AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 2nd Lesson స్వభాష

9th Class Telugu 2nd Lesson స్వభాష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పరభాషాపదములకర్థము తెలిసినంత మాత్రమున బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును. అది మీకసాధ్యము. తుదకిన్ని యీనాముల నమ్మి యమ్మ మెడలోని పుపూసలమ్మి – వంట యింటి పాత్రల నమ్మి – దైన్య పడి – వారములు చేసికొని – ముష్టియెత్తి సంపాదించిన – యాంగ్లేయభాషలోని పాండిత్యపుఁబస యీ రంగులోనికి దిగినది. ఈ విధముగా బ్రద్దలైనది.
ప్రశ్నలు:
1. భాషలోని వేనిని తెలుసుకోవాలి?
2. ‘ఈనాములు’ అనగానేమి?
3. ‘పాండిత్యపుఁబస’ విడదీయుము.
4. ‘అసాధ్యము’ విగ్రహవాక్యము రాయుము.
జవాబులు:
1. కళ, ప్రాణం, తత్త్వం , ఆత్మ
3. పాండిత్యము + పస
2. బహుమతిగా ఇచ్చిన భూమి
4. సాధ్యము కానిది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
ఆంధ్రభాష బొత్తిగ రానివాడతోడనే కాని మీరాంధేయమున నెన్నఁడు మాటాడవలదు. మీరు మీ మిత్రులకుత్తరము వ్రాయునప్పుడు ‘డియర్ క్రైండ్’తో నారంభించి ‘యువర్సుట్రూలీ’ తోఁ బూర్తి చేయక ‘బ్రహ్మశ్రీ’ తోడనో? ‘మహారాజశ్రీ ‘ తోడనోయారంభించి, ‘చిత్తగింపవలయును’తో బూర్తి చేయవలయును. ఆంధ్రభాష వచ్చినవాని కాంగ్లేయ భాషలో నుత్తరమెన్నఁడును వ్రాయఁకుడు. ఈ నియమములను మీరు చేసికోఁగలరా ? (అభ్యంతరమేమి యను కేకలు) నూతనముగా నచ్చుపడుచున్న యాంధ్ర గ్రంథము లెల్లను విమర్శనబుద్ధితోఁజదువుఁడు. తొందరపడి యధిక్షేపింపకుఁడు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండ రెండు గంటలు పురాణ పఠనమునఁ గాలక్షేపము చేయుఁడు. స్వభాషా పత్రికలను జూడకుండ నావలఁ బాఱవేయకుఁడు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో ‘మనభాష కక్కఱకు వచ్చు నంశము లేమియా’ యని తదేక దృష్టితోఁ జూచుచు వానిని మొదటిలోఁబదిలిపటపుఁడు.
ప్రశ్నలు:
1. తెలుగులో ఉత్తరములు రాయునపుడు మొదట వేనితో ప్రారంభించాలి?
2. ముగింపుగా ఏమి రాయాలి?
3. గ్రంథ పఠనము చేయునపుడు ఎలా చదవాలి?
4. ఏయే వారాలలో పురాణ పఠనం చేయమన్నారు?
జవాబులు:
1. బ్రహ్మశ్రీ / మహారాజశ్రీ
3. విమర్శన బుద్ధితో
2. చిత్తగింపవలయును
4. శనివారం, ఆదివారం

ప్రశ్న 3.
క్రింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. | సమాజంలో ఈనాడు కావాల్సినవి నైతిక విలువలు, అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. సత్యాన్ని మించిన దైవమే లేదన్న విశిష్ట సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్రది. హరిశ్చంద్ర నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న కాలంలో, జైలులో ఉండి రచించారు. మేనత్త సరస్వతమ్మ ద్వారా భారత, భాగవత, రామాయణాలను అర్థాలతో సహా తెలుసుకున్నారు. శివానందలహరి, బ్రహ్మరథం, మణిమంజూష మొ|| నవలలు, బుద్ధిమతి విలాసం, సత్యహరిశ్చంద్రీయం, ఉత్తర రాఘవీయం నాటకాలు బలిజేపల్లి వారి అమృతలేఖిని నుండి జాలు వారాయి. ‘కవితా కళానిధి’, ‘పుంభావ సరస్వతి’ అనే బిరుదులు వీరి పేరు పక్కన చేరి కొత్త సొబగులు సంతరించుకొన్నాయి.
ప్రశ్నలు:
1. నేటి సమాజానికి కావల్సినవి?
2. గాంధీజీ జీవితానికి స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం?
3. బలిజేపల్లి వారి మేనత్త?
4. వీరి నవలలు ఏవి?
జవాబులు:
1. నైతిక విలువలు
2. సత్యహరిశ్చంద్రీయం
3. సరస్వతమ్మ
4. శివానందలహరి, బ్రహ్మరథం, మణిమంజూష

ప్రశ్న 4.
సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే. సామెతలు ఉపయోగించుట ఒక కళ. సందర్భోచితంగా సామెతలు వాడుతూ, మాట్లాడుతుంటే – మాట్లాడేవారికి సంతోషం – వినేవారికి తృప్తి కలుగుతాయి. “సామెతల మాట – విందు వినోదాల పొందు” అందుకే సామెత లేని మాట – ఆమెత లేని యిల్లు’ అనే సామెత పుట్టింది. అనుభవజ్ఞుల నోటి నుండి మంచి ముత్యాల వానలా జారిపడిన ఈ సామెతలు ప్రజల మనసు లోతుల్ని తాకీ, ఆలోచనా స్రవంతిని కదలించి చైతన్యవంతుల్నిగా చేసే విజ్ఞాన భాండాగారాలు.
ప్రశ్నలు:
1. సామెత అనగానేమి?
2. సామెతల మాట …………… (ఖాళీ నింపండి.)
3. సామెతలు ఎక్కడ నుండి జారిపడ్డాయి?
4. సామెతలు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే …….
జవాబులు:
1. అనుభవం నేర్పిన పాఠం
2. విందు వినోదాల పొందు
3. అనుభవజ్ఞుల నోటినుండి
4. విజ్ఞాన భాండాగారాలు.

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
మాతృభాష పట్ల అభిమానంతో జంఘాల శాస్త్రి పాత్ర సృష్టించి స్వభాషా ప్రాముఖ్యాన్ని వివరించిన రచయిత గూర్చి రాయండి.
జవాబు:
పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు 11.2.1865లో రాజమండ్రి – సీతానగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. ఉన్నతవిద్య వరకూ రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలో దివానుగా కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు. సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొ||వి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘ సంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటివారు చిరస్మరణీయులు. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. వీరు 1-1-1940 న పరమపదించారు.

ప్రశ్న 2.
“వినక ఏమి చెవులు చిల్లులు పడినవా?” అని జంఘాలశాస్త్రి ఎందుకన్నాడు? ఈ మాటలను ఇంకా ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
సభాధ్యక్షుడు తనకు తెలుగురాదని, ఇష్టమైతే ఆంగ్లభాషలో మాట్లాడుతానని చెప్పాడు. అతని ప్రసంగం ముగిసిన పిదప జంఘాలశాస్త్రి తన ఉపన్యాసాన్ని ఆరంభించి ఇలా అన్నాడు- ఆ మాటలు తాను నిజంగా విన్నాడా ? లేక భ్రమపడ్డాడా? అని కాసేపు సందేహించినా తాను వాటిని విన్నాడనే నిశ్చయానికి వచ్చాడు. చెప్పేవాడు ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పినా తాము మాత్రం సిగ్గుపడేలా విన్నామని, గుండెలు పగిలేలా, మనస్సు మండేలా విన్నామని చెప్పాడు.

ఇష్టంలేని వాటిని ఎదుటివాళ్ళు చెప్పినప్పుడు ఈ మాటల్ని ఉపయోగిస్తాం. ప్రమాదం కలిగించే మాటల్ని విన్నప్పుడు వాటిని ఉపయోగిస్తాం. ఒళ్ళుమండి కోపం తారాస్థాయికి చేరినప్పుడు వాటిని వాడతాం. ఎదుటివారు అవాకులు చవాకులు పేలినప్పుడు అంటాం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 3.
‘అధిక్షేప వ్యాసం’ ప్రక్రియ గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
విషయ ప్రాధాన్యం ఉండి, ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. అధిక్షేపం అంటే ఎత్తి పొడుపు. ఇది వివిధ విషయాలపట్ల విమర్శదృష్టితో వ్యంగ్య, హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ, పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ.

ప్రశ్న 4.
స్వభాష పాఠం నేపథ్యం వివరించుము.
(లేదా )
పరభాషా వ్యా మోహంతో స్వభాష ప్రాముఖ్యాన్ని మరచిన వానిని విమర్శిస్తూ వ్రాసిన “స్వభాష” – నేపథ్యం గూర్చి రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైన ఒక పెద్దమనిషి వద్దకు వెళ్ళి, వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆయన న్యాయవాదవృత్తి చేస్తూ పేరు గడించినవాడు. ‘నేను వస్తానుగాని, తెలుగులో మాట్లాడలేను. ఇంగ్లీషులో మాట్లాడతా’నన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు. సమావేశానికి వచ్చిన ఆ పెద్దమనిషి ఆంగ్లంలో ‘దేహసాధన’ గురించి పావుగంట మాట్లాడి ‘విల్ ఎనీ జెంటిల్మన్ కమ్ ఫార్వర్డు టు స్పీక్’ అని ముగించాడు. అప్పుడా సభలోనున్న జంఘాలశాస్త్రి లేచి ఈ విధంగా ఉపన్యసించాడు.

ప్రశ్న 5.
ఆహాహా ! యేమని యేమని? మన యధ్యక్ష భగవానుని యాలాపకలాపమేమి? – అంటూ ప్రవాహంలా సాగే జంఘాలశాస్త్రి మాటకారితనాన్ని విశదీకరించుము. (S.A. III – 2015-16)
జవాబు:
జంఘాలశాస్త్రికి మాతృభాషపై మక్కువ ఎక్కువ. తెలుగులో మాట్లాడితే తక్కువ అనే భావంలో సభాధ్యక్షుడు ఆంగ్లంలో మాట్లాడతాడు. ఇంకేముంది జంఘాలశాస్త్రికి కోపం నషాళానికి అంటింది. ప్రవాహంలా సాగే తన మాటలతో సూటిగా, స్పష్టంగా చెప్పదలచిన విషయాన్ని, తన తెలుగు భాషా అభిమానాన్ని చెప్పాడు. ప్రాచీనతను ఆధునికతతో మేళవించి వ్యవహార దక్షతను చూపాడు. శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వాగ్దాటిని ప్రదర్శించాడు. యువతకు చక్కని మార్గదర్శనం చేశాడు. గొప్ప వక్తకు ఉండాల్సిన మాటకారితనాన్ని ప్రదర్శించి విద్యార్థులకు మార్గదర్శి అయ్యాడు.

ఆ) క్రింది ప్రశ్నలకు పది పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘స్వభాష’ పాఠ్యభాగ రచయితను పరిచయం చేయండి.
జవాబు:
‘స్వభాష’ పాఠ్యభాగ రచయిత శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు.

జననం : 11-02-1865 సీతానగరం (రాజమండ్రి)

మరణం : 1-1-1940

తల్లిదండ్రులు : రత్నమాంబ, వేంకటరమణయ్య

రచనలు : సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొదలైనవి.

విశేషాలు : బళ్ళారి జిల్లా ఆనెగొంది సంస్థాన దివానుగా కొంతకాలం చేసి, తరువాత పిఠాపురం సంస్థాన ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

శైలి : అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది.

ప్రత్యేకత : సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, సంఘసంస్కరణకు నడుం కట్టి, తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు.

బిరుదులు : అభినవ కాళిదాసు, ఆంధ్రా ఎడిసన్, ఆంధ్ర షేక్ స్పియర్.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
జంఘాలశాస్త్రి స్వభాష విషయంలో విద్యార్థులను ఏయే విషయాలను పాటించమని చెప్పాడో వివరించండి. (S.A. II – 2018-19)
జవాబు:
పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సంఘసంస్కరణాభిలాషతో ‘సాక్షి’ పేరుతో అనేక వ్యాసాలను రాశారు. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గూర్చి “జంఘాల శాస్త్రి” అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. జంఘాలశాస్త్రి స్వభాష విషయంలో విద్యార్థులకు సూచనగా నాయనలారా ! ఆంధ్రభాష బొత్తిగా రానివానితో తప్ప మీరు ఆంగ్లంలో మాట్లాడవద్దు. మీరు మీ మిత్రులకు ఉత్తరం రాయునపుడు ‘డియర్ ఫ్రెండ్’ అని ప్రారంభించి, ‘యువర్స్ ట్రూలి’తో పూర్తిచేయక, ‘బ్రహ్మశ్రీ’ లేదా ‘మహారాజశ్రీ’తో ఆరంభించి, ‘చిత్తగింపవలెను’ తో పూర్తి చేయండి. తెలుగుభాష వచ్చిన వారికి ఆంగ్లభాషలో ఉత్తరం ఎప్పుడూ రాయవద్దు. ఈ నియమం మీరు తప్పకూడదు. తెలుగులో వస్తున్న కొత్త గ్రంథాలను విమర్శనగా చదవండి. తొందరపడి విమర్శించకండి. శని, ఆది వారాలందు రాత్రి తప్పకుండా రెండు గంటలు పురాణ పఠన కాలక్షేపం చేయండి. తెలుగు పత్రికలను చూడండి. ఇంగ్లీషు భాషా గ్రంథాలను చదువుతున్నప్పుడు వానిలో “మన భాషకు పనికి వచ్చే అంశాలే”వని తదేక దృష్టితో చూసి, గుర్తుంచుకోండి. మీరీ నియమాలు ఏర్పాటు చేసుకొని పట్టుదలతో పాటించి, పుట్టుక చేతనే కాక, బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత ఆంధ్రులని పించుకోండి ! అంటూ సందేశమిచ్చారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన ఒక పుస్తకం గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x

ప్రియమైన మిత్రునికి,

నేనిక్కడ క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మొన్న జరిగిన నా పుట్టినరోజు వేడుకకు నీవు రాలేదు. నాకు బాధగా ఉంది. కారణం లేకుండా నీవు మానవని సరిపెట్టుకున్నాను. ఇక… ఫంక్షన్ బాగా జరిగింది. బోలెడు కానుకలు, స్వీట్స్ అందరూ ఇచ్చారు. వాటిలో ఒక పుస్తకం నాకు బాగా నచ్చింది. అది మా నాన్నగారు ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ‘బొమ్మల పంచతంత్రం’. రకరకాల పక్షులు, జంతువులు, మనుష్యుల పాత్రల ద్వారా మనుష్యులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దానిలో ఉంది. ఆపదలు వచ్చినప్పుడు ఉపాయంతో ఎలా తప్పించుకోవాలో వివరంగా, ఆసక్తికరంగా. అందులోని కథలు సాగుతాయి. నీవు కూడా ఇలాంటి పుస్తకం కొని చదువు. మీ పెద్దలకు నా నమస్కారాలు తెలియజేయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్,
9 వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
తెనాలి, గుంటూరు జిల్లా,

చిరునామా :
యస్. నాగలక్ష్మణ శర్మ,
S/o. పూర్ణాచంద్రశాస్త్రి,
ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

ప్రశ్న 2.
తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలుపుతూ విదేశీ మిత్రునికి లేఖ రాయండి. (S.A. I -2018-19)
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియమైన మిత్రుడు బాలు,

నేను క్షేమం, నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. చిన్నప్పటి నుండి స్నేహితులమైన మనం ఈనాడు మీ నాన్నగారు విదేశాలలో స్థిరపడాలనే కోరికతో దూరం అయ్యాం. కానీ మనం ఒకరిమీద మరొకరి అవ్యాజమైన స్నేహబంధం వల్ల ఇలా ఉత్తరాల ద్వారా మాట్లాడుకొంటున్నాం. నీవు అక్కడి ఆంగ్లం మోజులో పడి తెలుగును మరువద్దు. తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నీవు వెళ్ళడానికి ప్రయత్నించు. తెలుగు లేని జీవితం, వెలుగు లేని ఇల్లు లాంటిది. తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారని నీకు తెలుసు కదా ! అక్కడున్న నీతోటి పిల్లలందరికి నీవు నేర్చుకున్న తెలుగు పద్యాలను నేర్పు. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు. తిరిగి జాబు రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
యస్. బాలసుబ్రహ్మణ్యం, 9వ తరగతి
S/o పూర్ణచంద్రశాస్త్రి,
న్యూ వాషింగ్టన్, అమెరికా.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. వ్యుత్పత్త్యర్థాలు :

1. అక్షరం = నాశనము పొందనిది – వర్ణం
2. శివుడు = సాధుల హృదయమున శయనించి యుండువాడు, మంగళప్రదుడు – ఈశ్వరుడు
3. పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి కలవాడు (పండ = బుద్ధి) – విద్వాంసుడు

2. సంధులు :

1. అమూల్యాలంకారాలు : అమూల్య + అలంకారాలు = సవర్ణదీర్ఘ సంధి
2. అగ్రాసనాధిపతి = అగ్ర + ఆసన + అధిపతి = సవర్ణదీర్ఘ సంధి
3. శిలాక్షరం = శిల + అక్షరం = సవర్ణదీర్ఘ సంధి
4. యథార్థం = యథా + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
5. తాత్కాలికోన్మాదం = తాత్కాలిక + ఉన్మాదం = గుణసంధి
6. భాషోచ్చారణ = భాష + ఉచ్ఛా రణ = గుణసంధి
7. కంఠోక్తి = కంఠ + ఉక్తి = గుణసంధి
8. తదేక = తత్ + ఏక = జశ్త్వసంధి
9. నిస్సందేహము = నిః + సందేహము = విసర్గ సంధి
10. వాగోరణి = వాక్ + ధోరణి = జశ్త్వసంధి
11. దైన్యపడి = దైన్యము + పడి = పడ్వాది సంధి
12. శతాబ్దము = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
13. రవంత = రవ + అంత = అత్త్వసంధి
14. వాగ్వాహినీ = వాక్ + వాహినీ = జశ్త్వసంధి
15. పండితాగ్రణులు = పండిత + అగ్రణులు = సవర్ణదీర్ఘ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

3. సమాసాలు:

మాతాపితలు = మాతయు, పితయు – ద్వంద్వ సమాసం
పండితాగ్రణులు = పండితులలో శ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
శ్రీసూక్తి = మంగళకరమైన నీతివాక్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మాతృభాష = తల్లి యొక్క భాష – షష్ఠీ తత్పురుష సమాసం
అనర్హం = అర్హము కానిది – నఞ్ తత్పురుష సమాసం
అనుచితం = ఉచితం కానిది – నఞ్ తత్పురుష సమాసం
నిస్సందేహం = సందేహం లేనిది – నఞ్ తత్పురుష సమాసం
వాగౌరణులు = మాట యొక్క తీరులు – షష్ఠీ తత్పురుష సమాసం
ఏబది సంవత్సరాలు = ఏబది సంఖ్య గల సంవత్సరాలు – ద్విగు సమాసం (అర్ధ శతాబ్దం)

9th Class Telugu 2nd Lesson స్వభాష 1 Mark Bits

1. నీవు చెప్పిన మాటలు ఆశ్చర్యము కలిగించాయి – (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) అచ్చెరువు
బి) ఆచెరువు
సి) అచెరువు
డి) అస్చెరువు
జవాబు:
ఎ) అచ్చెరువు

2. అక్షరం జిహ్వ కిక్షురసం వంటిది – (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) నాశన మగునది
బి) నాశనము పొందినది
సి) నాశనం కలిగినది
డి) నాశనం లేనిది
జవాబు:
డి) నాశనం లేనిది

3. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. (గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ప్రథమ తత్పురుష సమాసం
బి) ద్వితీయ తత్పురుష సమాసం
సి) చతుర్డీ తత్పురుష సమాసం
డి) నఞ్ తత్పురుష సమాసం
జవాబు:
డి) నఞ్ తత్పురుష సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

4. ఆయన నడుస్తూ పాటలు వింటున్నాడు. (ఇది ఏ రకమైన వాక్యం) (S.A. I – 2018-19)
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) క్వార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం

5. కింది వాటిలో క్వార్థక క్రియ గుర్తించండి.
ఎ) వేడుకొన్నది
బి) పాల్గొన్నది
సి) చూసి
డి) వెళ్తూ
జవాబు:
సి) చూసి

6. మీ సభా కార్యక్రమము నంతయు జెడగొట్టితిని. (ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (S.A. II – 2018-19)
ఎ) మా సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టలేదు.
బి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టాను.
సి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టకూడదు.
డి) మీ సభా కార్యక్రమం అంతా చెడకొట్టబడింది.
జవాబు:
బి) మీ సభా కార్యక్రమాన్నంతా చెడకొట్టాను.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

7. “నేనొక్కడినే అదృష్ట వంతుడినా”? అన్నాడు జంఘాలశాస్త్రి (పరోక్ష కథనాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) తానొక్కడినే దురదృష్ట వంతుడినా ! అని అన్నాడు జంఘాలశాస్త్రి
బి) జంఘాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినా అని అన్నాడు.
సి) తానొక్కడినే అదృష్టవంతుడినా అని జంఘాలశాస్త్రి అనలేదు.
డి) జంఘాల శాస్త్రి తనకు తాను అదృష్టవంతుడనని ప్రకటించుకున్నాడు.
జవాబు:
బి) జంఘాల శాస్త్రి తానొక్కడినే అదృష్టవంతుడినా అని అన్నాడు.

8. శృతి సంగీతము విని, ఆనందించినది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకము
బి) క్వార్థకము
సి) చేదర్థకము
డి) అభ్యర్థకము
జవాబు:
బి) క్వార్థకము

9. పాఠాలు చదివితే, విషయం అర్థమౌతుంది (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) తుమున్నరకము
బి) వ్యతిరేకార్థకము
సి) భావార్థకము
డి) చేదర్థకము
జవాబు:
డి) చేదర్థకము

10. ఈ విధముగా బ్రద్దలైనది. (ఆధునిక వచనాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఈ విధంగా బద్దలైంది
బి) ఈ విధమ్ముగా బద్దలైనది
సి) ఈ విధంబుగా బ్రద్దలైంది
డి) ఈ విధమ్ముగా బ్రద్దలుఐనది
జవాబు:
ఎ) ఈ విధంగా బద్దలైంది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

11. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) “నరేశ్ రాడు”, అని అన్నాడు రఘు.
బి) “తాను రాడు”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
సి) “నేను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
డి) “తాను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.
జవాబు:
సి) “నేను రాను”, అని నరేశ్ రఘుతో అన్నాడు.

12. కవిత గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకొంది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) సంయుక్తం
బి) ఆశీర్వార్థకం
సి) ప్రశ్నార్థకం
డి) సంక్లిష్టం
జవాబు:
డి) సంక్లిష్టం

13. వానలు వస్తే పంటలు పండుతాయి. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (S.A. II – 2017-18)
ఎ) చేదర్థకం
బి) తమున్నర్థకం
సి) భావార్థకం
డి) వ్యతిరేకార్థకం
జవాబు:
ఎ) చేదర్థకం

14. అనుచితమనుమాట నిస్సందేహము (ఆధునిక వచనంలోకి మార్చిన వాక్యం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) అనుచితమనుమాట నిస్సందియము.
బి) అనుచితమనెడిమాటయు నిస్సందేహము.
సి) అనుచితం అనేమాట నిస్సందేహం.
డి) అనుచితం అనేమాట సందేహం.
జవాబు:
సి) అనుచితం అనేమాట నిస్సందేహం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

15. వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. (ఈ రెండు వాక్యాలను చేదర్థక వాక్యంగా మార్చినది గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) వర్షాలు కురిసి పంటలు పండుతాయి.
బి) వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.
సి) వర్షాలు కురవక పంటలు పండుతాయి.
డి) వర్షాలు కురవక పంటలు పండలేదు.
జవాబు:
బి) వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

16. సామెత లేని మాట. ఆమెత లేని ఇల్లు ఉండవు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గోడలు
B) కిటికీలు
C) విందు
D) గది
జవాబు:
C) విందు

17. అధిక్షేపము ఒక ప్రక్రియ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎత్తిపొడుపు
B) పొత్తికడుపు
C) నత్తిమాట
D) పొగడ్త
జవాబు:
A) ఎత్తిపొడుపు

18. రాజులు పండితులకు ఈనాములిచ్చారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) మాన్యం
B) సామాన్యం
C) అన్యం
D) వస్త్రం
జవాబు:
A) మాన్యం

19. తొందరపడి ఎవరినీ ‘అధిక్షేపించకూడదు’ – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) ఆక్షేపించు
B) మెచ్చుకొను
C) స్తుతించు
D) కొట్టు
జవాబు:
A) ఆక్షేపించు

20. తెలుగు నేర్చుకోడానికి ఇంగ్లీషు భాషాభ్యాసమునకు పడే శ్రమలో పదవ వంతు అక్కఱ లేదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కఱ్ఱ
B) ధనము
C) కష్టము
D) శ్రమ
జవాబు:
C) కష్టము

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

21. నీవు నిస్సందేహముగా ఈ పని చేయగలవు – గీత గీసిన పదానికి అర్థము ఏది?
A) సందేహము
B) నిశ్శంకము
C) నిక్కచ్చి
D) తప్పక
జవాబు:
B) నిశ్శంకము

2. పర్యాయపదాలు :

22. సూక్తి చెప్పేవాడి కన్నా, ఆచరించి చెప్పేవాడు మిన్న – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మంచిమాట, ఆట
B) మంచిమాట, నీతి వాక్యం
C) నీతివాక్యం, తిట్టు
D) ఆట, పాట
జవాబు:
B) మంచిమాట, నీతి వాక్యం

23. తల్లి గర్భం నుండి పుట్టి చివరకు గర్భశోకం మిగిల్చేవారు పశుప్రాయులు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి
A) జన్మించి, ఏడిపించి
B) ఉద్భవించి, నవ్వించి
C) జన్మించి, అవతరించి
D) బాధించి, జనించి
జవాబు:
C) జన్మించి, అవతరించి

24. దేశభాషలు ఉపాధ్యాయుడు అక్కఱ లేకయే, నేర్చుకొన గలము- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) గురువు, పండితుడు
B) ఆచార్యుడు, బుధుడు
C) ఒజ్జ, గురువు
D) అధ్యాపకుడు, ఆచారి
జవాబు:
C) ఒజ్జ, గురువు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

25. శివరాత్రినాడు గుడిలో శంభో, హర, హరా అనే నాదాలు మిన్నుముట్టాయి – గీత గీసిన పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) బ్రహ్మ
B) విష్ణువు
C) ఇంద్రుడు
D) శివుడు
జవాబు:
D) శివుడు

26. నీ ఆస్యగహ్వరము నుంచి వచ్చిన మాట అసమంజ సముగా ఉంది – గీత గీసిన పదానికి, సమానార్థకపదం ఏది?
A) ముఖము
B) గుహ
C) కంఠము
D) నోరు
జవాబు:
B) గుహ

3. వ్యుత్పత్యర్థాలు :

27. నాశనము పొందనిది – వ్యుత్పత్త్యర్ధం గల పదం గుర్తించండి.
A) వినాశనం
B) అక్షరం
C) సంపద
D) జీవం
జవాబు:
B) అక్షరం

28. ‘శివుడు’ – వ్యుత్పత్తిని గుర్తించండి.
A) మంగళప్రదుడు
B) విషం మింగినవాడు
C) అర్ధనారీశ్వరుడు
D) చంద్రుని తలపై ఉన్నవాడు
జవాబు:
A) మంగళప్రదుడు

29. ‘శాస్త్రమందు మంచిబుద్ధి కలవాడు’ – వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
A) వివేకి
B) మేధావి
C) పండితుడు
D) బుద్ధిశాలి
జవాబు:
C) పండితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

30. ‘భక్తుల పీడను హరించేవాడు’ – అనే వ్యుత్పత్త్యర్థం గల పదమేది?
A) శంభుడు
B) శివుడు
C) ముక్కంటి
D) హరుడు
జవాబు:
D) హరుడు

31. ‘పక్షి’ అనే దాని వ్యుత్పత్తిని గుర్తించండి.
A) పలికేది
B) పక్షములు గలది
C) టెక్కలు గలది
D) టెక్కలతో ఎగిరేది
జవాబు:
B) పక్షములు గలది

4. నానార్థాలు :

32. శ్రీలు ఒలికించు చిఱునవ్వు స్త్రీలకు దివ్యాభరణమే ! – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) లక్ష్మి, జ్యేష్ఠ
B) ఐశ్వర్యం, అలంకారం
C) శోభ, వింత
D) విషం, పాము
జవాబు:
B) ఐశ్వర్యం, అలంకారం

33. అర్ధము లేనిదే వ్యర్థము – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సంపద, ధనం
B) శబ్దార్థం, శతాబ్దం
C) శబ్దాది విషయం, ధనం
D) న్యాయం, శాంతి
జవాబు:
C) శబ్దాది విషయం, ధనం

34. నీవు నీ మిత్రుడికి ఉత్తరము తెలుగులోనే రాయి – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి.
A) స్నేహితుడు, హితుడు
B) సూర్యుడు, స్నేహితుడు
C) బ్రహ్మ, నేస్తము
D) విష్ణువు, హితుడు
జవాబు:
B) సూర్యుడు, స్నేహితుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

5. ప్రకృతి – వికృతులు :

35. భ్రాంతిమయ జీవితంలో ఎన్నటికి సుఖము ఉండదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బ్రాతి
B) బాంతి
C) బ్రాంతి
D) బాతి
జవాబు:
A) బ్రాతి

36. సుద్దులు ఎన్నెనా ఏమి బుద్దులు సరిలేనప్పుడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) శుభ్రత
B) శుభం
C) సూక్తులు
D) పనులు
జవాబు:
C) సూక్తులు

37. ‘అక్షరము’ అనే పదానికి వికృతిని గుర్తించండి.
A) అక్కరము
B) అక్కలు
C) ఆకరము
D) అంకె
జవాబు:
A) అక్కరము

38. నీవు చెప్పే సూక్తి శ్రుతపూర్వమే – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సుక్కి
B) సుద్ది
C) శ్రుతి
D) సూక్తము
జవాబు:
B) సుద్ది

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

39. మీ ఒజ్జలు మహాపండితులు – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) అధ్యాపకుడు
B) ఉపాధ్యాయుడు
C) గురువు
D) ఆచార్యుడు
జవాబు:
B) ఉపాధ్యాయుడు

6. సంధులు :

40. గుణసంధికి చెందినదేది?
AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష 1
జవాబు:
B)

41. ‘యథార్థం’ విడదీయండి.
A) యథా + అర్థం
B) యథ + అర్థం
C) యాథా + అర్థం
D) యథా + ఆర్థం
జవాబు:
A) యథా + అర్థం

42. ‘తదేక’ విడదీయండి.
A) తద + ఏక
B) తత్ + దేక
C) తత్ + ఏక
D) తదా + ఏక
జవాబు:
C) తత్ + ఏక

43. ‘వాగౌరణి’ – సంధి పేరేమిటి?
A) శ్చుత్వసంధి
B) గుణసంధి
C) వృద్ధిసంధి
D) జశ్త్వసంధి
జవాబు:
D) జశ్త్వసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

44. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ రాయండి.
A) కంఠోక్తి
B) తదేక
C) శతాబ్దం
D) వజ్రాలు
జవాబు:
C) శతాబ్దం

45. ‘దైన్యపడి’ విడదీయండి.
A) దైన్యము + పడి
B) దైన్యము + వడి
C) దైన్య + వడి
D) దైన్య + పడి
జవాబు:
A) దైన్యము + పడి

46. ‘నిః + సందేహం’ కలిపి రాయండి.
A) నీ దేహం
B) నిస్సందేహం
C) నిసందేహం
D) నీస్సందేహం
జవాబు:
B) నిస్సందేహం

47. ‘రవంత’ – సంధి పేరేమిటి?
A) ఉత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) ఇత్వసంధి
D) అత్వసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

48. ‘కంఠోక్తి’ పదాన్ని విడదీయండి.
A) కంఠ + ఓక్తి
B) కంఠ + ఊక్తి
C) కంఠ + ఉక్తి
D) కం + రోక్తి
జవాబు:
C) కంఠ + ఉక్తి

49. ‘పాండిత్యపుఁబస’ విడదీసి చూపండి.
A) పాండిత్యపు + బస
B) పాండిత్యము + పస
C) పాండిత్యం + బస
D) పాండిత్యపు + పస
జవాబు:
B) పాండిత్యము + పస

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

50. ‘భాషాభిమానము’ – ఏ సంధి?
A) అత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) గుణసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

51. ‘అయ్యయ్యో’ పదంలో గల సంధి ఏది?
A) ప్రాతాది సంధి
B) ఆమ్రేడిత సంధి
C) యడాగమ సంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) ఆమ్రేడిత సంధి

7. సమాసాలు :

52. మాతాపితలు దైవసమానులు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
A) ద్విగు
B) రూపకం
C) ద్వంద్వం
D) బహువ్రీహి
జవాబు:
C) ద్వంద్వం

53. మాతృభాష మరువకూడదు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
A) ద్వంద్వ
B) షష్ఠీ
C) తృతీయా
D) రూపకం
జవాబు:
B) షష్ఠీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

54. అనుచితమైన పనులు చేయకు – గీత గీసిన పదం ఏ – విగ్రహవాక్యమో గుర్తించండి.
A) ఉచితం
B) చిత్రమైనది
C) అమూల్యం
D) ఉచితం కానిది
జవాబు:
D) ఉచితం కానిది

55. ‘ఏబది సంఖ్యగల సంవత్సరాలు’ – సమాసపదం ఏది?
A) ఏబది సంవత్సరాలు
B) యాభై
C) ఏబది వసంతాలు
D) యాభైయేళ్ళు
జవాబు:
A) ఏబది సంవత్సరాలు

56. ‘మంగళకరమైన నీతివాక్యం’ – సమాసపదం ఏది?
A) మంగళవాక్యం
B) శ్రీ సూక్తి
C) మంగళ శ్రీ
D) శ్రీవాక్యం
జవాబు:
B) శ్రీ సూక్తి

57. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ రాయండి.
A) అనర్హం
B) మాతాపితలు
C) శ్రీసూక్తి
D) మాటతీరు
జవాబు:
C) శ్రీసూక్తి

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

58. ‘మాతాపితలు’ – ఈ సమాసానికి విగ్రహవాక్యం ఏది?
A) మాతయు, పితయు
B) అమ్మానాన్నలు
C) తండ్రి, తల్లి
D) మాతయు, పితృడును
జవాబు:
A) మాతయు, పితయు

59. ‘రక్తమును, మాంసమును’ దీన్ని సమాస పదంగా కూర్చండి.
A) రక్తా మాంసాలు
B) రక్త మాంసము
C) రక్తమాంసములు
D) మాంసరళములు
జవాబు:
C) రక్తమాంసములు

60. ‘భాషయందభిమానము’ దీన్ని సమాస పదంగా కూర్చండి.
A) భాష అభిమానము
B) భాషాభిమానము
C) అభిమాన భాష
D) భాషలయభిమానం
జవాబు:
B) భాషాభిమానము

61. ‘వాగ్వాహిని’ ఇది ఏ సమాసం?
A) నఞ్ తత్పురుష
B) ద్విగు
C) బహువ్రీహి
D) రూపకము
జవాబు:
D) రూపకము

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

8. గణాలు :

62. ‘స, భ, ర, న, మ, య, వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
D) మత్తేభం

63. ‘సౌలభ్యం’ గురులఘువులు గుర్తించండి.
A) UIU
B) UII
C) UUU
D) IUU
జవాబు:
C) UUU

64. III ఏ గణమో చెప్పండి.
A) స గణం
B) న గణం
C) మ గణం
D) భ గణం
జవాబు:
B) న గణం

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

65. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి. (S.A. I – 2018-19)
A) భాష ద్వారా కళ, ప్రాణం, తత్త్వం , ఆత్మ తెలుసు కోవాలి.
B) భాషలోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి.
C) భాష యొక్క కళ, ప్రాణాన్ని, తత్త్వం , ఆత్మను కనిపించాలి.
D) భాషతో కళను ప్రాణంతో తత్త్వం ఆత్మతో కనిపెట్టాలి.
జవాబు:
B) భాషలోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మని కనిపెట్టాలి.

66. స్వభాషను మీరు నేర్చుకొనుటకేమంత శ్రమమున్నది – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) మీ భాష మీరు తెల్సుకోడానికి శ్రమలేదు.
B) మీ భాష మేము నేర్చుకోడానికి ఏం శ్రమున్నది.
C) స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏం శ్రముంది.
D) స్వభాషను మేము నేర్చుకోడానికి శ్రమమేముంది.
జవాబు:
C) స్వభాషను మీరు నేర్చుకోడానికి ఏం శ్రముంది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

67. ఆంధ్రభాష బొత్తిగ రానివానితోడనే కాని మీరాంధేయము ననెన్నడు మాటాడవలదు – ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చండి.
A) తెలుగు అసలు రానివానితో తప్ప (ఇతరులతో) మీరు ఆంగ్లేయంలో ఎప్పుడు మాట్లాడవద్దు.
B) తెలుగు రానివారితో తప్ప ఇంగ్లీషులో మాట్లాడవద్దు.
C) తెలుగు వారితో ఇంగ్లీషులో మాట్లాడవద్దు.
D) తెలుగు రానివారితో ఇంగ్లీషులో మాట్లాడు.
జవాబు:
A) తెలుగు అసలు రానివానితో తప్ప (ఇతరులతో) మీరు ఆంగ్లేయంలో ఎప్పుడు మాట్లాడవద్దు.

68. “నేనొక్కడను మాత్రమే యదృష్టవంతుడనా ?” – దీన్నిఆధునిక వచనంగా మార్చండి.
A) నేను ఒక్కడ్లో అదృష్టవంతుడను కాను.
B) నేనొక్కణ్ణి మాత్రమే అదృష్టవంతుణా !
C) నేను అదృష్టవంతుణ్ణి మాత్రమే కాదు.
D) నేను అదృష్టవంతుడిని కానేకాను.
జవాబు:
B) నేనొక్కణ్ణి మాత్రమే అదృష్టవంతుణా !

69. కోతిని మీరెచ్చటనైనా జూచితిరా – ఆధునిక వచనంగా మార్చండి.
A) కోతిని మీరెక్కడైనా చూశారా?
B) కోతిని మీరు ఎక్కడా చూడలేదు
C) కోతిని మీరెక్కడా చూడరు
D) కోతిని మీరెచ్చటా చూడరు.
జవాబు:
A) కోతిని మీరెక్కడైనా చూశారా?

10. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

70. ప్రతి విషయం పరిశీలించబడుతుంది – దీన్ని కర్తరి వాక్యంగా రాయండి.
A) ప్రతి విషయమును పరిశీలిస్తారు.
B) ప్రతి విషయం పరిశీలింపగలరు.
C) ప్రతి విషయాన్ని పరిశీలించండి.
D) ప్రతి విషయమును పరిశీలింపబడుతుంది.
జవాబు:
A) ప్రతి విషయమును పరిశీలిస్తారు.

11. ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడం :

71. ‘నేను బడికి రాను’ సీత చెప్పింది – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్షకథనాన్ని గుర్తించండి.
A) నేను బడికి రానని సీత చెప్పింది.
B) తాను బడికి రానని సీత చెప్పింది.
C) తాను బడికి వెళ్ళనని సీత అంది.
D) వాడు బడికి రాడని సీత చెప్పింది.
జవాబు:
B) తాను బడికి రానని సీత చెప్పింది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

72. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :
8. మా భాష మాకు రాదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మా భాష మాకు వచ్చు
B) మా భాష మాకు తెలుసు
C) మీ భాష మాకు వచ్చు
D) మీ భాష మాకు తెలియదు
జవాబు:
A) మా భాష మాకు వచ్చు

73. మాధవి ఉద్యోగం చేస్తున్నది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మాధవి ఉద్యోగం చేయట్లేదు
B) మాధవి ఉద్యోగం చేస్తుంది
C) మాధవి ఉద్యోగం చేయబోతుంది
D) మాధవి ఉద్యోగం చేయట్లేదు
జవాబు:
A) మాధవి ఉద్యోగం చేయట్లేదు

12. వాక్యరకాలను గుర్తించడం :

74. మోహన కూచిపూడి నృత్యం మరియు భావన భరత నాట్యం నేర్చుకొన్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంయుక్త వాక్యం
D) మహావాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

75. నన్ను మీరు క్షమించి, మరెప్పుడైన ఈ సభను తిరిగి చేసుకోండి – ఇది ఏ రకమైన వాక్యం?
A) మహా వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామాన్య వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

76. ఎ) మోహిని కూచిపూడి నృత్యం నేర్చుకుంది.
బి) భావన భరత నాట్యం నేర్చుకుంది – వీటిని సంయుక్త వాక్యంగా మార్చండి.
A) మోహిని కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు.
B) మోహిని, భావనలు నృత్య నాట్యాలు నేర్చారు.
C) మోహిని నృత్యం నేర్చుకోగా భావన భరతనాట్యం నేర్చుకుంది.
D) మోహిని, భావనలు నృత్య నాట్యాలు నేర్చారు.
జవాబు:
A) మోహిని కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు.

13. ప్రక్రియలను గుర్తించడం :

77. భూతకాలిక అసమాపక క్రియకు ఉదాహరణను
గుర్తించండి.
A) కురిస్తే
B) తింటూ
C) వెళ్ళి
D) చూసాడు
జవాబు:
C) వెళ్ళి

78. ‘పడితే’ – ఇది ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) శత్రర్థకం
C) చుతుబర్ధకం
D) చేదర్థకం
జవాబు:
D) చేదర్థకం

79. భూతకాల అసమాపక క్రియను ఇలా పిలుస్తారు.
A) చేదర్థకం
B) క్త్వార్థకం
C) హేత్వర్థకం
D) శత్రర్థకం
జవాబు:
B) క్త్వార్థకం

80. మందు వాడితే జబ్బు తగ్గుతుంది – ‘గీత గీసిన పదం’ ఏ అసమాపక క్రియకు చెందినదో తెల్పండి.
A) అప్యర్థకం
B) క్వార్థకం
C) చేదర్థకం
D) శత్రర్థకం
జవాబు:
C) చేదర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 2 స్వభాష

81. వర్తమాన అసమాపక క్రియను ఏమంటారు? (S.A. III – 2016-17)
A) శత్రర్థకం
B) చేదర్థకం
C) క్త్వార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) శత్రర్థకం

82. చుట్టుముట్టడం : సమస్యలెన్ని చుట్టిముట్టినా ధైర్యంతో ముందడుగు వేయాలి.

83. అయోమయం : అర్థంకాని విషయం / పరిస్థితిని తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు.