AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
ఇంట్లో తాతగారు, మనవరాలికి పుస్తకం చూసి, పాఠం చెబుతున్నారు. మనవడు తాతగారితో ఆడుకుంటున్నాడు. తాతగారి అబ్బాయి, తాతగారి కోడలికి ఇంటి పనులలో సాయం చేస్తున్నాడు. వాళ్ళు తమ ఇంటి విశేషాల గురించి మాట్లాడుతున్నారు.

ప్రశ్న 2.
రెండవ చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
రెండవ చిత్రంలో ఇంటి యజమాని లోపలకు వచ్చే వేళకు, అతని భార్య సోఫాలో కూర్చుని, టి.వి. చూస్తోంది. వారి పిల్లవాడు కంప్యూటర్ లో ఆటలు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పుస్తకాల సంచి ఒక ప్రక్కన పడవేశాడు. వాళ్ళు టి.వి.లో చూస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?
జవాబు:
మా కుటుంబంలో నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటాము.

ప్రశ్న 4.
మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
మా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ముందు పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. మా నాన్నగారు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు. మా అమ్మగారు గృహిణి. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని. మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా నాన్నగారు పొరుగూరు స్కూలుకు బండిమీద వెళ్ళాలి. మా అమ్మ మా అందరికీ వంట చేసి పెట్టాలి. నేనూ అన్నయ్యా ఇంటి పనులలో సహాయం చేస్తాము.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కుటుంబం ఎలా ఉండాలి? మీ కుటుంబం గురించి చెప్పండి.
జవాబు:
“ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం ఒక హరివిల్లులా, అంటే ఇంద్రధనుస్సులా ఉండాలి. ఆ హరివిల్లులో తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య నాన్నమ్మలు ఒక భాగం. అప్పుడు ఆనందం తాండవిస్తుంది. కుటుంబం అనే భావన తియ్యనిది. ఆ మాట గుర్తుకు రాగానే, ఏదో తియ్యని, తెలియని హాయి కలగాలి. తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి.

మా ఇంట్లో అమ్మా, నాన్న, నేనూ, మా అన్నయ్య కలిసి ఉంటాము.

ప్రశ్న 2.
మీకు తెలిసిన సమష్టి కుటుంబాన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మా చిన్న తాతగారు పల్లెటూళ్ళో ఉంటారు. వారి ఇంట్లో తాతగారు, మామ్మ, బాబాయి, పిన్ని ఉంటారు. మా బాబాయికి ఒక ఆడపిల్ల, ఒక అబ్బాయి ఉన్నారు. ఆడపిల్ల ఇంటరు చదువుతోంది. పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు.

వాళ్ళు ఆరుగురే కలిసి ఉంటారు. వారికి వ్యవసాయం ఉంది. పాడి పశువులు ఉన్నాయి. కొబ్బరి తోటలున్నాయి. – మా తాతగారు, బాబాయి పౌరోహిత్యం చేసి సంపాదిస్తారు. అందరూ కలిసి అన్ని పనులూ చేసుకుంటారు.

వారిది పెద్ద ఇల్లు, పెద్ద ఖాళీస్థలం. వారి ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. నాలుగు గేదెలను పెంచుతారు. కావలసిన పాలు వాడుకొని, మిగిలినవి అమ్ముతారు. వారి జీవితం ఆనందంగా సాగుతోంది.

ఒకరి అవసరానికి మరొకరు సంతోషంగా సాయపడతారు. వారిది చక్కని సమష్టి కుటుంబం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది?
జవాబు:
కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు.

‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమెలసి ఉండలేరు. ఎవరిమట్టుకు వార్కి తమకు, తమ పిల్లలకు అనే భావనలు వస్తాయి.

II. చవదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలను పాఠంలో గుర్తించండి. ఆ వాక్యాలను చదవండి. వాటి గురించి చెప్పండి.

ఆశ్రమధర్మాలు, గృహస్థాశ్రమం, జీవితపథం, గార్హస్య జీవితం, సమాజ స్థితిగతులు, సంఘీభావం, సమష్టి వ్యవస్థ, ఆర్థిక స్వాతంత్ర్యం, విశ్వసనీయత, సమగ్రత.
జవాబు:
ఆశ్రమధర్మాలు :
‘గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. ” ఆశ్రమాలు నాలుగు రకాలు –
1. బ్రహ్మచర్యాశ్రమం
2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం
4. సన్యాసాశ్రమం

గృహస్థాశ్రమం :- “అంతేగాక, ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.”

గృహస్థాశ్రమం అంటే పెళ్ళి చేసుకొని భార్యాబిడ్డలతో సంసారం చేసుకుంటూ, సుఖంగా జీవించే కాలం.

జీవితపథం :
“ఈ విధమైన జీవన విధానం వల్ల జీవితపథ నిర్దేశం జరిగేది”

జీవితపథం అంటే జీవనమార్గం. అంటే ఎలా జీవించాలో తెలిపే పూర్గం. పెద్దలను చూసి వారిలాగే పిల్లలు జీవించే పద్ధతి.

గార్హస్య జీవితం :
“అందుకే ‘గార్హస్థ జీవితం’ అతిసుందరమని వారి భావన.”

గార్హస్య జీవితం అంటే, పెళ్ళి చేసుకొని పిల్లలతో సుఖంగా జీవించడం. అతిథులకు, అభ్యాగతులకు కావలసిన సదుపాయాలు చేయడం, తల్లిదండ్రులను సేవించుకుంటూ దైవారాధన చేయడం.

సమాజ స్థితిగతులు :
“సమాజ స్థితిగతులనూ, ఆచారవ్యవహారాలనూ, సంస్కృతి సంప్రదాయాలనూ పిల్లలు ప్రత్యక్షంగా విని ఆకళింపు చేసుకోనేవారు.”

సమాజ స్థితిగతులు అంటే, సంఘంలోని నేటి పరిస్థితులు, మంచి చెడ్డలు.

సంఘీభావం :
“ఈ సంఘీభావమే, దేశానికి వెన్నెముక అయ్యింది. ”

సంఘీభావం అంటే సంఘంలో ఉండే ప్రజలంతా ఏకమై తామంతా ఒకటే అన్న భావం. కలిసిమెలసి కష్టసుఖాలు పంచుకోవడం.

సమష్టి వ్యవస్థ :
“మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.”

‘సమష్టివ్యవస్థ’ అంటే కలసిమెలసి జీవించడం. – రామాయణంలో రాముని సోదరులు, లక్ష్మణభరతశత్రుఘ్నులు రామునితోనే కలసి ఉన్నారు. అలాగే పాండవులూ, కౌరవులూ సోదరులంతా సమష్టి కుటుంబంగానే జీవించారు.

ఆర్థిక స్వాతంత్ర్యం :
“ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛలకు భంగం కలగకుండా … ఒక కొత్త కుటుంబవ్యవస్థ రూపుదిద్దుకోవాలి.”

‘ఆర్థిక స్వాతంత్ర్యం’ అంటే డబ్బును స్వేచ్ఛగా వాడుకొనే హక్కు కలిగియుండడం, తనకు కావలసిన ధనాన్ని తాను ఇతరులను అడగకుండానే ఖర్చు పెట్టుకోగలగడం.

విశ్వసనీయత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘విశ్వసనీయత’ అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. కుటుంబం చక్కగా నడవడానికి కావలసిన వాటిలో విశ్వసనీయత ఒకటి.

సమగ్రత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘సమగ్రత’ అంటే ‘సంపూర్ణత’ – సమష్టి కుటుంబానికి కావలసిన మూడింటిలో ‘సమగ్రత’ ఒకటి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. పాఠం చదివి సరైన సమాధానాలను గుర్తించండి.
1) ఇల్లు అంటే ఇలా ఉండాలి.
అ) అందమైన భవనం
ఆ) అంతస్తుల భవనం
ఇ) ప్రేమానురాగాల నిలయం
ఈ) ఇవేవీ లేనిది
జవాబు:
ఇ) ప్రేమానురాగాల నిలయం

2) వేదకాలం అంటే
అ) రామాయణ భారతాల తరువాతికాలం
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం
ఇ) రామాయణ భారతాల ముందుకాలం
ఈ) కలియుగ కాలం
జవాబు:
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం

3) ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది.
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం
ఆ) భార్యకే ఎక్కువ ప్రాధాన్యం
ఇ) భర్తకే ఎక్కువ ప్రాధాన్యం
ఈ) పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం
జవాబు:
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం

4) సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడతాయి?
అ) కుటుంబం ద్వారా
ఆ) సమాజం ద్వారా
ఇ) పాఠశాల ద్వారా
ఈ) వీటన్నిటి ద్వారా
జవాబు:
అ) కుటుంబం ద్వారా

5) “అందరి సుఖంలో నా సుఖం ఉంది” దీనిలో ఏ భావన ఉంది?
అ) స్వార్థ భావన
ఆ) నిస్స్వా ర్థ భావన
ఇ) విశాల భావన
ఈ) సంకుచిత భావన
జవాబు:
ఆ) నిస్స్వా ర్థ భావన

3. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కుటుంబమంటే ఏమిటి?
జవాబు:
ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన ‘ సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం అనేది ఒక హరివిల్లు. ఆ హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలతో పాటు తాతయ్య నానమ్మలు ఒక భాగం. అలాంటి కుటుంబం అందంగా ఉండి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది. సమాజానికి కుటుంబం వెన్నెముక వంటిది.

ఆ) భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు? ఎందుకు?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది. గౌరవప్రదమైనది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. “ఇంటికి దీపం ఇల్లాలు” అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు.

పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ, సంతానాన్ని కనడం, గృహస్థాశ్రమ నిర్వహణ అనే వాటిలో స్త్రీకే ప్రాధాన్యం. అందువల్లే మన సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చారు.

ఇ) వృష్టి కుటుంబం అంటే ఏమిటి? ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు:
‘వ్యష్టి కుటుంబం’ అంటే భార్యాభర్తలూ, పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైనే, ‘వ్యష్టి కుటుంబం’ ఆధారపడి వుంటుంది. వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకొనే అధికారం లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడంవల్ల, స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది. అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.

ఈ) కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలేమిటి?
జవాబు:
1) విశ్వసనీయత 2) సమగ్రత 3) ఏకత అనే మూడు మూల స్తంభాల మీదనే మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. ‘అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం’ అనే త్యాగ భావన, భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఉ) తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిందేమిటి?
జవాబు:
తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వంటి గుణాలు ఇవ్వాలి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం నుంచి మంచి దేశం ఏర్పడుతుంది. దేశం అంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్నీ చక్కగా సిరిసంపదలతో ఉంటే, దేశం బాగా ఉన్నట్లే. కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయ జీవన సంస్కృతులు నిలుస్తున్నాయి. కాబట్టి దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక.

ఆ) “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబాలలో ఎప్పుడూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవటం జరుగుతుంది. శుభకార్యాలకు ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటారు. అందరూ పెద్దవారి పట్ల భయభక్తులతో ఉంటారు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినపుడు తల్లిదండ్రులు మందలించిన వెంటనే వారు తమ అమ్మమ్మ, నాయనమ్మల చెంత చేరతారు. వారు పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దాడతారు.

అందుకే “అసలు కంటె వడ్డీ ముద్దు” అనే సామెత పుట్టింది. అసలు అంటే తమకు పుట్టిన పిల్లలు, వడ్డీ అంటే తమ పిల్లలకు పుట్టిన పిల్లలన్నమాట. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, ఎక్కువ వడ్డీ ఇచ్చేవాళ్ళకే అప్పునిస్తారు. వాళ్ళకు అసలు కంటే వడ్డీయే ముద్దు ” తాము ఇచ్చిన అసలు అప్పు తీసుకున్నవాడు తీర్చగలడా? లేదా? అని కూడా చూడకుండా, వడ్డీపై ప్రేమతో వడ్డీ ఎక్కువ ఇస్తానన్నవాడికే వాళ్ళు అప్పు ఇస్తారు. అలాగే కుటుంబంలో పెద్దలు, కన్న పిల్లల కంటె, మనవల్నే ఎక్కువగా లాలిస్తారు అని భావం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ఇ) ‘కలిసి ఉంటే కలదు సుఖం’ దీన్ని వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాలలో ఉండదు. చిన్న కుటుంబంలో సభ్యులందరూ సంతోషాలను, బాధలను ఒకరివి ఒకరు పరస్పరం పంచుకోలేరు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మా నాన్నలు, పిల్లలతోపాటు తాతయ్య, నాన్నమ్మ కూడా కలిసి ఉంటే ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసి ఉంటే పిల్లలకు మన సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. వారు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కోరుకుంటారు. కలసిమెలసి తిరిగినపుడే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోగలరు. అలాగే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సందడిగా ఉంటుంది. మన అనే బంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంఘీభావంతో మెలుగుతారు. స్వార్థపరతకు తావు తక్కువగా ఉంటుంది. సత్ సాంప్రదాయాలు, కుటుంబపరమైన వారసత్వ భావనలు తరువాతి తరం వారికి అందుతాయి.

ఈ) యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
జవాబు:
‘యాంత్రిక జీవనం’ అంటే మన జీవన విధానంలో మనం నిత్యం చేసుకొనే పనులకు యంత్రాలను ఉపయోగించడం. ఇప్పుడు వ్యష్టి కుటుంబ పద్దతిలో తమ పనులు తామొక్కరే పూర్తి చేసుకోలేకపోతున్నారు. అందువల్ల యంత్రశక్తి వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది.

నేడు బట్టలు నేయడం, నూనెలు తీయడం వంటివి లేవు. బట్టలు ఉతకటానికి, పిండి రుబ్బటానికి, నగల తయారీకి, నీళ్ళు తోడడానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, గిన్నెలు కడగటానికి, కడిగిన చేతులు ఆరటానికి కూడా యంత్రశక్తినే వాడుతున్నారు. యంత్రశక్తి వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడౌతున్నాడు. చలాకీతనాన్ని పోగొట్టుకొని రోగాలపాలు అవుతున్నాడు. ఈ యాంత్రిక జీవన విధానం వల్ల అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి.

ఉ) పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. దేశ పౌరులుగా తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశపౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు. ఈ విధంగా పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) సమష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి? దాని పరిణామాలెలా ఉన్నాయి?
జవాబు:
సమష్టి కుటుంబంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ కలిసి ఉంటారు. సమష్టి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితో పంచుకొంటారు. ఆ విధంగా వారికి ఓదార్పు లభిస్తుంది.

ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు, సూచనలూ లభిస్తాయి. ఒకరికి ఒకరు, చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆనందాలను అందరూ పంచుకొంటారు. పిల్లలు పెద్దల ఆలనాపాలనలో వాళ్ళ కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంట్లో అందరికీ పెద్దలపట్ల భయభక్తులుంటాయి. తల్లిదండ్రుల సేవ, భగవంతుని సేవగా భావిస్తారు. ఈ జీవన విధానం వల్ల జీవిత మార్గం నిర్దేశింపబడుతుంది. పిల్లలు సమాజ స్థితిగతులనూ, ఆచార వ్యవహారాలనూ సంస్కృతీ సంప్రదాయాలనూ ప్రత్యక్షంగా ఏని, అర్థం చేసుకుంటారు.

కాని, ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం ఉండదు. స్వార్థం పెరిగిపోతుంది. అందువల్ల మార్పులు వచ్చాయి. చిన్నకుటుంబం అన్న భావన బలపడి వ్యష్టి కుటుంబవ్యవస్థగా మారింది.

ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే, వృష్టి కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. ఈ

కాని వ్యష్టి కుటుంబంవల్ల, వారసత్వ భావనలు అందవు. దేశీయ సాంస్కృతిక జీవన సంప్రదాయాలు నిలువవు. పిల్లలకు కంప్యూటర్లే ఆటపాటలవుతాయి. భావాలు సంకుచితమై, అనుభూతులు లోపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. అది, పిల్లల మనస్తత్వంపై విపరీత ప్రభావాన్ని చూపుతోంది. పెద్దవారు, వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తోంది. యంత్రశక్తి వినియోగం పెరిగిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరేగా మెలుగుతున్నారు.

ఆ) కుటుంబవ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి?
జవాబు:
ఉమ్మడి కుటుంబం, వృష్టి కుటుంబం మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం రాని ఏడంగా, ఆధిపత్యాల పోరులేని విధంగా, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా గల ఒక కొత్త కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలి.

ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు, పిల్లలకు వివరించి చెప్పాలి. పెద్దల బలాన్ని పొందాలి. బలగాన్ని పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవ శక్తి, యుక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. యంత్రశక్తి మీద ఆధారపడి బద్ధకస్తులు కాకూడదు.

కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోవాలి. ఆర్థిక సంబంధాలు, వ్యక్తిగత స్వార్థం, హక్కులు కంటె, మన బాధ్యతలు, మానవ సంబంధాలు ముఖ్యమనీ, అవి మన మనుగడకు ఆధారమనీ తెలుసుకోవాలి.

మనం చేసే పని ఏదయినా, మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్నీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచి, వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అందుకు సమష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి. ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అని గుర్తించాలి. సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబ వ్యవస్థకై అందరూ కృషి చేయాలి.

IV. పదజాలం

1. కింది పదాలకు సాధారణ అర్థాలు ఉంటాయి. కాని పాఠంలో ఏ అర్థంలో ఉపయోగించారో వివరించండి.
( అ) పునాది ఆ) పెద్దమలుపు ఇ) అవధానం ఈ) మరుగునపడిపోవడం ఉ) కనుమరుగవడం )

ఆ) పునాది :
పిల్లల సమస్త సద్గుణాలకూ, గుర్గుణాలకూ ఇల్లే పునాది అన్నారు. అంటే ఇక్కడ మూలస్తంభం అనే అర్థంలో ఈ పునాడి పదాన్ని ఉపయోగించారు.

ఆ) పెద్దమలుపు :
నాగరికత మారిన తరువాత మానవుడు గుహల నుంచి గృహంలోకి మారాడు. అదే ఒక పెద్ద మలుపు అనే సందర్భంలో ఇది వాడారు. పెద్ద మలుపు అంటే పెద్ద మార్పు.

ఇ) అవధానం :
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలందరికి ఒకేసారి భోజనాలు వడ్డించటం స్త్రీలకు అవధానం అవుతున్నది అని చెప్పు సందర్భంలో వాడతారు.
అవధానం = ఒకేసారి అన్నిటికి సమాధానాలు చెప్పటం

ఈ) మరుగునపడిపోవడం :
వ్యక్తి ప్రాధాన్యత పెరిగి సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది మరుగున పడిపోయింది అని చెప్పు సందర్భంలో వాడారు.
మరుగునపడిపోవడం = కనిపించకుండా మాయమైపోవడం

ఉ) కనుమరుగవడం :
సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది, కాని ఈ ఇల్లే ఇప్పుడు కనపడకుండా పోతోంది అనే సందర్భంలో వాడారు.
కనుమరుగవటం = కనిపించకుండా పోవడం

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది జంట పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) తల్లి-తండ్రి
జవాబు:
తల్లిదండ్రులు మనకు దైవాంశ సంభూతులు.

ఆ) ప్రేమ-అనురాగం
జవాబు:
వృద్ధాప్యంలో మనము పెద్దవారిపట్ల ప్రేమ-అనురాగాలు కలిగి ఉండాలి.

ఇ) అమ్మమ్మ-నాన్నమ్మ
జవాబు:
మేము ప్రతి పండుగరోజు అమ్మమ్మ-నాన్నమ్మలతో కలిసి ఆనందంగా గడుపుతాము.

ఈ) అందం – ఆనందం
జవాబు:
ఇంటి పెరట్లో పూల మొక్కలు పూస్తూ ఉంటే, అదే ‘అందం – ఆనందం’.

ఉ) అవస్థ – వ్యవస్థ
జవాబు:
మన అవస్థలు మారాలంటే, మన కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి.

ఊ) హక్కులు – బాధ్యతలు
జవాబు:
ప్రతివ్యక్తి, తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలిసికోవాలి.

3. కింది మాటలకు వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు గళ్ళల్లో ఉన్నాయి. వాటిని వెతికి, వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 2
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 3

అ. సహాయత × నిస్సహాయత
ఎందరో అనాథలు తమను పట్టించుకొనేవారు లేక నిస్సహాయతతో కాలం గడుపుచున్నారు.

ఆ. ఐక్యత × అనైక్యత
భారతీయ రాజుల అనైక్యత వల్లనే బ్రిటిష్ వారు మనదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు.

ఇ. సమానత్వం × అసమానత్వం
ప్రపంచ దేశాల మధ్య ఆర్థికంగా అసమానత్వం ఉంది.

ఈ. ఉత్సాహం × నిరుత్సాహం
కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు.

ఉ. ప్రాధాన్యం × అప్రాధాన్యం
మనం అప్రాధాన్య విషయాలపై సమయాన్ని వృథా చేయరాదు.

V. సృజనాత్మకత

* వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,

నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక రావాలి.

ఇట్లు,
మీ మిత్రుడు,
అఖిలేశ్వర్.

చిరునామా :
బి. అఖిల్,
S/0 బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.

(లేదా)
* తాతయ్య, నాన్నమ్మ, అమ్మానాన్నలు, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటికాలంలో ఎంతోమంది వృద్ధులను, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
(లేదా)
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేయడానికి “కరపత్రం” తయారు చేయండి.
జవాబు:
కన్నవారిని కళ్ళల్లో పెట్టి చూసుకుందాం

సోదరసోదరీమణులారా! ఒక చిన్న విన్నపం. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.

ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదనే బెంగతో, వారు క్రుంగిపోతారు.

మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి ఆదరంగా చేరదీసే తాతామామ్మలు వారికి దొరకరు. కనుక మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వీరిని ఉంచుకోండి. నిరాదరణకు గురిచేసి, వృద్ధాశ్రమాలకు పంపకండి. మరువకండి. లేదా మీకు మీ పెద్దల గతే, అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
జె.ఎమ్.ఎస్.యువజన చైతన్య సమితి.

VI. ప్రశంస

మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి/ తాతయ్యకు ఉత్తరం రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మ కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబం. నాకు అలాగే అందరూ కలిసి ఉండటం చాలా నచ్చింది. అక్కడ అందరూ పెద్దవారి మాటను అనుసరించి నడచుకుంటున్నారు. పెద్దల మాటలకు బాగా గౌరవం ఇస్తున్నారు. అలాగే పిల్లలపై పెద్దవారు చూపే ప్రేమాభిమానాలు, వారి మధ్యగల అనురాగాలు నాకు బాగా నచ్చాయి. అక్కడ నేను వారందరి మధ్య సంతోషంగా గడిపాను. నీవు కూడా మీ తాతయ్య వాళ్ళింటికి వెళ్ళావు కదా ! అక్కడి విషయాలు వివరిస్తూ లేఖ వ్రాయవలెను. ఉమ్మడి కుటుంబం వలన కలిగే ప్రయోజనాలు మనము మన స్నేహితులందరికి తెలియజేయాలి. అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
కె.రాకేష్,
S/o కె. రామ్మూర్తి,
9/83-78-6,
తోట్లవారి వీధి,
వైజాగ్.

ప్రాజెక్టు పని

* ఈనాటి మానవ సంబంధాలపై వార్తా పత్రికల్లో అనేక వార్తలు, కథనాలు వస్తుంటాయి. వాటిని సేకరించి తరగతిలో వినిపించండి.
జవాబు:
వార్తలు :
1. 90 ఏళ్ళ వయస్సున్న అన్నపూర్ణమ్మను ఇద్దరు కొడుకులు ఇంటి నుండి పంపివేశారు. అన్నపూర్ణమ్మ చెట్టు కింద ఉంటోంది. గ్రామస్థులు పెట్టింది తింటోంది.

2. భుజంగరావు తన తలిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లిదండ్రులు మనమల కోసం బెంగపెట్టుకున్నారు. అతని భార్య మాత్రం అత్తామామల రాకకు ఒప్పుకోలేదు.

VII. భాషాంశాలు

1) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
ఉదా :
శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది.
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది.

అ. మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది.
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది.

ఆ. శ్రీనిధి జడవేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది.
జవాబు:
శ్రీనిధి జడవేసుకుని, పూలు పెట్టుకుంది.

ఇ. మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది.
జవాబు:
మాధవి పాఠం చదివి, పద్యం చెప్పింది.

ఈ. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది.
జవాబు:
శివాని కళాశాలకు వెళ్ళి, పాటల పోటీలో పాల్గొన్నది.

ఉ. నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు.
జవాబు:
నారాయణ అన్నం తిని, నీళ్ళు తాగుతాడు.

ఊ. సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.
జవాబు:
సుమంత్ పోటీలకు వెళ్ళి, మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2) కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి.
ఉదా :
శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు.
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు.

అ. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు.
జవాబు:
కందుకూరి రచనలు చేశాడు. కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు.

ఆ. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాడు.
జవాబు:
రంగడు అడవికి వెళ్తాడు. రంగడు కట్టెలు తెస్తాడు.

ఇ. నీలిమ టి.వి. చూసి నిద్రపోయింది.
జవాబు:
నీలిమ టి.వి. చూసింది. నీలిమ నిద్రపోయింది.

ఈ. రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది.
జవాబు:
రజియా పాట పాడుతున్నది. రజియా ఆడుకుంటున్నది.

3) సంయుక్త వాక్యం
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది.
విమల తెలివైనది, అందమైనది.
“ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం” అంటారు.

4) సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పులను గమనించండి.
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది – రెండు నామపదాల్లో ఒకటి లోపించడం.

ఆ) అజిత అక్క శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది.

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం.

మరికొన్ని సంయుక్త వాక్యాలను రాయండి.

  1. ఆయనా, ఈయనా పెద్దవాళ్ళు.
  2. రవి కవిత్వమూ, కథలూ రాస్తాడు.
  3. అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి.
  4. శ్రీనిధి, రామూ బుద్ధిమంతులు.
  5. రాజా, గోపాలు అన్నాదమ్ములు.
  6. సీత యోగ్యురాలు, బుద్ధిమంతురాలు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అమ్మ : మాత, జనని, తల్లి
వివాహం : వివాహం, పరిణయం, ఉద్వాహం
స్వర్గం : త్రిదివం, నాకం, దివి
స్త్రీ : పడతి, స్త్రీ, ఇంతి
పక్షి : పిట్ట, పులుగు, విహంగం
వ్యవసాయం : సేద్యం, కృషి
సౌరభం : సువాసన, పరిమళం, తావి
నాన్న : జనకుడు, పిత, తండ్రి
ఇల : భూమి, వసుధ, ధరణి
పథం : దారి, మార్గం, త్రోవ
గృహం : ఇల్లు, సదనం, నికేతనం
భార్య : ఇల్లాలు, సతి, కులస్త్రీ

వ్యుత్పత్యర్థాలు

ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
మానవుడు – మనువు వల్ల పుట్టినవాడు (నరుడు)
పక్షి – పక్షములు కలది (పిట్ట)

నానార్థాలు

తాత = తండ్రి, తండ్రి తండ్రి, తల్లితండ్రి, బ్రహ్మ
గుణం = స్వభావం, అల్లెత్రాడు, ప్రయోజనం
వేదం = వెలివి, వివరణం
పాలు = క్షీరం, భాగం, సమీపం
సౌరభం = సువాసన, కుంకుమ, పువ్వు
వ్యవసాయం = కృషి, ప్రయత్నం , పరిశ్రమ
కాలం = సమయం, మరణం, నలుపు
దక్షిణం = ఒక దిక్కు సంభావన
ధర్మం = న్యాయం, ఆచారం, యజ్ఞం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకదేశమగును.

గృహస్థాశ్రమం = గృహస్థ + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
స్వావలంబన = స్వ + అవలంబన – సవర్ణదీర్ఘ సంధి
దేవాలయం = దేవ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
వృద్ధాశ్రమం = వృద + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
నిర్ణయాధికారం = నిర్ణయ + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
కాలానుగుణం = కాల + అనుగుణం – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
పరోపకారం = పర + ఉపకారం – గుణసంధి
భావోద్వేగాలు = భావ + ఉద్వేగాలు – గుణసంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమగును.
అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి
అత్యున్నత = అతి + ఉన్నత – యణాదేశ సంధి
ప్రత్యక్షం = ప్రతి + అక్షం – యణాదేశ సంధి

వృద్ధి సంధి :
సూత్రం : అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ఔ కొరమును ఏకాదేశమగును.
మమైక = మమ + ఏక = వృద్ధి సంధి
దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – వృద్ధిసంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
నాన్నమ్మ = . నాన్న + అమ్మ – అత్వసంధి
తాతయ్య = – తాత + అయ్య – అత్వసంధి
పెద్దయిన = పెద్ద + అయిన = అత్వసంధి

ఇత్వసంధి (అ) :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
మరెక్కడ = మరి + ఎక్కడ – ఇత్వసంధి
మనయ్యేది = పని + అయ్యేది – ఇత్వసంధి
ఏదైనా = ఏది + ఐనా – ఇత్వసంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
సాగిపోయిందని = సాగిపోయింది + అని – ఇత్వసంధి
ఉండేవని = ఉండేవి + అని – ఇత్వసంధి
ఉండేదని = ఉండేది + అని – ఇత్వసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఆకాశమంత =ఆకాశము + అంత – ఉత్వ సంధి
ఇల్లు + అంటే – ఉత్వసంధి
ఇల్లంటే = ఇల్లాలు = ఇల్లు – ఉత్వసంధి
వెన్నెముక = వెన్ను + ఎముక – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అక్కాచెల్లెళ్ళు అక్కయును, చెల్లెలును ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
రామాయణ భారతాలు రామాయణమును, భారతమును ద్వంద్వ సమాసం
ప్రేమానురాగాలు ప్రేమయును, అనురాగమును ద్వంద్వ సమాసం
సిరిసంపదలు సిరియును, సంపదయును ద్వంద్వ సమాసం
స్త్రీ, పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
సహాయసహకారాలు సహాయమును, సహకారమును ద్వంద్వ సమాసం
ఆచార వ్యవహారాలు ఆచారమును, వ్యవహారమును ద్వంద్వ సమాసం
భారతదేశం భారతము అను పేరుగల దేశము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆశ్రమధర్మాలు ఆశ్రమము యొక్క ధర్మాలు షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ వ్యవస్థ కుటుంబము యొక్క వ్యవస్థ షష్ఠీ తత్పురుష సమాసం
జీవనవిధానం జీవనము యొక్క విధానం షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ జీవనం కుటుంబము యొక్క జీవనం షష్ఠీ తత్పురుష సమాసం
మంత్రశక్తి మంత్రము యొక్క శక్తి షష్ఠీ తత్పురుష సమాసం
మనోభావాలు మనస్సు యొక్క భావాలు షష్ఠీ తత్పురుష సమాసం
రైతు కుటుంబాలు రైతుల యొక్క కుటుంబాలు షష్ఠీ తత్పురుష సమాసం
మంచి సమాజం మంచిదైన సమాజం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్నపిల్లలు చిన్నవైన పిల్లలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉన్నతశ్రేణి ఉన్నతమైన శ్రేణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మధురక్షణాలు మధురమైన క్షణాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాథమిక లక్షణం ప్రాథమికమైన లక్షణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రత్యక్షము అక్షము యొక్క సమూహము అవ్యయీభావ సమాసం
శ్రామికవర్గం శ్రామికుల యొక్క వర్గం షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గుణములు దుష్టములైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సద్గుణములు మంచివైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆత్మీయబంధం ఆత్మీయమైన బంధము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొత్తధోరణులు కొత్తవైన ధోరణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నాలుగు గోడలు నాలుగు సంఖ్య గల గోడలు ద్విగు సమాసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
ఆకాశం – ఆకసం
కార్యం – కర్ణం
సహజం – సాజము
వృద్ధ – పెద్ద
గర్వం – గరువము
శాస్త్రము – చట్టము
మర్యాద – మరియాద
నియమం – నేమం
గుణం – గొనం
విజ్ఞానం – విన్నానం
యంత్రం – జంత్రము
స్తంభము – కంబము
దీపము – దివ్వె
చరిత్ర – చారిత
స్త్రీ – ఇంతి
శాస్త్రం – చట్టం
రూపం – రూపు
అద్భుతము – అబ్బురము
గృహము – గీము
సంతోషం – సంతసము
ధర్మము – దమ్మము
దక్షిణం – దక్కనం
సుఖం – సుకం
త్యాగం – చాగం
స్తంభం – కంబం
భాష – బాస

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

పదాలు – అర్దాలు

లోగిలి = ಇಲ್ಲು
ఆమోదయోగ్యము = అంగీకారమునకు తగినది
వ్యవస్థ = ఏర్పాటు
ప్రాతిపదిక = మూలము
త్యాగభావన = విడిచిపెడుతున్నామనే ఊహ
కీలకము = ప్రధాన మర్మము
పునరుత్పత్తి = తిరిగి పుట్టించుట
విచక్షణ = మంచిచెడుల బేరీజు
సంస్కృతి = నాగరికత
సౌరభం = సువాసన
మక్కువ = ఇష్టము
వివేచన = మంచి చెడులను విమర్శించి తెలిసికోవడం
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
నియమబద్ధం = నియమములతో కూడినది
నానుడి = సామెత
గృహస్థ + ఆశ్రమం = భార్యాభర్తలు పిల్లలతో తల్లిదండ్రులతో నివాసం
గార్హస్థ్య జీవితం = గృహస్తుగా జీవించడం
ఆలనా పాలనా = వినడం, కాపాడడం
జీవితపథ నిర్దేశం = జీవించే మార్గాన్ని చెప్పడం
ఆకళింపుచేసుకొను = అర్ధం చేసికొను
అవధానం = ఏకాగ్రత
అక్కర = అవసరం
స్వార్థపరత = తన బాగే చూసుకోవడం
తావు = స్థలము

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

సంఘీభావం = ఐకమత్యం
ఇతిహాసాలు = భారత రామాయణాలు (పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు)
నమూనా = మాదిరి
స్వార్థం = స్వప్రయోజనం
అనివార్యము = నివారింపశక్యము కానిది
జీవన సరణి = జీవించే పద్ధతి
అనూహ్యము = ఊహింపరానిది
ధోరణులు = పద్దతులు
స్వావలంబన = తనపై తాను ఆధారపడడం
సంకుచితము = ముడుచుకున్నది
అనుభూతి = సుఖదుఃఖాదులను పొందడం
కనుమరుగు = కంటికి కనబడకుండా పోవుట
కేర్ టేకింగ్ సెంటర్లు = జాగ్రత్త తీసికొనే కేంద్రాలు
నేపథ్యం = తెరవెనుక ఉన్నది
అధిగమించి = దాటి
మనుగడ = జీవనం
విచ్ఛిన్నం = నాశనం
ఇబ్బడి ముబ్బడి = రెట్టింపు, మూడురెట్లు