AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 11భూదానం.
AP State Syllabus 8th Class Telugu Important Questions 11th Lesson భూదానం
8th Class Telugu 11th Lesson భూదానం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది పరిచిత గద్యాంశాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)
వినోభాభావే పవనార్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర సాగించారు. అప్పటికి సుమారు 35 వేల ఎకరాల భూమి దాన రూపంలో లభించింది. భారతీయ సంస్కృతి విశేషాలతో విలసిల్లిన ఈ భూ ఖండంలో శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి ప్రజల సహకారం పూర్తిగా లభించింది. భారతీయ సంస్కృతి విశేషాలతో విలసిల్లిన ఈ భూ ఖండంలో శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి ప్రజలు సహకారం పూర్తిగా లభించింది. దేశంలో మొత్తం 30 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. ఆ మొత్తంలో 6వ భాగం ఇమ్మని కోరాను. భారతదేశంలో గల ఒక్కొక్క కుటుంబంలో సగటున ఐదు
మంది చొప్పున ఉన్నారు. ఆ కుటుంబంలో మరొకణ్ణి చేర్చుకోమని చెప్పాను. సామాన్య బీద ప్రజానీకమే ఆరో వ్యక్తి.
ప్రశ్నలు :
1. ఆరో వ్యక్తి అంటే ఎవరు?
జవాబు:
సామాన్య బీద ప్రజానీకం (పేదవాడు)
2. దేశంలో మొత్తం ఎంత భూమి ఉన్నది?
జవాబు:
30 కోట్ల ఎకరాల భూమి
3. వినోభాభావే ఎక్కడ నుండి ఎక్కడికి పాద యాత్ర సాగించారు?
జవాబు:
పవనార్ నుంచి ఢిల్లీ వరకు
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఒక్కొక్క కుటుంబంలో సగటున ఎంత మంది ఉన్నారు?
ఆ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
“జీవావరణం మీద పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో ? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి ? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా ! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ………. ఆమ్ల దర్పాలనీ. ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవమేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.
ప్రశ్నలు :
1. కాలుష్యానికి కారణం ఏమిటి?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.
2. మానవులు చెప్పేదే చేస్తున్నారా?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.
3. మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.
4. చెట్లు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
చెట్లు లేకపోతే 1) గ్రీన్ హౌజ్ ఎఫెక్టు 2) ఆమ్ల దర్పాలు కలుగుతాయి.
2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు:
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు
2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన
3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు
4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి
3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారత జాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు :
1. సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో
2. తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలుపెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి
3. సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857
4. భారతదేశం ఆంగ్లేయుల పాలనలో పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857
4. కింది గద్యాన్ని చదివి, దిగువనిచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
“విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో సంగమ వంశరాజులు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1335లో స్థాపించారు. వీరు కళలను పోషిస్తూ, కవులను ఆదరిస్తూ, ఆశ్రితులకు అగ్రహారాలు ఇస్తూ క్రీ.శ 1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్భలు అవినీతిపరులుగా మారినందువల్ల వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ నరసింహరాయలు సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి క్రీ.శ. 1485లో అధికారాన్ని హస్తగతం చేసుకొని వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు తాళ్ళపాక అన్నమయ్యగారిని సత్కరించి సంకీర్తనలను ప్రోత్సహించాడు. పిల్లలమట్టి పినవీరయ్యను పోషించి కృతి పుచ్చుకున్నాడు.
ప్రశ్నలు :
1. సంగమరాజులు ఎవరి ప్రోత్సాహంతో ఎప్పుడు, ఏ రాజ్యం స్థాపించారు?
జవాబు:
సంగమరాజులు విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో 1335లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
2. సాళువ నరసింహరాయలు ఎవరు? ఎప్పుడు అతడు విజయనగర సామ్రాజ్య పాలకుడయ్యాడు?
జవాబు:
సాళువ నరసింహరాయలు సంగమ వంశరాజుల దండనాయకుడు. ఇతడు 1485లో విజయనగర పాలకుడయ్యాడు.
3. పిల్లలమట్టి పినవీరయ్యను పోషించిన ప్రభువు ఎవరు?
జవాబు:
పిల్లలమర్రి పినవీరయ్యను సాళువ నరసింహ రాయలు పోషించాడు.
4. సంకీర్తనాచార్యుడు అన్నమయ్యకు ఏ రాజు ప్రోత్సాహం లభించింది?
జవాబు:
అన్నమయ్యకు సాళువ నరసింహరాయల ప్రోత్సాహం లభించింది.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
వినోబా పాదయాత్ర చేద్దామని ఎందుకు అనుకున్నారు?
జవాబు:
వినోబాభావే శివరాంపల్లిలో జరుగబోయే సర్వోదయ సమ్మేళనానికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. అక్కడికి రైల్లో వెళ్తే ఒక రాత్రి ప్రయాణం చేస్తే సరిపోతుంది. కాని అందమైన ప్రకృతిని, ప్రజలను దగ్గరగా చూడలేం. కాని పాదయాత్ర చేస్తే ఆయా పల్లెల్లోని సహజ పరిస్థితులను, ప్రజలు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ విధంగా ఆలోచించి వినోబాభావే పాదయాత్ర చేయాలని సంకల్పించారు.
ప్రశ్న 2.
రైలు యాత్ర, విమాన యాత్ర కంటే పాదయాత్ర మంచిదని వినోబా భావించారు కదా ! దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైలులోగాని, విమానంలోగాని ప్రయాణం చేస్తే ఆ తక్కువ సమయంలో గమ్యస్థానాలను చేరుకోవచ్చు. కాని మార్గమధ్యంలో ఉన్న సుందర ప్రదేశాలను, ప్రజల వేషభాషలను, ఆచారవ్యవహారాలను చక్కగా తెలుసుకొనే అవకాశం ఉండదు. ప్రజలకు సన్నిహితంగా కలసి మాట్లాడే అవకాశం కలుగదు. పాదయాత్ర చేసినట్లైతే ప్రకృతి అందాలను తనివితీరా ప్రజల ఇబ్బందులను తెలుసుకొనవచ్చు. సహాయ సహకారాలను ప్రజలకు అందించవచ్చు.
ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
జవాబు:
మాన్యులు దానం చేయాలి. దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని –
- స్వార్థభావన తొలగిపోతుంది. విశాలభావన కలుగుతుంది.
- సమాజంలో సమున్నత గౌరవ మర్యాదలు కలుగుతాయి.
- అనాథలను, అభాగ్యులను ఆదుకునే అవకాశం కలుగుతుంది.
- మానవసేవే మాధవసేవ అనే సమున్నత భావన కలుగుతుంది.
- నా అనే భావన తొలగి ‘మన’ అనే భావం కలుగుతుంది.
- అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైన దుర్గుణాలకు దూరంగా ఉండవచ్చు.
- అంతులేని పుణ్యాన్ని సంపాదించుకొనే అవకాశం కలుగుతుంది.
ప్రశ్న 2.
నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెలుపండి.
జవాబు:
సమాజానికి నేడు విశిష్ట వ్యక్తుల సేవల అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలో అవినీతి పేరుకుపోయింది. స్వార్థం పెచ్చుమీరిపోయింది. స్వార్థంతో ప్రగతి శూన్యమయింది. భేదభావాలు రాజ్యమేలుతున్నాయి. అన్యాయాలు, అక్రమాలు పెచ్చుమీరిపోయాయి.
దేశభక్తి, అనన్యమైన మాతృభూమి సేవ చేయగల యువత అవసరం ఉన్నది. నీతి, అవినీతి మధ్య సంఘర్షణ పెరిగిపోయింది. స్వామి వివేకానంద విశాల భారతదేశం కావాలంటే “ఇనుపకండలు, ఉక్కునరాలు కలిగిన యువత కావాలి. కార్మికులు, కర్షకులు, దేశభక్తి కలిగిన ప్రజలు నిర్మాణం కావాలి. త్యాగం, దానం మొదలైన లక్షణాలు గల మనుషులు కావాలి. సమాజానికి అర్పణ చేసే మంచి మనుషులు కావాలి. జాతీయాదర్శాలుగా దానం శోభిల్లాలి. రామరాజ్యం నిర్మాణం కావాలంటే దానగుణం గల (మనుషుల) వ్యక్తుల అవసరం ఎంతో ఉన్నది.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
వినోబా భూదానోద్యమం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
అమలాపురం, ప్రియమైన మిత్రుడు రవికి, నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది. మన దేశంలో జన్మించిన మహనీయమూర్తుల్లో వినోబా ప్రముఖులు. ఈయన చేపట్టిన భూదానోద్యమం దేశంలో ఒక సంచలనం కలిగించింది. ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయం కలిగింది. ఎంతోమంది భూస్వాములు తమ భూములను ప్రజలకు స్వచ్ఛందంగా అందించారు. ఈ మహనీయుని స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలిచింది. ఈయనను ఆదర్శంగా తీసుకొని మనము కూడా తోటివారికి సహాయం చేద్దాం. దీనిపై నీ అభిప్రాయాన్ని తెలుపుతూ జాబు ఇవ్వగలవు. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు. ఇట్లు, చిరునామా: |
ప్రశ్న 2.
దానం ఆవశ్యకతను తెలుపుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
దానం చేయి – తోడ్పాటు అందించు
దానం చేయి – పేదరికాన్ని తొలగించు
స్వార్థం మానుకొని తోడ్పాటునందించు
సంపదలను పరహితం కోసం వెచ్చించు
పేదలను ఆదుకోవాలి. మమతను చాటాలి.
మానవత్వాన్ని చాటు – మహనీయునిగా జీవించు.
దానం చేయడంలోనే మాధవత్వం
ధర్మాన్ని ఆచరించండి. అదే మిమ్ములను రక్షిస్తుంది.
8th Class Telugu 11th Lesson భూదానం 1 Mark Bits
1. వారంతా వేగంగా నడవాలనుకున్నారు. (పదాన్ని విడదీయండి) (SA. I – 2018-19)
ఎ) వా + రంతా
బి) వార + 0త
సి) వారం + తొ
డి) వారు + అంత
జవాబు:
డి) వారు + అంత
2. మా గ్రామ రైతులు వ్యవసాయం చేయగా వారి పిల్లలు తమ వ్యవసాయంతో వ్యాపారాలు చేస్తున్నారు. (నానార్థాలు గుర్తించండి) S.A.I – 2017-18)
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) ఉద్యోగం, విహారం
సి) వ్యాపారం, వేడుక
డి) నష్టపరచడం, నష్టపోవడం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం
3. అశ్వం వేగంగా పరిగెత్తుతుంది. (అర్థం గుర్తించండి) (S.A. II – 2016-17)
ఎ) సింహం
బి) చిరుత పులి
సి) బట్టె
డి) గుఱ్ఱం
జవాబు:
డి) గుఱ్ఱం
4. నా పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకో ! (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2016-17)
ఎ) షష్ఠీ తత్పురుషం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్వితీయా తత్పురుషం
డి) చతుర్థి తత్పురుషం
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుషం
భాషాంశాలు – పదజాలం
అర్థాలు :
5. యశం పొందాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యత్నం
బి) కీర్తి
సి) గొప్ప
డి) దారి
జవాబు:
బి) కీర్తి
6. రాష్ట్రం కళలకు ఆటపట్టు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దాపు
ఓ) గుట్టుగ
సి) హీనం
డి) నిలయం
జవాబు:
డి) నిలయం
7. తార్కాణంగా నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సానుకూలత
బి) ఉదాహరణ
సి) సమన్వయం
డి) సాంద్రత
జవాబు:
బి) ఉదాహరణ
8. ధనాన్ని ఆర్జన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సముదాయం
బి) విక్రయం
సి) క్రమణం
డి) సంపాదన
జవాబు:
డి) సంపాదన
9. గాంధీ ఘనకార్యం చేశాడు – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) గొప్పపని
బి) చిన్నపని
సి) మధ్యపని
డి) అధమ పని
జవాబు:
ఎ) గొప్పపని
10. కంటికెదురు అని అర్థాన్ని తెలియజేసే పదం గుర్తించండి.
ఎ) ప్రత్యక్షం
బి) పరోక్షం
సి) అపరోక్షం
డి) అంతర్నిహితం
జవాబు:
ఎ) ప్రత్యక్షం
11. పొలంలో బీజం నాటాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వృక్షం
బి) విత్తనం
సి) చీర
డి) చినుగు
జవాబు:
బి) విత్తనం
12. పండుగకు విరాళం ఇచ్చాను – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధనం
బి) విత్తం
సి) చందా
డి) ధాన్యం
జవాబు:
సి) చందా
పర్యాయపదాలు :
13. గ్రంథం చదవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పుస్తకం, పొత్తం
బి) పురుషం, పైరు
సి) కావ్యం, ధ్వని
డి) శబ్దం, ధ్వని
జవాబు:
ఎ) పుస్తకం, పొత్తం
14. తోవ బాగుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఎద, హృదయం
బి) దారి, మార్గం
సి) పథం, ఆలోచన
డి) అంతరంగం, ఆరాధన
జవాబు:
బి) దారి, మార్గం
15. చదువు అవసరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వితరణం, విరాళం
బి) ఆవశ్యకత, అక్కఱ
సి) దాపు, గుట్టు
డి) ధనం, విత్తం
జవాబు:
బి) ఆవశ్యకత, అక్కఱ
16. వ్యవసాయం చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కృషి, సేద్యం
బి) ప్రయత్నం, పరిశోధన
సి) పరిమితి, దున్ను
డి) కేదారం, కూలంకష
జవాబు:
ఎ) కృషి, సేద్యం
17. నిర్ణయం చేయాలి – గీత గీసిన పదానికి ప్యూయపదాలు గుర్తించాలి.
ఎ) ప్రగతి, పురోగతి
బి) అనునయం, అనుకరణ
సి) నిశ్చయం, సిద్ధాంతం
డి) రాద్దాంతం, పరిశీలన
జవాబు:
సి) నిశ్చయం, సిద్ధాంతం
18. ప్రయోజనం కలిగి ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పరిశోధన, ప్రగతి
బి) లాభం, ఉపయోగం
సి) సాధన, సాధికారత
డి) అనునయం, పరిశీలన
జవాబు:
బి) లాభం, ఉపయోగం
19. గుహంలో ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి.
ఎ) అవసరం, ఆవరణ
బి) గేహం, సదనం
సి) సదనం, నిర్ణయం
డి) గుండె, గురుతు
జవాబు:
బి) గేహం, సదనం
ప్రకృతి – వికృతులు
20. రాత్రి పడింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) రాయితిరి
బి) రాతిరి
సి) రాతెరి
డి) రాతిరి
జవాబు:
బి) రాతిరి
21. దమం అనుసరించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) దోమం
బి) ధర్మం
సి) థెమ్మం
డి) దైవం
జవాబు:
బి) ధర్మం
22. శాసం చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చట్టం
బి) శాసనం
సి) శాసె
డి) శస్త్రం
జవాబు:
ఎ) చట్టం
23. సంతోషంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంబరం
బి) సహచరం
సి) వేడుక
డి) సంతసం
జవాబు:
డి) సంతసం
24. పయనం అయ్యారా? – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ప్రొయాణం
బి) ప్రయాణం
సి) ప్రమోదం
డి) ట్రయాణం
జవాబు:
బి) ప్రయాణం
25. బాస నేర్వాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) బస
బి) భాష
సి) బోస
డి) బైస
జవాబు:
బి) భాష
26. కార్యం పూర్తి కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కఠోరం
బి) కఠినం
సి) కర్ణం
డి) కర్ణం
జవాబు:
సి) కర్ణం
27. జతనం చేయాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) యత్నము
బి) యాతర
సి) బాతనం
డి) జేతనం
జవాబు:
ఎ) యత్నము
నానార్థాలు:
28. వ్యవసాయం చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కృషి, ప్రయత్నం
బి) పరిశోధన, కానుక
సి) కరుణ, దయ
డి) వ్యయం, దాపు
జవాబు:
ఎ) కృషి. ప్రయత్నం
29. వర్మం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాయువు, మబ్బు
సి) వారిధి, జలధి
డి) ప్రగతి, అరుణ
జవాబు:
ఎ) వాన, సంవత్సరం
30. మిత్రుడు వచ్చాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, వారిధి
బి) సూర్యుడు, స్నేహితుడు
సి) వైరి, విరోధి
డి) పగతుడు, ఆత్నీయుడు
జవాబు:
బి) సూర్యుడు, స్నేహితుడు
31. కరంతో పనిచేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కంది, కంచు
బి) చేయి, తొండము
సి) కర్ణం, నాశిక
డి) శీర్షం, శిరం
జవాబు:
బి) చేయి, తొండము
32. గుణం పెరగాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చాలు, కులం
బి) వర్ణం, వంశం
సి) మార్గం, గోపురం
డి) స్వభావం, అల్లెత్రాడు
జవాబు:
డి) స్వభావం, అల్లెత్రాడు
వ్యాకరణాంశాలు
సంధులు :
33. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) సూర్యాస్తమయం
బి) సర్వోదయం
సి) మనోహరం
డి) తపోధనుడు
జవాబు:
బి) సర్వోదయం
34. ఊహాతీతంగా ఉంది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి
35. తేవాలని ఉంది – గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) తేవాల + అని
బి) తేవాలి + అని
సి) తేవ + అని
డి) తేవాలే + అని
జవాబు:
బి) తేవాలి + అని
36. మరొకటి ఉండాలి – గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) మర + ఒకటి
బి) మరె + ఒకటి
సి) మంచి + ఒకటి
డి) మరి + ఒకటి
జవాబు:
డి) మరి + ఒకటి
37. కష్టార్జితం ఉత్తమం – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) కష్ట + యార్జితం
బి) కష్టి + ఆర్జితం
సి) కష్ట + ఆర్జితం
డి) కష్ట + ఆర్జితం
జవాబు:
సి) కష్ట + ఆర్జితం
38. ఏ, ఓ, అర్ – అనే వాటిని గుర్తించండి.
ఎ) గుణాలు
బి) వృద్దులు
సి) సరళాలు
డి) స్థిరాలు
జవాబు:
ఎ) గుణాలు
39. వృద్ధి సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వసుధేక
బి) వసుధైక
సి) వసుధోక
డి) వసుధాక
జవాబు:
బి) వసుధైక
40. శంకరాచార్యులు మహాగురువు – గీత గీసిన పదం సంధి?
ఎ) శంకరి + ఆచార్యులు
బి) శంకరా + ఆచార్యులు
సి) శంకరో + ఆచార్యులు
డి) శంకర + ఆచార్యులు
జవాబు:
డి) శంకర + ఆచార్యులు
సమాసాలు :
41. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వ సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) సప్తమీ తత్పురుష
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం
42. పల్లె యందలి ప్రజలు దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రథమా తత్పురుష
బి) సప్తమీ తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) సప్తమీ తత్పురుష
43. వందలాదిగా వచ్చారు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) అత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి
44. కష్టార్జితం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కష్టమునకు ఆర్జితం
బి) కష్టమునందు ఆర్జితం
సి) కష్టము కొరకు ఆర్జితం
డి) కష్టము చేత ఆర్జితం
జవాబు:
డి) కష్టము చేత ఆర్జితం
గణ విభజన :
45. న గణానికి గణాలు ఏవి?
ఎ) UUI
బి) III
సి) UUU
డి) IIU
జవాబు:
బి) III
46. IUU – ఇది ఏ గణం?
ఎ) య గణం
బి) త గణం
సి) ర గణం
డి) స గణం
జవాబు:
ఎ) య గణం
47. అత్యంత – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UUI
బి) UIU
సి) TUU
డి) IIU
జవాబు:
ఎ) UUI
48. IUI – ఇది ఏ గణము?
ఎ) య గణం
బి) జ గణం
సి) స గణం
డి) న గణం
జవాబు:
బి) జ గణం
వాక్యారకాలు :
49. బాలునిచే పనిచేయబడింది – ఇది ఏ వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) నిర్ణయాత్మక వాక్యం
జవాబు:
ఎ) కర్మణి వాక్యం
50. భూదానం తప్పక చేయాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) భూదానం విధిగా చేయకూడదు
బి) భూదానం తప్పక చేయకూడదు
సి) భూదానం తప్పక చేయలేకపోవచ్చు
డి) భూదానం కొంత చేయాలి
జవాబు:
బి) భూదానం తప్పక చేయకూడదు
51. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) నిశ్చయాత్మక వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయాత్మక వాక్యం
52. శత్రర్థకం – అనగా
ఎ) వర్తమాన అసమాపక క్రియ
బి) భూతకాలిక అసమాపక క్రియ
సి) భవిష్యత్కాలక అసమాపక క్రియ
డి) విధ్యర్థక అసమాపక క్రియ
జవాబు:
ఎ) వర్తమాన అసమాపక క్రియ
53. బస్సు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏరకమైన వాక్యం?
ఎ) కరరి వాక్యం
బి) సంయుక వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
ఎ) కరరి వాక్యం
54. మీరు ఇంటికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) అనుమత్యర్థక వాక్యం
సి) నిర్ణయాత్మక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
బి) అనుమత్యర్థక వాక్యం
55. మీరు ఎక్కడ ఉన్నారు? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) నిర్ణయాత్మక వాక్యం
సి) ప్రశ్నార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
సి) ప్రశ్నార్థక వాక్యం
56. పాలు తెల్లగా ఉంటాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం
57. దయతో అనుగ్రహించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) ప్రార్ధనార్ధక వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
బి) ప్రార్ధనార్ధక వాక్యం
58. అందరు వెళ్ళాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
బి) విధ్యర్థక వాక్యం
అలంకారాలు :
59. కమలాక్షునర్చించు కరములు కరములు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఉపమ
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
సి) లాటానుప్రాస
60. ఉపమానోపమేయాలకు పోలిక చెప్పడం – ఇది ఏ అలంకారం?
ఎ) ఉపమ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
ఎ) ఉపమ
61. మీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) అంత్యానుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస
62. నీ కరుణాకటాక్ష వీక్షణములకు నిరీక్షిస్తున్నాను – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) రూపకం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస
సొంత వాక్యాలు :
63. పాదయాత్ర : రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తారు.
64. సంస్కృతి : భారతీయ సంస్కృతి సమున్నతమైనది.
65. దర్శనం : భగవంతుని దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
66. కల్పవృక్షం : ఉపాధ్యాయుడు విద్యార్థులపట్ల కల్పవృక్షం వంటివాడు.
67. ఆకాంక్ష : దేశసేవ చేయాలనే ఆకాంక్ష ఉండాలి.
68. సాక్షాత్కారం : భక్తునికి భగవంతుని దివ్య సాక్షాత్కారం కలిగింది.
69. ప్రత్యేకత : మా అమ్మగారి వంటకాలు దేనికవే ప్రత్యేకతగా ఉంటాయి.
70. ఊహాతీతం : నాకు మొదటి ర్యాంకు వచ్చినపుడు ఊహాతీతమైన ఆనందం కల్గింది.
71. హత్తుకోవడం : మా గురువుల పాఠాలు మా మనస్సులకు బాగా హత్తుకున్నాయి.
72. లోటుపాట్లు : కార్యక్రమంలో లోటుపాట్లు జరగకుండా చూడాలి.
73. నిండు హృదయం : దానం చేసేటప్పుడు నిండు హృదయంతో సంతోషంగా దానం చేయాలి.
74. కష్టార్జితం : కష్టార్జితంతో జీవించడంలో ఆనందం ఉంది.
75. అసాధారణము : దేశంలో అవినీతి అసాధారణంగా పెరిగింది.