AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

SCERT AP 8th Class Social Study Material Pdf 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.
జవాబు:
సరియైనవి
అ) అన్ని వృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.

ప్రశ్న 2.
గత 50 సం||రాలలో జానపద కళాకారుల జీవితాల్లో వచ్చిన మార్పులను చర్చించండి. (AS1)
జవాబు:
సినిమాలు, టెలివిజన్ వంటి ఆధునిక సమాచార, వినోద రూపాలు అందుబాటులోకి రావటంతో సంప్రదాయ ప్రదర్శన కళలకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా గతంలోమాదిరి గ్రామ పెద్దలు, భూస్వాములు ఈ కళాకారులకు పోషకులుగా ఉండటం లేదు. ఈ కారణంగా జానపద కళలు క్షీణించిపోతున్నాయి. కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీళ్లు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు. ఇక వాళ్ళకు మిగిలింది నైపుణ్యంలేని కూలిపని చేయటమే.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంతమేరకు సహాయపడుతోంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటువంటి ప్రదర్శనలలో చెప్పాల్సిన అంశాన్ని ఈ ప్రదర్శనలకు ప్రాయోజకులైన ప్రభుత్వమే అందచేస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 3.
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయా? దీనివల్ల మన సంస్కృతికి ఎటువంటి నష్టం జరుగుతుంది? (AS4)
జవాబు:
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయి. దీనివల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాన్ని కోల్పోతాయి. తరువాత తరాల వారికి వీటి గురించి తెలియకుండా పోతుంది. సాంస్కృతిక వారసత్వం ఒక దేశం యొక్క ఉనికిని నిలబెడుతుంది. అది లేకపోతే దాని ఉనికే ఉండదు.

ప్రశ్న 4.
ఆధునిక జీవితంలోని కొత్త అవసరాలకు అనుగుణంగా జానపద కళలను మలిచి వాటిని పునరుద్ధరించటం సాధ్యమవుతుందా? (AS4)
జవాబు:
సాధ్యమవదనే చెప్పాల్సి వస్తుంది. నేటి జీవనం చాలా వేగంగా ఉన్నది. టీవీలు, కంప్యూటర్లు మొదలైన వాటికి ఇంట్లో కూర్చుని చూడటానికి అలవాటు పడ్డవారు ఈ జానపద కళలను ఖర్చు పెట్టి చూస్తారా అన్నది అనుమానస్పదమే. విద్యుత్తు, ఫ్యానులు వచ్చాక విసనకర్ర అవసరం తగ్గిపోయింది. పవర్ కట్ వచ్చాక మళ్ళీ విసనకర్రలు అందరిళ్ళల్లో కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే తప్ప వీటికి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తేలేము.

ప్రశ్న 5.
సదిర్ నాటినుంచి భరతనాట్యంలో చోటుచేసుకున్న ముఖ్యమైన మార్పులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. సదిర్ నాటి తమిళనాట ఉన్న నృత్య సాంప్రదాయం.
  2. దీనిని ఆరాధనలలో భాగంగా దేవదాసీలు దేవాలయాలలో ప్రదర్శించేవారు.
  3. నట్టువనార్లు వీరికి నాట్యం నేర్పి, ప్రక్కవాయిద్యకారులుగా ఉండి అనేక రకాలుగా సహకరించేవారు.
  4. బ్రిటిషు వారి ప్రభావంతో చదువుకున్న భారతీయులు దీనిని చిన్న చూపు చూడసాగారు.
  5. తరువాత దేవదాసీ విధానం సామాజిక దురాచారంగా మారి నిషేధించబడి, అంతమైపోయింది.
  6. ఆ విధంగా 20వ శతాబ్దం ప్రారంభంనాటికి ఈ సాంప్రదాయ నృత్య రూపం అంతరించి పోయింది.
  7. లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన ఇ కృష్ణ అయ్యర్, రుక్మిణీదేవి ఈ నాట్యానికి పూర్వవైభవం తీసుకుని వచ్చారు.
  8. దేవదాసీల కుటుంబాలవారైన, తంజావూరుకు చెందిన సుబ్బరామన్ నలుగురు కుమారులు ముత్తుస్వామి దీక్షితార్ గారి సంగీతంతో కలిపి దీనిని సదిర్ నుండి భరత నాట్యంగా మార్చారు.

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాళ్ళలో దేవదానీ వ్యవస్థను సమర్థించినవాళ్లు, వ్యతిరేకించినవాళ్లు, అందులో సంస్కరణలు చేయాలన్న వాళ్లు ఎవరు? (AS1)
బాల సరస్వతి, రుక్మిణీ దేవి, వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణ అయ్యర్, బెంగుళూర్ నాగరత్నమ్మ.
జవాబు:
సమర్థించినవాళ్లు : బాల సరస్వతి , బెంగుళూరు నాగరత్నమ్మ.
వ్యతిరేకించినవాళ్లు. : వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ
సంస్కరణలు చేయాలన్న వాళ్లు : రుక్మిణీదేవి, కృష్ణ అయ్యర్

ప్రశ్న 7.
తమ కళ ద్వారా జీవనోపాధి పొందటం కళాకారులకు ఎప్పుడూ కట్టుగా ఉండేది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు.
  2. వీళ్ళు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు.
  3. చివరకు వారు వారికి అలవాటులేని పనిమీద ఆధారపడి బ్రతుకుతున్నారు.

వారికి ప్రభుత్వం మద్దతును కల్పించాలి.

  1. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఈ కళారూపాలను ఎంచుకోవడం ద్వారా కొంత సహాయం చేయవచ్చు.
  2. ప్రస్తుతం టెక్నాలజీకి అలవాటు పడిన ప్రజలు ఈ కళల గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకోసం పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అనేక అంశాలపై ప్రభుత్వం ప్రకటనలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనలను ప్రభుత్వం ఈ కళారూపాల ద్వారా టెలివిజన్లలో ఇప్పించడం ద్వారా ప్రభుత్వం వారికి ఉపాధిని కల్పించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఏవైనా మీటింగులు, బహిరంగ సభల సమయంలో ఈ కళాకారుల ద్వారా స్టేజిషోలు ఇప్పించడం వలన వారికి కొంతమేలు జరుగుతుంది. వారికి నిరుద్యోగ భృతిని కల్పించవచ్చు. అంతరించిపోతున్న కళలను కాపాడవచ్చు. తోలుబొమ్మలాట, బుర్రకథ ఒగ్గునృత్యం ఇలాంటి వాటి ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల్లో నెలకు ఒకసారి ఈ కళా ప్రదర్శనలను నిర్వహించడం వలన వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
జానపద కళలను పునరుద్ధరించడానికి కళాక్షేత్ర వంటి సంస్థలు దోహదం చేయగలవా? (AS6)
జవాబు:
చేయగలవు. కాని యివి డబ్బున్నవారికి, ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ కళను అందివ్వగలవు. కాని యదార్థ వారసులకు మాత్రం అందివ్వలేవు. ఈ విధంగా కళాక్షేత్రం వంటి సంస్థలు మిశ్రమ ఫలితాలు యివ్వగలవు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 9.
మీ ప్రాంతంలోని కళాకారులను కలిసి, వారు ప్రదర్శించే నాటకాలు, కళారూపాలతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:

నాటకాలు, కళారూపాలు అంశం
పక్షి వలస పక్షుల జీవనం
అంతం – అంతం – అంతం (నాటిక) ఎయిడ్స్ పై అవగాహన
ఫోర్త్ మంకీ (నాటిక) ఉగ్రవాదంపై అవగాహన
తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం
బుర్రకథ ప్రాచీన కళారూపం
చికాగో అడ్రస్ (నాటిక) స్వామి వివేకానంద పరిచయం

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.227

ప్రశ్న 1.
ప్రదర్శన కళల ఫోటోలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిలో ఎన్నింటిని మీరు గుర్తించగలుగుతారు? ఫోటోల కింద వాటి పేర్లు రాయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 2

ప్రశ్న 2.
వీటిలో ఏదైనా మీ ఊళ్లో ప్రదర్శింపబడటం చూశారా? మీ అనుభవాన్ని తరగతిలో పంచుకోండి.
జవాబు:
ఒకసారి శ్రీరామనవమికి మా ఊరి పందిట్లో భారతి అనే ఒక స్త్రీ భారత నాట్యాన్ని ప్రదర్శించారు. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆమె ముఖకవళికలు, అలంకరణ నాకు ఎంతో నచ్చాయి.

ప్రశ్న 3.
ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులు పాడేపాటలు, చేసే నాట్యాల గురించి మీ తల్లిదండ్రులతో, తాత, అవ్వలతో మాట్లాడి తెలుసుకోండి. సందర్భం, నమూనా పాటలతో ఒక జాబితా తయారు చేయండి. ఇటీవల కాలంలో ఈ ప్రదర్శనల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీరు తెలుసుకున్న విషయాలు తరగతిలో మిగిలిన విద్యార్థులతో పంచుకోండి?
జవాబు:

సందర్భం నమూనా పాట
1. సంక్రాంతి, గొబ్బిళ్ళు 1. కొలను దోపరికి గొబ్బియల్లో యదుకుల సామికి గొబ్బియల్లో
2. బతుకమ్మ పండుగకు 1. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలు ఆనటి కాలన ఉయ్యాలు
2. కలవారి కోడలు కలికి సుందరి కడుగు చుంది పప్పు – కడవలో పోసి వచ్చిరి వారన్నలు – వనములుదాటి
3. అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె ఒప్పులగుప్ప, ఒయ్యారిభామ సన్నబియ్యం – చాయపప్పు అట్లతద్దె ఆరట్లోయ్ ముద్దుపప్పు మూడట్లోయ్
4. హారతి పాటలు గైకొనవే హారతీ – గౌరీ పాహి అమ్మనాదుమనవి ఆలకించవమ్మా ఆ అర్ధనారీశ్వరి, అభయము నీయవే
5. దీపావళి 1. అమ్మా ! సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
2. దుబ్బు, దుబ్బు, దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి
6. దసరా దాండియా నృత్యం
7. భోగిమంటలు మంటచుట్టూ చప్పట్లు కొడుతూ నాట్యం , పాట ‘గోగులపూచే, గోగులుకాచే ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు చక్కగా విరిసే ఓ లచ్చా గుమ్మాడి.”

ఇటీవల కాలంలో చాలామంది వీటిని మోటుగా భావించి ఆచరించటం లేదు. కాని యింకా యివి మన రాష్ట్రంలో సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.229

ప్రశ్న 4.
ఊరూరూ తిరిగే కళాకారులు ప్రదర్శించేవాటిని మీరు ఏమైనా చూశారా? వాళ్లు ఎవరు, ఏం చేశారు, ప్రేక్షకులు వాళ్లపట్ల ఎలా వ్యవహరించారు వంటి వివరాలను తోటి విద్యార్థులతో పంచుకోండి.
జవాబు:
మా ఊరిలో శివరాత్రికి కళ్యాణం చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు. అందులో భాగంగా రామాయణంలో ‘లంకా దహనం’ ను తోలుబొమ్మలాటలో ప్రదర్శించారు. హనుమంతుడు ఎగురు తున్నట్లు, లంకను తగులబెట్టినట్లు, రావణుడి పదితలకాయలు, చెట్టుకింద సీతమ్మ తల్లి, ఎంత బాగా చూపించారో?

ప్రేక్షకులు అంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. తోలు బొమ్మలను ఆడించినవారు ఒక గుంపుగా మా ఊరికొచ్చారు. 2 రోజులున్నారు. 7 గురు పెద్దవాళ్ళు 3 గురు పిల్లలు వచ్చారు. మా ఊరి వాళ్ళు వాళ్ళని ఆదరంగా చూశారు. కొందరు బియ్యం, పప్పులు, కూరగాయలు, కొందరు పాత బట్టలు, కొందరు డబ్బులు ఇచ్చారు. తరువాత వాళ్ళు మా పొరుగురుకు వెళ్ళారని మా అమ్మ చెప్పింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 5.
అటువంటి కళాకారులు దగ్గరలో నివసిస్తూ ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్ల కళలు, జీవితాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా యింటి దగ్గర గంగాధరం గారి కుటుంబం నివసిస్తోంది. వాళ్ళయింట్లో గంగాధరం గారు, ఆయన కొడుకు బావమరిది ముగ్గురు బుర్రకథలు చెపుతారు. చుట్టుపక్కల ఊర్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం వారు వీరిని పిలిపిస్తారు. దీని మీద వీరికొచ్చే ఆదాయం వీరికి సరిపోదు. అందుకని సంవత్సరం పొడుగునా వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. మధ్యలో కార్యక్రమాలున్నప్పుడు వాటికి వెళతారు. వీరు వీరగాథలు, అక్షరాస్యతమీద, కుటుంబ నియంత్రణ మీద బుర్రకథలు చెబుతారు.

8th Class Social Textbook Page No.233

ప్రశ్న 6.
జాతీయ ఉద్యమకాలంలో కళాకారుల పరిస్థితులలో, వాళ్ళు ఇచ్చే ప్రదర్శనలలోని అంశాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
జవాబు:
జాతీయ ఉద్యమం తరువాత స్వాతంత్ర్య భారతంలో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కళలను ఆదరించేవారు కరువయ్యారు. రాజులు, జమీందారులు లేకపోవటం మూలనా వీరు అనాథలయ్యారు. ప్రజలకు అనేక రకాలైన వినోదాలు అందుబాటులోకి రావడం మూలంగా వీరి ప్రదర్శనలకి గిరాకీ తగ్గింది.

బుర్రకథ :
వీరు జాతీయోద్యమ కాలంలో అనేక వీరగాథలు, బ్రిటిషువారి అకృత్యాలు కంటికి కనబడేలా తెలియ చేసేవారు. కాని నేడు యివి ప్రభుత్వ ఆదరణలో అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తోలు బొమ్మలాట :
వీరు పురాణ గాథలను ఎంచుకుని ప్రదర్శించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కళాకారులలోను, కళా ప్రదర్శనలలోను అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 1

ప్రశ్న 7.
టీ.వీ, సినిమాలు ప్రధాన వినోద సాధనాలుగా మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవసరం ఉంది. మన పూర్వీకుల నుండి సంస్కృత, సంప్రదాయాలు మనకు వారసత్వంగా వచ్చాయి. ముఖ్యంగా జానపద కళల రూపంలో, అనేక వినోద సాధనాలు మన జీవితాల్లోకి వచ్చిన నేపథ్యంలో మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జానపద కళలు, మన జాతికి గర్వకారణాలు కాబట్టి వానిని కూడా కాపాడుకోవాలి.

ప్రశ్న 8.
జాతీయవాదులు, కమ్యూనిస్టులు జానపద కళలను పునరుద్ధరించడానికి ఎందుకు ప్రయత్నించారు?
జవాబు:
జాతీయవాదం, సామ్యవాదం వంటి కథలను ఇతివృత్తాలను వారు చేపట్టడం వల్ల వారిని బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు వేధించారు. పరదేశ కళలను వ్యతిరేకించి స్వదేశీ కళలను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో జాతీయవాదులు కమ్యూనిస్టులు వీటిని ప్రోత్సహించారు.

8th Class Social Textbook Page No.234

ప్రశ్న 9.
దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకించేవాళ్లు, సమర్థించేవాళ్ల మధ్య చర్చ జరుగుతోందని ఊహించుకోండి. ఇరువర్గాలు చేసే . వాదనలను పేర్కొనంది. ఈ చర్యతో ఒక చిన్న రూపకం తయారు చేయండి.
జవాబు:
రామప్ప పంతులు :
అయ్యో ! యిదేం వింత? తగుదునమ్మా అని ఈ వీరేశలింగం పంతులు గారు అన్ని విషయాల్లో చేసుకుంటున్నారు? ఏమండోయ్ గిరీశంగారు ! ఇది మహాచెడ్డ కాలం సుమండీ! లేకపోతే శుభప్రదంగా భగవంతునికి దాస్యం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తుంటే దాన్ని అమానుషం అంటారేంటండి? మీరైనా చెప్పండి ! యిలా ఈ దేవదాసీ విధానాన్ని ఆపడం పాపం కదండీ!

గిరీశం : ఏమండోయ్ రామప్ప పంతులుగారు ! నేను కూడా యాంటి-నాచ్చిలో ఉన్నానండోయ్ అది సరేగాని అదే పుణ్యమైతే మరి అందరి ఆడపిల్లల్ని పంపరేంటంట. యిది ఒక కులం వాళ్ళని, వాళ్ళ బలహీనతని భగవంతుడి పేరు చెప్పి ఉపయోగించుకోవడం అని మా అభిప్రాయం.

రామప్ప పంతులు :
అయితే మధురవాణి సంగతేంటంట? ఆమెనయితే నీవు …..

మధురవాణి : హ్పప్పు………. ఏం పంతులు బావగారు ! మధ్యలో నా పేరెత్తు తున్నారు. ఏంటి సంగతి. గిరీశం గారితో మళ్ళీ ఏవైనా గొడవలాంటిది.

రామప్ప పంతులు :
అబ్బెబ్బై … అహహ…. లేదు, లేదు మధురవాణి గిరీశం గారు యాంటి- నాచ్చి అంటుంటేనూ.

మధురవాణి : అవునండి ! గిరీశం బావగారు ఈ మధ్య మారిపోయారు. దేవదాసి విధానం మంచిది కాదని, దాని రద్దు చేయాలని, ప్రభుత్వానికి అర్టీలు కూడా పంపించారు. నిజంగానే దాని మూలంగా చాలామంది ఆడవాళ్ళు అజ్ఞాతంగా ఏడుస్తున్నారు. కాబట్టి నేను కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాను. మీ సంగతేమిటి?

రామప్ప పంతులు : అది నిజమే అనుకో. కానీ ……..

గిరీశం : డామిట్ ! కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కానీ లేదు గీనీ లేదు. మళ్ళీ కనిష్టీబు గారిని పిలవమందురా?

రామప్ప పంతులు : హాహా బలే వాడివోయ్ గిరీశం నేనేదో ఆలోచిస్తూ కానీ అన్నాను. ఇంతమంది స్త్రీలు బాధపడితే నేను మాత్రం ఎలా సహిస్తాను. రేపటి నుంచి నేను కూడా మీతోపాటు యాంటి-నాచ్చి లోనే….

మధురవాణి : మంచిది బావగారు ఇకనుంచైనా ఇతరుల మేలుకోరి బతకండి.

రామప్ప పంతులు : అదే మరి … ఇక నుంచి నన్ను బావగారు అనకు మధురవాణి.

మధురవాణి : సరే సరే …
జై కందుకూరి – జైజై కందుకూరి

8th Class Social Textbook Page No.235

ప్రశ్న 10.
దేవదాసీ జీవితం గడపటం ఇష్టం లేని ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కష్టాలు ఊహించుకోండి. ఆమె తన మిత్రురాలికి తన వ్యధను వ్యక్తపరుస్తూ ఉత్తరం రాసినట్టు ఊహించుకుని ఆ ఉత్తరం మీరు రాయండి.
జవాబు:
ప్రియమైన మీనాక్షి,

ఎలా ఉన్నావు? ఇక్కడ నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఇంతవరకు నువ్వు నాకు తోడున్నావు. యిపుడేమో ఈ కష్ట సమయంలో వేరే ఊరు వెళ్ళిపోయావు. అందుకే ఉత్తరం ద్వారా నా బాధ నీకు తెలియపరుస్తాను.

నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి నాకు చదువంటే ఎంతో యిష్టమని. ఈ మధ్య నేను చదువుకో కూడదని అమ్మా, నాన్న చాలాసార్లు అంటుండడం విన్నాను. కానీ కారణం యిపుడు తెలిసింది. నన్ను దేవదాసిని చేస్తారట. మా యిలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి ! కి నన్ను యిచ్చేస్తారుట. మా సాంప్రదాయాన్ని అనుసరించి నేను నృత్యం నేర్చుకుని దేవాలయంలో గజ్జ కట్టాలిట. నేను పెళ్ళి చేసుకోకూడదట. నన్ను ఎవరు కోరుకుంటే వారితోనే ఆ రోజు జీవితం గడపాలిట. నాకు బిడ్డలు పుడితే వారు కూడా యిలా గడపాల్సిందేట. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా మీనా ! నీకు తెలుసుగా నాకు ఇద్దరు చెల్లెళ్లు. అన్నలు, తమ్ములు లేరు. మేం అందరం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మా, నాన్నలను ఎవరు చూస్తారు. అందుకని పెళ్ళి చేయకుండా ఇలాచేస్తే వారి ముసలితనంలో వాళ్ళని నేను ఆదుకుంటానని వారి ఆశ.

నేను చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించి చూస్తానని చెప్పినా వాళ్ళు వినటం లేదు. వచ్చే నెల మొదటి గురువారం ఉదయం ముహూర్తం పెట్టారు.

మీనా నాకు యిది యిష్టం లేదు. మీ మావయ్య పోలీసుగా పనిచేస్తున్నారుగా ! నాకు సాయం చేయవూ ! ప్లీజ్ ! ఆయన్ని తీసుకుని వచ్చి మా వాళ్లకి చెప్పి భయపెట్టవూ ! లేకుంటే నువ్వు సరేనని ఉత్తరం రాయి. బస్సెక్కి నీ దగ్గరకు వచ్చేస్తా, ఏదైనా హాస్టలులో ఉండి చదువుకుంటాను. ప్లీజ్ నాకు సహాయం చేయవూ !
ఇట్లు కన్నీళ్ళతో,
నీ నేస్తం,
అరుంధతి.

8th Class Social Textbook Page No.236

ప్రశ్న 11.
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి అందులో ఎటువంటి మార్పులు చేసి ఉంటారు?
జవాబు:
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి చేసిన మార్పులు :

  1. ఈ నాట్యాన్ని మొదటిగా మార్చినవారు తంజావూరుకు చెందిన నట్టువనార్ సుబ్బరామన్ కుమారులు నలుగురు. వీరు ముత్తుస్వామి దీక్షితర్ వారి సహకారంతో సాదిరను భరతనాట్యంగా మార్చారు.
  2. ఇది విద్యాధికులు, బ్రాహ్మణులచే కూడా నేర్వబడింది.
  3. దీని ప్రదర్శనలో ఉన్న అసభ్యకరమైన అంశాలన్నింటినీ మార్పు చేసి ఉంటారు.
  4. దీనిని ముఖ్యంగా భక్తి పూరితంగా ప్రదర్శించి ఉంటారు.
  5. దేవదాసీలు పూర్వం వలే వ్యభిచారంతో సంబంధం లేకుండా కళాకారులుగా నాట్యాన్ని ప్రదర్శించి ఉంటారు.
  6. మహిళలకు బదులు పురుషులు ఎక్కువ దీనిని నేర్చుకుంటారు.
  7. మ్యూజిక్ అకాడమీ వేదిక మీద చోటు దొరకటం దీనికి మరింత గౌరవాన్ని ఆపాదించింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 12.
ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి ఇతర కులాలవాళ్లు దాన్ని హస్తగతం చేసుకోవటం ఎందుకు ముఖ్యమయ్యింది?
జవాబు:

  1. ఈ నాట్యం దేవదాసీలది.
  2. ఇది కొంత అసభ్యతతో కూడుకున్నది.
  3. తరువాత కాలంలో దేవదాసీ వ్యవస్థతోపాటు నాట్యం కూడా దురాచారంగా చూడబడింది.
  4. అందువల్ల దేవదాసీ నిషేధంతో ఈ కళ కూడా తుడిచిపెట్టుకుపోయింది.

ఈ వ్యతిరేక పరిణామాలన్నీ పక్కన పెట్టి నాట్యాన్ని కళగా చూడటానికి, ప్రదర్శించడానికి, అందరి ఒప్పుకోలు పొందడానికి ఇతర కులాలవాళ్ళు దాన్ని హస్తగతం చేసుకోవటం ముఖ్యమైంది.

ప్రశ్న 13.
ఒక వైపున సంప్రదాయంగా ఈ నాట్యం చేస్తున్న వాళ్లని దాంట్లో కొనసాగనివ్వలేదు. ఇంకోవైపున దానిని గౌరవప్రదంగా మార్చటానికి ఇతర కులాల వాళ్లు దానిని చేజిక్కించుకున్నారు. ఈ మార్పులలో ఏదైనా అన్యాయం జరిగిందా?
జవాబు:
నిజం చెప్పాలంటే భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను నిర్మూలించినా అది ఇంకా అనధికారికంగా కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వం ఈ సంప్రదాయంలోని చెడుని నిషేధించి కళను కొనసాగించేలా వారిని ప్రోత్సహిస్తే బాగుండేది. కాని యిపుడు వ్యవస్థ మారలేదు, వారికున్న కళావారసత్వం మాత్రం దూరమయ్యింది. మరి ఈ మార్పులలో అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.237

ప్రశ్న 14.
నట్టువనార్ల ప్రత్యేక పాత్ర ఏమిటి? వాళ్ల పాత్రను నాట్యం చేసే వాళ్లే చేపడితే భరతనాట్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
నట్టువనార్లు దేవదాసీలకు పుట్టిన మగ సంతానంవారే తరవాతి తరం దేవదాసీలకు గురువులయ్యే వారు. వీరు తరతరాలుగా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటే వచ్చారు. పునరుద్ధరణ సమయంలో ఇతర కులాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా దేవదాసీలు, నట్టువనార్లే శిక్షణ నిచ్చారు. నట్టువనార్లు తమ శిక్షణ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించగలిగారు. వీరి గ్రామాల పేర్లతో ప్రఖ్యాతి గాంచిన వైవిధ్య భరిత నాట్యరీతులు గుర్తింపు పొందాయి.

కాని ప్రస్తుత కాలంలో ఈ కళారూపానికి నట్టువనార్లు కాక నాట్యం చేసే వాళ్ళే సంరక్షకులుగా మారారు. దీనివలన నాట్య నాణ్యత బోధన దెబ్బ తింటోంది. నట్టువనార్ల వారసత్వం దెబ్బ తింటోంది. అంతేకాక నాట్యంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. చేసుకుంటున్నాయి. ఇది నాణ్యతను ప్రాచీనతను దెబ్బ తీస్తోంది.

ప్రశ్న 15.
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల కళపైన, కళాకారులపైన ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయడం వలన కళకున్న అభ్యంతరాలన్నీ తొలగిపోయి అది జనాధారణ పొందింది. ఇది కళాకారులను, వాద్యకారులను ఆకర్షించింది. నాట్యం వినోదం స్థాయినుండి విద్య స్థాయికి ఎదిగింది.

కళాకారులు దీనికి ఆకర్షితులయ్యారు. కులంతో సంబంధం లేకుండా కళాభిరుచి ఉన్నవారందరూ అనేక ప్రదర్శనలు యిచ్చి కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అంతేకాక తిరిగి వీరు శిక్షకులుగా మారి దీనిని, ముందుతరాలకు తీసుకుని వెళ్ళుచున్నారు.

ప్రశ్న 16.
భరతనాట్యానికి వచ్చిన విపరీత ప్రజాదరణ దానికి ఎలా తోడ్పడింది? ఏ కొత్త సమస్యలకు కారణమయ్యింది?
జవాబు:
తోడ్పాటు :
ఈ కళా రూపానికి నట్టువనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్లు సంరక్షకులుగా మారారు. పునరుద్ధరణ కాలంలో నాట్యంలో శిక్షణనిచ్చిన నట్టువనార్లే ఆ వారసత్వానికి చెందిన ఆఖరి తరం. నాట్యం నేర్చుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉండటం వల్ల శిక్షణ కేవలం నట్టువనార్లకు పరిమితం కాలేదు. కళాక్షేత్ర వంటి సంస్థలలో శిక్షకులుగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నాట్యకారులు ముందుతరాలకు దీనిని నేర్పిస్తున్నారు. అంతేకాదు చాలామంది విద్యార్థులు నాట్యకారుల నుంచి వ్యక్తిగతంగా కూడా దీనిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శనలలో నట్టువనార్లు పోషించిన పాత్రను ప్రత్యేక శిక్షణ పొందిన సంగీత వాయిద్యకారులు. నాట్యకారులు తీసుకున్నారు.

సమస్యలు :
భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. ప్రదర్శనల ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని సాధారణంగా పొందలేరు. కొన్ని మినహాయింపులు తప్పించి భరతనాట్యం ఈనాడు కుటుంబ మద్దతు ఉన్నవారికి రెండవ ఉపాధిగానే ఉంది. కొంతమంది మాత్రమే ఈ నాట్యం నేర్చుకోటానికి, నాట్యకారులుగా ఎదగటానికి తమ జీవితమంతా అంకితం చేయగలుగుతున్నారు. డబ్బులు సంపాదించటానికి నాట్యకారులు తమ వృత్తి జీవిత తొలి సంవత్సరాలలోనే దీనిని ఇతరులకు నేర్పటం మొదలు పెడుతున్నారు. ఇది వారి నాట్య నాణ్యతనే కాకుండా వారి బోధనను కూడా ప్రభావితం చేస్తుంది.

నట్టువనార్లు లేకుండా మరింతమంది నాట్యకారులు బోధకులుగా మారటంతో తరతరాలుగా సంప్రదాయంగా నాట్యరూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడింది. కొంతమంది శిక్షకుల చేతిలో కాకుండా అనేకమంది నాట్యకారులు భరతనాట్యాన్ని బోధించటం వల్ల దీంట్లో కొత్త కొత్త మార్పులు వచ్చే అవకాశాలు పెరిగాయి.

ప్రశ్న 17.
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు ఏది?
జవాబు:
1986లో నాజర్ వలీకి వచ్చిన బిరుదు పద్మశ్రీ .

ప్రశ్న 18.
నాజర్ వలీ ఎవరు?
జవాబు:
నాజర్ వలీ బుర్రకథకుడు.

ప్రశ్న 19.
నాజర్ వలీ జీవిత చరిత్ర ఏ పేరుతో విడుదలైంది?
జవాబు:
నాజర్ వలీ జీవిత చరిత్ర ‘పింజారి’ పేరుతో విడుదలైంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 20.
బుర్రకథను కోస్తా ఆంధ్రలో ఏమంటారు?
జవాబు:
బుర్రకథను కోస్తా ఆంధ్రలో జంగమకథ అంటారు.

ప్రశ్న 21.
నాట్యశాస్త్ర రచయిత ఎవరు?
జవాబు:
నాట్యశాస్త్ర రచయిత భరతుడు.