AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson గుశ్వం
8th Class Telugu ఉపవాచకం 2nd Lesson గుశ్వం Textbook Questions and Answers
I. అవగాహన-ప్రతిస్పందన
కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. గుశ్వం నాటిక హాస్యంతో కూడినది. ఎందుకంటే శిష్యులు పదాలు సరిగా పలకలేక పోవడం గుఱ్ఱం బదులు : | గుల్లం అనడం నవ్వు తెప్పిస్తుంది. గుర్రంలో ‘గు’, అశ్వంలో ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పదం వారు తయారు చెయ్యడం హాస్యానికి కారణం. గుర్రానికి గుడ్డు ఉండదని కూడా తెలియని వాళ్ళ అమాయకత్వం, ఆ అయోమయాన్ని గురువు గారికి కూడా తగిలించి వాళ్ళు గుర్రం గుడ్డు తెస్తామనగానే ఆయన తలూపి పది వరహాలివ్వడం నవ్వు పుట్టిస్తుంది. బూడిద గుమ్మడికాయను గుడ్డు అని చెప్పగానే నమ్మేయడం గుమ్మడికాయ పగిలిపోతే ఆ శబ్దానికి బెదిరి కుందేలు పరుగెత్తడం చూసి ఆ కాయలోంచే కుందేలు వచ్చి ఉంటుందని వారు భావించి దానివెంట పరుగెత్తడం మరీ విడ్డూరం. ఇలా ఈ కథలో ప్రతి సన్నివేశమూ నవ్వు పుట్టిస్తుంది ఈ నాటికలో. –
ప్రశ్నలు :
1. శిష్యుల అమాయకత్వం ఎలాంటిది?
జవాబు:
గుర్రానికి గుడ్డు ఉండదని తెలియకపోవడం శిష్యుల అమాయకత్వం.
2. పరమానందయ్య శిష్యులు ఎలాంటివారు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అమాయకులు.
3. ‘గుశ్వం’ నాటిక దేనితో కూడినది ?
జవాబు:
‘గుశ్వం’ అనే నాటిక హాస్యంతో కూడినది.
4. శిష్యులు దేనిని గుర్రం గుడ్డుగా భావించారు?
జవాబు:
శిష్యులు బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగా భావించారు.
2. పరమానందయ్యగారు పేరు పొందిన గురువు. ఆయన దగ్గర శిష్యులు అమాయకులు. ఏ పని చెప్పినా అయోమయంగా చేస్తారు. వాళ్ళకు గురువుగారు ఒక రోజు గుర్రం గురించి చెప్పాలనుకున్నారు. చెన్నడు అనే శిష్యుడికి గుఱ్ఱం అని పలకమంటే అ పలకలేని చెన్నడు గుల్లం అన్నాడు. గున్నడు అనే శిష్యుడు ఇంకో పేరు చెప్పమంటే గురువు ‘అశ్వం’ అని చెప్పాడు. అశ్వమనే పేరు నాదంటే నాదని ఆ యిద్దరు కొట్లాడుకుంటూ గుర్రంలోని ‘గు’, అశ్వంలోని ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పేరు తయారుచేశారు. గురువుగారు వారిని విసుక్కుంటూ నాకు గుర్రమెక్కాలనే కోరిక తీరిక కనీసం మీకు గుర్రం గురించి చెబుదామనుకుంటే ఆ పేరు గూడ నేర్చుకోలేకపోయారు. అంటుంటే తిన్నడు అనే మరోశిష్యుడు పది వరహాలిస్తే గుర్రం గుడ్డు కొనుక్కొస్తానని చెప్పి చెన్నడు, గున్నడు ఇద్దర్నీ
వెంటబెట్టుకొని ఒక బూడిద గుమ్మడికాయను కొనుక్కొని వస్తుంటే దారిలో అది కిందపడి పగిలింది.
ప్రశ్నలు:
1. పేరు పొందిన గురువు ఎవరు?
జవాబు:
పేరు పొందిన గురువు పరమానందయ్య.
2. శిష్యులు ఏ పని చేసినా ఎలా చేస్తారు?
జవాబు:
శిష్యులు ఏ పని చేసినా అయోమయంగా చేస్తారు.
3. గుర్రాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.
4. బూడిద గుమ్మడికాయను దేనిగా భావించారు?
జవాబు:
బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగ భావించారు.
3. ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డు మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిదగుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.
ఇంతలో బూడిదగుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.
ప్రశ్నలు:
1. తిన్నడు ఎవరు?
జవాబు:
తిన్నడు పరమానందయ్య శిష్యుడు.
2. కుందేలు పిల్లను శిష్యులు దేనిగా గుర్తించారు?
జవాబు:
కుందేలు పిల్లను గుర్రం పిల్లగా గుర్తించారు.
3. పది వరహాలు ఇస్తే ఏది తెస్తామని శిష్యులు చెప్పారు?
జవాబు:
పది వరహాలు ఇస్తే గుర్రం గుడ్డును తెస్తామని చెప్పారు.
4. పెద్దమనిషి దేనిని అమ్మాడు?
జవాబు:
పెద్దమనిషి బూడిద గుమ్మడికాయను అమ్మాడు.
4. గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.
మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.
పరమానందయ్యగారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్నుతుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పిన మాట వింటుందనీ వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.
ఆ గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.
ప్రశ్నలు:
1. గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడికాయను కొన్న శిష్యుడు ఎవరు?
జవాబు:
తిన్నడు గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడ కాయను కొన్నాడు.
2. అతి తెలివిని ప్రదర్శించినది ఎవరు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అతి తెలివిని ప్రదర్శిస్తారు.
3. ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది ఎవరు?
జవాబు:
ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది శిష్యులు.
4. గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.
II వ్యక్తీకరణ – సృజనాత్మకత
కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
ఈ నాటకం వేయడానికి ఒకరు గురువుగాను, ముగ్గురు శిష్యులుగా, ఇంకొకరు పెద్దమనిషిగా ఉండాలి. నాటకంలోని సంభాషణలను అభ్యాసం చేయండి. పాత్రలకనుగుణంగా దుస్తులు ధరించాలి. అలంకరించుకోవాలి. తరగతిలో / పాఠశాలలో ప్రదర్శించాలి.
జవాబు:
నాటకం మీ తరగతిలో ప్రదర్శించండి.
ప్రశ్న 2.
“గుశ్వం” నాటకాన్ని కథగా సొంతమాటల్లో పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారికి చెన్నడు, గున్నడు అనే శిష్యులు ఉన్నారు. గురువుగారు చెన్నడికి ‘గుజ్జము’ అనే మాట చెప్పారు. అతడు దాన్ని గుల్లము అని పలుకుతాడు. అపుడు గున్నడు, చెన్నడి నోరు చిన్నదనీ గుఱ్ఱం, బండి వాడినోరు పట్టడం లేదనీ చెప్పాడు. గురువుగారు ‘అశ్వము’ అని మరో మాట చెప్పాడు. గున్నడు, చెన్నడు కలసి, గుఱ్ఱములో ‘ఱ్ఱ’ తీసి, అశ్వములోని ‘శ్వ’ అక్కడ పెట్టి, ‘గుశ్వం’ అనే మాట తయారుచేశారు. గురువుగారు అది తప్పని చెప్పి, వాళ్ళను మందలించి వారికి ‘తురగము’ అని మరో మాట చెప్పారు.
ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డును మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిద గుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.
ఇంతలో బూడిద గుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.
ప్రశ్న 3.
“గుశ్వం” నాటిక హాస్యంతో కూడినది కదా! ఎందుకో వివరంగా పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారు శిష్యుడికి ‘గుఱ్ఱం’ అనే మాట చెపితే చెన్నడనే శిష్యుడు “గుల్లము” అంటాడు. ‘గుఱ్ఱము’ అనే
మాటలో బండి ‘ఱ’ ఉంది అని గురువుగారంటే, అందుకే గుల్లము, బండి ‘ఱ’, ఒక్కసారిగా తన నోట పట్టడం లేదని శిష్యుడంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడి నోరు బొత్తిగా చిన్నదనీ, బళ్ళూ, రాళ్ళూ అసలు పట్టవని అంటాడు. ఈ మాటలు హాస్యంతో కూడినవి.
