SCERT AP 8th Class Social Study Material Pdf 22st Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు
8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
సినిమాలకు, నాటకాలకు ఉన్న మూడు తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
సినిమాలు | నాటకాలు |
1. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. | 1. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. |
2. ఒకేసారి అనేక చోట్ల ప్రదర్శించబడతాయి. | 2. ఒక్కసారీ ఒక్కచోట మాత్రమే ప్రదర్శించగలుగుతారు. |
3. అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తారు. | 3. ఒక్క స్టేజీపైనే అన్నీ చూపించటానికి ప్రయత్నిస్తారు. |
ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏదైనా కథను లేదా పాటను చిన్న సినిమాగా తీయవచ్చా? దీని ఆధారంగా సినిమా తీయటానికి ఎవరెవరు అవసరమో జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
తీయవచ్చును. దీనికి నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, కెమెరామెన్, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, గాయకులు, మ్యూజీషియన్లు ఇంకా ఇతర పనివారు కావాలి.
ప్రశ్న 3.
“సమాజాన్ని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం,” అని కొంతమంది వాదిస్తారు, “సినిమా ప్రభావం చెడుగా ఉంటుంది,” అని మరికొంతమంది అంటారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఎందుకు? (AS4)
జవాబు:
“సమాజాన్ని మంచిగా కాని, చెడుగా కాని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం” – అని నేను భావిస్తాను. అంటే మార్పు ఎటువంటిదైనాకాని, సినిమాకు ఆ శక్తి ఉన్నది.
కారణం :
సినిమా ఒక విలువైన మాధ్యమం. వినోదం కోసం వీటిని చూసినా కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి. చిన్న చిన్న విషయాలే మనుషుల ప్రవర్తనను మారుస్తుంటాయి.
ఉదా :
- ‘పోకిరి’ సినిమా చూసిన తరువాత మగ పిల్లలందరూ రెండు షర్టులు ధరించడం మొదలు పెట్టారు.
- పూర్వం కొన్ని సినిమాలలో హీరోకు కాన్సర్ వ్యాధి రావటం, రక్తం కక్కుకుని మరణించటం తరుచుగా జరిగేవి. కాని “గీతాంజలి’ అనే సినిమాలో కాన్సరు వచ్చిన హీరో తనలాంటి మరో రకం వ్యాధిగ్రస్తురాలిని ప్రేమిస్తాడు. తరువాత కాన్సరు వ్యాధితో హీరో మరణించిన సినిమాలు రాలేదు. అంటే ప్రేక్షకులు వాటిని ఆశించలేదు అని అర్ధం.
ఈ విధంగా సినిమా నిజంగా ఒక బలమైన ఆయుధం అని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
ముందుకాలం సినిమాల్లోని అంశాలు ఏమిటి? మీరు చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
ముందుకాలం నాటి సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలుగా ఉండేవి. కొన్ని సమాజానికి సందేశాత్మకంగా ఉండే చిత్రాలు ఉండేవి. మరికొన్ని పౌరాణికాలు ఉండేవి. నేను చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు పోలికలు.
- రెండు ఎక్కువగా కుటుంబ ప్రధాన చిత్రాలు.
- రెంటిలోనూ పౌరాణికాలు ఉన్నాయి.
- రెంటిలోనూ మంచి నటీనట వర్గం ఉంది.
తేడాలు :
నేను చూసిన సినిమాలు | గతంలోని సినిమాలు |
1. ఇవి ఎక్కువ పాటల ప్రధానమైనవి. | 1. ఇవి ఎక్కువ ఫైటింగున్నవి. |
2. ఇవి ఎక్కువ బడ్జెట్ చిత్రాలు. | 2. ఇవి తక్కువ బడ్జెట్ చిత్రాలు. |
3. ఇవి ప్రేమ ప్రధానమైనవి. | 3. ఇవి విలువలు ప్రధానమైనవి. |
4. ఇవి కొంచెం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. | 4. ఇవి అందరిచే ఆమోద యోగ్యాలు. |
5. హాస్యం అపహాస్యం అవుతోంది. | 5. హాస్యం సున్నితంగా ఉండేది. |
ప్రశ్న 5.
స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? (AS6)
జవాబు:
సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దిన పత్రికల పాత్ర :
బ్రిటీషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూమతంలో సంస్కరణలు, ‘సతి’ని నిషేధించటం, విధవా పునర్ వివాహాన్ని ప్రోత్సహించటం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుంచి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేకమంది నాయకులు పత్రికా సంపాదకులు. ‘అమృత్ బజార్ పత్రిక’ (1868లో మొదలయ్యింది) సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్, ‘బెంగాలీ’ (1833లో మొదలు) సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ, ‘ది హిందూ’ (1878లో మొదలు) సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, ‘కేసరి’ (1881లో మొదలు) సంపాదకుడు బాలగంగాధర తిలక్ ఇందులో చెప్పుకోదగిన వాళ్లు. ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటంలో వార్తా పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణా పత్రిక నిర్వహించబడింది.
మహాత్మా గాంధీ 1918లో ‘యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యత చేపట్టాడు. ఆ తరువాత గుజరాతీలో ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని ‘హరిజన్’ అనే పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీగారు పత్రికలకు బాగా విస్తృతంగా రాసేవాడు.
ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి.
ప్రశ్న 6.
తాజా అంశాలను తెలియచేసే వార్తలను దినపత్రికల నుంచి సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS1)
జవాబు:
తాజా అంశం: నేడు ఎంసెట్ ఫలితాలు
సాయంత్రం 4.30 గంటలకు విడుదలు
ఈనాడు-హైదరాబాద్ : ఎంసెట్-2013 ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వీటిని విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్జ్ విశ్వవిద్యాలయ ఆవరణలో జరగనుంది. ఫలితాల్లో మార్కులతో సహా ర్యాంకులను కూడా ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణారావు మంగళవారం వెల్లడించారు. ఫలితాలు విడుదలైన వెంటనే వాటిని విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు తెలియజేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాలు వెల్లడించే వెబ్ సైట్లు : Www.eenadu.net, apeamcet.org, educationandhra.com, vidyavision.com, manabadi.com, schools9.com, nettlinxresults.net, iitjeefoum.com, aksharam.in., resumedropbox.com etc.
ఈ ఉదాహరణ ప్రకారం తాజా వార్తలను సేకరించండి.
8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు InText Questions and Answers
8th Class Social Textbook Page No.239
ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులను వారి బాల్యంలోని నాటకాల గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కాలంలో భువన విజయం, చింతామణి, కన్యాశుల్కం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు బాగావేసేవారు.
ప్రశ్న 2.
కాలక్రమంలో నాటకాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పూర్వకాలం నాటకాలు ఎక్కువగా పౌరాణికాలు ఉండేవి. నేడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆనాటి వేదిక అలంకరణ నేడు ఆధునికంగా మారింది. నాడు నటుల గాత్రానికి చాలా విలువనిచ్చేవారు. నేడు వారు గట్టిగా మాట్లాడలేకపోయినా, మైకు వారికి సహకరిస్తున్నాయి. నాడు ఉన్న ఆదరణ నేడు లేదనే చెప్పవచ్చు.
8th Class Social Textbook Page No.240
ప్రశ్న 3.
నాటక ప్రదర్శనకు, సినిమాకు మధ్య తేడాలు ఏమిటి? పోలికలు, తేడాలతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:
పోలికలు :
- రెండూ వినోద మాధ్యమాలే.
- రెంటిలోనూ నటులే నటిస్తారు.
- రెండూ ప్రజాదరణ పొందాయి.
తేడాలు :
నాటకాలు :
ఇవి వేదికపై సజీవంగా ప్రదర్శించబడతాయి. ప్రదర్శన సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నటులు తమ స్వరాన్ని, ముఖ కవళికల్ని, ప్రేక్షకులు గ్రహించేలా అభినయించాలి. నటులు కొన్ని నెలలు ఈ నాటకాలని రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నటించడానికి నటీనటులకు ఆడిషన్ టెస్టులు కేవలం రెండు వారాలలో పూర్తి అవుతాయి.
సినిమాలు :
ఇవి రికార్డు చేయబడినవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. సినిమా తీసేముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రం రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చిత్రీకరించడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆడిషన్ టెస్టు నెలలు పడతాయి.
ప్రశ్న 4.
నాటకాల నుండి సినిమాలకు మారటం వల్ల కళాకారులు జీవనోపాధి పొందే అవకాశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:
నాటకాలకు ఎక్కువగా మంచి వాక్కు ఉన్నవాళ్ళను నటులుగా ఆదరించేవారు. వీరు సినిమాలకు మారటం వలన వీరి హావభావ ప్రదర్శన, శారీరకమైన అందచందాలు కూడా పరిగణనలోనికి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించారు. అదృష్టంతోనో, అండదండలతోనో ఈ రంగంలో రాణించినవారు మంచి జీవనోపాధిని, ఆదాయాన్ని పొందారు. లేనివారు కొంతమంది బికారులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ప్రశ్న 5.
అయిదు నిమిషాలపాటు ఎటువంటి మాటలు లేకుండా మూకాభినయం చేయండి. ఒక అయిదు నిమిషాల నాటకం వేయండి. ఈ రెండింటిలో నటనలో సౌలభ్యం, ఎంచుకోగల అంశాలు, ప్రేక్షకులకు అర్థం కావటం వంటి విషయాలను పోల్చండి. Page No.240
జవాబు:
విద్యార్థులు ఎవరికి వారుగా మూకాభినయం చేయండి. గ్రూపులవారీగా నాటకాలు వేయండి.
పోల్చుట
అంశాలు | మూకాభినయం | నాటకం |
1. నటనలో సౌలభ్యం | ఇది నటించడం కష్టం. | ప్రయత్నిస్తే తేలిక. |
2. ఎంచుకోగల అంశాలు | చిన్న, చిన్న అంశాలు, సామాజికమైనవి ఎంచుకోవాలి. | సామాజికమైన విషయాలు, పౌరాణిక , అంశాలు, హాస్యభరితమైనవి ఎంచుకోవాలి. |
3. ప్రేక్షకులకు అర్ధం కావటం | ప్రేక్షకులు మొదలైన కొద్ది సేపటికి అర్థం చేసుకోగలుగుతారు. | డైలాగ్ చెప్పిన తరువాత అర్థం అవుతుంది. |
8th Class Social Textbook Page No.241
ప్రశ్న 6.
మీ ఊళ్లో, పట్టణంలో గల వినోద సాధనాల జాబితా తయారుచేయండి. వాటి జనాదరణను ఎలా అంచనా వేస్తారు? కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులు ఏమిటి?
జవాబు:
మా ఊళ్ళో సినిమా హాళ్ళు, కళాక్షేత్రం మరియు రాజీవ్ గాంధీ పార్కు ఉన్నాయి. వీటిలో సినిమాహాళ్ళు సినిమాలు బాగుంటే లాంటివి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. కళాక్షేత్రంలో మంచి మంచి నాటకాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. వాటికి హాలు సగం, సగానికి పైన నిండుతుంది. రాజీవ్ గాంధీ పార్కుకు ఆదివారాలు, శెలవు దినాలు, వేసవి సాయంకాలాలు జనులు ఎక్కువగా వస్తారు.
ఈ మధ్యకాలంలో వీటన్నిటి కన్నా టీవీలకు, క్రికెట్ మ్యాచ్ లకు ఎక్కువ ఆదరణ పెరిగింది. పెద్దవాళ్ళు, ఆడపిల్లలు టీవీల ముందు, మగపిల్లలు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ లీనమై ఉంటున్నారు.
8th Class Social Textbook Page No.242
ప్రశ్న 7.
జాతీయోద్యమానికి సంబంధించి తీసిన మరో రెండు సినిమాలు చెప్పండి.
జవాబు:
భగత్ సింగ్, మంగళ్ పాండే.
ప్రశ్న 8.
తెలుగు సినిమాలలోని దేశభక్తి గీతాలను సేకరించండి.
జవాబు:
1. “భారతయువతా కదలిరా ||
నవయువ భారత విధాయకా.
“భారతయువతా కదలిరా ||”
2. “మేరీ దేశ్ కీ ధరతీ
సోనా ఉగలే ఉగలే హిరీమోతీ ||
3. “నా జన్మభూమి ఎంత అందమైన దేశము.
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము.”
4. “పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి”
8th Class Social Textbook Page No.243
ప్రశ్న 9.
రెండు బృందాలుగా ఏర్పడి అభిమాన సంఘాల వల్ల ప్రయోజనాలు, సమస్యల గురించి చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు : అభిమాన సంఘాలు వారి అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆకాశానికెత్తుతాయి. వారికి ఉచితంగా అడ్వర్టయిజ్ మెంటు ఇస్తారు. సినిమా 100 రోజులు ఆడటానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంతేకాక వారు సంఘపరంగా సేవాకార్యక్రమాలను చేపడతారు.
ఉదా :
రక్తదాన శిబిరాలు, ఐ క్యాంపులు మొదలగునవి.
సమస్యలు :
విపరీతమైన అభిమానం వలన సంఘాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తీవ్రమైతే అనారోగ్యకరమైన పోటీ అవుతుంది. ఒకోసారి, వీరు సినిమా గురించి అబద్దపు అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఇవి సినీ అభిమానులను నిరాశపరుస్తాయి.
ప్రశ్న 10.
మీరు ఇటీవల చూసిన సినిమాలోని కథ, సన్నివేశాలు మీబోటి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించండి. Page No.243)
జవాబు:
నేను ఇటీవల ‘బాషా’ సినిమా చూశాను. ఈ సినిమాలో హీరో ఒక పోలీసు ఆఫీసరు. కానీ అతను అండర్ కవర్ లో ఉంటాడు. ఇందులో సన్నివేశాలు ఒక పోలీసు ఆఫీసరు యిలా ఉంటారా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవి మా బోటి పిల్లలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి.
కేవలం ‘బాషా’ మాత్రమే కాదు. అన్ని సినిమాలు యిదే రీతిగా ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా ఉంటున్నాయి.
ప్రశ్న 11.
గత నెలలో వివిధ విద్యార్థులు చూసిన సినిమాల జాబితా తయారు చేయండి. వీటిల్లో హింసను బట్టి 0-5 మార్కులు వేయండి. ఏ మాత్రం హింసలేని సినిమాలకు 5 మార్కులు, ఏహ్యత పుట్టించే తీవ్ర హింస ఉన్న సినిమాలకు 0 మార్కులు వేయాలి.
జవాబు:
ఉదా : 1. శతమానం భవతి – 5
2. గౌతమీపుత్ర శాతకర్ణి – 3
3. ఖైదీ నెంబర్ – 150 – 3
4. …………………..
5. …………………..
6. …………………..
8th Class Social Textbook Page No.244
ప్రశ్న 12.
మీ ప్రాంతంలో దొరికే వివిధ రకాల దిన పత్రికలను తరగతికి తీసుకురండి. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని బృందాలుగా ఏర్పడండి. వార్తలు, విశేషాలు ఎలా పొందుపరిచారో (ఏ పేజీలో ఏముంది) విశ్లేషించండి.
జవాబు:
మా గ్రామంలోకి ఈనాడు, సాక్షి అనే రెండు పత్రికలు వస్తాయి. –
మా తరగతిలోని వారందరమూ 2 బృందాలుగా ఏర్పడ్డాము.
ఈనాడు బృందం :
దేశానికి సంబంధించిన ముఖ్య వార్త. తరువాత పేజీల వార్తలు సంక్షిప్తంగా మొదటి పేజీలో, సంపాదకీయం. 4 పేజీలకు వసుంధర అనే పేరుతో స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఆటలకు ఒక పేజీ, బిజినెస్ గురించి, అన్ని ప్రకటనలు, సినిమాల గురించి వెండితెర గురించి, టీ.వీ గురించి వివరాలు.
జిల్లా పేపర్ :
దీనిలో జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వార్తలు ఉంటాయి.
సాక్షి బృందం : సాక్షి పేపర్ 14 పేజీలు + జిల్లా పేపర్…
మొదటి పేజీలోనే దాదాపుగా ఆ రోజుకు ముఖ్యమైన వార్త అది దేశవ్యాప్తమైనది అవుతుంది. తరువాత పేజీల్లో వచ్చే ముఖ్య వార్తల్ని మొదటి పేజీలో చిన్న చిన్న వ్యాఖ్యలతో ఇచ్చి పేజీ నెంబరు ఇస్తారు. అది ఒక ఉపయోగం. తరువాత ఆ వార్తల్ని వివరంగా ఇస్తారు. టెండర్ల గురించి ప్రకటనలు. ఇక తరువాత ఫ్యామిలీ అనే పేరుతో 4 పేజీల పేపర్ ఉంటుంది. దానిలో ఒక గొప్ప వ్యక్తితో (ఏ రంగమైన) పరిచయం లేదా ఏదైనా మంచిపని చేసేవాళ్ళతో పరిచయం. పిల్లలకు కథలు, అన్నీ అంటే సోషల్ సైన్స్ మొ|| వాటిలో పిల్లలకు తెలియని విషయాలు, భక్తికి సంబంధించిన సందేశాలు, సినిమా కబుర్లు ఉంటాయి.
ఉద్యోగ అవకాశాలు, ఇంకా సంక్షిప్త వార్తలు, బిజినెస్ కు ఒక పేజీ, సెన్సెక్స్. తరువాత ఆటలకు ఒక పేజీ, చివరలో మిగిలిన అన్ని వార్తలు చాలాసార్లు ఫోటోలతో సహా జిల్లా పేపర్ లో మొదటి ముఖ్యవార్త, టెండర్, క్రైమ్, వెండితెర (సినిమా) – బుల్లితెర (ఆరోజు ప్రసారాలు) తరువాత మూడు పేజీల్లో స్థానిక వార్తలు, క్లాసిఫైడ్ (ప్రకటనలు) తరువాత విద్య (ఎంసెట్, బి.ఎడ్ మొ||) తరువాత స్థానిక వార్తలు 2 పేజీల్లో ఉంటాయి.
ప్రశ్న 13.
పైన పేర్కొన్న దిన పత్రికల సంచికలను వరుసగా వారం రోజులపాటు సేకరించండి. పై బృందాలలో ఒక్కొక్క పత్రికలో ఏ ఏరోజున ఏ ప్రత్యేక అంశాలు ప్రచురితమౌతాయో తెలుసుకోండి. ఆ వివరాలను తరగతి గదిలో పంఛుకోండి. దినపత్రికలలో ఇటువంటి అంశాలు ఎందుకు ప్రచురిస్తున్నారో కారణాలను పేర్కొనండి.
ప్రశ్న 14.
వివిధ విషయాలపై రకరకాల పత్రికలు ఉన్నాయి. మీ ఊరు / పట్టణంలో దొరికే పత్రికల పాత సంచికల నుంచి కరకాలున్నాయి ముఖచిత్ర పేజీలను సేకరించండి. వీటిని విషయాల వారీగా వర్గీకరించండి. వీటిని ఇంకే రకంగానైనా వర్గీకరించవచ్చా?
జవాబు:
ఇంకా ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని భాషనుబట్టి, కాలాన్ని బట్టి, అంశాలను బట్టి వర్గీకరించవచ్చు.
ప్రశ్న 15.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
సినిమా – వినోదరూపం :
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. ఇంతకు ముందు రేడియో, ఇప్పుడు టీవి సినిమా పాటలను విడిగా ప్రసారం చేస్తున్నాయి. సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకే వెళ్లవలసిన పనిలేకుండా పోయింది. సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్లు లేదా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
1. సినిమా కంటే ముందున్న వినోద రూపాలు ఏవి?
జవాబు:
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి.
2. సినిమా పాటలకున్న ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
వీటికి తగినంత ప్రజాదరణ ఉంది. రేడియోలు, టీవీలు వీటిని ప్రసారం చేస్తున్నాయి.
3. అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది. అందుకే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.
4. ప్రజలు వేటిని అనుకరిస్తున్నారు?
జవాబు:
ప్రజలు నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను అనుకరిస్తున్నారు.
5. సినిమాహాళ్ళకు వెళ్ళవలసిన పని ఎందుకు లేదు?
జవాబు:
సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్ళు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
ప్రశ్న 16.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
1938, 1939 లో విడుదలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ సినిమాల గురించి రంగయ్య మాటల్లో ఆనాటి ఉత్సాహం ఈనాటికీ కనపడుతోంది. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ‘మాలపిల్ల’లో ప్రధాన అంశం. దీంట్లోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతడు ఉన్నత కులాల వాళ్లకు తమ పద్ధతులను మార్చుకోమనీ, నిమ్న కులాల వాళ్లకు తాగుడు మానెయ్యమనీ, చదువుకోమనీ చెబుతుంటాడు. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండగూడదని పూజారి గుర్తిస్తాడు. దీంతో అతడు దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. పూజారి కొడుకు, దళిత అమ్మాయి పెళ్ళిని అందరూ ఆశీర్వదిస్తారు.
1. ‘మాలపిల్ల’లో ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం.
2. కథానాయకుడు ఎవరు?
జవాబు:
చౌదరయ్య.
3. ఆయన ఎవరికి మంచి చెప్పాడు?
జవాబు:
నిమ్న కులాల వాళ్ళకు.
4. ఎవరు మంటల్లో చిక్కుకున్నారు?
జవాబు:
పూజారి భార్య.
5. పూజారి ఏమి గుర్తిస్తాడు?
జవాబు:
అంటరానితనం ఉండరాదని పూజారి గుర్తిస్తాడు.
6. ఎవరికి ఆలయ ప్రవేశం జరిగింది?
జవాబు:
దళితులకు
7. ఎవరెవరికి పెళ్లి జరిగింది?
జవాబు:
పూజారి కొడుకుకి, దళిత అమ్మాయికి పెళ్లి జరిగింది.
ప్రశ్న 17.
ప్రస్తుత నాటకాలు కనుమరుగయ్యాయి. కారణం ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం నాటకాలు కనుమరుగవటానికి కారణాలు :
- సినిమాలు చూచుటకు అలవాటు పడిన ప్రజలు నాటకాలు, చూడడానికి ఆసక్తి చూపడం లేదు.
- టీ.వీల్లో సినిమాలు, సీరియల్స్ కు అలవాటు పడిన ప్రజలకు నాటకాలు రుచించడం లేదు.
- సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయభారం, చింతామణి వంటి పేరెన్నిక గల నాటకాలు నేటితరం యిష్టపడటం లేదు.
- ఈతరం యువత ఈ పద్య నాటకాలను అభ్యసించడం లేదు.
- ప్రజాదరణ లేకపోవడంతో నాటక సమాజాలు అంతరించిపోతున్నాయి.
ప్రశ్న 18.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రశంసించండి.
జవాబు:
1882లో బ్రిటిషు వాళ్లు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవులలో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోసాగారు. బ్రిటిషువాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు. 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన పోలీసు స్టేషనులపై దాడి చేశారు. గిరిజనులు తమ సాంప్రదాయ ఆయుధాలతోనూ, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోనూ పోరాటం చేయసాగారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు పాలకులు రూథర్ ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ ను పంపించింది. ఘంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు. చివరికి సీతారామరాజుని కూడా కాల్చి చంపేశారు. ఈ సినిమా వ్యాపార పరంగా ఎంతో లాభాలు ఆర్జించి పెట్టింది. దీంట్లోని ‘తెలుగు వీర లేవరా …’ పాటకి జాతీయ ఉత్తమ గీతం బహుమతి లభించింది. ఈ పాటని శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు.