోను ఉన్నాయి.
ప్రశ్న 19.
ఒక పెద్ద కంపెనీ అడవిని నరికివేస్తోందనీ, ఒక గిరిజనుడు కట్టెపుల్లల కోసం కొమ్మలు నరుకుతున్నాడని ఊహించుకోండి. – నిష్పక్షపాతంగా వ్యవహరించటం మంచిదేనా? చర్చించండి.
జవాబు:
గిరిజనులకు అడవిమీద అధికారం ఉంటుంది. వారి నిత్యావసరాలకు, వారు అడవిమీద ఆధారపడతారు. అడవికి – హానిచేయరు. దీనిని సమర్థించవచ్చు.
ఒక పెద్ద కంపెనీ అడవిని నరికివేయడం. అనేది చట్ట విరుద్ధమైన చర్య. ఇది పర్యావరణానికి ముప్పు, కాబట్టి ఇది సమర్థనీయం కాదు.
ప్రశ్న 20.
కింది నుంచి పై వరకు న్యాయస్థానాల వ్యవస్థ పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బొమ్మలో నింపండి.
(లేదా)
కింద ఇవ్వబడిన ఫ్లోచార్టలోని సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
i) మనదేశంలో ఎన్ని స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి?
ii) దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది?
iii) “సబార్డినేట్” న్యాయస్థానాలని వేటిని అంటారు?
iv) భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలు ఏ న్యాయస్థానానికి లోబడి ఉండాలి?
జవాబు:
i) మనదేశంలో మూడు స్థాయిలలో న్యాయ స్థానాలు ఉన్నాయి.
ii) దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు
iii) కింది స్థాయి న్యాయస్థానాలను సబార్డినేట్ న్యాయస్థానాలు అంటారు.
iv) అన్ని న్యాయస్థానాలు సుప్రీంకోర్టుకు లోబడి ఉంటాయి.
8th Class Social Textbook Page No.182
ప్రశ్న 21.
“మా నాన్నకి న్యాయం జరిగింది, కానీ చాలా ఆలస్యం అయింది” అని క్రాంతి అన్నాడు. మీరు అతడితో ఏకీభవిస్తారా? Page No.182)
జవాబు:
నేను క్రాంతితో ఏకీభవిస్తాను. ఎందుకంటే న్యాయం జరగడానికి సుమారు 3 సం||రాల కాలం తీసుకుంది. ఇది తక్కువ సమయమేమీ కాదు.
ప్రశ్న 22.
రవి శిక్షను సెషన్స్ కోర్టు తగ్గించటానికి కారణాలను ఊహించండి.
జవాబు:
ఏ దేశంలోనైనా శిక్షా స్మృతి దోషుల మనసు మార్చడానికే రాయబడి ఉంటుంది. రవికి మేజిస్ట్రేట్ కోర్టు 4 సం||రాల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పుపై అభ్యంతరంతో రవి సెషన్సు కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. సెషన్సు కోర్టులో కేసు తేలడానికి రెండు సంవత్సరాలు పట్టింది. అంటే అతని శిక్షాకాలంలో సగం కోర్టు నిర్ణయానికే వేచి ఉండాల్సి వచ్చింది. ఇంత కాలంలో మనిషిలో మార్పు రావడానికి అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఈ భావనను పరిగణనలోనికి తీసుకుని కోర్టు రవికి శిక్ష తగ్గించి ఉండవచ్చు.
ప్రశ్న 23.
నిందితులను కానీ, సాక్షులను కానీ హైకోర్టు తన ముందుకు రమ్మని అడగదు. ఎందుకని?
జవాబు:
క్రిందిస్థాయి కోర్టులో నిందితులను, సాక్షులను విచారిస్తారు. కాబట్టి హైకోర్టు మరలా విచారించాల్సిన అవసరం లేదు అని హైకోర్టు భావిస్తుంది. అందుకే వారిని తన ముందుకు రమ్మని అడగదు.
ప్రశ్న 24.
పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ఎలా ఉండాలి? భద్రత దృష్ట్యా కొన్ని సూచనలు చేయండి.
జవాబు:
పిల్లల పట్ల పెద్దలు ప్రేమ పూర్వకంగా మరియు స్నేహభావంతో మెలగాలి. పిల్లల చదువుల విషయంలో వారికి ఒక స్నేహితుడిలాగ అవగాహన కలిగించి వారు సరియైన దారిని ఎంచుకునే లాగ ప్రోత్సహించాలి. వారు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేసి చూపకుండ వారు చేసిన తప్పును సరిదిద్ది మరలా వారు దానిని చేయకుండా చూడాలి. వారికి చదువు ఒక్కటే కాదు ఆటలు, పాటలు అనేవి కూడా వారి జీవన విధానంలో ప్రధానమని ప్రోత్సహించాలి. పిల్లలకు పెద్ద వారిని గౌరవించడం నేర్పాలి. వారు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో గమనించాలి. పిల్లలకు లోకజ్ఞానమును నేర్పించాలి. వారికి వాహనములను నడపడం పట్ల మరియు రోడ్డు భద్రత అంశాల మీద అవగాహన కలిగించాలి. సోషల్ మీడియాను పిల్లలు సరియైన దారిలో ఉపయోగించేలాగ చూడాలి.
ప్రశ్న 25.
నిన్ను ఒకరు వేధిస్తున్నారని ఊహించుకోండి. దానికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరుస్తూ పోలీస్ అధికారికి . ఫిర్యాదు రాయండి.
జవాబు:
మహరాజశ్రీ, విజయవాడ వటౌన్ పోలీస్ స్టేషన్ S.I. గారి దివ్య సుముఖమునకు పంజాగుట్ట కాలనీవాసురాలిని మరియు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న ‘నేహ’ అనే విద్యార్థిని చేసుకుంటున్న విన్నపము.
అయ్యా , ఇట్లు అడ్రసు : |
ప్రశ్న 26.
గ్రామాలలో / కుటుంబాలలో తరచు తగాదాలు ఎందుకు వస్తాయి? దానికి కారణాలు ఏవి? అవి రాకుండా ఉందాలంటే మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావాలి?
జవాబు:
గ్రామస్తులు ఒకరితో ఒకరు కలసిమెలిసి ఉంటారు. ఇంకొకరి విషయాలలో వారి అనుమతి లేకుండానే తలదూరుస్తారు. ‘వ్యక్తిగతం’ అనేదాన్ని విస్మరిస్తారు. కావున తగాదాలు వస్తాయి. కాబట్టి వారు పట్టణ/నగర నాగరికతను అలవరుచుకుంటే మంచిది.
ప్రశ్న 27.
ఈ క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.
బెయిలు :
రవిది క్రిమినల్ కేసు కాబట్టి నేరారోపణ పత్రం (చార్జిషీటు దాఖలు చేసిన తరవాత లాకప్ లో నిర్బంధించారు. క్రిమినలు కేసులలో నిందితులను జైలులో ఉంచుతారు. అయితే ఇది శిక్షకాదు. ఇది నేర విచారణలో దోహదపడటానికి, లేదా నిందితుడు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉండటానికి, లేదా సాక్షులను బెదిరించకుండా ఉండటానికి ఉద్దేశించినది. పోలీసు లాకప్ లో కొన్ని రోజులు ఉన్న తరువాత రవి కుటుంబం బెయిలు కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది. హత్య, లంచగొండితనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు దొరకకపోవచ్చు. బెయిలు పొందటానికి న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి. ఈ హామీ ఆస్తులు కావచ్చు లేదా పూచీకత్తుగా నిలబడే వ్యక్తి కావచ్చు. బాండు కావచ్చు. అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందితుడు హాజరు అవుతాడని బాండు హామీ ఇస్తుంది. బెయిలు మంజూరు చేయాలో, లేదా నిరాకరించాలో న్యాయస్థానంలో న్యాయమూర్తి నిర్ణయిస్తారు.
అ) రవిని ఎందులో నిర్బంధించినారు?
జవాబు:
రవిని లాకప్ లో నిర్బంధించినారు.
ఆ) క్రిమినల్ కేసులలో నేర విచారణలో దోహదపడటానికి ఏం చేస్తారు?
జవాబు:
నిందితులను జైలులో ఉంచుతారు.
ఇ) బెయిలు కోసం ఎవరికి దరఖాస్తు చేశారు?
జవాబు:
న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు.
ఈ) బెయిల్ పొందడానికి న్యాయస్థానంలో ఏమి ఇవ్వాలి?
జవాబు:
న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి.
ఉ) బెయిల్ ను ఎవరు మంజూరు చేస్తారు?
జవాబు:
న్యాయమూర్తి
ప్రశ్న 28.
ఈ క్రింది పేరాను చదివి జవాబులిమ్ము.
ఇంతకు ముందు అధ్యాయాలలో మనం భారతదేశ రాజ్యాంగం గురించి చదువుకున్నాం. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరు చేయటం. దీని అర్థం ఒక రంగంలో మిగిలిన రంగాలు అంటే ఉదాహరణకు న్యాయ రంగంలో శాసన, కార్యనిర్వాహక రంగాలు జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ అధీనంలో లేవు. ప్రభుత్వం తరపున పని చేయవు.
పోలీసులు కూడా న్యాయరంగంలో భాగం కాదు. వాళ్లు కార్యనిర్వాహక రంగానికి చెందినవాళ్లు. గత సంవత్సరం మీరు జిల్లాస్థాయి పరిపాలన గురించి చదివారు. జిల్లాస్థాయిలో కలెక్టరు మాదిరిగా శాంతి, భద్రతల నిర్వహణకు జిల్లాస్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.
అ) రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం ఏది?
జవాబు:
రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయడం.
ఆ) న్యాయస్థానాలు ఎవరి ఆధీనంలో లేవు?
జవాబు:
న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు.
ఇ) పోలీసులు ఏ రంగానికి చెందినవారు?
జవాబు:
పోలీసులు కార్యనిర్వాహక రంగానికి చెందినవారు.
ఈ) పోలీసుశాఖ ఎవరి క్రింద పనిచేస్తుంది?
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వశాఖ కింద పోలీసుశాఖ పనిచేస్తుంది.
ప్రాజెక్టు
వీస్ ల్యాండ్ అనే పట్టణం ఉంది. దానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఆటస్థలంలో ఫియస్టా, జుబిలీ అనే ఫుట్ బాల్ టీముల మధ్య తుది పోటీ జరగాల్సి ఉంది. అయితే మరునాడు మైదానాన్ని జుబిలీ బృందం మద్దతుదారులు పాడుచేశారని తెలిసింది. పీల్యాండ్ లో ఫియస్గా మద్దతుదారులు జుబిలీ మద్దతుదారుల ఇళ్లపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది పురుషులు చనిపోయారు. అయిదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 50 మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు.
మీరు, మీ మిత్రులు నేర న్యాయవ్యవస్థలో భాగమని ఊహించుకోండి. ముందుగా తరగతిలోని విద్యార్థులను ఈ కింది రకంగా విభజించండి.
- పోలీసు
- ప్రభుత్వ న్యాయవాది
- నిందితుల తరపు న్యాయవాది
- న్యాయమూర్తి
పాఠం నుండి ప్రతి జట్టు చేయవలసిన విధులను, ఫియస్గా అభిమానులచే హింసకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా కేటాయించండి. ఈ విధులు ఏ క్రమంలో పూరించాలో సూచించండి.
ఇదే పరిస్థితిని తీసుకుని ఫియస్గా అభిమానియైన ఒక విద్యార్ధిని పైవిధులన్నీ నిర్వర్తించమనండి. నేర న్యాయవ్యవస్థలోని అన్ని విధులూ ఒక్కరే నిర్వర్తించినప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
నేర న్యాయవ్యవస్థలో వివిధ పాత్రలను వివిధ వ్యక్తులు పోషించాలనటానికి రెండు కారణాలను పేర్కొనండి.
జవాబు:
న్యాయవ్యవస్థలోని అన్ని విధులూ ఒకరే నిర్వహించితే కచ్చితంగా -ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది.
ఉదా :
ఫియస్గా అభిమాని విచారణ జరిపితే జూబిలీ వారికి అన్యాయం జరుగుతుంది.
రెండు కారణాలు :
- నేరవ్యవస్థలో ప్రాథమిక ఆధారాలని బట్టి మాత్రమే విచారణ చేసి కేసు పెడతారు.
- న్యాయ వ్యవస్థలో వాటిని కూలంకషంగా పరిశీలించి తీర్పునిస్తారు. కాబట్టి రెండు వ్యవస్థలు వేరువేరుగా ఉండాలి.