అలాగే ‘గుఱ్ఱంలో’ ఱ తీసివేసి అశ్వంలో ‘శ్వ’ ను కలిపి, శిష్యులు, ‘గుశ్వం’ అనే మాట సృష్టిస్తారు. అది కూడా హాస్యంతో కూడినదే. ఇంకో శిష్యుడు తిన్నడు గుర్రం గుడ్డుతెస్తానని పదివరహాలిచ్చి, బూడిద గుమ్మడికాయను కొని తెస్తాడు. ఆ శిష్యులకు గుర్రం గుడ్డు పెట్టదనీ, పిల్ల మాత్రమే పుడుతుందనీ తెలియకపోవడం నవ్వు పుట్టిస్తుంది. కుందేలు పిల్ల పారిపోతే, గుర్రం పిల్ల పారిపోయిందని శిష్యులు వెతకడం నవ్వు పుట్టిస్తుంది. గుర్రాన్ని కొనడం కంటె, గుర్రం గుడ్డుకొని దాని పిల్లను పెంచితే అది తమ చెప్పినమాట బాగా వింటుందనే, శిష్యుల అతితెలివిమాట కూడా నవ్వు పుట్టిస్తుంది.
గుర్రం గుడ్డును తామే పొదుగుతామని శిష్యులు అంటారు. ఆ మాట మరీ నవ్వు పుట్టిస్తుంది. గురువుగారి దగ్గర ఆ శిష్యులు చూపించే వినయమూ, వారి అతి తెలివితక్కువ మాటలూ మనకు నవ్వును తెప్పిస్తాయి. కాబట్టి “గుశ్వం” – హాస్యనాటిక.
ప్రశ్న 4.
“గుశ్వం” నాటికలోని శిష్యులు ఎలాంటివారు ? వీరి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గుశ్వం నాటికలో చెన్నడు, గున్నడు, తిన్నడు అనే ముగ్గురు శిష్యులున్నారు. వీరు అతి తెలివి తక్కువవారు. కాని వారంతా అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరంతా మూర్ఖులయిన శిష్యులు.
అందులో చెన్నడికి ‘గుఱ్ఱం’ అనే మాటలో బండి ‘ఓ’ పలకదు. ఆ మాటను ‘గుల్లము’ అంటాడు. తనకు గుల్లము బండి ఒక్కసారే నోట పట్టడం లేదంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడికి నోరు బొత్తిగా చిన్నదనీ బళ్ళు, రాళ్లు దాంట్లో పట్టవు అని అంటాడు.
గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.
మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.
పరమానందయ్య గారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్ను తుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పినమాట వింటుందని వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.
గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.
మొత్తంపై పరమానందయ్యగారి శిష్యుల మాటలూ, చేష్టలూ అడుగడుగునా నవ్వు పుట్టిస్తాయి.
ప్రశ్న 5.
పరమానందయ్య గురువుగారు, తిన్నడు, చెన్నడు, గున్నడు శిష్యులు కదా! గురుశిష్యుల మధ్య ఉండే సంబంధం గురించి తెలపండి.
జవాబు:
గురువులు పూర్వకాలంలో శిష్యులకు తామే భోజనం పెట్టి, వారికి చదువు చెప్పేవారు. శిష్యులు గురువులు చెప్పిన పనులుచేస్తూ, భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా గురువులు చెప్పే విద్యలు నేర్చుకొనేవారు.
గురుశిష్యులు ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. శిష్యులు గురువుగారినీ, గురువుగారి భార్యను ఎంతో భక్తితో సేవించేవారు. వారు చెప్పే పనులన్నీ చేసేవారు. గురువుగారి పూజకు, అగ్నిహోత్రాది విధులకు, కావలసిన సమిధలు, పూజాద్రవ్యాలు శిష్యులు తెచ్చి ఇచ్చేవారు.
గురుపత్ని శిష్యులకు కడుపునిండా భోజనం పెట్టేది. గురువుగారు శిష్యుల మంచి చెడ్డలను చూస్తూ వారికి కావలసిన విద్యలు నేర్పేవారు. చదువు పూర్తి అయిన తర్వాత గురువులకు, శిష్యులు గురుదక్షిణ సమర్పించేవారు. గురువులు ఏమి అడిగినా శిష్యులు వారికి ఇచ్చేవారు.
ఉదంకుడు అనే శిష్యుడు, పౌష్య మహారాజు భార్య కుండలాలను అడిగితెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆ విధంగా గురుదక్షిణ సమర్పించాడు. ఏకలవ్యుడు’ అనే శిష్యుడు తాను ఆరాధించే గురువు ద్రోణాచార్యునికి తన కుడిచేతి బొటనవ్రేలును గురుదక్షిణగా సమర్పించాడు.